ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. స్వయంగా పవన్ కల్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత కొంతకాలంగా వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆయనకు అనుచరులు, అభిమానులు ఉండటంతో ఈ చేరిక రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. విజయవాడ మేయర్ అభ్యర్థిగా రాధా.? వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరడంతో విజయవాడ నగర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. రానున్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన తరఫున ఆయన మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగవచ్చనే ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాధా చేరిక జనసేనకు ఎంతవరకు కలిసివస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ నుంచి జనసేన వరకు.. రాధా రాజకీయ ప్రస్థానం.! వంగవీటి రాధాకృష్ణ తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించారు. దివంగత వంగవీటి మోహనరంగా తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో పనిచేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ కార్యకలాపాల్లో కొనసాగారు. ఇప్పుడు జనసేనలో చేరడంతో ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టం మొదలైంది. విజయవాడ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.? విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా వంగవీటి మోహనరంగా అభిమానులు, రాధాకృష్ణ అనుచరుల మద్దతు రాజకీయంగా ప్రాధాన్యం కలిగిన అంశంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో రాధా జనసేనలో చేరడం ద్వారా పార్టీకి విజయవాడలో మరింత బలం చేకూరుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, రానున్న ఎన్నికల్లో రాధాకృష్ణకు జనసేన ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది? విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఆయనను ప్రకటిస్తుందా? కూటమిలో సీట్ల కేటాయింపులపై ఈ పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దీనిపై జనసేన నాయకత్వం తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.         [ Vangaveeti Radhakrishna, Vangaveeti Radha Joins Janasena, Pawan Kalyan, Janasena Party, Andhra Pradesh Politics, Vijayawada Mayor Candidate, Mangalagiri Janasena Office, Vangaveeti Mohana Ranga, Vijayawada Politics, AP Local Body Elections ]  
దక్షిణాది రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో..  తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం (అక్టోబర్ 13) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ కావడం రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది,  విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని, ఆ తరువాత విజయవాడ ఉత్సవ్ లో పాల్గొన్నారు విజయ్.   అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో చెన్నైకి తిరిగి వెళ్లారు. అయితే ఈ పర్యటన పైకి సాధారణ పర్యటనగానే కనిపించినా,   తెరవెనుక కీలక రాజకీయ చర్చలు, వ్యూహాలకు వేదికగా మారిందన్నది పరిశీలకుల విశ్లేషణ.  ఏపీ, తమిళనాడు  మధ్య నీటి సమస్యలు  నదుల అనుసంధానం,  జాతీయ రాజకీయ సమీకరణాలపై విజయ్ చంద్రబాబుతో కీలక చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా విజయవాడ ఉత్సవ్ లో చెప్పారు కూడా.  చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గోదావరి, కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకు తమిళనాడు మద్దతుపై చంద్రబాబు, విజయ్ మధ్య సంభాషణలో ప్రస్తావనకు వచ్చింది.   