LATEST NEWS
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరిట కొత్త పార్టీ ప్రారంభించడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది.  పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పార్టీలోని అహంకారపూరిత ధోరణులు, ముఖ్యంగా కేటీఆర్ మరియు హరీష్ రావుల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న కల్వకుంట్ల నేరుగా తండ్రి కేసీఆర్ పైనే యుద్ధం ప్రకటించారు. బీఆర్ఎస్  ఉద్యమకారులను, మేధావులను పక్కనపెట్టి కేవలం కొందరికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ పార్టీ పార్టీ పునాదులు బలహీనపడ్డాయి.  ఇప్పుడు కవిత సొంత పార్టీతో బీఆర్ఎస్ కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని అంటున్నారు.   కవిత వ్యూహం కేవలం కొత్త పార్టీ పెట్టడం మాత్రమే కాదు, బీఆర్ఎస్ పట్ల అసంతృప్తిగా ఉన్న కేడర్‌ను తనవైపు తిప్పుకోవడం.  తెలంగాణ రాష్ట్ర సమితి  అనే పాత పేరుపై ప్రజలకు ఉన్న సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆమె  తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన  (టీఆర్ఎస్) అనే పేరును ఎంచుకోవడం ద్వారా..  పాత టీఆర్ఎస్ వారసత్వాన్ని సొంతం చేసుకోవడమనే వ్యూహం కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కవిత కొత్త పార్టీ వల్ల ప్రధానంగా నష్టపోయేది బీఆర్ఎస్ అని అంటున్నారు. కవిత కొత్త పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకునే చీలుస్తుందని చెబుతున్నారు.   అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు ఈ అంతర్గత కలహాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాయనడంలో సందేహం లేదు. కవితకు బీజేపీ పరోక్ష మద్దతు ఉండవచ్చని, తద్వారా బీఆర్ఎస్ బార్గేనింగ్ శక్తిని తగ్గించడమే ఆమె అసలు లక్ష్యమని విశ్లేషకులు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వంటి ఆరోపణలు, కుటుంబ సభ్యుల మధ్య ఈగో క్లాష్‌లు కూడా ఈ చీలికకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.ఇదే విషయాన్ని తెలుగువన్ చర్చా వేదికలో సువేరా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.   కవిత నిర్ణయం తెలంగాణలో ఒక కొత్త రాజకీయ శక్తిని సృష్టించవచ్చున్న ఆయన..  ఆమె కేవలం కేసీఆర్ బిడ్డగానే కాకుండా, తనకంటూ ఒక సొంత ఇమేజ్‌ను నిర్మించుకోవాలని చూస్తున్నాన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ బలహీనపడి, క్రమంగా బీజేపీలో విలీనమయ్యే అవకాశాలు  కొట్టిపారేయలేన్న సువేరా.. కవిత పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఆమె ఎంచుకునే నాయకులు, యూత్ మేనిఫెస్టోపై ఆధారపడి ఉంటుందన్నారు. ఒకవేళ ఆమె బలమైన శక్తిగా ఎదిగితే, తెలంగాణలో త్రిముఖ పోటీ మరింత తీవ్రమై రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. మహిళా బిల్లు వంటి అంశాలపై ఆమె చేస్తున్న పోరాటం మహిళా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని సువేరా అభిప్రాయపడ్డారు.   
   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన, బీజేపీలో చేరడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇప్పుడు తన తదుపరి రాజకీయ అడుగుల కోసం తీవ్రంగా మథనపడుతున్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు  అభ్యంతరం తెలపడం వల్లే, విజయసాయిరెడ్డికి కాషాయ పార్టీ తలుపులు మూసుకున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు, ఇటీవల జరిగిన ఈడి సోదాలు ఆయన్ను మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి. వ్యూహాలు మరియు పరిణామాలు: విజయసాయిరెడ్డి రాజకీయంగా ఒంటరవుతున్న తరుణంలో, ఆయన కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. లిక్కర్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారిని వదిలేసి, తనను విచారణల పేరుతో వేధిస్తున్నారని ఆయన ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు నాయుడుపై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆయనలోని రాజకీయ ఫ్రస్ట్రేషన్‌కు అద్దం పడుతున్నాయి.  ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, తనదైన మార్గంలో ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయనకు క్షేత్రస్థాయిలో ఆదరణ లభించడం ప్రశ్నార్థకమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెలుపల తనకంటూ ఒక రాజకీయ ఉనికిని చాటుకోవాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ప్రధానంగా జగన్‌కు పరోక్షంగా ఉపయోగపడతాయా లేదా అన్నది కూడా గమనార్హం. భవిష్యత్తు రాజకీయ ప్రభావం: రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి నిర్ణయం కీలక మలుపు కావచ్చు. ఆయన సొంతంగా పార్టీ పెట్టినా, లేదా మరొక కూటమితో పొత్తు పెట్టుకున్నా, ప్రస్తుత రాజకీయ వాతావరణంలో అది ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది చూడాలి. ముఖ్యమంత్రి పట్ల ఆయన చూపుతున్న తీవ్ర వ్యతిరేకత, టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. వ్యవస్థలపైన, దర్యాప్తు సంస్థల పైన ఆయనకు ఉన్న నమ్మకం సడలిపోవడం, తన ఉనికిని కాపాడుకోవడానికి ఆయన చేసే రాజకీయం రాష్ట్రంలో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది.  రాజకీయంగా ఆయన ఏ అడుగు వేసినా, అది ఆయన భవిష్యత్తును నిర్ణయించడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తోంది. అయితే, ప్రజల్లోకి వెళ్లడం మరియు ప్రజల సమస్యలపై పోరాడటం అనే అంశాల్లో ఆయన వెనుకబడి ఉన్నారన్నది వాస్తవం. కేవలం మీడియా సమావేశాలు, సోషల్ మీడియా ట్వీట్లకే పరిమితం కాకుండా, ప్రజల్లోకి వెళ్తేనే ఆయన రాజకీయ మనుగడ సాధ్యమవుతుంది. తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్‌లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యూహాలపై కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమిల్లి శ్రీనివాస్‌రావు, జర్నలిస్ట్ గోపి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.. తప్పక వీక్షించండి  
కేంద్ర ఎన్నికల సంఘం  ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ణానేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ   ప్రతిపక్ష పార్టీలు తమ గళాన్ని పెంచాయి.  ఈ మేరకు వివిధ పార్టీలకు చెందిన సుమారు 73 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసిన  నోటీసును రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు అందజేశారు. భారత ఎన్నికల సంఘం పనితీరుపై గత కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు, ఇప్పుడు నేరుగా సీఈసీని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగడం రాజకీయ వర్గాల్లో   సంచలనంగా మారింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని తొలగించాలనే ప్రతిపాదనతో కూడిన ఈ పరిణామం హాట్ టాపిక్ గా మారింది.  ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి.   ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియకు వెన్నెముకగా నిలిచే ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని విపక్ష నేతలు పేర్కొన్నారు. గతంలో కూడా కొన్ని అంశాలపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఈసారి ఏకంగా 73 మంది సభ్యులు ఒకే తాటిపైకి వచ్చి అధికారికంగా నోటీసు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి,  ఎన్నికల కమిషన్‌కు ఒక సవాలుగా మారిందనడంలో సందేహం లేదు. నోటీసులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఎన్నికల సమయంలో నిబంధనల అమలులో వివక్ష, అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు వంటి ఆరోపణలు ఉన్నాయి.  కీలకమైన అంశాలపై ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం, ఓటర్ల జాబితాలో మార్పులు-చేర్పులు వంటి సున్నితమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి అంశాలను సభ్యులు తమ నోటీసులు సభ్యులు పేర్కొన్నారు.   రాజ్యసభ నిబంధనల ప్రకారం..  రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటే తగిన సంఖ్యలో సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుత నోటీసుపై 73 మంది సభ్యులు సంతకాలు చేయడంతో..  దీనిపై సభలో చర్చ జరగాలనే డిమాండ్ మరింత గట్టిగా వినిపించే అవకాశం ఉంది. చైర్మన్ ఈ నోటీసును పరిశీలించి, అది నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో  నిర్ధారించుకునన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటారు. సపోజ్ ఫర్ సపోజ్ ఈ నోటీసు ఆమోదం పొందితే, సభలో దీనిపై  చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. గత కొద్ది కాలంగా ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న సాంకేతికత మరియు ఎన్నికల కోడ్ అమలు తీరుపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో రాజ్యాంగ సంస్థలు విఫలమవుతున్నాయని విపక్షాలు పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఈసీని లక్ష్యంగా చేసుకుని విపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసు ప్రాధాన్యత సంతరించుకుంది.  
