తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాలను మరింత పటిష్టపరిచే దిశగా అధిష్ఠానం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జి బాధ్యతలను యువ నాయకుడు బీఎం సందీప్‌కు అప్పగిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది.    పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోద ముద్రతో ఈ నియామకం తక్షణమే అమల్లోకి రానున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ పార్టీని సమన్వయం చేసే తరుణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.    గతంలో ఈ బాధ్యతలను నిర్వర్తించిన మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఈ మార్పు జరిగిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ సంస్థాగత పదవి నుంచి తప్పుకున్న ఆమె, గతంలో రాష్ట్రంలో అందించిన విశేష సేవల పట్ల అధిష్ఠానం ప్రత్యేక ప్రశంసలు కురిపించింది.    కొత్త ఇన్‌ఛార్జి రేసులో పలువురు సీనియర్ జాతీయ నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పాటు సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, మాణిక్‌రావు థాక్రే వంటి ఉద్ధండుల పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ, అనూహ్యంగా అధిష్ఠానం బీఎం సందీప్ వైపు మొగ్గు చూపడం గమనార్హం.    ఈ పరిణామం సరిగ్గా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనలో ఉన్న సమయంలో జరగడం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. పార్టీ యంత్రాంగాన్ని మరింత ఉత్సాహపరిచేందుకు, క్షేత్రస్థాయిలో సమన్వయం సాధించేందుకు ఈ నాయకత్వ మార్పు దోహదపడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు  ఇతర రాజకీయ సవాళ్లు ఎదురుకానున్న తరుణంలో, కొత్త ఇన్‌ఛార్జి నియామకం పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుందని ఆశిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వంతో సఖ్యతను పెంపొందిస్తూ, పార్టీని విజయపథంలో నడిపించడంలో బీఎం సందీప్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మీకు నచ్చవచ్చు: Under 19 Asia Cup: పాక్‌పై చివరి బంతికి భారత్  థ్రిల్లింగ్ విక్టరీ..కప్ మనదే.! [ BM Sandeep Telangana Congress In-charge, Telangana Congress news, AICC new appointments 2026, TPCC updates, Mallikarjun Kharge decisions ]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు వైయస్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మెలిగిన కీలక నేత విజయసాయి రెడ్డి, ఇప్పుడు సొంత పొలిటికల్ జర్నీ ప్రారంభించిన సంగతి విదితమే.   వైసీపీ అధినేత జగన్ కు అత్యంత నమ్మకమైన చార్టర్డ్ అకౌంటెంట్‌గా, రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ఆయన,  పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) పేరుతో నూతన రాజకీయ పార్టీని స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపారు. వైయస్ కుటుంబ నీడ నుంచి బయటపడి, తనకంటూ ఒక స్వతంత్ర రాజకీయ అస్తిత్వాన్ని నిర్మించుకోవాలనే లక్ష్యంతో ఆయన క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణ పనులను వేగవంతం చేశారు. కొత్త పార్టీ ఆవిర్భావ వేదికపై విజయసాయి రెడ్డి ఊహించిన విధంగానే వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ మత విశ్వాసాలను ప్రస్తావిస్తూ, క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూనే రాజకీయ ప్రయోజనాల కోసం రెడ్డి సామాజిక వర్గ మద్దతును ఆశిస్తున్నారంటూ   ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ వర్గాలలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. సాయిరెడ్డి చేసిన ఈ విమర్శలకు,  ఆయన కొత్త పార్టీకి వైసీపీ నుంచి ఎవరు, ఎలాంటి సమాధానం ఇస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.   ఇది కూడా చదవండి: విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీ: చేరబోయే కొత్త నేత.. ఎవరో తెలుసా.? సాయిరెడ్డి పేరును ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండానే ఆయన సొంత పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడారు. విజయసాయి పేరు నేరుగా  ప్రస్తావించకుండా  జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నంత కాలం కొంతమంది వ్యక్తులు తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకుంటారని విమర్శించారు. జగన్ కల్పించిన నమ్మకం, విశ్వసనీయత వల్లే వారికి రాజకీయ వేదిక లభించిందని, కానీ నేడు వారు పార్టీ కంటే తామే గొప్ప అని భ్రమపడుతున్నారని చెవిరెడ్డి అన్నారు.   జగన్ లేకపోతే వ్యక్తిగతంగా వారికి ఎటువంటి గుర్తింపు, విలువ లేవనే విషయాన్ని   గ్రహించలేకపోతున్నారని అన్నారు. ఇలాంటి ప్రాధాన్యత లేని, ప్రభావం చూపలేని చిన్న పార్టీల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఇసుమంతైనా ఉండదన్నారు.   మీకునచ్చవచ్చు:  విజయసాయి కొత్త పార్టీ: వైసీపీకి జరిగే నష్ట మేంటి.. రాష్ట్ర రాజకీయాల్లో పీఆర్పీ ప్రభావమెంత.? విజయసాయి కొత్త పార్టీ: వైసీపీ బీ టీమ్ అంటూ చర్చలు.! [Vijaya Sai Reddy  PRP Party, Chevireddy Reaction, YCP TeluguOn]  
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రభావం వైసీపీపై ఏ మేరకు ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ రాజకీయాలలోకి ప్రవేశించడానికి ముందు నుంచి కూడా విజయసాయి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో కూడా విజయసాయి సహ నిందితుడు. జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2గా ఉన్నాయి.   వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన విజయసాయి,  ఇప్పుడు  పరివర్తన రాజనీతి పార్టీ  పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు.   దేశభక్తి, ప్రజా సంక్షేమం,  ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా తన పార్టీ పనిచేస్తుందని విజయసాయి పార్టీ ప్రకటన సందర్భంగా చెప్పారు. పార్టీ అధికారిక ప్రకటనతో పాటు జెండాను కూడా ఆవిష్కరించిన విజయసాయిరెడ్డి, రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సంస్కృతిని తీసుకువస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేయడమే తమ   లక్ష్యమని ప్రకటించారు.  