LATEST NEWS
రేవంత్ రెడ్డి తన కేబినెట్ నుంచి కొండా సురేఖను  బర్త్ రఫ్ తరువాత ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు అన్న ఉత్కంఠ తెలంగాణ రాజకీయవర్గాలలో నెలకొంది. బీజేపీవైపు ఆమె అడుగులు పడే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషణలకు కూడా చేశారు. అయితే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ వ్యక్తిత్వాన్ని, నాయకత్వ శైలిని ఆమె కొనియాడతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.  గతంలో బీఆర్ఎస్ పార్టీ  కొనసాగిన కాలంలో   కేసీఆర్‌తో  తమ కుటుంబానికి ఉన్న సంబంధాల గురించి తాజాగా వివరించిన  కొండా సురేఖ.. కేసీఆర్ చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. తాను ఆయనతో ఎప్పుడు భేటీ అయినా ఎంతో ఆప్యాయంగా, హుందాగా రిసీవ్ చేసుకునేవారని  గుర్తుచేసుకున్నారు. పార్టీలో సుదీర్ఘకాలం పాటు కలిసి పనిచేసినప్పటికీ, కేసీఆర్ వ్యవహారశైలి తమకు ఎప్పుడూ ఎలాంటి అసంతృప్తి కలిగించలేదన్న కొండా సురేఖ.. బీఆర్ఎస్ అధినాయత్వంతో  తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని చెప్పడమే కాకుండా.. కేసీఆర్ నాయకత్వంలో తనకు ఎటువంటి ఇబ్బందులూ ఎన్నడూ ఎదురు కాలేదన్నారు.  ఈ సందర్భంగా కొండా సురేఖ తన భర్త కొండా మురళికి గతంలో దక్కిన ఎమ్మెల్సీ పదవికి  కేసీఆర్ హయాంలోనే  దక్కిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో కొండా మురళికి శాసనమండలికి వెళ్లే అవకాశం వచ్చినప్పుడు..  పార్టీలోని కొందరు సీనియర్ నేతలు  అడ్డుకునేందుకు  ప్రయత్నించారనీ, ముఖ్యంగా  కడియం శ్రీహరి వంటి సీనియర్ నాయకులు మురళికి ఆ పదవిని దక్కకుండా చేసేందుకు తెరవెనుక పావులు కదిపారని తాజాగా ఆరోపించారు. అయితే  కేసీఆర్ మాత్రం వాటన్నిటినీ తోసి రాజని,  కొండా మురళి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకారం అందించారని కొండా సురేఖ గుర్తు చేసారు.   ప్రస్తుత పరిస్థితుల్లో కొండా సురేఖ కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడం రాజకీయంగా ఆమె అడుగులు ఎటుపడుతున్నాయన్నదానిపై ఒక స్పష్టత ఇచ్చేయడమేనన్నారు. గతంలో  బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన కొండా సురేఖ.. ఇప్పుడు అదే పార్టీ అధినేతపై ప్రశంసల వర్షం గుప్పించడం వెనుక ఆమె గులాబీ గూటికి చేరే వ్యూహం ఉందని పరిశీలకులు అంటున్నారు.    [Strategy Behind Konda Surekha Praises KCR, Konda, Brs, Konda Murali, MLC, Telangana Politics, Telugu One]
రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న రేవంత్  మంత్రివర్గ ప్రక్షాళన వ్యవహారం.. కేబినెట్ నుంచి కొండా సురేఖ బర్త్ రఫ్ తో కొత్త వివాదానికి తెరలేచింది.  తనకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన పరిణామాలపై కొండా సురేఖ మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.   కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్గతంగా నడుస్తున్న పరిణామాలు, నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు , రాష్ట్ర కాంగ్రెస్ లో పాత, కొత్త విభేదాలను మరోసారి తాజాగా కొండా సురేఖ తన వ్యాఖ్యల ద్వారా తెరపైకి తీసుకువచ్చారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, రేవంత్ రెడ్డి మూలాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయని, ఆయనలొ  ప్రవహిస్తున్నది టీడీపీ రక్తమేనన్న కొండా సురేఖ..  కక్షసాధింపు రాజకీయాలు, వెన్నుపోటు కుట్రలు  తెలుగుదేం రక్తంలోనే ఉన్నాయన్నారు.  తనను టార్గెట్ చేసే క్రమంలో చిన్నారెడ్డిని కూడా రాజకీయంగా బలి చేశారని కొండా సురేఖ ఆరోపంచారు. రక్షా బంధన్ సందర్భంగా తాను స్వయంగా సీఎం నివాసానికి వెళ్లి రాఖీ కట్టానని గుర్తు చేసిన కొండా సురేఖ ఆ సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి   ఈ వివాదం గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని చెబుతూ సెంటిమెంట్ పండించడానికి ప్రయత్నించారు. తనను కేబినెట్ నుంచి తప్పించే ఆలోచన  కాంగ్రెస్ అధిష్టానానికి లేదనీ, అయితే  కొందరు నేతలు స్వార్థ రాజకీయాల కారణంగానే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు.  కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు అంతర్గతంగా ఏకమై తనపై పెద్ద కుట్ర పన్నారని  ఆరోపించారు. ముఖ్యమంత్రితో వేం నరేందర్ రెడ్డి మైండ్ గేమ్ ఆడిస్తూ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారన్నారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకు గతంలో తాను రాసిన లేఖలను మీడియాకు విడుదల చేశారు.  పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు పంపిన ఆ లేఖల్లో ప్రభుత్వ తీరుపై కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రిగా తనకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని, తన శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలను కూడా తన ప్రమేయం లేకుండానే మంత్రులు, అధికారులు చక్కబెట్టేశారని ఆ లేఖల్లో ఆరోపించారు.    [Konda Surekha Sensational Comments, Revanth Reddy, Congress Government, Telangana Politics, TDP Blood Comments, Telugu One]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం ఒక వారంలోనే వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశ,  పోలవరం ఎడమ కాలువను ప్రారంభించి, రాష్ట్ర సాగునీటి చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికారు. మరోవైపు, ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది. ఇక పోలవరం ఎడమ కాలువ పనులను చేపట్టింది.. సీఎంగా ఉన్న సమయంలో వైసీపీ అధినేత జగనే అంటూ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ శతధా ప్రయత్నిస్తోంది.  అయితే వైసీపీ ఎకో సిస్టమ్ లో ఒక మాటకు కట్టుబడి ఉండటం అన్నది కనిపించదు. ఈ క్రెడిట్ వార్ లోనూ అదే జరుగుతోంది. పార్టీ అధినేత జగన్ అమరావతి విషయంలో, మూడు రాజధానుల విషయంలో, అలాగే మావిగన్ అంటూ పూటకో మాట, రోజుకో ప్రతిపాదనా అన్నట్లుగా వ్యవహరించిన తీరుగానే.. వైసీపీ సోషల్ మీడియా కూడా క్రెడిట్ వార్ లో రోజుకో మాట మారుస్తోంది. పోలవరం ఎడమ కాలువ జగన్ ఖాతాలో వేసేందుకు ప్రయత్నిస్తూ పోస్టులు వెల్లువెత్తించిన మరుసటి రోజే మాట మార్చి.. పోలవరం ఎడమ కాలువ పనుల్లో లోపాలున్నాయనీ, కొన్ని చోట్ల నీరు లీక్ అవుతోందంటూ కొత్త ప్రచారాన్ని తలకెత్తుకుంది.  ఒకవేళ నిజంగానే పనుల్లో లోపాలు ఉంటే, ఆ లోపాలు జగన్ హయాంలోనే జరిగినవి అని వైసీపీ చెప్పుకుంటున్నట్లే లెక్క.. ఎందుకంటే పోలవరం ఎడమ కాలువ తమ అధినేత క్రెడిటే అని వాదిస్తోంది కనుక.  ప్రాజెక్టు తమదే అని చెప్పుకుంటూనే, అందులో లోపాలు ఉంటే మాత్రం అవి చంద్రబాబు, తెలుగుదేశంల నిర్వాకమేనని సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్న ప్రచారం ఫ్లాప్ అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [YCP Social Media  Flawed, YS Jagan, YSR Congress social media strategy, Polavaram Left Canal, Chandrababu Naidu, AP irrigation projects, Telugu One]