ఈ ప్రాజెక్టు కృష్ణా డెల్టాను పరిరక్షించడంతో పాటు రాయలసీమ ప్రాంతానికి సాగునీటిని అందించడానికి అలాగే  కర్ణాటక  తమిళనాడు మధ్య నెలకొన్న కావేరి జల వివాదాలను శాశ్వత పరిష్కారానికీ కూడా దోహదపడుతుందంటున్నారు.  అంతే కాకుండా చంద్రబాబుతో భేటీకి ముందు రోజు తమిళనాడు సీఎం విజయ్ చెన్నైలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వేదిక పంచుకున్నారు. తన డిమాండ్లను ఆయన ముందుంచారు. ఈ రెండు సంఘటనలనూ బేరీజు వేసుకుంటే.. పొలిటికల్ గా విజయ్ ఎన్డీయే కూటమికి చేరువ అవుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. పరిశీలకులు కూడా ఇదే అంటున్నారు.   ఇటీవల తమిళనాడులో ద్రావిడ రాజకీయాల సంప్రదాయానికి భిన్నంగా తనకంటూ ప్రత్యేక ప్రజా మద్దతును కూడగట్టుకుంటున్న విజయ్, జాతీయ స్థాయిలోనూ తన ప్రభావాన్ని విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారనడానికి కూడా దీనినే తార్కానంగా చూపుతున్నారు పరిశీలకులు.   ఇక పోతే చంద్రబాబుతో భేటీ అనంతరం తమిళనాడు సీఎం విజయ్  మీడియా ఎదుట  చంద్రబాబు మాదిరిగా విక్టరీ సింబల్ గా రెండు వేళ్లూ చూపుతూ అభివాదం చేయడం ద్వారా తన పర్యటన సక్సెస్ అయ్యిందన్న సంకేతం ఇచ్చారు. విజయ్ బెజవాడ పర్యటన  దక్షిణాదిన రాజకీయ సమీకరణాల్లో స్పష్టమైన మార్పుకు సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [Tamilnadu CM Vijay Victory Symbol,  Chandrababu Naidu Meeting, Godavari Cauvery Linking, Telugu Ganga Project, NDA Alliance Politics, South Political Equations, Telugu One]
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షాక్ ఇచ్చింది. జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది.  ఈ విచారణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసే దిశగా  నాంపల్లి సీబీఐ కోర్టు ఈ మేరకు  ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు జగన్ తో పాటు  మిగిలిన నిందితులందరినీ కూడా స్వయంగా కోర్టు ముందుకు తీసుకురావాలని కోర్టు స్పష్టం చేసింది. జగన్ సహా మొత్తం 70 మంది నిందితులను వ్యక్తిగతంగా విచారించేలా ఈ ప్రక్రియ సాగుతుందని విస్పష్టంగా పేర్కొంది.  గతంలో ఈ కేసుల విచారణ నెమ్మదిగా సాగుతోందన్న కోణంలో విచారణను రోజువారీ ప్రాతిపదికన చేపట్టాలని కోరుతూ ఈడీ  కోర్టును  ఆశ్రయించిన విషయం తెలిసిందే.  దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసుల విచారణ త్వరగా ముగించి స్పష్టత తీసుకురావాలని ఈడీ ఆ పిటిషన్‌లో కోరింది. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన సీబీఐ ప్రత్యేక కోర్టు,   రోజువారీ విచారణను పట్టాలెక్కించింది. ఈ కేసుల్లో ఉన్న నిందితుల సంఖ్య పెద్దది కావడం, అలాగే దాఖలైన చార్జ్‌షీట్లు, పత్రాల పరిమాణం విస్తృతంగా ఉండటంతో న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు   వాయిదాలు, మినహాయింపులతో కాలయాపన జరుగుతోందన్న అభిప్రాయాలకు చెక్ పెడుతూ, ధర్మాసనం స్వయంగా అందరినీ ప్రత్యక్షంగా విచారించేందుకు సిద్ధమైంది. అక్రమాస్తుల కేసులకు సంబంధించి గత కొన్నేళ్లుగా సీబీఐ, ఈడీ  దాఖలు చేసిన పలు చార్జ్‌షీట్లపై విచారణ కొనసాగుతోంది.  కోర్టు నిర్ణయం నేపథ్యంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇతర రాజకీయ నాయకులు స్వయంగా రోజు వారీ విచారణకు కోర్టుకు హాజరు కాకతప్పని అనివార్యత ఏర్పడింది.  రోజువారీ విచారణతో ఇప్పటివరకు వాయిదాల మీదే నడుస్తున్న ఈ కేసుల  పురోగతి వేగం పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి  ఈ పరిణామాల నేపథ్యంలో నిందితులుగా ఉన్న వారు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా లేదా నాంపల్లి కోర్టు ఉత్తర్వుల ప్రకారం రోజువారీ హాజరవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రతిరోజూ కోర్టు విచారణ సజావుగా సాగితే, ఈ కేసుల్లో తీర్పుల ప్రక్రియ కూడా వేగవంతం అయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.  [CBI Court Shok Jagan, YS Jagan Mohan Reddy, CBI Special Court Nampally, Disproportionate Assets Case, Enforcement Directorate, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఉద్దేశించి ప్రముఖ నటి పూనమ్‌ కౌర్‌ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి సంచలనమే షాక్ కి గురయ్యే సంచలన పోస్ట్ చేసింది. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా 'ఒకప్పుడు త్రివిక్రమ్‌ సినిమాల్లో కనిపించిన వినోదం, మాటల చమత్కారం ఇప్పుడు కనిపించడం లేదు. ‘నీలో ఫన్‌ లేదు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. ఆ స్థానానికి మళ్లీ నువ్వు వెళ్లలేవు' అనే వ్యాఖ్యలు జోడించింది. దీంతో ఆమె వ్యాఖ్యలు నెట్టింట చర్చకి  దారి తీస్తున్నాయి.  ఇది కూడా చదవండి: పెళ్లి కంటే ముందే ఆ కోరిక నెరవేర్చుకుంటా: అనుపమ బోల్డ్ వ్యాఖ్యలు!     ఇదిలా ఉండగా మరో పోస్ట్‌లో టాలీవుడ్ లో గురూజీ గా పిలవబడే  ఓ నటి కోసం తన భార్యపై దాడి చేశాడంటూ ఓ వ్యక్తిని ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేసింది. ఆ వ్యక్తి పేరును మాత్రం ఆమె ప్రస్తావించలేదు. అయితే టాలీవుడ్‌లో త్రివిక్రమ్‌ని  చాలామంది ‘గురూజీ’ అని పిలుస్తుండటంతో ఈ పోస్టు ఆయనను ఉద్దేశించే చేసిందా ? అనే చర్చ కూడా అందరిలో జరుగుతుంది.    [Poonam Kaur About Trivikram, Poonam Kaur, Trivikram Srinivas, Tollywood controversy, Poonam Kaur Instagram post,Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywood News]
కెరీర్ స్టార్టింగ్ నుంచే తన అందమైన పెర్ఫార్మ్  తో ఎంతో మంది అభిమానులని సంపాదించింది అనుపమ పరమేశ్వరన్.. రేపు 'క్రేజీ కళ్యాణం' తో సెల్యులాయిడ్ పై సందడి చేయనుంది. కొన్ని చోట్ల ఈ నైట్ ప్రీమియర్స్ కూడా ప్రదరిస్తున్నారంటే అదంతా అనుపమ క్రేజ్ నే . ఆ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో అనుపమ మాట్లాడుతు నరేష్ గారు చెప్పినట్టుగా పెళ్లి చేసుకోకపోయినా , పిల్లల్ని మాత్రం కనండి అని చెప్పినట్టుగా మా అమ్మ కూడా నాతో అదే అంటుంది. నిజానికి  నాకు కూడా పెళ్లికి ముందే బిడ్డ కావాలనే కోరిక ఉండేది. భవిష్యత్తులో నాకు పెళ్లి అవుతుందో లేదో స్పష్టత కూడా లేదు .కానీ ఒక పాపనో, బాబునో పెంచుకోవాలనే కోరిక ఉంది. అది అడాపషన్, ఐ వి ఎఫ్ ద్వారా సాధ్యమే కదా అని చెప్పుకొచ్చింది. ఇది కూడా చదవండి: అక్టోబర్ 28 కల్లా దేశం విడిచి వెళ్ళిపోవాలి: అమీర్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కి పోలీసుల నోటీసులు!       ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ హోదాలో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. క్రేజీ కళ్యాణం లో అనుపమ తో పాటు తరుణ్ భాస్కర్ , నరేష్ కీ రోల్స్. భద్రప్ప గాజుల దర్శకుడు.       [Anupama Parameswaran Marriage Comments, Anupama Parameswaran, Crazy Kalyanam, Anupama marriage comments, Anupama bold statements, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywood News]
