LATEST NEWS
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.! హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో హనీ ట్రాప్ తరహా మోసం కలకలం రేపింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతి ఓ వ్యక్తిని పబ్‌కు తీసుకెళ్లి భారీగా బిల్లు వేసి మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. క్వాక్ క్వాక్ డేటింగ్ యాప్ ద్వారా హేమంత్‌కు దివ్య అనే యువతి పరిచయమైంది. అనంతరం ఇద్దరూ మాట్లాడుకోవడంతో దివ్య హేమంత్‌ను జూబ్లీహిల్స్‌లోని 36 కెమిస్ట్రీ పబ్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పబ్‌లో కొంత సమయం గడిపిన అనంతరం హేమంత్‌కు రూ.29,000 భారీ బిల్లు వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.  అయితే బిల్లు చెల్లించే సమయంలో పబ్ యాజమాన్యంతో కలిసి ఫేక్ పేమెంట్ ట్రాన్సాక్షన్ చూపించి తనను మోసం చేసినట్లు హేమంత్ ఆరోపించారు. పబ్ సిబ్బంది, దివ్య కలిసి ముందస్తు పథకం ప్రకారం తనను మోసం చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పబ్‌లో జరిగిన వ్యవహారానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, బిల్లింగ్ వివరాలు, పేమెంట్ ట్రాన్సాక్షన్‌లను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతి పాత్రతో పాటు పబ్ యాజమాన్యం లేదా సిబ్బంది ప్రమేయం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.       [ Honey Trap, Jubilee Hills, Dating App, Pub Bill, ₹29,000 Bill, Hyderabad Crime, Quack Quack Dating App, Hemant, Divya, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Hyderabad police ]
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది. ఎస్‌ఆర్‌ నగర్‌లోని ప్రసిద్ధ గోకుల్ ప్రైడ్ ఓయో హోటల్‌లో ఒక యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా  నగరంలో సంచలనం సృష్టించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం సమయంలో ఒక యువతి, యువకుడు కలిసి ఈ హోటల్‌లోని రూమ్ నెం. 103 లోకి అడుగుపెట్టారు. అయితే, ఆ గదిని బుక్ చేయడానికి ఉపయోగించిన రిజిస్టర్ ప్రకారం 'సి. గణేష్' అనే పేరును నమోదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆ గదిలో ఏం జరిగిందో తెలియదు కానీ, ఉదయం వేళకు యువతి విగతజీవిగా పడి ఉండటం హోటల్ సిబ్బందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హోటల్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఆర్‌ నగర్ పోలీసులు గదిని పరిశీలించి, వివరాలు సేకరించడం ప్రారంభించారు. ఈ కేసులో అత్యంత విస్తుపోయే మరో కోణం ఏమిటంటే, మృతి చెందిన యువతికి సంబంధించిన గుర్తింపు వివరాలలో భారీ వ్యత్యాసాలు మరియు గందరగోళం నెలకొంది. ఆమె ఒంటిపై ఉన్న ఆధార్ రికార్డులను పరిశీలిస్తే అందులో ఆమె పేరు 'దుర్గ' అని ఉండగా, అదే సమయంలో ఆసుపత్రి లేదా ఇతర ప్రాథమిక నివేదికలలో ఆమె పేరు 'శిరీష' అని నమోదు కావడంతో పోలీసులకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ఆ యువతి అసలు పేరు ఏమిటి? ఆమెది ఏ ప్రాంతం? హైదరాబాద్‌లో ఎక్కడ నివసిస్తోంది? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. హోటల్ గదిని బుక్ చేసే సమయంలో నకిలీ వివరాలు లేదా తప్పుదారి పట్టించే పేర్లను ఉపయోగించారా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆ గదిలో ఉన్న యువకుడు కనిపించకుండా పోవడం, లేదా పరారవ్వడం ఈ మృతి వెనుక ఏదో పెద్ద కుట్ర లేదా నేరపూరిత కోణం ఉందనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్  ప్రత్యేక పోలీస్ బృందాలు హోటల్ గదిలోని ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. గదిలో లభించిన వేలిముద్రలు, ఇతర భౌతిక ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే ఆ యువతి మృతికి గల అసలు కారణాలు ఏమిటనేది స్పష్టమైన క్లారిటీ వస్తుందని వైద్యులు పోలీసులు వెల్లడించారు. ఒక వైపు హోటల్ మేనేజ్‌మెంట్ బాధ్యతలపై, మరోవైపు రూమ్ బుకింగ్ నిబంధనల అమలు తీరుపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎటువంటి సరైన గుర్తింపు పత్రాలు లేకుండా లేదా తప్పుడు పేర్లతో గదులు కేటాయించడం వల్ల ఇలాంటి నేరాలు పునరావృతమవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఎస్‌ఆర్‌ నగర్ పోలీసులు ఈ ఘటనపై ప్రత్యేక కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నగరంలో కలకలం రేపిన ఈ మిస్టరీ డెత్ కేసులో అసలు నిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు వేగవంతం చేశారు.           [ SR Nagar Hotel death, Gokul Pride Oyo Hyderabad, Suspicious Death in Hotel, Hyderabad crime news, sr nagar police case, room booking mystery, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Hyderabad police ]
అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు పొంచివుండి మృత్యువులా దాడికి తెగబడ్డారు. దేశ సరిహద్దు ప్రాంతంలో భద్రతా విధుల్లో ఉన్న అసోం రైఫిల్స్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో ఒక జవాన్ వీరమరణం పొందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సంచలన ఘటన అరుణాచల్ ప్రదేశ్‌లోని సున్నితమైన చంగ్లాంగ్ జిల్లా పరిధిలో భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. రోజూ మాదిరిగానే భద్రతా బలగాలు తమ విధులను నిర్వర్తిస్తున్న సమయంలో ఈ ఊహించని పరిణామం ఎదురైంది. ఉదయం సరిగ్గా 6:30 గంటల సమయానికి 21వ అసోం రైఫిల్స్ బెటాలియన్‌కు చెందిన బలగాల బృందం నాంపోంగ్ నల్లా ప్రాంతంలో సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతం కావడంతో సరిహద్దు వెంబడి కంచె ఏర్పాటు పనులతో పాటు ఇక్కడ నిఘా అత్యంత కీలకంగా ఉంది. ఈ తరుణంలో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపడుతున్న జవాన్ల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని ముందస్తు పథకం ప్రకారం మాటువేసిన ఉగ్రవాదులు ఒక్కసారిగా విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల ఈ హఠాత్పరిణామపు దాడిలో 42 ఏళ్ల వయసున్న హవిల్దార్ జంఖోకాయ్ కుకి తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన ఆయన వీరమరణం దళాల్లో విషాదాన్ని నింపింది. ఈ కాల్పుల్లో మరో నలుగురు జవాన్లు కూడా తీవ్రంగా గాయపడినట్లు అధికారిక వర్గాలు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన ఇతర బలగాలు క్షతగాత్రులను వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నాయి. ప్రస్తుతం గాయపడిన వారిలో కొందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే ఉలిక్కిపడిన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. భారీ ఎత్తున సైనిక, పోలీసు బలగాలను మోహరించి సరిహద్దు వెంబడి భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలు కావడంతో ఉగ్రవాదులు తప్పించుకునేందుకు వీలుగా ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ దుశ్చర్యకు ఎన్‌ఎస్‌సీఎన్ (కే-వైఏ) ఉగ్రవాద సంస్థ పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సరిహద్దుల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక పోలీసు అధికారులు స్పష్టం చేశారు.       [  Assam Rifles, militants open fire, Arunachal Pradesh, India Myanmar border, jawan killed, Changlang district, indian army, PM MODI, Amit shah, Telugu One, Telugu News ]  
