LATEST NEWS
అధికారం వెలగబెట్టిన ఈ ఐదేళ్ళ కాలంలో ‘వైసీపీ నాయకులు, కార్యకర్తలు’ అనే పేరుతో మోర విరుచుకు తిరిగిన దండుపాళెం బ్యాచ్ ఇప్పుడు భయంతో వణికి చస్తున్నారు. ఈసారి ఎన్నికలలో ఏ పార్టీ గెలవబోతోంది అని సర్వే చేయాలంటే, ఓటర్ల దగ్గరకి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు, వైసీపీ దండుపాళెం బ్యాచ్‌లో ఎవర్ని అడిగినా వచ్చేది తెలుగుదేశమే, చచ్చేది మేమే అని ముక్తకంఠంతో చెబుతారు. ఈ జ్ఞానం పోలింగ్ ముగియగానే వీళ్ళకి కలిగింది. అందుకే వీళ్ళందరూ భయపడిపోతున్నారు. బీపీలు పెరిగిపోతున్నాయి, షుగర్లు కంట్రోల్ తప్పుతున్నాయి. కాళ్ళు వణుకుతున్నాయి. లాగూలు తడుస్తున్నాయి. రేపు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా పరిస్థితి ఎలా వుంటుందో అనుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎలక్షన్ అయిన వెంటనే ఫలితాలు వస్తే, తాడోపేడో తేలిపోయేది. కానీ, ఇప్పుడు పోలింగ్‌కి, ఫలితాలకి మధ్య ఇంత గ్యాప్ రావడంతో, ఈ గ్యాప్‌లో టెన్షన్ పడీపడీ గుండె ఆగి చస్తామేమోననే డౌట్ దండుపాళెం బ్యాచ్‌ కొంతమందిలో వుంది. అట్టు పెట్టినమ్మ అట్టున్నర తినడానికి రెడీగా వుండాలి కదా. వైసీపీ ఐదేళ్ళ హయాంలో చేయని దౌర్జన్యం లేదు, చేయని దుర్మార్గం లేదు... ఇప్పుడు ఆ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం అనుభవించాలి కదా. ఊరు వదిలి జంప్ అయిపోదామంటే వీల్లేదాయె. పోనీ, మనసు మార్చుకున్నాను అని చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకుందామంటే దగ్గరకి కూడా రానివ్వరాయె.  చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నట్టు.. వైసీపీ దండుపాళెం బ్యాచ్ తమ కర్మఫలాన్ని అనుభవించడం కోసం రోజులు లెక్కపెట్టుకుంటోంది.
ఉగ్రవాదం అంటే మనం సాధారణం గా తాలిబన్ ఉగ్రవాదులు ని అనుకుంటూ ఉంటాము,కానీ ప్రపంచం లో అంతకంటే భయంకరమైన ఉగ్రవాదం ఇంకొకటి వుంది , అది ఆర్ధిక ఉగ్రవాదం - ప్రపంచం అంత తాను నమ్మిన సిధ్ధాంతాన్ని మాత్రమే నమ్మాలి , అలా నమ్మకపోతే అందరినీ చంపేయాలి అంటే చంపేసి అయినా సరే తన వాదనే నెగ్గాలి అని భావించి దాన్ని కార్యాచరణ లో పెట్టడం ఉగ్రవాదం ప్రధాన ఎజెండా.  అందులో లాజిక్ ఏమీ ఉండదు ,  ఈ నేపథ్యంలో  పిల్లి మెడలో గంట కట్టేవారు ఎవరు అనే ప్రశ్నకు గుజరాత్ లోని అహ్మదాబాద్  పోలీసులు సమాధానం వెతికారు.  పోలీస్ శాఖకు చెందిన ఉగ్రవాద నిరోధక బృందం నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. నిందితులను ముహమ్మద్ నుస్రత్, ముహమ్మద్ నఫ్రాన్, ముహమ్మద్ ఫారిస్, ముహమ్మద్ రస్దీన్‌గా గుర్తించారు. శ్రీలంక జాతీయులైన నిందితులు కొలొంబో నుంచి చెన్నై మీదుగా అహ్మదాబాద్‌కు చేరుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లో ఆత్మాహుతి దాడులు చేసేందుకు వీరు వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పాక్‌లోని ఐసిస్ ఉగ్రవాది అబుతో నిందితులు నిరంతరం టచ్‌లో ఉన్నట్టు కూడా తెలుసుకున్నారు. భారత్‌లోని యూదు, హిందూ దేవాలయాలతో పాటు కొందరు బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ ప్రముఖులే టార్గెట్‌గా ఆత్మాహుతి దాడులు చేయాలనేది వీరి ప్లాన్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. పట్టుబడ్డ ఉగ్రవాదుల్లో ఒకరికి పాక్ వీసా కూడా ఉందని, అతడు అక్కడ తన హ్యాండ్లర్‌ను కలుసుకోవాల్సి ఉందని సమచారం. భారత్‌లో కొందరితో ఉగ్రవాదులు సంప్రదింపులు జరిపి ఉంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ లండన్‌కి వెళ్ళే ముందురోజు తాను 2019లో అధికారంలోకి రావడానికి సహకరించి, ఈ ఐదేళ్ళు జగన్ కోసం భారీ స్థాయిలో జనానికి అబద్ధాలు చెప్పి తరించిన ఐప్యాక్ సంస్థ కార్యాలయానికి వెళ్ళారు. ఆ ఎన్నికలలో, ఈ ఎన్నికలలో తనకు సహకరించిన ఐప్యాక్ ఉద్యోగులకు థాంక్స్ చెప్పడానికి జగన్ అక్కడకి వెళ్ళారు. తమ కార్యాలయానికి వచ్చిన జగన్ని చూసి ఐపాక్ ఉద్యోగులు మందుకొట్టిన మంకీల్లా అరిచారు. కాలుగాలిన పిల్లుల్లా గంతులు వేశారు. తోక తెగిన బల్లుల్లా హడావిడి చేశారు. ‘సీఎం... సీఎం’ అని పూనకం వచ్చినట్టు కేకలు వేశారు. ఆడలేదు, మగలేదు.. అందరూ జగన్‌తో రాసుకుని పూసుకోవడానికి ఉత్సాహపడిపోయారు. లండన్‌కి వెళ్ళిన జగన్ తిరిగి వస్తాడో రాడో అనుకున్నారోగానీ, ఆయనని చివరిసారి చూస్తున్నట్టుగా తెగ ఆత్రపడిపోయారు. ఈ సందర్భంగా జగన్ ‘ఈసారి మనం 156 ఎమ్మెల్యే సీట్లు, 22 పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాం’ అనగానే అందరూ అమ్మవారు పూనినట్టు ఆనందంతో ఊగిపోయారు. చివరాకరికి జగన్ ఈ ఐపాక్ గుంపుతో జగన్ సెల్ఫీలు దిగడం, కొన్ని సెల్ఫీలు అయితే జగనే స్వయంగా తీయడం చూసి ఐప్యాక్ ఉద్యోగులు నక్కతోక తొక్కినంతగాఆనందపడిపోయారు. మొత్తమ్మీద ఆ సీన్ ఆనందోత్సాహాల మధ్య ముగిసింది. పైన చెప్పుకున్న కామెడీ సీన్ ముగిసిన రెండ్రోజుల తర్వాత ట్రాజెడీ సీన్ మొదలైంది. ఐప్యాక్ సంస్థ తమ ఉద్యోగులు 150 మందిని తీసి అవతల పారేసింది. జగన్ వచ్చినప్పుడు చెప్పిన గెలిచే సీట్ల సంఖ్యలు విని ఇంకో ఐదేళ్ళు ఐప్యాక్ నీడలో అబద్ధాలు ప్రచారం చేస్తూ బతకొచ్చు అని కలలు కన్న ఆ 150 మందికి పెద్ద షాక్ తగిలింది. జగన్ పైకి అయితే అంకెలు చెప్పారుగానీ, లోపల గెలుస్తాననే నమ్మకం ఎంతమాత్రం లేదు. అందుకే ఐప్యాక్ సేవలు ఇక చాలు అని చెప్పేసినట్టున్నారు. అందుకే జగన్ వచ్చి వెళ్ళిన రెండ్రోజులకే ఐప్యాక్ బాస్‌లు 150 మంది ఉద్యోగుల బొచ్చెలో రాళ్ళు వేశారు. పాపం ఈ 150 మంది ఇంతకాలం అబద్ధాలు ప్రచారం చేస్తూ పొట్టపోసుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇలాంటి ఉద్యోగాలు దొరకడం ఎంత కష్టమో కదా! జగన్, ఐప్యాక్ ఇద్దరూ కలసి ఉద్యోగులను కరేపాకులా వాడుకుని విసిరేశారు. జగన్ భజన చేయడం కోసం ఐప్యాక్ ఉద్యోగులు జూనియర్ ఆర్టిస్టుల రేంజ్‌లో యాక్టింగ్ ఇరగదీసేశారు. పథకాలు అందుకుంటూ పులకరిచి పోతున్న పాపగా, జగనన్న నుంచి ఇల్లు అందుకుని, ఆనందబాష్పాలు వర్షిస్తున్న ఆడపడుచుగా, జగన్ పాలన అదిరిపోతోందని చెబుతున్న పొరుగురాష్ట్రం కుర్రాడిగా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన పారిశ్రామికవేత్తలుగా... ఇలా రకరకాల సందర్భాల్లో తగిన పాత్రలను అద్భుతంగా పోషించిన ఐప్యాక్ ఉద్యోగుల చేతుల్లో ఇప్పుడు ముష్టిపాత్ర వచ్చిపడింది. వీళ్ళకి ఇలాగే జరగాలి... ఇన్నాళ్ళూ అబద్ధాలు ప్రచారం చేసి జనం బుర్రలు పాడుచేశారు!
