LATEST NEWS
  కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి.. తెలంగాణ రాజకీయాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల సంఘం చేపడుతున్న 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా తేలికగా తీసుకోవద్దని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యంత తీవ్రంగా హెచ్చరించారు.  ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, భవిష్యత్తు ఎన్నికల్లో ఊహించని రాజకీయ పరిణామాలు మరియు భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ ఆన్‌లైన్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ మరియు ఏఐసీసీ ఇన్-ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌లతో కలిసి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అనుమానాస్పదంగా ఉన్నాయనే నెపంతో అర్హులైన నిజమైన ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించే ప్రమాదం ఉందని, దీనిపై గ్రామ మరియు బూత్ స్థాయిలో ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ సవరణ ప్రక్రియ ద్వారా అక్టోబర్ 2026 నాటికి తుది ఓటర్ల జాబితా ఖరారు కానుంది. ఈ అక్టోబర్ 2026 నాటి జాబితాయే 2028 లో జరగబోయే సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు అత్యంత కీలకమైన ఆధారం కానుందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు ఒక్క ఓటు కోల్పోయినా, భవిష్యత్తులో దాన్ని సరిదిద్దడం మరియు తిరిగి చేర్చడం అత్యంత కష్టతరమైన పనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  గతంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 90 రోజుల్లోనే మొత్తం 45 లక్షల డిజిటల్ సభ్యత్వాలను విజయవంతంగా నమోదు చేసి రికార్డు సృష్టించిందని, ఆనాడు బూత్ స్థాయిలో చురుగ్గా పనిచేసిన ఎన్‌రోలర్ల సేవలను ఇప్పుడు కూడా ఈ SIR ప్రక్రియ కోసం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా, హైదరాబాద్‌ నగర పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వీటి పర్యవేక్షణ బాధ్యతలను రాజ్యసభ సభ్యులు మరియు ఎమ్మెల్సీలకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు.   ఉపాధి కోసం తాత్కాలికంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన పేదలు, గిరిజనులు, దళితులు, మైనారిటీలు మరియు మహిళా ఓటర్ల పేర్లు కేవలం వారు వెరిఫికేషన్ సమయంలో ఇళ్లలో లేరనే కారణంతో ఓటర్ల జాబితా నుండి తొలగించబడకుండా చూసుకోవాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ప్రతినిధులదేనని సీఎం స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలోనూ బూత్ లెవెల్ అధికారులతో (BLO) నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఓట్ల తొలగింపును అడ్డుకోవాలన్నారు.  ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మరియు నియోజకవర్గాల వారీగా పర్యవేక్షించేందుకు జూన్ 20 లోగా జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రులు సంబంధిత నియోజకవర్గ ఇన్-ఛార్జ్‌లతో సమీక్షా సమావేశాలు పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు వీలుగా గాంధీ భవన్‌లో ప్రత్యేకంగా ఒక 'వార్ రూమ్' ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు కార్పొరేషన్ ఛైర్మన్లు ప్రతి 10 రోజులకు ఒక రోజు చొప్పున, తాను సైతం నెలకు 3 రోజులు పూర్తిగా పార్టీ సంస్థాగత బలోపేతం మరియు క్షేత్రస్థాయి పరిశీలన కోసం కేటాయిస్తానని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.    
  పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో అత్యంత కీలక నేతలుగా ఉండి, ప్రస్తుతం పరస్పరం కత్తులు దూసుకుంటున్న ఇద్దరు అగ్ర నాయకుల మధ్య ఉన్న పాత బంధం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. టీఎంసీ ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహువా మోయిత్రా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత సువేందు అధికారి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.  ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మహువా మోయిత్రా తన రాజకీయ జీవితంలోని అత్యంత క్లిష్టమైన రోజులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు ఎంపీ టికెట్ దక్కకపోవడంతో తాను పడిన మానసిక వేదనను ఆమె పంచుకున్నారు. ఆ సమయంలో టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురై, రాత్రంతా ఏడ్చానని, ఆ కష్టకాలంలో తనకు వెన్నుముకగా నిలిచి ఓదార్చిన ఏకైక వ్యక్తి శుభేందు అధికారి మాత్రమేనని మహువా సంచలన నిజాలను వెల్లడించారు.  రాజకీయంగా ఇప్పుడు విభిన్న ధృవాలుగా విడిపోయినప్పటికీ, సువేందు అధికారితో తనకు ఇప్పటికీ ఒక బలమైన 'ఎమోషనల్ కనెక్షన్' ఉందని ఆమె స్పష్టం చేశారు. తన తొలి రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ, 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కరీంపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసినప్పుడు టీఎంసీలోని ఏ ఒక్క సీనియర్ నాయకుడు కూడా తన కోసం ప్రచారం చేయడానికి రాలేదని మహువా పేర్కొన్నారు. కానీ ఆ రోజుల్లో పార్టీలో నెంబర్ టు స్థానంలో ఉన్న శుభేందు అధికారి స్వయంగా వచ్చి తన తరఫున మొదటి ఎన్నికల ర్యాలీలో పాల్గొని మద్దతుగా నిలిచారని చెప్పారు.  నేటికీ ఆనాటి ఫోటోలు చూస్తే అందులో కేవలం తను, సువేందు మాత్రమే కనిపిస్తారని ఆమె గుర్తుచేశారు. 2020లో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలతో వచ్చిన విభేదాల వల్ల శుభేందు అధికారి టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని నందిగ్రామ్‌తో పాటు భవానీపూర్‌లో వరుసగా రెండుసార్లు ఓడించి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ప్రస్తుతం బెంగాల్ సీఎం పీఠంపై ఉన్న శుభేందుతో తనకు ఇప్పుడు నిరంతర సంభాషణలు లేకపోయినప్పటికీ, వ్యక్తిగత సంబంధాలు ఎప్పుడూ పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉంటాయని, నాడు ఆయన చేసిన సహాయాన్ని తాను ఎప్పటికీ మరువలేనని మహువా మోయిత్రా కుండబద్దలు కొట్టారు.  ప్రస్తుతం టీఎంసీ పార్టీలో తీవ్ర అసమ్మతి రేగి, దాదాపు 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది తిరుగుబాటు పక్షాన ఉన్నారనే వార్తలు వస్తున్న తరుణంలో మహువా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. లోక్‌సభలో కూడా 20 మంది టీఎంసీ ఎంపీలు వేరే పార్టీలో విలీనమై బీజేపీకి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో, మహువా మోయిత్రా పార్టీ మారబోతున్నారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, తాను టీఎంసీని వీడే ప్రసక్తే లేదని, మమతా బెనర్జీయే అసలైన తృణమూల్ అని ఆమె స్పష్టం చేశారు.  అదే సమయంలో, గతంలో పార్టీని వీడిన తిరుగుబాటుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, పార్టీ మారాలనుకుంటే శుభేందు అధికారి లాగా పారదర్శకంగా, ధైర్యంగా మారాలని, అంతేకానీ లోపల ఉంటూ గోతులు తవ్వకూడదని హితవు పలికారు. బీజేపీ క్రమశిక్షణ గల క్యాడర్ ఆధారిత పార్టీ అని, అది కేవలం ఒకే ఒక్క వ్యక్తిపై ఆధారపడి నడవదని చెబుతూనే, టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని మహువా తేల్చి చెప్పారు. ఏది ఏమైనప్పటికీ, బెంగాల్ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న మహువా, శుభేందుల పాత స్నేహం గురించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.  