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దక్షిణాది ప్రజల సాంస్కృతిక, మత గుర్తింపునకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి.  దేశ రాజధాని హస్తినలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రజల సాంస్కృతిక, మతపరమైన గుర్తింపుల గురించి చేసిన విశ్లేషణ రాజకీయదుమారాన్ని రేపింది. రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో విభజన తెచ్చేలా సీఎం రేవంత్ మాట్లాడారంటూ బీజేపీ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తోంది.   దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల ఆరాధనా విధానాలు, దేవుళ్ల ప్రాధాన్యతను వివరిస్తూ.. రేవంత్ రెడ్డి ఆ మీడియా సమావేశంలో దక్షిణాది  వారు ద్రావిడులని, ఉత్తరాది వారులు  ఆర్యులని అన్నారు.   దక్షిణాది వారు శివభక్తులు, ఉత్తరాది వారు శ్రీరామ భక్తులుగా అభివర్ణించారు.  అక్కడితో ఆగకుండా  బీజేపీ నాయకులు ఎప్పుడూ  జై శ్రీరామ్ నినాదాలకే పరిమితమవుతారని,  హర హర మహాదేవ్'అని ఎందుకు అనరని నిలదీశారు. శివుడిని పేదల దేవుడిగా, రాముడిని ధనవంతుల దేవుడిగా అభివర్ణిస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. పెను వివాదానికి హేతువయ్యాయి.   రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై  నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.  ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే హిందువులను ప్రాంతాల వారీగా, దేవుళ్ల పేరుతో విడగొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నారు. సోమనాథ్ ఆలయ నిర్మాణం మొదలుకొని అనేక ధార్మిక ప్రాజెక్టులను గతంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని, ఇప్పుడు మళ్లీ అదే వైఖరిని ప్రదర్శిస్తోందని గుర్తు చేస్తున్నారు.  అంతేకాకుండా..  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  జై శ్రీరామ్'తో పాటు 'హర హర మహాదేవ్ అని కూడా నినదించే   అంటున్నారు. రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.  హిందువుల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడమే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు.   [Revanth Reddy Comments, Lord Rama, Lord Shiva controversy, BJP,  Congress, North South India Identity, National politics, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్య సంచలనంగా మిగిలిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతం మరోసారి రాజకీయ దుమారం  ఈ హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాటి ఘటనకు సంబంధించి పలువురు ప్రముఖుల ప్రమేయం,   ఈ కేసులో కొందరికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ రాజకీయ లబ్ది చేకూరిందనే ఆరోపణలు సంచలనంగా మారాయి. . ఘటన జరిగిన నాటి నుంచి దర్యాప్తు సరళి, కేసు దారి మళ్లిన వైనంపై వివిధ రాజకీయ పక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన సమయంలో స్థానిక పరిస్థితులు, తదనంతరం తెరపైకి వచ్చిన అంశాలు పలు అనుమానాలకు తావునిచ్చాయి. ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు. ఈ కేసు విషయంలో ఆమె అలుపెరుగని న్యాయపోరాటం చేశారు. చేస్తున్నారు.  ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ విచారణలో  హత్య జరిగిన రోజు ఉదయం నుంచి జరిగిన పరిణామాలు, టెలిఫోన్ సంభాషణలు, గూగుల్ టేకౌట్ వివరాలు నేరస్థలంలో లభించిన భౌతిక సాక్ష్యాలు, అనుమానితుల కదలికలతో పకడ్బందీగా ముందుకు సాగింది.   ఈ వ్యవహారంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి రెడ్డి అలాగే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నాయి. హత్యకు గురైన తర్వాత  సమాచారం బయటకు పొక్కకుండా వారు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వివేకా కుమార్తె వైఎస్ సునీత తన తండ్రి మృతిపై న్యాయం కోరుతూ సాగిస్తున్న సుదీర్ఘ పోరాటానికి పలు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది.    ఇక తాజాగా ఈ కేసులో ఏ2గా ఉన్న యాదటి సునీల్ యాదవ్  సంచలన విషయాలను వెల్లడించారు. వివేకా హత్య ద్వారా లబ్ధి పొందిన వారు మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి అని కుండబద్దలు కొట్టారు. వైఎస్ వివేకా హత్యకు గురి కాకుండా ఉంటే ఆయన నిస్సందేహంగా కడప ఎంపీ అయి ఉండేవారన్న సునీల్ యాదవ్.. దీనిని బట్టే ఈ హత్య వల్ల లబ్ధి పొందినది ఎవరన్నది సులభంగా అవగతమౌతుందన్నారు. సోమవారం (సెప్టెంబర్ 28)  ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సునీల్ యాదవ్.. వైఎస్ వివేకా హత్య విషయంలో తెరముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఉన్నా తెర వెనుక ఉన్నది కచ్చితంగా వైఎస్ జగన్, వైఎస్ భారతి అని విస్పష్టంగా చెప్పారు. వివేకాను హత్య చేయాల్సిన అవసరం తనకు ఇసుమంతైనా లేదన్న ఆయన.. వివేకా హత్యకు గురికాకుండా ఉండి ఉంటే.. ఆయన తనను యాదవ కార్పొరేషన్ చైర్మన్ ను చేసేవారని సునీల్ యాదవ్ చెప్పారు.  ఈ సందర్భంగా ఆయన తన ప్రాణానికి ముప్పు ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్  నుంచి తనకు ముప్పు ఉందనీ, తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఇప్పటికే తనపై మూడు సార్లు హత్య ప్రయత్నం జరిగిందని చెప్పిన సునీల్ యాదవ్.. ఈ కేసులో కీలక సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతిని గుర్తు చేస్తూ తనకు రక్షణ కల్పించాలని ఏపీ, తెలంగాణ సీఎంలకు విజ్ణప్తి చేశారు.  [YS Vivekananda Reddy Murder Case, YS Jagan Mohan Reddy, YS Bharathi, YS Avinash Reddy, AP Politics, A2 Sunil Ydaev, Sensational, Reveal, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘అక్క’ ఎట్టకేలకు స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను యశ్ రాజ్ ఫిల్మ్స్‌కు చెందిన వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ సిరీస్‌తో కీర్తి సురేష్ నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. తాజాగా ‘అక్క’ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ‘అక్క’ కథ 1980ల కాలంలో దక్షిణ భారతదేశంలోని కల్పిత నగరం పెర్నూరులో సాగుతుంది. అక్కడ మహిళల ఆధిపత్యం ఉండే సమాజంలో కీర్తి సురేష్, రాధికా ఆప్టే ఇద్దరూ శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ క్వీన్స్‌గా కనిపించనున్నారు. తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఈ ఇద్దరి ప్రపంచంలోకి ఓ బయటి వ్యక్తి ప్రవేశించడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలు, అధికారం కోసం జరిగే పోరాటం, ప్రతీకారం వంటి అంశాలతో సిరీస్ సాగనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో కీర్తి సురేష్, రాధికా ఆప్టే పాత్రలను పవర్‌ఫుల్‌గా చూపించారు. ఇద్దరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు, గ్యాంగ్‌స్టర్ ప్రపంచం, 1980ల నాటి వాతావరణం సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కీర్తి, రాధికాతో పాటు తన్వీ అజ్మీ, విశాఖ నాయర్, దివ్య శ్రీపాద తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2025లోనే ఈ ప్రాజెక్ట్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించగా.. ఇప్పుడు విడుదల తేదీ ఖరారు కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ‘అక్క’ను వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించగా.. ఆదిత్య చోప్రా, యోగేంద్ర మొగ్రే, అక్షయ్ విధానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్ అధికారిక పేజీలో విడుదల తేదీని ‘Coming Soon’గా చూపిస్తున్నప్పటికీ.. తాజా పరిశ్రమ నివేదికలు అక్టోబర్ 30న ప్రీమియర్ కానున్నట్లు వెల్లడించాయి. దీంతో కీర్తి సురేష్, రాధికా ఆప్టేలను గ్యాంగ్‌స్టర్ పాత్రల్లో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.     [Akka Web Series, Keerthy Suresh Akka, Radhika Apte Akka, Akka Netflix Release Date, Akka OTT Release, Keerthy Suresh OTT Debut, Akka Web Series Netflix, Dharmaraj Shetty Akka, YRF Entertainment Akka]
Trivikram Srinivas is gearing up to meet audiences with Aadarsha Kutumbam starring Victory Venkatesh, Srinidhi Shetty in leading roles. The movie is releasing on 9th October and he spoke about it in an interview. As part of it, he also gave an exciting update about his next with NTR, based on God of War book.  NTR has agreed to be part of this biggie and mythological film based on Lord Karthikeya. Trivikram has revealed that the script work is done and pre-production is going on as well. Once, Aadarsha Kutumbam release, he would continue the pre-production work to be ready for NTR.  Meanwhile, NTR's Dragon with Prashanth Neel has been delayed due to multiple injuries to the actor. He is currently recovering and soon, he will join the sets of the film to complete the shoot. For Lord Karthikeya's role, NTR might undergo a different transformation from Dragon's role.  Trivikram talking about Aadarsha Kutumbam revealed that it will be an out and out entertainer but not a comedy. He remarked that while there is a lot of comedy, the action and emotional parts are highly important. Nara Rohith is playing a prominent role in this S Thaman musical releasing on 9th October.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటేనే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత ఈ కాంబినేషన్‌లో మరో సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈసారి ఇద్దరూ కలిసి చాలా పెద్ద స్కేల్‌లో వస్తున్నారు. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ తెరకెక్కించబోయే మైథలాజికల్ మూవీపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ‘గాడ్ ఆఫ్ వార్’గా ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు త్రివిక్రమ్.  వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ రూపొందించిన 'ఆదర్శ కుటుంబం' అక్టోబర్ 9న విడుదల కానుంది. ఈ మూవీపై ప్రమోషన్స్ లో భాగంగా ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రివిక్రమ్.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ గురించి స్పందించారు. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయిందని, ఇంకా టైటిల్ మాత్రం ఫిక్స్ చేయలేదని తెలిపారు. సుబ్రహ్మణ్య స్వామి కథతో మైథలాజికల్ విజువల్ వండర్ లా ఈ సినిమా తెరకెక్కనుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ టాలెంట్ కి, త్రివిక్రమ్ కి పురాణాలపై ఉన్న పట్టు తోడైతే.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.  ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తయ్యాకే ఎన్టీఆర్–త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇది కూడా చదవండి: ఫస్ట్ టైమ్ అలాంటి పాత్రలో.. లోకేష్ కనగరాజ్‌ సినిమాలో అల్లు అర్జున్ రోల్ ఇదే.!       [God Of War Update, NTR Trivikram Movie, God Of War Movie, Aadarsha Kutumbam Movie, Trivikram Interview, NTR God of War, NTR Subramanya Swamy, NTR Murugan Role, NTR Dragon, Telugu Film News]  
మీరు చూస్తున్న పిక్ లో మెగాస్టార్ చిరంజీవి, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మధ్య క్యూట్ గా ముద్దులొలుకుతూ ఉన్న పాప ఎవరో గెస్ చెయ్యండి. తన భర్త ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ కూడా. ఏంటి.. గెస్ చెయ్యలేకపోతున్నారా! సరే ఎవరో పూర్తి న్యూస్  చదివేయండి చిరంజీవి, బాలకృష్ణ మధ్య అత్యంత ఆత్మీయంగా నిలబడిన ఆ చిన్నారి మరెవరో కాదు, తెలుగు చిత్రసీమలో దాదాపు 5 దశాబ్దాలుగా ఎన్నో సంచలన విజయాలని అందిస్తూ వస్తున్న  ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధినేత, శతచిత్ర నిర్మాత సి. అశ్విని దత్ ముద్దుల కుమార్తె ప్రియాంక దత్!   ఏంటి తనా అనుకుంటున్నారా! అక్షరాలా తనే. చిన్నప్పటి నుంచే ఇంట్లోనూ, షూటింగ్ సెట్లలోనూ నిరంతరం సినీ వాతావరణం, స్టార్ హీరోల సాన్నిహిత్యం మధ్య పెరిగిన ప్రియాంక దత్, పెద్దయ్యాక తన తండ్రి అడుగుజాడల్లోనే సినీ నిర్మాణ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నారు. కేవలం అశ్విని దత్ గారి అమ్మాయి అనే టాగ్ లైన్‌కే పరిమితం కాకుండా, సొంత ప్రతిభతో అగ్ర నిర్మాతగా తనకంటూ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. తన ప్రయాణంలో త్రీ ఏంజిల్స్ స్టూడియో బ్యానర్‌ను స్థాపించి చిన్న సినిమాలకు పెద్ద పీట వేశారు ప్రియాంక. యంగ్ హీరో నారా రోహిత్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన 'బాణం' సినిమాతో నిర్మాతిగా మొదటి అడుగు పడింది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రానికి గాను ఆమె ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 'వెండి నంది పురస్కారాన్ని' అందుకోవడం విశేషం. ఆ తర్వాత 'ఓం శాంతి', 'సారొచ్చారు' చిత్రాలను నిర్మించడమే కాకుండా పవన్‌కళ్యాణ్ 'బాలు', చిరంజీవి 'జై చిరంజీవ' వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు కో-ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తదనంతరం తన సోదరి స్వప్న దత్‌తో కలసి వైజయంతీ మూవీస్ బ్యానర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లారు. ఇది కూడా చదవండి: ఓటీటీలో రచ్చలేపుతున్న మలయాళ సైకో థ్రిల్లర్: ఆ...సుఖాన్ని ఎలా తీర్చుకుంటారో తెలుసా!     