LATEST NEWS
  రేపటి నుంచి తెలంగాణ‌లో ఆషాడ‌మాస బోనాలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు భోనాల పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. గోల్కొండ జగదాంబకి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.  అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగతి సాధించేలా తల్లి దీవెనలు ఉండాలన్నారు. బోనాల ఉత్సవ ఏర్పాట్లు, భక్తుల సదుపాయం కోసం రూ.20 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
  పూరి జగన్నాథ ఆలయం. అంతుచిక్కని రహస్యాల గని. ఈ ఆలయంపై ఏ సమయంలోనూ నీడ పడక పోవడం ఒక ప్రాకృతిక విచిత్రి. కాగా.. ఆలయ పై భాగంలో ఉన్న ఇరవై అడుగుల సుదర్శన చక్రం పూరీలోని ఏ ప్రాంతం నుంచి చూసినా కనిపించే దిక్సూచి. ఆలయ శిఖరంపై ఎగిరే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరడమొక దైవలీలగా ప్రసిద్ధి. ఆలయంలోపలికి ప్రవేశించిన తర్వాత సముద్రపు ఘోష వినిపించకపోవడం మరో విశేషం. ఇక ఆలయంలో వండే ప్రసాదం ఎంత మందికి వండినా ఎప్పుడూ వృధా కాక పోవడం మరో అంతుచిక్కని రహస్యం. ఏటా జరిగే పూరీ జగన్నాథ రథయాత్ర జగత్ ప్రసిద్ధం. భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళా ఖాతం తీరాన వెలసిన అత్యంత పురాతన ఆలయం పూరీ జగన్నాథ ఆలయం. హిందువులు తప్పక సందర్శించాల్సిన దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. చార్ ధామ్ ఆలయాల్లోనే సుప్రసిద్ధం.  ఈ ఆలయం ఇటు ఇతిహాస అటు చారిత్రక విశేషాల సమాహారం. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం కళింగ పాలకుడైన చోడగంగాదేవ నిర్మించినదిగా చెబుతుంది ఆలయ చరిత్ర. అంతే కాదు ఈ ఆలయ నిర్మాణంలో అనంగభీమదేవ పాత్ర కూడా ఉంది. తర్వాతి కాలంలో రామచంద్ర దేవ విగ్రహ పునఃప్రతిష్ట చేసినట్టుగానూ చెబుతోంది స్థల చరిత్ర. అయితే జగన్నాథుడి విగ్రహాలు ఒక పూర్ణ రూపంలో గాక.. విచిత్రాకారంలో ఉంటాయి కారణమేంటన్నది అంతుచిక్కని ప్రశ్న. అయితే ఇందుకంటూ కొన్నికథనాలు ప్రచారంలో ఉన్నాయి. స్వతహాగా.. ఇక్కడి జగన్నాథుడిని స్థానిక గిరిజనుల దేవుడనీ, నీల మాధవుడనీ నమ్ముతారు. అడవిలో ఒక రహస్య ప్రాంతంలో గిరిజన రాజు విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే ఒక యువకుడ్ని పంపుతాడట. అయితే అతడు విశ్వావసు కుమార్తెను ప్రేమించి పెళ్లాడుతాడట. తన వివాహానంతరం.. జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే విద్యాపతి అడగ్గా.. అతడి మామగారైన విశ్వావసుడు కళ్లకు గంతలు కట్టి.. ఆ ప్రాంతానికి తీస్కెళ్తాడట. ఆ దారి గుండా ఆవాలు ఆనవాళ్లుగా చల్లిన విద్యాపతి.. ఎట్టకేలకు రాజుకు కబురు పెడతాడట. అయితే రాజు ఆ ఆనవాళ్ల ద్వారా అక్కడకు చేరుకోగానే విగ్రహాలు కనిపించవట.  తిరిగి రాజ్యానికి చేరిన రాజు కలలో జగన్నాథుడు కనిపించి.. సముద్ర తీరానికి వేపకొయ్యలు కొట్టుకొస్తాయని.. వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడట. కొయ్యలు కొట్టుకొస్తాయి కానీ విగ్రహం చేయడమెలా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే విశ్వకర్మ.. ఒక వికలాంగుడి రూపంలో వచ్చి తానీ కార్యం నెరవేర్చుతానని అంటాడట. అయితే.. 21 రోజుల పాటు తాను నిద్రాహారాలు లేకుండా ఈ విగ్రహాలు చెక్కుతాననీ.. ఎవరూ ఈ పరిసరాలకు రాకూడదని షరతు విధిస్తాడట. ఎన్నాళ్లయినా విగ్రహ నిర్మాణం పూర్తి కాకపోవడంతో రాణి గుడించా దేవి.. తొందర పెట్టడంతో.. గడువు తీరకుండానే తలుపులు తెరుస్తారట. అక్కడ శిల్పి కనిపించడు. సగం చెక్కీ చెక్కని శిల్పాలుంటాయి. దీంతో బ్రహ్మదేవుడ్ని ప్రార్ధిస్తాడా రాజు. అయితే అదే రూపంలో ఇక్కడ విగ్రహాలు పూజలందుకునేలా ఆనతిస్తాడా చతుర్ముఖుడు. తానే వాటికి ప్రాణప్రతిష్ట చేస్తాడు. అందుకే ఇక్కడి విగ్రహాలకు అభయ హస్తం, వరద హస్తం కనిపించదని అంటారు. అయితే 14 లోకాలను వీక్షించడానికి చారడేసి కళ్లతో ఇక్కడి విగ్రహాలుంటాయని అంటారు. ఇక దేవాలయానికి సంబంధించిన సంప్రదాయ గాథల ప్రకారం.. పూరీ సముద్ర తీరంలోని ఒక మర్రి చెట్టు దగ్గర.. ఇంద్రనీల ఆభరణంగా అవతరించాడట ఆ జగన్నాథుడు. అయితే ఈ నీలి ఆభరణం చూడగానే తక్షణ మోక్షం లభిస్తుందట. దీంతో యమధర్మరాజు ఈ ఆభరణాన్ని భూమిలో పాతి పెడతాడట. ద్వాపరయుగంలో మాల్వాకి చెందిన ఇంద్రద్యుమ్న అనే రాజు.. అంతు చిక్కని ఆ రూపం గురించి తెలుసుకోవాలని చెప్పి.. ఘోర తపస్సు చేశాడట. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై పూరీ సముద్ర తీరానికి వెళ్లి.. అక్కడే తేలియాడే చెట్టు దుంగను కనుక్కని దాని కాండలోంచి తనకు రూపు తయారు చేసుకురమ్మని అతడ్ని ఆజ్ఞాపించాడట. ఈ కార్యం నిర్విఘ్నంగా నిర్వహించిన రాజు విగ్రహాలను ఎలా చేయాలో అర్ధం కాక యజ్ఞం  చేశాడట. యజ్ఞ నారసింహరాజు ప్రత్యక్షమై నారాయణుడ్ని నాలుగు అక్షరాల్లో విశదీకరించమనడంతో.. అవి జగన్నాథ- బలరామ- సుభద్ర- సుదర్శన చక్రాలైతే బావుంటాయని భావించారట. విశ్వకర్మ చిత్రకారుడి రూపంలో వచ్చి ఈ విగ్రహాలను చెక్కి వెళ్లాడట. ఈ ఆలయం కొన్ని తరాలుగా హిందూ- ఆదివాసీ సంస్కృతుల మేలు కలయికగా వస్తోంది. ఈ మూడు విగ్రహాలు జైన ఆచారాలుగా పిలిచే సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞానంద్, సమ్యక్ చరితలకు ప్రతీకగా ప్రాచుర్యం పొందాయి. ఇవి మోక్ష మార్గాలుగా అంతులేని ఆనంద ప్రదాతలుగా పిలవబడుతున్నాయని నమ్ముతారు. ఇక్కడి జగన్నాథుడు నారాయణుడిగా, బలభద్రుడు ఆదిశేషువుగా అదే సమయంలో ఆలయంలోని విగ్రహాలు భైరవ, విమలగానూ పూజలందుకుంటున్నాయి. అందుకే ఇది శైవ వైష్ణవ క్షేత్రాల్లోనే సుప్రసిద్ధమైనదిగా భావిస్తుంటారు. అంతే కాదు ఇటు శైవ అటు వైష్ణవతో పాటు శక్తిత్వానికీ ఈ ఆలయం ఒక ప్రతీక. ఈ ఆలయ నిర్మాణం 4 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో చుట్టూ ప్రహరీ ఎత్తైన కోటగోడలను కలిగి ఉంటుంది. ఇందులో 120 గుడులు ఇతర పూజనీయ స్థలాలున్నాయి. ఒడిశా నిర్మాశైలికి చెందిన ఈ ఆలయం భారతీయ అద్భుత నిర్మాణాలలో ఒకటి.  