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు  మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల అనంతర పరిణామాలను గమనిస్తే.. వైసీపీ కుల రాజకీయాలపై ఫోకస్ పెట్టిందని స్పష్టమౌతోంది.  ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై  చర్చించారు. ఈ కాపు శంఖారావం వెనుక బలమైన రాజకీయ వ్యూహం దాగి  ఉందని ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ అన్నారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కాపు సామాజికవర్గ పాకెట్ ను వేదికగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆ సామాజిక వర్గ ఓట్లను ఏకీకృతం చేయాలన్న వ్యూహంతో వైసీపీ ముందుకు సాగుతున్నట్లు విశ్లేషించారు. ఉమ్మడి కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి అత్యంత బలమైన పట్టు ఉంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గానికి ఎంతటి రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం ఉందో, తూర్పుగోదావరిలో కాపులకు అంతటి శక్తి ఉంది. ఈ స్ట్రాంగ్ పాకెట్‌ను వేదికగా చేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు ఓటు బ్యాంకును వైసీపీ వైపు ఏకీకృతం (Consolidate) చేయడమే కాపు శంఖారావం భేటీ ప్రధాన ఉద్దేశమని భరద్వాజ వివరించారు. గతంలో కాపు సామాజిక వర్గం కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం, హరిరామజోగయ్య వంటి సీనియర్ నేతలు వయోభారం, అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాలకు కొంత దూరంగా జరుగుతున్న తరుణంలో, తోట త్రిమూర్తులు వైసీపీ తరఫున ఈ కొత్త బాధ్యతలను భుజానకెత్తుకున్నట్లు కనిపిస్తోందన్నారు. అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నేతలతో పోలిస్తే తోట త్రిమూర్తులకు ఉన్న ఆర్థిక బలం,  ఇమేజ్   సమన్వయ శక్తి ఈ వ్యూహానికి ప్రధాన బలంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యూహంలో భాగంగా వైసీపీ నేతలు ప్రధానంగా ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారనీ,  ఇటీవల సాయికృష్ణ మిస్పింగ్ ఉదంతంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరును వైసీపీ కాపు నేతలు తీవ్రంగా తప్పుపట్టడం వెనుక కారణమిదేనని ఆయన అన్నారు. సాయికృష్ణను కేవలం ఒక  రౌడీ షీటర్ గా అభివర్ణిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలను, పోలీసుల వైఫల్యాలను ప్రశ్నించకపోవడాన్ని కాపు సమాజం జీర్ణించుకోలేకపోతోందని వారు ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తానే స్వయంగా  నన్ను కేవలం కాపు నాయకుడిగా చూడొద్దు  అని అంటున్నప్పుడు..  మనం కూడా ఆయన్ను మన నాయకుడిగా గుర్తించాల్సిన అవసరం లేదనే భావనను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందనీ,  చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కాపులకు శత్రువేనని, ఇప్పుడు చంద్రబాబుతో అంటకాగుతున్న పవన్ కూడా కాపు వ్యతిరేకిగా మారిపోయాడన్న నేరేషన్ ను బలంగా ముందుకు తీసుకురావడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందని భరద్వాజ చెప్పారు.  పూర్వం కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుండి నలుగుతున్న  కాపులను బీసీల్లో చేర్చే పాత డిమాండ్‌ను చంద్రబాబు గతంలో హామీ ఇచ్చి నెరవేర్చలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఆ హామీలపై నిలదీయాలని వైసీపీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు కాపులకు ఏ చిన్న సమస్య వచ్చినా బాధ్యత తీసుకుంటామని వైసీపీ ప్రకటించడం కూడా ఇందులో భాగంగానే చూడాలన్నారు.  అయితే వైసీపీ వ్యూహం కేవలం కాపులకే పరిమితం కాలేదు. సమాంతరంగా దళిత ఓటు బ్యాంకును, మరీ ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు మరో వ్యూహాన్ని అమలు చేస్తోందన్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఎంఆర్పీఎస్   నాయకుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య ఉదంతాన్ని వైసీపీ  పోలీసుల వేధింపులకు ముడిపెట్టడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.   అప్పటివరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటూ, లోకేష్‌తో సైతం మంచి సంబంధాలు ఉన్న వెంకటేశ్వరరావు ఇంటికి వైసీపీ ముఖ్య నేతలు వెళ్లి పరామర్శించడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. గాజ సాయికృష్ణ ఎపిసోడ్ ద్వారా కాపులను, క్రాంతి కుమార్ ఉదంతం ద్వారా మాదిగ ఓటు బ్యాంకును కూటమి ప్రభుత్వానికి దూరం చేయాలనేది వైసీపీ వ్యూహంగా ఆయన వివరించారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అనే పాత ముద్రను మళ్లీ తెరపైకి తెస్తూ, గత 15 రోజుల్లో విజయవాడ కేంద్రంగా జరిగిన పోలీసు శాఖ వైఫల్యాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటున్నారు. ఈ విధంగా ఏపీలో మళ్లీ కులాల వారీగా ఓటు బ్యాంకులను ఏకీకృతం చేసేందుకు జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని భరద్వాజ అన్నారు. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకినాడ వేదికగా ఇటీవల  జరిగిన 'మా ఊరు - మాటామంతి' కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  వైసీపీ నేతలను ఉద్దేశించి ఆయన అత్యంత అగ్రెసివ్ టోన్‌లో హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ నాయకులు పరిధులు దాటి మాట్లాడుతున్నారని, భవిష్యత్తులో ఏం జరిగినా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు.  గత కొన్ని రోజులుగా   సాయికృష్ణ మిస్సింగ్ ఉదంతం నేపథ్యంలో కాపు సామాజిక వర్గ  ఓట్ బ్యాంక్‌ను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు చేస్తున్న విమర్శలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కారు. తాను కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, ఒకవేళ భవిష్యత్తులో (రెండేళ్లల్లోనో, మూడేళ్లల్లోనో) వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా సరే.. ఒక్కొక్కరిని తొక్కి నారతీస్తానంటూ ఘాటుగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వేనుక రాజకీయ వ్యూహం ఏమిటన్న దానిపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో..ప్రముఖ అనలిస్ట్ భరధ్వాజ లోతైన విశ్లేషణ చేశారు.   పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా..  కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్   పంపించారన్నారు.  తాను ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ధోరణి సూచిస్తోందని భరద్వాజ అన్నారు. మరోవైపు, పవన్ కళ్యాణ్ తనను పదేపదే కాపు సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం చేయవద్దని వైసీపీ నేతలకు గట్టిగా చెప్పారు. తాను కులాలకు అతీతుడిననీ, ప్రాంతీయవాదానికి అతీతంగా జాతీయ సమగ్రత కోసం పనిచేస్తానని పునరుద్ఘాటించారు. జనసేన పార్టీని ఐదు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నామని, రాబోయే రోజుల్లో ఢిల్లీలో జెండా ఎగరేయబోతున్నామని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని భరద్వాజ అన్నారు. అదే జరిగితే.. రాష్ట్రంలో ఆయన సోదరుడు నాగబాబుకు కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉందన్నారు.  ఈ పరిణామాలు కూటమి ప్రభుత్వంలోనూ చర్చకు దారితీస్తున్నాయి. గతంలో హోంమంత్రి అనిత పనితీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిన్నటి సభలోనూ ఆయన  నేను హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉండేవి కానీ నేను తీసుకోను' అని వ్యాఖ్యానించడం విశేషం. ఈ దూకుడు వ్యవహార శైలి    కల్ట్  పవన్ కళ్యాణ్‌ను తలపిస్తోందని, నిస్తేజంగా ఉన్న జనసైనికుల్లో మళ్లీ కొత్త ఉత్సాహాన్ని నింపేందుకే ఆయన ఈ తరహా అగ్రెసివ్ పంథాను ఎంచుకున్నారనీ భరద్వాజ విశ్లేషించారు. 