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. చరిత్రలో మరుగునపడిన ఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ చిత్రం తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడేలా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  సుమారు 150 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలనలో సంభవించిన ‘గ్రేట్ మద్రాస్ ఫామైన్’ (మద్రాస్ మహా కరువు) గురించి విజయ్ దేవరకొండ ప్రస్తావించారు. ఆ సమయంలో బ్రిటిషర్లు చేసిన దారుణాల కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం సూపర్ ఎల్‌నినో ప్రభావంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో, గతంలో ఎదురైన కరువు పరిస్థితులను గుర్తుచేసుకుంటూ ప్రజలకు కీలక సూచన చేశారు. నీరు, విద్యుత్, ఆహారాన్ని ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాలని, వాటిని వృథా చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు సాగగల సత్తా భారతీయులకు ఉందని విజయ్ అన్నారు.  1876–1878 మధ్య దక్షిణ భారతదేశాన్ని అతలాకుతలం చేసిన మహా కరువు నేపథ్యంలో ‘రణబాలి’ కథ సాగుతుంది. ఆకలి, పేదరికం, అంటువ్యాధులతో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, బ్రిటిష్ పాలకుల దోపిడీని ఇందులో చూపించనున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల కోసం పోరాడే వీరుడిగా కనిపించనున్నారు. చరిత్రలోని చీకటి కోణాలను వెలుగులోకి తీసుకురావడమే ఈ కథ వెనుక ప్రధాన ఉద్దేశమని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెలిపారు.  ఇక రష్మిక మందన్న మాట్లాడుతూ.. ‘రణబాలి’ తనకు, విజయ్‌కు ఎంతో ముఖ్యమైన సినిమా అని చెప్పారు. ఇందులో జయమ్మ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని, సినిమాలోని ప్రేమకథ కూడా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. మొత్తానికి చారిత్రక నేపథ్యం, భారీ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలతో తెరకెక్కిన ‘రణబాలి’పై అంచనాలు పెరిగాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కరువు చరిత్రను గుర్తుచేస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.     [Vijay Deverakonda, Ranabaali Movie, El Nino Effect, Great Madras Famine, Ranabaali Story, Rashmika Mandanna, Rahul Sankrityan]
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణించి ఐదేళ్లు కావస్తోంది. అయినప్పటికీ ఆయన జ్ఞాపకాలను అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. తాజాగా పునీత్‌కు వ్యక్తిగత వైద్యుడిగా వ్యవహరించిన డాక్టర్ రమణారావు.. ఆయన మరణానికి ముందు జరిగిన పరిణామాలను ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. దీంతో అప్పట్లో ఏం జరిగిందనే విషయాలు మరోసారి చర్చకు వచ్చాయి. 2021 అక్టోబర్ 29న 46 ఏళ్ల వయసులో పునీత్ గుండె సంబంధిత అత్యవసర పరిస్థితితో కన్నుమూసిన విషయం తెలిసిందే. డాక్టర్ రమణారావు వెల్లడించిన వివరాల ప్రకారం.. పునీత్ మరణించిన రోజు జిమ్‌లో సుమారు గంటన్నర పాటు కిక్‌బాక్సింగ్ చేశారు. ఆ రోజు ఆయన తొలిసారిగా ఈ వ్యాయామం చేసినట్లు వైద్యుడు తెలిపారు. అనంతరం తీవ్ర అలసటతో పాటు విపరీతంగా చెమటలు పడుతుండటంతో పునీత్ తన క్లినిక్‌కు వచ్చారని చెప్పారు. ఆయన పరిస్థితిని గమనించిన డాక్టర్ వెంటనే ఈసీజీ పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలో గుండెపై ఒత్తిడి ఉన్నట్లు సంకేతాలు కనిపించడంతో ఆలస్యం చేయకుండా మందులు ఇచ్చి ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రికి వెళ్లే సమయంలో పునీత్ తన కారులోనే ప్రయాణించారు. అప్పటికీ ఆయన మాట్లాడుతున్నారని, కారులో నిటారుగా కూర్చోవడానికి ప్రయత్నించారని రమణారావు గుర్తుచేసుకున్నారు. అయితే, ఆయన భార్య అశ్విని ఒడిలో తల పెట్టుకుని విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. మరోవైపు డాక్టర్ రంగనాయక్ ఆస్పత్రిలో అత్యవసర చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ ఆస్పత్రికి చేరుకోవడానికి ఒక్క నిమిషం ముందు పునీత్ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని రమణారావు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయనను కాపాడలేకపోయారని చెప్పారు. ఇదిలా ఉంటే.. పునీత్‌తో తనకు ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉందని డాక్టర్ రమణారావు తెలిపారు. ఆయనను తన సొంత కొడుకుతో సమానంగా భావించేవాడినని, తన రెండో కుమారుడితో పునీత్‌కు చిన్నప్పటి నుంచే స్నేహం ఉందని గుర్తుచేసుకున్నారు. పునీత్ మరణం తన జీవితంలో అత్యంత బాధాకరమైన ఘటనల్లో ఒకటని, సొంత కుమారుడిని కోల్పోయినట్లు అనిపించిందని చెప్పారు. అభిమానులు ప్రేమగా ‘అప్పు’ అని పిలుచుకునే పునీత్ అకాల మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా మిగిలిపోయింది.     [Puneeth Rajkumar, Puneeth Rajkumar Last Moments, Puneeth Rajkumar Doctor, Dr Ramana Rao, Puneeth Rajkumar Death, Appu Last Moments, Puneeth Rajkumar Kickboxing, Kannada Actor Puneeth Rajkumar, Puneeth Rajkumar News]
Sai Durgha Tej looks battle-ready in the latest birthday poster of Sambarala Yeti Gattu, which hints at a raw and intense action drama set against the backdrop of a village uprising. The actor sports a rugged look, carrying a long sword and a wooden shield, with a goods train in the background. Directed by Rohith KP, the film is being made on a lavish scale, with the makers spending nearly two years on its production. The story is said to be set in the 1980s and revolves around villagers rising against an oppressive landlord. The latest poster hints at a violent confrontation, with Sai Durgha Tej's character appearing ready to take on the forces exploiting the people. The actor has undergone a significant transformation for the role, sporting a rugged appearance that suits the film's revolutionary backdrop. The project is expected to combine large-scale action sequences with an emotional story rooted in the struggles of ordinary people. Produced by Chaitanya Reddy and Niranjan Reddy, Sambarala Yeti Gattu is currently in post-production. Ajaneesh Loknath is composing the music for the pan-India film, which is targeting a Sankranti release, on 12th January. Further details about the film's promotions are expected to be announced by the makers. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Sai Durgha Tej has announced his next film, tentatively titled #SDT19, on the occasion of his birthday. The film will be produced by Anil Sunkara under his AK Entertainments banner, with Teja Kakumanu making his feature film directorial debut. Teja Kakumanu is known for his acting roles in films like Baahubali and for directing the popular web series Save The Tigers. He has developed a story tailored for Sai Durgha Tej, with the actor set to appear in a different avatar. Producer Anil Sunkara has backed several commercial entertainers and content-driven films under AK Entertainments. The upcoming project is being planned on a grand scale, with the makers aiming to begin regular shooting this month. Further details about the film's cast and technical crew are expected to be announced soon. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