ఏపీ రాజ‌కీయాల్లో  పోలింగ్ త‌రువాత కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫ‌లితాలు రాక‌ముందే వైసీపీ నేత‌లు ప‌క్క‌ చూపులు చూస్తున్నారు. వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని, కూట‌మి 140 నుంచి 150 సీట్ల‌తో తెలుగుదేశం అధికారంలోకి రాబోతుంద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీలో పోలింగ్ శాతం న‌మోదైంది. విదేశాలు, ఇత‌ర రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ ఓట‌ర్లు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చి ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. దీనికితోడు స్థానికంగా ఉన్న ఓట‌ర్లు సైతం పోలింగ్ కేంద్రాల వ‌ద్ద గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్ల‌లో నిల‌బ‌డి మ‌రీ ఓటు వేశారు. దీంతో ప‌లు ప్రాంతాల్లో తెల్లవారు జామున 2గంట‌ల వ‌ర‌కు  పోలింగ్ జ‌రిగింది. భారీ సంఖ్య‌లో న‌మోదైన పోలింగ్‌తో కూట‌మి విజ‌యం ఖాయ‌మ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, నేత‌ల్లో కంగారు మొద‌లైంది. ఫ‌లితాలు రాక‌ముందే కూట‌మి పార్టీలైన తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీల్లో చేరేందుకు ఆ పార్టీ పెద్ద‌ల వ‌ద్ద‌కు రాయ‌బారాలు న‌డుపుతున్నారు. వీరిలో గ‌న్న‌వ‌రం వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి వ‌ల్ల‌భ‌నేని వంశీ కూడా ఉన్నారు.  ప్ర‌స్తుతం వంశీ అమెరికా వెళ్లాడు. త‌న కొడుకు చ‌దువుకోస‌మ‌ని ఆయ‌న‌ డ‌ల్లాస్ వెళ్లిన‌ట్లు అనుచ‌రులు చెబుతున్నారు. అస‌లు విష‌యం మాత్రం టీడీపీ పెద్ద‌ల‌తో రాజీకోసం వంశీ ఉన్న‌ట్లుండి డ‌ల్లాస్ లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్లు తెలుస్తోంది. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తెలుగుదేశం నుంచి రాజ‌కీయంగా ఎలాంటి ఇబ్బంది ఉండ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా తెలుగుదేశం ఎన్ఆర్ ఐల‌ ద్వారా రాయ‌బారాలు న‌డుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో బీజేపీలో చేరేందుకు సైతం వంశీ పావులు క‌దుపుతున్న‌ట్లు స‌మాచారం.  వ‌ల్ల‌భ‌నేని వంశీ రాజకీయ ఎంట్రీ తెలుగుదేశంతోనే ఆరంభమైన సంగతి తెలిసిందే.   గ‌న్న‌వ‌రం నుంచి రెండు సార్లు టీడీపీ అభ్య‌ర్థిగా విజ‌యం సాధించారు. 2019 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అభ్య‌ర్ధిగా విజ‌యం సాధించిన వంశీ ఆ త‌రువాత   సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నాడు. వైసీపీలో చేరిన కొద్దిరోజుల‌కే టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రిపై  అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఆ స‌మ‌యంలో తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వంశీపై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌లు రాజ‌కీయ పార్టీల్లోని సీనియ‌ర్ నేత‌లు సైతం వంశీ వ్యాఖ్య‌ల‌ను తప్పుపట్టారు. ఖండించారు.   ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా వంశీ పోటీ చేయ‌గా.. టీడీపీ నుంచి యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు పోటీ చేశారు. వంశీ వైసీపీలోకి వెళ్లిన త‌రువాత గ్రామ‌స్థాయిలోని టీడీపీ నేత‌లు పార్టీని బ‌లోపేతం చేస్తూ వ‌చ్చారు. చంద్ర‌బాబు కుటుంబంపై వ్యాఖ్య‌ల త‌రువాత వంశీ అనుచ‌రులు సైతం ఆయ‌న‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. ప్ర‌స్తుతం జ‌రిగిన ఎన్నిక‌ల్లో యార్ల‌గ‌డ్డ‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. దీంతో వంశీ ఓట‌మి ఖాయ‌మ‌ని నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ జ‌రుగుతున్నది. వైసీపీ అధికారం కోల్పోతుండ‌టం, నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ఓట‌మి ఖాయ‌మ‌వ్వడంతో వంశీ బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.  వ‌ల్ల‌భ‌నేని వంశీ తిరిగి తెలుగుదేశంలోకి వెళ్లే ప‌రిస్థితి లేదు. దీంతో ఆయ‌నకు ప్ర‌త్యామ్నాయం భార‌తీయ జ‌న‌తా పార్టీయేన‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. బీజేపీలోని త‌న స‌న్నిహితుల ద్వారా పార్టీ పెద్ద‌లతో చ‌ర్చించి కాషాయం కండువాను క‌ప్పుకునేందుకు వంశీ ప్ర‌య‌త్నాల‌ను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.  ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న వంశీ,  బీజేపీలో చేరేందుకు మార్గం సుగ‌మం చేసుకోవ‌టంతోపాటు తెలుగుదేశం పెద్ద‌ల‌తో రాజీకి కూడా  ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని ఆయన అనుచరులే చెబుతున్నారు‌. డ‌ల్లాస్ లోని తెలుగుదేశం ఎన్ఆర్ ఐల ద్వారా చంద్ర‌బాబు, లోకేశ్ ల‌తో మాట్లాడేందుకు వ‌ల్ల‌భ‌నేని వంశీ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పిన వంశీ, నేరుగా లోకేశ్ తో మాట్లాడ‌టం ద్వారా త‌న‌పై ఆగ్ర‌హాన్ని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చూస్తున్నారని అంటున్నారు. అయితే, చంద్ర‌బాబు, లోకేశ్‌, ఇత‌ర టీడీపీ ముఖ్య‌నేత‌లంతా కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. కూట‌మి అధికారంలోకి రాగానే ముందుగా వారిద్ద‌రికి స‌రైన గుణ‌పాఠం చెప్పాలని భావిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు, లోకేశ్ లు వంశీతో మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డ‌ర‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే జ‌రిగితే బీజేపీలో చేర‌డం ద్వారా కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వ్వ‌వ‌ని వంశీ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  బీజేపీలోని ముఖ్య‌ నేత‌ల‌తో వ‌ల్ల‌భ‌నేని వంశీతో పాటు మ‌రికొంద‌రు వైసీపీ నేత‌లు ట‌చ్ లోకి వెళ్లిన‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వీరంతా ఫ‌లితాలు రాగానే వైసీపీని వీడి బీజేపీ కండువా క‌ప్పుకుంటార‌ని స‌మాచారం. వంశీ ఇప్ప‌టికే రాష్ట్ర బీజేపీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, దేశ స్థాయిలో లోక్ స‌భ ఎన్నిక‌లు పూర్తికాగానే కేంద్ర పార్టీ పెద్ద‌ల అనుమ‌తితో ఆయ‌న కాషాయం కండువా క‌ప్పుకుంటార‌ని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ జ‌రుగుతున్నది. మొత్తానికి ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన కొద్ది రోజుల‌కే వ‌ల్ల‌భ‌నేని వంశీ బీజేపీలోకి వెళ్ల‌డం ఖాయ‌మ‌ని, త‌ద్వారా కూట‌మి ప్ర‌భుత్వం నుంచి ఎదుర‌య్యే రాజ‌కీయ‌ ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డాలని చూస్తున్నారని వంశీ అనుచరులు చెబుతున్నారు‌.  
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం(మే21) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీసీ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక సోమవారం శ్రీవారిని మొత్తం 85 వేల 825 మంది దర్శించుకున్నారు. వారిలో 36వేల 146 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 40 లక్షల రూపాయలు వచ్చింది. 
