LATEST NEWS
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరిట కొత్త పార్టీ ప్రారంభించడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది.  పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పార్టీలోని అహంకారపూరిత ధోరణులు, ముఖ్యంగా కేటీఆర్ మరియు హరీష్ రావుల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న కల్వకుంట్ల నేరుగా తండ్రి కేసీఆర్ పైనే యుద్ధం ప్రకటించారు. బీఆర్ఎస్  ఉద్యమకారులను, మేధావులను పక్కనపెట్టి కేవలం కొందరికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ పార్టీ పార్టీ పునాదులు బలహీనపడ్డాయి.  ఇప్పుడు కవిత సొంత పార్టీతో బీఆర్ఎస్ కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని అంటున్నారు.   కవిత వ్యూహం కేవలం కొత్త పార్టీ పెట్టడం మాత్రమే కాదు, బీఆర్ఎస్ పట్ల అసంతృప్తిగా ఉన్న కేడర్‌ను తనవైపు తిప్పుకోవడం.  తెలంగాణ రాష్ట్ర సమితి  అనే పాత పేరుపై ప్రజలకు ఉన్న సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆమె  తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన  (టీఆర్ఎస్) అనే పేరును ఎంచుకోవడం ద్వారా..  పాత టీఆర్ఎస్ వారసత్వాన్ని సొంతం చేసుకోవడమనే వ్యూహం కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కవిత కొత్త పార్టీ వల్ల ప్రధానంగా నష్టపోయేది బీఆర్ఎస్ అని అంటున్నారు. కవిత కొత్త పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకునే చీలుస్తుందని చెబుతున్నారు.   అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు ఈ అంతర్గత కలహాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాయనడంలో సందేహం లేదు. కవితకు బీజేపీ పరోక్ష మద్దతు ఉండవచ్చని, తద్వారా బీఆర్ఎస్ బార్గేనింగ్ శక్తిని తగ్గించడమే ఆమె అసలు లక్ష్యమని విశ్లేషకులు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వంటి ఆరోపణలు, కుటుంబ సభ్యుల మధ్య ఈగో క్లాష్‌లు కూడా ఈ చీలికకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.ఇదే విషయాన్ని తెలుగువన్ చర్చా వేదికలో సువేరా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.   కవిత నిర్ణయం తెలంగాణలో ఒక కొత్త రాజకీయ శక్తిని సృష్టించవచ్చున్న ఆయన..  ఆమె కేవలం కేసీఆర్ బిడ్డగానే కాకుండా, తనకంటూ ఒక సొంత ఇమేజ్‌ను నిర్మించుకోవాలని చూస్తున్నాన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ బలహీనపడి, క్రమంగా బీజేపీలో విలీనమయ్యే అవకాశాలు  కొట్టిపారేయలేన్న సువేరా.. కవిత పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఆమె ఎంచుకునే నాయకులు, యూత్ మేనిఫెస్టోపై ఆధారపడి ఉంటుందన్నారు. ఒకవేళ ఆమె బలమైన శక్తిగా ఎదిగితే, తెలంగాణలో త్రిముఖ పోటీ మరింత తీవ్రమై రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. మహిళా బిల్లు వంటి అంశాలపై ఆమె చేస్తున్న పోరాటం మహిళా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని సువేరా అభిప్రాయపడ్డారు.   
   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన, బీజేపీలో చేరడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇప్పుడు తన తదుపరి రాజకీయ అడుగుల కోసం తీవ్రంగా మథనపడుతున్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు  అభ్యంతరం తెలపడం వల్లే, విజయసాయిరెడ్డికి కాషాయ పార్టీ తలుపులు మూసుకున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు, ఇటీవల జరిగిన ఈడి సోదాలు ఆయన్ను మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి. వ్యూహాలు మరియు పరిణామాలు: విజయసాయిరెడ్డి రాజకీయంగా ఒంటరవుతున్న తరుణంలో, ఆయన కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. లిక్కర్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారిని వదిలేసి, తనను విచారణల పేరుతో వేధిస్తున్నారని ఆయన ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు నాయుడుపై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆయనలోని రాజకీయ ఫ్రస్ట్రేషన్‌కు అద్దం పడుతున్నాయి.  ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, తనదైన మార్గంలో ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయనకు క్షేత్రస్థాయిలో ఆదరణ లభించడం ప్రశ్నార్థకమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెలుపల తనకంటూ ఒక రాజకీయ ఉనికిని చాటుకోవాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ప్రధానంగా జగన్‌కు పరోక్షంగా ఉపయోగపడతాయా లేదా అన్నది కూడా గమనార్హం. భవిష్యత్తు రాజకీయ ప్రభావం: రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి నిర్ణయం కీలక మలుపు కావచ్చు. ఆయన సొంతంగా పార్టీ పెట్టినా, లేదా మరొక కూటమితో పొత్తు పెట్టుకున్నా, ప్రస్తుత రాజకీయ వాతావరణంలో అది ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది చూడాలి. ముఖ్యమంత్రి పట్ల ఆయన చూపుతున్న తీవ్ర వ్యతిరేకత, టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. వ్యవస్థలపైన, దర్యాప్తు సంస్థల పైన ఆయనకు ఉన్న నమ్మకం సడలిపోవడం, తన ఉనికిని కాపాడుకోవడానికి ఆయన చేసే రాజకీయం రాష్ట్రంలో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది.  రాజకీయంగా ఆయన ఏ అడుగు వేసినా, అది ఆయన భవిష్యత్తును నిర్ణయించడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తోంది. అయితే, ప్రజల్లోకి వెళ్లడం మరియు ప్రజల సమస్యలపై పోరాడటం అనే అంశాల్లో ఆయన వెనుకబడి ఉన్నారన్నది వాస్తవం. కేవలం మీడియా సమావేశాలు, సోషల్ మీడియా ట్వీట్లకే పరిమితం కాకుండా, ప్రజల్లోకి వెళ్తేనే ఆయన రాజకీయ మనుగడ సాధ్యమవుతుంది. తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్‌లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యూహాలపై కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమిల్లి శ్రీనివాస్‌రావు, జర్నలిస్ట్ గోపి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.. తప్పక వీక్షించండి  
కేంద్ర ఎన్నికల సంఘం  ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ణానేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ   ప్రతిపక్ష పార్టీలు తమ గళాన్ని పెంచాయి.  ఈ మేరకు వివిధ పార్టీలకు చెందిన సుమారు 73 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసిన  నోటీసును రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు అందజేశారు. భారత ఎన్నికల సంఘం పనితీరుపై గత కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు, ఇప్పుడు నేరుగా సీఈసీని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగడం రాజకీయ వర్గాల్లో   సంచలనంగా మారింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని తొలగించాలనే ప్రతిపాదనతో కూడిన ఈ పరిణామం హాట్ టాపిక్ గా మారింది.  ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి.   ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియకు వెన్నెముకగా నిలిచే ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని విపక్ష నేతలు పేర్కొన్నారు. గతంలో కూడా కొన్ని అంశాలపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఈసారి ఏకంగా 73 మంది సభ్యులు ఒకే తాటిపైకి వచ్చి అధికారికంగా నోటీసు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి,  ఎన్నికల కమిషన్‌కు ఒక సవాలుగా మారిందనడంలో సందేహం లేదు. నోటీసులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఎన్నికల సమయంలో నిబంధనల అమలులో వివక్ష, అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు వంటి ఆరోపణలు ఉన్నాయి.  కీలకమైన అంశాలపై ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం, ఓటర్ల జాబితాలో మార్పులు-చేర్పులు వంటి సున్నితమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి అంశాలను సభ్యులు తమ నోటీసులు సభ్యులు పేర్కొన్నారు.   రాజ్యసభ నిబంధనల ప్రకారం..  రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటే తగిన సంఖ్యలో సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుత నోటీసుపై 73 మంది సభ్యులు సంతకాలు చేయడంతో..  దీనిపై సభలో చర్చ జరగాలనే డిమాండ్ మరింత గట్టిగా వినిపించే అవకాశం ఉంది. చైర్మన్ ఈ నోటీసును పరిశీలించి, అది నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో  నిర్ధారించుకునన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటారు. సపోజ్ ఫర్ సపోజ్ ఈ నోటీసు ఆమోదం పొందితే, సభలో దీనిపై  చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. గత కొద్ది కాలంగా ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న సాంకేతికత మరియు ఎన్నికల కోడ్ అమలు తీరుపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో రాజ్యాంగ సంస్థలు విఫలమవుతున్నాయని విపక్షాలు పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఈసీని లక్ష్యంగా చేసుకుని విపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసు ప్రాధాన్యత సంతరించుకుంది.  