ఈ పరిణామం వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై  సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు పార్టీలో అత్యంత కీలకంగా, పార్టీ నేతకు అధినేతకు అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు  సొంత కుంపటి పెట్టుకోవడం ఆ పార్టీకి ఏదో మేరకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉందన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తమౌతోంది.   ఇది కూడా చదవండి:  జయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.! పార్టీలో అసంతృప్తితో ఉన్న, అలాగే ఆయనతో సత్సంబంధాలు కలిగిన కొందరు నేతలు భవిష్యత్తులో వైసీపీని వీడి విజయసాయి పంచన చేరే అవకాశలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  అదలా ఉంచితే..  కొత్త పార్టీ ద్వారా ఆయన ఏ మేరకు ప్రభావం చూపగలరు, ప్రజాదరణను ఏ విధంగా సంపాదించుకుంటారు అనే విషయంలో కూడా రాజకీయవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రానున్న కాలంలో విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ)  ప్రయాణం అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను ఏ మేరకు ఎలా  ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద చెప్పిన ముహూర్తానికి చెప్పినట్లుగా తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విజయసాయి, ముందు ముందు రాష్ట్ర రాజకీయాలలో  ఏ మేరకు ప్రభావం చూపుతారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్త మౌతోంది.   మీకు నచ్చవచ్చు:  వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి   విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీ: చేరబోయే కొత్త నేత.. ఎవరో తెలుసా.? [Effect of Vijayasai Reddy New Party onYCP, Parivarthana Rajaneethi Party, PRP, Political Impact, AP Politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
    గిరిబాబు.. తెలుగు సినిమా ప్రేమికుల నోటి వెంట సెల్యులాయిడ్ పై ఆయన పలికిన కామెడీ  డైలాగులు నిత్యం వినిపిస్తూ ఉంటాయి. ఎనీ క్యారక్టర్ తీసుకోండి మెస్మరైజ్ చేయడంలో ఆరి తేరిన దిగ్గజ నటుడు. ఈ రోజు సాయంత్రం గిరిబాబుగారు సినిమాని వీడి అనంత లోకాలకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన పార్థివ దేహం అభిమానులు, ప్రజల సందర్శనార్ధం హైదరాబాద్ ఫిలిం నగర్ ఛాంబర్ లో ఉంచారు. దీంతో అభిమానులు,సాటి సినీ నటులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రజలు గిరిబాబు గారి పార్థివ దేహాన్ని  చూడటానికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. దీన్ని బట్టి అర్ధమవుతున్న నిజం ఏంటంటే సినిమా నటులకి, సినిమా వాళ్ళకి  ఈ సమాజం ఎంతో విలువ ఇస్తుందని.  1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. చిన్నతనం నుంచే సినిమాలపై ఉన్న విపరీతమైన ఆసక్తితో ఆయన ఊళ్లోని టూరింగ్ టాకీస్‌లోనే ఎక్కువ సమయం గడిపేవారు. ఆ రోజుల్లో అందరూ ఆయన్ను "సినిమా పిచ్చోడు" అని పిలిచేవారట. నాటకాలపై మక్కువతో సొంతంగా నాటక సమాజాన్ని స్థాపించి నటనలో మెలకువలు నేర్చుకున్న ఆయన, సినీ రంగంలో అడుగుపెట్టే క్రమంలో తొలిరోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఛార్మిపై శంకరాభరణం మంజు భార్గవి వ్యాఖ్యలు వైరల్:ఛార్మికి అందులోనే ఎక్కువ మార్కులు!    మొదటగా అనుకున్న మూడు సినిమాలు వివిధ కారణాల వల్ల ఆగిపోయినప్పటికీ, వెనకడుగు వేయకుండా పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగించి 1973లో విడుదలైన 'జగమే మాయ' చిత్రంతో నటుడిగా తెరపైకి వచ్చారు.   తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో గిరిబాబు వైవిధ్యభూమితమైన పాత్రలతో మెప్పించారు. సుమారు 100 సినిమాల్లో హీరోగా, 300 సినిమాలకు పైగా విలన్‌గా నటించి ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరియు హాస్యనటుడిగా విభిన్న కోణాలను ఆవిష్కరించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, రజనీకాంత్, వెంకటేష్ వంటి అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ పంచుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా జయభేరి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై 'దేవతలారా దీవించండి', 'సింహగర్జన', 'మెరుపు దాడి', 'పసుపు కుంకుమ' వంటి చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా 'రణరంగం', 'ఇంద్రజిత్', 'నీ సుఖమే నే కోరుకున్నా' వంటి సినిమాలకు దర్శకత్వం వహించి టాలీవుడ్‌లో తన బహుముఖ ప్రజ్ఞ చాటుకున్నారు.   మీకు నచ్చవచ్చు: మహేష్ బాబు న్యూ ఏజ్ పిక్ వైరల్.. పక్కనున్న హీరోయిన్ ఎవరు!   మీకు నచ్చవచ్చు:ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబో: హిట్ పక్కనా! [Giribabu, Raghubabu, Film  Chamber, Tollywood, Chiranjeevi]  
Making her acting debut opposite Dulquer Salmaan in Aakasamlo Oka Tara, Satvika Veeravalli has taken an unconventional route into films. Born and brought up in the USA, the debutante revealed that she quit her corporate job and underwent formal language training to portray a village girl with ambitions of travelling into space. Talking about her character, Satvika described her as an innocent, peaceful girl who remains focused on her dream despite facing humiliation from people around her. She said the character's determination and self-belief make her journey inspirational. Interestingly, Satvika also used her foundational science knowledge to understand the script and connect with the space-related aspects of her character. The transformation from her real-life personality into a soft-spoken village girl was particularly challenging. Recalling her experience, she said seeing herself in a school uniform in the mirror was a surprising moment. She also described the opportunity to play such a different character as a magical experience. Satvika credited Dulquer Salmaan for helping her overcome her nervousness on the sets. Recalling her first day of shooting during a crowded village festival sequence, she said she was scared initially, but Dulquer's support helped her perform confidently. She also praised Shruti Haasan and Ruhani Sharma for their encouragement and guidance. Also Read: Nagarjuna says Aniesh has arrived big time Explaining the film's central emotional idea, Satvika said, "They say behind every man's success there is a woman. In this film, behind a girl's success, there is a boy with a great heart." She believes her character's journey and the film's message of mutual encouragement will inspire audiences. Directed by Pavan Sadineni, Aakasamlo Oka Tara stars Dulquer Salmaan, Satvika Veeravalli, Shruti Haasan and Ruhani Sharma. Produced by Sandeep Gunnam and Ramya Gunnam, the film is presented by Geetha Arts and Swapna Cinema. GV Prakash Kumar is composing the music, and the film is gearing up for a worldwide theatrical release on November 20. Check Out:  Veteran Telugu Actor Giribabu Passes Away                        Aakasamlo Oka Tara will be an iconic film - GV Prakash    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