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో తొలి విడత పోలింగ్ ముగిసిన వేళ  కేంద్ర హోంమంత్రి అమిత్ షా  ప్రకటన రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. మొదటి దశలో పోలింగ్ జరిగిన 152 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 110కి పైగా సీట్లను కైవసం చేసుకోబోతోందని ఆయన   ధీమాగా చెప్పారు.  రాష్ట్రంలో గాలి   మార్పు స్పష్టంగా గోచరిస్తోందన్న అమిత్ షా..  తృణమూల్ కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ భారీ అంచనా వెనుక గణాంకాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అమిత్ షా లెక్కలు నిజం కావాలంటే..  ఈ ప్రాంతాల్లో కమలం పార్టీ ఓటు బ్యాంకులో భారీ ఎత్తున  స్వింగ్ రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా అధికార టీఎంసీ ఓట్ల నుంచి సుమారు 10 శాతం, ఇతరుల నుంచి మరో 5 శాతం ఓట్లు బీజేపీ వైపు మళ్ళితేనే  అమిత్ షా చెప్పిన సంఖ్యలో నియోజకవర్గాలలో బీజేపీ విజయం సాధ్యమవుతుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నమోదైన అధిక పోలింగ్ శాతం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మాల్దా, జల్పాయ్‌గురి, మేదినిపూర్ వంటి ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావడం మార్పుకు సంకేతమని కాషాయ దళం భావిస్తోంది.  ముఖ్యంగా గతంలో టీఎంసీకి అండగా నిలిచిన కొన్ని వర్గాల ఓట్లు చీలిపోవడం.. ముస్లిం ఓట్లలో  విభజన   తమకు కలిసి వస్తుందని కమలం పార్టీ బలంగా నమ్ముతోంది.  మాల్దా వంటి చోట్ల కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ వంటి పార్టీలు టీఎంసీ ఓటు బ్యాంకును దెబ్బతీసి.. అది పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తాయని ఆశిస్తోంది. అయితే, ఈ అంచనాలపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  రాజకీయ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. 152 సీట్లలో దాదాపు 60 స్థానాలలో  బీజేపీ గట్టి పోటీ  ఎదుర్కొనే అవకాశం ఉంది.   మిగిలిన స్థానాల్లో టీఎంసీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు..  ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న చోట్ల కమలం పార్టీకి ఎదురుగాలి తప్పదంటున్నారు.   అమిత్ షా ఊహిస్తున్నట్లుగా 110 సీట్లు సాధించాలంటే రాష్ట్రంలో ఒక అసాధారణమైన  కాషాయ గాలి వీచాలి. ప్రభుత్వ వ్యతిరేకత  కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. టీఎంసీ ప్రభుత్వంపై ఉన్న అవినీతి ఆరోపణలు, అభివృద్ధి లోపం వంటి అంశాలను బీజేపీ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీనికి తోడు ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటి ఆందోళనలు కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించాయని కొందరు అంటున్నారు. ఈ పరిస్థితులన్నీ బీజేపీకి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయనేది కాషాయ నేతల వాదన. మొత్తంగా చూస్తే.. బెంగాల్ రాజకీయాల్లో మతపరమైన ధ్రువీకరణ ఎంతవరకు పనిచేస్తుందనేదే ఫలితాలను శాసించనుంది. హిందూ ఓట్లు ఏకపక్షంగా బీజేపీ వైపు మొగ్గు చూపితే అమిత్ షా అంచనాలు నిజం కావచ్చు.. కానీ, టీఎంసీ తన కోర్ ఓటు బ్యాంకును కాపాడుకోగలిగితే మాత్రం పోటీ అత్యంత హోరాహోరీగా ఉంటుంది. అమిత్ షా ప్రకటించిన 110 సీట్ల ధీమా నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే తుది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -సీతారాం కంఠంనేని
తెలంగాణలో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు  కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం (ఏప్రిల్ 25) ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది. ముఖ్యంగా మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్ కు గవర్నర్ నిర్ణయం గొప్ప ఊరటనిచ్చిందని చెప్పుకోవాలి. ఆయన తన పదవిని నిలబెట్టుకోవడానికి అవసరమైన రాజ్యాంగ గడువు ముగియనున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ కేబినెట్ గతంలోనే గవర్నర్ కోటా కింద కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ప్రతిపాదించింది. అయితే.. గతంలో జరిగిన న్యాయపరమైన చిక్కులు, గవర్నర్ల మార్పు వంటి కారణాలతో ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి, ఈ నియామకాలను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ముఖ్యంగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న అజారుద్దీన్.. ఆరు నెలల లోపు శాసనసభ లేదా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికవ్వాలనే నిబంధన ఉండటంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.   గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించడం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా న్యాయపరమైన స్టేలు రావడం వంటి అంశాలు ఈ ప్రక్రియను ఆలస్యం చేశాయి. సుప్రీంకోర్టులో ఉన్న స్టేలను దృష్టిలో ఉంచుకుని,,  ప్రభుత్వం సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. తాజా నిర్ణయంతో కోదండరాం, అజారుద్దీన్‌లు త్వరలోనే శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ద్వారా ప్రభుత్వం ఉద్యమకారులకు గుర్తింపునిచ్చింది. అలాగే, జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా, మాజీ ఎంపీగా ఉన్న అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం,   మండలికి పంపడం ద్వారా మైనారిటీ వర్గాలకు బలమైన ప్రాతినిధ్యం కల్పించినట్లయింది.   మరోవైపు, అజారుద్దీన్ మంత్రి పదవి విషయంలో ఉన్న గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ గ్రీన్ సిగ్నల్ రావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ నెల 30వ తేదీతో ఆయన మంత్రిగా ప్రమాణం చేసి ఆరు నెలలు పూర్తి కానున్నాయి. ఒకవేళ ఈ లోపు ఎమ్మెల్సీగా నియామకం జరగకపోతే..  అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది.  ఇప్పుడు ఆ ముప్పు తప్పినట్లయింది.   గవర్నర్ ఆమోదంతో తదుపరి ప్రక్రియగా సాధారణ పరిపాలన విభాగం (GAD) ఉత్తర్వులు జారీ చేస్తుంది. అనంతరం శాసనమండలి చైర్మన్ సమక్షంలో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనివల్ల రాష్ట్ర కేబినెట్‌లో అజారుద్దీన్ స్థానం సుస్థిరమవుతుంది.