The team behind the prestigious biopic of Bharat Ratna M.S. Subbulakshmi has expressed its heartfelt gratitude to Superstar Rajinikanth for his warm wishes, blessings and enthusiastic response to the project. During the recent Jailer 2 Super Show interview, Rajinikanth expressed his excitement about the M.S. Subbulakshmi biopic, bringing immense happiness to the entire team. Thalaivar Rajinikanth expressed deep reverence for the legendary Bharat Ratna M.S. Subbulakshmi Amma, calling her a divine pan-India spiritual icon. He mentioned he is eagerly waiting for the upcoming biopic titled "MS: A Legacy on Screen." Rajinikanth also stated that Anirudh's musical score will be the perfect tribute to the classical singer. He said, "I'm happy that Anirudh is doing MSS biopic, It's Going to be another Sankarabharanam. I'm eagerly waiting for that." In a heartfelt gesture, the team extended its sincere thanks to the one and only Thalaivar for his encouragement and gracious blessings. The film’s pooja ceremony has already been completed, marking an important milestone in bringing the inspiring life story of one of India’s greatest musical legends to the big screen. The ambitious pan-India biopic features National Crush Rashmika Mandanna in the role of M.S. Subbulakshmi and is directed by Gowtam Tinnanuri, with music composed by Rockstar Anirudh Ravichander. Visionary producers Allu Aravind, Rockline Venkatesh and Bunny Vas are backing this prestigious project. The film will be mounted on a grand scale with world-class production values and high technical standards, and is expected to go on floors soon. The makers will announce more details about the project in the coming days. On this special occasion, the team also extended its heartfelt wishes to Superstar Rajinikanth and the entire team of Jailer 2 for a grand success as the highly anticipated film gears up for its worldwide theatrical release tomorrow, October 15. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  ఈ రోజు సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పుట్టిన రోజు. దీంతో అభిమానులు,శ్రేయోభిలాషులు  బర్త్ విషెస్  చెప్తూ సోషల్ మీడియాకి సరికొత్త జోష్ తీసుకొస్తున్నారు. ఇక తేజ్ కూడా వాళ్ళకి జోష్ ఇస్తూ  కొత్త సినిమా ప్రకటన చేసాడు.    ఇది కూడా చదవండి: జైలర్ 2 రిలీజ్: ఆ థియేటర్ లో ధనుష్,ఐశ్వర్య!   ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర నిర్మాణంలో ఓటీటీలో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ప్రముఖ సిరీస్ "సేవ్ ది టైగర్స్" (Save The Tigers) దర్శకుడు తేజ కనుమూరు  డైరెక్ట్ చేయబోతున్నాడు.  ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, నటీనటులు అలాగే సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం  'సంబరాల ఏటి గట్టు' తో బిజీగా ఉన్నాడు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ కాగా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానుంది.   [ Sai Dharam Tej New Movie Announced, Sai Dharam Tej, Sai Durgha Tej, Teja Kanuru, Tollywood news, latest movie announcement, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywood News]  