'శంకరాభరణం' తో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించిన నటి మంజు భార్గవి. ఎంతలా అంటే తన మిగతా చిత్రాల గురించి చెప్పుకున్నా వైబ్రేషన్ అంటూ కనపడదు. శంకరా భరణంతో  తన జీవితం ధన్యమైనట్టు కూడా. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ లో మాజీ హీరోయిన్ 'ఛార్మి' పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.  ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతు 'పౌర్ణమి చిత్రంలో తాను పోషించిన నెగటివ్ రోల్ ని  ఎంతగానో ఆస్వాదించానని, సాధారణంగా తాను చేసే క్యారక్టర్ లకి అది పూర్తి విరుద్ధమని తెలిపారు. ఆ రోల్  చెయ్యాలని తనకు అనిపించిందని, అందులో తనలోని గయ్యాళి బయటకు వచ్చిందని సరదాగా అన్నారు. పౌర్ణమిలో  హీరోయిన్ చార్మీ డాన్స్ కోసం ఎంతగా కష్టపడిందో ఆమె గుర్తు చేసుకున్నారు, కూచిపూడి మాస్టర్ ధర్మరాజ్ వద్ద చార్మీ రోజూ సాయంత్రం ప్రాక్టీస్ చేసేదని చెప్పారు. తనకు నటిగా కంటే డాన్సర్‌గానే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని మంజు భార్గవి అన్నారు. చిన్ననాటి నుంచే డాన్స్ పట్ల తనకున్న మక్కువను, తన తల్లి ప్రోత్సాహంతోనే ఈ రంగంలోకి వచ్చానని చెప్పారు. అవార్డుల పట్ల తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, తనకు సంగీత నాటక అకాడమీ అవార్డు లభించిందని, అయితే సినిమాల విషయంలో అవార్డులను తాను పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి:మహేష్ బాబుతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా: ఇప్పుడు టాప్ హీరోయిన్!  ప్రేక్షకులను సంతోషపెట్టడమే అతిపెద్ద అవార్డు అని ఆమె గట్టిగా నమ్ముతారు. భౌతికంగా లభించే అవార్డులు బూజు పట్టిపోతాయని, వాటిని దులిపేందుకు సమయం కేటాయించాల్సి వస్తుందని, కానీ ప్రేక్షకుల ప్రేమ హృదయాల నుంచి  వస్తుందని, అది ఎప్పటికీ శాశ్వతమని ఆమె అన్నారు. తన కెరీర్‌లో శంకరాభరణం సినిమా తనకు అత్యంత ఇష్టమైనదని, ఆ చిత్రం ద్వారా ఒక గురువు చెప్పిన కొంచెం అనే పదాన్ని అర్థం చేసుకోగలిగానని తెలిపారు. ప్రభాస్, ప్రభుదేవా కాంబోలో వచ్చిన పౌర్ణమిలో ఛార్మి వన్ ఆఫ్ ది హీరోయిన్ అనే విషయం తెలిసిందే.    మీకు నచ్చవచ్చు:గిరిబాబు మరణంపై చిరంజీవి భావోద్వేగం! మీకు నచ్చవచ్చు:ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబో కథ ఇదేనా!: ఫ్యాన్స్ లో పూనకాలు!   [Manju Bhargavi, Charmy Kaur, Pournami, Prabhas, Sankarabharanam]
ప్రముఖ సినీ నటుడు గిరిబాబు మరణంపై నందమూరి కుటుంబానికి చెందిన నందమూరి రామకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గిరిబాబు గొప్ప నటుడని, తెలుగు చలనచిత్ర రంగంలో తనదైన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. గిరిబాబు కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా కూడా సినీ రంగానికి సేవలందించారని రామకృష్ణ గుర్తుచేసుకున్నారు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రశంసించారు. ముఖ్యంగా తన తండ్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావుతో గిరిబాబుకు ఎంతో సాన్నిహిత్యం ఉండేదని రామకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్‌తో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. గిరిబాబు స్నేహానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. గిరిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు బాధను తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. గిరిబాబు జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని నందమూరి రామకృష్ణ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.     [Giribabu, NandamuriRamakrishna, NTRGiribabu, GiribabuTribute, NandamuriFamily]
24 అవర్స్ ఆన్ లెజండ్రీ  పర్సన్ అనే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ దొరుకుతారా అని సోషల్ మీడియా రెడీగా కాచుకొని కూర్చుంటుంది. ఎందుకంటే వైరల్ చేసేద్దామని. ఈ కోవలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఓల్డ్ పిక్ ఒకటి ఫుల్ వైరల్ గా మారింది.         సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆయన కెరీర్‌కు సంబంధించిన పాత ఫోటోలు, త్రోబ్యాక్ జ్ఞాపకాలను అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక అరుదైన ఫోటోలో యంగ్ లుక్‌లో ఉన్న మహేష్ బాబు పక్కన ఒక సుందరమైన అమ్మాయి కనిపిస్తోంది. టాలీవుడ్ ప్రేక్షకులకు ఆమె మొహం కాస్త పరిచయం ఉన్నట్లు అనిపించినా, అసలు ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టడం చాలా మందికి కష్టంగా మారింది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో కాదు.. ప్రముఖ బాలీవుడ్ నటి, మోడల్ తారా శర్మ. ముంబై బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లో అడుగుపెట్టాల్సిన సమయంలో ఊహించని పరిణామాల వల్ల వెనకడుగు వేయాల్సి వచ్చింది. దర్శకుడు శోభన్ తెరకెక్కించిన 2002 నాటి చిత్రం 'బాబీ' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుమారు  9 నుండి 9.5 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా, మహేష్ బాబు హీరోగా నటించారు. ఇది కూడా చదవండి: గిరిబాబు మరణంపై చిరంజీవి ట్వీట్: టోటల్ 600 చిత్రాల్లో! అయితే ఈ చిత్రంలో తొలుత కథానాయికగా నటించాల్సింది ఆర్తీ అగర్వాల్ కాదట. ముందుగా ముంబై మోడల్ తారా శర్మను దర్శకుడు శోభన్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారు. సినిమాకు సంబంధించి కొన్ని రోజుల పాటు షూటింగ్‌లో కూడా ఆమె