ALSO ON TELUGUONE N E W S
కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ వస్తున్నాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda). త్వరలో ఆనంద్ "గం..గం..గణేశా" (Gam Gam Ganesha) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమా కోసం తన లుక్ కూడా మార్చేశాడు. ఆయన ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడు. తాజాగా తన సిక్స్ ప్యాక్ ఫొటోను ఆనంద్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆనంద్ సిక్స్ ప్యాక్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతని చేంజోవర్ చూసి అందరూ సర్ ప్రైజ్ అవుతున్నారు. డెడికేషన్ అదిరిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కాగా 'లైగర్' కోసం తన అన్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా సిక్స్ ప్యాక్ చేశాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఆనంద్ "గం..గం..గణేశా"తో ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడేమో చూడాలి. తాజాగా విడుదలైన ట్రైలర్ కి అయితే మంచి స్పందనే వచ్చింది. "గం..గం..గణేశా" యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా ఈ నెల 31న థియేటర్స్ లోకి రాబోతోంది. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
Thaman S who is one of the biggest and most successful music directors in the South is known for his eclectic and mass style of compositions.  While he has composed songs in multi-genres, Thaman right now is enjoying the top-form working for movies of top South Indian stars. Now, get ready for the biggest Telugu concert ever in Dallas by the music maestro Thaman presented by People Media Factory. The Spice Tour begins on June 1st. The promo released recently by the team shows Thaman with the mass blast Dum Masala from Superstar Mahesh Babu’s Guntur Kaaram.
Pan-India rebel star Prabhas and director Nag Ashwin teamed up for the first time for a massive futuristic sci-fi film titled Kalki 2898AD. Bollywood diva Deepika Padukone is the female lead in this biggie. Amitabh Bachchan is playing key role and Ulaganayagan Kamal Haasan playing prominent role. Team is currently busy introducing character glimpses. Amitabh Bachchan who is playing Ashwatthama stunned everyone with his presence in his character glimpse, unveiled recently. Makers planning to unveil Bujji - a special car of Bhairava glimpse next. But, we have an exclusive about Kamal Haasan character and his remuneration. Kamal Haasan role in Kalki2898AD part 1 will be around 20 minutes only and in the part 2 he will be the main antagonist with 90 minutes screen time. He charged whopping 150 crores for both parts. Kamal Haasan's character draws heavily from the mythological figure Kamsa in the Bhagavatham, embodying traits of relentless ambition and mercilessness. His portrayal of a despot bent on world domination is central to the film's plot, showcasing his willingness to go to any lengths, including harming his own people and targeting the unborn, to secure his rule. This dystopian adventure sets him against Prabhas' character, Bhairava, a determined hero committed to thwarting his tyrannical plans. The dynamic between these two forces promises a tense and thrilling conflict, which is anticipated to be a major highlight of the movie.  The anticipation raises peak for the highly awaited sci-fi epic "Kalki 2898 AD," the film's release date is getting closer. This highly-anticipated sci-fi spectacle, is set to win over the audiences worldwide on 27th June, 2024. The film has garnered immense attention and kept fans eagerly awaiting its release with every content. Team has plans to promote the film globally. The film will release on Thursday, June 27th. Produced by Ashwini Dutt under the banner of Vyjayanthi Movies.
  కేజిఎఫ్ తో యష్(yash)ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు.  నేడు ఇండియా మొత్తం ఆయన కొత్త సినిమా కోసం  ఎదురుచూస్తు ఉంది. ఎట్ లీస్ట్ ఆయన మూవీ షూటింగ్ జరుపుకుంటున్నా చాలు  ఫ్యాన్స్ కీ పండుగే. రీసెంట్ గా ఆయన రెండు చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, అందులో ఒకటి టాక్సిక్ కాగా ఇంకోటి రామాయణ(ramayana) ఈ రెండు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ క్రమంలో యష్ కి సంబంధించిన ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. రామాయణ.. భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుని జీవిత కథ ఆధారంగా ఇతిహాసాల్లో పొందుపరిచిన రామాయణం ని ప్రధాన ఇతి వృత్తంగా చేసుకొని తెరకెక్కుతుంది. రాముడు గా రణబీర్ కపూర్ (ranbir kapoor) సీతమ్మ తల్లిగా  సాయి పల్లవి (sai pallavi) చేస్తుంది. ఇక యష్  రావణుడుగా మెరవబోతున్నాడు.పరమేశ్వరుడు కి పరమ భక్తుడైన రావణుడు లంకకి అధిపతి. లంక మొత్తం సువర్ణమయం.ఆయన ఒంటి మొత్తం ఎప్పుడు బంగారంతో నిండిపోయి ఉంటుంది.ధరించే  వస్త్రాలు, వాడే వస్తువులు అన్ని పూర్తిగా  సువర్ణమయం. అంటే  బంగారంతో చేసిన వాటినే రావణ బ్రహ్మ ఉపయోగించేవాడు. ఈ విషయం గురించి పురాణాల్లో  చాలా స్పష్టంగా  చెప్పబడి ఉంది. ఇప్పుడు రావణుడుగా చేస్తున్న  యష్ కి కూడా నిజమైన బంగారాన్నే  వాడబోతున్నారు. అంటే రావణుడి లా  యష్ ఒంటి నిండా మాత్రమే కాకుండా  వాడబోయే వస్తువులు కూడా బంగారం తోనే ఉండబోతున్నాయి అదే విధంగా  ఇంతవరకు ఏ మూవీలోను  లంక ని ఎవరు చూపించని విధంగా భారీ సెట్స్ వేస్తున్నారు. నితీష్ తివారి దర్శకుడు కాగా ప్రొడ్యూసర్స్ విషయంలో చిన్న గందర గోళం నెలకొని ఉంది. కేజిఎఫ్ లో యష్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో దోచుకున్న బంగారాన్ని ఈ సినిమాకి ఉపయోగిస్తున్నాడని   ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సరదాగా  కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా యష్ గోల్డ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది  
The movie "Aarambham," featuring Mohan Bhagath, Supritha Satyanarayan, Bhushan Kalyan, and Ravindra Vijay in pivotal roles, is being produced by Abhishek Viti under the banner of AVT Entertainment and directed by Ajay Nag V. "Aarambham," a film is a distinctive thriller and it was impressed very few in theatres. Packed with mysterious elements, compelling storylines and powerful performers, the film was a seat edge thriller. With rave reviews and critics support, the film got decent numbers in theatres. Now, the film which impressed audience in theatres is coming to OTT. The film will be available for streaming only on ETV Win from May 23rd. Srinjith Yerramilli is the music director while Devdeep Gandhi Kundu is handling the cinematography.
The promotional activities of Sudheer Babu’s most-awaited movie Harom Hara are in full swing. The appealing songs, intriguing teaser, and other promos received a great response, creating enough hype for the movie. The Murugan song in particular which was released for Sudheer Babu’s birthday and showed his friendship with Sunil also made a lasting impression. The movie which was earlier planned for release on May 31st is postponed to June 14th. The makers announced the news officially through a small byte that shows Sudheer Babu with a gun in his hand, and the title song is played in the background. With no noted movie is arriving on June 14th, Harom Hara will have a solo release. Gnanasagar Dwaraka of Sehari fame is directing the movie billed to be an intense action thriller. Produced by Sumanth G Naidu under the banner of SSC (Sree Subrahmanyeshwara Cinemas) with Malvika Sharma playing the female lead, the movie is a period film set in 1989 in the backdrop of Kuppam of Chittoor district. Chaitan Bharadwaj provides the music, while the cinematography is by Aravind Vishwanathan. The editing is done by Raviteja Girijala.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), అనిరుధ్ (Anirudh) కాంబినేషన్ అంటే.. అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ ఏమో మ్యాన్ ఆఫ్ మాసెస్.. అనిరుధ్ ఏమో తన మ్యూజిక్ తో మాస్ ని ఉర్రూతలూగిస్తాడు. అందుకే ఈ ఇద్దరు కలయికలో 'దేవర' (Devara) సినిమా వస్తుందని తెలియగానే.. సాంగ్స్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి. దేవర సాంగ్స్ ఎప్పుడెప్పుడు వినాలా అని అందరూ ఎంతగానో ఎదురుచూశారు. ఎట్టకేలకు ఎదురుచూపులు ఫలించి.. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొదటి సాంగ్ విడుదలైంది. విడుదలకు ముందు ఈ సాంగ్ పై అంచనాలు మామూలుగా లేవు. దానికి తోడు ఈ సాంగ్.. "జైలర్ సినిమాలోని హుకుం సాంగ్ ని మించి ఉంటుంది" అని నిర్మాత నాగవంశీ వంటి వారు చెప్పడంతో.. అంచనాలు మరో స్థాయికి వెళ్లాయి. తీరా సాంగ్ విడుదలయ్యాక.. ఆశించిన స్థాయిలో లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'దేవర' ఫస్ట్ సింగిల్ గా 'ఫియర్ సాంగ్' (Fear Song) విడుదలైంది. ఈ సాంగ్ కి యూట్యూబ్ లో 24 గంటల్లో చెప్పుకోదగ్గ వ్యూసే వచ్చాయి కానీ.. ఎన్టీఆర్-అనిరుధ్ కాంబినేషన్ హైప్ కి తగ్గ రికార్డు వ్యూస్ అయితే రాలేదనే చెప్పాలి. దానికి కారణం ఈ సాంగ్ కి మిశ్రమ స్పందన రావడమే. సాంగ్ వినడానికి బాగానే ఉన్నా.. పాడుకోవడానికి మాత్రం కష్టంగా ఉంది. ముఖ్యంగా లిరిక్స్ ని మ్యూజిక్ బాగా డామినేట్ చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మ్యూజిక్ కూడా 'విక్రమ్', 'జైలర్', 'లియో' వంటి సినిమాలను గుర్తు చేస్తుందని.. ఏమాత్రం కొత్తదనం లేదని అంటున్నారు. హుకుం సాంగ్ ని మించి కాదు కదా.. దాని దరిదాపుల్లో కూడా లేదని... అనవసరంగా ఎక్కువ పబ్లిసిటీ చేశారని కొందరు ట్రోల్ చేస్తున్నారు. దేవర మొదటి సాంగ్ ని కొందరు ట్రోల్ చేస్తుంటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సాంగ్ పట్ల ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అనిరుధ్ మాస్ సాంగ్స్ ఇన్‌స్టంట్ గా హిట్ కావని.. స్లో పాయిజన్ లా ఎక్కి చార్ట్ బస్టర్స్ అవుతాయని చెబుతున్నారు. 'వాతి కమింగ్', 'హుకుం' వంటి పాటలకు కూడా విడుదల కాగానే రికార్డు వ్యూస్ రాలేదని.. వింటున్న కొద్దీ సాంగ్స్ అందరికీ నచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాయని గుర్తు చేస్తున్నారు. అలాగే 'ఫియర్ సాంగ్' కూడా వింటున్న కొద్దీ బాగా నచ్చుతుందని, థియేటర్లలో ఈ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయమని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశిస్తున్నట్లు..  'ఫియర్ సాంగ్' కూడా 'వాతి కమింగ్', 'హుకుం' సాంగ్స్ లా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.