తెలంగాణ రాజకీయాల్లో   మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంత కాలం తనకు కేబినెట్ లో స్థానం కావాలంటూ గళమెత్తిన ఆయన తాజాగా సీఎం పదవే తన లక్ష్యమని ప్రకటించి సంచలనానికి తెరలేపారు. గతంలో కేబినెట్ లో తనకు చోటు దక్కకపోవడంపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసి.. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు గుప్పించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తనకు మంత్రిపదవి రాకుండా  అడ్డుకుంటున్నారనీ, హైకమాండ్ తనకు మంత్రిపదవిపై స్పష్టమైన హామీ ఇచ్చిందంటూ రేవంత్ లక్ష్యంగా పలు సందర్భాలలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.  అయితే ఇప్పుడు ఆయన ఒక అడుగు ముందుకు వేసి.. తాను సీఎంను అవుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజన్న రాజ్యం అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అన్నిటికీ మించి పార్టీలోకి కొత్తగా వస్తున్న నాయకులు కాంగ్రెస్‌ను కబ్జా చేయాలని చూస్తున్నారంటూ ఆయన చేసిన విమర్శలు, వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీలో పాత నేతలకు తీరని అన్యాయం జరుగుతోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేయడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే కోమటి రెడ్డికి ఏ వ్యూహం లేదనీ, అహంభావంతోనే విమర్శలు గుప్పిస్తున్నారనీ కాంగ్రెస్ లోని ఒక వర్గం అంటున్నది.  కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు. అదే సమయంలో పరోక్షంగానైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బయటనుంచి వచ్చి పార్టీని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు.  ఇది పార్టీలో రేవంత్ పట్ల వ్యతిరేకులను ఏకతాటిపైకి తీసుకువచ్చే వ్యూహం ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది.  అయితే రేవంత్ మద్దతు దారులు మాత్రం.. కోమటిరెడ్డి రాజకోపాల్ రెడ్డి ఏమీ తొలి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని లేరంటున్నారు. గతంలో కాంగ్రెస్ ను వీడి బీజేపీ గూటికి చేరిన కోమటిరెడ్డి, ఆ తరువాత   2023 ఎన్నికలకు ముందు  కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చి ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేస్తున్నారు. మొత్తం  మీద తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగెపాల్ రెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.    [Komatireddy Rajagopal Reddy Comments Create Sensation, Rajanna Rajyam, Telangana Congress, Munugode MLA, Revanth Reddy, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు’ అనే సూత్రం ప్రకారం కూటమి ఏర్పడినప్పటికీ.. క్షేత్రస్థాయిలో స్థానిక పోరు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు భాగస్వామ్య పార్టీల మధ్య కొత్త సవాళ్లను తెరపైకి తెస్తున్నాయి.ఇలాంటి అంశాలపై ‘వాస్తవ వేదిక’ కార్యక్రమంలో ‘జమీన్ రైతు’ ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్, తెలుగువన్ ఎం.డీ. కంఠమనేని రవిశంకర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఖరి కూటమి ప్రభుత్వంపై ఆయనకున్న అసంతృప్తిని పరోక్షంగా తెలియజేస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వరుసగా నాలుగు కేబినెట్ సమావేశాలకు హాజరుకాకపోవడం, అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల సమయంలో నియోజకవర్గ పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వడం, అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నప్పటికీ సభకు హాజరుకాకపోవడం వంటి పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.మరోవైపు.. టీడీపీ, జనసేన మధ్య సమాచార వారధులుగా వ్యవహరించిన కీలక నాయకుల వ్యాపార, వ్యక్తిగత ప్రాధాన్యతలు పెరుగుతున్నాయనే భావనతో జనసేన రాజకీయ ప్రయోజనాలపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీల వ్యూహాలు.. అంతర్లీన పరిణామాలు.. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ, జనసేన తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. జనసేన వ్యూహం: నరసరావుపేట, భీమవరం, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో స్థానికంగా తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు జనసేన నాయకులు స్వయంగా మేయర్, చైర్మన్ అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు. ఈ ప్రకటనలకు పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడం.. టీడీపీపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ వైఖరి.. కూటమి భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే.. రాష్ట్రవ్యాప్తంగా తమ సొంత రాజకీయ బలాన్ని మరింత స్థిరీకరించుకోవడం టీడీపీ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే కీలక అంశాల్లో సీట్ల పంపకంపై తక్కువ వాటా ప్రతిపాదనలు, ఇరు పార్టీల మధ్య సమాచార లోపం వంటి అంశాలు జనసేనలో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయనే చర్చ జరుగుతోంది.   భవిష్యత్ రాజకీయ ప్రభావం.. టీడీపీ–జనసేన మధ్య అంతర్గత విభేదాలు, స్పష్టమైన సమన్వయం లోపించడం రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో జనసేన శ్రేణులు టీడీపీ అభ్యర్థులకు పూర్తి స్థాయిలో సహకరించని పరిస్థితి ఏర్పడితే.. కూటమి ఎన్నికల ఫలితాలపరంగానే కాకుండా రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అదే సమయంలో.. కూటమి భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే తమ సొంత రాజకీయ గుర్తింపు, మైలేజీని కాపాడుకునేందుకు జనసేన చేస్తున్న ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను మరింత ఆసక్తికర మలుపులు తిప్పే అవకాశం కనిపిస్తోంది.       ( Vasthava Vedika, Dolendra Prasad, Ravi Shankar, AP Politics, Pawan Kalyan, TDP-Janasena Alliance, CM Chandrababu Naidu, AP Municipal Elections, TDP, Janasena, Andhra Pradesh Politics, AP Government, Nara Lokesh, Amaravati Politics, Political Analysis)
ALSO ON TELUGUONE N E W S
తెలుగు చిత్రసీమలో సరికొత్త రికార్డులను తిరగరాసిన 'రంగస్థలం' కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కలయికలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ఆర్‌సీ17' (RC17). ఈ సంచలన చిత్రం పూజా కార్యక్రమాలకు, షూటింగ్ సమయానికి సంబంధించి ఫిలింనగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రాన్ని రాబోయే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని లాంఛనంగా ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన వెంటనే, నవంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభించాలని దర్శకనిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే 'రంగస్థలం'లో చిట్టిబాబుగా మెగా అభిమానులను అలరించిన రామ్ చరణ్, ఈసారి పూర్తిగా విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. సుకుమార్ ఈ కథను ఒక సరికొత్త అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత స్టైలిష్‌గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిసింది. ఈ పాత్ర రూపకల్పన కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్‌తో పాటు ఫిజిక్‌ను కూడా పూర్తిగా మార్చుకోబోతున్నారు. తన మునుపటి బిగ్ హిట్ 'పెద్ది' చిత్రంలో రగ్గడ్ అండ్ మాస్ లుక్‌లో కనిపించిన చెర్రీ, సుకుమార్ కాన్సెప్ట్ కోసం దాదాపు 15 కిలోల బరువు తగ్గనున్నారని వినికిడి. స్లిమ్‌గా, అత్యంత క్లాసీ అండ్ పవర్‌ఫుల్ అవతారంలోకి మారేందుకు ఆయన ఇప్పటికే ప్రత్యేక డైట్, వర్కవుట్స్ ప్రారంభించారు. ఈ కొత్త మేకోవర్ చరణ్ కెరీర్‌లోనే ఒక స్పెషల్ హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ టాక్. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని మైండ్ బ్లాకింగ్ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో కథానాయికగా రుక్మిణి వసంత్ లేదా రష్మిక మందన్న పేర్లు ప్రముఖంగా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే సంగీత దర్శకుడి విషయంలోనూ సుకుమార్ టీమ్ ఒక సర్‌ప్రైజింగ్ ఆప్షన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు 'పెద్ది' సృష్టించిన ప్రభంజనం తర్వాత వస్తుండటం, మరోవైపు తిరుగులేని విజయాన్ని అందించిన సుకుమార్ కాంబో కావడంతో ఆర్‌సీ17పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చరణ్ కొత్త లుక్ ఎలా ఉండబోతోంది? మొదటి షెడ్యూల్ ఎక్కడ ప్రారంభం కానుంది? అనే విషయాలపై త్వరలోనే రానున్న అధికారిక ప్రకటన కోసం మెగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.       [Ram Charan, Sukumar, RC17 Movie Updates, Mythri Movie Makers, Ram Charan Weight Loss]