పాల్గొంది. సెట్స్‌లో మహేష్ బాబు, దర్శకుడు శోభన్‌తో కలిసి దిగిన ఈ ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే కొద్ది రోజుల షూటింగ్ ముగిసిన తర్వాత తారా శర్మకు హిందీ బాలీవుడ్ నుంచి మరో ప్రతిష్టాత్మకమైన ఆఫర్ వచ్చింది. అనుపమ్ ఖేర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఓం జై జగదీష్' చిత్రంలో నటించే సువర్ణావకాశం ఆమెను వరించింది. దీంతో ఆమె బాలీవుడ్ ప్రాజెక్ట్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చి, టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'బాబీ' సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పట్లో ఈ విషయం గురించి తారా శర్మ స్వయంగా స్పందిస్తూ, తాను మహేష్ బాబు సరసన నటించాల్సిన తొలి తెలుగు సినిమా మిస్సయినందుకు కొంచెం బాధపడ్డానని, అయితే ఆ సమయంలో గడిపిన క్షణాలు చాలా మధురమైనవని గుర్తుచేసుకున్నారు. ఒకవేళ తారా శర్మ తప్పుకోకపోతే టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఆమె రేంజ్ మరోలా ఉండేది. ఆ తర్వాత ఆమె ప్లేస్‌లోకి అందాల తార ఆర్తీ అగర్వాల్ వచ్చి చేరగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. అప్పట్లో మిస్ అయిన ఆ బ్లాక్‌బస్టర్ సినిమా జ్ఞాపకం ఇప్పుడు మరోసారి ఇంటర్నెట్‌లో తెగ హల్ చల్ చేస్తోంది.   మీకు నచ్చవచ్చు: రసవత్తరంగా మారిన అమితాబ్ ఆస్తి వివాదం! మీకు నచ్చవచ్చు:తెలుగు సినిమాకి కొత్త హీరోయిన్: ఆ స్టార్ క్రికెటర్ కి విడాకులు కూడా ఇచ్చేసింది!     [Mahesh Babu, Tara Sharma, Bobby movie, Shobhan]
ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు బేన‌ర్‌లో ఎన్ని సూప‌ర్‌హిట్ సినిమాలు వ‌చ్చాయో అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో దిల్‌రాజు చేసిన రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2, ఎఫ్‌3, సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాలు ఘ‌న విజ‌యం సాధించాయి. 2026, 2027 సంక్రాంతికి ఆయ‌న నిర్మాణంలో వ‌చ్చిన ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో 2028 సంక్రాంతి దిల్ రాజుదే అని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. హిట్ కాంబినేష‌న్‌గా పేరు తెచ్చుకున్న దిల్‌రాజు, అనిల్ రావిపూడి క‌లిసి మ‌ళ్లీ సినిమా చెయ్య‌బోతున్నార‌ని, ఆ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ప్రారంభ‌మై 2028 సంక్రాంతికి రిలీజ్ అవుతుంద‌ని కూడా చెప్పుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో దీని గురించి ప్ర‌స్తావిస్తూ తెలుగువ‌న్ ఛాన‌ల్ సినిమా ఇన్‌ఛార్జ్ వేణు బిక్కి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ దిల్‌రాజు ఏమ‌న్నారంటే.. ‘ప్రస్తుతం అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత మా బేనర్‌లో సినిమా చేస్తారు. హీరో ఎవరు, అది ఎలాంటి సినిమా అనేది ఇప్పుడే చెప్పలేను. అయితే వచ్చే సంక్రాంతికి ప్రారంభమై 2028 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తామని మాత్రం చెప్పగలను’ అన్నారు.  అయితే అందర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ ఈ సినిమా గురించి అడిగిన మ‌రుస‌టిరోజే ఎన్టీఆర్‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో సినిమా అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బేన‌ర్‌లో ఈ సినిమా నిర్మించ‌బోతున్న‌ట్టు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ ప్ర‌క‌టించారు. అయితే దీనికి సంబంధించి ఒక వార్త ఫిలిం స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేమిటంటే.. అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌ని దిల్‌రాజు ప్ర‌క‌టించిన మ‌రుస‌టిరోజే ఎన్టీఆర్‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో సినిమా అని ఎనౌన్స్ చేయ‌డంతో నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌తోపాటు దిల్ రాజు కూడా ఈ సినిమాకి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారా? అనే సందేహం క‌లుగుతోంది. మ‌రి దిల్‌రాజు చెప్పిన కాంబినేష‌న్ ఇదేనా?  లేక మ‌రో హీరోతో అనిల్ రావిపూడి చేసే సినిమాకు దిల్‌రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారా అనే విష‌యం తెలియాల్సి ఉంది.  ఏది ఏమైనా ప్రెస్‌మీట్‌లో అనిల్ రావిపూడి సినిమా ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన మ‌రుస‌టి రోజే ఎన్టీఆర్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్టు అఫీషియ‌ల్‌ ఎనౌన్స్‌మెంట్ రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.     [Dil Raju, Anil Ravipudi, Ntr, KalyanRam, NtrNewMovie] 
దిగ్గజ నటుడు,నిర్మాత, దర్శకుడు గిరిబాబుగారు ఈ రోజు సాయంత్రం మరణించారు. దీంతో అభిమానులు, పరిశ్రమ షాక్ కి గురైంది. ఈ నేపథ్యంలో గిరి బాబు మరణంపై  చిరంజీవి స్పందిస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి తన ట్వీట్ లో గిరిబాబు గారు ఇకలేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. 'విలక్షణమైన నటనతో, తనదైన ప్రత్యేక శైలితో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల ద్వారా నటుడుగా, నిర్మాతగా, దర్శకునిగా తెలుగు చిత్ర పరిశ్రమకి  గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం.  ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. ఇది కూడా చదవండి: ప్యారడైజ్ లో ఎన్టీఆర్, చరణ్,అల్లు అర్జున్ చేసి ఉంటే: జరిగేది అదే..స్టార్ నటుడి వ్యాఖ్యలు వైరల్!    చిరంజీవి, గిరిబాబు కలిసి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. వాటిల్లో ఒకటి అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు ఒకటి. గిరిబాబు గారు తన నట జీవితంలో సుమారు 600 కి పైగా చిత్రాల్లో చేశారు. ఆయన వారసుడిగా రఘుబాబు తన జైత్ర యాత్రని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.       మీకు నచ్చవచ్చు:ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ఫిక్స్: ఫ్యాన్స్ సంబరాలు! మీకు నచ్చవచ్చు:అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం!   [Chiranjeevi, Giribabu, Tollywood news, Giribabu death]