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో తొలి విడత పోలింగ్ ముగిసిన వేళ  కేంద్ర హోంమంత్రి అమిత్ షా  ప్రకటన రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. మొదటి దశలో పోలింగ్ జరిగిన 152 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 110కి పైగా సీట్లను కైవసం చేసుకోబోతోందని ఆయన   ధీమాగా చెప్పారు.  రాష్ట్రంలో గాలి   మార్పు స్పష్టంగా గోచరిస్తోందన్న అమిత్ షా..  తృణమూల్ కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ భారీ అంచనా వెనుక గణాంకాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అమిత్ షా లెక్కలు నిజం కావాలంటే..  ఈ ప్రాంతాల్లో కమలం పార్టీ ఓటు బ్యాంకులో భారీ ఎత్తున  స్వింగ్ రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా అధికార టీఎంసీ ఓట్ల నుంచి సుమారు 10 శాతం, ఇతరుల నుంచి మరో 5 శాతం ఓట్లు బీజేపీ వైపు మళ్ళితేనే  అమిత్ షా చెప్పిన సంఖ్యలో నియోజకవర్గాలలో బీజేపీ విజయం సాధ్యమవుతుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నమోదైన అధిక పోలింగ్ శాతం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మాల్దా, జల్పాయ్‌గురి, మేదినిపూర్ వంటి ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావడం మార్పుకు సంకేతమని కాషాయ దళం భావిస్తోంది.  ముఖ్యంగా గతంలో టీఎంసీకి అండగా నిలిచిన కొన్ని వర్గాల ఓట్లు చీలిపోవడం.. ముస్లిం ఓట్లలో  విభజన   తమకు కలిసి వస్తుందని కమలం పార్టీ బలంగా నమ్ముతోంది.  మాల్దా వంటి చోట్ల కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ వంటి పార్టీలు టీఎంసీ ఓటు బ్యాంకును దెబ్బతీసి.. అది పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తాయని ఆశిస్తోంది. అయితే, ఈ అంచనాలపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  రాజకీయ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. 152 సీట్లలో దాదాపు 60 స్థానాలలో  బీజేపీ గట్టి పోటీ  ఎదుర్కొనే అవకాశం ఉంది.   మిగిలిన స్థానాల్లో టీఎంసీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు..  ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న చోట్ల కమలం పార్టీకి ఎదురుగాలి తప్పదంటున్నారు.   అమిత్ షా ఊహిస్తున్నట్లుగా 110 సీట్లు సాధించాలంటే రాష్ట్రంలో ఒక అసాధారణమైన  కాషాయ గాలి వీచాలి. ప్రభుత్వ వ్యతిరేకత  కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. టీఎంసీ ప్రభుత్వంపై ఉన్న అవినీతి ఆరోపణలు, అభివృద్ధి లోపం వంటి అంశాలను బీజేపీ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీనికి తోడు ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటి ఆందోళనలు కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించాయని కొందరు అంటున్నారు. ఈ పరిస్థితులన్నీ బీజేపీకి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయనేది కాషాయ నేతల వాదన. మొత్తంగా చూస్తే.. బెంగాల్ రాజకీయాల్లో మతపరమైన ధ్రువీకరణ ఎంతవరకు పనిచేస్తుందనేదే ఫలితాలను శాసించనుంది. హిందూ ఓట్లు ఏకపక్షంగా బీజేపీ వైపు మొగ్గు చూపితే అమిత్ షా అంచనాలు నిజం కావచ్చు.. కానీ, టీఎంసీ తన కోర్ ఓటు బ్యాంకును కాపాడుకోగలిగితే మాత్రం పోటీ అత్యంత హోరాహోరీగా ఉంటుంది. అమిత్ షా ప్రకటించిన 110 సీట్ల ధీమా నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే తుది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -సీతారాం కంఠంనేని
తెలంగాణలో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు  కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం (ఏప్రిల్ 25) ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది. ముఖ్యంగా మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్ కు గవర్నర్ నిర్ణయం గొప్ప ఊరటనిచ్చిందని చెప్పుకోవాలి. ఆయన తన పదవిని నిలబెట్టుకోవడానికి అవసరమైన రాజ్యాంగ గడువు ముగియనున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ కేబినెట్ గతంలోనే గవర్నర్ కోటా కింద కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ప్రతిపాదించింది. అయితే.. గతంలో జరిగిన న్యాయపరమైన చిక్కులు, గవర్నర్ల మార్పు వంటి కారణాలతో ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి, ఈ నియామకాలను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ముఖ్యంగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న అజారుద్దీన్.. ఆరు నెలల లోపు శాసనసభ లేదా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికవ్వాలనే నిబంధన ఉండటంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.   గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించడం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా న్యాయపరమైన స్టేలు రావడం వంటి అంశాలు ఈ ప్రక్రియను ఆలస్యం చేశాయి. సుప్రీంకోర్టులో ఉన్న స్టేలను దృష్టిలో ఉంచుకుని,,  ప్రభుత్వం సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. తాజా నిర్ణయంతో కోదండరాం, అజారుద్దీన్‌లు త్వరలోనే శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ద్వారా ప్రభుత్వం ఉద్యమకారులకు గుర్తింపునిచ్చింది. అలాగే, జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా, మాజీ ఎంపీగా ఉన్న అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం,   మండలికి పంపడం ద్వారా మైనారిటీ వర్గాలకు బలమైన ప్రాతినిధ్యం కల్పించినట్లయింది.   మరోవైపు, అజారుద్దీన్ మంత్రి పదవి విషయంలో ఉన్న గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ గ్రీన్ సిగ్నల్ రావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ నెల 30వ తేదీతో ఆయన మంత్రిగా ప్రమాణం చేసి ఆరు నెలలు పూర్తి కానున్నాయి. ఒకవేళ ఈ లోపు ఎమ్మెల్సీగా నియామకం జరగకపోతే..  అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది.  ఇప్పుడు ఆ ముప్పు తప్పినట్లయింది.   గవర్నర్ ఆమోదంతో తదుపరి ప్రక్రియగా సాధారణ పరిపాలన విభాగం (GAD) ఉత్తర్వులు జారీ చేస్తుంది. అనంతరం శాసనమండలి చైర్మన్ సమక్షంలో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనివల్ల రాష్ట్ర కేబినెట్‌లో అజారుద్దీన్ స్థానం సుస్థిరమవుతుంది.