ALSO ON TELUGUONE N E W S
తెలుగు సినిమా చరిత్రలో విలనిజానికి కొత్త భాష్యం చెప్పడమే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసిన నటుడు రావు గోపాలరావు. ఆయన డైలాగ్ డెలివరీ, ఆ గంభీరమైన కంఠస్వరం ఇప్పటికీ ప్రేక్షకులకు చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. తాజాగా తెలుగువన్ టీఎండీబీ వేదికగా 'వింత దొంగలు' సినిమాలోని ఆయన విలక్షణమైన నటనను, భావోద్వేగపూరితమైన డైలాగులను గుర్తుచేస్తూ ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో మధ్యతరగతి కుటుంబ యజమాని పడే కష్టాలను ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు. "ఇంటి యజమాని ఇంటికి రాగానే నాలుగు ముద్దలు తిని కడుపు చల్లార్చుకునే వరకు సమస్యలతో వేధించకండి" అంటూ ఆయన పలికే సంభాషణలు ప్రతి సామాన్య మనిషి గుండెను హత్తుకుంటాయి. సమాజంలో మధ్యతరగతి మనిషి పరిస్థితి ఎటుకాకుండా ఉంటుందని, పైనున్న వాడికి తక్కువగా, కింద ఉన్న వాడికి ఎక్కువగా కనిపిస్తాడని ఆయన చెప్పిన తీరు అమోఘం. డబ్బు కంటే మానవత్వమే గొప్పదని చాటిచెప్పే సన్నివేశాలు ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచాయి. "డబ్బు రంగు రంగుల చిత్తు కాగితం మాత్రమే, అది చనిపోయిన మనిషికి ఊపిరి పోయలేదు" అంటూ ధనవంతుల అహంకారాన్ని అణచివేసే డైలాగులు రావు గోపాలరావు గారి నటనలో మరో స్థాయికి చేరాయి. తన కూతురిని కిడ్నాప్ చేశారనే కోపంతో ఉన్న తండ్రిని ఎదిరించి, నిజాన్ని నిర్భయంగా చెప్పే సన్నివేశం సినిమాకే ప్రాణం పోసింది. రావు గోపాలరావు గారి నటనలో ఉండే ఆ ప్రత్యేకత ఏంటంటే, ఆయన విలన్ గా నటించినా, బుద్ది చెప్పే పెద్ద మనిషిగా నటించినా అందులో ఒక లోతైన అర్థం ఉంటుంది. ఈ వీడియో చూసిన అభిమానులు "అప్పట్లో ఆయన డైలాగ్స్ అంటే ఒక సెన్సేషన్" అని, "ఆయన స్థానాన్ని భర్తీ చేసే నటుడు మళ్లీ రాలేదు" అని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. 'వింత దొంగలు' వంటి పాత తరం సినిమాల్లోని ఇటువంటి ఆణిముత్యాలను మళ్లీ గుర్తుచేసుకోవడం సినీ ప్రియులకు నిజంగా కనువిందే. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.   
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా 'మైసా' (Mysaa) అనే లేడీ ఓరియెంటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'మైసా' చిత్రం గోండ్ గిరిజన తెగల నేపథ్యంతో సాగే ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో రష్మిక ఒక శక్తివంతమైన గిరిజన యువతిగా, వారియర్ అవతారంలో కనిపించనుంది. ముఖంపై రక్తపు మరకలు, చేతిలో ఆయుధం, ముక్కుపుడకతో ఆమె కనిపిస్తున్న తీరు చూస్తుంటే, ఈ సినిమాలో రష్మిక మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఉగ్రరూపంలో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది. "ధైర్యం ఆమె బలం.. ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి" అంటూ చిత్ర బృందం ఇచ్చిన ట్యాగ్ లైన్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ పాత్ర కోసం రష్మిక మందన్న ఎంతో శ్రమిస్తోంది. పూర్తిస్థాయి యాక్షన్ రోల్ కావడంతో ఆమె బ్యాంకాక్, ఇటలీ వంటి ప్రాంతాల్లో అంతర్జాతీయ స్టంట్ మాస్టర్ల పర్యవేక్షణలో కఠినమైన శిక్షణ తీసుకుంది. మార్షల్ ఆర్ట్స్, కత్తి యుద్ధం, వివిధ రకాల పోరాట విన్యాసాల్లో రష్మిక ప్రాక్టీస్ చేస్తుంది. ప్రస్తుతం కేరళ అడవుల్లో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ సీన్స్ లో రష్మిక స్టంట్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని సమాచారం. దాదాపు 50 కోట్ల భారీ బడ్జెట్‌తో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. 'పుష్ప', 'యానిమల్' వంటి విజయాలతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన రష్మిక, 'మైసా'తో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఒక యోధురాలిగా ఆమె చేస్తున్న ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో వేచి చూడాలి.  
టాలీవుడ్ ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి (JD Chakravarthy) అంటే ఒక విలక్షణమైన శైలికి మారుపేరు. ఇక యాంకర్ విష్ణుప్రియ (Vishnu Priya) తన ఎనర్జీతో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని, త్వరలోనే విష్ణుప్రియను జేడీ చక్రవర్తి రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వివాదంపై జేడీ చక్రవర్తి తాజాగా స్పందిస్తూ రూమర్లకు చెక్ పెట్టారు. అసలు రూమర్లు ఎందుకు వచ్చాయి?  ఒక రియాలిటీ షోలో విష్ణుప్రియ మాట్లాడుతూ.. తనకు జేడీ చక్రవర్తి అంటే చాలా ఇష్టమని, ఆయనను పెళ్లి చేసుకోవాలని ఉందని బహిరంగంగా తన మనసులోని మాటను బయటపెట్టింది. అప్పటి నుండి వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. జేడీ చక్రవర్తి వివరణ:  ఈ వార్తలపై జేడీ చక్రవర్తి తనదైన శైలిలో స్పందించారు. "విష్ణుప్రియకు నాపై ఉన్నది అభిమానం మాత్రమే. తను చాలా నిజాయితీ గల అమ్మాయి, అందుకే తన మనసులో ఉన్నది ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేసింది. అంత మాత్రాన మా మధ్య ఏదో ఉందని అనుకోవడం తప్పు. నేను ఆమెకు ఒక మెంటార్‌గా, శ్రేయోభిలాషిగా మాత్రమే ఉంటాను" అని స్పష్టం చేశారు.  విష్ణుప్రియ రియాక్షన్:  విష్ణుప్రియ కూడా పలు సందర్భాల్లో స్పందిస్తూ.. జేడీ సర్ పట్ల తనకు ఉన్నది ఒక రకమైన ఆరాధన అని, ఆయన నుండి ఎంతో నేర్చుకున్నానని పేర్కొంది. గాసిప్స్ గురించి పెద్దగా పట్టించుకోనని ఆమె గతంలోనే వెల్లడించింది. మొత్తానికి జేడీ చక్రవర్తి తన క్లారిటీతో ఈ రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. సెలబ్రిటీల మధ్య ఉండే స్నేహాన్ని లేదా అభిమానాన్ని తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేయడం సరికాదని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతోంది. ప్రస్తుతం జేడీ వరుస వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన 'గాయపడ్డ సింహం' సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.   