ఇక ఎనిమిది ఆకులతో నిర్మితమైన నీలచక్ర- శ్రీ చక్రం అష్టధాతువులతో తయారైనదిగా నమ్ముతారు. ఎత్తైన రాతి దిమ్మపైగల ధ్వజస్థంభం గర్భగుడికన్నా 214 అడుగుల ఎత్తులో ఉంటుంది. చుట్టపక్కల పరిసరాల్లో అతి పెద్దదిగా దర్శనమిస్తుంది. చుట్టూ ఒక పర్వత శ్రేణి ఉన్నట్టు కనిపిస్తుంది. సింహద్వారం సంగతి సరేసరి. రెండు వైపులా గాండ్రించే సింహాలతో అత్యంత గంభీరంగా ఉంటుంది. ఆలయానికి మొత్తం నాలుగు ద్వారాలుండగా.. ఉత్తర, పడమట, దక్షిణ దిక్కులలో హథిద్వారా అంటే ఏనుగు, వ్యాగ్ర ద్వారా అంటే పులి, అశ్వద్వారా అంటే గుర్రాల ద్వారాలుగా ఇవి కనిపిస్తాయి. గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలిచే జగన్నాథ, బలభద్ర, సుభద్రల మూల విరాట్టులు రత్నవేది ఆభరణాలతో అలంకరించబడి ఉంటాయి. వీటితో పాటే సుదర్శన చక్ర, మదనమోహన, శ్రీదేవి, విశ్వధాత్రిల విగ్రహాలు కూడా రత్నవేదిపై ఉంటాయి. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్రాల విగ్రహాలు దారు బ్రహ్మగా పిలిచే పవిత్రమైన వేప కాండాల నుంచి తయారయ్యాయి. కాలాలను బట్టి ప్రతిమల నగలు, దుస్తులను మారుస్తుంటారు. వీటిని కొలవటం ఆలయ నిర్మాణం ముందు నుంచీ ఉంది. అంటే ప్రాచీన ఆదివాసుల కాలం నుంచీ ఉందని చెబుతారు. ఇక్కడ మండపాలు ఇతరత్రా ఎన్నో ఆలయాలతో ఎంతో పవిత్రత తొణికిసలాడుతుంది. ఇక ఆలయ వంట శాల ఇక్కడి మహాప్రసాదం ఏ ఫైవ్ స్టార్ ఫుడ్ కి తీసి పోనంత నాణ్యంగా ఉండటమే కాదు. ఆ రుచికి ప్రత్యేకమైన జియోగ్రాఫికల్ గుర్తింపు ఉంది. ఇక్కడి వంటకాలు ఎంతో రుచిగా శుచిగా ఎందుకు ఉంటాయని చూస్తే.. ఈ వంటశాల మహాలక్ష్మీదేవి పర్యవేక్షణలో సాగుతుందని విశ్వసిస్తారు. ఇక్కడి వంటకు కేవలం మట్టి పాత్రలను మాత్రమే వినియోగించడం మరో ప్రత్యేకత. వంటశాలకు దగ్గరగా ఉన్న గంగా యమున అనే రెండు పవిత్ర బావుల నీటిని మాత్రమే వాడుతారు. మొత్తం 56 నైవేద్యాలను వండుతారు. ఈ నైవేద్యం జగన్నాథునికి సమర్పించిన తర్వాత మహా ప్రసాదంగా ఈశాన్యంలోని ఆనంద బజార్ లో పంచుతారు. ఇక్కడి భక్తులు ఈ మహాప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక్కడి ప్రధానమైన పండుగలేంటని చూస్తే.. జూన్ లో జరిగే రథయాత్ర. ఈ బ్రహ్మాండమైన పండగలో జగన్నాథ, బలరామ, సుభద్రల విగ్రహాలున్న మూడు పెద్ద రథాలను ఊరేగిస్తారు. ఏడాదిలో రెండు ఆషాడ మాసాలు వచ్చినపుడు నబకలేవర ఉత్సవం పేరిట.. కొత్త విగ్రహాలను మార్చుతారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున చందన యాత్ర రథ నిర్మాణ ప్రారంభాన్ని సూచిస్తుంది. జేష్ట పౌర్ణమిరోజున అన్ని ప్రతిమలకు స్నానం చేసి అలంకరిస్తారు. వసంతకాలంలో డోలాయాత్ర, వర్షాకాంలో ఝులన్ యాత్ర వంటి పండగలు నిర్వహిస్తారు. కార్తీక, పుష్యమాసాలలో ప్రత్యేక వేడుకలు జరుగుతాయి. ఇక విమలాదేవి కోసం  ఆశ్వయుజ మాసంలో షోడశ దినాత్మక పూజ ఘనంగా నిర్వహిస్తారు. ఇక బ్రహ్మపరివర్తన వేడుక సైతం గొప్పగా జరుగుతుంది.  జేష్ట పౌర్ణమినాడు స్నాన యాత్ర తర్వాత జగన్నాథ- బలభద్ర- సుభద్ర- సుదర్శన విగ్రహాలను రహస్య మందిరాలకు తీస్కెళ్తారు. అక్కడ కృష్ణపక్షం వరకూ ఉంచుతారు. ఆ సమయంలో భక్తులకు జగన్నాథ దర్శనానికి వీలు పడదు. అప్పుడు బ్రహ్మగిరిలోని విష్ణువు స్వరూపమైన అల్వర్నాత్ ని కొలుస్తారు. అధిక స్నానం చేయడంతో దేవుళ్లకు జ్వరం చేసిందని.. పదిహేను రోజుల పాటు రాజ వైద్యునితో చికిత్స చేయిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్నాథ మహిమాన్విత చరితం. నిరంతర పారాయణం. ఒడిశాలోని పూరీకి ఎలా చేరుకోవాలో చూస్తే.. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సదుపాయాలున్నాయి. భువనేశ్వర్ బీజూపట్నాయక్ ఎయిర్ పోర్ట్ పూరీకి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాన నగరాల నుంచి రైలు సర్వీసులు విస్తృతంగా ఉన్నాయి. కోల్ కతా- చైన్నై ప్రధాన రైలు మార్గం కావంతో .. ఖుర్దారోడ్ రైల్వే స్టేషన్లో దిగి.. అక్కడి నుంచి పూరీకి టాక్సీల్లో చేరుకోవచ్చు. ఈ స్టేషన్ పూరీకి కేవలం 44 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భువనేశ్వర్, కోల్ కతా, విశాఖ నుంచి బస్సు సౌకర్యం ఉంది.
  కారు కిందపడ్డ సింగయ్యను  వదిలేసి ఎలా ముందుకు వెళ్లారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. మాజీ సీఎం జగన్ జగన్‌ చేసే ర్యాలీలు, బల ప్రదర్శనలను నిషేధించాలని షర్మిల తెలిపారు.  సింగయ్య మృతికి జగన్ నిరక్ష్యంతో పాటు పోలీసుల వైఫల్యం కూడా అని  పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. 3 కార్లకే పోలీసులు అనుమతి ఇస్తే వేల మందితో ఎందుకు పర్యటన చేశారని షర్మిల నిలదీశారు.  కారు కింద పడిన వ్యక్తిని జగన్ పట్టించుకోకుండా వెళ్లిపోవడం దారుణమన్నారు. ఇప్పటికే జగన్ చాలా తప్పులు చేశారని, అందుకే ఆయనపై కేసులు నమోదు అయ్యాయని షర్మిల వ్యాఖ్యానించారు. ఇటీవల పల్నాడులో జగన్‌తో కరచాలనం చేసేందుకు వచ్చి ఓ వృద్ధుడు కారు కింద పడ్డాడని.. అయినా డ్రైవర్‌ పట్టించుకోకుండా వెళ్లారని ఆమె మండిపడ్డారు. కనీస మానవత్వం లేకుండా పక్కకు లాగి ర్యాలీగా వెళ్లారన్నారు. సొంత పార్టీ కార్యకర్తపైనా మానవత్వం లేకుండా వ్యవహరించారంటూ షర్మిల ఆక్షేపించారు.  
    గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అమరావతిని మార్చేందుకు ఉన్న అవకాశాలపై అమరావతి క్వాంటం వ్యాలీ, క్వాంటం టెక్నాలజీలపై నేషనల్ వర్క్ షాప్ ను ప్రభుత్వం నిర్వహించనుంది. దీనికి సన్నాహకంగా విజయవాడలో కర్టైన్ రైజర్ కార్యక్రమాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ శాఖ నిర్వహించింది. జూన్ 30 తేదీ విజయవాడలో నిర్వహించనున్న జాతీయ స్థాయి వర్క్ షాప్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. 2026 జనవరి నాటికి అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం టెక్నాలజీలపై భాగస్వాములను ఒక్క చోటకు చేర్చేలా ఈ నేషనల్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఒక్క రోజు నిర్వహించే వర్క్ షాప్ లో క్వాంటం హార్డ్ వేర్ సహా కీలకమైన అంశాలపై నిపుణులతో రౌండ్ టేబుల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.  ఈ వర్క్ షాప్ లో ఐబీఎం, టీసీఎస్, అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులు, నీతి ఆయోగ్ సహా వివిధ ఐఐటీల నుంచి ప్రోఫెసర్లు, నిపుణులు, గ్లోబల్ లీడర్లు ప్లీనరీ సెషన్లకు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటం వ్యాలీ ఏర్పాటులో రాష్ట్ర ప్రాధాన్యతలను వివరించనున్నారు. దీనిపై అమరావతి డిక్లరేషన్ను అధికారికంగా విడుదల చేయనున్నారు. అలాగే క్వాంటం స్టార్టప్, క్వాంటం డిక్లరేషన్ బుక్ ను కూడా సీఎం ఆవిష్కరించనున్నారు. ఈ అంశంపై విజయవాడలో నిర్వహించిన కర్టైన్ రైజర్ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ముఖ్యమంత్రి కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, టీసీఎస్ సలహాదారు, జాతీయ క్వాంటం మిషన్ సభ్యులు ప్రోఫెసర్ అనిల్ ప్రభాకర్, ఐబీఎం సంస్థ డైరెక్టర్ డాక్టర్ అమిత్ సింఘీ, ఎల్టీఐ మైండ్ ట్రీ లీడ్ విజయరావు హాజరయ్యారు. క్వాంటం టెక్నాలజీని అందిపుచ్చుకునేలా ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందడుగు వేస్తోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రాజధాని అమరావతిలో ప్రఖ్యాత ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి సంస్థలు క్వాంటం వ్యాలీ టెక్ పార్కును ఏర్పాటు చేయనున్నాయి. ఇందులో భాగంగా ఐబీఎం సంస్థ దేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటరును అమరావతిలో ఏర్పాటు చేయనుంది. రెండు 156 క్యూబిట్  క్వాంటం సిస్టంలను ఐబీఎం ఇన్ స్టాల్ చేయనుంది. ఇక దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఎల్ అండ్ టీ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇక మరో సంస్థ టీసీఎస్ క్వాంటం కంప్యూటింగ్ సేవలతో పాటు హైబ్రీడ్ కంప్యూటింగ్ సొల్యూషన్సును అందించనుంది. వైద్యారోగ్యం, ఆర్ధిక, ఉత్పత్తి రంగం సహా వేర్వేరు రంగాల్లో సేవలు అందించేలా ఈ క్వాంటం వ్యాలీ  సిద్ధం కానుంది. 2026 జనవరి నాటికి అమరావతి క్వాంటం వ్యాలీ దేశానికి సేవలందిస్తుందని ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు.
  వాయువ్య బంగాళాఖతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా  రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి ఉరుములు, మెరుపులతో పాటుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నాది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.   శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో  అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో, పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి ములుగు, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణ వర్షాలు కురుస్తాయంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్  జారీచేశారు.   
ALSO ON TELUGUONE N E W S
మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా ప్రారంభించిన నాటి నుంచి అనేక అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. రిలీజ్‌ దగ్గర పడుతున్న సమయంలో కూడా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకి నిర్మాత కూడా మంచు విష్ణే కావడంతో అన్నింటినీ ఎదుర్కొని సినిమాని థియేటర్స్‌కి తీసుకు రావాల్సిన పరిస్థితి వస్తోంది. తాజాగా ‘కన్నప్ప’ చిత్రానికి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. మాదాపూర్‌లోని మంచు విష్ణు కార్యాలయంపై ఐటి, జిఎస్‌టి అధికారులు దాడులు నిర్వహించారు. బుధవారం సాయంత్రం అధికారులు కార్యాలయానికి వచ్చి సినిమా బడ్జెట్‌ గురించి ఆరా తీస్తున్నారు. అలాగే ఐటి, జిఎస్‌టికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ను పరిశీలిస్తున్నారు.  ఇదిలా ఉంటే.. ‘కన్నప్ప’ నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న కొందరి ఇళ్ళపై కూడా ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సమస్యలను ఎదుర్కొని మరో రెండు రోజుల్లో ‘కన్నప్ప’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సమయంలో అధికారుల దాడులు చిత్ర యూనిట్‌ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే భారీగా సర్క్యులేట్‌ అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది, ఐటి దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. 
Anirudh Ravichander has been a special composer for Superstar Rajinikanth from late 2010's. After Petta, he has become a regular composer for the star and Jailer album, BGM have made it obvious that the superstar doesn't look beyond him. Now, he started Coolie promotions on a high with Chikitu Vibe song.  Lokesh Kanagaraj, the director of the film, is known for using Anirudh in perfect manner to compose special songs, even in English, for his films, that suit it perfectly. From Master, they both have delivered banger album after album. Using T Rajendar's humming, Anirudh crafted a swaggy mass song that suits Rajini well.  In the special video, while he performed like Rajini and danced his heart out, Anirudh did give T Rajendar, special tribute. The veteran shocked everyone with his energy and vibe to feature in the video. He danced and even showcased his swag in Rajini style. The song is going to be a vibe material in theatres.  King Nagarjuna, Satyaraj, Upendra, Aamir Khan, Shruti Haasan are cast in this film other than Rajinikanth. Sun Pictures are producing the film and it is releasing on 14th August and the movie is expected to be the first film to cross Rs.1000 crores for Tamil Film Industry.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Manchu Vishnu has claimed that he produced Kannappa on a large canvas with a budget amounting to Rs.150 crores. He expressed great confidence on the movie and he did not accept low business offers pre-release and wanted to wait till post release to get better offers.  Taking such financial risks might only effect him and also showcase his confidence, he did attract another risk with IT and GST officials raids on his office. The officials are conducting raids at his office to check the details about how he arranged for the money and if he paid GST as per his claims.  Currently, they are checking all the income sources and also the amounts spent over the past few years to complete the film. Well, Vishnu is counting highly on Prabhas, Mohanlal, Akshay Kumar stardom to help him in taking the movie to audiences. Mohan Babu is playing a crucial role in the movie, too.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Sekhar Kammula's Kuberaa starring Dhanush, King Nagarjuna, Rashmika Mandanna has become a blockbuster in Telugu States and it crossed Rs.100 crores mark worldwide, with major contribution with Telugu dominated markets. In North America, movie is closing in on US$ 2 Million mark, a first for Nag and Dhanush, as well.  During RRR, people started discussing about who is the real lead and supporting lead in the film. Ram Charan fans started trolling NTR fans as in climax, SS Rajamouli decided to present Ram Charan in a new avatar and as in Alluri Sitaramaraju's popular get-up.  Now, Kuberaa collections are doing the same. In Telugu States, the collections have been huge while Tamil version is a disaster. In Tamil Nadu, after the weekend, the movie did not attract anything and even in Tamil dominated Overseas areas, the movie is showing abysmal performance.    So, people started talking about Nagarjuna's box office stamina and popularity vs Dhanush stamina and popularity. While Nagarjuna did accept to play a supporting lead, it is his character that had much to do in the film, to become an emotional cog. Dhanush's performance is much talked about than his character.  While the conversation about who is the lead feels too amateurish, it is evident that both the characters are important for the story to progress while Jim Sarbh did his best in selling the streotype villain. It is their performances, mainly, Nagarjuna's commitment to play a character that is something unique about this film.  Dhanush does have a good recognition in Telugu but never enjoyed a market, for Telugu people to rush to watch his film in theatres. So, it is the mix of these two stars and Sekhar Kammula, that is, drawing crowds. Hope, people understand the fact and stop these silly comparisons as it would kill multi-starrers forever.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
అభ్యుదయ  దర్శకుడు  బాబ్జీ దర్శకత్వంలో  బెల్లి జనార్థన్ నిర్మాతగా తూలికా  తనిష్క్ క్రియేషన్స్ పతాకంలో రూపొందిన " పోలీస్ వారి హెచ్చరిక"  టీజర్ ను తన కార్యాలయంలో  సుధీర్ బాబు ఆవిష్కరించారు. ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేయగా గజ్వేల్ వేణు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. కాగా నేడు నవ దళపతి సుధీర్ బాబు చేతుల మీదగా ఈ చిత్ర టీజర్ విడుదల కావడం జరిగింది.  ఈ సందర్భంగా నవ దళపతి సుధీర్ బాబు మాట్లాడుతూ... "దర్శకుడు బాబ్జీ మా మామగారైన  సూపర్ స్టార్ కృష్ణ  గారికి  బాగా  దగ్గరివాడు. దేశ వ్యాప్తంగా ఉన్న  కృష్ణ గారి అభిమానులందరికీ  సుపరిచితుడు. అటువంటి బాబ్జీ గారి దర్శకత్వం లో రూపొందిన  ఈ చిత్రం టీజర్ ను  నా చేతుల  మీదుగా ఆవిష్కరించడం  నాకు  సంతోషాన్ని  కలిగిస్తుంది. టీజర్  అంటే  రక రకాల  వ్యాపకాలతో, రకరకాల మూడ్స్ తో  ఉండే  ప్రేక్షకులనుచిటిక  వేసి  మనవైపుకు తిప్పుకునే  అస్త్రం. "పోలీస్ వారి హెచ్చరిక" అలా ఒక అస్త్రంలా  ఆకర్షణీయంగా, రిచ్ గా ఉంది" అన్నారు.  దర్శకుడు బాబ్జీ  మాట్లాడుతూ... "నేను ఏ  సినిమా చేసినా  ఆ సినిమా  తాలూకు  ఏదో ఒక కార్యక్రమాన్ని కృష్ణ  గారి చేతుల మీదుగా  జరుపుకునే వాడిని, ప్రస్తుతం  కృష్ణ గారు భౌతికంగా  మన మధ్య లేకపోవడం తో ఈ సినిమా కు సంబంధించిన ఒక్క కార్యక్రమం కూడా ఆయన చేతుల మీదుగా జరుపుకోలేక పోయాననే  లోటు  ఇలా సుధీర్ బాబు  గారు ఈ టీజర్ ను  విడుదల చేయడం తో తీరిందని" అన్నారు.  నిర్మాత  బెల్లి జనార్థన్  మాట్లాడుతూ... "ఒక  కొత్త నిర్మాతగా  నేను  నిర్మించిన ఈ సినిమాకు సంబంధిన ప్రమోషన్  కార్యక్రమాలకు సినీ పరిశ్రమలోని  ప్రముఖులు  హాజరు కావడం, టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను, లిరికల్  సాంగ్స్ ను, ఆడియోను ఆవిష్కరించడం వంటి సంఘటనలు  నన్ను  ఆనందపరుస్తున్నాయి" అని పేర్కొన్నారు.  చిత్ర  కథానాయకుడు సన్నీ అఖిల్  మాట్లాడుతూ... "సినిమా లో హీరో పాత్ర అనగానే  అందమైన కాస్ట్యూమ్స్ ధరించి, హీరోయిన్  వెంటపడి  డ్యూయెట్ లు పాడడం జరుగుతుందని కానీ ఈ చిత్రంలో సంఘ వ్యతిరేక శక్తుల  కారణంగా మతిబ్రమించి  తిరుగుతూ క్లైమాక్స్ కు  తెర తీసే ఒకానొక  సగటు యువకుని పాత్ర  లో నటిస్తున్నానని, నాలోని  నటుడిని ఆవిష్కరించుకునే  అద్భుతమైన  ఆస్కారాన్ని ఈ పాత్ర  నాకు అందించింది" అన్నారు.   