  సినిమా పేరు: రంభ, ఊర్వశి, మేనక న‌టీన‌టులు: అల్లరి నరేష్, సురభి, నరేష్, రాశి సింగ్, ప్రిష సింగ్,  విష్ణు ప్రియ, వెన్నెల కిషోర్, తారక్ పొన్నప్ప, శ్రీనివాసరెడ్డి, గోపరాజు రమణ తదితరులు సినిమాటోగ్ర‌ఫీ: పవన్ పప్పుల ఎడిటింగ్: చోట కె ప్రసాద్  మ్యూజిక్: చైతన్ భరద్వాజ్  నిర్మాత‌లు : రాజేష్ దండా, ప్రసాద్ నిమ్మకాయల సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్   బ్యానర్ :  హాస్య క్రియేషన్స్, రచన,దర్శకత్వం: చంద్రమోహన్ చింతాడ   రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 4, 2026    కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఈ రోజు రంభ, ఊర్వశి, మేనక అంటూ థియేటర్స్ లో  అడుగుపెట్టాడు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో భాగస్వామి కావడం  రంభ, ఊర్వశి, మేనక స్పెషాలిటీ. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ మంతెన సూర్యనారాయణ అలియాస్ సూరి( అల్లరి నరేష్) వంశపారంపర్యంగా వస్తున్న డ్రామా కంపెనీకి ప్రస్తుత ఓనర్. చిన్న తనంలోనే తన తల్లితో పెద్ద సినిమాహీరో అవుతానని మాట ఇస్తాడు. కానీ తన డ్రామా కంపెనీ తరుపున ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు హీరో ప్రయత్నాలు చేయకండా ఊరి నిండా అప్పులు చేస్తాడు. చిన్నతనం నుంచే పైన ఆకాశంలో స్వర్గలోకంలో ఉండే రంభ, ఊర్వశి, మేనక లని తన ఆరాధ్య దైవాలుగా భావిస్తు ఆ ముగ్గురిని భూమ్మీదకి రప్పించడం కోసం పూజలు చేస్తుంటాడు. దీంతో సూరిని స్వర్గలోకాధిపతి ఇంద్రుడు( వెన్నెల కిషోర్) తన ఎనిమీ గా భావించి రంభ, ఊర్వశి, మేనక విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇంద్రుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? దానివల్ల సూరి లైఫ్ ఏ విధంగా కొనసాగింది? ఎండ్ అయ్యింది? అనేదే రంభ, ఊర్వశి మేనక. ఎనాలసిస్  మూవీ చూస్తున్నంత సేపు పది, పదిహేనేళ్ల క్రితం రావాల్సిన కథ, కథనం కదా అనిపిస్తుంటుంది. సీన్స్ కూడా అందుకు తగ్గట్టే ఉన్నాయి. మూవీ చివరలో హీరో తన లైఫ్ గురించి మోటివేట్ అవ్వడం అనేది ఇంటర్వెల్ బ్లాంగ్ గా ఎంచుకొని హీరో అవ్వడానికి హీరో ఎలాంటి ప్రయత్నాలు చేసాడని చెప్పి ఉంటే మానవ శక్తీ ముందు దైవ శక్తీ సైడ్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఉన్నా మూవీ ఫలితం వేరేలా ఉండేది. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే ఏ ఒక్క సన్నివేశం కూడా ఆకట్టుకోదు. సూరితో పాటు తన ప్రేయసి( సురభి) మధ్య వచ్చిన సీన్స్ ,పోలీస్ ఇన్ స్పెక్టర్ ( తారక్ పొన్నప్ప) తో  వచ్చిన సీన్స్  సైతం ఆకట్టుకోలేదు. ఇంద్రుడుగా వచ్చిన వెన్నెల కిషోర్ సీన్స్ కొంచం పర్లేదు. ఇంటర్వెల్ బాంగ్ పర్లేదు. సెకండ్ హాఫ్ లో  సీనియర్ నరేష్, శ్రీనివాసరెడ్డి తో వచ్చిన కామెడీ సీన్స్ పర్లేదు. రంభ, ఊర్వశి, మేనక ని ముట్టుకుంటే చనిపోతారని వచ్చిన సీన్స్ నవ్వు పుట్టించలేదు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ తో పాటు సూరి క్యారక్టర్ ద్వారా చెప్పిన మెసేజ్ బాగున్నా తల్లి చనిపోకుండా సూరినే  కాపాడుకోవాల్సింది. నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు  సూరిగా అల్లరి నరేష్ ఎప్పటి లాగానే  కామెడీ, లవ్, సెంటిమెంట్ మోడ్ లో మెస్మరైజ్ చేసాడు. ముఖ్యంగా హాస్పిటల్ లో  తల్లితో వచ్చిన సీన్స్ లో కన్నీళ్లు పెట్టించాడని చెప్పవచ్చు.  సురభితో పాటు  రంభ, ఊర్వశి, మేనక గా చేసిన  రాశి సింగ్, ప్రిష సింగ్,  విష్ణు ప్రియ నటనలో మెరుపులు లేకపోయినా సెల్యులాయిడ్ పై అందంగా మెరిశారు. నరేష్ మరో సారి తన పెర్ఫార్మ్ తో మెప్పించాడు. వెన్నెల కిషోర్ తో పాటు మిగతా ఆర్టిస్టులందరు తమ క్యారక్టర్ కి న్యాయం చేసారు. పోలీస్ క్యారక్టర్ కి  తారక్ పొన్నప్ప సూట్ అవ్వలేదు.  దర్శకుడు చంద్రమోహన్  స్క్రీన్ ప్లే, కథ విషయంలో ఓల్డ్ ఫార్మేట్ ని నమ్ముకున్నాడు.ఏ ఒక్క సన్నివేశాన్ని కొత్తగా మలచలేకపోయాడు. డైలాగ్స్ కొన్ని చోట్ల బాగానే పేలినా, కామెడీ ని పుట్టించడమే లక్ష్యంగా ఉపయోగించే  అలాంటి డైలాగ్స్ నిత్యం వింటూనే ఉంటున్నాం. హైదరాబాద్ లోని మణికొండ ఏరియాపై పంచ్ వచ్చేలా డైలాగ్ చెప్తే  రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రేక్షకులకి ఆ జోక్ అర్ధం కాదు కదా! నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.  సాంగ్స్ కూడా ఓల్డ్ వెర్షన్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదు. బలాలు 1 . అల్లరి నరేష్ పెర్ ఫార్మెన్స్  2 . ప్రీ క్లైమాక్స్  బలహీనతలు  1 . కథ 2 . కథనం చివరిగా చెప్పుకోవాలంటే రంభ, ఊర్వశి, మేనక విజయానికి ఓల్డ్ ఫార్మేట్ లో ట్రావెల్  చేసిన కథ, కథనం, దర్శకత్వం అడ్డుగా నిలిచాయి.          రేటింగ్ 2 /5                                                                            అరుణాచలం                                                                                                                                                    
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని కొణిదెల నివాసంలో వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. కుటుంబసభ్యులందరూ కలిసి దైవ పూజలో పాల్గొని ఈ ప్రత్యేకమైన రోజును ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మెగా ప్రిన్సెస్ క్లీంకార, కుటుంబంలోని చిన్నారుల ముచ్చటైన వేషధారణలే. చిన్నారులను చిన్ని కృష్ణుడు, రాధల రూపంలో ఎంతో ముచ్చటగా ముస్తాబు చేశారు. క్లీంకారాతో పాటు శివ్ రామ్, అన్వీరలు కృష్ణారాధల లుక్‌లో కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇంటిని ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అందమైన పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన చరణ్, ఉపాసన దంపతులు పిల్లలతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ దైవిక వాతావరణం కొణిదెల ఇంట సరికొత్త కాంతులను నింపింది. ఈ జన్మాష్టమి వేడుకలకు సంబంధించిన క్యూట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అవ్వగానే క్షణాల్లో వైరల్‌గా మారాయి. ముద్దులొలికే చిన్నారుల లుక్స్ చూసి మెగా అభిమానులు, నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కమెంట్ సెక్షన్‌లో అభినందనలు తెలపడంతో పాటు 'దిష్టి తీయండి' అంటూ ప్రేమను కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉన్నారు. భారీ అంచనాలు ఉన్న చిత్రాలతో పాటు, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో రాబోతున్న ఆర్‌సీ17 (RC17) కోసం ఆయన సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం చరణ్ మేక్ ఓవర్ అవుతూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవైపు గ్లోబల్ లెవెల్ షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, రామ్ చరణ్ తన కుటుంబానికి, భారతీయ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆయన నుంచి రాబోయే తదుపరి ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్స్ కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.       [Ram Charan, Upasana Konidela, Klin Kaara Konidela, Janmashtami Celebrations, Mega Family Updates]