సినీ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ట్రాక్ రికార్డుకి ఘనమైన హిస్టరీ నే ఉంది. రైటర్స్ కి స్టార్ డమ్, విజిల్స్, చప్పట్లు తెచ్చిన కట్ అవుట్ కూడా. నటుడుగాను రాణించి అబ్బా మనం వెళ్లే మూవీలో పరుచూరి గోపాల కృష్ణ ఉంటే ఎంత బాగుండని అనుకునేలా కూడా చేసాడు.  తాజాగా పరుచూరి పలుకులు ప్రోగ్రాంలో  'ది ప్యారడైజ్' సినిమాపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ, ఈ కథాంశంపై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథల ఎంపిక, నటీనటుల ఎంపిక ఎంత ముఖ్యమో ఆయన తనదైన శైలిలో వివరించారు. మూవీ  విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదని, కంటెంట్ పరంగా ఇంకా మెరుగైన అవుట్‌పుట్ వచ్చే అవకాశం ఉండేదని ఆయన విశ్లేషించారు. ఒక మంచి పాయింట్‌ను తీసుకున్నప్పుడు దానిని తెరపై ఆవిష్కరించే విధానంలో చిన్నపాటి మెరుగులు దిద్దితే ప్రేక్షకుల నుంచి మరింత స్పందన లభిస్తుందని  పేర్కొన్నారు. ఇక ఇదే సందర్భంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ప్యారడైజ్  కథలో చేసి  ఉంటే సినిమా స్థాయి పూర్తిగా వేరేలా ఉండేదని, అగ్ర హీరోల బాడీ లాంగ్వేజ్, వారి మాస్ ఇమేజ్, బాక్సాఫీస్ స్టామినా ఈ రకమైన కథలకు సరిగ్గా సరిపోతాయని అభిప్రాయపడ్డారు. ఇది కూడా చదవండి: బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్: ఎన్టీఆర్, అనిల్ రావిపూడి క్రేజీ కాంబో ఫిక్స్..ఇక థియేటర్లలో నవ్వుల జాతరే! తెలుగు తెరపై ఇలాంటి వైవిధ్యమైన ప్రయత్నాలు వస్తున్న తరుణంలో, కథాబలం తోడుగా అగ్ర హీరోల భాగస్వామ్యం ఉంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తారుమారవుతాయని  ఉద్ఘాటించారు. సినిమా నిర్మాణంలో ప్రతి విభాగంపై తగినంత దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో మరింత సంచలన విజయాలు సాధించే అవకాశం ఉంటుందని కూడా మేకర్స్ కి కూడా  సూచించారు.   మీకు నచ్చవచ్చు: అమితాబ్ ఆస్థి గొడవలో ట్విస్ట్: అడ్డం తిరిగిన ఆ మహిళ! మీకు నచ్చవచ్చు:ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ చిత్రంలో ఎన్టీఆర్!   [Paruchuri Gopala Krishna, Ntr, Ram Charan, Allu Arjun, Nani, The Paradise]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో సంచలనం సృష్టిస్తున్న స్థూలకాయ నివారణ మందుల విషయంలో చైనా ఒక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ (Eli Lilly) అభివృద్ధి చేసిన  ఓర్ఫోగ్లిప్రాన్  (Orforglipron) అనే ఓరల్ జీఎల్పీ 1 బరువు తగ్గించే మాత్రకు చైనా నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ (NMPA) అధికారికంగా మార్కెటింగ్ అనుమతి మంజూరు చేసింది. చైనాలో బరువు నియంత్రణ కోసం క్లియరెన్స్ పొందిన మొట్టమొదటి ఓరల్ జీఎల్పీ 1 రెసెప్టర్ అగోనిస్ట్ ఇదే కావడం విశేషం. ఈ కీలక నిర్ణయంతో చైనా మార్కెట్లో ఇంజెక్షన్ల శకం ముగిసి, సులభంగా వేసుకునే మాత్రల ద్వారా బరువు తగ్గే సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఫార్మా మార్కెట్‌గా ఉన్న చైనాలో, తన ప్రధాన ప్రత్యర్థి అయిన నోవో నొర్డిస్క్ (Novo Nordisk) కంటే ముందే ఈ ఆమోదాన్ని దక్కించుకోవడం ద్వారా ఎలి లిల్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సరికొత్త మాత్రను చైనాలో స్థానికంగా  ముయోడా  (Muyouda) అనే బ్రాండ్ పేరుతో విక్రయించనున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న లేదా కనీసం ఒక్క బరువు సంబంధిత ఆరోగ్య సమస్యతోనైనా సతమతమవుతున్న పెద్దలకు ఈ మందును ఆహార నియమాలు మరియు వ్యాయామంతో పాటుగా సూచించనున్నారు. ఇప్పటివరకు ఈ మార్కెట్లో కేవలం ఇంజెక్షన్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో, ఈ ఓరల్ మాత్ర రోగులకు అత్యంత సులభతరమైన ప్రత్యామ్నాయంగా మారనుంది. ఈ మందుకు సంబంధించిన క్లినికల్ పరీక్షల్లో అత్యంత అద్భుతమైన ఫలితాలు వెలువడ్డాయి. ప్రతిష్టాత్మకమైన  ATTAIN 1  ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా, అత్యధిక మోతాదు తీసుకున్న రోగులు 72 వారాల వ్యవధిలో సగటున ఏకంగా 12.4 కిలోల బరువు తగ్గినట్లు తేలింది. అంతేకాకుండా, ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది తమ శరీర బరువులో 15 శాతానికి పైగా కోల్పోవడం విశేషం. ఈ పరిశోధనల్లో మొత్తం 10,000 మందికి పైగా రోగులపై పరీక్షలు నిర్వహించగా, అందులో చైనీస్ రోగులు కూడా పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం గమనార్హం. ఈ ఓరల్ మాత్ర యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది నాన్ పెప్టైడ్ చిన్న అణువుతో తయారైన ఔషధం. దీనివల్ల రోగులు రోజూ ఏ సమయంలోనైనా, ఎలాంటి కఠినమైన ఆహార లేదా నీటి నిబంధనలు లేకుండా ఈ మాత్రను సులభంగా వేసుకోవచ్చు. క్లినికల్ పరీక్షల్లో ఈ మందు సురక్షితమైనదని రుజువు కాగా, కొన్ని స్వల్పపాటి జీర్ణకోశ సమస్యలు మినహా ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేవని, ముఖ్యంగా కాలేయానికి సంబంధించి ఎలాంటి ప్రమాదకర సంకేతాలు కనిపించలేదని కంపెనీ స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి:సంస్కృత దినోత్సవ వేడుకలు: ప్రాచీన వైభవానికి నాయకుల నీరాజనాలు! భవిష్యత్తులో ఈ ఆరోగ్య సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉండబోతుందో లాన్సెట్ జర్నల్ లో ప్రచురితమైన 2025 అధ్యయనం హెచ్చరిస్తోంది. ఆ అంచనాల ప్రకారం 2050 నాటికి చైనాలో ఊబకాయం లేదా అధిక బరువుతో బాధపడే పెద్దల సంఖ్య ఏకంగా 630 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ భారీ జనాభాను దృష్టిలో ఉంచుకునే ఎలి లిల్లీ సంస్థ రాబోయే దశాబ్ద కాలంలో చైనాలోనే స్థానిక సరఫరా గొలుసును పటిష్టం చేయడానికి సుమారు 3 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు పెట్టాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం చైనాలో బరువు తగ్గించే మందులకు ప్రభుత్వ ఆరోగ్య బీమా లేదా ప్రైవేట్ పాలసీల మద్దతు లేదు కాబట్టి, రోగులే స్వయంగా ఖర్చు భరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ మధ్య, ధనిక వర్గాల పట్టణ వాసుల నుంచి ఇటువంటి విప్లవాత్మక మందులకు విపరీతమైన డిమాండ్ లభిస్తోంది. ఈ చారిత్రాత్మక ఆమోదం వెలువడిన వెంటనే, అమెరికా స్టాక్ మార్కెట్లో ఎలి లిల్లీ షేర్లు దాదాపు 2.8 శాతం మేర ఎగబాకడం ఈ వార్తకు ఉన్న మార్కెట్ ప్రభావాన్ని స్పష్టం చేస్తోంది. మీకు నచ్చవచ్చు:హార్ట్ ఫెయిల్యూర్ రోగులు జాగ్రత్త: వాతావరణ మార్పులతో ఊహించని ప్రమాదం!                    పిల్లలకు రోజుకు 2 గంటలే సోషల్ మీడియా: మెటా భారీ రాజీ వెనుక అసలు నిజాలివే!     Orforglipron Weight Loss, Oral GLP 1 Pill, Obesity Treatment Breakthrough, New Medical Innovations, Weight Management Drugs, Doctor Health Advice, Health Tips In Telugu.  