Dynamic Star Vishnu Manchu’s magnum opus Kannappa is all set for a grand release in just a couple of days. Ahead of the release, actor Shiva Balaji, who plays an important role as Kumaradeva Sastry, interacted with the media to share some intriguing insights.  How did your journey with Kannappa begin?  It all started quite casually. Mohan Babu garu, Vishnu, and I were having lunch at the same office. The New Zealand shoot was already locked in, and most of the lead cast had been finalized. During the conversation, Mohan Babu garu asked Vishnu, "Why isn’t there a role for Shiva Balaji?" Vishnu replied that there wasn’t much scope for me to have a substantial role in the story. But Mohan Babu garu was adamant. The next day, while we were discussing further, he told me, “You do have a role. I’m playing Mahadeva Sastry, and you’re my son, Kumaradeva Sastry.” That’s how it began for me.  What kind of preparation went into your character?  Honestly, I didn’t do much in terms of external references. Since I was playing Mohan Babu garu’s son, I simply mirrored his demeanor. His character is extremely strict, so much so that he doesn’t even like being touched by his own son. I carried forward that personality trait in the next generation. It’s not explicitly stated in the film, but that’s the character's emotional undercurrent.  Can you tell us about your role in the film?  It’s a supporting yet impactful role. The film features different factions—Thinnadu, Mahadeva Sastry’s lineage, and the Boya community. Access to the sacred Vayu Lingam is restricted, and only Mahadeva Sastry has the access. Even his son is not allowed. My character is well-written and I shared considerable screen space with Mohan Babu garu.  You’ve not been doing many films lately. Why is that?  I’ve been listening to scripts, but I’m quite selective now. If a story doesn’t resonate with me, I simply pass. I’m only looking to do roles that offer solid scope for performance.  Have you watched the film? What’s your feedback?  Yes, I’ve seen it. Kannappa is an extraordinary film. The second half, in particular, will leave a huge impact. It’s very emotionally and visually powerful.  How significant is Prabhas’ role in the film?  Prabhas appears for a good 40 minutes in the film. His presence leaves a strong impression. From his entry to the end, his scenes are very engaging. Vishnu gave him a well-written and well-executed role.  What about other major characters in the film?  Every character holds significance. Once Mohanlal enters, the story takes a different turn. Prabhas’ entry changes the pace again. Akshay Kumar’s portrayal of Lord Shiva is especially noteworthy—his dialogues are powerful yet simple and easy to grasp.  Devotional films have been trending for the past couple of years. What can we expect from Kannappa?  Expect many high moments and goosebump-inducing sequences. It’s not just a film; it’s a spiritual experience.    How was working with Mohan Babu garu off-screen?  He’s very different off-camera—warm and caring. He treats us like family. I actually grew closer to Vishnu during the MAA elections, even though I had met him a couple of times before.  Did you accept the role mainly because of Mohan Babu garu?  To be honest, I thought about it for two days before accepting. I’ve become very choosy lately. I even asked Vishnu directly if it would feel like I was being pushed into the film. He said it’s totally my call, but also told me I’d have a better role in his next. I spoke to my wife Madhu about it, and she said it was up to me. In the end, I’m glad I said yes—missing out on this film would’ve been a big regret.  Did you contribute to the production side as well?  I was keen on helping with the food arrangements. We even brought a chef along. I helped wherever I could.    There were rumors that Mohan Babu bought 7000 acres in New Zealand. Is that true?  That was just a joke! They leased about 7000 acres in Rotorua, in New Zealand’s North Island, for the shoot. We had a guest house there too. Some parts of the second half were shot in Wanaka, South Island. One day, while we were cooking dinner, on both mine and Vishnu’s wedding anniversaries, Mohan Babu jokingly said he owned the land. Later, he clarified on it.  OTT platforms are seeing a surge in senior actors. Are you open to OTT content?  Definitely. After Recce, I haven’t taken up another OTT project, but I’m planning to come back with Recce 2 soon.  What’s your view on how Bigg Boss has evolved?  Honestly, I’m not a fan of the current format. When we did it, it felt more genuine. Now, it feels pre-designed. After Bigg Boss, I had a strong fan base. I stayed in the house for three months, then did interviews right after.  How was it working with director Mukesh Kumar Singh?  He’s one of the most polite directors I’ve worked with. He’s passionate about history, enjoys travel, and loves trying vegetarian food. He handled Kannappa very well. His collaboration with Vishnu really worked out.  Your bond with Vishnu seems strong. Can you elaborate?  The Vishnu you see on social media is just one side of him. In reality, he’s very cool person. Coming to Kannappa, he took care of every aspect of the production with great attention.  Do you think social media influencers are impacting society negatively?  Yes, negativity is spreading quickly through influencers. It’s affecting not just celebrities but also common people.    There were talks of objectionable scenes in the film. What's your take?  Nothing was truly objectionable. But out of respect for everyone, we decided to remove those particular dialogues.  How is Akshay Kumar as Lord Shiva?  There was a lot of debate about who should play Lord Shiva. Initially, Prabhas was considered. After discussions, Prabhas took on a different role. When Akshay Kumar came on board, he just fit the part perfectly. He looked divine on screen and did full justice to the role.  What’s your next project?  I’m working on a thriller produced by Mohan Babu garu. It’s being directed by a Tamil filmmaker. More details will be revealed soon.
అక్కినేని నాగార్జున(Nagarjuna)ధనుష్(Dhanush)రష్మిక(Rashmika Mandanna), శేఖర్ కమ్ముల(Sekhar Kammula)కాంబినేషన్ లో ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా మూవీ 'కుబేర'. అన్ని భాషల్లోను హిట్ టాక్ ని తెచ్చుకున్న కుబేర ఒక  మిలినియర్ , బిచ్చగాడి కి మధ్య జరిగిన ఒక వినూత్న కథాంశంతో తెరకెక్కింది. నాగార్జున, ధనుష్, రష్మిక తో పాటు మిగతా పాత్రల్లో చేసిన వాళ్ళందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారని మూవీ చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు చెప్తున్నాడు. ఇక ఈ మూవీ రీసెంట్ గా వంద కోట్ల క్లబ్ లోకి చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. చిత్ర బృందం కూడా ఈ మేరకు అధికారకంగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఫస్ట్ వీక్ లోకి ఎంట్రీ ఇవ్వకుండానే 100 కోట్ల క్లబ్ లో కి చేరడంతో మూవీకి ప్రేక్షకుల్లో లభిస్తున్న అదరణని అర్ధం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. చిత్ర యూనిట్ కూడా ఈ  విషయంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల సక్సెస్ మీట్ ని కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర ఎల్ ఎల్ పి, అమిగోస్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు, శేఖర్ కమ్ముల సంయుక్తంగా నిర్మించిన కుబేర లో జిమ్ సర్బ్, షాయాజీ షిండే, దిలీప్ తాహిల్, భాగ్యరాజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్(Devi sriprasad)సంగీతాన్ని అందించాడు.     