ALSO ON TELUGUONE N E W S
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది' (Peddi). ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా జరిగిన ధనుష్ 'కర' (KARA) మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్న బుచ్చిబాబు, 'పెద్ది' సినిమా విడుదల తేదీపై ఒక కీలక ప్రకటన చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. 'కర' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు బుచ్చిబాబు అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా స్టేజ్ మీద ఉన్న ఆయనను అభిమానులు రామ్ చరణ్ 'పెద్ది' సినిమా అప్‌డేట్ కావాలంటూ గట్టిగా అరిచారు. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని చూసిన బుచ్చిబాబు నవ్వుతూ, "జూన్ 25 పెద్ది వస్తుంది" అంటూ కొత్త విడుదల తేదీని రివీల్ చేశారు. 'పెద్ది' మూవీ జూన్ లో వస్తుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కానీ, డేట్ మాత్రం చెప్పలేదు. ఇటీవల జూన్ 25 రావొచ్చు అంటూ వార్తలొచ్చాయి. అయితే అధికారిక ప్రకటన రాకముందే.. ఫ్యాన్స్ ఉత్సాహం చూసి బుచ్చిబాబు డేట్ లీక్ చేయడం విశేషం. 'పెద్ది' సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా. ఈ సినిమాలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్ ఫుల్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. . బుచ్చిబాబు చేసిన ఈ అనౌన్స్‌మెంట్‌తో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. జూన్ 25న 'పెద్ది' థియేటర్లలోకి వచ్చి ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని ఆసక్తికర సినిమా అప్డేట్స్ కోసం తెలుగువన్ సినిమా (TeluguOne Cinema) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.  
The release date shuffle in Tollywood has created a major headache for the makers of Akhil Akkineni’s upcoming film, Lenin. Director Buchi Babu Sana recently confirmed that Ram Charan’s highly anticipated period sports drama, Peddi, is officially locked for a theatrical release on June 25, 2026. While this is an exciting update for the audience, it leaves the Lenin team in a difficult situation. Originally, Lenin was scheduled to hit theaters on May 1. However, when the makers of Peddi previously announced an April 30 release, the Lenin team stepped back to avoid a clash. Out of goodwill, they voluntarily postponed Lenin to June 26. Unfortunately, production delays for Peddi resulted in Buchi Babu locking June 25 as the new date. Lenin now finds itself back in the line of fire.  Adding to the complications, reports indicate that Nagarjuna Akkineni recently watched the rushes of Lenin and has asked for critical re-shoots. Nagarjuna is personally overseeing the output to ensure the film is absolutely perfect.  He is determined to make this project a definitive box office winner for Akhil, who desperately needs a massive comeback following the disaster of his previous outing, Agent. With unexpected reshoots required and a massive theatrical clash looming, the Lenin makers are truly caught in the doldrums.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
South Indian cinema actress Mehreen Pirzada has officially entered a beautiful new phase in her life. Taking many by surprise over the weekend, the talented actress, well-known for her memorable performances in Telugu hits like F2: Fun and Frustration and Krishna Gaadi Veera Prema Gaadha, announced her marriage.   The private Anand Karaj ceremony took place on April 26, 2026, nestled in the picturesque hills of Chail, Himachal Pradesh. Surrounded by close relatives and friends, she tied the knot with Arsh Aulakh. The couple chose an elegant blush-pink theme for their special day. Mehreen looked stunning in a pastel pink ensemble designed by Sawan Gandhi, complemented by traditional polki jewelry, while Arsh coordinated perfectly in a matching blush-pink sherwani and turban.   Sharing her joy on social media, she posted candid pictures with a caption noting the date "26.04.26" alongside the hashtag #ArshDiMehr. The film community and colleagues quickly showered the couple with warm wishes. Arsh reportedly maintains a very private profile outside the entertainment industry.   Following this personal milestone, Mehreen is moving forward with her acting journey. She is currently preparing for her Kannada debut in Nee Sigoovaregu, balancing this fresh start in life with her continuing career.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ తెలుగు ప్రేక్షకులని తన ట్రాప్ లో పడేలా చేసిన భామ మెహ్రీన్(Mehreen Pirzada).. గోల్డెన్ లెగ్ అనే పేరు కూడా తెచ్చుకున్న మెహ్రిన్ రీసెంట్ గా సోషల్ మీడియాలో తన పెళ్లి పిక్స్ షేర్ చేసి సోషల్ మీడియాని తన ఆదీనంలో ఉంచుకుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఏప్రిల్ 26 న అంటే నిన్న అర్ష్ ఔలక్ తో   మెహ్రిన్  వివాహం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకల్లో మెహ్రీన్ మెరిసిపోయారు. పెళ్లికి ముందు జరిగిన మెహందీ, హల్దీ వేడుకల నుండి మొదలుకొని ప్రధాన కళ్యాణం వరకు ప్రతి ఘట్టం ఎంతో వేడుకగా సాగింది. తన పెళ్లి రోజున మెహ్రీన్ ధరించిన డిజైనర్ లెహంగా ,ప్రత్యేకమైన ఆభరణాలు ఆమెకి రాజసం తెచ్చిపెట్టాయి. ముఖంలో నవ వధువు కళ ఉట్టిపడుతుండగా, ఆమె చిరునవ్వు అభిమానులను కట్టిపడేస్తోంది. జంట చూడముచ్చటగా ఉందని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా మెహ్రీన్‌తో కలిసి పనిచేసిన టాలీవుడ్ స్టార్స్ మరియు స్నేహితులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Also read: Archana Puran singh: ప్రముఖ నటి ఇంట క్రెడిట్ కార్డు స్కామ్.. మీరు కూడా ఉంటారేమో జాగ్రత్త   ఆమె వెడ్డింగ్ ఆల్బమ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ కొత్త ప్రయాణంలో మెహ్రీన్ మరిన్ని విజయాలు అందుకోవాలని, ఆమె వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని మనమూ కోరుకుందాం. మెహ్రీన్ పెళ్లి వేడుకలకు సంబంధించిన మరిన్ని అద్భుతమైన దృశ్యాలను మీరు ఈ ఫోటో గ్యాలరీలో వీక్షించవచ్చు.. మెహ్రీన్ కి గతంలో అంటే 2021 లో  హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడు  భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్ మెంట్ జరిగి క్యాన్సిల్ అయ్యింది. నాచురల్ స్టార్ నాని నుంచి వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. మరి పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగుతారా లేదా అనేది చూడాలి.   