ప్రియాంక దత్ నిర్మించిన 'ఎవడే సుబ్రహ్మణ్యం', మహానటి సావిత్రి బయోపిక్‌గా వచ్చిన 'మహానటి' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్లుగా నిలిచి జాతీయ స్థాయిలో అవార్డులు కొల్లగొట్టాయి. ఆమె ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్‌ను వివాహం చేసుకున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన దృశ్యకావ్యం 'కల్కి 2898 AD' చిత్రాన్ని కూడా స్వప్న దత్, ప్రియాంక దత్ కలసి అపారమైన సాహసంతో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై రికార్డు స్థాయిలో ఏకంగా1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి భారతీయ చిత్రసీమలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ 'కల్కి 2' చిత్రీకరణలో నిమగ్నమై ఉండగా, ప్రియాంక దత్ క్రేజీ ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతల్లో బిజీగా ఉన్నారు. చిన్ననాడు చిరు, బాలయ్యల మధ్య ముద్దులొలికిన ఆ పాప, నేడు వెయ్యి కోట్ల గ్లోబల్ వండర్‌ను నిర్మించే స్థాయికి చేరడం నిజంగా విశేషం! మరి చిరంజీవి, బాలకృష్ణ..మల్టిస్టారర్ ని కూడా ప్రియాంక దత్ నే నిర్మిస్తుందేమో చూడాలి. మల్టి స్టారర్ కి ఆల్రెడీ చిరంజీవి, బాలకృష్ణ  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.   [Chiranjeevi And Balakrishna rare photo In Priyanka Dutt, Priyanka Dutt Childhood Pic, Nag Ashwin wife Priyanka, Nag Ashwin wife Priyanka, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రత్యేకంగా నిలిచే ‘కింగ్-100’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగార్జున నటిస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ మూవీకి కోలీవుడ్ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో నాగార్జున సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. టబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ‘కింగ్-100’కు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నాగార్జునతో తలపడే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కోలీవుడ్ యంగ్ హీరో అశోక్ సెల్వన్ నటించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అశోక్ సెల్వన్.. తొలిసారి నాగార్జునకు ఎదురుగా ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తే ఈ కాంబినేషన్ ఆసక్తికరంగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. అశోక్ సెల్వన్ ఇప్పటికే తమిళంలో విభిన్న కథా చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉండే కథలను ఎంచుకుంటూ తన నటనతో మెప్పిస్తున్నారు. అలాంటి హీరో ‘కింగ్-100’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారనే వార్త ఇప్పుడు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. నాగార్జున, అశోక్ సెల్వన్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో కీలకంగా ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. నాగార్జున కెరీర్‌లో 100వ సినిమాగా తెరకెక్కుతున్న ‘కింగ్-100’ను దర్శకుడు రా కార్తీక్ భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కొనసాగుతుండగా.. నటీనటులకు సంబంధించిన ఒక్కో అప్‌డేట్ బయటకు వస్తోంది. తాజాగా అశోక్ సెల్వన్ పేరు తెరపైకి రావడంతో ఈ సినిమాలో విలన్ పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. అయితే ఆయన పాత్రపై పూర్తి వివరాలు తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.     [King 100 Movie, Nagarjuna King 100, Ashok Selvan King 100, Nagarjuna Ashok Selvan, King 100 Villain, Nagarjuna 100th Movie, Aishwarya Rajesh King 100, Ra Karthik King 100]
రొటీన్ సినిమాలు చూస్తే ఏం లాభం..చూస్తే ఇలాంటి సినిమా చూడాలి. చూసాక మీరు పొందే అనుభూతిని మీకే వదిలేస్తున్నాం. అంతలా మెస్మరైజ్ చేయడంలో ఏ మాత్రం నిరుత్సాహపరచదు. మరి ఆ మూవీ ఏంటో చూద్దాం. ఉడల్.. డబ్బు, వివాహేతర సంబంధాల మోజులో పడి తమ కుటుంబాన్ని కొందరు మహిళలు ఎలా నాశనం చేసుకుంటున్నారు అనే పాయింట్ తో తెరకెక్కింది. గత మూడేళ్లుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టిస్తూ, ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపుతున్న మలయాళ సైకో డార్క్ థ్రిల్లర్. 2022 మే 20న విడుదలై బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 దేశాలలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకే ఇంట్లో, కేవలం 2 గంటల వ్యవధిలో సాగే ఈ అరాచక కథనం ప్రేక్షకులకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా రొమాన్స్, మోసం, క్రూరమైన హత్యలు, రక్తం చిందించే రివేంజ్ డ్రామాతో భయపెడుతుంది.  ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్: రామాయణ పార్ట్ 1 ప్రీ పోన్!      కథ విషయానికి వస్తే షైనీ (దుర్గా కృష్ణ), రెజీ (జూడ్ ఆంటోని జోసెఫ్) దంపతులు. వీరికి ఐదేళ్ల కొడుకు ఉంటాడు. రెజీ తన భార్య, పిల్లాడిని తన తల్లిదండ్రులతోపాటే వదిలేసి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తాడు. అలాగే ఆమె అత్త మంచానికే పరిమితమై ఉంటుంది. దీంతో ఆమెకు సేవలు చేయడానికి రెజీ విసుక్కుంటుంది. మరోవైపు మామకు కన్ను సరిగ్గా కనిపించదు. అదే సమయంలో తన పాత కాలేజీ స్నేహితుడు (ధ్యాన్ శ్రీనివాసన్ ) తిరిగి పరిచయం కావడం.. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. ఒక రోజు తన అత్తను ప్రియుడితో కలిసి చంపేస్తుంది. కానీ కోడలు చేసిన ఈ హత్యను తన మామ చూస్తాడు. తన భార్యను చంపిన తన కోడలిని, ఆమె ప్రియుడిని ఎలాగైనా అంతం చేయాలనుకుంటాడు. ఇక అప్పుడే అసలు కథ మొదలవుతుంది. సస్పెన్స్, థ్రిల్లర్ మధ్య ఈ సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుంది.  డబ్బు, వివాహేతర సంబంధాల మోజులో అమ్మాయిలు ఎలా పడతారో క్లియర్ గా చూపించారు. డోంట్ మిస్.    [Udal Malayalam Dark Thriller Ott Sensation, Udal Malayalam movie, Best suspense movies OTT,Amazon Prime Malayalam thrillers, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయ్యాయి. 