సాధారణంగా శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర (బ్లడ్ షుగర్) స్థాయిలు తగ్గుతాయని అందరూ భావిస్తారు. కానీ చాలా మందిలో వ్యాయామం ముగిసిన తర్వాత లేదా వ్యాయామం చేస్తున్న సమయంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగడం గమనించవచ్చు. ఇది ఎలాంటి అనారోగ్య సమస్య కాదని, శరీరంలో జరిగే ఒక సహజమైన జీవక్రియ ప్రతిస్పందన అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా హై ఇంటెన్సిటీ వర్కౌట్లు, హెవీ వెయిట్ లిఫ్టింగ్, స్ప్రింటింగ్ వంటి కఠినమైన శారీరక శ్రమలు చేసినప్పుడు ఈ రకమైన షుగర్ స్పైక్స్ సర్వసాధారణంగా కనిపిస్తాయి. అయితే ఈ ప్రతిస్పందన ఒక్కరి శరీర తత్వాన్ని బట్టి మారుతుంటుంది. శరీరానికి కఠినమైన వ్యాయామాల సమయంలో తక్షణ శక్తిని అందించడానికి కాలేయం (లివర్) తనలో నిల్వ ఉంచుకున్న గ్లైకోజెన్‌ను విచ్ఛిన్నం చేసి రక్తంలోకి గ్లూకోజ్‌ను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియను గ్లైకోజెనోలిసిస్ అని పిలుస్తారు. దీనితో పాటు గ్లూకోనియోజనెసిస్ అనే పద్ధతి ద్వారా కాలేయం కొత్త గ్లూకోజ్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది. కండరాలకు శక్తి కొరత రాకుండా నివారించడానికి శరీరం చేసే రక్షణ చర్య ఇది. అయితే మధుమేహం ఉన్నవారిలో, లేదా ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఉన్నవారిలో కాలేయం విడుదల చేసే ఈ గ్లూకోజ్ సరిగ్గా వినియోగించబడదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తాత్కాలికంగా పెరుగుతాయి. ఉదయం పూట వ్యాయామాలు చేసేవారిలో ఈ బ్లడ్ షుగర్ పెరుగుదల మరింత స్పష్టంగా కనిపించవచ్చు. దీనికి ప్రధాన కారణం  డాన్ ఫెనామినన్  (Dawn Phenomenon). ఉదయం వేళల్లో కార్టిసాల్, గ్రోత్ హార్మోన్ల ప్రభావం వల్ల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు సహజంగానే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో వర్కౌట్లు చేయడం వల్ల హార్మోన్ల విడుదల మరింత పెరుగుతుంది. దీనితో పాటు శరీరం డీహైడ్రేషన్‌కు గురైతే, రక్తంలో గ్లూకోజ్ సాంద్రత పెరిగి చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం మరింత కష్టమవుతుంది. అందువల్ల వేడి వాతావరణంలో వ్యాయామం చేసేటప్పుడు తగినంత నీరు త్రాగడం అత్యంత ముఖ్యం. మధుమేహం ఉన్నవారు వ్యాయామానికి ముందు తమ రక్తంలో గ్లూకోజ్ మరియు కీటోన్ స్థాయిలను పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు 250 mg/dL కంటే ఎక్కువగా ఉన్నప్పుడు లేదా కీటోన్లు ఉన్నప్పుడు కఠినమైన వ్యాయామాలు చేయడం ప్రమాదకరంగా మారుతుంది. ఇది డయాబెటిక్ కీటోఅసిడోసిస్ (DKA) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి అనూహ్యంగా రీడింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. ఇది కూడా చదవండి:వర్షాకాలంలో హెల్దీ బెల్లం టీ.. పాలు విరగకుండా అద్భుతమైన రుచి కోసం చిట్కాలు! వ్యాయామం తర్వాత కనిపించే ఈ తాత్కాలిక షుగర్ పెరుగుదల ఎల్లప్పుడూ హానికరం కాదు. అయితే వ్యాయామం తర్వాత చాలా గంటల పాటు షుగర్ లెవెల్స్ తగ్గకుండా ఉండటం, ప్రతిసారీ ఇదే సమస్య పునరావృతం కావడం, విపరీతమైన దాహం, తరచుగా మూత్ర విసర్జన, వికారం లేదా తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి సందర్భాల్లో మీ ఫిజిషియన్ లేదా ఎండోక్రైనాలజిస్ట్ సహాయంతో మందుల మోతాదు లేదా ఆహారపు అలవాట్లలో తగిన మార్పులు చేసుకోవడం మంచిది. మొత్తంగా చెప్పాలంటే, వ్యాయామం వల్ల బ్లడ్ షుగర్ తాత్కాలికంగా పెరిగినంత మాత్రాన వ్యాయామం చేయడం మానేయాల్సిన అవసరం లేదు. క్రమక్రమంగా వ్యాయామం యొక్క తీవ్రతను పెంచడం, సరైన హైడ్రేషన్ పాటించడం మరియు మీ శరీర తీరును నిరంతరం మానిటర్ చేయడం ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. సరైన జీవనశైలి మార్పులు మరియు వైద్యుల సలహాలతో మీ రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యకరమైన పరిమితుల్లో ఉంచుకోవడం సాధ్యమవుతుంది. మీకు నచ్చవచ్చు:రోడ్డు పక్కన కనిపించే ఈ పిచ్చి మొక్క తెలుసా? ఆ భయంకర రోగానికి బ్రహ్మాస్త్రం! పరగడుపున బొప్పాయి తింటే మీ చర్మం, జీర్ణక్రియ ఎలా మారుతాయో చూడండి!       Blood Sugar After Exercise, Post Workout Glucose Spike, Diabetes Fitness Tips, High Blood Sugar Causes, Exercise And Blood Glucose, Doctor Health Advice, Health Tips In Telugu.