ప్రతీ మనిషి‌ పూర్వం వంద సంవత్సరాలు.. ఆ పైబడి జీవచించేవారు. మరిప్పుడు అరవై డెబ్బై ఏళ్ళకే ఏదో ఒక జబ్బు వచ్చి చనిపోతున్నారు. అయితే ఇన్ టైమ్ అనే సైన్స్ ఫిక్షన్ మూవీ చూస్తే మనం బ్రతికే విధానం.. మనం టైమ్ గురించి ఆలోచించే విధానమే మారిపోతుంది. 'ఇన్ టైమ్(IN TIME)' అనే పేరుతో హాలివుడ్ లో రిలీజైన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ విలువని తెలియజేసేలా మేకర్స్ ఈ మూవీని తీసుకొచ్చారు. ఈ సినజమా కథేంటో‌ ఓసారి చూసేద్దాం... ఈసినిమా ఓ వంద సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో చూపిస్తుంది. అప్పుడు అందరు డిజిటల్ మీడియా మీదే అధారపడి ఉంటారు. ప్రతీ ఒక్కరు పుట్టడమే చేతికి టైమ్ తో పుడతారు. అందులో ఎవరి‌ జీవితం ఎంత టైమ్ వరకో‌ రాసి ఉంటుంది. అయిన మనిషి కష్టపడి పనిచేస్తే టైమ్ పెరుగుతుంది. అయితే బాగా డబ్బున్న వాళ్ళు వారి జీవితకాలాన్ని‌ వేల సంవత్సరాల వరకు టైమ్ పెంచుకుంటారు. పేదవారికి మాత్రం తక్కువ టైమ్ ను ఇస్తారు. ‌ఇక హీరో యొక్క తల్లికి టైమ్ ముగియడంతో తను చనిపోతుంది. అది భరించలేని హీరో.. బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర టైమ్ ని దోచేయాలని అనుకుంటాడు. అదేసమయంలో అతనికి హీరోయిన్ నచ్చుతుంది.‌ ఇక తను కూడా హీరో మార్గాన్నే ఎన్నుకుంటుంది. ఇక బాగా డబ్బున్న వారి దగ్గర హీరో, హీరోయిన్ కలిసి టైమ్ దొంగిలించి టైమ్ కొనుక్కోలేనివారికి ఇస్తారు.  టైమ్ ఎంతుంటే వారు అన్ని సంవత్సరాలు జీవిస్తారు. సినిమా మొదలైన నుండి ముగిసేవరకు‌ ఉత్కంఠభరితంగా సాగుతుంది. మన ఫ్యూచర్ జెనరేషన్ టెక్నాలజీ‌ పేరుతో వారి జీవితాలని ఎలా నాశనం చేసుకుంటారో తెలియజేస్తూ సాగుతుంది. టైమ్ ఉంటే ఓ సారి ఈ 'ఇన్ టైమ్' ని చూసేయ్యండి.   
Anand Devarakonda's latest movie is "Gam Gam Ganesha". Pragathi Srivastava and Nayan Sarika are playing the lead female roles opposite Anand. This movie is being produced by Kedar Selagamshetty and Vamsi Karumanchi under the banner Hy-Life Entertainment, with Uday Shetty making his directorial debut. "Gam Gam Ganesha" is set for a grand theatrical release on the 31st of this month. Today, the trailer release event was held in Hyderabad. Director Vamsi Paidipally said, "We released the trailer of the movie 'Baby' here. It was July and it rained. It is May now, and it rained today too. I hope Anand achieves success with 'Ganesha' like 'Baby.' Coming from the Devarakonda family, people think it is easy for Vijay, but it is challenging for Anand to carry that weight. After seeing 'Dorasani,' 'Middle Class Melodies,' and 'Pushpaka Vimana,' it seemed okay. But Anand got a blockbuster with Sai Rajesh's 'Baby.' Anand's performance in that movie was impressive, especially in a couple of scenes. Both Anand and Vijay are on different paths. I wish Anand and the entire team a super hit with 'Gam Gam Ganesha' on the 31st of May." Producer Vamsi Karumanchi said, "This is our first production with 'Gam Gam Ganesha.' We thank Anand for giving us this opportunity. The trailer will impress you as much as our movie teaser did. The songs of 'Gam..Gam..Ganesha' are also enjoyable. Anand gave his best in the action scenes. Enjoy it on the 31st of this month at 'Gam..Gam..Ganesha' theaters." Producer Kedar Selagamshetty said, "Hello, Anand fans who came to this event. We had planned to do a film with Anand earlier in our company. Now that he has become a star, we are happy to be making a movie with him. We are going to achieve great success with 'Gam Gam Ganesha.' Thanks to all our team for delivering a good movie to our company." Co-Producer Anurag Parvataneni said, "Elections are over, IPL is finally ending, the sun is fading, and the rains are falling. Some closed single screens are re-opening. Our 'Gam..Gam..Ganesha' movie is coming at the right time. Any business should be done at the right time. Crores of rupees were spent in the elections. Now people have money. We think this is the right time for our movie release. Along with 'Gam..Gam..Ganesha,' other films are coming on the 31st of this month, and we wish them all the best. But any work starts with Ganesha. We hope that the audience will come to 'Gam..Gam..Ganesha' theaters to watch Anand after 'Baby.'. Actor Yavar said, "This is the film I am doing after Bigg Boss. I got a good role in Gam Gam Ganesha. Anand was very supportive while doing this character. As you liked the trailer of Gam Gam Ganesha, the movie will also please you. I hope you will come to the theaters and watch our movie." Actor Jabardasth Emmanuel said, "Gam Gam Ganesha is a movie to enjoy with your family. The movie will go in a unique comedy timing. There is one best friend in your life who supports you no matter what you do. I have played such a friend character in this film. Anand will be seen in the character of a friend. If you see my character, you will remember your friend. There are three heroines along with me in this movie. My chemistry with Anand is like that. Go to theaters to watch Gam Gam Ganesha. The movie will entertain you well." Director Uday Shetty said, "We often divide movies into class and mass. But our movie is a mix of both. Ganesh Chaturthi is celebrated energetically by people from all walks of life, and that energy is present in Gam Gam Ganesha. We have made this movie with a story revolving around Vinayaka Chavithi. The movie is entertaining throughout, and the twists are thrilling. Enjoy watching Gam Gam Ganesha in theatres." Writer Vijayendra Prasad said, "Anand's fans look as smart as Power Star Pawan Kalyan's fans. I recently saw the movie Baby. Anand's performance and Sai Rajesh's design are very impressive. I give them my blessings. The director of this film, Uday, worked with me. He is a dedicated and hardworking person. I want this film to be a success for him. All the best to the Gam Gam Ganesha team. In Telangana, 72 percent voting was done, and 81 percent in AP. I hope that 100 percent of the audience will vote for this movie. If you go without worshiping Ganesha, you will face problems. If boys propose to girls without watching this movie, your cheeks will crack." Heroine Nayan Sarika said, "Thanks to Vijayendra Prasad, Vamsi Paidipalli, and Sai Rajesh who came to our event. I would like to thank the director and producers for giving me a chance in Gam Gam Ganesha. It was a pleasure to work with Anand. There are many shades in the movie. Gam Gam Ganesha impresses with all the elements of spice, sweetness, thrill, and action. Anand's character will give you a new experience. Watch it on the 31st of this month at Gam Gam Ganesha Theatres." Director Sai Rajesh said, "Anand Deverakonda is the hero who gives life to the film. I am very satisfied as a director for making the movie Baby with him. If Anand trusts the director, he acts as instructed. Anand's name is Anna during Baby Time, and he couldn't dance. I was surprised to see his dance in this movie; he is dancing very well. Director Uday has good comedy timing like Priyadarshan and Crazy Mohan. He told me this story, and as he said, he brought it to the screen. Uday has a bright future. I wish Anand the same success with Gam Gam Ganesha as he had with Baby." Hero Anand Deverakonda said, "Thanks to director Sai Rajesh Anna for giving me a memorable movie like Baby. Vijayendra Prasad was the first to recognize the acting talent of my elder brother Vijay. You have talent while performing on stage, Anna. I am happy he came to bless our event today. The hero figure is on the movie poster and is given more priority, but film directors are crucial. They should be prioritized first. We celebrated Director's Day yesterday. My congratulations to all the directors. Industry, audience, media, and fans—we are all one family. Whatever good happens in the industry, whoever achieves something, should be celebrated together. But today, we are moving from competition to comparison in the film industry. Only a few groups celebrate when someone achieves something significant. That shouldn't be the case. We should all celebrate the achievements of our industry. So far, I have done realistic and natural movies. Ganesha comes with an energetic character. It is a typical genre movie—a crime comedy with a compelling story. It feels like Express Raja, Run Raja Run, Swami Rara, or Agent Sai Srinivasa Athreya. Don't compare it to the movie Baby. Gam Gam Ganesha is a different genre movie. I wish our director Uday all the best. He supports his peers. I want him to get two or three more films and get busy soon. Gam Gam Ganesha should bring success to our producers. Watch Gam Gam Ganesha in theaters on the 31st of this month and bless us."