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) టాలీవుడ్‌లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సరసన 'డ్రాగన్' (Dragon) సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ, ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కాబోతున్నట్లు సమాచారం. భారత రత్న, కర్ణాటక సంగీత దిగ్గజం ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రుక్మిణి వసంత్ టైటిల్ రోల్ పోషించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భారతీయ సంగీత ప్రపంచంలో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి (MS Subbulakshmi) పేరు అజరామరం. ఆమె జీవిత విశేషాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు గతంలో పలువురు దర్శకులు ప్రయత్నించినప్పటికీ, అవి కార్యరూపం దాల్చలేదు. అయితే, ఇప్పుడు 'మళ్ళీ రావా', 'జెర్సీ' వంటి క్లాసిక్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ బాధ్యతను తీసుకున్నట్లు తెలుస్తోంది. భావోద్వేగాలను పండించడంలో దిట్ట అయిన గౌతమ్, సుబ్బలక్ష్మి జీవితంలోని కీలక ఘట్టాలను ఎంతో సున్నితంగా చూపించబోతున్నారట. రుక్మిణి వసంత్ ఎంపికకు కారణం? ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పాత్ర కోసం మొదట సాయిపల్లవి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు అనూహ్యంగా రుక్మిణి వసంత్‌ పేరు తెరపైకి వచ్చింది. ఈ పాత్ర కోసం రుక్మిణిని ఎంపిక చేయడానికి బలమైన కారణాలు ఉన్నాయని సమాచారం. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి రూపానికి సరిపోయేలా ఉండటమే కాకుండా.. రుక్మిణి శాస్త్రీయ నృత్యం, కళల పట్ల అవగాహన ఉన్న నటి కావడంతో ఆమె ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే ఈ పాత్ర కోసం రుక్మిణి కొంత మేకోవర్ కూడా ప్రారంభించినట్లు వినికిడి. ఈ భారీ బయోపిక్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించబోతోంది. అల్లు అరవింద్ నిర్మాణంలో అత్యున్నత సాంకేతిక విలువలతో, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్ తోడుండటంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. సుబ్బలక్ష్మి సంగీత ప్రస్థానం, ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, ప్రపంచవ్యాప్త కీర్తిని ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నారని టాక్. గౌతమ్ తిన్ననూరి మేకింగ్, మరియు రుక్మిణి వసంత్ అభినయం తోడైతే ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ తెలుగు సినిమా చరిత్రలో ఒక గొప్ప కళాఖండంగా నిలిచిపోవడం ఖాయం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  
      టెక్నాలజీ పుట్టిందే  సైబర్ నేరాల కోసం అన్నట్టుగా సైబర్ నేరగాళ్లు దేశానికి స్వాతంత్రం తెచ్చింది మేమే అనే వీరుల్లా  విజృంబిస్తున్నారు. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ ఈ మోసగాళ్ల బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా ప్రముఖ నటి, 'ది కపిల్ శర్మ షో' ఫేమ్ అర్చన పురాణ్ సింగ్(Archana Puran singh)కుమారుడు ఆయుష్మాన్ సేథీ భారీ సైబర్ మోసానికి గురయ్యి తన క్రెడిట్ కార్డ్ ద్వారా ఏకంగా 87,000 రూపాయలు పోగొట్టుకున్నారు.  ఆయుష్మాన్ సేథీ ఫోన్‌కి క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు సంబంధించిన అలర్ట్స్ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఆయుష్మాన్ క్రెడిట్ కార్డ్ వివరాలను సేకరించి, అతని అనుమతి లేకుండానే షాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఎనిమిది విభిన్న లావాదేవీల ద్వారా మొత్తం రూ. 87,000 డ్రా అయినట్లు మెసేజ్‌లు రావడంతో ఆయుష్మాన్ వెంటనే అప్రమత్తమయ్యారు. సాధారణంగా ఓటీపీ లేకుండా ఇలాంటి లావాదేవీలు జరగడం కష్టమైనప్పటికీ, అంతర్జాతీయ లావాదేవీలు లేదా క్లోనింగ్ ద్వారా ఈ మోసం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయుష్మాన్ ముంబైలోని అంబోలి పోలీసులను ఆశ్రయించారు. తన క్రెడిట్ కార్డు నుంచి అనధికారికంగా డబ్బులు కట్ అయ్యాయని, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు వెంటనే స్పందించి ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ విభాగం ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేస్తోంది. బాధితుడి అకౌంట్ నుండి డబ్బు ఎక్కడికి వెళ్లింది? ఏ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఈ లావాదేవీలు జరిగాయి? అనే అంశాలపై విచారణ జరుపుతున్నారు. గత కొద్ది రోజులుగా బాలీవుడ్ ప్రముఖులే లక్ష్యంగా సైబర్ దొంగలు విరుచుకుపడుతున్నారు. కేవలం అర్చన పురాణ్ సింగ్ కుమారుడే కాకుండా, ఇటీవల కాలంలో మరికొందరు నటీనటులు కూడా ఆన్‌లైన్ మోసాలకు గురయ్యారు. సైబర్ నేరగాళ్లు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లుగా నటించడం లేదా ఆకర్షణీయమైన లింక్‌లు పంపడం ద్వారా క్రెడిట్ కార్డ్ వివరాలని తస్కరిస్తున్నారు. ఆన్‌లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా చిన్న పొరపాటు జరిగితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అర్చన పురాణ్ సింగ్ కుమారుడికి ఎదురైన ఈ అనుభవం అందరికీ ఒక హెచ్చరిక వంటిది. మన క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలను ఎవరికీ షేర్ చేయకూడదని, అనుమానాస్పద లింక్స్‌పై క్లిక్ చేయవద్దని పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే '1930' నంబర్‌కు ఫోన్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది.  
లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఇటీవల మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా నయనతార బయటి వేదికలపై తక్కువగా కనిపిస్తుంటారు, అలాగే సహ నటుల గురించి మాట్లాడటం కూడా అరుదు. అయితే తారక్ విషయంలో ఆమె ప్రశంసల వర్షం కురిపించడం నందమూరి అభిమానులను ఖుషీ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, నయనతార గతంలో 'అదుర్స్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సెట్స్‌లో తారక్ పనితీరును చూసి తాను ఎంతగా ఆశ్చర్యపోయానో ఒక ఇంటర్వ్యూలో నయన్ గుర్తు చేసుకున్నారు. "నేను నా కెరీర్‌లో చాలా మంది స్టార్ హీరోలతో పని చేశాను. కానీ తారక్ స్టైల్ వేరు. ఆయన సెట్స్‌లోకి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ముఖ్యంగా ఆయన మెమరీ పవర్ చూసి నేను షాక్ అయ్యాను" అని నయనతార పేర్కొన్నారు. ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి నయనతార ప్రత్యేకంగా ప్రస్తావించారు. 'అదుర్స్' సినిమాలో పాటల చిత్రీకరణ సమయంలో తారక్ ఎంతో కష్టమైన స్టెప్పులను కూడా కేవలం ఒక్కసారి చూడగానే అలవోకగా వేసేవారని ఆమె చెప్పారు. "మేము ఆ స్టెప్పుల కోసం గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తే, ఆయన మాత్రం రిహార్సల్స్ లేకుండానే సింగిల్ టేక్‌లో ఓకే చేసేవారు. షూటింగ్ గ్యాప్‌లో అందరితో ఎంతో సరదాగా ఉంటూనే, కెమెరా ముందుకు రాగానే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు. అలాంటి టాలెంట్ ఉన్న నటుడిని నేను ఇంతవరకు చూడలేదు" అని నయన్ కొనియాడారు.  