తాజాగా ఫోర్బ్స్ ఇండియా ఆగస్టు మ్యాగజైన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెరిశారు. అయితే, ఆ ఆర్టికల్ లో అల్లు అర్జున్‌ని ‘రెబల్ స్టార్’ అని సంబోధించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఒక్క పదంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే మొదలైంది. పెదనాన్న కృష్ణంరాజు నుండి వారసత్వంగా ‘రెబల్ స్టార్’ ట్యాగ్ ప్రభాస్ కి వచ్చింది. నేషనల్ వైడ్ గా అదే ట్యాగ్ తో ఆయన పాపులర్. అలాంటిది ఇప్పుడు ఆ ట్యాగ్ ను ఫోర్బ్స్ లాంటి అంతర్జాతీయ మ్యాగజైన్ టీమ్.. అల్లు అర్జున్‌కి ఆపాదించడం సంచలనంగా మారింది. ఇది ఫోర్బ్స్ ఇండియా ఎడిటోరియల్ టీమ్ చేసిన మిస్టేక్ అయి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీ హీరోల ట్యాగ్స్‌పై పూర్తి అవగాహన ఉండకపోవచ్చు అంటున్నారు. మరోవైపు, పుష్ప 2తో అల్లు అర్జున్ సృష్టించిన ప్రభంజనాన్ని చూసి, డిస్క్రిప్టివ్‌గా ‘రెబెల్ స్టార్’ అని రాసి ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.  ఏది ఏమైనా అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అని కాకుండా.. ‘రెబల్ స్టార్’ ట్యాగ్ తో సంబోధించడం వివాదానికి దారి తీసింది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. "రెబల్ స్టార్ అనేది ప్రభాస్ కి మాత్రమే సొంతం. ఫోర్బ్స్ వెంటనే తప్పు సరి దిద్దుకోవాలి" అని డిమాండ్ చేస్తున్నారు. ఈ కాంట్రవర్సీపై ఇప్పటివరకు ఫోర్బ్స్ ఇండియా కానీ, లేదా అల్లు అర్జున్ టీమ్ కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించి, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి.       [Forbes India, Allu Arjun, Rebel Star, Controversy, Prabhas, Telugu Film News, Telugu News, Tollywood]  
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రామ్ చరణ్, ఉపాసన తమ ఇంట్లో జరిపిన ప్రత్యేక పూజలకు సంబంధించిన ఒక అందమైన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ఓం నమో భగవతే వాసుదేవాయ" అంటూ ఉపాసన షేర్ చేసిన ఈ పోస్ట్, మెగా అభిమానులతో పాటు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలో మనం ప్రధానంగా గమనించాల్సింది వారి ఇంట్లోని పూజా మందిరపు ఆధ్యాత్మిక వాతావరణం. ఎంతో భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా అలంకరించిన పూజా వేదిక ముందు రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ పిల్లలతో కలిసి కూర్చుని పూజ చేసుకుంటున్నారు. చరణ్, ఉపాసన దంపతులు సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేస్తున్నారు. కుటుంబమంతా ఒకే చోట చేరి, ఎంతో నిరాడంబరంగా, పవిత్రమైన వాతావరణంలో భగవంతుడి ఆశీస్సులు అందుకుంటున్న ఈ దృశ్యం కుటుంబ విలువలకు, హైందవ సంస్కృతికి అద్దం పడుతోంది. ఎంతో బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ, పండుగల వేళ ఇలా సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ, ఇంట్లోనే పవిత్ర పూజలు నిర్వహించడం మెగా ఫ్యామిలీ ప్రత్యేకత. https://www.instagram.com/p/Dc2lJQdsJV5/       [Ram Charan, Upasana Konidela, Krishna Janmashtami, Krishnashtami, Telugu Film News, Telugu News]  
నటీనటులు: సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, కస్తూరి, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, షఫీ, శివకుమార్ తదితరులు  లిరిక్స్: చంద్రబోస్ సంగీతం: మహావీర్ ఏలేందర్ డీఓపీ: వెంకట హనుమ ఎడిటింగ్: సాయిబాబు తలారి ఆర్ట్: భార్గవాచారి నౌండ్ల  నిర్మాత: మేరుం భాస్కర్ స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట విడుదల తేదీ: సెప్టెంబర్ 4, 2026 మూవింగ్ డ్రీమ్స్ ఇండియా బ్యానర్ పై సీనియర్ యాక్టర్స్ సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, కస్తూరి, యువ హీరో నటరాజ్, హీరోయిన్ రాయంచ కొక్కుర, హీరో వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మేరుం భాస్కర్ నిర్మాత. పొలిటికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ:  ధర్మస్థల నియోజకవర్గంలో వరుసగా ఏడు సార్లు గెలిచి, తిరుగులేని నాయకుడిగా చెలామణి అవుతుంటాడు ఎమ్మెల్యే బైర్రాజు(సాయికుమార్). అదే ప్రాంతంలో కాలేజీని నడుపుతూ డ్రగ్స్ దందా చేస్తుంటారు వాసుదేవ్(రాజీవ్ కనకాల), అతని భార్య కస్తూరి. తమ కాలేజీలోని విద్యార్థులకు విశ్వ(శివకుమార్) ద్వారా డ్రగ్స్ ను సప్లై చేస్తూ.. విద్యార్థులను డ్రగ్స్ కు బానిసలుగా చేసి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఇది తెలిసిన అదే కాలేజీలో లెక్చరర్ గా పని చేసే అరుంధతి( వితిక షేరు), ఆమె స్టూడెంట్స్ బద్రి(నటరాజ్), ఈషా (రాయంచ కొక్కుర) తదితరులు విశ్వను ఎదిరిస్తారు. ఈ క్రమంలో బద్రి దారుణ హత్యకు గురవుతాడు. నియోజకవర్గం ఎమ్మెల్యే అండదండలతోనే తన కుమారుడు హత్యకు గురయ్యాడని తెలిసి టీ కొట్టు నడుపుకునే బద్రి తండ్రి ఈశ్వరయ్య(సుమన్) రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యే ఎన్నికల్లో బైర్రాజు మీద స్టూడెంట్స్ మద్దతుతో పోటీకి దిగుతాడు. ధన బలం, మందిబలం ఉన్న బైర్రాజును ఒక సామాన్య టీ అమ్ముకునే ఈశ్వరయ్య ఎలా ఓడించాడు అనేదే మిగతా కథ. విశ్లేషణ:  పొలిటికల్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎక్కువగానే ఉంటారు. సరైన కథను ఎంచుకుని దానికి తగ్గట్టుగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేను నడిపితే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. దర్శకుడు జై ఙ్ఞాన ప్రభ తోట కూడా నేటి సమాజంలో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఓ కాంటెంపరరీ ఇష్యూను బేస్ చేసుకుని కథను రాసి.. దానికి తగ్గట్టుగా పొలిటికల్ టచ్ తో స్క్రీన్ ప్లేను నడిపించాడు.  ఫస్ట్ హాఫ్ అంతా కాలేజీ వాతావరణం, డ్రగ్స్ కు బానిసలుగా మారిన విద్యార్థుల జీవితాలు, డ్రగ్స్ కు బానిసైన విద్యార్థిని మరణం, అది చూసిన ఓ మహిళా లెక్చరర్, కొంత మంది విద్యార్థుల తిరుగుబాటు, ఆ వెంటనే హీరో దారుణ హత్యకు గురికావడం వంటి అంశాలతో నడుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్.. సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది.  సెకండ్ హాఫ్ లో ఈశ్వరయ్య రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ధర్మస్థల నియోజకవర్గం రాజకీయం వేడెక్కుతుంది. అప్పటి దాకా తనకు తిరుగే లేదని విర్రవీగిన బైర్రాజుకు ఈశ్వరయ్య సవాల్ గా మారతాడు. ఈశ్వరయ్య చేసే పొలిటికల్ క్యాంపెయిన్, తన కుమారుణ్ణి దారుణంగా చంపిన వాళ్లను మట్టుబెట్టడం, లెక్చరర్ అరుంధతి ఉగ్రరూపం అన్నీ ప్రేక్షకులకు ఆకట్టుకుంటాయి. చివర్లో వరుణ్ సందేశ్ తో ఒక్క ఓటు విలువ ప్రాధాన్యం గురించి చెప్పిన తీరు.. ప్రజాస్వామ్యంలో  ఓటు ఎంత విలువైనదో తెలియజేస్తుంది. సినిమాలో ఉచిత పథకాల వల్ల కలిగే నష్టం గురించి కూడా ప్రస్తావించారు. అలాగే దుష్టుల స్నేహం ఎంత ప్రమాదకరమో వాసుదేవ్, కస్తూరిల పాత్రలతో చూపించారు. ఇలా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తుంది ధర్మస్థల నియోజకవర్గం. అయితే ఈ తరహా కథలు ఇప్పటికే చూసి ఉండటం కాస్త మైనస్. నటీనటుల పనితీరు: ఈశ్వరయ్య పాత్రలో సుమన్ ఒదిగిపోయారు. టీ అమ్ముకునే సామాన్యుడు నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి బడా నాయకుడిని ఢీ కొట్టే వ్యక్తిగా ఆయన నటన ఆకట్టుకుంది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని నాయకుడిగా చెలామణి అయ్యే బైర్రాజు పాత్రలో సాయికుమార్ ఆకట్టుకున్నారు. విలన్ పాత్రల్లో రాజీవ్ కనకాల, సీనియర్ నటి కస్తూరి మెప్పించారు. విలన్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సత్య ప్రకాష్ కుమారుడు నటరాజ్ ఇందులో స్టూడెంట్ గా నటించి మెప్పించాడు. అతనికి జోడిగా నటించిన రాయంచ కొక్కుర కూడా తన నటనతో ఆకట్టుకుంది. నటుడు శివకుమార్ కూడా తనకు బాగా సూట్ అయ్యే యంగ్ విలన్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. సత్య ప్రకాష్, రాజా రవీంద్ర, షఫీ, కాలకేయ ప్రభాకర్, చివర్లో వరుణ్ సందేశ్ తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు జై ఙ్ఞాన ప్రభ తోట ఎక్కడా డివియేట్ కాకుండా తను చెప్పాలనుకున్న కథను మెసేజ్ రూపంలో తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. డెబ్యూ దర్శకుడే అయినా.. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను బాగానే మలిచారు. మహావీర్ ఏలేందర్ అందించిన సంగీతం బాగుంది. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రాసిన పాటలు బాగున్నాయి. వెంకట హనుమ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.  ఫైనల్ గా.. మంచి మెసేజ్ తో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామాను పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి హ్యాపీగా చూసేయొచ్చు.   రేటింగ్: 2.5/5   Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.       [Dharmasthala Niyojakavargam, Telugu Movie Review, Suman, Sai Kumar, Vithika Sheru, Varun Sandesh, Rajeev Kanakala, Kasthuri Shankar, Nataraj, Rayancha Kokkura]  