  కొన్ని సినిమాలు కంటెంట్ ఉన్నా సరైన పబ్లిసిటీ లేక యావరేజ్ టాక్ ని తెచ్చుకుంటాయి. కానీ అవే ఏదైన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో గానీ యూట్యూబ్ లో గానీ రిలీజైతే మంచి వ్యూస్ వస్తాయి. అలా అండర్ రేటెడ్ గా ఉన్న ఓ సినిమా అటు ఓటీటీనీ ఇటు యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. శంకర్ గురు రచయితగా, దర్శకుడిగా.. డాలి ధనంజయ హీరోగా, అమృత అయ్యంగారు హీరోయిన్ గా నటించిన మూవీ ' బడవ రాస్కెల్ '. ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. శంకర్ అలియాస్ బడవ రాస్కెల్ గా డాలి ధనంజయ, సంగీతగా అమృత అయ్యంగారు, శంకర్ వాళ్ళ నాన్న రంగనాథ్ గా రంగాయన రఘు, శంకర్ వాళ్ళ అమ్మ శారదమ్మగా తార, శంకర్ క్లోజ్ ఫ్రెండ్ గా నాగలింగ,  సంగీత వాళ్ళ అమ్మ ప్రేమకూమారిగా స్పర్శ రేఖ నటించారు. శంకర్ గురు రాసుకున్న ఈ కథ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. టైలాగ్స్ సినిమాకి ప్రధానబలంగా నిలిచాయి. అమ్మనాన్నల ప్రేమని కొడుకులు అర్థం చేసుకుంటారా? ప్రేయసి ప్రేమని వద్దంటే ఆ ప్రేమికుడికి బాధ ఎలా ఉంటుంది? స్నేహితుల కోసం ప్రాణాలిచ్చేవాడు‌ ఉంటే ఎలా ఉంటుంది.. లాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఈ బడవ రాస్కెల్ ఉంది. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం... రోడ్డు పక్కన ఇద్దరు ముసలి భార్యాభర్తలు ఓ చిన్న హోటల్ ని పెట్టుకుంటారు. అయితే అక్కడికి కొంతమంది రౌడీలు వచ్చి వారిని ఆ స్థలం ఖాళీ చేసి వెళ్ళమని లేదంటే బాగోదని బెదిరిస్తారు‌. అప్పుడే  అక్కడికి వచ్చిన శంకర్(డాలి ధనంజయ) రౌడీలని కొట్టి వారిని సేవ్ చేస్తాడు. అయితే ఓ రౌడీ తిరిగి వచ్చి శంకర్ తలమీద బలంగా కొట్టి ఓ పాతబడ్డ ఫ్యాక్టరీకి తీసుకెళ్తాడు. అక్కడ అప్పటికే కొంతమందిని తీసుకొస్తారు ఆ రౌడీలు. ఇక ఒక్కొక్కరు తమ ఫ్యామిలీ గురించి ప్రేమకథ గురించి చెప్తారు. శంకర్ ని సంగీత నమ్మించి మోసం చేసిందని.. తన అమ్మనాన్నలైనటువంటి రంగనాథ్, శారదమ్మలని దారుణంగా అవమానించారని చెప్తుంటాడు. అసలు శంకర్ ని ప్రేమించిన సంగీత ఎందుకలా చేసింది? సంగీత వాళ్ళ అమ్మ ప్రేమకూమారి పాత్రేంటి? శంకర్ యొక్క అమ్మనాన్నలు ఏం చేశారనేది మిగతా కథ. యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. ఫ్యామిలీతో కలసి చూసేలా ఉంది. గత సంవత్సరం కన్నడలో రిలీజైన ఈ సినిమా సరైన పబ్లిసిటీ లేక అయిదు నెలల క్రితమే యూట్యూబ్ లోకి వచ్చేసింది. ప్రేక్షకుడు సినిమా చూస్తున్నంతసేపు హీరో స్థానంలో తనని తాను చూసుకుంటాడు. డాలి ధనంజయ వాయిస్ సినిమాకి ప్లస్ అయింది. శంకర్ యొక్క అమ్మనాన్నలు, ఫ్రెండ్స్, లవర్, ఇలా ప్రతీ ఒక్కరు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమా పూర్తిగా చూస్తే ప్రతీ ఫ్యామిలీలో నాన్న పడే కష్టం, అమ్మ చేస్తున్న త్యాగం తెలుస్తుంది. డబ్బులు పెట్టి కంటెంట్ లేని వాటిని చూసేకంటే ఇంట్లోనే యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమాని హ్యాపీగా చూసేయ్యండి.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  మనసులో ఏదీ దాచుకోలేకపోవడం చాలా మంది బలహీనత. బాధ అయినా, సంతోషం అయినా, దుఃఖం అయినా తనకు తెలిసిన వారికో లేక స్నేహితులు, ఆత్మీయులకో ఏదో ఒక  సందర్భంలో చెప్పుకుని తీరతారు. అయితే ఇలా చెప్పడం తప్పని కాదు కానీ.. కొన్ని విషయాలు మాత్రం ఇతరులతో అస్సలు చెప్పడం మంచిది కాదని అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేష నిపుణులు. ఏ వ్యక్తి అయినా ఇతరులతో అస్సలు చెప్పకూడని 5 విషయాలేంటో తెలుసుకుని వాటిని పాటిస్తే  వారి జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది. ఆ అయిదు విషయాలేంటో తెలుసుకుంటే.. ఆర్థిక స్థితి.. ఉద్యోగం చేసేవారు అయినా వ్యాపారం చేసేవారు అయినా పొదుపు చేసేవారు అయినా తమ ఆర్థిక స్థితి గురించి మరో వ్యక్తికి చెప్పడం మంచిది కాదు. ప్రతి వ్యక్తి ఆర్థిక స్థితి సామాజిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. డబ్బును చూసి మనుషులు మసలుకునే కాలమిది. ఎవరిదగ్గరైనా డబ్బు ఎక్కువ ఉందని తెలిసినా, ఎక్కువ సంపాదిస్తున్నారని తెలిసినా అప్పు కోసం, సహాయాల కోసం సులువుగా చుట్టూ చేరతారు. పక్క మనిషి గురించి పట్టించుకోని ఈ కాలంలో ఆర్థిక సహాయాలు చెయ్యడం అంత మంచిది కాదు. అందుకే ఆర్థిక స్థితి గురించి ఎవరికీ చెప్పకూడదు. ఇంటి సమస్యలు.. ప్రతి ఇంట్లోనూ సమస్యలుంటాయి. ఇంటి సమస్యలను ఇంటి వారితో చర్చించి వాటిని చక్కబెట్టుకోవడం శ్రేయస్కరం. అలా కాకుండా సలహాలు, సూచనలు ఇస్తారనో లేదా మనసులో భారం దించుకోవాలనే ఆలోచనతోనో ఇంటి సమస్యలు బయటి వారికి, తెలిసిన వారికి చెప్పడం మంచిది కాదు. రిలేషన్ గొడవలు..  నిజానికి తోబుట్టువులు, చుట్టాలు, బాగా దగ్గరి వారైనా సరే.. భార్యాభర్తల సమస్యలలో జోక్యం చేసుకోవడం, తీర్పులు ఇవ్వడం మంచిది కాదు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవలు, సమస్యలు వారే పరిష్కరించుకుంటే వారిద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం పెరుగుతుంది. ఏ సమస్యకైనా ప్రతి వ్యక్తి స్పందన వేరుగా ఉంటుంది. అనుభవాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి సమస్యలను బయటకు, లేదా ఇతరుల దగ్గరకు తీసుకెళ్లడం, చెప్పడం మంచిది కాదు. మూడవ వ్యక్తికి భార్యాభర్తల సమస్యలు చెబితే వారు దాన్ని ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు. బలహీనతలు.. ప్రతి వ్యక్తిలోనూ బలాలతో పాటూ బలహీనతలు ఉంటాయి. చాలామంది వ్యక్తులలో లోపాలు, బలహీనతలను వెతుకుతారు. వాటిని వేలెత్తి చూపిస్తారు. విమర్శిస్తారు. అందుకే వ్యక్తులలో బలాలు బయటపెట్టినా సమస్య లేదు కానీ బలహీనతల గురించి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరికీ చెప్పకూడదు. ప్రణాళికలు.. పెద్ద పెద్ద విషయాల గురించి నిర్ణయాలు తీసుకునే ముందు, పెద్ద ప్రణాళికలు వేసుకునేటప్పుడు వాటిని మరొక వ్యక్తితో చెప్పకూడదు. జీవితంలో ఇంకా ఎదిగే దశలో వేసుకునే ప్రణాళికలు ఇతరులతో చెప్పకూడదు.                                                      *రూపశ్రీ.  