చలికాలం రాగానే మార్కెట్లలో పచ్చని ముత్యాల్లా మెరిసే పచ్చి బఠానీలు అందరినీ ఆకర్షిస్తాయి. కూరలు, సూప్‌లు, స్నాక్స్‌లో విరివిగా వాడే ఈ చిన్న గింజల వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. కేవలం రుచిని అందించడమే కాకుండా, శీతాకాలంలో మనకి కావలసిన పోషకాలను ఇవి పూర్తిగా సమకూరుస్తాయి. అయితే చాలామంది బఠానీలను కేవలం కూరల రుచి పెంచే పదార్థంగానే చూస్తారు కానీ, వీటిలో ఉండే పోషక విలువులు మాత్రం మన ఆరోగ్యానికి సరికొత్త శక్తిని ఇస్తాయి. శీతాకాలంలో ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఆకలి నియంత్రణ మరియు బరువు పెరుగుదల. ఒక కప్పు ఉడికించిన బఠానీలను తీసుకుంటే సుమారు 9 గ్రాముల ప్రోటీన్, అలాగే మరో 9 గ్రాముల ఫైబర్ లభిస్తాయి. ఈ అద్భుతమైన పోషకాల కలయిక వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది, దీనితో అనవసరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక దూరం అవుతుంది. అంతేకాకుండా కేవలం 100 గ్రాముల ఉడికించిన బఠానీలలో సుమారు 1.5 మి.గ్రాముల ఐరన్ లభిస్తుంది. శరీరానికి మొక్కల ఆధారిత ఐరన్ అందడంతో పాటు, ఇందులో విటమిన్-సి కూడా తగినంతగా ఉండటం వల్ల ఆ ఐరన్‌ను శరీరం చాలా సులభంగా గ్రహించగలుగుతుంది. బఠానీలపై కొద్దిగా నిమ్మరసం పిండుకుని తింటే ఈ పోషకాలు మరింత మెరుగ్గా ఒంటబడతాయి. ఇక జీర్ణవ్యవస్థ విషయానికి వస్తే, ఒక కప్పు బఠానీల ద్వారా రోజూ మనకు కావలసిన ఫైబర్‌లో దాదాపు 31 శాతం అనగా 9 గ్రాముల పీచు పదార్థం అందుతుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గించి, పేగుల ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరిస్తుంది. బఠానీలలో ఉండే పులియబెట్టగల కార్బోహైడ్రేట్లు పేగుల్లోని ప్రయోజనకరమైన మంచి బ్యాక్టీరియాను పోషిస్తాయి. ఈ ప్రక్రియలో తయారయ్యే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్లు ఆరోగ్యకరమైన పేగు వాతావరణాన్ని నిర్మిస్తాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరిగి చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి శరీరం రక్షణ పొందుతుంది. అయితే కొందరిలో ఈ కార్బోహైడ్రేట్ల వల్ల చిన్నపాటి కడుపు ఉబ్బరం రావచ్చు కాబట్టి, సరిపడా మోతాదులో ఉడికించి తీసుకోవడం చాలా మంచిది. ఇది కూడా చదవండి:భూమాఫియా కుట్రకు బలైన ప్రాచీన ఆలయం: పాకిస్థాన్‌లో హిందువుల ఆందోళన! కణాల పునరుద్ధరణ మరియు డిఎన్ఏ ఏర్పడటంలో విటమిన్ బి9 అనగా ఫోలేట్ కీలక పాత్ర పోషిస్తుంది. వంద గ్రాముల వండిన బఠానీలలో సుమారు 63 మైక్రోగ్రాముల ఫోలేట్ లభిస్తుంది, ఇది సాధారణ కణ విభజనకు ఎంతో అవసరం. అంతేకాకుండా ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. బఠానీలను ఉడికించేటప్పుడు ఎక్కువ సేపు మరగబెట్టకుండా ఆవిరిపై లేదా మైక్రోవేవ్‌లో తక్కువ సమయం ఉడికించడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల వాటిలోని విటమిన్లు నశించకుండా పూర్తిగా దక్కుతాయి. తృణధాన్యాలతో కలిపి పచ్చి బఠానీలను తీసుకుంటే శరీరానికి అదనపు అమైనో ఆమ్లాలు, పీచు పదార్థం లభిస్తాయి. కాబట్టి ఈ చలికాలంలో పచ్చి బఠానీలను మీ డైట్‌లో భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి. మీకు నచ్చవచ్చు:పసుపులోని కర్కుమిన్ మ్యాజిక్.. కీళ్ల నొప్పులు, ఇన్ఫెక్షన్లకు తిరుగులేని పరిష్కారం!                   కొత్త అధ్యయనం సంచలనం: కేవలం 3 నిమిషాల వర్కౌట్‌తో క్యాన్సర్ ముప్పు 18% అవుట్!     Green Peas Benefits, Winter Health Foods, Fresh Matar Nutrition, Immunity Boosting Vegetables, Heart Healthy Diet, Doctor Health Advice, Health Tips In Telugu.