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రముఖ సర్వే సంస్థ  యూనికార్న్ పొలిటికల్ స్ట్రాటజీ సంచలన నివేదికను బయటపెట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో బాగానే సాగుతున్నప్పటికీ, ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి గ్రాఫ్ ఆందోళనకరంగా పడిపోయిందని ఈ సర్వే పేర్కొంది. 100 శాతం సంతృప్తి ఆశించిన చోట ప్రభుత్వ ప్రస్తుత రేటింగ్ కేవలం 60 శాతం (5.9 మార్కులు) లోపు మాత్రమే నమోదవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన యూనికార్న్ పొలిటికల్ స్ట్రాటజీ అధినేత రవి..  కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్  వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ..  డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు  దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు. కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్స్‌కు గత ఏడెనిమిదేళ్లుగా ఒకే రకమైన ఫిర్యాదులు రావడం అధికారుల వైఫల్యానికి అద్దం పడుతోందన్నారు.  తమ సర్వేలో ముఖ్యంగా క్యాబినెట్‌లో సీనియర్లు, జూనియర్ల మధ్య ఉన్న సమన్వయ లోపాలు ప్రస్ఫుటంగా బయటపడ్డాయన్నారు. 2024 అధికార మార్పిడి తర్వాత యువ రక్తాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ..  వారు జిల్లాల్లో పట్టు సాధించలేకపోతున్నాని తేలిందని చెప్పారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో తలెత్తిన డయేరియా వంటి తీవ్ర ప్రజా సమస్యలను పరిష్కరించే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి అగ్రనేతలు వెళ్లినప్పుడు, స్థానిక సీనియర్ నేత కళా వెంకట్రావు వంటి వారి అనుభవాన్ని వాడుకోలేకపోయారని విశ్లేషించారు. సీనియర్ల అనుభవంతో జూనియర్ల ఉత్సాహాన్ని మిక్స్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం ప్రజలలో వ్యక్తమైందన్నారు.  అటు కడప జిల్లాలో జూనియర్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లాంటి వారు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయలేకపోతున్నారని, రాయలసీమలో సామాజిక సమతుల్యత లోపించిందని తమ సర్వేలో వెల్లడైందని చెప్పారు.   అలాగే, నెల్లూరు జిల్లాలో తమిళనాడు బోట్ల వివాదం, మత్స్యకారుల ఆందోళనలు, కార్పొరేట్ పాలిటిక్స్ కారణంగా ఇంటర్నల్ డ్యామేజ్ తీవ్రంగా జరుగుతోందనీ.. ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్లను ఇలాంటి సమస్యల పరిష్కారానికి టాస్క్‌గా ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం వెనుకబడిందని రవి విశ్లేషించారు. మరోవైపు.. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేష్‌లపై నమోదైన సీఐడీ కేసుల దర్యాప్తుకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ వైఫల్యాలను కూడా రవి వివరించారు.  ప్రస్తుతం సీఐడీ విభాగానికి డీజీ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది లేకపోవడం, 13 జిల్లాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడం, గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన ఐఓలు (ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్) ఇప్పుడు  కేసులను క్లోజ్ చేసేలా నివేదికలు ఇవ్వడం వంటివి కూటమి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయనిరవి విశ్లేషించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రవిశంకర్ అయ్యన్నార్ లాంటి సమర్థులను సరైన స్థానాల్లో ఉపయోగించుకోకపోవడం, రిటైర్డ్ అధికారులకు ఎక్స్టెన్షన్స్ ఇవ్వడం వల్ల క్రింది స్థాయి అధికారుల ప్రమోషన్లు ఆగిపోయి డిపార్ట్‌మెంట్‌లో నైరాశ్యం అలుముకుందని సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాల ఆధారంగానే బండి లాగిస్తోందనీ, రాజకీయంగా ఎదురవుతున్న అంతర్గత సవాళ్లను చల్లార్చడంలో విఫలమవుతోందని తన సర్వే నివేదిక తేటతెల్లం చేసిందని రవి చెప్పారు.  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆపై 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయి కార్యకర్తలను బలోపేతం చేసుకోకపోతే, ఈ రేటింగ్స్ మరింత దిగజారి ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగడం ఖాయమనీ,  సీఎం చంద్రబాబు నాయుడు ఆశిస్తున్న 100 శాతం టాప్ ర్యాంక్ సాధించాలంటే కేవలం "పాస్ మార్కులు" సరిపోవని, తక్షణమే పరిపాలన, రాజకీయ సమన్వయంలో సమూల మార్పులు చేయాలని తమ సర్వే నివేదికలో తేలిందని   యూనికార్న్ పొలిటికల్ స్ట్రాటజీ అధినేత రవి స్పష్టం చేశారు. 
ALSO ON TELUGUONE N E W S
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన క్లాసిక్ ముద్ర వేసుకున్న సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ తాజాగా ఇండస్ట్రీలో ఒక రేంజ్ వివాదానికి తెరలేపారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది' సినిమాపై ఆయన చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమా మేకింగ్ స్టైల్‌ను విమర్శిస్తూనే, డైరెక్టర్ బుచ్చిబాబు తన సినిమా సీన్‌ను కాపీ కొట్టారంటూ నేరుగా ఆరోపణలు గుప్పించారు. గీతాకృష్ణ ఒక తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'పెద్ది' సినిమాలో హీరోయిన్ తనకు తానుగా తాళి కట్టుకునే అత్యంత కీలకమైన సన్నివేశం, 1989లో తాను రూపొందించిన ఎమోషనల్ క్లాసిక్ హిట్ 'కోకిల' చిత్రం నుండి తీసుకున్నదేనని బాంబ్ పేల్చారు. ఆ సీన్‌ను బుచ్చిబాబు యాజిటీజ్‌గా దించేశాడంటూ నిర్మొహమాటంగా మాట్లాడారు. కేవలం కాపీ వివాదంతోనే ఆగకుండా సినిమా కథనంపై కూడా ఆయన తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. 'పెద్ది' చిత్రాన్ని ఒక పక్కా కమర్షియల్ బయోపిక్‌గా ప్రెజెంట్ చేయడంలో చిత్రబృందం విఫలమైందని, సినిమా చూస్తుంటే ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలిగిందని అన్నారు. కథలో స్పష్టమైన ఫార్మాట్ లేకపోవడం సాధారణ ప్రేక్షకుడికి కనెక్ట్ కాకుండా చేసిందని, బాక్సాఫీస్ ఫార్ములాను మిస్ అవ్వడం ఈ చిత్రానికి మైనస్ అయిందని అభిప్రాయపడ్డారు. ఇక ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ.. ఆ పాత్ర కోసం ఆమె చాలా కష్టపడిన మాట వాస్తవమే అయినా, గ్రూమింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందని అన్నారు. ఒకవేళ షూటింగ్ సమయంలోనే తనను సంప్రదించి ఉంటే ఆ క్యారెక్టర్‌ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు గైడెన్స్ ఇచ్చేవాడినని, అయితే తన రెమ్యునరేషన్ కాస్త ఎక్కువే ఉంటుందంటూ నవ్వుతూ చమత్కరించారు. దర్శక దిగ్గజం కె. విశ్వనాథ్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన గీతాకృష్ణ.. నాగార్జున హీరోగా వచ్చిన 'సంకీర్తన' చిత్రంతో ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన అందించిన కోకిల, కీచురాళ్ళు, ప్రియతమ వంటి చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. నిఖార్సైన విమర్శలు చేసే ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. గీతాకృష్ణ చేసిన ఈ కాపీ ఆరోపణలు, డాక్యుమెంటరీ విమర్శలపై 'పెద్ది' చిత్రబృందం గానీ, దర్శకుడు బుచ్చిబాబు గానీ ఎలా స్పందిస్తారో.. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ డిజిటల్ ఎంట్రీకి సర్వం సిద్ధమైంది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న మొట్టమొదటి తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ (Super Subbu) ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వినూత్నమైన కథాంశంతో, హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సిరీస్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సిరీస్ కథాంశం విషయానికొస్తే.. సుబ్రహ్మణ్యం చిల్లుకూరి రావు అలియాస్ సుబ్బు అనే ఓ దురదృష్టవంతుడైన యువకుడు 'మాకిపూర్' అనే ఊహాజనిత గ్రామానికి ప్రభుత్వ ఉద్యోగిగా వెళ్తాడు. అయితే అక్కడ అతనికి ఎవరూ ఊహించని విధంగా 'సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్' అనే విచిత్రమైన పోస్టింగ్ ఇస్తారు. సమాజంలో బహిరంగంగా చర్చించడానికి ఇష్టపడని ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అంశాన్ని అమాయకపు గ్రామస్తులకు సుబ్బు ఎలా నేర్పించాడు? ఆ క్రమంలో అతని కెరీర్, ప్రేమ, కుటుంబ జీవితంలో ఎదురైన నవ్వుల గొడవలేంటనేది ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్‌లో వచ్చే సంభాషణలు ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ముఖ్యంగా 'మగ పిల్లాడి కోసం చిట్కా చెప్పండి సార్' అంటూ గ్రామస్తులు అడిగే ప్రశ్నలు, దానికి సందీప్ కిషన్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ హైలైట్‌గా నిలిచాయి. దర్శకుడు మల్లిక్ రామ్ సమాజంలో దాగి ఉన్న ఒక సున్నితమైన లైన్‌ను పక్కా విలేజ్ కామెడీ డ్రామాగా, ఎమోషనల్ టచ్‌తో అద్భుతంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం సందీప్ కిషన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'డిజె టిల్లు' ఫేమ్ మల్లిక్ రామ్ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేయడం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను భారీగా పెంచేసింది. సందీప్ సరసన బాలీవుడ్ బ్యూటీ మిథిలా పాల్కర్, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు మురళీ శర్మ, బ్రహ్మానందం, జీవన్, గెటప్ శ్రీను, సంపూర్ణేష్ బాబు వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోషల్ మీడియాలో 'సూపర్ సుబ్బు' ట్రైలర్‌కు నెటిజన్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు తెలుగు డిజిటల్ స్పేస్‌లో ఇలాంటి బోల్డ్ అండ్ క్లీన్ కామెడీ సబ్జెక్ట్ రాలేదని, సందీప్ కిషన్‌కు ఈ సిరీస్‌తో పక్కా డిజిటల్ హిట్ ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి ఈ సిరీస్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ క్రేజీ విలేజ్ కామెడీ ఎంటర్‌టైనర్ వెబ్ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా గ్లోబల్ వైడ్‌గా స్ట్రీమింగ్ కానుంది. మరి మన 'సూపర్ సుబ్బు' మాకిపూర్ గ్రామస్తులను ఎలా మార్చాడు? బాక్సాఫీస్ వద్ద కాకపోయినా ఓటీటీ రీచ్‌లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలంటే జూలై 2 వరకు ఆగాల్సిందే!
  Sandeep Kishan has built a reputation for picking varied subjects and experimenting across genres. Now, he is stepping into the digital space with Super Subbu, the first-ever Telugu Netflix Original series directed by Tillu Square fame Mallik Ram. The makers unveiled the trailer today and it promises a quirky, unapologetic comedy packed with social commentary. The trailer introduces Subbu, a young man raised under the strict supervision of his father, played by Murli Sharma, who makes him wear a bell to keep his thoughts and behaviour in check. As he grows up, Subbu becomes an assistant professor and lands an unusual posting — a Sex Education teacher in Maakipur village. But there’s a twist. The village is known for its unusually high fertility rate and the government hopes Subbu can trigger awareness and bring change. Instead, he finds himself becoming the subject of jokes and resistance from villagers, turning his mission into complete chaos. Sandeep Kishan looks completely at ease in this awkward, innocent and frustration-filled character. His comic timing appears to be the biggest strength of the trailer. Mallik Ram, after delivering a blockbuster entertainer with Tillu Square, seems to have approached the sensitive subject with humour rather than controversy. With Mithila Palkar as the female lead and a strong comic ensemble including Brahmanandam, Super Subbu appears to be aiming for edgy yet accessible entertainment. The series will premiere on Netflix from July 2. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వైవిధ్యమైన కథలతో పాటు విభిన్న కాంబినేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నారు. వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ అభిమానుల్లో విపరీతమైన అంచనాలను పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే సరికొత్త కాంబినేషన్‌లో ఆయన నటిస్తున్న ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. మలయాళ ఇండస్ట్రీలో ‘రోమాంచం’, ‘ఆవేశం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో సంచలనం సృష్టించిన టాలెంటెడ్ డైరెక్టర్ జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రానికి చిత్ర యూనిట్ ‘సరవేడి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. తమిళంలో ‘సరవేడి’ అంటే పేలుడు పదార్థం (గ్రానైడ్) అనే పవర్‌ఫుల్ అర్థం వస్తుంది. దీంతో ఈ టైటిల్ సూర్య మాస్ ఇమేజ్‌కు పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఈ చిత్రాన్ని తమిళంలో ఈ పేరుతోనే ఉంచి, తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో ‘గ్రానైడ్’ అనే టైటిల్‌తో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో సూర్య ఒక పవర్‌ఫుల్, రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జోరందుకుంది. గతంలో సూర్య చేసిన ఖాకీ పాత్రలు, ముఖ్యంగా ‘సింగం’ సిరీస్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మళ్లీ చాలా కాలం తర్వాత జీతూ మాధవన్ మార్క్ స్టైలిష్ యాక్షన్‌తో సూర్య పోలీస్ డ్రెస్ వేస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో టాలెంటెడ్ నటి నజ్రియా నజీమ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇటీవల ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఆయనకు మంచి బూస్ట్ ఇచ్చింది. అలాగే ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం కూడా శరవేగంగా ముస్తాబవుతోంది. సరికొత్త కాంబినేషన్లకే తొలి ప్రాధాన్యం ఇస్తున్న సూర్య, కథల్లోని వైవిధ్యాన్ని నమ్మి ఈ చిత్రాలన్నింటినీ లైన్‌లో పెట్టారు. ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన గాసిప్స్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో సూర్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ‘సింగం’ లాంటి పవర్‌ఫుల్ పోలీస్ రోల్‌ను మళ్లీ చూడబోతున్నామంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. జీతూ మాధవన్ గత చిత్రాల సక్సెస్ ట్రాక్ రికార్డును బట్టి ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా పనులు ముగించుకుంటున్న ఈ చిత్రాన్ని రాబోయే దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదే గనుక నిజమైతే, ఈ ఏడాదిలోనే సూర్య నటించిన మూడు సినిమాలు థియేటర్లలో సందడి చేసి ప్రేక్షకులకు ట్రిపుల్ ధమాకా ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Mr. P. Bharath Bhushan, Chairman of the Andhra Pradesh State Film, Television and Theatre Development Corporation (APSFTVTDC), recently paid a courtesy visit to the Hon’ble Chief Minister of Andhra Pradesh, Shri N. Chandrababu Naidu. During the meeting, Mr. Bharath Bhushan expressed his gratitude to the Chief Minister and reaffirmed his commitment towards the growth and development of the film industry in Andhra Pradesh. As the Vice President of the Film Federation of India (FFI), a body recognized by the Government of India, he stated that he would work closely with his team and industry stakeholders to strengthen the state’s position as a major destination for film, television, and entertainment activities. Mr. Bharath Bhushan also conveyed his happiness over the grand launch of the much-awaited #NBK112, scheduled to take place tomorrow at the TTD Sri Venkateswara Swamy Temple premises in Venkatapalem. He expressed his delight that Hon’ble Minister Shri Nara Lokesh and Hon’ble Minister Shri Kandula Durgesh will grace the occasion as Chief Guests. Speaking on the occasion, Mr. Bharath Bhushan said that the APSFTVTDC team is committed to creating an ecosystem that encourages more such prestigious film-related events and productions in Andhra Pradesh. He added that the Corporation will continue to work towards promoting the state as a preferred destination for the entertainment industry and contribute to its overall development. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
టాలీవుడ్ ఎంట్రీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రాశీ ఖన్నా ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. గ్లామర్, యాక్టింగ్ పరంగా ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ, సరైన కమర్షియల్ హిట్ లేకపోవడంతో కాస్త నెమ్మదించిన ఈ ముద్దుగుమ్మకు తాజాగా ఒక మైండ్ బ్లోయింగ్ ఆఫర్ దక్కింది. ఏకంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ల్యాండ్‌మార్క్ లాంటి ప్రాజెక్ట్‌లో భాగమయ్యే లక్కీ ఛాన్స్ ఈమెను వరించింది. సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా, లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మాన్’. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రాశీ ఖన్నా ఒక కీలక పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మరియు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ చిత్రంలో సీనియర్ నటి సిమ్రాన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా, రాశీ ఖన్నా మరో ప్రధాన పాత్రలో సందడి చేయనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రజినీకాంత్ కుమార్తెగా రాశీ ఖన్నా కనిపించబోతోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నటనకు ప్రాధాన్యమున్న ఈ పాత్ర ద్వారా ఆమె తనలోని సరికొత్త నటిని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాశీ.. ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్ లలో వరుస సినిమాలు చేసింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాలు దక్కకపోవడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ రెండు వెబ్ సిరీస్‌లతో భారీ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ, మళ్లీ సౌత్ ఇండస్ట్రీలో తన జెండా పాతేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈ క్రమంలో తలైవా సినిమా రావడం ఆమె కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్‌తో రాశీ ఖన్నా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు అభినందనలు కురిపిస్తున్నారు. ఒకే ఫ్రేమ్‌లో రజినీకాంత్, కమల్ హాసన్ (నిర్మాతగా) లాంటి ఇద్దరు లెజెండ్స్ ఉన్న ప్రాజెక్ట్‌లో రాశీ భాగమవ్వడం చూసి, ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయితే కోలీవుడ్‌లో ఆమె రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ‘ధర్మాన్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు, రాశీ ఖన్నా ఫస్ట్ లుక్ లేదా అఫీషియల్ అప్‌డేట్స్‌ను చిత్ర బృందం విడుదల చేయనుందని సమాచారం. మరి ఈ గోల్డెన్ ఆఫర్‌తో రాశీ ఖన్నా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన తాజా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న అద్భుతమైన వసూళ్లపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, సమంత ఆప్తమిత్రుడు రాజ్ నిడిమోరు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విడుదలకంటే ముందు ఇండస్ట్రీలో చాలా మంది సమంత మార్కెట్ స్టామినాను, ఆమె పొటెన్షియల్‌ను చాలా తక్కువ అంచనా వేశారని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు ఒక నిర్మాత ఇండస్ట్రీ వర్గాల్లో ఈ చిత్రం బజ్ గురించి ఆరా తీశారని గుర్తు చేసుకున్నారు. దానికి అవతలి వ్యక్తి.. "మహిళా ప్రధాన చిత్రాలకు ముందేం బజ్ ఉంటుంది? టాక్ బాగుంటేనే థియేటర్లకు జనాలు వస్తారు" అంటూ చాలా తేలికగా మాట్లాడారని రాజ్ తెలిపారు. ఆ మాటలు విన్నప్పుడు తాము కూడా కాస్త నిరుత్సాహపడ్డామని, కానీ మొదటి రోజు బాక్సాఫీస్ ఓపెనింగ్స్ చూశాక అందరి మైండ్ బ్లాక్ అయిందని ఆయన నవ్వుతూ చెప్పారు. సినిమా అంటే సినిమానే.. అది హీరోదైనా, హీరోయిన్‌దైనా కంటెంట్ బాగుంటే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారని ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్ నిరూపించాయని రాజ్ నిడిమోరు స్పష్టం చేశారు. ఒంటరిగా భారీ ఎత్తున థియేటర్లకు ప్రేక్షకులను రాబట్టగల (Crowd Pulling) సత్తా సమంతకు ఉందని ఈ చిత్రం గట్టిగా చాటిచెప్పిందని ఆయన కొనియాడారు. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా దేశీయంగా దాదాపు 27.20 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. గతంలో రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వం వహించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో ‘రాజి’ పాత్రతో సమంత డిజిటల్ స్క్రీన్‌పై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అదే కాంబినేషన్‌లో వచ్చిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్‌లోనూ సామ్ అదిరిపోయే యాక్షన్ విన్యాసాలతో మెప్పించింది. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ కథను కూడా రాజ్ నిడిమోరు అందించగా, బి.వి. నందిని రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. సమంత తన స్వంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’పై ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ సినిమా సాధిస్తున్న ఘన విజయంపై సోషల్ మీడియాలో సమంత అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఒక సాదాసీదా కోడలిగా కనిపిస్తూనే, కుటుంబం కోసం ఆయుధం పట్టిన వీరనారిగా సమంత చూపించిన నటనకు థియేటర్లలో చప్పట్లు, ఈలలు మారుమోగుతున్నాయి. విమర్శకుల అంచనాలను తలకిందులు చేస్తూ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఇప్పటికే 46 కోట్ల మార్కును దాటి దూసుకుపోతోంది. ఈ మాస్ సక్సెస్‌తో సమంత తన తదుపరి ప్రాజెక్టులకు మరిన్ని భారీ యాక్షన్ ఓరియెంటెడ్ కథలను ఎంచుకునేందుకు సిద్ధమవుతోంది.
'మిర్జాపూర్' వెబ్ సిరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు 'మిర్జాపూర్' సినిమాగా థియేటర్లలో అలరించడానికి రాబోతుంది. రేపు టీజర్ విడుదల కానుంది. (Mirzapur: The Movie) 'మిర్జాపూర్: ది మూవీ' టీజర్ విడుదలకు ఒక రోజు ముందు మేకర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేలా ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లను విడుదల చేశారు. మిర్జాపూర్ ప్రపంచాన్ని నిర్వచించిన మున్నా భయ్యా, గుడ్డు భయ్యా, కాలీన్ భయ్యా పాత్రలతో రూపొందించిన ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “గద్దీ హై తో హమ్ హై” అనే శక్తివంతమైన సందేశంతో విడుదలైన ఈ పోస్టర్లు మిర్జాపూర్ యూనివర్స్‌లోని అధికారం, వారసత్వం, ప్రత్యర్థిత్వాలను మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఈ పోస్టర్ల విడుదలతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. మిర్జాపూర్ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పాత్రలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చ సాగుతోంది. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్న మిర్జాపూర్: ది మూవీ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించగా, పునీత్ కృష్ణ కథను అందించారు. రితేష్ సిద్ధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాసిమ్ జగ్‌మాగియా, విశాల్ రామ్‌చందానీ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు భాషలోనూ విడుదల కానున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 సెప్టెంబర్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.  