  ఒక హీరోతో అనుకున్న కథ మరో హీరో దగ్గరకు వెళ్ళడం సహజం. ఇటీవల టాలీవుడ్ లో ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. 'పెద్ది' కథను బుచ్చిబాబు మొదట ఎన్టీఆర్ తో చేయాలనుకున్నాడు. కానీ, ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన మైథలాజికల్ ఫిల్మ్.. ఎన్టీఆర్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమా విషయంలో కూడా అదే జరిగిందని తెలుస్తోంది. ప్రభాస్ కోసం అనుకున్న ఓ కథ.. ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళినట్లు సమాచారం.   అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనే సస్పెన్స్ నెలకొంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశముంది అంటున్నారు. దీనిని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడట.   నిజానికి ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'రావణం' అనే ఓ భారీ సినిమాను ప్లాన్ చేశాడు దిల్ రాజు. అయితే ప్రభాస్ చేతిలో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. అవన్నీ పూర్తి కావాలంటే మరో నాలుగైదేళ్లు పడుతుంది. అందుకే దిల్ రాజు.. ఈ ప్రాజెక్ట్ ని బన్నీతో ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి.   ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో 'డ్రాగన్' చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ లో విడుదల కానుంది. దాని తర్వాత ప్రశాంత్ నీల్.. రావణం కోసం అల్లు అర్జున్ తో చేతులు కలిపే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.   
ఈస్టర్ నోరాన్హా, శివబాలాజీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'రెక్కీ'(Recce)వెబ్ సిరీస్ ఫేమ్ 'పోలూరి కృష్ణ'(Poluri Krishna)దర్శకత్వంలో తెరకెక్కిన మరో వెబ్ సిరీస్ 'విరాటపాలెం(Viratapalem). పీసి మీనా రిపోర్టింగ్ అనేది ఉపశీర్షిక.  థ్రిల్లర్ కథాంశాలతో రూపొందిన  ఈ సిరీస్ లో అభిజ్ఞ, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రలు పోషించారు. జీ 5 లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్ గా ప్రముఖ ఓటిటి సంస్థ 'ఈటీవీ విన్'(Etv Win)కోర్టుని ఆశ్రయించి 'విరాటపాలెం సిరీస్ తమ సంస్థ ద్వారా విడుదల కానున్న 'కానిస్టేబుల్ కనకం'(Constable Kanakam)కథతో  సిద్ధమయ్యిందని, కాబట్టి విరాటపాలెం రిలీజ్ ని ఆపాలని కోర్టుకి విన్నవించుకుంది. దీంతో కోర్టు తీర్పుపై సినీ ప్రియుల్లో టెన్షన్ మొదలయ్యింది. కానిస్టేబుల్ కనకం' సిరీస్ లో వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్ పోషించగా, చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన  కానిస్టేబుల్ కనకం గత సంవత్సరం డిసెంబర్ లోనే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. అడవి గుట్ట అనే ప్రాంతంలో ఉన్న ఒక మిస్టరీని ఛేదించే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. వర్ష బొల్లమ్మ(varsha Bollamma)ఇప్పటికే అనేక సినిమాల్లో హీరోయిన్ గా చేసి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.  
  రాజ్ గురు బ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో జూన్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. నేడు ఈ చిత్రం నుండి దం దిగా దం గీతం విడుదలయింది. ఈ పాటకు ప్రణవ్ చాగంటి లిరిక్స్ అందించగా యాసిర్ నిసర్ ఆలపించారు.   సాంగ్ లాంచ్ సందర్భంగా చిత్ర నిర్మాత రాజా దారపనేని మాట్లాడుతూ... "సాంగ్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పటికే వర్జిన్ బాయ్స్ చిత్రం నుండి టీజర్ ఇంకా ఒక పాటకు మంచి స్పందన లభించింది. సినిమా యూత్ ఫుల్ గా ఉండబోతుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని ఎన్నో ప్రశంసలతో కొనియాడారు. ఆడవారు కూడా చిత్రాన్ని ప్రశంసించడం ప్రత్యేకంగా కనిపించింది. చిత్రంలో ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. చిత్రానికి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్ వచ్చింది. చిత్రాన్ని నైజంలో ఏషియన్ సునీల్ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. జులై 11వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది" అన్నారు.    నటి జెన్నీఫర్ ఇమాన్యుల్ మాట్లాడుతూ... "ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర బంధం అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చిత్రంలో నటించిన వారితో పనిచేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. జెడి మాస్టర్ తో కలిసి పనిచేయడం ప్రత్యేకంగా కనిపించింది" అన్నారు.    నటుడు శ్రీహాన్ మాట్లాడుతూ... "నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన బాలు గారికి, మిత్ర గారికి, రాజా గారికి ధన్యవాదాలు. ఈ సినిమా పూర్తిగా యూత్ కు ఎంటర్టైన్మెంట్ కోసం చేసింది. ఈ చిత్రంలో ఏది మంచిది ఏది కానిది అనేది ఎన్నో విషయాలు చెప్పాము. ఈ సినిమా చూస్తే పూర్తిగా ఎంటర్టైన్ అవుతారు. జూలై 11వ తేదీన తప్పకుండా థియేటర్లో ఈ చిత్రంని చూడండి" అన్నారు.      చిత్ర దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ... "సాంగ్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన అందరికీ నా ధన్యవాదాలు. ఈ చిత్రం ఒక మంచి లవ్ స్టోరీతో యూత్ ఫుల్ గా ఉండబోతుంది. సినిమా చూసినంతసేపు మీ కాలేజీ రోజులు గుర్తొస్తాయి. ఈ చిత్రం కోసం నిర్మాత రాజా గారు అలాగే నటీనటులు అందరితో పని చేయడం నాకు ఎంత సంతోషకరంగా కనిపించింది. మీరందరితో కలిసి పనిచేసి మంచి సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. నేడు విడుదలైన పాట ప్రేక్షకులందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. జులై 11వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రానికి మంచి సంగీతాన్ని అందించిన స్మరణ్ సాయికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిత్రంలో మంచి బిజీఎం తో పాటు మొత్తం ఆరు పాటలు ఉంటాయి. అలాగే చిత్రం కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అన్నారు.    నటుడు గీతానంద్ మాట్లాడుతూ... "నేను ఇంతకుముందు చేసిన రథం సినిమాకు కూడా ఇదే నిర్మాత రాజా గారు నిర్మించారు. గత సంవత్సరం గేమ్ ఆన్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఇప్పుడు వర్జిన్ బాయ్స్ చిత్రం ద్వారా మరోసారి మీ ముందుకు రాబోతున్నాను. విడుదలైన ఈ దం దిగ దం పాటలు ఎంతటి పార్టీ మూడ్ ఉందో సినిమా అంతా కూడా అలాగే ఉంటుంది. సినిమా చూసి ఎంతో మంచి అనుభూతిని పొందుతారు. యూత్ ఈ చిత్రాన్ని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు" అన్నారు.    