2001 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ‘సత్య’ అనే పాత్రలో నటించిన రాజీవ్ కనకాల.. పాతికేళ్ల తర్వాత ఆ సినిమా జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన సినీ కెరీర్‌లో ‘స్టూడెంట్ నంబర్ 1’కు ప్రత్యేకమైన స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘స్టూడెంట్ నంబర్ 1’ తన జీవితంలో, సినీ ప్రయాణంలో మరచిపోలేని అధ్యాయమని రాజీవ్ కనకాల తెలిపారు. ఈ సినిమాలో పోషించిన ‘సత్య’ పాత్ర తనకు మంచి గుర్తింపును తీసుకొచ్చిందని.. ఇప్పటికీ ప్రేక్షకులు తనను ఆ పాత్ర పేరుతో గుర్తుపట్టడం ఆనందంగా ఉంటుందని చెప్పారు. ఈ సినిమా విజయవంతమైన తర్వాతే నటనను పూర్తిస్థాయి వృత్తిగా ఎంచుకుని సినిమాల్లో కొనసాగానని ఆయన గుర్తుచేసుకున్నారు. తొలినాళ్లలో సినిమాపై కొందరు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ.. చివరకు 42 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమై విజయాన్ని అందుకుందని తెలిపారు. ఈ సందర్భంగా తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, హీరో ఎన్టీఆర్‌తో పాటు చిత్రబృందానికి రాజీవ్ కనకాల కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమా తనకు అందించిన విలువైన బహుమతి స్నేహమని ఆయన పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్‌తో ఏర్పడిన స్నేహం ఆ తర్వాత కూడా కొనసాగిందని, జీవితాంతం గుర్తుండిపోయే అనుబంధం తనకు లభించిందని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. ఇక ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనూ, రాజమౌళి దర్శకుడిగా ప్రయాణంలోనూ కీలకమైన ప్రారంభ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతోనే రాజమౌళి దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘సింహాద్రి’, ‘ఛత్రపతి’, ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో ఆయన తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 25 ఏళ్ల క్రితం వచ్చిన ‘స్టూడెంట్ నంబర్ 1’ను గుర్తుచేసుకుంటూ రాజీవ్ కనకాల చేసిన పోస్ట్ ఇప్పుడు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.       [Student No 1 25 Years, Rajeev Kanakala, Jr NTR Student No 1, SS Rajamouli Student No 1, Rajeev Kanakala Emotional Post, Student No 1 Anniversary, Rajeev Kanakala NTR Friendship]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ చేస్తుండగా.. ఆ తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో కలిసి ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు. ‘AA23’ వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్న ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకేష్ కనగరాజ్ సినిమాలో అల్లు అర్జున్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం మొదలైంది. ఇప్పటివరకు బన్నీ ఫుల్ లెంగ్త్ సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించలేదు. ‘రేసుగుర్రం’లో మాత్రం కొంతసేపు పోలీస్ గెటప్‌లో కనిపించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు లోకేష్ సినిమాలో బన్నీని పవర్‌ఫుల్ కాప్‌గా చూపించబోతున్నారనే టాక్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. లోకేష్ కనగరాజ్ సినిమాలంటే సాధారణంగా డ్రగ్స్, గ్యాంగ్‌స్టర్స్, మాఫియా, యాక్షన్ ఎలిమెంట్స్ గుర్తొస్తాయి. అయితే పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాలనే తన ఆసక్తిని లోకేష్ గతంలో వ్యక్తంపరిచారు. దీంతో లోకేష్.. అల్లు అర్జున్ కాంబినేషన్‌లోనే అలాంటి పోలీస్ స్టోరీ చేయబోతున్నాడా? అనే చర్చ మొదలైంది. ఇది కూడా చదవండి: ఏమో ఏమో ఇది.. సరికొత్త లవ్ ఆంథమ్‌ వచ్చేసింది.!       [Allu Arjun Cop Role, Allu Arjun Police Role, Allu Arjun Role In AA23, AA23 Movie, Allu Arjun, Lokesh Kanagaraj, Anirudh Ravichander, Raaka Movie, Telugu Film News, Telugu News]  
భారతీయ  సినీ ప్రేమికులతో పాటు, రామభక్తులందరు కళ్లల్లో వత్తులు వేసుకొని మరి రామాయణ కోసం చూస్తున్నారు. ప్రచారచిత్రాలతో రామాయణ ఎలా ఉండబోతోందనే ఆలోచన కూడా వాళ్ళ మస్తిష్కాల్లో ఉంది. ఈ విజువల్ వండర్ గురించి ఇప్పుడు ఒక క్రేజీ అప్‌డేట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. నవంబర్ 8న దీపావళి కానుకగా రామాయణ విడుదల కాబోతుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓవర్ సీస్ మాత్రం 6 న విడుదల కానుంది. కానీ ఇప్పుడు  ఓవర్సీస్ అండ్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు భారీ స్థాయిలో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసేందుకు వీలుగా, మేకర్స్ నవంబర్ 5నే థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట. అంటే, అనుకున్న సమయం కంటే 3 రోజుల ముందే ఈ పౌరాణిక దృశ్యకావ్యం మన ముందుకు రాబోతుందని బాలీవుడ్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇది కూడా చదవండి: మేడారం సమ్మక్క,సారలమ్మ దగ్గర నాని: సమర్పించిన మొక్కు వివరాలు ఇవే!   ఇందుకు కారణం కూడా లేకపోలేదు. పండగ రోజు రిలీజ్ చేసే పూజలు, టపాసులు పనిలో ప్రేక్షకులు హడావిడిగా ఉంటారని మేకర్స్ బావిస్తున్నారంట.   [Ramayana Part 1 Preponed Release Date, ,Ramayana Part 1 , Yash Ravana Ramayana, Sai Pallavi Sita, Ramayana November 5 release, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన ఇండస్ట్రీగా ఉండేది. కానీ ‘బాహుబలి’ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్ సినిమాలు దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించడంతో పాటు.. మన హీరోలకు ఇతర భాషల్లోనూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు ఇతర దక్షిణాది పరిశ్రమల నుంచి కూడా తెలుగు హీరోలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి భవిష్యత్తులో ఇండియన్ సినిమా నంబర్‌-1 స్టార్‌గా ఎవరు ఎదుగుతారనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ చర్చలో ప్రభాస్ పేరు ముందుగా వినిపిస్తోంది. ‘బాహుబలి’ రెండు భాగాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్.. ఆ తర్వాత ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి సినిమాలతోనూ తన మార్కెట్‌ను మరింత విస్తరించారు. మరోవైపు ‘పుష్ప 2’తో అల్లు అర్జున్ కూడా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింద‌ని పేర్కొన్నారు. దీంతో వీరిద్దరి పేర్లు ఈ చర్చలో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్థాయిలో తమ మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో ఇద్దరికీ దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో.. భవిష్యత్తు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో రూపొందుతుండటంతో.. సినిమా సాధించే ఫలితాలు మహేశ్ బాబు పాన్ ఇండియా మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే ఈ సినిమా రూ.3,000 కోట్ల వసూళ్లు సాధిస్తుందన్నది ప్రస్తుతం అంచనా మాత్రమే. అయితే ఒక‌టి రెండు సినిమాల విజయాలతోనే ఇండియాలో నంబర్‌-1 స్టార్ అనే స్థానం దక్కదనే అభిప్రాయం కూడా ఉంది. వరుసగా విజయాలు సాధించడం, బాక్సాఫీస్ వద్ద రికార్డులు నమోదు చేయడం, దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడం వంటి అంశాలు కీలకంగా మారతాయి. అలాగే నటనతో పాటు డ్యాన్స్, యాక్షన్ వంటి విభిన్న అంశాల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే సామర్థ్యం అవసరం. అందుకే ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు.. వీరిలో భవిష్యత్తులో ఎవరి స్టార్‌డమ్ ఏ స్థాయికి వెళ్తుందో తెలుసుకోవాలంటే రాబోయే కొన్ని సంవత్సరాల సినిమాల ఫలితాలను చూడాల్సిందే. [Tollywood Number One Star, Indian Cinema Number One Hero, Prabhas, Allu Arjun, Mahesh Babu, Ram Charan, Jr NTR, Tollywood Pan India Stars, Top Telugu Heroes, Indian Cinema Stars]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