ప్రస్తుతం సినీ ప్రేక్షకులందరి కళ్లు థియేటర్ల కంటే ఎక్కువగా ఓటీటీల వైపే ఉన్నాయి. ప్రతి వారం కొత్త సినిమాలు, సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా, సైలెంట్‌గా ఒక తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అదే రాజేష్ మేరు, నవ్య చిట్యాల హీరోహీరోయిన్లుగా నటించిన 'లగ్గం టైమ్' (Laggam Time). ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. 'లగ్గం టైమ్' పూర్తిగా పెళ్ళి నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. అనన్య (నవ్య చిట్యాల) పెళ్లి జరుగుతుండగా, ఆమె ప్రియుడు సూర్య (రాజేష్ మేరు) అక్కడికి వస్తాడు. ఎలాగైనా ఆమెను తీసుకెళ్లిపోవాలని ప్లాన్ చేస్తాడు. అయితే సరిగ్గా పెళ్లి సమయానికే పెళ్లికొడుకు చంద్ర (సుదర్శన్) కిడ్నాప్ అవుతాడు. ఈ కిడ్నాప్ వెనుక ఉన్నది ఎవరు? అసలు సూర్య-అనన్యల ప్రేమ కథ ఏమైంది? పెళ్లి ఇంట్లో జరిగిన ఈ గందరగోళం చివరకు ఎలా ముగిసింది? అనే ఆసక్తికరమైన అంశాలతో దర్శకుడు ప్రజోత్ కె. వెన్నమ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన దాదాపు రెండున్నర నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (Aha)లో ఏప్రిల్ 25 నుండి ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా.. ఆహ్లాదకరమైన కామెడీ, కుటుంబ అనుబంధాలతో కూడిన కథ కావడంతో ఓటీటీలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. వీకెండ్‌లో సరదాగా ఫ్యామిలీతో కలిసి ఒక లైట్ హార్టెడ్ కామెడీ సినిమా చూడాలనుకునే వారికి 'ఆహా'లో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.  
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh) చిక్కుల్లో పడ్డ 'కాంతార' (Kantara) మిమిక్రీ వివాదం ఎట్టకేలకు ఒక ముగింపునకు వచ్చింది. దైవ సంప్రదాయాలను అవమానించారనే ఆరోపణలపై నమోదైన కేసులో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. రణవీర్ సింగ్ బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో పాటు, మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలని కోర్టు ఆదేశించింది. గతేడాది గోవాలో జరిగిన 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' (IFFI) వేదికపై రణవీర్ సింగ్ ప్రసంగిస్తూ.. 'కాంతార' సినిమాలో రిషబ్ శెట్టి నటనను కొనియాడారు. ఈ క్రమంలో సినిమాలోని పంజుర్లి దైవం నటనను అనుకరిస్తూ, దైవాన్ని ఆడ దెయ్యం అని సంబోధించారు. తీర ప్రాంత కర్ణాటక ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే దైవ సంప్రదాయాన్ని రణవీర్ కించపరిచారంటూ బెంగళూరుకు చెందిన అడ్వకేట్ ప్రశాంత్ మెతల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రణవీర్‌పై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని రణవీర్ సింగ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం.. సెలబ్రిటీలు బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు మతపరమైన, సంస్కృతి పరమైన విషయాల్లో ఎంతో బాధ్యతగా ఉండాలని హితవు పలికింది.  రణవీర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశ్యం కాదని, కేవలం రిషబ్ శెట్టి నటనను అభినందించే క్రమంలోనే అలా అన్నారని, దీనికి సంబంధించి ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశామని తెలిపారు.  హైకోర్టు ప్రధానంగా రెండు షరతులు విధించింది. రణవీర్ సింగ్ మరోసారి స్పష్టమైన క్షమాపణలతో సవరించిన అఫిడవిట్‌ను సమర్పించాలి. రాబోయే నాలుగు వారాల లోపు మైసూరులోని ప్రసిద్ధ చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని, దైవం పట్ల తన భక్తిని, పశ్చాత్తాపాన్ని చాటుకోవాలి. కోర్టు సూచించిన విధంగా ఆలయ సందర్శన పూర్తి చేసి, నివేదిక సమర్పించిన తర్వాత రణవీర్‌పై ఉన్న ఎఫ్.ఐ.ఆర్.ను అధికారికంగా కొట్టివేస్తామని ధర్మాసనం వెల్లడించింది. దీంతో కొన్నాళ్లుగా రణవీర్‌ను వెంటాడుతున్న ఈ వివాదం సద్దుమణిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రణవీర్ సింగ్ తన తాజా చిత్రం 'ధురందర్-2' (Dhurandhar2) సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.  
తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) న్యూ-ఏజ్ ఎంటర్‌టైనర్ 'గాయపడ సింహం'(Gaayapadda Simham)తో అలరించబోతున్నారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ సాదినేని సమర్పణలో ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ట్రైజర్, పాటలతో మంచి బజ్‌ను సృష్టించింది. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఉత్సాహాన్ని మరింత పెంచింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కథ ఒక యువకుడి జీవితంలో జరిగే అనుకోని మలుపు చుట్టూ తిరుగుతుంది. అమెరికాలో సెటిల్ అవ్వాలని కలలుకనే తను, డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీల కారణంగా డిపోర్ట్ అవుతాడు. అతని కలలు ఒక్కసారిగా ఛిన్నాభిన్నమవుతాయి. ప్రేమ, భవిష్యత్తు.. ఒక్కసారిగా దెబ్బతినడంతో, తనలో పెరిగే నిరాశ, కోపం అతడిని ఒక విచిత్రమైన రివెంజ్ వైపు నడిపిస్తుంది. ఈ భావోద్వేగ ప్రయాణాన్ని దర్శకుడు సెటైర్, డార్క్ హ్యూమర్‌తో మేళవించి ఆసక్తికరంగా తెరకెక్కించారు.   దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ గ్లోబల్‌ సమస్యను యువతకు కనెక్ట్ అయ్యేలా కథగా మలిచారు. సూర్య ప్రకాశ్ జ్యోసుల అందించిన కథలో భావోద్వేగం, వ్యంగ్యం, హాస్యం అన్నీ సమతుల్యంగా కనిపిస్తున్నాయి. వినోదంతో పాటు ఆలోచింపజేసే అంశాలు కూడా ఇందులో ఉన్నట్లు ట్రైలర్ సూచిస్తోంది. తరుణ్ భాస్కర్ ఒక సాధారణ యువకుడిగా, ఆశలు-నిజాల మధ్య ఇరుక్కుపోయిన పాత్రను సహజంగా పోషించారు. ఆయన నటనలో భావోద్వేగం, నిరాశ, సరదా.. అన్నీ నేచురల్ గా కనిపిస్తున్నాయి. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటిస్తూ కథకు మరింత అందాన్ని జోడించారు. విష్ణు ఓయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ వంటి సహాయ నటులు తమ పాత్రలతో సినిమాకు బలం చేకూర్చారు. జేడీ చక్రవర్తి నెగటివ్ షేడ్‌లో కనిపిస్తూ ఇంటెన్స్ ను పెంచగా, శ్రీ విష్ణు ప్రత్యేక పాత్రలో కనిపించడం సినిమాకు సర్ప్రైజ్ ఎలిమెంట్‌గా నిలుస్తుంది. టెక్నికల్‌గా కూడా సినిమా బలంగా ఉంది. విద్యా సాగర్ చింత సినిమాటోగ్రఫీకి మోడరన్, కలర్‌ఫుల్ టచ్ ఇవ్వగా, స్వీకర్ అగస్తి సంగీతం కథకు ఎనర్జీని జోడించింది. విప్లవ్ ఎడిటింగ్ సినిమా పేస్ ను కట్టుదిట్టంగా ఉంచగా, చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైన్ విజువల్ రిచ్‌నెస్‌ను పెంచింది. మొత్తానికి, ఇప్పటికే మంచి బజ్ ఉన్న ఈ చిత్రానికి ట్రైలర్ మరింత హైప్ తీసుకొచ్చింది. ఈ సమ్మర్‌లో న్యూ-ఏజ్ ఎంటర్‌టైనర్ గా  ‘గాయపడ్డ సింహం’ ప్రేక్షకులని అలరించబోతుంది.   
