LATEST NEWS
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ పిలుపు మేరకు మంగళవారం (జులై 21) జరిగిన ప్రధాని నివాసం ముట్టడి కార్యక్రమంలో   రాహుల్ గాంధీతో పాటు పలువురు కీలక నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో  రాహుల్ గాంధీ  గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది.  పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.  దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.    దేశ వ్యాప్తంగా యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలు, కేంద్ర  ప్రభుత్వ అణచివేత చర్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఈ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పలువురు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు  ప్రధాని నివాసానికి ర్యాలీగా బయలుదేరారు. కాంగ్రెస్ నాయకులు,  కార్యకర్తల ర్యాలీని ప్రధానమంత్రి నివాసానికి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు.    నిరసనకారులు ముందుకు సాగేందుకు ప్రయత్నించగా, పోలీసులు  లాఠీఛార్జ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. రాహుల్ గాంధీని అక్కడ నుంచి తరలించేందుకు పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఆయన ముక్కు నుంచి రక్తం కారింది.  అయినప్పటికీ భద్రతా సిబ్బంది   ఆయనను నిర్బంధంలోకి తీసుకుని,  మోసుకెళ్లి వ్యాన్ లో ఎక్కించారు.  ముక్కు నంచి రక్తం కారుతున్నా.. రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా నినాదాలు చేస్తుండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండి పడుతున్నారు. యువత కసం నిలబడిన నేత పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నారు.  ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందనీ..  అలాంటిది ఒక అగ్రనేతపై  పోలీసులు భౌతిక దాడికి దిగడం దారుణమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ప్రజా నాయకుడిగా క్లిష్ట సమయాల్లో భౌతిక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల తరఫున నిలబడిన  రాహుల్ గాంధీ పోరాటపటిమ, నాయకత్వ లక్షణాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.   Rahul Gandhi Bleeding Nose, Rahul Gandhi PM Residence Protest, Congress Delhi Protest, Rahul Gandhi Detained Delhi Police, Rahul Gandhi Injury
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కేంద్రం శరణు జొచ్చారా? ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ.. వేగం జగన్ ను భయపెడుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ సడన్ ఢిల్లీ పర్యటన వెనుక రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా ఈడీ   ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి,  కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ లను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్న నేపథ్యంలో..జగన్ జంకుతున్నట్లు చెబుతున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా తనను కూడా ప్రశ్నించడమో, అరెస్టు చేయడమో ఖాయమన్న నిర్ధారణకు వచ్చిన జగన్  ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను శరణువేడాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అందుకే జగన్  ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ప్రధాని   నరేంద్ర మోదీ,  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం.. లోక్‌సభ లో వైసీపీ పక్ష నేత మిథున్ రెడ్డి,  రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ద్వారా  ప్రధాని, హోంమంత్రులతో అప్పాయింట్ మెంట్ కోసం ఇప్పటికే పీఎంవోకే, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు  విజ్ఞప్తులు పంపినట్లు సమాచారం. వారి అప్పాయింట్ మెంట్ దొరకడమే ఆలస్యం జగన్ హస్తినకు పయనం అవుతారని విశ్వసనీయంగా తెలుస్తోంది.   మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ..   ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే   జగన్  పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు.  మద్యం కుంభకోణం కేసులో   ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న   సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.     పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతుండటంతో.. మోడీ, అమిత్ షా అందుబాటులో ఉండటంతో..  పార్లమెంట్ ప్రాంగణంలోనే జగన్ వారిని కలిసేందుకు అవవకాశం  కల్పించాలని ఇప్పటికే వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా.   రాష్ట్రంలో మద్యం అక్రమ వ్యవహారానికి సంబంధించి ఈడీ దూకుడు గత కొద్ది రోజులుగా  వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ  హయాంలో నిర్ణయాలు తీసుకున్న అధికారులు, రాజకీయ నాయకులకు ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన కీలక వ్యక్తుల నుంచి లభించిన సమాచారం  ఆధారంగా   అగ్రనేతల పేర్లు వెలుగులోకి వస్తుండటం.. త్వరలోనే  విచారణకు హాజరు కావలసిందిగా  జగన్ కు ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో.. జగన్ కేంద్రం పెద్దలను ఆశ్రయించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  అయితే..ఇప్పటి వరకూ మోడీ, అమిత్ షా అప్పాయింట్ మెంట్ లభించకపోవడంతో జగన్ హస్తిన పర్యటన తేదీ ఖరారు కాలేదని తెలుస్తోంది. అయితే వైసీపీ వర్గాల సమాచారం మేరకు గురువారం(జులై23) జగ్ హస్తినకు చేరుకుంటారనీ, అమిత్ షా అప్పాయింట్ మెంట్ లభించిందనీ తెలుస్తోంది.  Jittery over ED probe, YS Jagan Delhi Visit, PM Narendra Modi, Amit Shah Appointment, ED Investigation Liquor Case, YSRCP Political News
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా  యువత చేపట్టిన ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడంలో కాంగ్రెస్ వెనుకబడిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.  కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలకు వ్యతిరేకంగా ఇండియాలో జన్ జడ్ చేపట్టిన అతి పెద్ద ఆందోళనను అవకాశంగా మలచుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రధాన పత్రిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ యువత ఉద్యమం విషయంలో స్పందించిన తీరు, ప్రకటించిన పరిమిత మద్దతు కాంగ్రెస్ కు అందివచ్చిన బంగారు అవకాశాన్ని ‘చే’జారేలా చేశాయన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఈ ఉధృత పోరాటాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లేందుకు  యువత  పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన తరువాత కూడా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఆ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ వారికి మద్దతుగా కేంద్రాన్ని నిలదీయడంలోవిఫలమయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఢిల్లీ వేదికగా మారుమోగుతున్న  యువత  ఉద్యమానికి ప్రధాన రాజకీయ పక్షాలన్నీ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆప్ అధినేత అరవిద్ కేజ్రీవాల్,   జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వంటి  నేతలైతే..  