హైదరాబాద్‌లోని యువతను ఇప్పుడు తీవ్రంగా కలవరపెడుతున్న అంశం ఏదైనా ఉందంటే అది అకాల బట్టతలే! ఒకప్పుడు 45 నుండి 50 సంవత్సరాలు దాటిన తర్వాత కనిపించే బట్టతల సమస్య, ఇప్పుడు 20 నుండి 29 ఏళ్ల చిన్న వయస్సులోనే అత్యంత వేగంగా ముసురుకుంటోంది. ఐటీ కారిడార్లు, స్టార్టప్‌లు, కార్పొరేట్ కంపెనీలలో పనిచేస్తున్న యువతీయువకులలో చాలామంది ఈ సమస్యతో నిత్యం మానసిక వేదనను అనుభవిస్తున్నారు. కేవలం 29 ఏళ్లకే తలపై జుట్టు విపరీతంగా పల్చబడిపోవడం, నుదుటి భాగం వెనక్కి వెళ్లడం వంటి లక్షణాలు కనిపిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల వెలువడిన ఆరోగ్య అధ్యయన నివేదికల ప్రకారం, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో నగరంలో ప్రతి 10 మంది పురుషులలో దాదాపు 6 నుండి 7 మంది ఏదో ఒక స్థాయి జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. తెలంగాణా వ్యాప్తంగా జరిపిన ఆరోగ్య సర్వేలలో కేవలం ఒక్క ఏడాదలోనే ఉత్తమ జీర్ణ ఆరోగ్య శాతంలో 4.10 శాతం భారీ క్షీణత నమోదైంది. గతంలో 19.13 శాతంగా ఉన్న ఆరోగ్య సూచిక 15.03 శాతానికి పడిపోవడం, దేశంలోనే అత్యంత ఆందోళనకరమైన మార్పుగా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. యువతలో బట్టతల వేగంగా రావడానికి ప్రధానంగా జీవనశైలి మార్పులే కారణమని చర్మ మరియు జుట్టు సంరక్షణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో పెరిగిన పని ఒత్తిడి, నైట్ షిఫ్ట్‌లు, వేళకాని వేళల్లో ఆహారం తినడం, నిద్రలేమి, రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర కూడా సరిగ్గా లేకపోవడం జుట్టు కుదుళ్లను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. దీనికి తోడు జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ బి12, ఐరన్, జింక్, ప్రొటీన్ల లోపం ఏర్పడి జుట్టు రాలడం వేగవంతమవుతోంది. హైదరాబాద్‌లో లభించే నీటిలోని కఠినత్వం, కాలుష్యం మరియు ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అనే జన్యుపరమైన అండ్రోజెన్ హార్మోన్ల వ్యత్యాసం కూడా ఈ సమస్యకు మరిన్ని వినాశకరమైన రెక్కలు తొడుగుతోంది. రోజూ సాధారణంగా 50 నుండి 100 వెంట్రుకలు రాలడం సహజమే అయినప్పటికీ, నిత్యం 150కి పైగా వెంట్రుకలు రాలుతుంటే దానిని తీవ్రమైన సంకేతంగా భావించాలి. ఈ భయంతో చాలామంది యువకులు రాత్రికి రాత్రే జుట్టు వస్తుందని చెప్పే ఫేక్ నూనెలు, సైన్స్ ప్రామాణికత లేని లోషన్లు వాడి ముఖాలు వాచిపోవడం, చర్మ వ్యాధులు కొనితెచ్చుకోవడం వంటి మోసాల బారిన పడుతున్నారు. అకాల బట్టతలను నివారించాలంటే ప్రాథమిక స్థాయిలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రారంభ దశలోనే డాక్టర్లను సంప్రదించి ఫినాస్టరైడ్, మినాక్సిడిల్ లేదా పీఆర్‌పీ (PRP) చికిత్సల ద్వారా 80 శాతానికి పైగా జుట్టును కాపాడుకోవచ్చు. నిత్యం సమతుల్య ఆహారం తీసుకోవడం, యోగా లేదా ధ్యానంతో ఒత్తిడి తగ్గించుకోవడం, కనీసం 7 గంటల ప్రశాంతమైన నిద్రపోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.     [ Hyderabad, Telangana, Hair Loss, Premature Baldness, Hair Fall, Androgenetic Alopecia, Hair Health, Vitamin B12 Deficiency, Iron Deficiency, Hair Care ]  
పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు.! పిల్లల పెంపకం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, అది ఒక నిరంతర ప్రయాణం. పిల్లలు తల్లిదండ్రులు  చెప్పే మాటల కంటే వాళ్లు  చేసే పనులనే ఎక్కువగా గమనిస్తారు, అనుకరిస్తారు. ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తనే పిల్లల భవిష్యత్తుకు, వారి వ్యక్తిత్వానికి పునాది అవుతుంది. ఇంట్లో ఆత్మీయత, అనురాగం ఉన్నప్పుడే పిల్లలు శారీరకంగా, మానసికంగా బలంగా ఎదుగుతారు. అందుకే వారి ముందు తల్లిదండ్రులు  ఎలా ప్రవర్తిస్తున్నారనేది చాలా ముఖ్యం. పిల్లల ఎదుట తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఎలాంటి పనులు చేయకూడదో వివరంగా తెలుసుకుంటే.. పిల్లల ముందు తల్లిదండ్రులు ఇలా ఉండాలి ఆప్యాయత, గౌరవంతో మాట్లాడాలి.. ఇంట్లో తల్లిదండ్రులు ఒకరినొకరు గౌరవించుకుంటూ, ప్రేమగా మాట్లాడుకోవడం చూసినప్పుడు పిల్లల్లో నేర్చుకునే తత్వం, నమ్మకం పెరుగుతాయి. వారు కూడా ఇతరులతో అలాగే మర్యాదగా మాట్లాడటం అలవాటు చేసుకుంటారు. చెప్పేది వినే ఓపిక ఉండాలి.. పిల్లలు స్కూల్ నుండి రాగానే లేదా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వారి మాటలను శ్రద్ధగా వినాలి. తల్లిదండ్రులకు ఎంత పని ఉన్నా, వారి మాటలకు విలువ ఇస్తే తమ సమస్యలను తల్లిదండ్రుల దగ్గర  దాచకుండా పంచుకుంటారు.  జీవనం.. తల్లిదండ్రులు  పిల్లలకు ఎలాంటి మంచి అలవాట్లు ఉండాలని కోరుకుంటారో, మొదట తల్లిదండ్రులు కూడా  వాటిని పాటించి చూపాలి. సమయపాలన, నిజాయితీ, తోటివారికి సహాయం చేయడం వంటి గుణాలను తల్లిదండ్రులను చూసే పిల్లలు నేర్చుకుంటారు. ప్రోత్సాహం అందించాలి.. పిల్లలు ఏ చిన్న మంచి పని చేసినా లేదా ఆటల్లో, చదువులో ప్రయత్నించినా మెచ్చుకోవాలి. ఓడిపోయినప్పుడు నిరాశపడకుండా, మళ్లీ ప్రయత్నించేలా ధైర్యం చెప్పాలి. శాంతంగా, సహనంతో ఉండాలి.. పరిస్థితులు ఎలా ఉన్నా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. తల్లిదండ్రులు  కోపంగా కాకుండా సహనంతో నిర్ణయాలు తీసుకోవడం చూస్తే, పిల్లలు కూడా ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో నేర్చుకుంటారు. పిల్లల ముందు తల్లిదండ్రులు ఇలా ఉండకూడదు.. గొడవలు పడకూడదు.. తల్లిదండ్రులు పిల్లల ఎదుట అరుచుకోవడం, పెద్దగా గొడవపడటం అసలు చేయకూడదు. ఇది వారిని తీవ్ర భయానికి, ఆందోళనకు గురిచేస్తుంది. వారి మనస్సులో అభద్రతా భావం ఏర్పడుతుంది. ఇతరులతో పోల్చకూడదు.. పక్కింటి పిల్లలతోనో లేదా తోబుట్టువులతోనో పోల్చి మాట్లాడకూడదు. నువ్వు దేనికి పనికిరావు అని తక్కువ చేసి మాట్లాడితే వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఎప్పుడూ ఫోన్లకే పరిమితం కాకూడదు.. పిల్లల ముందు తల్లిదండ్రులు గంటల తరబడి మొబైల్ ఫోన్లు వాడటం, టీవీలు చూడటం తగ్గించాలి. తల్లిదండ్రులే  ఫోన్ పట్టుకుని కూర్చుంటే, పిల్లలకు దూరంగా ఉండమని చెప్పే హక్కు తల్లిదండ్రులు  కోల్పోతారు. అబద్ధాలు చెప్పడం లేదా ఇతరులను దూషించడం.. తల్లిదండ్రులు తమకు  తెలియకుండానే పిల్లల ముందు చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం లేదా ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం చేయకూడదు. అది చూసి పిల్లలు కూడా అబద్ధాలు చెప్పడం సహజమేనని అనుకుంటారు. అతిగా కోప్పడటం లేదా కొట్టడం.. చిన్న చిన్న పొరపాట్లకు పిల్లలపై విరుచుకుపడటం, కొట్టడం చేయకూడదు. అలా చేస్తే వారిలో మొండితనం పెరుగుతుంది తప్ప మార్పు రాదు. పిల్లలకు తల్లిదండ్రులు  ఇచ్చే అతిపెద్ద బహుమతి డబ్బు,  ఆస్తులు కాదు, ఒక మంచి, సురక్షితమైన వాతావరణం. ప్రేమ, సహనం, ఆప్యాయతలతో కూడిన పెంపకమే వారిని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది.                                                                                                                                                *రూపశ్రీ.