టాలీవుడ్‌లో ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం నటననే నమ్ముకుని వర్సటైల్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ టాలెంటెడ్ హీరో.. తాజాగా నటించిన 'రావు బహదూర్' చిత్రం జూలై 3న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సత్యదేవ్ తన పదేళ్ల సినీ ప్రయాణం, కెరీర్‌లో ఎదుర్కొన్న ఆటంకాలు మరియు కమర్షియల్ హిట్లు దక్కకపోవడంపై అత్యంత నిజాయితీగా స్పందించారు. ఇంటర్వ్యూ వేదికగా యాంకర్ అడిగిన ఓ సూటి ప్రశ్నకు సత్యదేవ్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. "మీరు అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు.. కానీ ఎంతో నమ్మకం పెట్టుకున్న 'తిమ్మరుసు', విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న 'కృష్ణమ్మ' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎందుకు ఆశించిన విజయం సాధించలేదు? పదేళ్లుగా సరైన కమర్షియల్ బ్రేక్ రాకపోవడానికి కారణం ఏంటి?" అని ప్రశ్నించగా ఆయన మనసు విప్పి మాట్లాడారు. తన కెరీర్ కాస్త స్లోగా సాగుతోందన్న మాట నిజమేనని సత్యదేవ్ అంగీకరించారు. "కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్లు.. మనం ఒకటి అనుకుంటే ఇండస్ట్రీలో మరొకటి జరుగుతుంది. చాలా నమ్మకంతో చేసిన కొన్ని సినిమాలు ఆడలేదు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కంటెంట్ పరంగా అన్నీ బాగున్నా ఎక్కడో ఏదో లోపం వల్ల సక్సెస్ దూరమైందని, అయితే పరాజయాలకు భయపడి తాను పోరాటాన్ని ఆపలేదని, నిలబడి నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి 'జ్యోతిలక్ష్మి', 'బ్లఫ్ మాస్టర్', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి చిత్రాలతో నటుడిగా సత్యదేవ్ ప్రత్యేక ముద్ర వేశారు. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో अक्षय कुमारతో కలిసి 'రామ్ సేతు' సినిమాలోనూ మెరిశారు. నటన పరంగా వందకు వంద శాతం న్యాయం చేస్తున్నా, బాక్సాఫీస్ వద్ద సరైన కమర్షియల్ లక్ కలిసిరాకపోవడంపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. సత్యదేవ్ ఇంటర్వ్యూ క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, ఆయన అభిమానులు సత్యదేవ్ మైండ్‌సెట్‌ను ఎంతగానో అభినందిస్తున్నారు. "హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేదు.. నీ నటన ఎప్పటికీ సూపర్. నీ పట్టుదలే నీకు పెద్ద సక్సెస్ ఇస్తుంది" అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆయనకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అందరి కళ్ళు వెంకటేష్ మహా దర్శకత్వంలో వస్తున్న 'రావు బహదూర్' సినిమాపైనే ఉన్నాయి. ఈ క్రైమ్ అండ్ కోర్ట్‌రూమ్ డ్రామా టీజర్, ట్రైలర్ ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. జూలై 3న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాతో సత్యదేవ్ తన పదేళ్ల కమర్షియల్ హిట్ నిరీక్షణకు తెరదించి, బాక్సాఫీస్ వద్ద గట్టి కంబ్యాక్ ఇస్తారని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
టాలీవుడ్ లో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), ఇప్పుడు మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారుతున్న విషయం తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించిన 'RAPO23' చిత్రం ఇండస్ట్రీ వర్గాల్లో మరియు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది.  ఈ ప్రాజెక్ట్‌ను కేవలం ఒక సాధారణ చిత్రంగా కాకుండా, టాలీవుడ్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. "ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వోల్ఫ్" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో రామ్ "వీర" అనే ఒక పవర్‌ఫుల్ మరియు కాంప్లెక్స్ మానసిక స్థితి ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా, మాస్ హీరోగా అలరించిన రామ్, ఈసారి తనలోని అసలైన నటుడిని సరికొత్త కోణంలో ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని ఏకంగా ₹100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ పోతినేని కెరీర్‌లోనే ఇది అత్యధిక బడ్జెట్ సినిమా కావడం విశేషం. కేవలం కథపై ఉన్న నమ్మకంతో, ఎక్కడా రాజీ పడకుండా ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ భారీ వ్యయాన్ని స్క్రీన్‌పై అద్భుతంగా చూపించడానికి టాప్ టెక్నీషియన్లను రంగంలోకి దించారు. విజువల్స్ పరంగా సినిమా మైండ్ బ్లోయింగ్ గా ఉండేందుకు నేషనల్ అవార్డ్ విన్నర్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరు (Tirru) ఈ ప్రాజెక్ట్‌కి పనిచేస్తున్నారు. ఆయన సృష్టించే నియో-నోయిర్ విజువల్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే, ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అయిన పీటర్ హెయిన్ ఈ చిత్రంలోని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేయబోతున్నారు. వీటితో పాటు, స్టార్ ప్రొడక్షన్ డిజైనర్ ఎ.ఎస్. ప్రకాష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శివార్లలో భారీ సెట్లను నిర్మిస్తున్నారు. ఈ ₹100 కోట్ల బడ్జెట్ లో ఎక్కువ భాగం విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ మరియు రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ కోసమే కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. తన గత చిత్రంలో సింగర్‌గా, లిరిసిస్ట్‌గా తన ప్రతిభను చాటుకున్న ఆయన, ఇప్పుడు ఏకంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చూపించిన డార్క్ థీమ్, రామ్ హెయిర్ స్టైల్, బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న రెడ్ కలర్ 'V' సింబల్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇచ్చాయి. ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను 2026 డిసెంబర్ లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా అనుకోవచ్చు. కానీ  కొందరు ప్రేమలో పదేపదే మోసపోతుంటారు. ఇలా పదే పదే  జరిగే మోసాలు దురదృష్టం వల్ల కాకుండా మనిషి చేసే  పొరపాటు వల్ల జరుగుతాయి. కొన్నిసార్లు, మనం తెలియకుండానే చేసే పొరపాట్లు పదేపదే మోసాలకు దారితీయవచ్చు. ప్రేమలో పదే పదే మోసపోయే వారు చేసే పొరపాట్లు ఏమిటో.. ఎందుకు జరుగుతాయో.. వివరంగా తెలుసుకుంటే.. హెచ్చరికలు.. ప్రేమలో మోసపోతున్నారని చెప్పడానికి కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ తెలుస్తూ ఉంటాయి.  అబద్దాలు చెప్పడం, వింతగా ప్రవర్తించడం,  విషయాలు దాచడం,కేవలం మాటలు చెప్పడం,  చేతల్లో ఏమీ ఉండకపోవడం వంటివి ప్రేమలో మోసపోవడానికి హెచ్చరికలు. ఇవన్నీ చేసే వ్యక్తి ఏదో ఒకరోజు మోసం చేసే అవకాశం ఉంటుంది. ప్రాధాన్యత.. భాగస్వామిని సంతోషపెట్టాలనే కోరికలతో ఆత్మగౌరవాన్ని వదిలి  తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటే, అవతలి వ్యక్తి  తేలికగా తీసుకుంటారు. అందుకే తమను తాము ఎప్పుడూ  ప్రేమించుకుని, గౌరవించుకోవాలి. అది జరగనంత వరకు  అవతలి వ్యక్తి  విలువ ఇవ్వరు.  భాగస్వామి  విలువ ఇవ్వనప్పుడు,  ఎప్పుడైనా మోసం చేయగలరు. అందుకే సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ చాలా కీలకం. తొందరపాటు నిర్ణయాలు.. చాలాసార్లు, గతంలో  విడిపోవడం వల్ల కలిగిన బాధను తగ్గించుకోవడానికి లేదా తుడిచివేయడానికి,  ఆలోచించకుండా కొత్త సంబంధాలను వెతుక్కుంటారు.  సంబంధంలోకి వెళ్లడానికి  ఎప్పుడూ తొందరపడకూడదు, ఎందుకంటే ఇది  అవతలి వ్యక్తిపై మానసికంగా ఆధారపడేలా చేస్తుంది. గుడ్డి నమ్మకం..  భాగస్వామిని గుడ్డిగా నమ్మడం సరికాదు. ఒక సంబంధంలో ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా అవసరం.  భాగస్వామిని గుడ్డిగా కాకుండా, తార్కికంగా నమ్మాలి. ఏ సంబంధంలోనైనా నమ్మకం కాలక్రమేణా ఏర్పడుతుంది. భాగస్వామిని గుడ్డిగా నమ్మితే, మోసపోవచ్చు.                                     *రూపశ్రీ.