ప్రతి మనిషి జీవితంలో ఎన్నో బంధాలు ఉంటాయి. తల్లిదండ్రులు, స్నేహితులు, చుట్టాలు, తెలిసిన వారు ఇలా చాలామంది జీవితంలో  ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. తల్లిదండ్రులు కన్నవారు కాబట్టి వారు జీవితాంతం పిల్లల విషియంలో పాజిటివ్ గానే ఉంటారు. ఇక స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు ఈ బంధాలన్నీ బయటినుండి వచ్చేవే.. అయితే అన్నింటి కంటే భాగస్వామి పాత్ర మాత్రం చాలా పెద్దది. జీవితంలో ఓ దశలో బంధంలోకి వచ్చి చివరి వరకు కలసి ఉండేవారు జీవిత భాగస్వాములు.  జీవిత భాగస్వాములతో బంధం  ఎంత బలంగా ఉంటే ఇద్దరి జీవితం, ఇద్దరి భవిష్యత్తు  అంతే గొప్పగా ఉంటుంది. ఈ బంధం ఎంత బలంగా ఉందో నిర్ణయించే   5 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు దొరికే సమాధానాలే బంధం బలాన్ని స్పష్టం చేస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేస్తున్నారా.. ఒక బంధం బలంగా ఉండాలంటే దానికి ముఖ్యంగా మంచి కమ్యూనికేషన్ అవసరం. మీరు,  మీ భాగస్వామి,  మీ ఆలోచనలు, భావాలు,  అవసరాలను బహిరంగంగా వ్యక్తపరచగలరో లేదో అంచనా వేయాలి.  ఒకరు చెప్పేది మరొకరు శ్రద్దగా వింటున్నారా? ఇద్దరి మధ్య చర్చలు వివాదాలు  వాదనలుగా మారుతున్నాయా? ఇలాంటివి  వివాదాలుగా మారకుండా   పరిష్కరించగలుగుతున్నారా? ఇవన్నీ కమ్యూనికేషన్  సమర్థవంతంగా ఉందా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తాయి.  కమ్యూనికేషన్ బాగుంటే ఇద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం, నమ్మకం పెరుగుతాయి. ఏకభావం.. బలమైన బంధానికి  భాగస్వాముల విలువలు, ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ఎలా ఉంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది . మీరు అయినా,  మీ భాగస్వామి అయినా, ఇద్దరి  ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నారా? ఇద్దరి నిర్ణయాలు  కెరీర్, కుటుంబం, జీవనశైలి లేదా వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించినవా అని ఆలోచించాలి. ఇద్దరూ జీవితంలో ఎలాంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు?  వంటివి ఇద్దరూ భవిష్యత్తు కోసం ఎంత మాత్రం ఏకభావంతో ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.  సంఘర్షణలు.. ఏ సంబంధంలోనైనా సంఘర్షణలు  తప్పనిసరిగా ఉంటాయి. అయితే వాటిని ఎలా డీల్ చేస్తారనే దానిపైనే బంధం ఆధారపడి ఉంటుంది.   భాగస్వామితో కలిగే  విభేదాలు,  సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో, ఎలా ఎదుర్కోవాలో పరిశీలించాలి. గొడవలు జరిగినప్పుడు రాజీ పడటం,  పరిష్కారం కోసం ప్రయత్నించడం వంటివి ఏ మేరకు జరుగుతున్నాయో తరచి చూసుకోవాలి.    వివాదాలు పెరుగుతున్నాయా?  వాటిని పరిష్కరించుకోవడానికి ఎంత సమయం తీసుకుంటున్నారు?  ఆరోగ్యకరమైన  రీతిలో గౌరవం మరియు పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలను కనుగొనే సుముఖత ఉంటాయి. భావోద్వేగాలు.. భావోద్వేగ సాన్నిహిత్యం భౌతిక సాన్నిహిత్యానికి మించినది.  భాగస్వామితో భావోద్వేగ పరంగా లోతుగా కనెక్ట్  అయితే  ఇద్దరి మధ్య బంధం కూడా బలంగా ఉంటుంది. ఇద్దరి ఆలోచనలు, భయాలు , ఇబ్బందులను ఒకరితో మరొకరు సరిగా ఓపెన్ అయ్యి చెప్పుకుంటున్నారా?  అవసరమైన సందర్భాలలో ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారా?  ఇవన్నీ ఇద్దరి మధ్య బంధం ఎంత గాఢంగా ఉందో తెలియజేస్తుంది.  పెట్టుబడి.. ఏ వ్యాపారానికి అయినా ఎలాగైతే డబ్బు, కష్టం పెట్టుబడిగా పెడతారో.. అదే విధంగా  బంధం బలంగా ఉండటానికి సమయం పెట్టుబడి పెట్టాలి. ఇద్దరూ ఒకరికోసం ఒకరు సమయం ఎలా కేటాయించుకుంటున్నారనే దానిపై బంధం ఆధారపడి ఉంటుంది. ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో చురుకుగా ఉంటున్నారా?. ఇద్దరూ  కలిసి  క్వాలిటీ టైమ్ మెయింటైన్ చేస్తున్నారా?  ఒకరి అవసరాలకు మరొకరు ప్రాధాన్యత ఇస్తున్నారా? ఒకరిని మరొకరు మెచ్చుకోవడం, ప్రోత్సహించడం, సపోర్ట్ ఇవ్వడం  వంటివి చేస్తున్నారా? ఇవన్నీ ఒక బంధం బలపడటానికి పెట్టుబడులే.                                                       *రూపశ్రీ.