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, గుండెను పదిలంగా కాపాడుకోవడానికి చాలామంది వాకింగ్ ను ఎంచుకుంటారు. అయితే, వాకింగ్ చేయాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ, దానిని నిలకడగా కొనసాగించడంలో చాలామంది విఫలమవుతుంటారు. వర్షం వచ్చిందని, చలికాలం అని, లేదా ఆ రోజు మూడ్ బాలేదని, బిజీగా ఉన్నామని రకరకాల కారణాలతో నడకను మధ్యలోనే ఆపేస్తుంటారు. అసలు వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని ఆ ముఖ్యమైన రహస్యం ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. ఉత్సాహం కాదు.. సరైన ప్లానింగ్ ముఖ్యం.. చాలామంది ఫిట్‌నెస్ విషయంలో ఒక పెద్ద పొరపాటు చేస్తుంటారు. మొదటి రోజే ఉత్సాహంతో నలభై ఐదు నిమిషాలు లేదా గంటపాటు నడవాలని నిర్ణయించుకుంటారు. అలా మొదటి రోజు కష్టపడి నడిచాక, రెండో రోజు కాళ్ల నొప్పితో బాధపడతారు. మూడో రోజు పని ఒత్తిడి, నాలుగో రోజు వాతావరణం బాగోలేకపోవడంతో వాకింగ్ కు స్వస్తి చెబుతారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఫిట్‌నెస్ సాధించడంలో ఎక్కువ మోటివేషన్ ఉన్నవారు కాదు, మంచి అలవాట్లు ఏర్పరచుకున్నవారే విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు. వేగం కాదు.. ఈ లాజిక్ ముఖ్యం.. గుండె ఆరోగ్యం కోసం వేగంగా నడవాలని,  హార్ట్ పాయింట్లు అని ఈ మధ్య చాలామంది వేగంగా నడుస్తూ ఉంటారు. కానీ ఎంత వేగంగా నడిచాం లేదా ఎంతసేపు నడిచాం అనేది ముఖ్యం కాదు, ప్రతీరోజూ నడకను కొనసాగించామా లేదా అనేదే చాలా కీలకం. ఈ క్రమంలోనే వాకింగ్ ప్రారంభించాలనుకునేవారి కోసం ఒక సులభమైన , అద్భుతమైన మార్గం ఉంది. అదేంటంటే.. ఈజీగా.. హుషారుగా.. మొదటగా మొదటి మూడు వారాలు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే నడవాలి. కేవలం ఐదు నిమిషాలు నడవడం వల్ల గుండెకు పెద్దగా ప్రయోజనం చేకూరకపోవచ్చు, కానీ మన మెదడుకు ఒక కొత్త అలవాటును నేర్పించడానికి ఇది సరిగ్గా సరిపోతుంది. మొదటి మూడు వారాలు ఐదు నిమిషాలు నడిచిన తర్వాత, ఆ సమయాన్ని మరో ఐదు నిమిషాలు పెంచి పది నిమిషాలు చేయాలి. ఆ తరువాత మరో మూడు వారాలకు పదిహేను నిమిషాలు, ఇలా క్రమంగా ఇరవై నుంచి ముప్పై నిమిషాలకు పెంచుకుంటూ పోవాలి. ఇది కూడా చదవండి   మోకాళ్ల నొప్పులతో ఇబ్బందా..ఈ 5 వ్యాయామాలు మిస్ అవ్వకండి .! ​ ఇక్కడ ప్రధాన లక్ష్యం మొదట్లోనే శరీరాన్ని అలసటకి గురి చేయడం కాదు, నడకను ఒక మంచి అలవాటుగా మార్చుకోవడం. అలవాటు ఏర్పడిన తర్వాత ఫిట్‌నెస్ అనేది దానంతట అదే మన సొంతం అవుతుంది. చిన్న చిన్న చిట్కాలు.. వాకింగ్ కు మార్గాలు.. నడకను ఎటువంటి ఆటంకాలు లేకుండా క్రమం తప్పకుండా సాగించడానికి కొన్ని చిన్నచిన్న చిట్కాలు ఎంతో సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందే మరుసటి రోజు ఉదయం వాకింగ్ కి వేసుకునే దుస్తులను సిద్ధంగా ఉంచుకోవాలి. వీలైతే వాటిని పక్కనే ఉంచుకోవడం మంచిది. అలాగే షూస్‌ను మంచం పక్కనే ఉంచాలి. ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. దీనివల్ల మనం అలసత్వాన్ని గెలవడం కంటే అసలు అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా ఉండవచ్చు. హ్యాబిట్ స్టాకింగ్.. హ్యాబిట్ స్టాకింగ్ అనే ఒక అద్భుతమైన పద్ధతిని పాటించవచ్చు. ఉదయం నిద్రలేచి బ్రష్ చేసిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా నేరుగా వాకింగ్ కి వెళ్ళిపోవాలి. వాకింగ్ పూర్తయిన తర్వాతే స్నానం చేసేలా దినచర్యను మలచుకోవాలి. ఒక పాత అలవాటుకు మరో కొత్త అలవాటును ఇలా జోడించడం వల్ల పనులు మర్చిపోయే అవకాశం ఉండదు. ఒకవేళ వర్షం కారణంగా బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడితే, ఇంట్లోనే ఐదు నిమిషాల పాటు నడవాలి కానీ వాకింగ్ అలవాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించకూడదు. మొదలు పెట్టిన రోజే పది కిలోమీటర్లు నడవడం కంటే, ఏడాది పొడవునా ప్రతీరోజూ పది నిమిషాల చొప్పున నడవడం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మన గుండెకు కావాల్సింది ఏదో ఒక్కరోజే చేసే  ప్లానింగ్ కాదు.. ప్రతీరోజూ కొనసాగించే ప్లానింగ్ కావాలి. ఈ చిన్నపాటి నియమాలను పాటిస్తూ, వాకింగ్ ను జీవితంలో ఒక భాగం చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతమవుతుంది.                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు  మీ దగ్గర డబ్బు నిలవడం లేదా..అసలు కారణాలు ఇవే..!                                 మీకు తెలుసా ..ఈ విటమిన్లు లోపిస్తే లివర్ దెబ్బతింటుంది..!
మన ఆరోగ్యం బాగుండాలంటే రోజువారీ ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండే పండ్లను తప్పనిసరిగా చేర్చుకోవాలి. పండ్లు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు (Fiber), యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇవి జీర్ణక్రియ మెరుగుపడటానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా కొన్ని పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించుకోవడానికి కూడా సహాయపడుతుంది. మరి మన ఆరోగ్యానికి మేలు చేసే ఆ ఐదు పండ్లు ఏమిటి? జామ, బొప్పాయి, దానిమ్మ, పైనాపిల్, మామిడి పండ్లలో ఎలాంటి పోషకాలు ఉంటాయి? వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి? మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఈ పండ్లు ఎలా ఉపయోగపడతాయి? ఈ ప్రత్యేక వీడియోలో ఆయుర్వేద డైటీషియన్ శ్రవంతి రఘు గారు ఈ ఐదు పండ్లలోని పోషక విలువలు, వాటి ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. జామపండులో ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియకు ఎలా సహాయపడతాయి? బొప్పాయిలోని పోషకాలు మహిళల ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి? దానిమ్మ శరీరానికి అందించే ప్రయోజనాలు ఏమిటి? పైనాపిల్ పేగుల ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? మామిడి పండులోని విటమిన్లు, పోషకాలు మన శరీరానికి ఎలా మేలు చేస్తాయి? అనే విషయాలను వివరంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, ఈ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు కలిగే ప్రయోజనాలు, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వీటి పాత్ర, రోగనిరోధక శక్తికి అవసరమైన పోషకాలు వంటి అనేక విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మలబద్ధకం సమస్యను తగ్గించుకోవడానికి పీచు పదార్థాలు అధికంగా ఉండే పండ్లను ఆహారంలో ఎలా చేర్చుకోవాలి? వాటిని ఏ విధంగా తీసుకుంటే మంచిది? అనే విషయాలను కూడా శ్రవంతి రఘు గారు వివరించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఖరీదైన ఆహారాలే అవసరం లేదు. మనకు సులభంగా లభించే పండ్లను సరైన మోతాదులో, సరైన పద్ధతిలో తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఈ ఐదు పండ్లలోని పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు, మలబద్ధకం సమస్యకు అవి ఎలా తోడ్పడతాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)