ఈ రోజుల్లో ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు ఎక్కువగా విఫలమవుతున్నాయి? ప్రేమలో నమ్మకం, పరస్పర అవగాహన, స్వేచ్ఛ ఎంత ముఖ్యమో ఈ వీడియోలో సి. కళ్యాణ్ వివరంగా చర్చించారు. బ్రేకప్‌ల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? బంధాలను బలంగా నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? వంటి అంశాలపై ఆసక్తికరమైన విశ్లేషణను తెలుసుకోండి.
ఆలోచన ఒక అవసరానికి ముడివడకుండా ఉన్నంతవరకూ దానికి అర్ధవంతమైన గెలుపు ఉండదు. చాలా మందిలో ఆలోచన అనే ఒక బెరడు, జీవిత సాగరంలో దానికదే తేలిపోతూ ఉంటుంది. లక్ష్యం లేని ఆలోచన ఒక దుర్గుణం. ఆలోచనలను ఆలా తేలిపోనివ్వకూడదు. లక్ష్యం లేని ఆలోచనల వలన చివరకు జరిగేది విధ్వంసమే. ఒక లక్ష్యం లేకుండా జీవించే వారు తేలికగా ఆందోళన, భయం, కష్టాలు నిర్వేదాల ఉచ్చులో పడతారు. ఈ బలహీనతలన్నీ ఖచ్చితంగా జరిగే ఒక పాపపు ప్రణాళికలా  ఓటమికీ, దుఃఖానికీ మరియూ నష్టానికీ దారి తీస్తాయి. ఎందుకంటే శక్తి ఆధారంగా పరిణతి చెందే ఈ విశ్వంలో బలహీనతకి చోటు లేదు. ఒక మనిషి తన హృదయంలో ఒక ఆశయాన్ని కలిగి ఉండి, దానిని చేరుకునేవరకూ పరితపించాలి. ఆ ఆశయాన్ని లేదా లక్ష్యాన్ని తన ఆలోచనల కేంద్రబిందువుగా చేసుకోవాలి. సమయ సందర్భాలను బట్టి, ఆ లక్ష్యం ఆధ్యాత్మిక ఆశయం కావచ్చు, లేదా ప్రాపంచిక విషయం కావచ్చు. అది ఏదైనప్పటికీ తన ఆలోచనాశక్తినంతా దాని మీదే పూర్తిగా లగ్నం చేయాలి. దానినే అతని పరమ విధిగా భావించి వేరే ఇతర వ్యాపకాల పట్ల కోరికల పట్ల, ఊహల పట్ల మనస్సుని పోనివ్వకుండా తదేక దీక్షతో సాధించే వరకూ శ్రమించాలి. ఇదే ఆత్మ నిగ్రహానికి మరియూ నిజమైన ఏకాగ్రతకు రాజమార్గం. ఒక వేళ లక్ష్య సాధనలో మరలా మరలా ఓడిపోయినా (బలహీనతలను అధిగమించేవరకూ ఓటమి ఎలాగూ తప్పదు), వ్యక్తి శీలంలో అభివృద్ధి కనిపిస్తే అది విజమైన విజయానికి ఒక నిదర్శనం, భవిష్యత్తులో సాధించబోయే విజయానికి ఈ ఓటమి ఒక మెట్టులా, ఒక శక్తిలా పనిచేస్తుంది. ఉన్నత లక్ష్యం గురించి ఆదుర్దా వద్దనుకునే వ్యక్తులు చేసేది ఎంత చిన్న పనైనా సరే, దానికి ఏమాత్రం విలువలేదనిపించినా సరే, ఎటువంటి అవకతవకలు లేకుండా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే దాని మీదనే తమ ధ్యాసంతా ఉంచాలి. కేవలం ఈ విధంగానే ఆలోచనలను వృద్ధి చేసుకున్నప్పుడు అవి మరింత శక్తివంతంగా మారి లక్ష్యసాధనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తాయి. శక్తిని వృద్ధి చేసుకునే ఏకైక మార్గం ఎడతెగని కృషి మరియూ సాధన మాత్రమే అని తెలుసుకుని, దానిని నమ్మిన మరుక్షణం, అతి బలహీనమైన వ్యక్తి అయినా సరే కష్టించి పనిచేయడం ప్రారంభిస్తాడు. కృషికి కృషినీ, ఓర్పుకి ఓర్పునీ, శక్తికి శక్తినీ జోడిస్తూ ఉంటే, వ్యక్తి అభివృద్ధి ఇక ఆగదు. అలా ఎదుగుతూ చివరకు ఎంతో దివ్యమైన శక్తిగా మారుతుంది. శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి సహనంతో జాగ్రత్తగా సాధన చేస్తే ఎలా శక్తివంతంగా తయారవుతాడో అలాగే బలహీనమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి సరైన ఆలోచనల వలన మానసికంగా శక్తివంతంగా తయారుకాగలడు. నిర్లక్ష్యాన్ని, బలహీనతనూ దూరంగా ఉంచి, ఒక లక్ష్యం వైపు ఆలోచించడం మొదలుపెట్టడమంటే, ఓటమిని కూడా లక్ష్య సాధనలో ఒక భాగంగా పరిగణించే శక్తివంతులుగా మారడమే. అటువంటి వ్యక్తులు శక్తివంతంగా ఆలోచించి, భయంలేకుండా అడుగు ముందుకేసి, ఎటువంటి పరిస్థితినైనా తమకు అనువుగా మార్చుకుని విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యక్తి తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని చేరుకునే మార్గాన్ని మానసికంగా ఎంచుకుని దిక్కులు చూడకుండా ఋజుమార్గంలో పయనించాలి. అనుమానాలను, భయాలనూ పూర్తిగా తుడిచిపెట్టెయ్యాలి.  ఎందుకంటే అవి నాశనానికి కారకాలు, కృషి అనే దారిని మళ్ళించి వ్యక్తిని ప్రభావరహితంగా పనికిమాలినవిధంగా తయారుచేయగలవు. అనుమానం, భయం ఎప్పుడూ ఏదీ సాధించింది లేదు, ఎప్పుడూ సాధించలేవు కూడా. అవి ఎప్పుడూ ఓటమికే దారి తీస్తాయి. అవి చేరిన వెంటనే లక్ష్యం, బలం, శక్తి, సంకల్ప శక్తి అన్నీ పనిచేయడం ఆగిపోతాయి. ఏదైనా పని చేయగలమనే జ్ఞానం నుంచే చేయాలనే సంకల్పం పుట్టుకొస్తుంది. అనుమానం, భయం జ్ఞానానికి బద్ధ శత్రువులు. వాటిని చంపేయకుండా ఇంకా ఉత్సాహపరిచే వారు ప్రతి అడుగులోనూ ఇబ్బందికి గురవుతారు. అనుమానాన్నీ, భయాన్నీ జయించినవాడు ఓటమిని కూడా జయిస్తాడు. అతని ప్రతి ఆలోచన, శక్తితో కూడుకుని ఉంటుంది, అతడు ప్రతి కష్టాన్నీ వివేకంతో మరియూ ధైర్యంతో ఎదుర్కొని జయించగలడు. నిర్భయమైన ఆలోచనకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం తోడైతే అది సృజనాత్మక శక్తిగా మారుతుంది. ఈ విషయం తెలిసిన వ్యక్తి ఊగిసలాడే ఆలోచనలతో మరియూ కొట్టుమిట్టాడే వాతావరణంతో ఉండే ఒక బుడగలా కాకుండా, పరిస్థితికి ఉన్నతంగా శక్తివంతంగా మారేదానికి సంసిద్ధమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న వ్యక్తి తన మానసిక శక్తులను స్పృహతో మరియూ తెలివితేటలతో సమర్ధవంతంగా వాడుకోగలుగుతాడు.                                  ◆నిశ్శబ్ద.