సోషల్ మీడియా సెన్సేషన్, బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy) చిక్కుల్లో పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక వ్యక్తి నుంచి కోట్ల రూపాయలు కాజేసినట్లు ఆమెపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS)లో కేసు నమోదైంది. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. అసలేం జరిగింది? పోలీసుల సమాచారం ప్రకారం.. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్ర అనే వ్యక్తికి 2018లో అషురెడ్డితో పరిచయం ఏర్పడింది. అప్పట్లో తను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నానని ఆమె అతనికి చెప్పింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తన ఆర్థిక అవసరాల పేరుతో ఆమె ధర్మేంద్ర నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రూ. 9.35 కోట్ల మోసం! ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు పేర్కొన్నారు. 2018 నుండి 2025 మధ్య కాలంలో అషురెడ్డి వివిధ రూపాల్లో ధర్మేంద్ర నుంచి దాదాపు రూ. 9.35 కోట్లు తీసుకున్నట్లు ఆయన ఆరోపించారు. ఇందులో నగదుతో పాటు సుమారు 5 కిలోల బంగారం, ఖరీదైన లగ్జరీ కార్లు, హైదరాబాద్‌లో ఖరీదైన ఫ్లాట్లు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటన్నింటినీ ధర్మేంద్ర డబ్బుతో కొనుగోలు చేసి, తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుందని బాధితుడి కుటుంబం వాపోతోంది. అంతేకాకుండా అషురెడ్డి సోదరి కూడా సుమారు రూ. 50 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో వెల్లడించారు. కుటుంబ సభ్యుల ప్రమేయం? పెళ్లి సంబంధం ఖాయం చేస్తున్నామంటూ అషురెడ్డి కుటుంబ సభ్యులు కూడా తమను నమ్మించారని బాధితుడి తండ్రి తెలిపారు. అయితే గత కొంతకాలంగా పెళ్లి ప్రస్తావన తీసుకురాగా అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు ముఖం చాటేస్తున్నారని, చివరకు తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించినట్లు వారు పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తు బాధితుడి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆమెకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో డ్రగ్స్ కేసు విచారణలో పేరు వినిపించి వార్తల్లో నిలిచిన అషురెడ్డి, ఇప్పుడు ఏకంగా రూ. 9 కోట్ల మోసం కేసులో ఇరుక్కోవడం చర్చనీయాంశమైంది. ఈ ఆరోపణలపై అషురెడ్డి ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.  
తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొన్ని ద‌శాబ్దాల‌పాటు వంద‌ల సినిమాల్లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించారు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు. రొటీన్ పాత్ర‌లే కాకుండా కొన్ని విభిన్న‌మైన పాత్ర‌లు కూడా పోషించారు. అలాంటి వాటిలో ర‌థ‌సార‌ధి చిత్రంలో ఆయ‌న చేసిన క‌లెక్ట‌ర్ క్యారెక్ట‌ర్‌. ఈ సినిమాలోని హై-వోల్టేజ్ సీన్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో అభిమానుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది.  ఈ వీడియోలో ఏఎన్నార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో విలన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత, అప్పటి వరకు చట్టబద్ధంగా వ్యవహరించిన ఆయన, అవినీతిపరులను అంతం చేయడానికి తన మేధస్సును ఎలా వాడుతారో చెప్పే తీరు అద్భుతం. "ఇన్నాళ్లు నా తెలివితేటలను జిల్లా అభివృద్ధి కోసం వాడాను.. ఇకపై మిమ్మల్ని తుదముట్టించడానికి వాడుతాను" అంటూ ఆయన చెప్పే డైలాగ్స్ థియేటర్లో విజిల్స్ వేయించే రేంజ్‌లో ఉన్నాయి. వీడియోలో మరో కీలక ఘట్టం.. ఒక అవినీతి పోలీస్ అధికారి ఫేక్ ఎన్‌కౌంట‌ర్  ప్లాన్ చేయడం. అయితే, ఆ కుట్రను రాజశేఖరం (ANR పాత్ర) తన చాకచక్యంతో తిప్పికొడతారు. ప్రెస్ మరియు ఎస్పీని అక్కడికి రప్పించి, ఆ పోలీస్ ఆఫీసర్ బండారాన్ని బయటపెట్టే సీన్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది. అక్కినేని బాడీ లాంగ్వేజ్, ఆ వాయిస్‌లోని బేస్ సినిమా స్థాయిని పెంచేశాయి. విలన్ల మధ్య జరిగే అంతర్గత గొడవలు, ఒకరి పాపాలను మరొకరు బయటపెట్టుకోవడం వంటి సన్నివేశాలు డ్రామాను రక్తికట్టించాయి. ముఖ్యంగా యూనియన్ లీడర్ హత్య, ఇంజనీర్ రాఘవ కేసు వంటి ఆధారాలను బయటపెడతానని ఒక ఇన్ స్పెక్టర్ విలన్లను బెదిరించడం కథలో ఉత్కంఠను పెంచుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఏఎన్నార్ రికార్డ్ చేసి మంత్రికి పంపడం సినిమాలోని అసలు ట్విస్ట్. వినోద్ కుమార్ ఈ చిత్రంలో ఏఎన్నార్‌తో కలిసి పోటాపోటీగా నటించారు. యాక్షన్ మరియు ఎమోషన్ కలగలిసిన ఈ సీక్వెన్స్ చూస్తుంటే, పాత తరం సినిమాల్లోని కంటెంట్ ఎంత బలంగా ఉండేదో అర్థమవుతుంది. అక్కినేని మార్క్ డైలాగ్ డెలివరీ ఇప్పటి తరం ప్రేక్షకులకు కూడా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఏఎన్నార్ క్లాస్ లుక్ లో ఉంటూనే మాస్ వార్నింగ్ ఇవ్వడం ఆయనకే సాధ్యమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నాటి క్లాసిక్ సినిమాల్లోని ఇటువంటి పవర్‌ఫుల్ సీన్లను మళ్ళీ చూడటం అభిమానులకు ఒక కనువిందుగా మారింది. ఇలాంటి మ‌రిన్ని ప‌వ‌ర్‌ఫుల్ సీన్స్ కోసం మా Teluguone youtube Channelను Subscribe చేసుకోండి.  