స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహిస్తున్న యువతను కలిసి  సంఘీభావం ప్రకటించారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం జంతర్ మంతర్ నిరసన శిబిరానికి వచ్చి యువతకు సంఘీభావం తెలపలేదు. ఇదే విషయం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.  పోలీసుల చర్యలు, ఉద్రిక్తతల మధ్య గాయపడిన కొందరు యువకులను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించినప్పటికీ రాహుల్ గాంధీ..  ఆందోళన జరుగుతున్న జంతర్ మంతర్ వద్దకు వెళ్ల లేదు.  కేవలం మీడియా ముందు మాట్లాడటానికి, ప్రకటనలు విడుదల చేయడానికి మాత్రమే ఆయన పరిమితమయ్యారు.   ప్రభుత్వంపై సమరశంఖం పూరించిన యువజనంతో  నేరుగా మమేకం కాకుండా  మద్దతు ప్రకటనలకు పరిమితం కావడం ద్వారా పొలిటికల్ మైలేజీకి ఈ ఉద్యమాన్ని ఊతం చేసుకోవడంతో కాంగ్రెస్ విఫలమైందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.   దేశంలోనే అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న యువతలో నెలకొన్న ఆందోళనను, వారి ఆగ్రహాన్ని సరైన దిశలో నడిపించగలిగితే ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీకి అపారమైన రాజకీయ ప్రయోజనం లభించేది. అదే సమయంలో ఒక జాతీయ స్థాయి అగ్రనేత తమ మధ్యకు వస్తే, పోరాటం చేస్తున్న యువకులకు సైతం కొండంత అండ లభించేది. ఈ పరిణామం ఉభయతారకంగా ఇరు వర్గాలకు ఎంతో ఉపయోగపడేది. కానీ, రాహుల్ గాంధీ జంతర్ మంతర్‌కు వెళ్లకుండా దూరంగా ఉండటం వల్ల ఆందోళనకు కావాల్సిన స్థాయిలో ఊపు లభించకపోగా, కాంగ్రెస్‌కు దక్కాల్సిన మైలేజ్ కూడా దక్కకుండా పోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకుముందు రైతు చట్టాల రద్దు కోసం జరిగిన ఏడాది కాలపు రైతాంగ ఉద్యమంలో కానీ, మణిపూర్ హింసాకాండ బాధితుల పరామర్శలో కానీ రాహుల్ గాంధీ స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలకు అండగా నిలిచారు. పార్లమెంట్ లోపలా, వెలుపలా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ దూకుడు ప్రదర్శించారు. గతంలో అనేక సందర్భాల్లో ప్రజా సమస్యలపై స్వయంగా వీధుల్లోకి వచ్చిన రాహుల్, ఇప్పుడు అత్యంత కీలకమైన యువజన సమస్యపై మాత్రం జంతర్ మంతర్ ప్రాంగణానికి దూరంగా ఉండటం విచిత్రంగా కనిపిస్తోంది. మీడియా వేదికలపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినంత మాత్రాన క్షేత్రస్థాయిలో ఉద్యమ తీవ్రత పెరగదని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ వీధుల్లో జరుగుతున్న ఈ పోరాటం రాబోయే రోజుల్లో పార్లమెంట్ ముట్టడికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఈ దశలో ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో నేరుగా పాల్గొనకపోతే, అధికార పక్షం ఈ ఆందోళనలను మరింత సులువుగా అణచివేసే ప్రమాదం ఉందని నిరసనకారులు భావిస్తున్నారు. అధికార ప్రతిపక్షాల నడుమ పార్లమెంట్ సమావేశాల్లో రసాభాస జరుగుతున్న నేపథ్యంలో, వెలుపల ఉవ్వెత్తున లేస్తున్న ప్రజా సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రతిపక్షం చూపుతున్న మందకొడి వైఖరిపై సొంత పార్టీ వర్గాల్లో కూడా అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమవుతోందని సమాచారం. ముందుముందు జరగబోయే రాజకీయ పరిణామాల దృష్ట్యా రాహుల్ గాంధీ తన వ్యూహాన్ని మార్చుకుని నేరుగా జంతర్ మంతర్ ఉద్యమ క్షేత్రంలోకి దిగుతారా లేదా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. యువత సమస్యలను కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం చేయకుండా, స్వయంగా వారితో కలిసి పోరాటంలో పాల్గొంటేనే నిజమైన ప్రతిపక్ష నేతగా ప్రజలలో మరింత నమ్మకం ఏర్పడుతుందని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికలు, పార్లమెంట్ లోపల వెలుపల జరగబోయే పోరాటాల దృష్ట్యా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇప్పటికైనా స్పందించి ఉపాధి, ఉద్యోగ పోరాటంలో ఉన్న యువతకు నేరుగా అండగా నిలబడుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది. Jantar Mantar Protest Delhi, Rahul Gandhi Youth Protest, Leader of Opposition Strategy, Opposition Leaders Support 
వైసీపీలోని కాపు సామాజిక వర్గ నేతలు తిరుగుబావుటా ఎగుర వేస్తున్నారా? సొంత పార్టీ లైన్ నే దాటుతూ, పార్టీ అధినేతకు తమ ధిక్కార స్వరం వినిపిస్తున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం వస్తున్నది. పార్టీలో కాపు సామాజికవర్గ నేతల తీరు వైసీపీకి గుబులు పుట్టిస్తోందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైసీసీకి చెందిన   కాపు సామాజికవర్గ  నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా  కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్..  అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే..  తోట త్రిమూర్తులు  ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.  ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే బొండా ఉమ విజయవాడలో నిర్వహించతలపెట్టిన కాపుల ఐక్యత సభకు తాను హాజరవుతానని తోట త్రిమూర్తులు  ప్రకటించడం వైసీపీకి మింగుడు పడటం లేదు.   వైసీపీ అధినేత  జగన్  నిర్ణయాలతో సంబంధం లేకుండా తోట త్రిమూర్తులు  స్వతంత్రంగా కాపు సామాజికవర్గ ఐక్యత నినాదంతో ముందుకు సాగుతుండటంతో  వైసీపీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది.  అదు విధంగా వైసీపీలో సీనియర్ మోస్ట్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం కాపు రిజర్వేషన్లు, కాపు సామాజిక వర్గ  హక్కుల విషయంలో ఇండిపెండెంట్ లైన్ తీసుకోవడం కూడా వైసీపీలో కలవరం రేపుతోంది.  కాపు సామాజికవర్గానికి మేలు జరగాలంటే..  హక్కుల కోసం పోరాడాలి అంటూ బొత్స  సంచలన వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ సంస్మరణ సభలు వేదికగా తోట త్రిమూర్తులు,  బొత్స సత్యనారాయణ లు   జ్యోతుల నెహ్రూతో వేదిక పంచుకోవడం, తోట త్రిమూర్తులు బోండా ఉమా ఆధ్వర్యంలో కాపు ఐక్యత సభకు హాజరౌతానని ప్రకటించడంతో.. రానున్న రోజులలో కాపు సామాజికవర్గ ఐక్యత రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపే అవకాశాలున్నాయన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఉన్నట్లుగా కనిపిస్తోంది. Tense in ycp, botsa, totatrimurthulu, Kapu, Leaders, Cross, Partyline Telugu One
