Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రధాని నివాసం వద్ద గాయపడిన రాహుల్.. ముక్కు నుంచి రక్తం.. అసలేం జరిగింది?
posted on: Jul 22, 2026 11:10AM

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ పిలుపు మేరకు మంగళవారం (జులై 21) జరిగిన ప్రధాని నివాసం ముట్టడి కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు పలువురు కీలక నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
దేశ వ్యాప్తంగా యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలు, కేంద్ర ప్రభుత్వ అణచివేత చర్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఈ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పలువురు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ప్రధాని నివాసానికి ర్యాలీగా బయలుదేరారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ర్యాలీని ప్రధానమంత్రి నివాసానికి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు ముందుకు సాగేందుకు ప్రయత్నించగా, పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. రాహుల్ గాంధీని అక్కడ నుంచి తరలించేందుకు పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఆయన ముక్కు నుంచి రక్తం కారింది. అయినప్పటికీ భద్రతా సిబ్బంది ఆయనను నిర్బంధంలోకి తీసుకుని, మోసుకెళ్లి వ్యాన్ లో ఎక్కించారు.
ముక్కు నంచి రక్తం కారుతున్నా.. రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా నినాదాలు చేస్తుండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండి పడుతున్నారు. యువత కసం నిలబడిన నేత పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందనీ.. అలాంటిది ఒక అగ్రనేతపై పోలీసులు భౌతిక దాడికి దిగడం దారుణమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజా నాయకుడిగా క్లిష్ట సమయాల్లో భౌతిక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల తరఫున నిలబడిన రాహుల్ గాంధీ పోరాటపటిమ, నాయకత్వ లక్షణాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Rahul Gandhi Bleeding Nose, Rahul Gandhi PM Residence Protest, Congress Delhi Protest, Rahul Gandhi Detained Delhi Police, Rahul Gandhi Injury