నటి మిత్ర శర్మ మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ముందుగా ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. వర్జిన్ బాయ్స్ చిత్రం ద్వారా నేను పూర్తిగా నటిగా తృప్తి చెందాను. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరితోను నేను ఎంతో కలిసిమెలిసి పనిచేశాను. దయానంద్ ఓ మంచి సోదరుడిలా నా వెంట ఉంటూ దర్శకత్వాన్ని వహించారు. జెడి గారు ఎంత మంచి కొరియోగ్రఫీ అందించారు. చిత్రంలో ముఖ్యంగా డ్యూటీ క్యారెక్టర్ ఎంతో ప్రత్యేకమైనది. ఆ క్యారెక్టర్ కోసం ఎవరు బాగా చేస్తారో అనుకుంటున్నాప్పుడు మాకు శ్రీహాన్ వచ్చారు. ఆయన ఆ క్యారెక్టర్ ను ఎంతో బాగా చేశారు. ఈ చిత్రాన్ని నేడు ఇక్కడ వరకు తీసుకువచ్చే ప్రయాణంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. అలాగే మమ్మల్ని నమ్మి మాకు ఈ అవకాశం ఇచ్చిన రాజా గారికి ధన్యవాదాలు. ఈ సాంగ్ షూటింగ్ కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేసాము. జులై 11వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము" అంటూ ముగించారు.   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  భారతీయులు ఎక్కువగా ఉపయోగించే దుంప కూరగాయలలో బంగాళదుంపలు ముఖ్యమైనవి. వీటితో స్నాక్స్,  చిప్స్ తో పాటు,  బోలెడు రకాల వంటలు కూడా చేసుకుంటారు. అయితే బంగాళదుంపలను ఉడికించేటప్పుడు చాలామంది తెలియకుండా కొన్ని తప్పులు చేస్తారు. ఈ తప్పుల వల్ల బంగాళదుంపలు సరిగా ఉడకకపోవడం, పైన పొట్టు వచ్చినా లోపల పచ్చిగా ఉండటం జరుగుతుంది. అయితే 5 విషయాలను గుర్తుంచుకుంటే బంగాళదుంపలు చక్కగా దుంప మొత్తం సమంగా ఉడుకుతాయి. అంతేకాదు.. బంగాళదుంపల గురించి చాలా ముఖ్యమైన చిట్కాలు కూడా ఇదిగో ఇక్కడ తెలుసుకోండి.. ఎక్కువగా ఉడకబెట్టినప్పుడు.. బంగాళదుంపలను ఎక్కువగా ఉడకబెట్టినప్పుడు పెద్ద సమస్య వచ్చి పడుతుంది.  దుంపలు ఎక్కువగా ఉడకడం వల్ల మెత్తగా చేతిలో పట్టుకోగానే విరిగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు  వాటిని ఫ్రిజ్ లో ఉంచడం వల్ల చాలా ప్రయోజనంగా ఉంటుంది.  కూల్ అయ్యాక బంగాళదుంపలు మెత్తదనం పోయి కాస్త గట్టిగా అవుతాయి.  అప్పుడు వీటిని కూరలలో తగినట్టుగా ఉపయోగించుకోవచ్చు. వేడినీరు.. చాలామంది బంగాళదుంపలను తొందరగా ఉడికిద్దాం అనే ఆలోచనతో ముందే వేడి చేసిన నీటిలో బంగాళదుంపలు వేసి తరువాత వాటిని ఉడికిస్తారు. దీని వల్ల పైన తొక్క తొందరగా వచ్చేస్తుంది.  కానీ లోపల సరిగా ఉడకదు.  పచ్చిగా ఉంటుంది.  అందుకే నేరుగా చల్లని నీటిలో బంగాళదుంపలు వేసి  ఉడికించాలి. ఉప్పు.. బంగాళదుంపలను కుక్కర్ లో ఉడికించేటప్పుడు కాసింత ఉప్పు జోడించాలి.  ఇలా చేయడం వల్ల బంగాళదుంప తొక్క చాలా మెత్తగా అయిపోయి దుంప జారిపోయేలా కాకుండా దుంప మొత్తం సమంగా ఉడకడానికి సహాయపడుతుంది. ఎక్కువ నీరు.. బంగాళదుంపలను ఉడికించడానికి ఎక్కువ నీరు ఉపయోగించడం వల్ల కూడా బంగాళదుంపలు చాలా మెత్తగా, నీటిలోనే కలిసిపోయేలా అయ్యే అవకాశం ఉంటుంది.  4 విజిల్స్‌లో పూర్తయ్యేంత నీటిని మాత్రమే జోడించాలి. అలాగే  మీడియం మంట మీద మాత్రమే ఉడకబెట్టాలి.  దీనివల్ల బంగాళాదుంపలు ఎప్పుడూ పగిలిపోకుండా ఉంటాయి. చిన్న పరిమాణంలో ఉన్న  బంగాళాదుంపలకు ఒక విజిల్ సరిపోతుంది. గిన్నె పద్దతి.. బంగాళాదుంపలు తక్కువగా ఉంటే ముందుగా కుక్కర్‌లో చల్లటి నీరు పోసి స్టీల్ గిన్నె ఉంచాలి. బంగాళాదుంపలను గిన్నెలో వేసి మరిగించాలి.  దీనివల్ల బంగాళాదుంపలు నీటిని పీల్చుకోకుండా ఉంటాయి.  అవి విరగకుండా సులభంగా మృదువుగా మారుతాయి. వంటను సులభతరం చేయడంలో గిన్నె పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.                                    *రూపశ్రీ.
  ప్రతి మనిషి జీవితంలో ఏదైనా ముఖ్యమైన మొదటి దశ ఉందంటే అది కెరీర్ కు సంబంధించిన విషయమే అయ్యుంటుంది.కెరీర్ విషయంలో తీసుకునే నిర్ణయానికి అనుగుణంగానే  ఉద్యోగం,  ఆనందం,  ఆర్థిక స్థితి, వ్యక్తిగత అభివృద్ది వంటి విషయాలు ఆధారపడి ఉంటాయి. చాలా మంది అవగాహన లేకుండా సమాజంలో దేనికి ఆదరణ ఉందనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని దాన్నే తమ కెరీర్ గా ఎంచుకుంటారు. ఇది ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ.. అన్ని వేళలా ఇది పనిచేయదు.  సరైన కెరీర్ ను ఎంచుకోవడానికి ఏం చేయాలి?  తెలుసుకుంటే.. ఆసక్తులు, అభిరుచులు.. మీరు ఏ విషయాలలో ఆసక్తి చూపిస్తారు? (ఉదా: సైన్స్, ఆర్ట్స్, బిజినెస్, టెక్నాలజీ, క్రియేటివ్ ఫీల్డ్స్, సర్వీస్?) చిన్నప్పటి నుండి మీరు ఎక్కువగా ఆసక్తి చూపిన విషయాలు ఏవి? ఏ పని చేసేటప్పుడు మీరు టైమ్ గమనించకుండా మునిగిపోతారు? ఉదాహరణ: మీకు problems solve చేయడం ఇష్టం అయితే — సైన్స్, ఇంజినీరింగ్, డేటా సైన్స్, లా వంటివి మంచి ఎంపికలు.  మీ సామర్థ్యాలు, బలాలు.. మీరు ఏ విషయాన్ని బాగా  చేయగలరు? (ఉదా: గణితం, భాషలు, కమ్యూనికేషన్, ఆర్ట్, లీడర్‌షిప్, డిజైన్) ఇతరులు మీలో ఏ బలాలను గుర్తిస్తారు? దీన్ని అర్థం చేసుకోవడానికి Aptitude Tests లేదా Career Assessment Tests (ఉదా: MBTI, Holland Code) చేయవచ్చు.  మార్కెట్ లో అవకాశాలు.. ఎంచుకోవాలి అనుకున్న రంగంలో ఫ్యూచర్ డిమాండ్ ఉందా? ఆ ఫీల్డ్ లో గ్రోత్, జాబ్ సెటిల్మెంట్ ఎలా ఉంటుంది? కొత్తగా పెరుగుతున్న రంగాలు ఏమిటి? (ఉదా: AI, డేటా సైన్స్, సస్టైనబిలిటీ, డిజిటల్ మార్కెటింగ్) జీతం,  జీవన ప్రమాణాలు.. మీరు ఎంచుకునే కెరీర్ మీ ఆర్థిక అవసరాలను నెరవేర్చగలదా? మీరు కోరుకునే జీవన విధానానికి అనువుగా ఉందా? ఇలాంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి.  మెంటార్లు,  ప్రొఫెషనల్స్.. మీరు ఇష్టపడే రంగంలో ఇప్పటికే ఉన్నవారి అనుభవాలను తెలుసుకోవాలి.   వారు ఎదుర్కొనే సవాళ్లు, సంతృప్తి, అవకాశాలు తెలుసుకోవాలి.  సవాళ్లను అధిగమించడానికి కావలసిన నైపుణ్యాలు, సామర్థ్యాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రాక్టికల్ ఎక్స్పీరిన్స్.. ఇంటర్న్షిప్‌లు, వర్క్‌షాప్‌లు, ప్రాజెక్ట్‌లు, వాలంటీర్ వర్క్ ద్వారా ఫీల్డ్ ను దగ్గరగా చూడడం వల్ల చాలా మంచి అనుభవం లభిస్తుంది. భవిష్యత్తు.. ఈ కెరీర్ లో మీరు 10-20 ఏళ్ళ తరువాత మీరు ఎక్కడ  ఉంటారు, ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలని అనుకుంటున్నారు? ఇవన్నీ ఆలోచించాలి.  అది మీ వ్యక్తిత్వం, విలువలకు సరిపోతుందా? చివరగా.. కెరీర్ ఎంపికలో ఎప్పుడూ ఒకే సరైన దారి ఉండదు. మీ అభిరుచి, సామర్థ్యం, మార్కెట్ డిమాండ్, జీవిత లక్ష్యాల కలయికతో సరైన దారి ఏర్పడుతుంది. ముఖ్యంగా.. శాంతిగా ఆలోచించాలి.  రీసెర్చ్ చేయాలి. అవసరమైతే కెరీర్ కౌన్సెలింగ్  సహాయం తీసుకోవాలి. ఇది చాలా మంచి పునాదికి దారి తీస్తుంది.                                       *రూపశ్రీ.