ప్రస్తుత జీవనశైలిలో సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎక్కువగా బయట ఆహారం తినడం, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు చిన్నవిగా అనిపించినా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ ఆరోగ్య అవగాహన వీడియోలో ఆయుర్వేద వైద్య నిపుణుడు Dr. Murali Manohar Chirumamilla గ్యాస్ సమస్యలకు ప్రధాన కారణాలు ఏమిటి, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోతే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే అంశాలను వివరంగా చెబుతున్నారు. అలాగే గ్యాస్ సమస్యను తగ్గించేందుకు ఉపయోగపడే కొన్ని ఆయుర్వేద గృహచిట్కాలు, ఆహార నియమాలు, జీర్ణశక్తిని పెంచే అలవాట్లు గురించి కూడా సూచనలు అందిస్తున్నారు.  ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: కడుపులో గ్యాస్ ఏర్పడడానికి కారణాలు అజీర్తి మరియు ఉబ్బరం సమస్యల లక్షణాలు జీర్ణశక్తిని మెరుగుపరచే సహజ మార్గాలు గ్యాస్ సమస్య తగ్గించేందుకు ఆయుర్వేద సూచనలు ఆహారంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఆరోగ్యకరమైన జీవనశైలి చిట్కాలు గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ వీడియో ఉపయోగకరమైన అవగాహనను అందిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం సరైన ఆహారం, సరైన అలవాట్లు ఎంత ముఖ్యమో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి   మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!). 
పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా స్కూల్‌కి వెళ్లే పిల్లలకు సరైన పోషకాహారం అందించడం చాలా అవసరం. ఈ వయస్సులో శారీరక ఎదుగుదలతో పాటు మెదడు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుంది. అందుకే పిల్లలు తీసుకునే ఆహారం సమతుల్యంగా, పోషకాలతో నిండి ఉండాలి. ఈ "రైట్ డైట్" కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డా. పి. జానకి శ్రీనాథ్ స్కూల్ పిల్లల కోసం అనుసరించాల్సిన సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన డైట్ గురించి విలువైన సూచనలు అందిస్తున్నారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: ✔️ స్కూల్ పిల్లలకు అవసరమైన పోషకాహారం ✔️ ఉదయం అల్పాహారం ఎందుకు తప్పనిసరి? ✔️ టిఫిన్ బాక్స్‌లో ఎలాంటి ఆహారం పెట్టాలి? ✔️ పాలు, పండ్లు, కూరగాయల ప్రాముఖ్యత ✔️ ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాల అవసరం ✔️ చాక్లెట్లు, చిప్స్, జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలు ✔️ పిల్లలలో మంచి ఆహారపు అలవాట్లు ఎలా పెంపొందించాలి? ✔️ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ✔️ చదువులో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచే ఆహార సూచనలు తల్లిదండ్రులు తమ పిల్లల రోజువారీ ఆహారంలో సరైన మార్పులు చేస్తే వారు ఆరోగ్యంగా, చురుకుగా, చదువులో మెరుగైన ఫలితాలు సాధించగలరు. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే ప్రతి తల్లిదండ్రి తప్పక చూడాల్సిన ఉపయోగకరమైన వీడియో ఇది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
  కాలక్రమేణా అంటువ్యాధులు సర్వసాధారణం అవుతున్నాయి. ఒకవైపు  రోగనిరోధక శక్తి బలహీనం కావడం, మరొకవైపు వైరస్‌లు , బ్యాక్టీరియాల కొత్త రకాలు కూడా తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. గత నెలరోజులుగా కేరళలో షిగెల్లా , నిపా వంటి అంటువ్యాధులు తాండవం చేస్తుంటే.. మరోవైపు, కర్ణాటక ప్రజలకు H1N1 (స్వైన్ ఫ్లూ) గురించి అప్రమత్తం చేస్తున్నారు. ఈ వ్యాధి కారణంగా ఒక వ్యక్తి మరణించినట్లు తెలిసింది. ఈ క్రమంలో సాధారణ జలుబుకు,  స్వైన్ ఫ్లూ కు మద్య తేడాలు ఏంటో తెలుసుకుంటే.. స్వైన్ ఫ్లూ లక్షణాలు తరచుగా సాధారణ ఇన్ఫ్లుఎంజా లక్షణాలను పోలి ఉంటాయి, అందుకే  ఈ రెండు వ్యాధుల మధ్య తేడాను గుర్తించలేరు. ఇన్ఫెక్షన్ వేగంగా ముదిరి, రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అధిక జ్వరం , తీవ్రమైన సమస్యలు తలెత్తినప్పుడు  ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. H1N1 కూడా ఒక రకమైన ఇన్ఫ్లుయెంజా వైరస్, కానీ దీని వ్యాప్తి, ప్రమాదం , కొన్ని సందర్భాల్లో వ్యాధి తీవ్రత సాధారణ సీజనల్ ఫ్లూ కంటే ఎక్కువగా ఉంటాయి. వైద్య నివేదికల ప్రకారం, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు , ముందు నుంచే అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ప్రభావితం కావచ్చు. వాతావరణ మార్పులను బట్టే.. వాతావరణం మారేకొద్దీ శ్వాసకోశ వైరల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.  ఈ ఇన్ఫెక్షన్లు రద్దీ ప్రదేశాలు, పాఠశాలలు, కార్యాలయాలు , ప్రజా రవాణాలో వేగంగా వ్యాపిస్తాయి. దీర్ఘకాలం పాటు అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,  దగ్గు తగ్గకపోవడం లేదా తీవ్రమైన నీరసం వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సాధారణ జలుబు సమస్య.. స్వైన్ ఫ్లూ , సాధారణ ఫ్లూ రెండూ ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల కలిగే శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లే, కానీ ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే వైరస్ రకాలు భిన్నంగా ఉండవచ్చు. H1N1 కేవలం ఇన్ఫ్లుయెంజా A వైరస్ ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. సాధారణ కాలానుగుణ ఫ్లూ ఇన్ఫ్లుయెంజా A లేదా B తో సహా వివిధ రకాల వైరస్‌ల వల్ల సంభవించవచ్చు.  సాధారణ ఫ్లూలో కూడా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉంటాయి. ఎలా గుర్తించాలి..  కేవలం లక్షణాల ఆధారంగా H1N1 , సాధారణ ఫ్లూ మధ్య తేడాను గుర్తించడం కష్టం. రెండింటిలోనూ జ్వరం, దగ్గు, గొంతు నొప్పి  ఒళ్ళు నొప్పులు ఉండవచ్చు. ఒక ప్రాంతంలో H1N1 కేసులు పెరుగుతూ ఉండి, రోగి తీవ్ర అనారోగ్యంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే, వైద్యుడు కొన్ని పరీక్షలను సిఫార్సు చేయవచ్చు. H1N1 , సాధారణ ఫ్లూ మధ్య అత్యంత స్పష్టంగా కనిపించే తేడాలలో ఒకటి ఏమిటంటే, H1N1 యొక్క సాధారణ లక్షణాలతో పాటు, కొంతమందికి కడుపు నొప్పి , విరేచనాలు వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా కలగవచ్చు.                                 *రూపశ్రీ.