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'డ్రాగన్'పై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల ఎన్టీఆర్ భుజానికి చిన్న గాయం కావడంతో ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం ఇచ్చారు మేకర్స్. త్వరలోనే తారక్ కోలుకుని మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ గ్యాప్‌లోనే ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఒక సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, ఆలియా భట్ కీ రోల్స్‌లో కనిపించబోతున్నారట. ఆలియా భట్, ఎన్టీఆర్ కాంబినేషన్ అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. అందులో సీతగా ఆలియా, భీమ్‌గా తారక్ తమ యాక్టింగ్‌తో గూస్‌బంప్స్ తెప్పించారు. ఇప్పుడు మళ్లీ ప్రశాంత్ నీల్ క్రియేట్ చేస్తున్న ఈ డార్క్ అండ్ రా యాక్షన్ వరల్డ్‌లో ఆలియా ఒక క్రూషియల్ రోల్ చేయబోతోందనే టాక్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక షాహిద్ కపూర్ పేరు వినిపించడం మరో సర్ ప్రైజ్. ‘కబీర్ సింగ్’ లాంటి ఇంటెన్స్ రోల్స్‌లో అదరగొట్టిన షాహిద్ కపూర్‌ను ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్‌తో స్క్రీన్ మీద చూస్తే గూస్‌బంప్స్ గ్యారెంటీ. అసలు షాహిద్ కపూర్ పాత్ర ఏంటి? ఎన్టీఆర్‌ని ఢీ కొట్టే పవర్ ఫుల్ నెగటివ్ క్యారెక్టర్‌లో కనిపిస్తారా? అనేది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ యాక్టర్ బిజు మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు ఇప్పుడు ఆలియా భట్, షాహిద్ కపూర్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా తోడైతే, ‘డ్రాగన్’ రేంజ్ మరో లెవెల్‌కి వెళ్లడం ఖాయం.       [Jr NTR, Prashanth Neel, Dragon Movie, Alia Bhatt, Shahid Kapoor, NTR Dragon Cast, Telugu Film News, Telugu News, Tollywood]  
'ఇరుముడి' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టిన తర్వాత, ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, కోలీవుడ్‌లోనూ డైరెక్టర్ శివ నిర్వాణ పేరు గట్టిగా వినిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజతో చేసిన 'ఇరుముడి' ప్రాజెక్ట్ తెచ్చిపెట్టిన సక్సెస్ జోరులో ఉన్న శివ నిర్వాణ, తన నెక్స్ట్ మూవీ విషయంలో ఎలాంటి ప్లాన్ వేస్తున్నారనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో శివ నిర్వాణ ఒక హై-వోల్టేజ్ ఎమోషనల్ డ్రామా కథను ప్లాన్ చేస్తున్నారట. అసలు ఈ కాంబినేషన్ ఇప్పుడు సడన్‌గా అనుకున్నది కాదట. 'ఇరుముడి' సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికంటే ముందే ధనుష్‌తో శివ నిర్వాణ కథా చర్చలు జరిపారట. శివ చెప్పిన విభిన్నమైన లైన్ ధనుష్‌కి బాగా నచ్చడంతో, ఈ ప్రాజెక్ట్‌పై ఇద్దరి మధ్య ప్రాథమికంగా డీల్ ఓకే అయిందనే వార్తలు సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఒకవైపు హ్యూమన్ ఎమోషన్స్, లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాను ఎంతో హృద్యంగా తెరకెక్కించడంలో దిట్ట అయిన శివ నిర్వాణ, మరోవైపు ఏ పాత్ర ఇచ్చినా తన నటనతో ప్రాణం పోసే వర్సటైల్ యాక్టర్ ధనుష్. వీరిద్దరూ కలిస్తే స్క్రీన్ మీద ఎమోషన్స్ ఏ స్థాయిలో పండుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధనుష్‌కు ఇప్పటికే 'సార్', 'రఘువరన్ B.Tech' వంటి సినిమాల ద్వారా తెలుగులోనూ చాలా బలమైన మార్కెట్ ఉంది. సరైన ఎమోషనల్ కథ పడితే తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయం. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినప్పటికీ, త్వరలోనే ఒక బిగ్ సర్ ప్రైజ్ అనౌన్స్‌మెంట్ ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. 'ఇరుముడి' సక్సెస్ ఇచ్చిన బూస్ట్‌తో శివ నిర్వాణ ఈ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారట.       [Ravi Teja, Irumudi Movie, Shiva Nirvana, Dhanush, Telugu Film News, Telugu News, Tollywood]  
వెండితెరపై వెలిగిపోయిన ఎంతోమంది తారల నిజ జీవితాలు బయటకు కనిపించేంత గ్లామరస్‌గా ఉండవు. 90ల కాలంలో సౌత్ ఇండియాలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి చ‌ర్మిల మ‌నోహ‌ర‌న్ జీవితం కూడా అలాంటిదే. ఒకప్పుడు వరుస విజయాలతో కథానాయకిగా అలరించిన ఆమె, వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేయబడింది. చ‌ర్మిల తమిళం, మలయాళం, కన్నడతో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా మలయాళ సినీ రంగంలో ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ఆమెకు స్టార్ డమ్ అందించాయి. అయితే కెరీర్ ఊపందుకుంటున్న సమయంలోనే ఆమె తీసుకున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఆమె వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీశాయి. ప్రేమ, పెళ్లి విషయంలో చ‌ర్మిలకు వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. నటుడు కిషోర్ సత్యతో జరిగిన మొదటి వివాహం కొద్ది కాలానికే విడాకులకు దారితీసింది. ఆ తర్వాత వ్యాపారవేత్త రాజేష్‌ను రెండవ వివాహం చేసుకున్నప్పటికీ, మనస్పర్థల కారణంగా ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అంతకుముందు ఒక ప్రముఖ నటుడితో నడిచిన ప్రేమాయణం కూడా బ్రేకప్‌తో ముగిసింది. వ్యక్తిగత జీవితంలో వరుస వైఫల్యాలు ఎదురవ్వడంతో చ‌ర్మిల మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. అదే సమయంలో సినిమాల్లో అవకాశాలు క్రమంగా తగ్గిపోవడం, సరైన ఆదాయ మార్గాలు లేకపోవడంతో ఆమె తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. కొడుకు బాధ్యతలు, అనారోగ్య సమస్యలు, ఇంటి అద్దెలు చెల్లించలేని పరిస్థితులను కూడా ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో చ‌ర్మిల తన కష్టాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎంతోమంది ఆప్యాయంగా పలకరించారని, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తోటి నటులు మాత్రమే తనకు అంతోఇంతో సహాయం అందించారని గుర్తుచేసుకున్నారు. చ‌ర్మిల విషాదకర పరిస్థితిని తెలుసుకున్న సినీ అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. రీల్ లైఫ్‌లో ఎంతో సంతోషంగా కనిపించే నటీనటులు రియల్ లైఫ్‌లో ఇలాంటి కష్టాలు పడటం విచారకరమని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం షర్మిల చిన్న చిన్న పాత్రలు, బుల్లితెర షోల ద్వారా మళ్లీ కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాలు ఆమెకు తగిన అవకాశాలు ఇచ్చి ఆదుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో 'నేషనల్ క్రష్'గా పేరు తెచ్చుకున్న అందాల భామ రష్మిక మందన్న సరికొత్త ఘనతను సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ క్రేజీ హీరోయిన్, ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణెను కూడా దాటేసి భారతదేశంలోనే అత్యంత పాపులర్ సెలబ్రిటీగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఐఎమ్‌డిబి (IMDb) విడుదల చేసిన అత్యంత ప్రాచుర్యం పొందిన భారతీయ తారల తాజా జాబితాలో రష్మిక మందన్న ప్రథమ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా సినీ అభిమానుల నుంచి లభించిన ఆదరణ, సోషల్ మీడియా ట్రెండ్స్ మరియు ఆమె నటిస్తున్న సినిమాల క్రేజ్ ప్రాతిపదికన ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు. ఈ రేసులో రష్మిక అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, దీపికా పదుకొణె రెండవ స్థానానికి పరిమితమైంది. అంతేకాకుండా, సౌత్ లేడీ పవర్ హౌస్ సాయి పల్లవి ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. సౌత్ నటీమణులు జాతీయ స్థాయిలో ఈ స్థాయిలో హవా చాటడంపై సినీ వర్గాలు మరియు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'ఛలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక, తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత 'పుష్ప: ది రైజ్' మరియు 'పుష్ప: ది రూల్' సినిమాలతో గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో 'యానిమల్' వంటి భారీ బ్లాక్‌బస్టర్‌తో మరింత క్రేజ్ సంపాదించి, పాన్ ఇండియా రేంజ్‌లో తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం రష్మిక లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సరసన నటిస్తూనే, వరుసగా బాలీవుడ్ మరియు సౌత్ బిగ్ ప్రాజెక్టులలో నటిస్తోంది. మరోవైపు సాయి పల్లవి కూడా పాన్ ఇండియా లెవల్లో నటిస్తున్న 'రామాయణ్' వంటి క్రేజీ చిత్రాలతో విశేషమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా రష్మిక అభిమానులు ఈ అరుదైన మైలురాయిని విశేషంగా వేడుక చేసుకుంటున్నారు. "రియల్ నేషనల్ స్టార్ రష్మిక" అంటూ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో హ్యాష్ ట్యాగ్‌లతో పోస్టులు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వరుస హిట్లు, పాన్ ఇండియా ప్రాజెక్టులతో దండయాత్ర చేస్తున్న రష్మిక మందన్న రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియన్ సినీ హిస్టరీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా ఈ నేషనల్ క్రష్ వేగంగా అడుగులు వేస్తోంది.       [Rashmika Mandanna IMDb Ranking, Rashmika Mandanna No 1 National Star, Sai Pallavi Top 4 IMDb, Deepika Padukone vs Rashmika, Telugu Cinema Popular Actresses]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నేటి ఆధునిక డిజిటల్ యుగంలో చిన్న పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఇంట్లో పిల్లలు ఏడుపు ఆపడానికైనా, రచ్చ చేయకుండా సమయానికి అన్నం తినిపించడానికైనా చాలామంది తల్లిదండ్రులు వెంటనే సులువైన మార్గంగా తమ చేతిలోని స్మార్ట్‌ఫోన్ తీసి పిల్లల చేతిలో పెట్టడం లేదా టీవీలో కలర్‌ఫుల్ కార్టూన్లు పెట్టడం సర్వసాధారణమైన అలవాటుగా మారిపోయింది. కానీ, ఈ అలవాటు మీ పిల్లల భవిష్యత్తును తీవ్రమైన ప్రమాదంలోకి నెడుతోందని పిల్లల వైద్య నిపుణులు మరియు తాజా అధ్యయనాలు స్పష్టమైన హెచ్చరికలు చేస్తున్నాయి. ముఖ్యంగా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లల్లో అధికంగా ఉండే ఈ స్క్రీన్ టైమ్ వారి శారీరక, మానసిక వికాసంపై అత్యంత ప్రతికూల ప్రభావం చూపుతోందని నూతన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ అధ్యయనం ప్రకారం చిన్నతనంలో పిల్లలు అధికంగా డిజిటల్ స్క్రీన్లు చూడటం వల్ల కలిగే ప్రధాన నష్టాల్లో మొదటిది మాటలు రావడం తీవ్రంగా ఆలస్యం కావడం. సాధారణంగా 0 నుండి 6 ఏళ్ల వయస్సులో పిల్లలు తమ చుట్టూ ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాట్లాడే మాటలు, వారి ముఖ కవళికలు మరియు హావభావాలను నిశితంగా గమనిస్తూ సహజంగా భాషను నేర్చుకుంటారు. అయితే నిరంతరం స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్ డిస్‌ప్లే వైపే చూస్తుండటం వల్ల అక్కడ కేవలం ఏకపక్ష సమాచారం మాత్రమే జరుగుతుంది. దీనివల్ల సంభాషణ కొరవడి, పిల్లల్లో సకాలంలో మాటలు రాకపోవడం మరియు భాషా నైపుణ్యాలు పూర్తిగా లోపించడం జరుగుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరొక తీవ్రమైన సమస్య పిల్లల మానసిక వికాసం మందగించడం మరియు శ్రద్ధ లోపించడం. నిరంతరం డిజిటల్ స్క్రీన్ల చిత్ర విచిత్రమైన వెలుగులు చూడటం వల్ల పిల్లల మెదడు అభివృద్ధి వేగం తగ్గుతుంది. వారు ఏ ఒక చిన్న విషయంపైనా ఎక్కువ సేపు దృష్టి కేంద్రీకరించలేరు. అంతేకాకుండా, వారి చేతిలో ఉన్న ఫోన్‌ను అనుకోకుండా లాక్కుంటే విపరీతమైన కోపం ప్రదర్శించడం, చిరాకు పడటం, గట్టిగా ఏడవడం మరియు మొండితనం చూపించడం వంటి మానసిక వైపరీత్యాలకు గురవుతున్నారు. దీంతో పాటు డిజిటల్ சாதனాల నుండి వెలువడే ప్రమాదకర నీలి కాంతి (Blue Light) పిల్లల లేత కంటి చూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. చాలా చిన్న వయస్సులోనే సైట్ రావడం, కళ్లు పొడిబారడం వంటి తీవ్రమైన శారీరక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నీలి కాంతి మెదడులో నిద్రకు సహకరించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని భారీగా తగ్గిస్తుంది, దీనివల్ల పిల్లలు రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రపోక తీవ్ర నిద్రలేమితో బాధపడుతున్నారు. బయటకు వెళ్లకుండా, ఆటలు ఆడకుండా ఒకే చోట గంటల తరబడి కూర్చుని ఫోన్ చూడటం వల్ల 6 ఏళ్ల లోపు పిల్లల్లో ఊబకాయం మరియు శారీరక బలహీనత వంటి సమస్యలు రాపిడ్‌గా పెరుగుతున్నాయి.       smartphone dangers toddlers study,speech delay kids screen time.
ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న శరీర బరువు, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే మొండి కొవ్వు ప్రతి ఒక్కరినీ తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్య. ఈ జిడ్డు కొవ్వును కరిగించుకోవడానికి, బరువు తగ్గి సన్నబడటానికి చాలామంది ఎన్నో రకాల వ్యాయామాలు, కఠినమైన డైటింగ్ పద్ధతులు అనుసరిస్తుంటారు. అయితే, అతి సులువైన మరియు ప్రాచుర్యం పొందిన గృహ చిట్కాలలో బ్లాక్ కాఫీ తాగడం ఒకటిగా మారింది. పాలు, చక్కెర మరియు ఎటువంటి స్వీట్నర్లు లేకుండా కేవలం వేడి నీటితో మాత్రమే తయారుచేసే ఈ బ్లాక్ కాఫీ నిజంగానే పొట్ట కొవ్వును కరిగించడంలో ఎంతవరకు సహాయపడుతుంది, దీని వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ రహస్యాలు ఏమిటి మరియు ఇది తాగేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన ఆరోగ్య నియమాలు ఏమిటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. అసలు బ్లాక్ కాఫీ బరువు తగ్గించడంలో ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే అందులోని కేలరీలు మరియు కెఫిన్ పాత్రను తెలుసుకోవాలి. సాధారణ బ్లాక్ కాఫీలో కేలరీలు దాదాపు శూన్యం. మనం తాగే బ్లాక్ కాఫీలోని కెఫిన్ శరీరంలోని మెటబాలిజం రేటును లేదా జీవక్రియ వేగాన్ని గణనీయంగా పెంచుతుంది. మన జీవక్రియ వేగవంతం కావడం వల్ల శరీరం విశ్రాంతిగా ఉన్న సమయంలో లేదా సాధారణ పనులు చేసుకుంటున్నప్పుడు కూడా ఎక్కువ కేలరీలను వేగంగా బర్న్ చేయగలుగుతుంది. ఇది బరువు తగ్గడానికి ప్రాథమిక పునాదిగా పనిచేస్తుంది. దీనికితోడు, బ్లాక్ కాఫీలో 'క్లోరోజెనిక్ ఆసిడ్' అనే అత్యంత శక్తివంతమైన ముఖ్యాంశ కాంపౌండ్ లభిస్తుంది. ఈ క్లోరోజెనిక్ ఆసిడ్ శరీరంలో కొత్తగా గ్లూకోజ్ ఉత్పత్తి కాకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరం కొత్తగా కొవ్వును తయారు చేసుకోకుండా అడ్డుకోవడమే కాకుండా, ఇప్పటికే కణజాలాల్లో పేరుకుపోయిన పాత కొవ్వును వేగంగా కరిగించి శక్తిగా మార్చడంలో ఇది అద్భుతంగా తోడ్పడుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో బ్లాక్ కాఫీ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆకలిని సమర్థవంతంగా నియంత్రించడం. బ్లాక్ కాఫీ తాగిన వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అకస్మాత్తుగా వచ్చే ఆకలి కోరికలను తగ్గిస్తుంది మరియు సమయానికి మించి ఆహారాన్ని అమితంగా తినకుండా అరికడుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో అన్-హెల్దీ స్నాక్స్ తినే అలవాటు ఉన్నవారు, ఆ సమయంలో ఒక కప్పు బ్లాక్ కాఫీ తీసుకుంటే కేలరీల వినియోగం చాలావరకు తగ్గుతుంది. అంతేకాకుండా, మీరు వ్యాయామం లేదా జిమ్ వర్కౌట్ చేయడానికి సరిగ్గా 30 నిమిషాల ముందు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి మరియు అదనపు స్టామినా లభిస్తాయి. ఇది వ్యాయామం చేసే సమయంలో కండరాల అలసటను తగ్గించి, శరీరం వేగంగా కొవ్వును బర్న్ చేసేలా ప్రోత్సహిస్తుంది.       does black coffee burn belly fat,black coffee health benefits telugu.  