తమిళ స్టార్ ధనుష్ (Dhanush) నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'కర' (Kara). విఘ్నేశ్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో  ఇటీవల నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో ధనుష్ చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అవమానాలు, జాతీయ అవార్డుపై తనకున్న నమ్మకం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ధనుష్ తన ప్రసంగాన్ని భగవద్గీతలోని "యద్భావం తద్భవతి" (మనం ఏది బలంగా కోరుకుంటామో అదే అవుతాం) అనే శ్లోకంతో ప్రారంభించారు. తన సినీ ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులను గుర్తుచేసుకుంటూ.. "2002-2003 కాలంలో నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో, నాకు ఏదో ఒకరోజు జాతీయ అవార్డు వస్తుందని ఎవరికైనా చెప్తే అందరూ నవ్వుకునేవారు. ఎందుకంటే అప్పుడు నా పరిస్థితి అలా ఉండేది. కానీ నేను నా మనసులో ఆ కోరికను బలంగా నాటుకున్నాను. నిరంతరం శ్రమించాను. చివరకు ఆ కల నిజమైంది" అని చెప్పుకొచ్చారు.  ఈ వేడుకలో ధనుష్‌కు ఆయన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన 'పొల్లాదవన్' సినిమా రోజులను గుర్తు చేసుకున్నారు. "పొల్లాదవన్ సినిమా కంటే ముందు నన్ను చాలా మంది బక్కగా ఉన్నావని ఎగతాళి చేసేవారు. నా బాడీపై బాడీ షేమింగ్ కామెంట్స్ వచ్చేవి. కానీ ఆ సినిమాలో మొదటిసారి సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించినప్పుడు థియేటర్లలో చప్పట్లు, ఈలలు వినిపించాయి. నా నటనకే కాదు, నా ఫిజిక్‌కు కూడా గుర్తింపు రావడం ఆ సినిమాతోనే మొదలైంది" అని ధనుష్ భావోద్వేగానికి లోనయ్యారు. 1991 నాటి ఇంధన సంక్షోభం నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా 'కర' రూపొందింది. ఇందులో ధనుష్ ఒక బ్యాంకు దొంగగా కనిపించబోతున్నారు. మమితా బైజు కథానాయికగా నటించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా కమర్షియల్ హంగుల కంటే కంటెంట్‌పైనే ఎక్కువ ఆధారపడి ఉంటుందని, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని ధనుష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ధనుష్ మాటలు కేవలం సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే కాకుండా, యువతకు ఒక గొప్ప సందేశాన్ని అందించాయి. ఎవరెన్ని విమర్శలు చేసినా, మనపై మనకు నమ్మకం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఆయన తన ప్రయాణం ద్వారా నిరూపించారు. 'కర' సినిమా కూడా ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.  
  -షూటింగ్ దశలో కల్కి పార్ట్ 2  -త్వరలోనే ప్రభాస్ జాయిన్  -ఈ క్రమంలో క్రేజీ న్యూస్ వైరల్  ప్రభాస్(Prabhas)తో పాటు ఫ్యాన్స్, పాన్ ఇండియా ప్రేక్షకులకి మోస్ట్ అవైటింగ్ మూవీ ఏది అంటే కల్కి పార్ట్ 2(Kalki part 2)అని చెప్పవచ్చు. అఫ్ కోర్స్ మేకర్స్ కి కూడా మోస్ట్ అవైటింగ్ మూవీ.  అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కమల్ హాసన్, అమితాబ్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ కూడా త్వరలోనే జాయిన్ కాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం. కల్కి మొదటి భాగం పేరు కల్కి 2898 ఏడి. దీంతో సెకండ్ పార్ట్ పేరు కల్కి పార్ట్ 2 ఫిక్స్ చేస్తారేమో అనుకుంటూ వస్తున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం, 'కల్కి 2' కి కర్ణ: 3102 BC" అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొదటి భాగంలో  ప్రభాస్ క్యారక్టర్ కర్ణుడిగా రివీల్ అయిన విషయం తెలిసిందే. రెండో భాగానికి క్రీస్తు పూర్వం 3102లో కలియుగం ప్రారంభమైన సమయాన్ని, అలాగే కురుక్షేత్ర యుద్ధం తర్వాత కర్ణుడి పాత్ర యొక్క ప్రాముఖ్యతని ప్రతిబింబించపోతుంది. దీంతో కర్ణ: 3102 BC  టైటిల్ పవర్ ఫుల్ గా  ఉంటుందని భావిస్తున్నారు. సదరు టైటిల్ పై  చిత్ర యూనిట్ త్వరలోనే  అధికారిక ప్రకటన కూడా చేయబోతుందని అంటున్నారు. ఒకవేళ ఇదే టైటిల్ ఖరారైతే, ప్రభాస్ అభిమానులకి ఇది అంతకంటే పెద్ద పండగ అని చెప్పవచ్చు.  Also read: VIJay: సౌత్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసారు..ఇక సినిమాలు చేయడానికి వీల్లేదు మొదటి భాగంలో భవిష్యత్తుపై ఎక్కువ దృష్టి పెట్టిన నాగ్‌ అశ్విన్, రెండో భాగంలో గతాన్ని భవిష్యత్తుని  అనుసంధానించబోతున్నారు. ముఖ్యంగా మహాభారత కాలంలోని కర్ణుడి యుద్ధ నైపుణ్యం, అశ్వత్థామతో అతని సంబంధం మరియు సుప్రీమ్ యాస్కిన్ అంతం కోసం కల్కి అవతారం ఎలా ఉద్భవిస్తుందనేది ఈ పార్ట్‌లో చూపించబోతున్నారు.  యాక్షన్ ఎపిసోడ్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ మొదటి భాగాన్ని మించి మరింత భారీ స్థాయిలో ఉండనున్నాయి.      
      ప్రస్తుతం తమిళనాట ఎక్కడ చూసినా  మే 4 న ప్రకటించే ఎన్నికల ఫలితాలతో  విజయ్(VIjay)ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుంటాడా లేదా అనే ఒకటే చర్చ. ఇండియా మొత్తం ఇదే చర్చ అనుకోండి.  సర్వేల ప్రకారం చూసినా కొన్ని విజయ్ కి పాజిటివ్ గా మరికొన్ని నెగిటివ్ గా వస్తున్నాయి. ఈ లోపు విజయ్ సినీ జర్నీకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం.  విజయ్ అప్ కమింగ్ మూవీ ‘జననాయగన్' (Jananayagan)పైరసీ జరిగిన విషయం తెలిసిందే. పైరసీ చేసింది ఎవరో కాదు ఫ్రీలాన్స్‌ ఎడిటర్‌ ప్రదీప్‌ ఇ.రాఘవ్‌. ఇప్పుడు సదరు ఎడిటర్ పై సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ  అసోసియేషన్‌ నుంచి ప్రదీప్ ని సస్పెండ్‌ చేస్తున్నట్లుగా మొన్న పత్రికా ప్రకటన విడుదల చేసింది.దీంతో ప్రదీప్ తన సినీ లైఫ్ ఎలా ఉంటుందో కలలు కనడమే కానీ కలలు నిజమయ్యే పరిస్థితి లేదు. పైరసీ వ్యవహారంలో రాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ విభాగం కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి  మొదట ఆరుగురుని, ఆ తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేయగా.. వీరిలో ప్రదీప్‌ ఇ.రాఘవ్‌‌ ఒకరు.   ప్రదీప్‌ ఇ.రాఘవ్‌ వేరే మూవీకి  ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. ‘జననాయగన్’ సినిమా ఎడిటింగ్ స్టూడియోలో అతనికి అనుమతి లేనప్పటికీ, అనధికారికంగా సినిమా రీల్స్‌ ని యాక్సెస్ చేసి డేటాను దొంగిలించినట్లుగా సైబర్‌ క్రైమ్‌ విభాగం కనుగొంది. ఆ దొంగిలించిన డేటాను సినిమాగా మార్చి, తన సహ నిందితులకు షేర్ చేయడంతో  ఆన్‌లైన్‌లో కూడా కంటెంట్ ని ప్రదర్శించడం జరిగింది. హెచ్. వినోద్(H Vinoth)దర్శకత్వంలో  కేవీఎన్ ప్రొడక్షన్ వెంకట్ కె. నారాయణ సుమారు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. పూజా హెగ్డే, మమిత భైజు కీలక రోల్స్ లో చెయ్యగా జన నాయగన్ రిలీజ్ డేట్ కోసం అయితే ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఇప్పటికి వెయిటింగ్.