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం (జులై 22) హస్తిన పర్యటనకు వెడుతున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన హఠాత్తుగా హస్తిన పర్యటనకు వెళ్లడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  బాబు పర్యటనకు కారణమేంటన్న విషయంలో సర్వత్రా ఆసక్కి వ్యక్తం అవుతోంది.  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన , మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ బిల్లులు తీసుకురానుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన కీలకంగా మారింది.  ఈ బిల్లులకు తెలుగుదేశం సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. చంద్రబాబు హస్తిన పర్యటన చేపట్టారు. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా,  చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ  కూడగట్టడం కోసం..   వివిధ   పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.  ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా..  దాంతోపాటు 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలయ్యేలా జాతీయ స్థాయిలో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకు ఆయన పలు పార్టీల నేతలతో చర్చలు జరిపే అవకాశం ఉందని అంటున్నారు.  ఈ బిల్లుల అజెండాతో పాటు, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక పెండింగ్ అంశాలపైనా చంద్రబాబు ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా.. అమరావతి రాజధాని నిర్మాణం, పొలవరం ప్రాజెక్టు పూర్తి,  కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదల అంశాలపై ఆయన  ప్రధాని,  మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో పాటు పలువురు   కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుగుదేశం ఎంపీల సమాచారం. మొత్తం మీద చంద్రబాబు  ఢిల్లీ పర్యటన అటు జాతీయ రాజకీయాల్లో,  ప్రాధాన్యత సంతరించుకుంది. CBN, Womens Reservation Bill, Delimitation Bill,  Andhra Pradesh Politics,  NDA Government 
ALSO ON TELUGUONE N E W S
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి మేకింగ్ అంటేనే ఒక వైల్డ్ వైబ్ ఉంటుంది. దానికి తోడు ప్రభాస్ మాస్ ఇమేజ్ తోడవ్వడంతో ఈ డార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 40 శాతానికి పైగా చిత్రీకరణ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటివరకు వెలువడిన పోస్టర్స్, ఆడియో గ్లింప్స్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వ్యూస్‌తో ట్రెండ్ అయ్యాయి. ఈ సినిమాలో తృప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుండగా, ఐశ్వర్య దేశాయ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. సందీప్ రెడ్డి వంగా తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మైండ్ బ్లోయింగ్ ఎలిమెంట్‌తో ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తుంటారు. ఇప్పుడు 'స్పిరిట్' విషయంలోనూ అదే తరహా మాస్టర్ ప్లాన్ ఒకటి సిద్ధం చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కథను ఊహించని మలుపు తిప్పే ఒక ప్రత్యేక పాత్ర కోసం బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్‌ను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న కత్రినా కైఫ్ ఈ ప్రాజెక్ట్‌కి ఒప్పుకుంటే సినిమా రేంజ్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం. ఈ పాత్ర కథాంశంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది కావడం వల్ల ఆమె పాత్ర రాకతోనే మొత్తం స్టోరీ లైన్ అంచనాలకు అందకుండా మారిపోతుందని సమాచారం. ఈ రోల్ కోసం కేవలం 2 రోజుల కాల్ షీట్స్ మాత్రమే అవసరమని తెలుస్తోంది. ఇది చిన్న గెస్ట్ రోల్ మాత్రమే కాదు, కథ మొత్తాన్ని ఒక ఊహించని మలుపు తిప్పే "గేమ్ ఛేంజింగ్" క్యారెక్టర్. ఉదాహరణకు 'ఖుషి' చిత్రంలో ఎస్.జె. సూర్య కనిపించేది కేవలం ఒక్క నిమిషం మాత్రమే అయినా, ఆ ఒక్క సీన్ సినిమా గమనాన్నే మార్చేస్తుంది. 'స్పిరిట్'లో రాబోయే ఈ బాలీవుడ్ భామ పాత్ర కూడా సరిగ్గా అలాగే ఉండబోతోందని టాక్.  ఒకవేళ ఏవైనా కారణాల వల్ల కత్రినా కైఫ్ ఈ ప్రాజెక్ట్‌ చేయడం కుదరకపోతే, ప్లాన్-బి కింద మరో పాపులర్ బాలీవుడ్ ఫేస్‌ను కూడా సందీప్ రెడ్డి ఇప్పటికే లైన్‌లో పెట్టారట. అయితే ఆ రెండవ హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రభాస్ ఖాకీ డ్రెస్ వేసుకొని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ సినిమాలో, ఇప్పటికే 40 శాతానికి పైగా టాకీ పార్ట్ పూర్తవ్వడం ఫ్యాన్స్‌కు పెద్ద ఊరట నిచ్చింది. సందీప్ రెడ్డి మార్క్ రా, రస్టిక్ టేకింగ్, ప్రభాస్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ అవతార్, దానికి తోడు ఈ సర్‌ప్రైజ్ బాలీవుడ్ ఎంట్రీలన్నీ కలిసి బాక్సాఫీస్ దగ్గర పాత రికార్డులన్నీ బద్దలవడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  కథను మలుపు తిప్పే ఆ మెరుపు పాత్రలో కత్రినా కైఫ్ మెరుస్తుందో లేక మరెవరైనా సీన్ లోకి వస్తారో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.     Katrina Kaif, Spirit, Prabhas, Sandeep Reddy Vanga, Tripti Dimri  
  సమంత(Samantha)తో పాటు ఆమె అభిమానులు సైతం ఊహించని విధంగా మా ఇంటి బంగారం(Maa Inti Bangaram)భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అందుకోవడమే కాదు రిలీజ్ కి ముందు ప్రీ రిలీస్ బిజినెస్, రిలీజైన తర్వాత కలెక్షన్స్ విషయంలో రికార్డులని సృష్టించింది. కొన్ని రోజుల క్రితం ఓటిటి వేదికగా విడుదలై రికార్డు వ్యూస్ సృష్టించే పనిలో బిజీగా ఉన్న మా ఇంటి బంగారం  విడుద‌లై 32 రోజులు అవుతున్నా ఇంకా కొన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ మూవీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు  99.51 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కొన్ని చానెల్స్, వెబ్‌సైట్లు ఇంకా 100 కోట్ల మార్క్‌ అధికారికంగా నమోదు చేయకపోయినా, చిత్రబృందం మాత్రం వారం రోజుల క్రితమే సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు ప్రకటించింది. కానీ కలెక్షన్ల విషయంలో సమంత ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాస్తవ కలెక్షన్స్  మాత్రమే ప్రకటించాలని, మిస్ లీడ్ చేసే గణాంకాలు విడుదల చేయొద్దని  చిత్రబృందానికి సూచించినట్లు టాక్ వినిపిస్తోంది. Also read: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలనటి మృతి.. కోట్లాది మంది హృదయాల్ని గెలుచుకుంది అందుకే అధికారిక లెక్కలు, ట్రేడ్ అంచనాల మధ్య స్వల్ప తేడా కనిపిస్తోందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మా ఇంటి బంగారం’ నిర్మాణ వ్యయం సుమారు 30 కోట్ల వరకు ఉన్నట్లు సినీ వర్గాల అంచనా. అయితే డిజిటల్, శాటిలైట్, ఇతర నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలోనే దాదాపు 35 కోట్ల ఆదాయం రావడంతో విడుదలకు ముందే సినిమా లాభాల్లోకి వెళ్లిందని సమాచారం. samantha, maa inti bangaram, raj nidimoru, nandini reddy  
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, టాలీవుడ్ యాక్షన్ సినిమా ప్రేమికులకు 'OG' మూవీ ఎంతటి భారీ మేనియాను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా బాక్సాఫీస్ వద్ద విజృంభించడమే కాకుండా, పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని స్టైలిష్ అవతార్‌లో ఆవిష్కరించింది.  ఇప్పుడు అదే పవర్ ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న సీక్వెల్ 'OG 2' కి సంబంధించి నెట్టింట ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం 'OG 2' టీమ్ అధికారికంగా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిందని, డైరెక్టర్ సుజీత్ ఈ రెండవ భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ విజ్యులైజేషన్ ప్రక్రియపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారని సమాచారం. మొదటి భాగాన్ని మించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సీక్వెల్‌ను రూపుదిద్దేందుకు సుజీత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుల పుట్టినరోజుల సందర్భంగా ఏదో ఒక ప్రత్యేక పోస్టర్ లేదా ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే రాబోయే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక మైండ్ బ్లోయింగ్ సర్ ప్రైజ్ అందించేందుకు మేకర్స్ పక్కా ప్లాన్ రూపొందిస్తున్నారు.  పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా 'OG 2' నుంచి ఒక అద్భుతమైన యానిమేషన్ వీడియోను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ యానిమేటెడ్ ప్రెజెంటేషన్ ను అద్భుతంగా, హై విజువల్ స్టాండర్డ్స్‌తో తీర్చిదిద్దేందుకు గాను చెన్నైకి చెందిన ప్రముఖ యానిమేషన్ స్టూడియోలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.  కేవలం ఒక సాధారణ ప్రకటనగా మాత్రమే కాకుండా, ఒక అనౌన్స్‌మెంట్ టీజర్ శైలిలో ఈ వీడియో డిజైన్ అవుతోందని వినికిడి. ఈ యానిమేటెడ్ టీజర్ ద్వారా 'OG 2' కథా ప్రపంచం, అందులోని ప్రధాన పాత్రల స్వభావం, సీక్వెల్లో ఉండబోయే హై-వోల్టేజ్ గ్యాంగ్‌స్టర్ ఎలిమెంట్స్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలను అభిమానులకు ముందే రుచి చూపించనున్నారట. దర్శకుడు సుజీత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్న ఈ యానిమేటెడ్ వీడియో పవన్ కళ్యాణ్ అభిమానులకు రాబోయే సెప్టెంబర్ 2న పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను పవన్ కళ్యాణ్ స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. అంతేకాకుండా తన మార్క్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఆల్బమ్‌తో ఆకట్టుకుంటున్న మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మరోసారి తన పవర్ ఫుల్ మ్యూజిక్ తో బీభత్సం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.      Pawan Kalyan, Birthday, OG 2 Animated Video, Sujeeth, OG2 Movie  
  -షాక్ కి గురవుతున్న ప్రపంచ సినీ ప్రేమికులు  -కారు యాక్సిడెంట్ లో బాల నటి మృతి  -యాక్సిడెంట్ కి గల కారణమేంటి!  సినీ ప్రపంచంలోకి చిన్నారి తారగా అడుగుపెట్టి, తన అద్భుతమైన అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్న యువ నటి కైలీ హాటిల్ (Kaylee Hottle) నిన్న అమెరికాలోని మేరీ ల్యాండ్ లో జరిగిన రోడ్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో  ప్రపంచ సినిమాలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. స్థానిక పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం తెల్లవారుజామున సుమారు 2:52 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. కైలీ తో పాటు మరో యువకుడు  1995 మోడల్ కి చెందిన హోండా కార్డ్‌ కారులో వెళ్తున్నారు. మితిమీరిన వేగంతో వస్తున్న కారు వేగంగా రోడ్ పక్కనే ఉన్న కల్వర్టుని బలంగా ఢీకొట్టింది.ప్రమాదం జరిగిన వెంటనే కైలీ, యువకుడ్ని  చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. కానీ తీవ్ర గాయాల కారణంగా కైలీ చనిపోగా కారులో ఉన్న మరో వ్యక్తి  ప్రమాదం నుండి తృటిలో ప్రాణాలతో బయట పడ్డాడు. డ్రైవర్ స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. Also read: మెగా హీరో మూవీపై కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ ప్రాజెక్ట్ నాదే  2021లో వచ్చిన హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' లో 'జియా' (Jia) అనే మూగ, చెవిటి పాప క్యారక్టర్ లో  కైలీ ప్రదర్శించిన నటన అందరినీ కట్టిపడేసింది. మాటలు లేకపోయినా సైగలతో కళ్లలోని భావాలతో భారీ రాక్షస జంతువు 'కాంగ్' తో ఆమె పెంచుకునే అనుబంధం ప్రేక్షకులని భావోద్వేగానికి గురిచేసింది.  2024లో విడుదలైన 'గాడ్జిల్లా vs  కాంగ్ సీక్వెల్‌లో కూడా నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కైలీ మరణవార్తని  ఆమె తండ్రి జోషువా హాటిల్  ఫేస్‌బుక్‌లో సైన్ లాంగ్వేజ్‌లో ఒక కన్నీటి వీడియో రూపంలో పంచుకోవడంతో ప్రపంచానికి ఈ చేదు నిజం తెలిసింది. కైలీ పుట్టుకతోనే వినికిడి లోపంతో  జన్మించింది..కైలీ మృతి పట్ల ప్రపంచ సినీ ప్రేమికులతో పాటు సినీ బృందం తన సంతాపాన్ని తెలియచేస్తుంది. కైలీ వయసు ప్రస్తుతం పద్దెమిది సంవత్సరాలు. kaylee hottle, Godzilla vs Kong actor     
ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి జ్యోతి కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు మెహర్ రమేష్. "నా ప్రియమైన చిన్నక్క 'మెహెర్ జ్యోతి సుంకర' విజయవాడ లో స్వర్గస్తులైనారు." అంటూ మెహర్ రమేష్ పెట్టిన పోస్ట్ కంటతడి పెట్టిస్తోంది. వైరల్ న్యూమోనియాతో గత 14 రోజులుగా చికిత్స పొందుతున్న జ్యోతి.. మంగళవారం రాత్రి అనంత లోకాలకి వెళ్లి పోయారు.  మెహర్ రమేష్ కి చిన్నప్పటి నుంచి అండగా నిలిచిన జ్యోతి.. రీసెంట్ గా ఆయన కూతురి పెళ్లిని కూడా దగ్గరుండి జరిపించారు.  "ఇటీవల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఎంతో ఆనందపడిన మా అక్క.. ఇప్పుడు ఆ దేవుడి దగ్గరకి ఇంత తొందరగా వెళ్లిపోవడం మా కుటుంబానికి తీరని లోటు." అంటూ మెహర్ రమేష్ ఎమోషనల్ గా రాసుకొచ్చారు. https://x.com/MeherRamesh/status/2079632473466802450   Meher Ramesh, Sister, Meher Jyothi Sunkara, Tollywood  
  కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)ఈ శుక్రవారం అంటే 24 న చెన్నై లవ్ స్టోరీతో థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడు. ప్రచార చిత్రాలు బాగుండటం, క్రేజీ భామ గౌరీ ప్రియ హీరోయిన్ కావడం, మెగా కాంపౌండ్ గా పిలుచుకునే ఎస్ కె ఎన్, సాయి రాజేష్ నిర్మాతలు కావడంతో  చెన్నై లవ్ స్టోరీ పై మంచి అంచనాలే ఉన్నాయి.  ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా 'కిరణ్ అబ్బవరం' సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్(Sai Durga Tej)అప్ కమింగ్ మూవీ 'సంబరాల ఏటిగట్టు' పై కీలక వ్యాఖ్యలు చేసాడు. 'సంబరాల ఏటిగట్టు" సినిమా నిజానికి సాయి తేజ్ కంటే ముందు నా దగ్గరకే వచ్చింది. 2021 లో దర్శకుడు రోహిత్ 2 కోట్ల చిన్న బడ్జెట్ కథతో నా వద్దకి వచ్చాడు..అయితే రోహిత్‌లోని అద్భుతమైన ప్రతిభ తెలిసి, చిన్న కథ కాకుండా ఒక పెద్ద స్కేల్ ఉన్న కథని సిద్ధం చేయమని సూచించాను. అలా రూపుదిద్దుకున్నదే ఈ "సంబరాల ఏటిగట్టు" కథ. నాకు ఎంతో ఆప్తుడైన 'హనుమాన్' చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డికి రోహిత్ ని పరిచయం చేశాను.కానీ ప్రీ ప్రొడక్షన్ ప్రక్రియ సాగుతుండగానే పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఒకవైపు కథ పరిధి పెరిగిపోవడంతో బడ్జెట్ అనుకున్న దానికంటే భారీగా పెరిగి  60 కోట్ల నుండి 70 కోట్లకి చేరుకుంది. మరొకవైపు అదే సమయంలో నా నుంచి వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా ఫ్లాప్ అయ్యాయి. మార్కెట్‌లో తన స్థానం కొంత ఊగిసలాటలో ఉన్న ఆ సమయంలో, అంత పెద్ద బడ్జెట్ నా మార్కెట్ మీద పెట్టడం రిస్క్ అని ఆలోచించాను. నిర్మాత నిరంజన్ రెడ్డి తనతోనే సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, నిర్మాత క్షేమం కోరి స్వయంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.సంబరాల యేటిగట్టు  అతిపెద్ద హిట్ కావాలని మొదట ఆశించేది, సంతోషించేది నేనేనని కిరణ్ చెప్పుకొచ్చాడు. సాయి దుర్గ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా చేస్తుండగా పాన్ ఇండియా లెవల్లో సంబరాల యేటి గట్టు తెరకెక్కుతుంది. kiran abbavaram, saidharam tej, syg, sambarala yetigattu  