  ఈ రోజు యోగా డే అంటూ చాలా ఆడంబరంగా ఉత్సవాలలా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ప్రధాని మోడీ గారు అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా ఈసారి యోగా డే దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అందులోనూ అన్ని రాష్ట్రాల చూపులు విశాఖపట్నం ఆర్.కె బీచ్ వైపై ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఈ రోజు యోగా అనేది విదేశీయులను కూడా ఆకర్షించే అంశం అయిపోయింది.  ఇది మనిషి ఆరోగ్యానికి జీవనాడి అయ్యింది.  అయితే ఈ యోగాను భారతీయులకు అందించినది పతంజలి మహర్షి. అందుకే యోగా డే  సందర్బంగా ఆ మహనీయుడిని గుర్తుచేసుకోవడం భారతీయుల కర్తవ్యం. అలాగే..  యోగా కోసం పతంజలి మహర్షి చేసిన కృషి,  ఆయన చరిత్ర తెలుసుకుంటే.. పతంజలి మహర్షి చరిత్ర వృత్తాంతం  భారత సంస్కృతిలో ఒక గంభీరమైన, ఆధ్యాత్మికంగా ప్రేరణాత్మకమైన గాథ. ఇది పురాణ, ఇతిహాస, ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా వచ్చిందని చెప్పవచ్చు. ఆయన ఒక భగవద్భక్తుడు, తత్త్వవేత్త, గొప్ప పండితుడు. ఆయన్ను మూడు ముఖ్యశాస్త్రాలలో విపులమైన కృషి చేసినవాడిగా గుర్తిస్తారు . ఆ మూడు ఏమిటంటే.. యోగశాస్త్రం, వ్యాకరణం (సంస్కృత వ్యాకరణం),  ఆయుర్వేదం.  ఆయన చరిత్ర వృత్తాంతం..  ఆదిశేషునిగా అవతారం.. పతంజలి మహర్షి, విష్ణుమూర్తికి సేవ చేసే ఆదిశేషుని అవతారంగా పరిగణించబడతారు. ఒక సందర్భంలో, విష్ణుడు తన హృదయంలో శివుని ఆనందతాండవాన్ని దర్శించుకుంటుండగా, ఆదిశేషునికీ ఆ తాండవాన్ని చూడాలనే కోరిక కలిగిందట. అందుకు అనుగుణంగా  విష్ణుమూర్తి ఆదిశేషునికి భూలోకంలో అవతరించాల్సిందిగా సూచించాడు. గోనికా తపస్సు & పతంజలి అవతారం.. విష్ణుమూర్తి ఆదిశేవును భూలోకంలో అవతరించమని ఆదేశించి  సమయంలో గోనికా అనే పతివ్రత స్త్రీ, సూర్య భగవానుని ప్రార్థిస్తూ  లోకానికి ఉపయోగపడే బిడ్డ కావాలని తపస్సు చేస్తూ, చేతులలో నిండుగా నీటిని తీసుకుని అంజలి ఘటిస్తూ అంటే నమస్కారం చేస్తూ అర్చించుకుంటున్న  సమయంలో పాము రూపంలో ఆదిశేషుడు ఆమె చేతుల్లోకి పడిపోయాడట. అందువల్ల ఆ బాలుని పేరు పతంజలి (పతనము + అంజలి) అని ఉద్భవించింది. నటరాజుని తాండవ దర్శనం.. పతంజలి మహర్షి తన తల్లిదండ్రుల వద్ద పెరిగి, తర్వాత చిదంబరం వచ్చినాడు.  అక్కడ శివుడు నటరాజు రూపంలో తాండవం చేస్తున్నాడని తెలిసి. అతనికి శివుని తాండవాన్ని చూసే అవకాశం లభించింది. నంది, భృంగిలు అతని శరీరాకృతిపై హేళన చేసినా, అతను నోరుతో “నటరాజ నవకం” అనే స్తోత్రాన్ని గానం చేసి శివుని ఆనందింపజేశాడు. ఈ నటరాజ నవకం అనేది పూర్తీగా డమరుక శబ్దంతో ఉంటుంది. నటరాజ నవకం విని సంతోషించిన శివుడు నిన్నునాట్యంలో భాగం చేస్తాను బాధపడకు అని చెప్పి  శివుడు అతనిని తన పాదాల చుట్టూ చుట్టి తాండవంలో భాగస్వామిని చేశాడు.  ఇది పతంజలి మహర్షి  భగవత్‌ ప్రేమకు సంకేతం.  త్రికరణ శుద్ధి లక్ష్యంగా విద్యాబోధన.. శివుని ఆశీర్వాదంతో పతంజలి, భూలోకానికి త్రికరణ శుద్ధి  అంటే మనస్సు, వాక్కు, కర్మ అనేవి  సాధించేందుకు మూడు శాస్త్రాలను అందించాడు. యోగశాస్త్రం – మనస్సు శుద్ధి కోసం వ్యాకరణం – వాక్కు శుద్ధి కోసం ఆయుర్వేదం – శరీర శుద్ధి కోసం శిష్యులకు బోధన.. పతంజలి 1000 మందికి బోధన ఇవ్వాలనుకున్నాడు. అందరి అర్హతలు భిన్నంగా ఉండటంతో, ఓ తెర వెనుక ఆదిశేషురూపంలో బోధించాడు. తెర ఎత్తవద్దని చెప్పినా ఒక శిష్యుడు అతని నియమాన్ని ఉల్లంఘించి తెర తీసేశాడు. దీంతో 999 మంది విద్యార్థులు కాలిపోయారు. మిగిలిన శిష్యుడికి పతంజలి మొత్తం విద్యను బోధించాడు, కాని అతను శాపగ్రస్తుడై బ్రహ్మ రాక్షసుడయ్యాడు. శిష్యుడిని శాప విముక్తుడిని చేసిన ఘట్టం.. ఆ బ్రహ్మ రాక్షసుడు జ్ఞానాన్ని బోధించగల అర్హుడిని వెతుకుతూ, సరైన జవాబు చెప్పని వారిని మింగేవాడు. చివరికి పతంజలి మహర్షి స్వయంగా శిష్యుడి రూపంలో (చంద్రశర్మగా) వచ్చి, సరైన సమాధానం ఇచ్చి, జ్ఞానం తీసుకొని శిష్యుడిని శాపం నుండి విముక్తుణ్ని చేశాడు. ఆ రాక్షసుడు తరువాత గౌడపాదాచార్యుడుగా అవతరించాడు. ఆయన రచనలు.. యోగ సూత్రాలు (196 సూత్రాలు) – యోగ దార్శనికశాస్త్రానికి ప్రామాణిక గ్రంథం. మహాభాష్యం – పాణినీ వ్యాకరణంపై వ్యాఖ్యాన గ్రంథం. ఆయుర్వేదానికి సంబంధించిన రచనలకూ ఆయనకు ఆపాదించబడింది, కానీ ఆధారాల పరంగా స్పష్టత లేదు.  జీవసమాధి స్థలం.. పతంజలి మహర్షి జీవసమాధి స్థలం తమిళనాడు, తిరుపత్తూరు (త్రిచీ దగ్గర)లోని బ్రహ్మపురీశ్వర ఆలయంలో ఉంది.  ప్రార్థన శ్లోకం.. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన। యోఽపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోఽస్మి॥ మనస్సు, వాక్కు, శరీరం శుద్ధి కోసం పతంజలిని ప్రణమిస్తాను అని ఈ ప్రార్థన అర్థం.                                     *రూపశ్రీ
  వర్షాకాలం (Monsoon season)లో మన శరీర రోగ నిరోధక శక్తి కొంత తగ్గుతుంది. అలాగని పండ్లు తినడం మానేయడం కాదు. సరిగ్గా ఎంచుకుని తినడం చాలా ముఖ్యం. ఈ కాలంలో కొన్ని పండ్లు ప్రత్యేకంగా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి, అలాగే కొన్ని జాగ్రత్తలతో తినాలి. ఇప్పుడు వాటిని వివరంగా చూద్దాం. వర్షాకాలానికి అనుకూలమైన పండ్లు: యాపిల్  (Apple) లాభాలు: శరీరానికి ఫైబర్, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అయితే యాపిల్స్ ను శుభ్రంగా కడిగి తినాలి. పియర్.. (Pear)  శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు, శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. పియర్ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది  జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. అరటిపండు (Banana) అరటిపండ్లు అందరికీ చాలా సులవుగా తక్కువ ధరలో దొరుకుతాయి. పైగా అన్ని వయసుల వారు తినదగిన పండు ఇది. అరటిపండు జీర్ణ సమస్యలు నివారించడంలో సహాయపడుతుంది. అరటిపండు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే  ఇతర పళ్లతో కలిపి కాకుండా తినడం మంచిది. ఆరంజ్ (Orange)  ఆరెంజ్ లేదా నారింజ పండులో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. సీజన్ మారుతున్న కాలంలో నారింజ తినడం మంచిదే కానీ.. వర్షాకాలంలో వీటిని పూర్తిగా శుభ్రంగా కడిగి తినాలి. ద్రాక్ష (Grapes) ద్రాక్ష పండ్లు  ఆరోగ్యానికి చాలా మంచివి.  వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. ద్రాక్ష పండ్లు తింటే శరీరం లోపల శుద్ది అవుతుంది.  