పొగిడి చెడినవాడు లేడు. సమయోచితంగా పొగడలేని వారు అన్ని చోట్లా చెడిపోతారు. జీవితంలో కొందరికి జ్ఞానం ఒక దశలో వస్తుంది. అంతకు క్రితం నష్టమైపోయిన కాలాన్ని కూడదీసుకోవడానికి అన్నట్లుగా జ్ఞానోదయమైన మరుక్షణం నుండి అవతలివారిని అమితంగా, భరించలేనంతగా పొగడడం నేర్చుకుంటారు. ఇలాంటి వ్యక్తి తాను పొగిడేవాణ్ణి ఆకాశానికి ఎత్తేస్తాడు. 'ది స్కై ఈజ్ ది లిమిట్” అని రుజువు చేస్తాడు. అవతలి వ్యక్తి అలిసిపోయేంత వరకూ, లేక తాను అలిసేంత వరకూ పొగుడుతాడు.  ఒక్కొక్కసారి అక్కడ పొగడడానికి తగినంత విషయం లేనప్పుడు అతడి ఇంట్లో తనకు ఆతిథ్యమిచ్చిన ఆయన సతీమణి అమృతహస్తాన్ని, ఆవిడ వండి వడ్డించిన పదార్థాలు ఎంత రుచికరంగా వుంటాయో ఇలాంటి విషయాలను ఇరికించి మరీ చెప్తాడు. ఇలాంటి సబ్జక్టును గురించి ఎంతైనా చెప్పే వీలుంది. ఆ వంకాయ కూర, ఆ పాయసం, వారింటి నెయ్యి ఘుమఘుమలు, ఇట్లా చెప్పుకుపోతూ వుంటే దీనికి అంతుందా అనిపిస్తుంది. అక్కడ సన్మానంలో సన్మానితుడూ, ఉపన్యాసకుడూ అలసి పోయేలోగా శ్రోతలమైన మనం అలసిపోవడం ఖాయం. ఇలా ప్రసంగించేవాడికి సన్మానితుడు అసలెవరో తెలీని సందర్భాలు కూడా ఎదురావుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ ప్రాసంగికుడు ఏ మాత్రం జంకడు. ఎవర్ని సన్మానిస్తున్నారో వారిని గురించి చీటిమీద మూడు ముక్కలు వ్రాసి ఇలా ఇవ్వండి. మూడునిమిషాల్లో ప్రసంగ పాఠంతో రెడీ అయిపోతాను. మీరు వేదికమీద ఆహ్వానితులు నలుగురికీ పూలమాలలు వేసేలోగా నా చెవిలో నాలుగుముక్కలు ఊదితే దంచి పారేస్తాను. ఎవరిని గురించి చెప్పే వాక్యాలైనా నాకు కంఠస్థమే, తడుము కోవలసిన అవసరముండదు. రాజకీయ, పారిశ్రామిక, విద్యావేత్తలెవరైనా సరే, కళాకారులు, సినిమా స్టారులైనా సరే. ఎవరికి తగిన సన్మాన వాక్యాలు వారికి వప్పజెప్పడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగానే వుంటాను. గుటికెడు కాఫీ సేవించి గొంతు సవరించానంటే ఇక ఆ తర్వాత ఉపన్యాసం అనర్గళంగా సాగిపోతుంది" అని హామీ ఇస్తాడు. అన్ని రంగాల్లోనూ స్పెషలైజేషన్ చోటు చేసుకున్న నేటి కాలంలో పొగిడే కళలో కొందర్ని తర్ఫీదు చేసి, వారికి లైసెన్స్ మంజూరు చేయడంలో తప్పేమీ కనిపించదు అనిపిస్తుంది. ఈ లలితకళను శాస్త్రీయంగా ఎక్కడా అభ్యసించకపోయినా, అనేక సంవత్సరాల అలవాటు కొద్దీ దీనిని క్షుణ్ణంగా నేర్చినవారు మన రాష్ట్రంలో ఎందరో వున్నారు. ఇలాంటివి నేర్పటానికి  నెలకొల్పే సంస్థల్లో ప్రస్తుతానికి వీరిని అధ్యాపకులు గానూ, శిక్షకులుగానూ నియమించవచ్చు. ఒక బాచ్ విద్యార్థులు శిక్షణ పొందితే ఇక ఆ తర్వాత కావలసినంత మంది అధ్యాపకులు. సమోవా అనే చిన్న రాజ్యానికి ఒక రాజుండేవాడు. అతడి రాజ్యంలో డాక్టర్ విన్సెంట్ హైనర్ అనే పెద్దమనిషి కొన్నాళ్ళుండి కొంత ప్రజాసేవ చేశాడు. డాక్టరు మహాశయుడు ఆ రాజ్యాన్ని వదలి వెళ్ళే తరుణంలో ఆ రాజుగారు ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేశాడు. ఆ సందర్భంగా రాజు డాక్టర్ను గురించి నాలుగు వాక్యాలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కాని రాజు కుర్చీలో కదలకుండా కూచున్నాడు. రాజు లేచి నుంచోని ప్రసంగించకుండా అలానే కూచోనుండటం డాక్టర్ హైనర్కు ఆశ్చర్యం కలిగించింది. ఈలోగా పొగడ్తనే వృత్తిగా చేసుకున్న ఒక వక్త వచ్చి రాజు తరపున డాక్టర్ హైనర్ గురించి బ్రహ్మాండమైన వాక్యాలతో దంచి పారేశాడు. సుదీర్ఘమైన ఆ ప్రశంసా వాక్యాల తర్వాత హైనర్ కొంత కింధా మీదై. ఉచిత రీతిని సమాధానం చెప్పడానికి లేచి నుంచోబోయాడు. రాజుగారు హైనర్ను వారిస్తూ కూచోమంటూ సౌంజ్ఞ చేశాడు. "మీ తరపున ప్రసంగించటానికి కూడా ఒక వక్తను నియమించాను. ఇక్కడ మా రాజ్యంలో ఇలాంటి ప్రసంగాలు ఆ వృత్తి స్వీకరించిన వారే చేస్తారు. ఔత్సాహికుల్ని ప్రోత్సహించడం మా పద్ధతి కాదు" అని వివరించాడు. ఇది పొగడటానికి కూడా ఎంత ప్రతిభ ఉండాలో తెలియజేస్తుంది. వాక్చాతుర్యం మనిషికి ఎంత ముఖ్యమో స్పష్టపరుస్తుంది.                                    ◆నిశ్శబ్ద.
ఇంట్లో ఉన్నప్పుడు టీవీ చూస్తున్నా, ఏదైనా పని చేసుకుంటున్నా  పక్కనే ఒక ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు పెట్టుకుని ఉంటారు. ఇక భోజనం చేసేటప్పుడు అయితే ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని ప్లాస్టిక్ బాటిళ్లతో నీళ్ళు పక్కన పెట్టుకుంటారు. రాత్రి నిద్రపోయే ముందు పక్కనే ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్ళు పెట్టుకుంటారు.  ఇక బయటకు వెళ్లినా  వెంట ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్ళు తీసుకెళ్లాల్సిందే. లేకపోతే బయట 20 నుండి 30 రుపాయలు పెట్టి నీళ్ళ బాటిల్ కొనాల్సి వస్తుంది. ఎక్కడైనా తాగుదామా అంటే పరిశుభ్రత గురించి, నీటి క్వాలిటీ గురించి ఆలోచిస్తాం. కొందరు అయితే ఆరోగ్యం మీద స్పృహతో ప్రయాణాలలోనూ, హోటళ్లలోనూ వాటర్ బాటిళ్లు కొనుగోలు చేసి నీరు తాగుతారు. కానీ ఇలా బాటిళ్లలో నీరు తాగడం అంత మంచిది కాదని ఎప్పటినుండో చెబుతున్నా ఇప్పుడు ఓ దారుణమైన నిజం బయటపడింది. ప్లాస్టిక్ బాటిళ్ళలో నీరు తాగడం గురించి శాస్త్రవేత్తలు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. అందరూ వాటర్ బాటిళ్లలో నీరు తాగుతారు. ఇంట్లో అయినా, బయట నేరుగా బాటిళ్లతో కొనే నీరు అయినా పరిశుభ్రంగా ఉన్నాయని అనుకుంటారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు  డబుల్ లేజర్ సూక్ష్మదర్శిని ఉపయోగించి ఈ బాటిళ్లలో నీటిని పరిశీలించగా దిమ్మతిరిగిపోయే విషయాలు బయటపడ్డాయి. సగటు లీటర్ వాటర్ బాటిల్ లో రెండు మిలియన్ల కంటే ప్లాస్టిక్ ముక్కలు సూక్ష్మరూపంలో ఉంటాయట. ఇవి అదృశ్యరూపంలో ఉండే నానోప్లాస్టిక్ ముక్కలుగా తేలింది. కొలంబియా,  రట్జర్స్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు మూడు సాధారణ బాటిల్ వాటర్ బ్రాండ్‌ల నుంచి  ఐదు బాటిళ్ల నీటిని  పరిశీలిస్తే, ఒక లీటరు నీటిలో 1,10,000, మరొక దాంట్లో  4,00,000 ఇలా ఉన్నాయి. మొత్తం మీద  ప్లాస్టిక్ ముక్కల సంఖ్య ప్రతి బాటిల్ కు  సగటున 2,40,000 ఉన్నాయి.  ఇవి ఒక మైక్రాన్ కంటే తక్కువ పరిమాణంలో ఉండే కణాలు. ఒక అంగుళంలో 25,400 మైక్రాన్లు ఉంటాయి.  ఇది మీటర్‌లో మిలియన్ వంతు. కాబట్టి మైక్రోమీటర్ అని కూడా పిలుస్తారు. మనిషి  జుట్టు దాదాపు 83 మైక్రాన్ల వెడల్పు ఉంటుంది. ఇంతకు ముందు ప్లాస్టిక్ బాటిళ్లలో నీటి గురించి జరిపిన అధ్యయనంలో 5 మిల్లీమీటర్ల నుండి పావు అంగుళం కంటే తక్కువగానూ, ఒక మైక్రాన్ వరకు ఉండే కొంచెం పెద్ద మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నాయి. మైక్రోప్లాస్టిక్‌ల కంటే బాటిల్ వాటర్‌లో దాదాపు 10 నుండి 100 రెట్లు ఎక్కువ నానోప్లాస్టిక్‌లు ఉన్నాయని అధ్యయనాలు కనుగొన్నాయి.  ప్లాస్టిక్ బాటిళ్లలో ఇలాంటి నీరు తాగడం వల్ల కలిగే ఇబ్బందులు  ఏమిటంటే..  ఈ చిన్న కణాలు మెదడుకు రక్త సరఫరాకు అంతరాయం కలిగించడం,   వివిధ అవయవాలు,  క్రాస్ మెమ్బ్రేన్‌లను ప్రభావితం చేయడం చేస్తాయి. అదే విధంగా  ఈ  నానోప్లాస్టిక్‌లు పేగుల్లో పేరుకుపోయి వాటిని నిరోధించే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు ఈ కణాలు మెల్లిగా రక్త నాళాల వైపు కదులుతాయి. మనిషి  శరీరంలో ఆల్వియోలస్ అనేది ఊపిరితిత్తుల భాగం. ఇది రక్తంలోకి ఆక్సిజన్‌ను విడుదల చేయడానికి,  రక్తం నుండి కార్బన్ డయాక్సైడ్‌ను స్వీకరించడానికి పెద్ద రంధ్రాలను కలిగి ఉంటుంది. ఈ కణాలు ఊపిరితిత్తులలోకి ప్రవేశించి రక్తం-గాలి ప్రసరణకు అవరోధాన్ని కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా చిన్న ప్లాస్టిక్ కణాలు గర్భవతులలో మావిని ప్రభావితం చేస్తాయి. తల్లీబిడ్డలను కలిపే  అవయవం మావి. ఇది ప్రభావితం కావడం వల్ల  ఆక్సిజన్,  పోషకాలను తల్లి నుండి పిండానికి రవాణా చేయడం కష్టతరమవుతుంది.                                               *నిశ్శబ్ద.  