నందమూరి కుటుంబం అంటేనే తెలుగు చిత్రసీమలోనూ, రాజకీయాల్లోనూ ఒక చెరగని ముద్ర. స్వర్గీయ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు స్థాపించిన ఆశయాలు, నందమూరి హరికృష్ణ చూపించిన బాటను ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నందమూరి కుటుంబం నుంచి మరొక ప్రముఖ వ్యక్తి ప్రజా సేవలో చురుగ్గా ముందుకు వస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆమె ఎవరో కాదు... స్వర్గీయ నందమూరి జానకీరామ్ సతీమణి, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ లకు వదిన అయిన నందమూరి దీపికా జానకీరామ్. ఇటీవల కాలంలో నందమూరి దీపిక చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. స్వర్గీయ జానకీరామ్ జ్ఞాపకార్థం, ఆయన సేవా స్ఫూర్తిని సజీవంగా ఉంచేందుకు "నందమూరి జానకీరామ్ ట్రస్ట్"ను ఏర్పాటు చేసి, దాని ద్వారా నిరుపేదలకు, చిన్నారులకు, విద్యార్థులకు నిరంతరం అండగా నిలుస్తున్నారు.  తాజాగా శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక సేవా కార్యక్రమంలో నందమూరి దీపిక స్వయంగా పాల్గొని చిన్నారులకు అవసరమైన కుర్చీలు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు. అంగన్‌వాడీ చిన్నారులతో ఆమె ఆప్యాయంగా ముచ్చటించి, వారి ముద్దుల నవ్వులను తిలకించడం స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. https://www.instagram.com/p/DbDaTGQFDwF/ "పిల్లలు దైవ స్వరూపులు... వారి చిరునవ్వుల్లోనే దేవుడి ఆశీర్వాదం కనిపిస్తుంది. చిన్నారుల భవిష్యత్తు బలంగా ఉండాలంటే వారికి మెరుగైన విద్య, మంచి ఆరోగ్యం, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం మనందరి సామాజిక బాధ్యత" అని ఈ సందర్భంగా దీపిక గారు పేర్కొన్నారు.  "సేవే మా సంకల్పం... చిన్నారుల సంక్షేమమే మా లక్ష్యం" అనే నినాదంతో ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా ఆమె ముందడుగు వేస్తున్నారు. కేవలం అంగన్‌వాడీ కేంద్రాలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ పాఠశాలలు, దివ్యాంగులు, పేద కుటుంబాల అవసరాలను గుర్తించి నందమూరి జానకీరామ్ ట్రస్ట్ ద్వారా తగిన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. https://www.instagram.com/reel/DbDoZHITWAQ/ నందమూరి జానకీరామ్ గతంలో రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన తనయులు మాస్టర్ ఎన్టీఆర్, మాస్టర్ సౌమిత్రి ఇప్పటికే 'దాన వీర శూర కర్ణ' బాలల చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. చిన్న ఎన్టీఆర్ త్వరలోనే హీరోగానూ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.  భర్త ఆశయాలను, నందమూరి వంశ ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను దీపిక భుజస్కంధాలపై వేసుకున్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు చేయూతనిస్తూ, విద్యార్థుల చదువుకు ఆసరాగా నిలుస్తున్న ఆమెను చూసి నందమూరి అభిమానులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో దీపిక ఇంత చురుగ్గా పాల్గొంటుండటంతో, త్వరలోనే ఆమె రాజకీయ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో నందమూరి సుహాసిని ఎన్నికల బరిలో నిలిచిన సమయంలో కూడా దీపిక ప్రచారంలో పాల్గొని మద్దతు తెలిపిన విషయాన్ని పలువురు గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుతానికి రాజకీయ ప్రకటనలు ఏవీ చేయకపోయినప్పటికీ, ప్రజా సేవ ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్తున్న తీరు చూస్తుంటే, నందమూరి వారసత్వాన్ని ప్రజాసేవలో సరికొత్తగా చాటేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏది ఏమైనా, జానకీరామ్ ట్రస్ట్ ద్వారా వేలాది మందికి లబ్ధి చేకూరుస్తూ నందమూరి దీపిక సాగిస్తున్న ఈ సేవా ప్రయాణం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.     Nandamuri Deepika, Public Service, Nandamuri Janakiram, NTR, HariKrishna  
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస భారీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. 'పుష్ప' సిరీస్ తెచ్చిన కనీవినీ ఎరుగని విజయం తర్వాత, బన్నీ ఎంచుకునే ప్రతి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో అల్లు అర్జున్ ఒక మూవీ చేయబోతున్నారనే వార్త సినీ ప్రియులలో ఉత్సాహాన్ని నింపింది.  కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా లోకేష్‌కంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయన దర్శకత్వంలో ఉండే ఎఫెక్టివ్ స్క్రీన్‌ప్లే, డార్క్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్, అలాగే అల్లు అర్జున్ కింగ్ సైజ్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల తుఫాను ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ సంచలన కలయికకు సంబంధించి ఇప్పుడొక ఆసక్తికరమైన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే, వీరిద్దరూ కలిసి నటించబోతున్న మూడో సినిమా ఇది అవుతుంది. గతంలో 'దువ్వాడ జగన్నాథం', 'అల వైకుంఠపురములో' సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాలో బన్నీ, పూజాల మధ్య పండిన కెమిస్ట్రీ, 'బుట్టబొమ్మ' పాటలో వారి డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ కాంబినేషన్ తెచ్చిన మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు మళ్లీ అదే హిట్ పెయిర్ తెరపైకి రాబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు లోకేష్ కనగరాజ్ గత చిత్రం 'కూలీ'లో మోనికా సాంగ్ తో పూజ మెస్మరైజ్ చేయడం విశేషం. పైగా, లోకేష్ తన సినిమాల్లో హీరోయిన్ పాత్రలను డిజైన్ చేసే తీరు చాలా భిన్నంగా ఉంటుంది. కేవలం గ్లామర్‌కే పరిమితం చేయకుండా కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలుగా తీర్చిదిద్దడం ఆయన శైలి. అలాంటి విలక్షణమైన టేకింగ్‌లో పూజా హెగ్డే స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  ప్రస్తుతం ఈ కాంబినేషన్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నప్పటికీ, మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. త్వరలోనే మూవీ టీమ్ దీనిపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.     AA23, Allu Arjun, Lokesh Kanagaraj, Pooja Hegde  