  మనదేశంలో చాలామందికి ఉదయాన్నే లేవగానే వేడివేడిగా ఒక కప్పు టీ పడాల్సిందే. అలసటను పారద్రోలి శరీరానికి, మనస్సుకు తక్షణ ఉత్సాహాన్ని ఇవ్వడంలో టీ కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు ఒకటి రెండు కప్పుల టీ తాగడం సాధారణ అలవాటు అయినప్పటికీ, చాలామంది రోజులో పదే పదే టీ తాగుతుంటారు. అయితే, ఇలా పరిమితికి మించి ఎక్కువ మొత్తంలో టీ తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయని, శరీరంలో కాల్షియం స్థాయిలు గణనీయంగా పడిపోతాయని సోషల్ మీడియాలో నిరంతరం వార్తలు ప్రచారమవుతుంటాయి. ఈ ప్రచారం వినగానే టీ ప్రేమికుల్లో తీవ్ర ఆందోళన మొదలవుతుంది. అసలు టీ తాగడానికి, ఎముకల ఆరోగ్యానికి మధ్య ఉన్న అసలు సంబంధం ఏమిటి? అతిగా టీ తాగడం వల్ల ఎముకల సాంద్రత తగ్గి ఆస్టియోపోరోసిస్ వంటి ప్రమాదకర సమస్యలు వస్తాయా? ఈ విషయాలపై వైద్య నిపుణులు మరియు పరిశోధకులు వెల్లడించిన శాస్త్రీయ నిజాలను వివరంగా తెలుసుకోవడం ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. పరిశోధనల ప్రకారం టీలో  కెఫిన్  అనే సమ్మేళనం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ప్రతి కప్పు టీలో దాదాపు 30 నుండి 50 మిల్లీగ్రాముల వరకు కెఫిన్ ఉంటుంది. మనం అధిక మొత్తంలో కెఫిన్ తీసుకున్నప్పుడు, అది మూత్రపిండాల (కిడ్నీల) ద్వారా శరీరంలోని కాల్షియం మూత్రం రూపంలో బయటకు విసర్జించబడేలా చేస్తుంది. సాధారణంగా మనం ప్రతి 60 మిల్లీగ్రాముల కెఫిన్ తీసుకున్నప్పుడు, శరీరం నుండి సుమారు 1 నుండి 2 మిల్లీగ్రాముల కాల్షియం నష్టపోతామని వైద్య అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే రోజుకు 4 నుండి 5 కప్పుల కంటే ఎక్కువ మోతాదులో టీ తాగే వారిలో కాల్షియం లోపం ఏర్పడే అవకాశాలు స్వల్పంగా పెరుగుతాయి. ముఖ్యంగా, మనం తీసుకునే రోజువారీ ఆహారంలో కాల్షియం శాతం తక్కువగా ఉన్నప్పుడు, ఈ కెఫిన్ ప్రభావం ఎముకల ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఎముకల నుండి కాల్షియం కరిగిపోవడం వల్ల వయసు పెరిగే కొద్దీ ఎముకలు లొసుగుబారి, త్వరగా విరిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే ఇక్కడే మరొక ఆసక్తికరమైన సైంటిఫిక్ కోణం దాగి ఉంది. టీలో కేవలం కెఫిన్ మాత్రమే కాకుండా  ఫ్లేవనాయిడ్లు  (Flavonoids) మరియు  ఫైటోఈస్ట్రోజెన్లు  అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల క్షీణతను అడ్డుకోవడంలో మరియు ఎముకల సాంద్రతను (Bone Mineral Density) మెరుగుపరచడంలో ఎంతో సాయపడతాయి. ముఖ్యంగా గ్రీన్ టీ మరియు బ్లాక్ టీలలో ఉండే పాలిఫెనాల్స్ అనే కాంపౌండ్లు ఎముకలను పునర్నిర్మించే  ఆస్టియోబ్లాస్ట్  కణాల పనితీరును వేగవంతం చేస్తాయని, అదే సమయంలో ఎముకలను కరిగించే  ఆస్టియోక్లాస్ట్  కణాల చర్యలను అదుపు చేస్తాయని రీసెర్చ్‌లో తేలింది. కాబట్టి మిితంగా అంటే రోజుకు 2 నుండి 3 కప్పుల టీ తాగే వారిలో ఎముకలు బలహీనపడటం అటుంచి, పైగా ఎముకల ఆరోగ్యం మరింత బలపడుతుందని బహుళ అధ్యయనాలు నిరూపించాయి. మరి టీ తాగే అలవాటు ఉన్నవారు ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటిది టీ తాగే పరిమాణాన్ని రోజుకు 2 లేదా 3 కప్పులకు పరిమితం చేసుకోవడం చాలా మంచిది. రెండవది, టీ చేసేటప్పుడు అందులో తగినంత పాలు ఉపయోగించడం వల్ల, టీ ద్వారా కోల్పోయే స్వల్ప కాల్షియంను పాలలోని ఉత్కృష్టమైన కాల్షియం భర్తీ చేస్తుంది. భోజనం చేసిన వెంటనే లేదా ఐరన్, కాల్షియం సప్లిమెంట్లు తీసుకునే సమయంలో టీ తాగకపోవడం ఉత్తమం, ఎందుకంటే టీలోని టాన్సిన్లు పోషకాల శోషణను అడ్డుకుంటాయి. మీ రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు, ఆకుకూరలు, రాగులు మరియు విటమిన్ డి లభించే పదార్థాలను సమృద్ధిగా చేర్చుకుంటే టీ వల్ల ఎముకలకు ఎలాంటి నష్టం జరగదు. కాబట్టి టీని పరిమితంగా, సరైన పద్ధతిలో ఆస్వాదిస్తే ఆరోగ్యానికి ఎలాంటి భయం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. How much tea is safe for bones,tea and bone health myths vs reality.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం. ట్రికట చూర్ణం, ధనియాల పొడి, పసుపు పొడి వంటి మూడు పదార్థాలను సరైన మోతాదులో ఎలా కలపాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? రోజులో ఏ సమయంలో తీసుకుంటే మంచిది? వంటి విషయాలను ఈ వీడియోలో సులభంగా వివరించారు. థైరాయిడ్‌కు సంబంధించిన సమస్యల్లో ఇంటి చిట్కాలను పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. ఇప్పటికే థైరాయిడ్ మందులు వాడుతున్నవారు వైద్యుల సూచన లేకుండా మందులను ఆపకండి లేదా మార్చకండి. థైరాయిడ్ ఆరోగ్యం, ఆయుర్వేద చిట్కాలు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health‌ను ఫాలో అవ్వండి. Disclaimer: ఈ వీడియోలోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు.  
అన్ని జీవరాశులకు ఆహారమే శక్తినవనరు. అయితే మనిషికి మాత్రం ఆహారంలో ఎన్నో ఛాయిస్ లు ఉన్నాయి. కానీ  ఏది పడితే అది, ఎలా పడితే అలా తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. కొందరు అనారోగ్యం చేసినప్పుడు లేదా కొన్ని రకాల ట్రీట్మెంట్ లలో ఉన్నప్పుడు పత్యం చేయమని చెబుతారు.   పత్యం ఆహారంలో ఉన్నప్పుడు వంకాయను తినకూడదని చెబుతూ ఉంటారు.  సాధారణంగా  సాంప్రదాయ ఆయుర్వేదం, నాటు వైద్యంలో కొన్నిరకాల అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి వంకాయ తినకూడదని సిఫారసు చేస్తారు.  సాధారణ రోజుల్లో వంకాయ రుచికరమైన, పోషకాలున్న కూరగాయ అయినప్పటికీ, పత్యం వేళల్లో దీనిని మినహాయించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వంకాయను పత్యం ఉన్నప్పుడు ఎందుకు తీసుకోకూడదో వివరంగా తెలుసుకుంటే.. వంకాయ.. వంకాయను ఆయుర్వేదంలో వాత, పిత్త దోషాలను పెంచే ఆహారంగా పరిగణిస్తారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఉన్నప్పుడు లేదా రోగ నివారణకు పత్యం ఉంటున్నప్పుడు వంకాయ తింటే వాత దోషం పెరిగి నొప్పులు, జాయింట్లలో ఇబ్బందులు వస్తాయి. వంకాయ విత్తనాల్లో , తోలులో కొన్ని రకాల సహజ కాంపౌండ్లు ఉంటాయి. ఇవి సున్నితమైన చర్మం ఉన్నవారిలో, లేదా ఇప్పటికే దద్దుర్లు, దురదలు, అలర్జీలతో బాధపడుతున్న వారిలో సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ఔషధాల ప్రభావం సరిగ్గా పనిచేయాలన్నా చర్మ సంబంధిత పత్యంలో వంకాయకు దూరంగా ఉండాలి. వంకాయ అరుగుదలకు కాస్త సమయం తీసుకుంటుంది. శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు జీర్ణక్రియ మందగిస్తుంది. అటువంటి సమయంలో సులభంగా అరగని వంకాయను తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో ఎక్కడైనా గాయాలు, పుండ్లు ఉన్నప్పుడు లేదా శస్త్రచికిత్సలు జరిగినప్పుడు నాటు వైద్యంలో ప్రత్యేక పత్యం సూచిస్తారు. వంకాయ శరీరంలో వేడిని,   దురదను పెంచి పుండ్లు త్వరగా మానకుండా అడ్డుకుంటుందని చెప్తారు. వంకాయ సోలనేసి కుటుంబానికి చెందిన కూరగాయ. ఇందులో సోలనైన్ అనే కాంపౌండ్ ఉంటుంది. సాధారణ ఆరోగ్యంతో ఉన్నవారికి ఇది పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా, పత్యం చేసేవారిలో , మందులు వాడేవారిలో ఇది జీర్ణ వ్యవస్థపై , నాడీ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్లనే పత్యం సమయంలో శరీరం త్వరగా కోలుకోవడానికి, ఔషధాలు ఎలాంటి సమస్య లేకుండా పనిచేయడానికి వంకాయకు దూరంగా ఉండాలని పెద్దలు , ఆయుర్వేద వైద్యులు సలహా ఇస్తారు. పత్యం పూర్తయి శరీరం పూర్తి ఆరోగ్యాన్ని పుంజుకున్న తర్వాతే వంకాయను ఆహారంలో తిరిగి చేర్చుకోవడం మంచిది.                          *రూపశ్రీ.