The trailer launch event for Tharun Bhascker's upcoming comedy, Gayapadda Simham, revealed several interesting details about the film's structure and plot. Speaking at the event, chief guest Dulquer Salmaan noted that the movie has the makings of a large-scale summer release rather than a small-budget project. He pointed out that the central theme, which revolves around the struggles of the US visa process and immigration, will easily connect with the younger generation. Producer Dil Raju provided a clearer picture of what audiences can expect from the narrative. He compared the movie's out-and-out comedic tone to cult classics like Money and the recent hit Jathi Ratnalu. Interestingly, he stated that the story actually revolves around a revenge plot against US President Donald Trump.   Dil Raju also revealed that the second half is driven by Sree Vishnu’s extended cameo and features five distinct spoof episodes imitating top stars like Prabhas, Mahesh Babu, and Yash. Furthermore, he noted that JD Chakravarty’s character shifts from a serious villain in the first half to a purely comedic role later on. Producer Pavan Sadineni expressed his gratitude to the guests and Zee Studios for their support, confirming that the Kashyap Srinivas directorial will hit the screens on May 1st. Faria Abdullah, Maanasa Chaudhary, JD Chakravarty and Sree Vishnu are playing prominent roles in the movie.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
Dulquer Salmaan released the trailer for the upcoming Telugu comedy Gayapadda Simham building great buzz ahead of its May 1st theatrical release. Directed by Kashyap Srinivas and presented by Pavan Sadineni, the film features Tharun Bhascker, Faria Abdullah, and Manasa Chaudhary in the lead roles.   The story is built on a funny and highly unique premise. The bride’s father insists on a groom who is settled in the US, forcing Tharun's character to find a way to move there. However, his plans crash when US President Donald Trump tightens immigration policies. Frustrated by the sudden ban, the hero decides to take direct revenge on the US President.   Adding to the madness is JD Chakravarty, who has been enthusiastically promoting the movie. He plays "Brutal Dharma," a dangerous man who runs Satya Logistics and commits murders for a living. The trailer also reveals Sree Vishnu in an exciting extended cameo. He appears as a deeply patriotic man stuck in jail, acting as another "Simham" in the narrative. The director cleverly uses pop culture references to deliver fresh laughs. Audiences will easily spot a recreation of a famous scene from Venky, along with a hilarious KGF spoof featuring Krishna Bhagwan and Subhaleka Sudhakar, who voiced the original actor. With its strong production values and novel comedic tone, Gayapadda Simham promises to be a thoroughly entertaining ride.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది,  ఇష్టంగా అనిపిస్తుంది,  తమ చుట్టూ ఒక కొత్త ప్రపంచం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కాలంతో పాటు ప్రేమ కూడా మారుతూ ఉంటుంది.  ముఖ్యంగా పరీక్షలు పెడుతూ ఉంటుంది.  ఇద్దరు వ్యక్తులు సిన్సియర్ గా ఉన్నారా లేదా అనేది కూడా కాలమే డిసైడ్ చేస్తుంది. అయితే ప్రేమించిన చాలా మంది సంతోషం కంటే ఎక్కువ బాధపడిన సందర్బాలే ఉంటాయి.  పదే పదే మనోవేదనకు గురవుతూ ఉంటారు.  ప్రేమ అనేది కేవలం ఒక్కరితో అగేది కూడా కాదు.. చాలామంది ప్రేమలో ఫెయిల్యూర్ వచ్చాక లేదా బ్రేకప్ అయ్యాక.. మళ్లీ ఇంకొకరితో ప్రేమలో పడతారు. కానీ అక్కడ కూడా మళ్లీ బాధ.. పదే పదే మానసిక వేధన బహుమానంలా లభిస్తాయి.  అసలు ప్రేమించేవారికి పదే పదే మానసిక వేధన ఎందుకు ఎదురవుతోంది? ఇందులో తప్పు ఎవరిది? తెలుసుకుంటే.. బాధ కలిగినా అదే మార్గంలో ప్రయాణం.. చాలామంది ప్రేమలో ఉన్నప్పుడు అయినా జీవితంలో వేరే బంధంలో అయినా.. తమకు బాధ కలిగినా సరే.. అదే జోన్ లోనే ఉండటానికి ఇష్టపడతారు. చిన్నతనంలోని అనుభవాలు,  పెరిగిన వాతావరణం,  గతంలో ఏర్పడిన బందాల వల్ల కలిగిన బాధ.. బందంలో గౌరవం లేకపోవడం వంటివి మనిషిని మారేలా చేయాలి. కానీ చాలామంది కొత్తగా ఏర్పడే ప్రతి బందంలోనూ అవే తప్పులు పదే పదే చేస్తుంటారు. అందుకే పదే పదే మనోవేధన కూడా ఎదురవుతూ ఉంటుంది. ఎమోషన్స్ నుండి బయట పడలేకపోవడం.. చాలా మంది తమకు తెలియకుండానే తమలాంటి భాగస్వాములనే ఎంచుకుంటారు. ఇది వారి సబ్ కాన్షియస్ మైండ్  చేసే ఒక ప్రయోగం.  గతంలో విషపూరితమైన సంబంధాలను అనుభవించి ఉంటే  మనస్సు వాటిని సాధారణమైనవిగా అంగీకరిస్తుంది. అందుకే పదే పదే అలాంటి రిలేషన్స్ వైపుకే  ఆకర్షితులు అవుతుంటారు. తమను తాము తక్కువగా  అంచనా వేసుకోవడం.. ఒక వ్యక్తి తమను తాము తక్కువగా అంచనా వేసుకున్నప్పుడు, వారు తరచుగా సంబంధాలలో తాము తక్కువ అన్నట్టు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎదుటి మనిషి వ్యక్తిత్వం గురించి పెద్దగా పట్టించుకోకుండా  పదే పదే తప్పుడు భాగస్వామిని ఎంచుకుంటారు. మార్పు పట్ల భయం.. చాలా మంది తాము తప్పులు చేస్తున్నామని తెలిసినా, మారడం వల్ల ఎదురయ్యే నష్టాలు,  ప్రమాదాలను చూసుకుని మారడానికి భయపడతారు.  అందుకే వారు అవే పాత పద్ధతులలో చిక్కుకుపోయి ఉంటారు. గత గాయాల ప్రబావం.. గత సంబంధాల వల్ల కలిగిన గాయం, పూర్తిగా మానకపోవడం వంటివి చాలామంది పదే పదే అవే తప్పులు చేసేలా చేస్తాయి.  ఇలాంటి వారు  భావోద్వేగపరంగా కోలుకునేంత వరకు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు. గందరగోళం.. చాలా మంది ప్రేమకు , భావోద్వేగ అనుబంధానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోరు. వారు తప్పుడు వ్యక్తికి దగ్గరై, దానినే ప్రేమగా పొరబడతారు, తద్వారా అవే తప్పులను రిపీట్ చేస్తూ ఉంటారు.   ప్రేమలో లేదా రిలేషన్ లో  అవే తప్పులను పదే పదే చేయడం అనేది విధి రాసే రాత కాదు.. అది మనిషి  అలవాట్లు,  ఆలోచనా విధానం ఇచ్చే  ఫలితం. ప్రతి వ్యక్తి తన  పద్ధతులను గుర్తించి, తమను తాము  సరిదిద్దుకున్నప్పుడు మాత్రమే ఇలా పదే పదే బాధపడే బంధంలో చిక్కుకోవడాన్ని నివారించగలుగుతారు. సింపుల్ గా చెప్పాలంటే.. ప్రతి మనిషి ప్రేమలో లేదా రెలేషన్ లో.. పదే పదే మానసిక వేదనకు అనుభవించడానికి అక్షరాలా ఆ మనిషి చేతులారా చేసుకునే తప్పులు,  పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడం,  పాత ఆలోచనలు, సిద్దాంతాలలో  చిక్కుకుని ఉండటం వంటివి కారణం అవుతాయి.                                    *రూపశ్రీ.