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, టాలెంటెడ్ హీరోయిన్ రీతూ వర్మ ప్రేమలో ఉన్నారంటూ గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలసి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించకపోయినప్పటికీ.. సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఈ జంటపై ఎప్పుడూ ఒక రకమైన ఆసక్తి నెలకొని ఉంది.  నిహారిక కొణిదెలతో ఉన్న మంచి స్నేహం కారణంగా రీతూ వర్మ మెగా కుటుంబానికి చాలా దగ్గరయ్యారు. నిహారిక వివాహ వేడుకలతో పాటు వరుణ్ తేజ్ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకల్లో కూడా రీతూ వర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి హంగామా చేశారు. ఆ వేడుకల్లో ఆమె కనిపించిన తీరుతోనే మెగా ఇంట్లోకి రీతూ త్వరలోనే కోడలిగా వెళ్లబోతోందంటూ వార్తలు ఊపందుకున్నాయి. అయితే, గత కొంతకాలంగా వైష్ణవ్ తేజ్, రీతూ వర్మ జంట ఎక్కడా కలసి కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా బ్రేకప్ వార్తలు షికారు చేశాయి. వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారని, అందుకే ఒకరికొకరు దూరంగా ఉంటున్నారంటూ నెటిజన్లు రకరకాల ఊహాగానాలు మొదలుపెట్టారు.  కానీ, తాజాగా ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విడిపోయారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. రీతూ వర్మ, వైష్ణవ్ తేజ్ ఇప్పటికీ సీక్రెట్‌గా రిలేషన్‌షిప్‌లోనే కొనసాగుతున్నారని, తమ వ్యక్తిగత జీవితాన్ని మీడియా ప్రచారానికి దూరంగా ప్రైవేట్‌గా ఉంచాలనే ఉద్దేశంతోనే సైలెంట్‌గా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ బ్రేకప్ రూమర్స్‌కు చెక్ పెడుతూ ఇటీవల ఒక చిన్న ఆసక్తికరమైన సంఘటన కూడా జరిగింది. రీతూ వర్మ తన వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త ప్రయాణం మొదలైందంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌కు, అందరికంటే ముందే వైష్ణవ్ తేజ్ లైక్ కొట్టడం నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. వైష్ణవ్ చేసిన ఆ ఒక్క చిన్న లైక్‌తో వీరిద్దరి బంధంపై వస్తున్న అసత్య ప్రచారాలన్నింటికీ పూర్తిగా తెరపడినట్లయింది. ప్రొఫెషనల్ కెరీర్ పరంగా ఇద్దరూ పూర్తిగా సెటిల్ అయిన తర్వాత, ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి పీటలు ఎక్కాలని ఈ జంట భావిస్తున్నట్లు తెలుస్తోంది. కెరీర్ విషయానికి వస్తే, 'ఉప్పెన' వంటి సంచలన విజయం తర్వాత వైష్ణవ్ తేజ్‌కు వరుసగా ప్లాప్‌లు పడటంతో గత దాదాపు 2 ఏళ్లుగా ఎలాంటి కొత్త ప్రాజెక్టును ఒప్పుకోకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తన కెరీర్‌ను తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకురావడానికి కథల ఎంపికపై పూర్తి శ్రద్ధ పెట్టారు.  మరోవైపు రీతూ వర్మ కూడా గోపీచంద్ సరసన 'భరతవర్ష' అనే భారీ హిస్టారికల్ ఫిల్మ్ లో నటిస్తున్నారు. దీంతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.  లవ్ లైఫ్‌ను, కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న ఈ మెగా జంట ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.     Vaishnav Tej, Ritu Varma, Relationship, Secret Love, Marriage  
Pooja Hegde appears to be back in demand in Telugu cinema. After signing high-profile projects across Tamil and Hindi, the actress is now reportedly in discussions for a major Telugu multi-starrer, sparking fresh excitement among fans. According to the latest industry buzz, Pooja has been approached to play one of the leading ladies in an upcoming multi-starrer featuring two prominent Telugu heroes. While the makers are said to be keen on bringing her on board, the actress is yet to officially sign the dotted line. The project is reportedly in the casting stage, with an announcement expected once the lead cast is finalized. The rumour comes at a time when Pooja is enjoying a busy lineup. She is gearing up for the release of Vijay's Jana Nayagan, has multiple Tamil and Hindi films in hand, and is also said to be considering fresh Telugu offers as she looks to strengthen her presence in Tollywood once again. A multi-starrer could be the perfect platform for the actress to make a strong comeback in Telugu cinema, especially after staying away from the industry for some time. Given her successful track record with several leading stars, the prospect of seeing her in another big-ticket Telugu entertainer has already generated curiosity among movie buffs. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది. ఒకప్పుడు కేవలం పండుగలు,  పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటి సమయాల్లో మాత్రమే ధరించినప్పటికీ, నేటికాలంలో మహిళలు ఆఫీస్, పార్టీలు, పండుగలు, నార్మల్ టూర్స్ వంటి వాటికి కూడా సల్వార్ సూట్ లు ధరించడానికి ఇష్టపడతారు.  అయితే ఇప్పట్లో సల్వార్ సూట్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ లోకి మారింది. నేటికాలంలో మరింత ఫ్యాషన్ గా ఉన్న దుస్తులు రావడంతో సల్వార్ సూట్ కూడా సాధారణ దుస్తుల్లా మారిపోయింది.  కానీ సల్వార్ సూట్ ను కూడా ఫ్యాషన్ గా ధరిస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండొచ్చు.  అందుకోసం సల్వార్ సూట్ ను ఎలా ధరించాలి?  తెలుసుకుంటే.. సల్వార్ సూట్ స్టైల్ గా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు.. సరైన ఫిట్టింగ్..  సరైన ఫిట్‌తో సూట్‌ను ఎంచుకోండి. సల్వార్ సూట్ స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా కనిపించాలంటే, దాని ఫిట్టింగ్‌పై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. చక్కగా సరిపోయే సూట్  చక్కగా కనిపించేలా చేస్తుంది, అలాగే చాలా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.  మరీ వదులుగా ఉండే సూట్ ధరించడం వల్ల దుస్తుల షేప్  పాడవుతుంది, అదే సమయంలో మరీ బిగుతుగా ఉండే సూట్ ఎబ్బెట్టుగా కనిపించేలా చేస్తుంది. అందుకే ఫిట్టింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుప్పట్టా.. సల్వార్ సూట్‌లో దుపట్టా చాలా ముఖ్యమైనది.  ఇది మొత్తం రూపాన్ని డిఫరెంట్ గా మార్చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. అంతేకాదు.. దుపట్టాను ధరించే విధానాన్ని మార్చడం ద్వారా ఒకే సూట్‌ను చాలా విధాలుగా దరించవచ్చు. దుప్పట్టాను  ఒక భుజంపై ఓపెన్ గా  వేసుకోవచ్చు, ముందు వైపు కుచ్చులతో ధరించవచ్చు, లేదా బెల్ట్‌తో కొత్త టచ్ ఇవ్వవచ్చు.   ఫ్యాషన్ జ్యువెలరీ.. సరైన జ్యువెలరీ  సాధారణ సల్వార్ సూట్‌ను కూడా స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా మార్చగలవు.  సూట్ సింపుల్‌గా ఉంటే, ఆక్సిడైజ్డ్ చెవిపోగులు, చాంద్‌బాలీలు, ఒక స్టేట్‌మెంట్ నెక్లెస్ లేదా రంగురంగుల బ్రాస్‌లెట్‌లు ధరించి  లుక్‌ను మరింత మెరుగుపరుచుకోవచ్చు. అయితే, భారీ వర్క్  ఉన్న సూట్‌తో సింపుల్ ఆభరణాలు మరింత హుందాగా కనిపిస్తాయి. ఆభరణాలను ఎంచుకునేటప్పుడు, బాలెన్స్డ్  లుక్ కోసం సూట్  రంగు , డిజైన్‌ను పరిగణలోకి తీసుకోవాలి. .పాదరక్షలు.. సల్వార్ సూట్‌కు సరైన పాదరక్షలను ఎంచుకోవడం  మొత్తం రూపాన్ని మార్చేస్తుంది. సాంప్రదాయ రూపానికి, ఎత్నిక్ జుట్టీలు, కొల్హాపురి చెప్పులు , శాండల్స్ మంచి ఎంపికలు.  పార్టీకి లేదా ప్రత్యేక సందర్భానికి సూట్ ధరిస్తుంటే, లైట్ హీల్స్ మరింత అందాన్ని ఇస్తాయి.  హెయిర్ స్టైల్, మేకప్.. సరైన హెయిర్‌స్టైల్ , మేకప్ సల్వార్ సూట్‌తో  రూపాన్ని మరింత మెరుగుపరుస్తాయి. సాంప్రదాయ దుస్తులతో, లూజ్ హెయిర్ స్టైల్ కు స్మూత్  కర్ల్స్, లో బన్, గజ్రా స్టైల్ లేదా సైడ్ బ్రెయిడ్ వంటివి బాగుంటాయి. హెవీ మేకప్ లుక్ కంటే లైట్ గా , సహజమైన మేకప్ మరింత హుందాగా కనిపిస్తుంది.  డ్రెస్ రంగుకు అనుగుణంగా   లిప్ కలర్, ఐ మేకప్ , బిందీని సెలెక్ట్ చేసుకోవచ్చు.                                           *రూపశ్రీ.  
అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 20న జరుపుకుంటారు . చెస్ అనేది మెదడును ఎక్కువగా ఉపయోగించే ఆట. అందువల్ల, చెస్ ఆడటం పిల్లల మేధస్సును పదును పెడుతుందని చాలా మంది చెబుతుంటారు. చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆలోచనా, గ్రహణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి పిల్లలతో చెస్ ఆడించాలని అనుకుంటారు. కానీ కేవలం చెస్ ఆడటం మాత్రమే మేధస్సును పదును పెడుతుందా? దీనిపై వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుంటే.. ఆలోచించే అలవాటు.. చదరంగం ఆడేటప్పుడు పిల్లలు ప్రతి ఎత్తును జాగ్రత్తగా పరిశీలించాలి,.  ప్రత్యర్థి ఎలాంటి ఎత్తు వేస్తాడు అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి,  ఇది పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే బదులు ముందుగా ఆలోచించేలా ప్రోత్సహిస్తుంది. క్రమంగా, వారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే అలవాటును పెంపొందించుకోగలుగుతారు. ఏకాగ్రత.. చదరంగం ఆడుతున్నప్పుడు పిల్లల పూర్తి ఏకాగ్రత ఆటపైనే ఉంటుంది. వారి ఏకాగ్రత ఒక్క క్షణం తగ్గినా,  లేదా డిస్టర్బ్ అయినా  వారు ఆటను ఓడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల, ఈ ఆట పిల్లల ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే చెస్ ఆడేటప్పుడు పిల్లలు ఏకాగ్రతగా ఉండటం వారి చదువులకు, ఇతర ముఖ్యమైన పనులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. జ్ఞాపకశక్తి.. చెస్ ఆడేటప్పుడు పిల్లలు అనేక ఎత్తులు, నియమాలు , చెస్ ఆడే ఇతర  పద్ధతులను గుర్తుంచుకోవలసి ఉంటుంది. దీనివల్ల వారి మెదడు నిరంతరం చురుకుగా ఉంటుంది. వైద్యుల ప్రకారం, ఇది వారి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది , కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తిని కూడా పెంచుతుంది. సహనం.. చెస్ అనేది తొందరపడి ఆడే ఆట కాదు. ప్రతి ఎత్తుగడకు జాగ్రత్తగా ఆలోచన అవసరం. కొన్నిసార్లు, గెలవడానికి చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఇది పిల్లలకు సహనాన్ని నేర్పి, వాస్తవిక దృక్పథంతో నిర్ణయాలు తీసుకునే అలవాటును పెంపొందించడంలో సహాయపడుతుంది. పాఠాలు.. చెస్ అనే కాదు.. ఏ ఆటలో అయినా సరే.. ఎల్లప్పుడూ గెలవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఓడిపోతాం. కానీ ఓటమి పిల్లలు తమ తప్పులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని వైద్యులు చెబుతారు. ఇది తర్వాతిసారి మరింత మెరుగ్గా ఆడేందుకు వారిని ప్రోత్సహిస్తుంది. ఈ అలవాటు వారి చదువులో , ఇతర జీవిత పనులలో కూడా సహాయపడుతుంది. చెస్ మాత్రమే కాదు.. కేవలం చెస్  ఆడటం వల్ల మాత్రమే పిల్లల మెదడు పదునుదేరదని వైద్యులు చెబుతున్నారు. మంచి నిద్ర, సరైన పోషణ, రోజువారీ శారీరాన్ని చురుగ్గా ఉంచే ఇతర ఆటలు, చదువు కూడా చాలా అవసరం. ఇవన్నీ కలిసినప్పుడే పిల్లల మెదడు చక్కగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల, చదరంగంతో పాటు మంచి రోజువారీ అలవాట్లపై దృష్టి పెట్టడం ముఖ్యం.                                     *రూపశ్రీ.  
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.  పిల్లలు తప్పులు చ చేయడం సహజం. తోటి పిల్లలను బాధపెట్టడం కూడా సహజం. కానీ పిల్లలు మాత్రం  కొంత సేపు అయ్యాక లేదా ఒక రోజు తర్వాత అవన్నీ మర్చిపోయి తిరిగి కలిసి ఆడుకుంటారు, మళ్లీ గొడవలు కూడా పడతారు.  అందుకే పిల్లలను కల్మషం లేని వారు అని చెబుతూ ఉంటారు. అయితే గొడవలు పడినప్పుడో.. లేదా ఇతర పిల్లలు మీ పిల్లలను బాధపెట్టినప్పుడు, ఇతర పిల్లలు చేసిన తప్పులను మీ పిల్లలు మర్చిపోకుండా మనసులో ఉంచుకోవడం వంటివి చేసినప్పుడు అది మంచి విషయం కాదని పిల్లల పెంపకం నిపుణులు అంటున్నారు.   దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. కారణం.. పిల్లలు ప్రపంచాన్ని పెద్దల కంటే చాలా భిన్నంగా చూస్తారు. వారికి, ఒక బొమ్మను పగలగొట్టడం లేదా ఆటలో ఓడిపోవడం చాలా పెద్ద విషయం. అటువంటి పరిస్థితిలో, ఒక స్నేహితుడు వారి మాట వినకపోతే, వారు అభద్రతకు గురై, మోసపోయినట్లు భావిస్తారు. క్రమంగా, పిల్లలలో అహంభావం పెరుగుతుంది, దీనివల్ల క్షమాపణ చెప్పడం లేదా క్షమాపణ కోరడం ఒక కష్టమైన పనిగా అనిపిస్తుంది. ప్రవర్తనను మార్చడం వల్ల కలిగే ప్రభావం.. పిల్లవాడికి క్షమించే అలవాటు లేకపోతే, అతను క్రమంగా ఒంటరివాడు అవుతాడు. మనసులో పగను ఉంచుకోవడం అతని మానసిక ఒత్తిడిని పెంచుతుంది. దేనికీ సర్థుకుని పోలేని మనస్తత్వం,  ఇతరుల తప్పులను చూపించే కారణం వల్ల పిల్లవాడు ఎవరితో కూడా ఎక్కువకాలం స్నేహంగా ఉండలేడు.  పిల్లలు సున్నితమైన, అర్థం చేసుకునే వ్యక్తులుగా మారాలంటే,  క్షమించడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులే సహాయం చేయాలి.. తల్లిదండ్రులు చిన్న విషయాలకే కోపగించుకుని, క్షమాపణ చెప్పకపోయినా లేదా క్షమించకపోయినా, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఒకవేళ తను తప్పు చేసి ఉంటే ఏమి ఆశించి ఉండేవాడో ఆ పిల్లవాడిని అడగాలి. ఇతర పిల్లల పరిస్థితిని అర్థం చేసుకునేలా పిల్లలను  ప్రోత్సహించాలి. ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు మీరు కూడా క్షమాపణ చెప్పి, ఎదుటి వ్యక్తిని క్షమించడం నేర్చుకోవాలి. క్షమాపణ చెప్పడం బలహీనతకు సంకేతం కాదని, గొప్పతనానికి సంకేతమని పిల్లలు  అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. స్నేహాన్ని బలపరిచే విషయాలు.. ఎవరూ పర్పెక్ట్ కారని పిల్లలకు వివరించాలి. ప్రతిఒక్కరూ తప్పులు చేస్తారు,  కాబట్టి అందరిలో  తప్పులు మాత్రమే  చూడటం తప్పని పిల్లలకు చెప్పాలి. స్నేహ సంబంధం అనేది నమ్మకం , క్షమాగుణం అనే పునాదులపై ఆధారపడి ఉంటుంది. 'క్షమించండి' అని చెప్పడంలో ఉన్న  ప్రాముఖ్యతను పిల్లలకు  వివరించాలి.  క్షమించడం ఎంతో గొప్ప గుణం అని  చెప్పాలి. చిన్నతనంలో క్షమించడం నేర్చుకున్న పిల్లలు భవిష్యత్తులో మరింత సంతోషంగా, విజయవంతంగా ఉంటారని మనస్తత్వవేత్తలు నమ్ముతారు. కాబట్టి పిల్లలకు క్షమాగుణం అలవాటు చేయాలి.                                       *రూపశ్రీ.  
యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే పప్పు ధాన్యాలు తినకూడదా..! కొందరికి కాలివేళ్లు , చేతివేళ్ల కీళ్లలో నొప్పి, మోకాళ్లు , చీలమండలలో వాపు, , నడవడంలో ఇబ్బంది వంటివి ఎదురవుతుంటాయి.  ఇవి యూరిక్ యాసిడ్ పెరగడానికి సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక వ్యర్థ పదార్థం. శరీరం ప్యూరిన్స్ అనే పదార్థాలను విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. సాధారణ పరిస్థితులలో, మూత్రపిండాలు దీనిని వడపోసి మూత్రం ద్వారా విసర్జిస్తాయి. అయితే, శరీరం దీనిని అధిక మొత్తంలో ఉత్పత్తి చేసినప్పుడు లేదా మూత్రపిండాలు దీనిని సరిగ్గా విసర్జించలేనప్పుడు, ఇది రక్తంలో పేరుకుపోవడం మొదలవుతుంది. శరీరంలో  యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే అనేక రకాల సమస్యలకు దారితీయవచ్చు. క్రమంగా, దాని స్ఫటికాలు కీళ్లలో పేరుకుపోయి, నొప్పి, వాపు , గౌట్ వంటి సమస్యలను కలిగిస్తాయి. సాధారణంగా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే, పప్పుధాన్యాలు తినడం మానేయాలని  కొందరు చెబుతూ ఉంటారు. అసలు యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే పప్పు ధాన్యాలు తినడం మానేయాలా? యారిక్ యాసిడ్ స్థాయిలు తగ్గించుకోవడానికి ఏం చేయాలి?  తెలుసుకుంటే.. యూరిక్ యాసిడ్ ఎలా పెరుగుతుంది?  ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరంగా లేకపోవడం,  బరువు పెరగడం, శారీరక శ్రమ తగ్గడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య గణనీయంగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. గతంలో వృద్ధులకు వచ్చే వ్యాధిగా భావించిన ఈ సమస్య, ఇప్పుడు 30 ఏళ్లలోపు యువతలో కూడా బయటపడుతోంది. . కిడ్నీ వ్యాధులు,  డయాబెటిస్ మందులు,  మెటబాలిక్ సిండ్రోమ్,  కొన్ని రకాల మందులు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతాయి. యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు పప్పు ధాన్యాలు తినకూడదా?  యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటే పప్పుధాన్యాలు తినడం మానుకోవాలా అని చాలామంది గందరగోళానికి గురవుతుంటారు. కానీ పూర్తీగా మానేయడం అవసరం లేదని ఆహార నిపుణులు చెబుతున్నారు.  యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ,  పప్పుధాన్యాలు తినడం ఆపాల్సిన అవసరం లేదు.  సరైన పప్పుధాన్యాలను ఎంచుకుని, వాటి పరిమాణం విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుందట. ఇది  యూరిక్ యాసిడ్ స్థాయిపై కూడా ఆధారపడి ఉంటుందట. 8 కంటే ఎక్కువ యూరిక్ యాసిడ ఉంటే, తక్కువ ప్యూరిన్ ఉన్న పప్పు ధాన్యాలు తినడం మంచిది. పప్పుధాన్యాలు ప్రోటీన్, ఫైబర్ తో పాటు అనేక ముఖ్యమైన పోషకాలకు మంచి వనరు. పచ్చ పెసలు యూరిక్ యాసిడ్  ఉన్నవారికి చాలామంచివి.   అవి పోషకాలను అందించి, యూరిక్ యాసిడ్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.  వారానికి 3-4 సార్లు పెసరపప్పు, ఎర్ర కందిపప్పు తినడం ఆరోగ్యానికి మంచిది. యూరిక్ యాసిడ్ ఉన్నవారు ఏవి తినకూడదు? యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే, సముద్రపు ఆహారం, ఎర్ర మాంసం , మద్యం మొదలైనవి మానేయాలి.   తీపి పానీయాలు, అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కలిగిన పానీయాలు , అధిక చక్కెర వినియోగాన్ని తగ్గించుకోవాలి. తగినంత నీరు త్రాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం మరింత ప్రయోజనకరం.                                      *రూపశ్రీ.  
హై ప్రోటీన్ కోసం ఖరీదైన ఫుడ్స్ అవసరం లేదు! ఈ మినుముల పులగమే చాలు మినుముల పులగం అనేది మన సంప్రదాయ ఆహారాల్లో ఎంతో విలువైనది. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, బలం, శక్తిని అందించే సహజమైన ఆహారం. ముఖ్యంగా శారీరక బలహీనత, కండరాల బలం తగ్గడం, అలసట వంటి సమస్యలు ఉన్నవారికి ఇది మంచి పోషకాహారంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చిటిబొట్ల మధుసూదన్ శర్మ గారు మినుముల పులగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను సులభంగా వివరించారు. మినుములలో ఉండే అధిక ప్రోటీన్ శరీర కండరాలను బలపరచడంలో సహాయపడుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి, శక్తి పెరగడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు: మినుముల పులగం ఆరోగ్యానికి ఎందుకు మంచిది? ఇందులో ఉండే పోషక విలువలు ఏమిటి? అధిక ప్రోటీన్ శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది? మినుముల పులగాన్ని ఎలా తయారు చేయాలి? ఎవరు తినాలి? ఎవరు పరిమితంగా తీసుకోవాలి? ఆయుర్వేదం ప్రకారం దీనిని తీసుకునే సరైన విధానం ఏమిటి? సహజమైన ఆహారంతో శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను తప్పకుండా చూడండి. గమనిక: ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఆయుర్వేద అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకుని మాత్రమే ఆహారంలో మార్పులు చేసుకోవాలి.