మన భారతీయుల నిత్య జీవితంలో అన్నం లేని ఆహారాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అని తేడా లేకుండా ప్రతిరోజూ ప్లేట్ నిండా తెల్లటి పాలిష్ చేసిన బియ్యాన్ని తినడానికి అలవాటుపడిపోయాం. అయితే, రుచికి ఎంతో బాగుండే ఈ పాలిష్డ్ తెల్ల బియ్యం మన ఆరోగ్యానికి ఎంతటి చేటు చేస్తుందో అని తెలిస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. ధాన్యం నుంచి లభించే పోషకాలను, పీచు పదార్థాన్ని పాలిషింగ్ ప్రక్రియ ద్వారా పూర్తిగా తొలగించి కేవలం పిండి పదార్థాన్ని మాత్రమే మిగిల్చే తెల్ల బియ్యం కంటే, తృణధాన్యాల వర్గానికి చెందిన  బ్రౌన్ రైస్  (తవుడు తీయని బియ్యం) రోజూ తీసుకోవడం వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకునే వారికి, ముఖ్యంగా ఆధునిక జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్న వారికి బ్రౌన్ రైస్ ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో విటమిన్ బి1, విటమిన్ బి3, విటమిన్ బి6 వంటి అత్యవసర విటమిన్లు, అలాగే మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, ఇనుము మరియు జింక్ వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటన్నింటికీ మించి బ్రౌన్ రైస్‌లో లభించే అధిక పీచు పదార్థం (ఫైబర్) జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కడుపులో ఉండి నెమ్మదిగా అరుగుతుంది. కాబట్టి కొద్దిగా తిన్నా సరే కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా అతిగా తినే అలవాటు తగ్గి, బరువు తగ్గాలనుకునే వారికి మరియు ఊబకాయంతో బాధపడేవారికి బ్రౌన్ రైస్ ఒక అద్భుతమైన ఆహార ఎంపికగా మారుతుంది. ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మధుమేహం లేదా టైప్ 2 డయాబెటిస్. తెల్లటి బియ్యం తిన్నప్పుడు అందులోని పిండి పదార్థం వేగంగా రక్తంలో గ్లూకోజ్‌గా మారి షుగర్ లెవెల్స్‌ను ఒక్కసారిగా పెంచేస్తుంది. కానీ బ్రౌన్ రైస్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువగా ఉంటుంది. దీనిని ఆహారంగా తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగకుండా చాలా నెమ్మదిగా విడుదలవుతాయి. అందువల్ల డయాబెటిస్ బాధితులు బ్రౌన్ రైస్‌ను తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ స్థాయిలను చాలా సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి మరియు గుండె ఆరోగ్యాన్ని పటిష్టం చేసుకోవాలనుకునే వారికి బ్రౌన్ రైస్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో లభించే పీచు పదార్థం, మాంగనీస్ మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో దోహదపడతాయి. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడి, రక్తపోటును (బిపి) అదుపులో ఉంచుతుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన ముప్పుల నుంచి రక్షణ లభిస్తుంది. శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తూ, మెదడు నాడీ వ్యవస్థను వేగవంతం చేయడంలో బ్రౌన్ రైస్ సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక పూట తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్‌ను అలవాటు చేసుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యవంతమైన జీవనాన్ని సొంతం చేసుకోవచ్చు.     [ Brown Rice, White Rice, Whole Grains, Dietary Fiber, Diabetes, Blood Sugar, Low Glycemic Index, Weight Management, Heart Health, Cholesterol ]
ఛాతిలో నొప్పి వస్తే అది గ్యాస్ సమస్యా? లేక గుండెపోటు లక్షణమా? ఈ రెండింటి మధ్య తేడాను ఎలా గుర్తించాలి? గుండెపోటు వచ్చినప్పుడు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? ఈ వీడియోలో కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేష్ నటువా గారు వివరంగా చెబుతున్నారు. ఛాతీ మధ్యలో బరువుగా, బిగుతుగా లేదా పిండుతున్నట్టుగా అనిపించడం, నొప్పి ఎడమ చేయి, మెడ లేదా పొట్ట వైపు వ్యాపించడం వంటి లక్షణాలతో పాటు విపరీతమైన చెమటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆందోళన, త్వరగా అలసిపోవడం వంటి సంకేతాలను కూడా తెలుసుకోండి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు, 70 ఏళ్లు పైబడినవారు, మహిళల్లో కొన్నిసార్లు సాధారణ ఛాతినొప్పికి బదులుగా గ్యాస్ లేదా హార్ట్‌బర్న్‌లా లక్షణాలు కనిపించవచ్చు. డయాబెటిస్, అధిక రక్తపోటు, ఊబకాయం, పొగతాగడం, మద్యం వంటి గుండెపోటు ప్రమాద కారకాలు ఉన్నప్పుడు లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవడం ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి. చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తోంది? జంక్ ఫుడ్, శారీరక శ్రమ తగ్గిపోవడం, అధిక బరువు, కుటుంబ చరిత్ర, జన్యుపరమైన కారణాలు, కొలెస్ట్రాల్ వంటి అంశాలు గుండె ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయో కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఛాతినొప్పిని సాధారణ గ్యాస్ సమస్యగా భావించే ముందు ఈ ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ఉదయాన్నే పరగడుపున నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని మన పెద్దలు, వైద్యులు ఎప్పుడూ చెబుతుంటారు. అయితే సాధారణంగా నిలబడి లేదా కుర్చీలో కూర్చుని నీరు తాగడం కంటే.. మలాసనంలో (స్క్వాట్ పొజిషన్) కూర్చుని నీరు తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ఇలా మలాసనంలో కూర్చుని ఉదయాన్నే నీరు ఎందుకు తాగాలి? దీని వెనుక ఉన్న అసలైన కారణాలు, ఆరోగ్య రహస్యాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే.. మలాసనం అంటే ఏమిటి? మలాసనం అంటే నేలపై రెండు కాళ్లను ముందుకు చాపి, మోకాళ్లను వంచి, పిరుదులు నేలకు దగ్గరగా ఉండేలా కూర్చునే పద్ధతి. మనం పాతకాలంలో వాడే ఇండియన్ టాయిలెట్ లో కూర్చునే పద్ధతి కూడా ఇదే. ఈ భంగిమ మన శరీరానికి చాలా సహజమైనది. మలాసనంలో కూర్చుని నీరు తాగడం వల్ల కలిగే లాభాల.. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.. మలాసనంలో కూర్చున్నప్పుడు మన పొట్ట భాగం మీద సహజమైన ఒత్తిడి పడుతుంది. ఈ సమయంలో నీరు తాగినప్పుడు, ఆ నీరు నేరుగా ప్రేగుల్లోకి సులభంగా వెళ్తుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ మేల్కొని, రాత్రి తిన్న ఆహారం బాగా అరిగిపోతుంది. మలబద్ధకం సమస్య మాయం.. చాలామంది ఉదయాన్నే మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. మలాసనంలో కూర్చుని నీరు తాగడం వల్ల పెద్దప్రేగుపై సరైన ఒత్తిడి కలిగి, ప్రేగుల కదలికలు పెరుగుతాయి. దీంతో పొట్ట త్వరగా శుభ్రపడుతుంది. రోజూ ఇలా చేస్తే మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్తాయి.. రాత్రి సమయంలో మన శరీరం అంతర్గతంగా శుభ్రపడే ప్రక్రియ జరుగుతుంది. ఉదయాన్నే మలాసనంలో నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు, వ్యర్థాలు మూత్రం , మలం ద్వారా బయటకు సులభంగా వెళ్ళిపోతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.. నిలబడి నీరు తాగడం వల్ల నీరు వేగంగా కిడ్నీల గుండా ప్రవహించి, సరైన వడపోత జరగదు. కానీ మలాసనంలో కూర్చుని నీరు తాగినప్పుడు శరీరం నీటిని సరిగ్గా పీల్చుకుంటుంది. దీనివల్ల కిడ్నీల మీద భారం పడదు, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.  కీళ్ల నొప్పులు రావు.. నిలబడి నీరు తాగే అలవాటు ఉన్నవారికి భవిష్యత్తులో మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. అదే కూర్చుని, ముఖ్యంగా మలాసనంలో నీరు తాగడం వల్ల శరీరంలోని ద్రవాల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. ఈ పద్ధతిని ఎలా పాటించాలి? ఉదయాన్నే లేవగానే నోరు శుభ్రం చేసుకుని లేదా చేసుకోవడానికి ముందే ఒక లీటరు లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. నేలపై శుభ్రమైన చాప లేదా మ్యాట్ వేసుకుని మలాసనంలో కూర్చోవాలి. నీటిని ఒక్కసారిగా వేగంగా తాగకుండా, ఒక్కో గుటక మెల్లగా ఆస్వాదిస్తూ తాగాలి. నీరు తాగాక ఒక ఐదు నిమిషాలు అలాగే కూర్చుంటే పొట్టలో కదలికలు మొదలై, మలవిసర్జన సులభంగా జరుగుతుంది. ఈ సమస్యలు ఉన్నవారు  జాగ్రత్తలు తీసుకోవాలి.. మోకాళ్ల నొప్పులు తీవ్రంగా ఉన్నవారు, ఇటీవలే శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు లేదా నడవడానికి ఇబ్బంది పడేవారు మలాసనంలో కూర్చోవడం కష్టం కావచ్చు. అలాంటి వారు మామూలుగా కుర్చీలో కూర్చుని గోరువెచ్చని నీరు తాగవచ్చు. ఉదయాన్నే మలాసనంలో కూర్చుని నీరు తాగడం అనేది ఒక సహజమైన , అద్భుతమైన ఆరోగ్య అలవాటు. ఎలాంటి ఖర్చు లేకుండా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ చిన్న మార్పు ఎంతగానో ఉపయోగపడుతుంది.                                                                                                                                                  *రూపశ్రీ.
 గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి డాక్టర్లు చెప్పిన సలహాలు..! గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఒక్క రోజులో జరిగే  పని కాదు. నేటి ఆధునిక జీవనశైలి, సరైన పోషకాహారం లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వంటి అనేక కారణాల వల్ల చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం మన దేశంలో సంభవిస్తున్న మరణాలలో ఎక్కువ భాగం గుండె జబ్బుల వల్లే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే, ముందే మన లైఫ్ స్టైల్ లో  కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చని ప్రముఖ వైద్యులు సూచిస్తున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే.. చురుగ్గా ఉండటం.. బాగా  వర్కవుట్లు చేయలేకపోయినా, రోజూ కొంత సమయం నడవడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజంతా ఒకే చోట కూర్చుని పనిచేసే వారు మధ్యమధ్యలో లేచి కాసేపు అటుఇటు తిరగడం వల్ల శరీరంలో రక్తం సరఫరా మెరుగ్గా ఉంటుంది. ఆహారం..  బరువు తగ్గడం కోసమే కాకుండా, శరీర జీవక్రియలను క్రమబద్ధీకరించే పౌష్టికాహారాన్ని ఎంచుకోవాలి. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం ఎంత పరిమాణంలో ఉందో, అందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయో గమనించడం చాలా అవసరం. దీర్ఘకాలంలో గుండెకు మేలు చేసే బాలెన్స్డ్  ఆహారాన్ని అలవాటు చేసుకోవడం మంచిది. కండరాలను బలంగా ఉంచే వ్యాయామాలు..  వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కండరాల సాంద్రత తగ్గుతుంది. అందుకే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేదా కండరాలను దృఢపరిచే వ్యాయామాలు చేయడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుందని, ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో రక్షణ ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం.. ఇప్పటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి చాలా సాధారణమైపోయింది. ఒత్తిడి గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే మనస్సును, నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచడానికి సంగీతం వినడం, ధ్యానం చేయడం, లోతైన శ్వాస తీసుకోవడం వంటివి చేయాలి. రోజులో కొంత సమయాన్ని మనస్సును తేలికపరిచే కార్యకలాపాల కోసం కేటాయించడం చాలా ఉపయోగకరం. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏవేవో  ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. మన రోజువారీ అలవాట్లలో నడకను భాగం చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని దూరం చేసుకోవడం వంటి చిన్న చిన్న మార్పుల ద్వారానే ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.                                  *రూపశ్రీ.