నేటి డిజిటల్ యుగంలో ఆరోగ్య స్పృహ, ఫిట్‌నెస్ పట్ల శ్రద్ద పెరిగాయి. జిమ్‌లకు వెళ్లేవారు, బరువు తగ్గాలనుకునేవారు లేదా కండరాల పుష్టి కోసం ప్రయత్నం చేసేవారు ప్రోటీన్ షేక్స్, హెల్త్ సప్లిమెంట్లు, డిజైనర్ ప్రోటీన్ బార్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కానీ, మన తాతల తండ్రుల కాలంలో ఎలాంటి ప్రొటీన్ పౌడర్లు ఉండేవి కావు. అయినా వారు ఎంతో బలంగా, శక్తివంతంగా, దీర్ఘకాలిక ఆరోగ్యంతో జీవించారు. దానికి కారణం వారు రోజూ తీసుకునే సంప్రదాయ భారతీయ ఆహారమే! మన ప్రాంతీయ వాతావరణం, రుతుపవనాలు , పాతకాలపు వంట పద్ధతుల ఆధారంగా మన పళ్లెంలో చేరే రోజూవారీ ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా లభించేవి. ఆధునిక ఆహార అలవాట్ల వల్ల కాలక్రమేణా మనం మరచిపోయిన, కానీ మన తాతల కాలంలో క్రమం తప్పకుండా తిన్న 10 శక్తివంతమైన ప్రోటీన్ ఆహారాలు ఉన్నాయి.  నిజానికి ఇవన్నీ ప్రోటీన్ సూపర్ ఫుడ్స్.. అవేంటో తెలుసుకుంటే..  ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం:  ఉలవలు.. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఇంట్లో క్రమం తప్పకుండా వాడే ధాన్యాల్లో ఉలవలు ముఖ్యమైనవి. శాకాహారంలో ప్రోటీన్ అత్యధికంగా లభించే ఆహారాల్లో ఇది ఒకటి. మన తాతలు రోజంతా కష్టపడి పనిచేయడానికి అవసరమైన శక్తిని ఈ ఉలవలే ఇచ్చేవి. ఉలవ చారు, ఉలవ పప్పు, చట్నీలు లేదా గుగ్గిళ్ల  రూపంలో వీటిని తీసుకునేవారు. ప్రోటీన్‌తో పాటు ఇందులో ఐరన్, పీచు పదార్థం , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీ రాళ్లను నివారించడంలోనూ, శరీరంలో కొవ్వును తగ్గించడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. సత్తు పిండి.. ఇది శనగలను వేయించి, మెత్తగా పొడి చేసి తయారుచేసే సంప్రదాయ ఆహారం. ప్రోటీన్ షేక్స్‌కు ఇది పూర్వీకుల కాలం నాటి దేశీ వెర్షన్ అని చెప్పవచ్చు. వేసవికాలంలో సత్తు పిండిని నీళ్లు, నిమ్మరసం, మసాలాలతో కలిపి  తాగేందుకు వాడేవారు. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. నాణ్యమైన ప్రోటీన్ , ఫైబర్ ఉన్న సత్తు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. నల్ల శనగలు.. ఈ రోజుల్లో తెల్ల శనగలు వాడకం పెరిగినప్పటికీ, పూర్వకాలంలో నల్ల శనగలదే హవా రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే గుడాలుగా  తినడం లేదా కూరల్లో వాడటం చేసేవారు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వేయించిన నల్ల శనగలను తీసుకెళ్లేవారు. ఇవి త్వరగా పాడవవు, తింటే కడుపు నిండుగా ఉంటుంది. ఇవి ప్లాంట్ బేస్డ్   ప్రోటీన్‌తో పాటు ఐరన్‌ను సమృద్ధిగా అందిస్తాయి.  బొబ్బర్లు / అలసందలు.. బొబ్బర్లు లేదా అలసందలు ఒకప్పుడు ప్రతీ ఇంట్లోనూ రెగ్యులర్‌గా వండే కూర ధాన్యం. వీటిలో అత్యధిక మోతాదులో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్ , ఐరన్ ఉంటాయి. నాటు దినుసులు , మసాలాలతో నెమ్మదిగా ఉడికించి చేసే బొబ్బర్ల కూర లేదా గుడాలు శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. మట్కీ / మోత్ బీన్స్.. రాజస్థాన్ వంటి పొడి వాతావరణం కలిగిన ప్రాంతాలలో ఎక్కువగా పండే మట్కీ లేదా మోత్ బీన్స్ చిన్నగా ఉన్నప్పటికీ పోషకాల గని. ఇవి చూడటానికి పెసల సైజ్ లో ఉంటాయి. కానీ వీటి రంగు మాత్రం భిన్నంగా ఉంటుంది.  తక్కువ నీటితో పండే ఈ పంట రైతులకు, ప్రజలకు ప్రధాన ప్రోటీన్ మూలంగా ఉండేది. వీటిని మొలకలెత్తించి తినడం లేదా కారంగా కూర వండుకోవడం చేసేవారు. ధాన్యాలను మొలకెత్తించడం వల్ల వాటిలోని ప్రోటీన్ , ఇతర పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుందని మన పూర్వీకులకు ముందే తెలుసు. మినపప్పు.. నేడు మినపప్పును కేవలం ఇడ్లీ, దోస పిండి లేదా పోపులకే పరిమితం చేశాం. కానీ, పూర్వకాలంలో మినపప్పుతో వడలు, మినప రొట్టెలు, మినప సున్నుండలు వంటి బలమైన పదార్థాలు తయారుచేసి తినేవారు. మినపప్పులో ప్రోటీన్‌తో పాటు క్యాల్షియం, పొటాషియం, ఐరన్ మెండుగా ఉంటాయి. బియ్యం లేదా తృణధాన్యాలతో కలిపి మినపప్పును తిన్నప్పుడు అది శరీరానికి పూర్తిస్థాయి ప్రోటీన్‌ను అందిస్తుంది.  ఇంట్లోనే తయారుచేసిన తాజా పనీర్.. పాకెట్లలో లభించే ప్యాక్ చేసిన పనీర్ కాకుండా, మన అమ్మమ్మలు గేదె లేదా ఆవు పాల నుంచి తాజా నిమ్మరసం పిండి పనీర్ తయారు చేసేవారు. ఈ తాజా పనీర్‌లో ఎలాంటి రసాయనాలు ఉండవు. ఇది నాణ్యమైన ప్రోటీన్ , క్యాల్షియంను ఉచితంగా శరీరానికి అందిస్తుంది. ఎముకల గట్టితనానికి, కండరాల పునరుద్ధరణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.  వేయించిన వేరుశనగలు..   నట్స్ అనగానే ఈ రోజుల్లో బాదం, జీడిపప్పు, పిస్తా గుర్తుకొస్తాయి. కానీ పేదవాడి బాదం పప్పు అయిన వేరుశనగలు పోషకాల్లో దేనికీ తీసిపోవు. సాయంత్రం పూట తినుబండారంగా, లేదా బెల్లంతో కలిపి పల్లీ పట్టీ రూపంలో పూర్వీకులు వీటిని రోజూ తినేవారు. వేరుశనగల్లో ప్రోటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. రాజగిరా / అమరాంత్ గింజలు.. రాజగిరాను  ఉపవాసాల సమయంలో ఎక్కువగా తింటుంటారు. కానీ పూర్వకాలంలో దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకునేవారు. రాజగిరా గింజల్లో శరీరం స్వయంగా తయారుచేసుకోలేని 9 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది సంపూర్ణ ప్రోటీన్ కలిగిన అతికొద్ది వృక్షాహారాలలో ఒకటి. రాజగిరా లాడ్డు, జావ, రొట్టెల రూపంలో  తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. నువ్వులు .. పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ నువ్వులలో ఉండే పోషకాలు అపారం. నువ్వుల పొడి, నువ్వుల చట్నీ, నువ్వుల ఉండలు మన సంప్రదాయ ఆహారంలో భాగం. నువ్వులలో కేవలం క్యాల్షియం, మంచి కొవ్వులే కాకుండా విలువైన ప్రోటీన్ కూడా ఉంటుంది. నువ్వులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కండరాలు బలంగా మారడమే కాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫిట్‌నెస్ అంటే విదేశీ ఆహార అలవాట్లను లేదా ప్యాక్ చేసిన హెల్త్ పౌడర్లను గ్రైండ్ చేయడం కాదు. మన ఇంట్లోనే, మన పూర్వీకులు తిన్న సంప్రదాయ ధాన్యాలు , పప్పు దినుసులలోనే శరీరానికి అవసరమైన అసలైన బలం దాగి ఉంది.  దైనందిన ఆహారంలో మళ్లీ ఈ పాతకాలపు ఆహారాలను భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన శరీరం లభిస్తుంది.