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి. అయితే కూలర్లు వాడేవారు దాని శుభ్రత గురించి మాత్రం అంత శ్రద్ద తీసుకోరు. దీని వల్ల నీరు మురికిగా మారి దోమలు పెరగడానికి ఆవాసంగా మారడమే కాకుండా.. . కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచకపోతే కూలింగ్ కూడా పెద్దగా రాదు.   అయితే కూలర్ లో నీటిని ప్రతిరోజూ శుభ్రం చేయడం అంత ఈజీ ఏమీ కాదు.. కొన్ని కంపెనీల కూలర్లలో నీటిని నింపడం సులువే.. కానీ వాటిలో నీటిని తొలగించడం, శుభ్రం చేయడం కాస్త శ్రమతో కూడుకున్నదే.. అయితే.. కూలర్లలో నీరు ప్రతిరోజూ శుభ్రం చేయకపోయినా కొన్నిరోజుల పాటు నీరు శుభ్రంగా ఉండాలన్నా, తాజాగా అనిపించాలన్నా కేవలం ఒకే ఒక్క చిట్కా అద్బుతంగా పనిచేస్తుంది. అదేంటో తెలుసుకుంటే.. పటిక.. కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచడానికి పటిక చాలా సులభమైన,  ఇంటి చిట్కా. దీనిని నీటిలో వేయడం  వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కూలర్ ట్యాంక్‌లో నీరు తరచుగా ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది, ఇది తొందరగా మురికిగా మారే అవకాశం ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ నీటిలో దోమలు  ఆవాసం ఏర్పాటు చేసుకుని  గుడ్లు పెడతాయి. అయితే కూలర్ ఎక్కువ కాలం పనిచేయాలంటే   దానిని శుభ్రపరచడం చాలా ముఖ్యం. నీటిలో ఒక చిన్న పటిక ముక్కను వేయడం వల్ల నీటిని శుభ్రపరచవచ్చు.  పైగా దోమల సమస్య కూడా తగ్గుతుంది. కూలర్ ట్యాంక్ లో పటిక వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు.. నీటి స్వచ్చత.. పటిక నీటిలోని దుమ్ము, ధూళి , చిన్న కణాలను బంధిస్తుంది. ఈ కణాలు బరువెక్కి అడుగుకు చేరుకుంటాయి, దీనివల్ల పైన ఉన్న నీరు స్వచ్ఛంగా ఉంటుంది. దోమలకు చెక్.. పటిక నీటిని శుద్ధి చేయడం వల్ల దోమల గుడ్లు, లార్వాలు సులభంగా వృద్ధి చెందలేవు. దీనివల్ల దోమల సమస్య గణనీయంగా తగ్గుతుంది. దుర్వాసన.. కూలర్ నీటి నుండి ఏదైనా వింత లేదా దుర్వాసన వస్తుంటే, దానిని చాలా వరకు తగ్గించడంలో పటిక సహాయపడుతుంది. బ్యాక్టీరియా..  పటికకు తేలికపాటి యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి, ఇవి నీటిలో ఉండే  హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి. నీటి నాణ్యత.. పటిక నీటిని ఎక్కువ సేపు శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది, దీనివల్ల కూలర్ ప్యాడ్‌లు త్వరగా పాడవకుండా ఉంటాయి , గాలి చల్లగా ఉంటుంది. పటికను ఉపయోగించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. పటికను ఎక్కువ పరిమాణంలో వాడకూడదు. ఒక చిన్న ముక్క సరిపోతుంది. ఎక్కువ పటిక కలపడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా కూలర్‌లోని నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి.                                 *రూపశ్రీ.
  వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి. ఈ కారణంగానే ఇప్పట్లో ప్రతి ఇంట్లో కూలర్లు వాడుతున్నారు.  కాస్త అర్థిక స్థితి ఉన్నవారేతై ఏసీ లు కూడా పెట్టించుకుంటారు. కానీ రానురాను పెరుగుతున్న ఎండలు,  వాటి తాలుకూ వేడి కారణంగా కూలర్లు కూడా సరిపోవడం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ.. సాధారణ కూలర్ ను కూడా చక్కగా ఏసీ లాంటి చల్లదనం ఇచ్చేలా చేయవచ్చు.  ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. సాధారణ కూలర్ తో ఏసీ లాంటి చల్లదనం కావాలంటే.. ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుంటే.. సాల్ట్ , ఐస్.. కూలర్  చల్లటి గాలిని అందించాలని  అనుకుంటే, ఐస్ లేదా ఉప్పు నీటిని కలపడం చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఇది చాలా ఫేమస్ చిట్కా కూడా.  కూలర్ ట్యాంకులో రాళ్ల ఉప్పు,   ఐస్ క్యూబ్స్ వేస్తారు.  రాళ్ల ఉప్పు ఐస్ క్యూబ్స్ కరగకుండా ఎక్కువ సేపు ఉండేలా చేస్తాయి. దీని వల్ల కూలింగ్ బాగా వస్తుంది. అయితే.. ఇది రెగ్యులర్ గా చేయడం మంచిది కాదు.. ఉప్పు తొందరగా చిలుము పట్టేలా చేస్తుంది. దీని వల్ల కూలర్ లోని మెటల్ భాగాలు తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఎప్పుడైనా వేడి భరించలేని సమయాల్లో ట్రై చేయడం మంచిది. వెంటిలేషన్.. చాలా మంది ఏసీ లాంటి చల్లదనం వస్తుందని ఆశించి,  కూలర్లను మూసి ఉన్న గదులలో వాడుతుంటారు, కానీ ఇది  పెద్ద పొరపాటు. సరైన వెంటిలేషన్ ఉన్నప్పుడే ఎయిర్ కూలర్ సరిగ్గా పనిచేస్తుంది. గదిలో  వేడి గాలి బయటకు పోవడానికి , చల్లని గాలి లోపల ప్రసరించడానికి వీలుగా ఒక కిటికీని లేదా తలుపును తెరిచి ఉంచడం ముఖ్యం. సరైన వెంటిలేషన్ కూలర్ పనితీరును  మెరుగుపరుస్తుంది. శుభ్రత.. కాలక్రమేణా కూలర్ ప్యాడ్‌లపై దుమ్ము, ధూళి పేరుకుపోయి, వాటి కూలింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అందువల్ల వాటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం లేదా మార్చడం ముఖ్యం. కూలర్ చాలా చల్లని గాలిని ఇవ్వాలి అంటే.. కూలర్ లోపల వట్టివేర్లతో తయారు చేసిన మ్యాట్లను  ఉపయోగించాలి. ఇది కూలింగ్ ను మెరుగుపరుస్తుంది. వట్టివేర్ల  గుండా నీరు ప్రవహించినప్పుడు, గాలి చల్లగా, తాజాగా మారుతుంది, మంచి  తేలికపాటి సువాసనను కూడా అందిస్తుంది. పైన పేర్కొన్న చిట్కాలను పాటించడం వల్ల వేసవి కాలంలో కూలర్ ఏసీ లాంటి చల్లదనాన్నిఇస్తుంది.                                     *రూపశ్రీ.
  కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి.  చాలా పరిశుభ్రతలో బాగంగా మౌత్ వాష్ లు వాడుతుంటారు.  కొందరు పళ్లు తోమే పని లేకుండా మౌత్ వాష్ వాడితే.. మరికొందరు పళ్లు తోమిన తర్వాత కూడా ఇంకా పళ్లు ఎక్కువగా శుభ్రం అవుతాయని అతి శుభ్రతతో మౌత్ వాష్ కూడా వాడతారు. అయితే.. మౌత్ వాష్ వాడే వారికి డాక్టర్లు ఓ చల్లని చావు కబురు చెబుతున్నారు.  మౌత్ వాష్ వాడితే రక్తపోటు సమస్య వస్తుందని అంటున్నారు.  దీని గురించి వైద్యులు చెప్పిన విషయాలు వివరంగా తెలుసుకుంటే.. మౌత్ వాష్.. నోటి ఆరోగ్యం.. నోటిలోని మంచి బ్యాక్టీరియా మానవ శరీరానికి చాలా అవసరం. ఈ బ్యాక్టీరియా ఆహారంలోని నైట్రేట్‌లను నైట్రైట్‌లుగా మార్చడానికి సహాయపడతాయి, ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ అనేది రక్తనాళాలను సడలించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి , రక్తపోటును నియంత్రించడానికి సహాయపడే ఒక ముఖ్యమైన అంశం. మౌత్ వాష్ వల్ల కలిగే నష్టం.. బలమైన యాంటీసెప్టిక్ మౌత్‌వాష్‌లు నోటిలోని  మంచి బ్యాక్టీరియాను కూడా చంపగలవని నిపుణులు అంటున్నారు. ఇది నైట్రేట్, నైట్రైట్‌గా మారే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది , శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను తగ్గించగలదు. ఇది నేరుగా రక్తనాళాల పనితీరుపై ప్రభావం చూపుతుంది, తద్వారా రక్తపోటును ప్రభావితం చేసే అవకాశం ఉంది. యాంటీ బాక్టీరియల్ మౌత్‌వాష్ వాడకం వల్ల నోటిలోని అవసరమైన బ్యాక్టీరియా 90 శాతం వరకు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలలో తేలిందని వైద్యులు కూడా చెబుతున్నారు. కేవలం కొన్ని రోజుల వాడకం కూడా లాలాజలంలో నైట్రేట్ స్థాయిలను తగ్గించగలదని, దీనివల్ల సిస్టోలిక్ రక్తపోటులో స్వల్ప పెరుగుదల ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మౌత్ వాష్ ఎక్కువ కాలం ఉపయోగిస్తే.. రోజు ఎక్కువగా మౌత్‌వాష్ ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మంచి బ్యాక్టీరియాను తగ్గించడం, నైట్రిక్ ఆక్సైడ్‌ను తగ్గించడం, , రక్తనాళాల సరైన పనితీరును దెబ్బతీసే ప్రక్రియ వలనే ఇది జరుగుతుందని అంటున్నారు. దీని ప్రభావాలు అందరిపై తీవ్రంగా ఉండనప్పటికీ, రెగ్యులర్ గా అందులోనూ ఎక్కువగా వాడటం వల్ల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చిగుళ్ల వ్యాధి, దంత చికిత్స తర్వాత, లేదా దంతాలపై అధికంగా పాచి పేరుకుపోయిన వంటి కొన్ని పరిస్థితులలో మౌత్‌వాష్ వాడకం  అవసరం అవుతుంది. అందువల్ల, మౌత్‌వాష్‌ను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని, దానిని రోజువారీ అలవాటుగా చేసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. నోటి శుభ్రతకు బ్రష్ చేయడమే మంచిదని, దీనికే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. కాబట్టి మౌత్ వాష్ ఎక్కువగా వాడకూడదు.                                      *రూపశ్రీ.
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం,  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా కీలకం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అవసరం అవుతాయి. అలాంటి వాటిలో జింక్ కూడా ఒకటి. అయితే చాలామందికి జింక్ లోపం గురించి పెద్దగా అవగాహన ఉండదు.  జింక్ లోపం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇది నిజమేనా? జింక్ లోపం గురించి.  జింక్ లోపం వల్ల వచ్చే సమస్యల గురించి వైద్యులు ఏం చెబుతున్నారు తెలుసుకుంటే.. శరీరానికి జింక్ ఎందుకు అవసరం..  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి , చర్మానికి జింక్ చాలా అవసరం. జింక్ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి , కణజాలాలను బాగు చేయడానికి సహాయపడుతుంది. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చని, చర్మ, కడుపు సమస్యలను కూడా కలిగించవచ్చని వైద్యులు చెబుతున్నారు. జింక్ లోపం వల్ల వచ్చే సమస్యలు.. జింక్ లోపం శరీరంలో అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. జింక్ లోపం పిల్లలలో పెరుగుదలను నిరోధించగలదు , మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇన్ఫెక్షన్లు.. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. జింక్ లోపం ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల ఫంగస్ , చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు తలెత్తవచ్చు. విరేచనాలు.. వైద్యుల ప్రకారం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా అవసరం. జింక్ లోపం జీర్ణవ్యవస్థపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో జింక్ లోపించినప్పుడు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. గాయాలు.. జింక్ లోపం చర్మం, కడుపునే కాకుండా గాయాలను కూడా ప్రభావితం చేస్తుంది. జింక్ లోపం ఉన్నవారిలో గాయాలు నెమ్మదిగా నయమవుతాయి. జింక్ లోపిస్తే కనిపించే లక్షణాలు.. జింక్ లోపం వేగంగా బరువు తగ్గడం, నీరసం , జుట్టు రాలడం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. జింక్ పుష్కలంగా లభించే ఆహారాలు.. ఆహారంలో జింక్‌ను చేర్చుకోవడానికి,  గుమ్మడి గింజలు, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు గింజలు , రాగులను చేర్చుకోవచ్చు. ఈ ఆహారాలలో జింక్ ఉంటుంది. అదనంగా,  ఆవాల ఆకుకూర, మాంసం, పప్పుధాన్యాలు, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, పెరుగు, వేరుశెనగలు , గుడ్లను కూడా తినవచ్చు. ఈ ఆహారాలలో కూడా జింక్ సమృద్దిగా ఉంటుంది.                                 *రూపశ్రీ.