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది,  ఇష్టంగా అనిపిస్తుంది,  తమ చుట్టూ ఒక కొత్త ప్రపంచం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కాలంతో పాటు ప్రేమ కూడా మారుతూ ఉంటుంది.  ముఖ్యంగా పరీక్షలు పెడుతూ ఉంటుంది.  ఇద్దరు వ్యక్తులు సిన్సియర్ గా ఉన్నారా లేదా అనేది కూడా కాలమే డిసైడ్ చేస్తుంది. అయితే ప్రేమించిన చాలా మంది సంతోషం కంటే ఎక్కువ బాధపడిన సందర్బాలే ఉంటాయి.  పదే పదే మనోవేదనకు గురవుతూ ఉంటారు.  ప్రేమ అనేది కేవలం ఒక్కరితో అగేది కూడా కాదు.. చాలామంది ప్రేమలో ఫెయిల్యూర్ వచ్చాక లేదా బ్రేకప్ అయ్యాక.. మళ్లీ ఇంకొకరితో ప్రేమలో పడతారు. కానీ అక్కడ కూడా మళ్లీ బాధ.. పదే పదే మానసిక వేధన బహుమానంలా లభిస్తాయి.  అసలు ప్రేమించేవారికి పదే పదే మానసిక వేధన ఎందుకు ఎదురవుతోంది? ఇందులో తప్పు ఎవరిది? తెలుసుకుంటే.. బాధ కలిగినా అదే మార్గంలో ప్రయాణం.. చాలామంది ప్రేమలో ఉన్నప్పుడు అయినా జీవితంలో వేరే బంధంలో అయినా.. తమకు బాధ కలిగినా సరే.. అదే జోన్ లోనే ఉండటానికి ఇష్టపడతారు. చిన్నతనంలోని అనుభవాలు,  పెరిగిన వాతావరణం,  గతంలో ఏర్పడిన బందాల వల్ల కలిగిన బాధ.. బందంలో గౌరవం లేకపోవడం వంటివి మనిషిని మారేలా చేయాలి. కానీ చాలామంది కొత్తగా ఏర్పడే ప్రతి బందంలోనూ అవే తప్పులు పదే పదే చేస్తుంటారు. అందుకే పదే పదే మనోవేధన కూడా ఎదురవుతూ ఉంటుంది. ఎమోషన్స్ నుండి బయట పడలేకపోవడం.. చాలా మంది తమకు తెలియకుండానే తమలాంటి భాగస్వాములనే ఎంచుకుంటారు. ఇది వారి సబ్ కాన్షియస్ మైండ్  చేసే ఒక ప్రయోగం.  గతంలో విషపూరితమైన సంబంధాలను అనుభవించి ఉంటే  మనస్సు వాటిని సాధారణమైనవిగా అంగీకరిస్తుంది. అందుకే పదే పదే అలాంటి రిలేషన్స్ వైపుకే  ఆకర్షితులు అవుతుంటారు. తమను తాము తక్కువగా  అంచనా వేసుకోవడం.. ఒక వ్యక్తి తమను తాము తక్కువగా అంచనా వేసుకున్నప్పుడు, వారు తరచుగా సంబంధాలలో తాము తక్కువ అన్నట్టు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎదుటి మనిషి వ్యక్తిత్వం గురించి పెద్దగా పట్టించుకోకుండా  పదే పదే తప్పుడు భాగస్వామిని ఎంచుకుంటారు. మార్పు పట్ల భయం.. చాలా మంది తాము తప్పులు చేస్తున్నామని తెలిసినా, మారడం వల్ల ఎదురయ్యే నష్టాలు,  ప్రమాదాలను చూసుకుని మారడానికి భయపడతారు.  అందుకే వారు అవే పాత పద్ధతులలో చిక్కుకుపోయి ఉంటారు. గత గాయాల ప్రబావం.. గత సంబంధాల వల్ల కలిగిన గాయం, పూర్తిగా మానకపోవడం వంటివి చాలామంది పదే పదే అవే తప్పులు చేసేలా చేస్తాయి.  ఇలాంటి వారు  భావోద్వేగపరంగా కోలుకునేంత వరకు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు. గందరగోళం.. చాలా మంది ప్రేమకు , భావోద్వేగ అనుబంధానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోరు. వారు తప్పుడు వ్యక్తికి దగ్గరై, దానినే ప్రేమగా పొరబడతారు, తద్వారా అవే తప్పులను రిపీట్ చేస్తూ ఉంటారు.   ప్రేమలో లేదా రిలేషన్ లో  అవే తప్పులను పదే పదే చేయడం అనేది విధి రాసే రాత కాదు.. అది మనిషి  అలవాట్లు,  ఆలోచనా విధానం ఇచ్చే  ఫలితం. ప్రతి వ్యక్తి తన  పద్ధతులను గుర్తించి, తమను తాము  సరిదిద్దుకున్నప్పుడు మాత్రమే ఇలా పదే పదే బాధపడే బంధంలో చిక్కుకోవడాన్ని నివారించగలుగుతారు. సింపుల్ గా చెప్పాలంటే.. ప్రతి మనిషి ప్రేమలో లేదా రెలేషన్ లో.. పదే పదే మానసిక వేదనకు అనుభవించడానికి అక్షరాలా ఆ మనిషి చేతులారా చేసుకునే తప్పులు,  పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడం,  పాత ఆలోచనలు, సిద్దాంతాలలో  చిక్కుకుని ఉండటం వంటివి కారణం అవుతాయి.                                    *రూపశ్రీ.
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి. అయితే కూలర్లు వాడేవారు దాని శుభ్రత గురించి మాత్రం అంత శ్రద్ద తీసుకోరు. దీని వల్ల నీరు మురికిగా మారి దోమలు పెరగడానికి ఆవాసంగా మారడమే కాకుండా.. . కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచకపోతే కూలింగ్ కూడా పెద్దగా రాదు.   అయితే కూలర్ లో నీటిని ప్రతిరోజూ శుభ్రం చేయడం అంత ఈజీ ఏమీ కాదు.. కొన్ని కంపెనీల కూలర్లలో నీటిని నింపడం సులువే.. కానీ వాటిలో నీటిని తొలగించడం, శుభ్రం చేయడం కాస్త శ్రమతో కూడుకున్నదే.. అయితే.. కూలర్లలో నీరు ప్రతిరోజూ శుభ్రం చేయకపోయినా కొన్నిరోజుల పాటు నీరు శుభ్రంగా ఉండాలన్నా, తాజాగా అనిపించాలన్నా కేవలం ఒకే ఒక్క చిట్కా అద్బుతంగా పనిచేస్తుంది. అదేంటో తెలుసుకుంటే.. పటిక.. కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచడానికి పటిక చాలా సులభమైన,  ఇంటి చిట్కా. దీనిని నీటిలో వేయడం  వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కూలర్ ట్యాంక్‌లో నీరు తరచుగా ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది, ఇది తొందరగా మురికిగా మారే అవకాశం ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ నీటిలో దోమలు  ఆవాసం ఏర్పాటు చేసుకుని  గుడ్లు పెడతాయి. అయితే కూలర్ ఎక్కువ కాలం పనిచేయాలంటే   దానిని శుభ్రపరచడం చాలా ముఖ్యం. నీటిలో ఒక చిన్న పటిక ముక్కను వేయడం వల్ల నీటిని శుభ్రపరచవచ్చు.  పైగా దోమల సమస్య కూడా తగ్గుతుంది. కూలర్ ట్యాంక్ లో పటిక వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు.. నీటి స్వచ్చత.. పటిక నీటిలోని దుమ్ము, ధూళి , చిన్న కణాలను బంధిస్తుంది. ఈ కణాలు బరువెక్కి అడుగుకు చేరుకుంటాయి, దీనివల్ల పైన ఉన్న నీరు స్వచ్ఛంగా ఉంటుంది. దోమలకు చెక్.. పటిక నీటిని శుద్ధి చేయడం వల్ల దోమల గుడ్లు, లార్వాలు సులభంగా వృద్ధి చెందలేవు. దీనివల్ల దోమల సమస్య గణనీయంగా తగ్గుతుంది. దుర్వాసన.. కూలర్ నీటి నుండి ఏదైనా వింత లేదా దుర్వాసన వస్తుంటే, దానిని చాలా వరకు తగ్గించడంలో పటిక సహాయపడుతుంది. బ్యాక్టీరియా..  పటికకు తేలికపాటి యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి, ఇవి నీటిలో ఉండే  హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి. నీటి నాణ్యత.. పటిక నీటిని ఎక్కువ సేపు శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది, దీనివల్ల కూలర్ ప్యాడ్‌లు త్వరగా పాడవకుండా ఉంటాయి , గాలి చల్లగా ఉంటుంది. పటికను ఉపయోగించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. పటికను ఎక్కువ పరిమాణంలో వాడకూడదు. ఒక చిన్న ముక్క సరిపోతుంది. ఎక్కువ పటిక కలపడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా కూలర్‌లోని నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి.                                 *రూపశ్రీ.
  వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి. ఈ కారణంగానే ఇప్పట్లో ప్రతి ఇంట్లో కూలర్లు వాడుతున్నారు.  కాస్త అర్థిక స్థితి ఉన్నవారేతై ఏసీ లు కూడా పెట్టించుకుంటారు. కానీ రానురాను పెరుగుతున్న ఎండలు,  వాటి తాలుకూ వేడి కారణంగా కూలర్లు కూడా సరిపోవడం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ.. సాధారణ కూలర్ ను కూడా చక్కగా ఏసీ లాంటి చల్లదనం ఇచ్చేలా చేయవచ్చు.  ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. సాధారణ కూలర్ తో ఏసీ లాంటి చల్లదనం కావాలంటే.. ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుంటే.. సాల్ట్ , ఐస్.. కూలర్  చల్లటి గాలిని అందించాలని  అనుకుంటే, ఐస్ లేదా ఉప్పు నీటిని కలపడం చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఇది చాలా ఫేమస్ చిట్కా కూడా.  కూలర్ ట్యాంకులో రాళ్ల ఉప్పు,   ఐస్ క్యూబ్స్ వేస్తారు.  రాళ్ల ఉప్పు ఐస్ క్యూబ్స్ కరగకుండా ఎక్కువ సేపు ఉండేలా చేస్తాయి. దీని వల్ల కూలింగ్ బాగా వస్తుంది. అయితే.. ఇది రెగ్యులర్ గా చేయడం మంచిది కాదు.. ఉప్పు తొందరగా చిలుము పట్టేలా చేస్తుంది. దీని వల్ల కూలర్ లోని మెటల్ భాగాలు తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఎప్పుడైనా వేడి భరించలేని సమయాల్లో ట్రై చేయడం మంచిది. వెంటిలేషన్.. చాలా మంది ఏసీ లాంటి చల్లదనం వస్తుందని ఆశించి,  కూలర్లను మూసి ఉన్న గదులలో వాడుతుంటారు, కానీ ఇది  పెద్ద పొరపాటు. సరైన వెంటిలేషన్ ఉన్నప్పుడే ఎయిర్ కూలర్ సరిగ్గా పనిచేస్తుంది. గదిలో  వేడి గాలి బయటకు పోవడానికి , చల్లని గాలి లోపల ప్రసరించడానికి వీలుగా ఒక కిటికీని లేదా తలుపును తెరిచి ఉంచడం ముఖ్యం. సరైన వెంటిలేషన్ కూలర్ పనితీరును  మెరుగుపరుస్తుంది. శుభ్రత.. కాలక్రమేణా కూలర్ ప్యాడ్‌లపై దుమ్ము, ధూళి పేరుకుపోయి, వాటి కూలింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అందువల్ల వాటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం లేదా మార్చడం ముఖ్యం. కూలర్ చాలా చల్లని గాలిని ఇవ్వాలి అంటే.. కూలర్ లోపల వట్టివేర్లతో తయారు చేసిన మ్యాట్లను  ఉపయోగించాలి. ఇది కూలింగ్ ను మెరుగుపరుస్తుంది. వట్టివేర్ల  గుండా నీరు ప్రవహించినప్పుడు, గాలి చల్లగా, తాజాగా మారుతుంది, మంచి  తేలికపాటి సువాసనను కూడా అందిస్తుంది. పైన పేర్కొన్న చిట్కాలను పాటించడం వల్ల వేసవి కాలంలో కూలర్ ఏసీ లాంటి చల్లదనాన్నిఇస్తుంది.                                     *రూపశ్రీ.
  కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి.  చాలా పరిశుభ్రతలో బాగంగా మౌత్ వాష్ లు వాడుతుంటారు.  కొందరు పళ్లు తోమే పని లేకుండా మౌత్ వాష్ వాడితే.. మరికొందరు పళ్లు తోమిన తర్వాత కూడా ఇంకా పళ్లు ఎక్కువగా శుభ్రం అవుతాయని అతి శుభ్రతతో మౌత్ వాష్ కూడా వాడతారు. అయితే.. మౌత్ వాష్ వాడే వారికి డాక్టర్లు ఓ చల్లని చావు కబురు చెబుతున్నారు.  మౌత్ వాష్ వాడితే రక్తపోటు సమస్య వస్తుందని అంటున్నారు.  దీని గురించి వైద్యులు చెప్పిన విషయాలు వివరంగా తెలుసుకుంటే.. మౌత్ వాష్.. నోటి ఆరోగ్యం.. నోటిలోని మంచి బ్యాక్టీరియా మానవ శరీరానికి చాలా అవసరం. ఈ బ్యాక్టీరియా ఆహారంలోని నైట్రేట్‌లను నైట్రైట్‌లుగా మార్చడానికి సహాయపడతాయి, ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ అనేది రక్తనాళాలను సడలించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి , రక్తపోటును నియంత్రించడానికి సహాయపడే ఒక ముఖ్యమైన అంశం. మౌత్ వాష్ వల్ల కలిగే నష్టం.. బలమైన యాంటీసెప్టిక్ మౌత్‌వాష్‌లు నోటిలోని  మంచి బ్యాక్టీరియాను కూడా చంపగలవని నిపుణులు అంటున్నారు. ఇది నైట్రేట్, నైట్రైట్‌గా మారే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది , శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను తగ్గించగలదు. ఇది నేరుగా రక్తనాళాల పనితీరుపై ప్రభావం చూపుతుంది, తద్వారా రక్తపోటును ప్రభావితం చేసే అవకాశం ఉంది. యాంటీ బాక్టీరియల్ మౌత్‌వాష్ వాడకం వల్ల నోటిలోని అవసరమైన బ్యాక్టీరియా 90 శాతం వరకు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలలో తేలిందని వైద్యులు కూడా చెబుతున్నారు. కేవలం కొన్ని రోజుల వాడకం కూడా లాలాజలంలో నైట్రేట్ స్థాయిలను తగ్గించగలదని, దీనివల్ల సిస్టోలిక్ రక్తపోటులో స్వల్ప పెరుగుదల ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మౌత్ వాష్ ఎక్కువ కాలం ఉపయోగిస్తే.. రోజు ఎక్కువగా మౌత్‌వాష్ ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మంచి బ్యాక్టీరియాను తగ్గించడం, నైట్రిక్ ఆక్సైడ్‌ను తగ్గించడం, , రక్తనాళాల సరైన పనితీరును దెబ్బతీసే ప్రక్రియ వలనే ఇది జరుగుతుందని అంటున్నారు. దీని ప్రభావాలు అందరిపై తీవ్రంగా ఉండనప్పటికీ, రెగ్యులర్ గా అందులోనూ ఎక్కువగా వాడటం వల్ల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చిగుళ్ల వ్యాధి, దంత చికిత్స తర్వాత, లేదా దంతాలపై అధికంగా పాచి పేరుకుపోయిన వంటి కొన్ని పరిస్థితులలో మౌత్‌వాష్ వాడకం  అవసరం అవుతుంది. అందువల్ల, మౌత్‌వాష్‌ను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని, దానిని రోజువారీ అలవాటుగా చేసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. నోటి శుభ్రతకు బ్రష్ చేయడమే మంచిదని, దీనికే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. కాబట్టి మౌత్ వాష్ ఎక్కువగా వాడకూడదు.                                      *రూపశ్రీ.