అయితే ద్రాక్షలో ధూళి, ఫంగస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా  వర్షాకాలంలో వీటిని  మంచి నీటితో బాగా కడిగి తినాలి. అనాసపండు (Pineapple) అనాస పండు రుచిలోనూ, వాసనలోనూ అందరినీ కట్టిపడేస్తుంది. ఈ సీజన్ మార్పులో అనాసపండు తీసుకుంటే శరీరానికి మంచి  ఎనర్జీ లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వర్షాకాలంలో చల్లని వాతావరణం వల్ల ఎదురయ్యే కఫం, మలబద్ధకం వంటి సమస్యల నివారణకు మంచిది. తక్కువగా మగ్గిన మామిడిపండ్లు (Semi-ripe Mangoes) వర్షాకాలం ప్రారంభమయ్యి సీజన్ మారుతున్న కాలంలో అక్కడక్కడా ఇంకా మామిడి పండ్లు దొరుకుతూ ఉంటాయి. అయితే జాగ్రత్త,  వర్షాల కారణంగా మామిడిపండ్లలో పురుగులు ఉంటాయి.  అందుకే తక్కువగా మగ్గిన మామిడి పండ్లు తీసుకోవాలి.  వీటిలో విటమిన్ A & C సమృద్ధిగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే తక్కువగా మగ్గినవి అయినా  ఎక్కువగా తింటే మంట, అజీర్ణం కలగవచ్చు. అందుకే  మితంగా తినాలి. వర్షాకాలంలో ఏ పండ్లను జాగ్రత్తగా తినాలి? జామకాయ (Guava)..  జామకాయలను బాగా కడిగి తినాలి. ఎందుకంటే వీటిలో ఫంగస్ ఉండే ప్రమాదం ఎక్కువ. నల్ల ద్రాక్ష (Black grapes)..  నల్ల ద్రాక్ష చాలా వరకు అందరికీ అందుబాటులో ఉండేదే.. అయితే  వీటి శుభ్రతపై ఫోకస్ చేయాలి. శుభ్రంగా లేకుంటే అస్సలు తినకండి. నేరేడు (Jamun)..  నేరేడు పండ్లు ఈ కాలంలో విరివిగా దొరుకుతాయి.  అయితే ఇవి  కొంతమందికి అలర్జీ కలిగించొచ్చు. అందుకే జాగ్రత్త తీసుకోవాలి పండ్లను తినేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు.. శుభ్రత: పండ్లను మంచి నీటితో బాగా కడగాలి. కొనుగోలు చేసిన వెంటనే నేరుగా తినకూడదు. తాజాగా తినాలి: బయట నిల్వపెట్టిన పండ్లు ఫంగస్ పట్టే ప్రమాదం ఎక్కువ. అందులోనూ ఈ వర్షాకాలంలో  మరీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మితంగా తినాలి: ఎక్కువగా తినడం వల్ల అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు. అందుకే పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా మితంగా తనాలి. రాత్రి పూట జాగ్రత్త: పండ్లు ఎక్కువగా జీర్ణం కావాలంటే ఉదయం లేదా మద్యాహ్నం తినడం ఉత్తమం. రాత్రిపూట తింటే ఇవి జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.  ఇది కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్యలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలం అంటే జలుబు, జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండే కాలం. అందుకే విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పండ్లు తీసుకోవడం ద్వారా రోగ నిరోధకత పెరిగి ఆరోగ్యంగా ఉండవచ్చు.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
  జిమ్,  యోగా  రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వ్యాయామ పద్ధతులే. అయితే ఆరోగ్య లక్ష్యాలు , జీవనశైలి , శారీరక పరిస్థితి,  మానసిక స్థితిని బట్టి ఏది బెస్ట్ అనే విషయంలో మార్పు ఉంటుంది.   అంతేకాదు ఈ రెండింటి మధ్య తేడాలు ఉండటం వల్ల వీటి వల్ల లభించే ఫలితాల్లో కూడా తేడాలు ఉంటాయి.  ఈ రెండు మధ్య తేడాలు,  ఉపయోగాలు తెలుసుకుంటే.. జిమ్ (Gym) — లాభాలు:  బలవర్ధక వ్యాయామం (Strength training): జిమ్‌లో వెయిట్లు, మిషన్లు వాడడం వల్ల కండరాలు (muscles) బలంగా తయారవుతాయి. శరీరాన్ని షేప్‌లోకి తేగలగడం (Body toning): శరీరంలో ఏదైనా ప్రాంతంలో కొవ్వు పేరుకుని ఉంటే.. ఆ ప్రాంతానికి సంబంధించి జిమ్ లో వ్యాయామాలు చేయడం ద్వారా  కొవ్వు కరిగించి ఫిట్ బాడీని పొందవచ్చు. వెయిట్ లాస్ / వెయిట్ గెయిన్ (Weight control): బరువు ఎక్కువ ఉన్నవారు మాత్రమే జిమ్ కు వెళతారు అంటే అది పొరపాటు. జిమ్ చేయడం వల్ల బరువు పెరగవచ్చు కూడా.  దీనికి తగిన వ్యాయామాన్ని ఎంచుకోవచ్చు. ఫిట్‌నెస్ నిపుణులు కూడా సజెస్ట్ చేస్తారు. దీని వల్ల ఆరోగ్యకరంగా బరువు తగ్గడం,  లేదా పెరగడం చేయవచ్చు. ఎనర్జీ స్థాయి పెరుగుతుంది: జిమ్ కు వెళ్లడం వల్ల శరీరం చురుగ్గా మారుతుంది.  దీనివల్ల  రోజువారీ జీవితం energetic గా ఉంటుంది.  కార్డియో ఎక్సర్సైజులు (Cardio workouts): కార్డియో ఎక్సర్సైజులు గుండెకు చాలా మంచివి.  జిమ్ లో చాలామంది చేసే  ట్రెడ్‌మిల్, సైక్లింగ్ వంటివి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.  గుండెను దృఢంగా మారుస్తాయి. యోగా (Yoga) — లాభాలు: మానసిక ప్రశాంతత (Mental peace): యోగా అంటే కేవలం శరీరానికి సంబంధించినది కాదు.. ఇది మనసుకు కూడా సంబంధించినది.  కాబట్టి యోగా వల్ల  మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్ ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.  శ్వాస,  చైతన్యం పెరుగుతుంది (Improved breathing & awareness): యోగాలో ధ్యానం, ప్రాణాయామం ముఖ్యమైనవి. ప్రాణాయామంలో కూడా చాలా రకాలు ఉన్నాయి.  ఇవి  lungs పనితీరును మెరుగుపరుస్తాయి. శరీర సౌలభ్యం (Flexibility): యోగాలో వివిధ ఆసనాలు, భంగిమలు ఉంటాయి. వీటి వల్ల శరీరంలో అన్ని ప్రాంతాలలోసాధారణంగా అందరూ చేసే వ్యాయామాలకంటే ఎక్కువగా బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది.  హార్మోనల్ బ్యాలెన్స్: యోగా వల్ల శరీరంలో గ్రంథుల పనితీరు మెరుగవుతుంది.  దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గి హార్మోన్లు సక్రమంగా విడుదల అవుతాయి. ఇది  శరీర వ్యవస్థలను సవ్యంగా ఉంచుతుంది. ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, నాడీవ్యవస్థ మొదలైన వాటికి మేలు చేస్తుంది. ఎవరికి ఏది బెటర్? వ్యక్తి లక్ష్యాన్ని బట్టి సరైన ఎంపిక.. దానికి గల కారణం.. బరువు తగ్గాలనుకునే వారు జిమ్ లేదా యోగా + డైట్ చేయడం మంచిది.  అయితే జిమ్ వేగంగా ఫలితం ఇస్తుంది. యోగా మెల్లగా ఫలితాన్ని ఇస్తుంది.  కానీ దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి అనుకునేవారు యోగా మెడిటేషన్, ప్రాణాయామం చేయాలి. ఇవి మానసిక  శాంతిని ఇస్తాయి. కండరాలు పెంచుకోవాలి అనుకునేవారికి జిమ్ బెటర్. ఎందుకంటే జిమ్ లో వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది. ఇది కండరాలు పెరగడానికి  అవసరం. ఫ్లెక్సిబిలిటీ, అంతర్గత ఆరోగ్యం కోసం యోగా చేయాలి. నాడీవ్యూహం, శ్వాస వ్యవస్థ పైన యోగా ప్రభావితంగా ఉంటుంది. అందుకే యోగాఎంపిక మేలు. టైమ్ తక్కువగా ఉంటే జిమ్ కు వెళ్లడం కుదరదు. కాబట్టి అలాంటి వారికి యోగా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే యోగాను ఇంట్లో కూడా 20-30 నిమిషాలు చేయవచ్చు. మోటివేషన్ తగ్గిపోతుంటే ఇంట్లో జిమ్ అయినా,  యోగా అయినా చేయలేం. అందుకే జిమ్ లో ట్రైనర్, యోగా క్లాసులలో యోగా టీచర్ ఇంకా ఇతర అభ్యాసకులు ఉంటారు.  కాబట్టి ఉత్సాహంగా ముందుకు వెళ్లవచ్చు.   మిక్స్ చేయడం బెస్ట్.. అవకాశం ఉంటే వారంలో 3 రోజులు జిమ్ + 2 రోజులు యోగా చేయడం ఉత్తమ మార్గం. ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, మైండ్ బ్యాలన్సు అన్నీ కలుగుతాయి.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...