నేడు దేశంలో ని సగానికి పైగా యువత తక్కువ వయసులోనే జుట్టు ఊడిపోవడం, బట్టతల సమస్య ఎదుర్కుంటున్నారు.ఈ సమస్యవల్లె చాలామందికి పెళ్ళికూడా కాక పోవడం సంభవిస్తోంది అందరిముందు బట్టతల తో తిరగాలంటే సిగ్గుపడడం గమనించవచ్చు. ఇందుకోసం అందంగా కనపడడానికి బాగా జుట్టుపెరగాదానికి చేయని ప్రయాత్నం అంటూ లేదు అందుకోసం పడుతున్న పడరాని పాట్లు వర్ణనాతీతం చివరగా ఎదిక్కులేక హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ అంటే జుట్టు మార్పిడి చేయించుకోడానికి సిద్ధమౌతున్నారు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసేందుకు ఇబ్బిడి ముబ్బిడిగా పుట్టుకొస్తున్న నేపధ్యంలో మే నెలలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వల్ల ౩5 సంవత్సరాల వ్యక్తి మృతి చెందం తీవ్ర కలకలం రేపింది. డిల్లి నార్త్ వెస్ట్ ప్రాంతం లోనిరోహిణి లో  హెయిర్ టాన్స్ ప్లాంట్ చేస్తున్న సమయంలో రోగి మరణిం చడం పై డిల్లి హైకోర్ట్ తీవ్రంగా పరిగణిస్తూ కేంద్రం ప్రభుత్వాలు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసేవారిపట్ల వైద్య నియమ నిబందనలు అనుగుణంగా ఉన్నాయో లేదో చూడాలని డిల్లి హైకోర్ట్ ఆదేశించింది. ఇందుకోసం జాతీయ స్థాయి ప్రమాణాలు నియమ నిబందనలకు అనుగుణంగా పరిశీలించాలని నష్నల్ మెడికల్ కమీషన్ కు ఆదేశాలు జారీచేసింది. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సమయంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించేందుకు అత్యవసర సమయంలో అందించాల్సిన చికిత్చలు కు సత్వరం అందించేందుకు సమీపంలో పెద్ద ఆసుపత్రులలో నిర్వహించాలని క్లినిక్ నిర్వాహకులకు సూచించింది.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వల్ల జీవితం అంతమై పోదు, మరనిస్తారాని కాదు నష్నల్ మెడికల్ కమీషన్ తీసుకున్న నిర్ణయం పట్ల హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది ప్రముఖ ఆసుపత్రులలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ నిర్వహిస్తే ఇబ్బందులు తప్పవని ప్రైవేట్ ఆసుపత్రులలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ బృందం ఉంటుందని క్లినిక్లకు పెద్దసవాలు కాగలదని హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ చండి జైన్ గుప్తాఅన్నారు ప్రైవేట్ క్లినిక్లను కార్పోరేట్ పెద్ద ఆసుపత్రులు అనుమతించ బోవని ఆయా ఆసుపత్రుల నుండి సవాళ్లు తప్పవని డాక్టర్ మయాంక్ సింగ్ అన్నారు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సమయం లో అనుసరించే పద్ధతి అలసటతో కూడుకున్నది పెద్ద పెద్ద వసతులు ఉన్నప్పుడు ఎంపిక సులభమని అన్ని సదుపాయాలు ఉన్న చోట అనుభవజ్ఞులైన వైద్యుల సేవలు అందుతాయని పి ఎస్ ఆర్ ఐ ఆసుపత్రి ఎల్లప్పుడూ స్వగాతిస్తుందని వైద్యులు అన్నారు.అయితే దీనికోసం నూతన విధి విధానాలు అమలు చేయాలని సరైన సదుపాయాలూ శిక్షణ లేని వారుహెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ నిర్వహించడం వల్ల ప్రజల ప్రాణాలకు హానికలిగే అవకాసం ఉంది. డిల్లి లో సరైన సదుపాయాలు లేని ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ లు చాలానే ఉన్నాయాని పద్దతి ప్రకారం నిర్వహించే ట్రాన్స్ ప్లాంట్ కు 1.5 నుండి 2 లక్షలు అవుతుందని అంటున్నారు నిపుణులు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ పరిశ్రమను నూతన జవసత్వాలు కల్పించడం నాణ్యత ప్రమాణాలు సాడుపాయాలు లేని ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ లపై ఉక్కు పాదం మోపడం అంటే నియంత్రించడం. జాతీయ ఆరోగ్య మిషాన్ ఎన్ ఎం సి నియమ నిబంధనల అనుగుణంగా పనిచేయాలని పేర్కొంది.ఈ విషయాన్ని మోడ్రన్ ఈస్థటిక్స్ స్వాగతించింది.ఇది కేవలం డే కేర్ సర్జరీ మాత్రమే అనిస్పష్టం చేసారు. ఎన్ ఎం సి నిబందనల ప్రకారం ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ కు సమీపం లో నర్సింగ్ హోం ఉండాలన్న నిబంధన విధించిందన్న విషయం గుర్తుచేశారు. అత్యవసర మైన పక్షం లో అవసరమైన సమయం లో చేర్చేందుకు అవసరమైన వైద్య సదుపాయాలు ఉండడం అత్యవసరమని పేర్కొంది తద్వారా రోగిని ప్రమాదం నుండి తపాయించావచ్చని పేర్కొంది. అయితే ట్రాన్స్ ప్లాంట్ లో సమయంలో ప్రమాదం జరగడం అరుదని డాక్టర్ గుప్తా అన్నారు.ఈ మధ్యకాలం లో దేశవ్యాప్తంగా చోటు చేసుకోవడం పై గుప్తా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. సర్జరీ సమయం లో ప్రత్యేక పద్దతి అనుసరించాలాని బలమైన అనస్తీషియా బృందం ఉండాలాని ఎందుకంటే దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయాని చాలా క్లినిక్స్ లో డర్మటాలాజిస్ట్ లు లేదా ప్లాస్టిక్ సర్జన్స్ ఎనేస్తీషియా ఎక్స్ పర్ట్ గా వ్యవహరిస్తున్నారని వారి వద్ద సురక్షిత మైన వారు లేరని రోగులు తీవ్రమైన విచిత్ర మైన పరిస్థితులు ఎదుర్కోవడం సంభవిస్తుందని అందుకే అప్రమత్తం గా ఉండాలని ఎన్ ఎం సి హేచారించింది.ఎన్ ఎం సి నియనిబంధనలకు లోబడే ప్లాస్టిక్ సర్జన్లు ఉండాలి. అర్హత లేని వ్యక్తుల పై చట్టప్రకారం చర్యలు ఉంటాయాని ఎన్ ఎం సి హెచ్చరించింది.