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం,  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా కీలకం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అవసరం అవుతాయి. అలాంటి వాటిలో జింక్ కూడా ఒకటి. అయితే చాలామందికి జింక్ లోపం గురించి పెద్దగా అవగాహన ఉండదు.  జింక్ లోపం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇది నిజమేనా? జింక్ లోపం గురించి.  జింక్ లోపం వల్ల వచ్చే సమస్యల గురించి వైద్యులు ఏం చెబుతున్నారు తెలుసుకుంటే.. శరీరానికి జింక్ ఎందుకు అవసరం..  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి , చర్మానికి జింక్ చాలా అవసరం. జింక్ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి , కణజాలాలను బాగు చేయడానికి సహాయపడుతుంది. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చని, చర్మ, కడుపు సమస్యలను కూడా కలిగించవచ్చని వైద్యులు చెబుతున్నారు. జింక్ లోపం వల్ల వచ్చే సమస్యలు.. జింక్ లోపం శరీరంలో అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. జింక్ లోపం పిల్లలలో పెరుగుదలను నిరోధించగలదు , మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇన్ఫెక్షన్లు.. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. జింక్ లోపం ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల ఫంగస్ , చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు తలెత్తవచ్చు. విరేచనాలు.. వైద్యుల ప్రకారం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా అవసరం. జింక్ లోపం జీర్ణవ్యవస్థపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో జింక్ లోపించినప్పుడు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. గాయాలు.. జింక్ లోపం చర్మం, కడుపునే కాకుండా గాయాలను కూడా ప్రభావితం చేస్తుంది. జింక్ లోపం ఉన్నవారిలో గాయాలు నెమ్మదిగా నయమవుతాయి. జింక్ లోపిస్తే కనిపించే లక్షణాలు.. జింక్ లోపం వేగంగా బరువు తగ్గడం, నీరసం , జుట్టు రాలడం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. జింక్ పుష్కలంగా లభించే ఆహారాలు.. ఆహారంలో జింక్‌ను చేర్చుకోవడానికి,  గుమ్మడి గింజలు, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు గింజలు , రాగులను చేర్చుకోవచ్చు. ఈ ఆహారాలలో జింక్ ఉంటుంది. అదనంగా,  ఆవాల ఆకుకూర, మాంసం, పప్పుధాన్యాలు, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, పెరుగు, వేరుశెనగలు , గుడ్లను కూడా తినవచ్చు. ఈ ఆహారాలలో కూడా జింక్ సమృద్దిగా ఉంటుంది.                                 *రూపశ్రీ.
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ అవసరం లేకుండా కొద్దిమోతాదులో అందుతుంది.  అయితే  అన్ని రకాల కూరగాయలను ఇనుప పాత్రలో వండకూడదు.  . కొన్ని కూరగాయలు ఐరన్ పాత్రలో వండినప్పుడు రియాక్షన్ జరిగి వాటి రుచి, రంగు లేదా పోషక విలువల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.  ఆహారం  నాణ్యత , రుచిని కోల్పోకుండా ఉండేందుకు, ఐరన్ పాత్రలు వాడే ప్తి ఒక్కరూ వాటిలో వండకూడని కూరగాయలు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. టమోటా.. టమోటాలు వంటల్లో ఎక్కువగా ఉపయోగించే  కూరగాయ. టమోటాలలో ఆమ్లం అధిక మొత్తంలో ఉంటుంది, ఇది ఐరన్ తో చర్య జరుపుతుంది. దీనివల్ల కూరగాయ రంగు ముదురుగా మారవచ్చు , కొద్దిగా వగరు రుచిని కలిగి ఉండవచ్చు. ఎక్కువసేపు వండటం ఈ ప్రభావాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. అందువల్ల, టమోటా వంటి  కూరగాయలను స్టీల్ లేదా నాన్-స్టిక్ పాన్ లేదా బౌల్స్ లో వండాలి. పాలకూర.. పాలకూర వంటి ఆకుకూరలు ఐరన్ ప్రభావానికి గురైనప్పుడు వాటి  ఆకుపచ్చ రంగును కోల్పోయి, ముదురు రంగులోకి లేదా నల్లగా మారవచ్చు, దీనివల్ల అవి తినడానికి పనికిరావు. రుచిలో కూడా కొద్దిగా మార్పు ఉంటుంది. ఆకుకూరలను అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలలో వండటం ఉత్తమం. చింతపండు.. చింతపండు ఉపయోగించి వండే  కూరను ఇనుప పెనంలో వండకూడదు. వీటిలో ఉండే ఆమ్లాలు ఇనుముతో చర్య జరిపి ఆహారం రుచిని మార్చి, దానికి లోహపు రుచిని ఇస్తాయి. ఇది అనారోగ్యకరమైనదిగా కూడా పరిగణించబడుతుంది. అందువల్ల, స్టీల్ లేదా నాన్-స్టిక్ పెనాన్ని ఉపయోగించాలి.  కేవలం చింతపండు మాత్రమే కాకుండా నిమ్మకాయ,  మామిడికాయ వంటివి కూడా ఐరన్ పాత్రలలో వండకూడదు. పెరుగు వంటలు.. పెరుగుతో చేసిన కూర లేదా పెరుగు గ్రేవీ వంటి కూరగాయల వంటకాలను ఇనుప పెనంలో వండినప్పుడు వాటి రుచి భిన్నంగా ఉంటుంది. పెరుగులోని పులుపు ఇనుముతో కలిసి కొద్దిగా చేదును కలిగిస్తుంది. అంతేకాకుండా రంగు ముదురుగా మారవచ్చు , కూరలో కొద్దిగా నలుపు కనిపించవచ్చు. నిమ్మకాయ.. కూరగాయలకు నిమ్మరసం కలపడం వల్ల వాటికి కొద్దిగా పులుపు, రుచి వస్తుంది, కానీ అది ఐరన్ తో  చర్య జరిపి రుచిని పాడుచేసే అవకాశం ఉంది.  దీనివల్ల ఆహారానికి లోహపు, వగరు రుచి వస్తుంది, కాబట్టి నిమ్మరసాన్ని ఎల్లప్పుడూ వంట చేసిన తర్వాత, తినడానికి ముందు మాత్రమే కలపాలి. ఎక్కువ నీటి శాతం కలిగిన కూరలు.. అధిక నీటి శాతం ఉన్న కూరగాయలను ఐరన్ పెనంలో వండినప్పుడు వాటి రంగు, ఆకృతి మారవచ్చు. ఈ కూరగాయలను ఎక్కువ సేపు వండితే నల్లగా మారిపోతాయి. అందువల్ల వాటిని రసాయనాలతో చర్య జరపని పాత్రలలో వండటం మంచిది.                               *రూపశ్రీ.