Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇల్లు ఎంత శుభ్రం చేసినా సాలీడు పురుగులు, బూజు వచ్చేస్తున్నాయా?
posted on: Jul 27, 2026 3:56PM

ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం, ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు. అయితే ఎంత శుభ్రం చేసినా చాలా ఇళ్లలో సాలీడు పురుగులు చాలా మళ్లీ మళ్లీ వచ్చి చేరుతుంటాయి. బూజు కూడా చాలా తొందరగా ఏర్పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? వీటికి కారణాలు ఏంటి? వీటిని పరిష్కరించుకోవడానికి ఏం చేయాలి? పూర్తీగా తెలుసుకుంటే..
సాలీడు గూళ్లు కట్టడానికి కారణాలుయ..
ఇల్లు శుభ్రం చేసిన కొద్ది రోజులకే మూలల్లో, సీలింగ్‌పై, లేదా ఫర్నిచర్ వెనుక సాలీ గూళ్లు మళ్లీ కనిపిస్తుంటే ఇల్లు సరిగా శుభ్రం చేయలేదని అర్థం కాదు.. పదేపదే గూళ్లు ఏర్పడటానికి చాలా కారణాలు ఉండవచ్చు. వాస్తవానికి, సాలీలు తమకు సురక్షితమైన ప్రదేశం , తినడానికి చిన్న కీటకాలు సులభంగా దొరికే చోట మాత్రమే తమ గూళ్లను అల్లుతాయి.
స్టోర్‌రూమ్‌లు, అటకలు, మెట్ల దారులు, కిటికీల అంచులు లేదా బరువైన ఫర్నిచర్ వెనుక.. ఇలా ఇంట్లో ఎక్కువ కాలం శుభ్రం చేయకుండా ఉండే ప్రదేశాలు సాలీడులకు ఇష్టమైన స్థలాలుగా మారతాయి. ఈ ప్రదేశాలు నిశ్శబ్దంగా ఉండి, మనుషుల సంచారం తక్కువగా ఉండటం వల్ల, అవి గూళ్లు అల్లడానికి సులభంగా ఉంటాయి.
సాలీడులు పదే పదే ఇంట్లోకి ఎందుకు వస్తాయంటే..
సాలీడులు పదేపదే గూళ్లు కట్టడానికి ఒక ప్రధాన కారణం ఇంట్లో చిన్న కీటకాలు ఉండటమే. సాలీడులు ఈ కీటకాలను తిని బ్రతుకుతాయి. ఇంట్లో దోమలు, ఈగలు లేదా ఇతర చిన్న కీటకాలు ఎక్కువగా ఉంటే, సాలీడులు కూడా తరచుగా అక్కడికి వచ్చి గూళ్లు కడతాయి. వర్షాకాలం , శీతాకాలంలో , సాలీడులు బయట కంటే ఇళ్లలోని సురక్షిత ప్రదేశాలను వెతుకుతాయి. దీని వల్ల వర్షాకాలంలో ఇళ్లలో సాలీడుల నివాసం, సాలీడు గూడులు పెట్టడం వంటివి ఎక్కువ అవుతాయి.
సాలీడుగూళ్లు ఎలా తొలగించాలి?
ఇంట్లో సాలెగూళ్లు ఏర్పడితే, వాటిని వీలైనంత త్వరగా తొలగించాలి. వాక్యూమ్ క్లీనర్‌తో పైకప్పులు, మూలల్లోని సాలెగూళ్లను సులభంగా శుభ్రం చేయవచ్చు. వాక్యూమ్ చేరలేని ప్రదేశాల కోసం పొడవాటి పిడి ఉన్న చీపురు లేదా డస్టర్‌ను ఉపయోగించవచ్చు. భారతీయులు వాడే బూజు కర్రతో బాగా శుభ్రం చేయవచ్చు. శుభ్రం చేసిన తర్వాత, మిగిలిపోయిన దుమ్ము, సాలెగూళ్లను పూర్తిగా తొలగించడానికి ఆ ప్రదేశాన్ని తడి గుడ్డతో తుడవడం మంచిది.
సాలెగూళ్లు మళ్లీ ఏర్పడకుండా ఉండాలంటే..
ఇంట్లో సాలెపురుగులు మళ్లీ గూళ్లు కట్టకుండా నిరోధించాలంటే, ముందుగా ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ముఖ్యంగా మూలలు, పైకప్పులు, ఫర్నిచర్ వెనుక , స్టోర్‌రూమ్‌ల వంటి ప్రదేశాలను నిర్లక్ష్యం చేయకూడదు. కిటికీలు, తలుపులు , గోడలలోని పగుళ్లు లేదా చిన్న రంధ్రాలను మూసివేయాలి. ఎందుకంటే సాలెపురుగులు వీటి ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇంట్లో చిన్న కీటకాల తిరగడం, దోమలు, ఈగలు వంటివి ఉండకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సాలెపురుగులకు ఆహారం దొరకనప్పుడు, అవి అక్కడ ఎక్కువసేపు ఉండవు. ముఖ్యంగా తలుపులు , కిటికీల చుట్టూ పుదీనా నూనెను కలిపిన నీటిని చల్లడం కూడా సాలెపురుగులను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.
*రూపశ్రీ.