న‌టీన‌టులు: ర‌జినీకాంత్‌, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, విద్యాబాల‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ర‌మ్య‌కృష్ణ‌, సూర‌జ్ వెంజ‌ర‌మూడు, యోగిబాబు, న‌మో నారాయ‌ణ త‌దిత‌రులు స్పెష‌ల్ కేమియోస్ :  మోహ‌న్‌లాల్‌, శివ‌రాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, హృతిక్ రోష‌న్‌, విజ‌య్ సేతుప‌తి సంగీతం : అనిరుధ్ ర‌విచంద‌ర్‌ సినిమాటోగ్ర‌ఫీ :  విజ‌య్ కార్తీక్ క‌న్న‌న్‌ ఎడిటింగ్ : ఆర్‌.నిర్మ‌ల్‌ నిర్మాత : క‌ళానిధి మార‌న్‌ బ్యాన‌ర్ : స‌న్ పిక్చ‌ర్స్‌ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం :  నెల్స‌న్ దిలీప్‌కుమార్‌ విడుద‌ల తేదీ:  15.10.26 సినిమా నిడివి: 165.18 నిమిషాలు సూపర్‌స్టార్ రజినీకాంత్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు.. థియేటర్లో విజిల్స్ మోత మోగాల్సిందే! ఆయన నడకలో స్టైల్ ఉంటుంది.. చూపులో పవర్ ఉంటుంది.. డైలాగ్‌లో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఇక ‘జైలర్’లో టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజినీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే పాత్రను మరింత భారీగా, మరింత పవర్‌ఫుల్‌గా చూపించేందుకు ‘జైలర్ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. మరి మొదటి భాగంతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన రజనీ–నెల్సన్ కాంబినేషన్.. ఈ సీక్వెల్‌తో మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసిందా? టైగర్ ఈసారి వేసిన వేట ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? అనే విష‌యాలు ఈ స‌మీక్ష‌లో తెలుసుకుందాం. క‌థ: ‘జైలర్’ చిత్రానికి ఇది కొన‌సాగింపు అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. విగ్ర‌హాలను అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న వ‌ర్మ ముఠాను అంత‌మొందించ‌డంతో మొద‌టి భాగం ముగ‌స్తుంది. ఈ విగ్ర‌హాల స్మ‌గ్లింగ్ వెనుక పెద్ద త‌లకాయ‌లు ఉన్నాయ‌నే విష‌యాన్ని విల‌న్ వ‌ర్మ ద్వారా చెప్పించాడు డైరెక్ట‌ర్‌. రెండో భాగం కోసం కొన్ని హుక్ పాయింట్స్‌ను మొద‌టి పార్ట్‌లో వ‌దిలాడు. ఇక జైల‌ర్‌2 విష‌యానికి వ‌స్తే.. వ‌ర్మ‌లాంటి క్రూర‌మైన విల‌న్‌ని చంపిన త‌ర్వాత త‌న కుటుంబానికి సేఫ్టీ అవ‌స‌రం అని భావించిన ముత్తు(ర‌జినీకాంత్‌) త‌మిళ‌నాడుకి మ‌కాం మారుస్తాడు. అక్క‌డ ఓ సూప‌ర్ మార్కెట్‌లో సూప‌ర్‌వైజ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. వ‌ర్మ స్థానంలోకి వ‌చ్చిన దిలీప్‌(సూర‌జ్ వెంజ‌ర‌మూడు).. వ‌ర్మ‌ను చంపింది ఎవ‌రు అని క‌నిపెట్టే ప‌నిలో ఉంటాడు. అలాగే పెద్ద త‌ల‌కాయ‌ల నుంచి ఈ విష‌యంలో దిలీప్‌కి ప్రెజ‌ర్ ఎక్కువ‌వుతుంది. మ‌రి ముత్తును క‌నిపెట్ట‌డంలో దిలీప్ స‌క్సెస్ అయ్యాడా?  విగ్ర‌హాల‌ను స్మ‌గ్లింగ్ చేస్తున్న పెద్ద త‌ల‌కాయ‌ల్ని ముత్తు నిర్మూలించ‌గ‌లిగాడా? ఆ క్ర‌మంలో ముత్తు ఎలాంటి స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొన్నాడు?  మొద‌టి భాగంలో ముత్తుకి హెల్ప్ చేసిన పాత ఫ్రెండ్స్ సెకండ్ పార్ట్‌లో ఎంత వ‌ర‌కు ప్ల‌స్ అయ్యారు?  అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.  విశ్లేష‌ణ : జైల‌ర్ సినిమాకి సంబంధించిన రెండు పార్టుల‌కు ప్ర‌ధాన బ‌లం డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్‌కుమార్ అని చెప్పాలి. స్క్రిప్ట్‌ని ఎంతో ప‌క‌డ్బందీగా రెడీ చేసుకున్న చిన్న పాయింట్‌ని కూడా మిస్ చేయ‌కుండా 2 గంట‌ల 45 నిమిషాలు ప్రేక్ష‌కుల్ని సీట్ల‌లో కూర్చోబెట్ట‌డం అంటే సామాన్య విష‌యం కాదు. పేరుకి ఇది సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ సినిమా అయిన‌ప్ప‌టికీ క్రెడిట్ మాత్రం ర‌జినీతోపాటు నెల్స‌న్‌కి కూడా ద‌క్కుతుంది. సినిమాకి మ‌రో పెద్ద ప్ల‌స్‌గా నిలిచిన‌వాడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్‌. సూప‌ర్‌స్టార్ ఇమేజ్‌, క్రేజ్‌కి త‌గ్గ‌ట్టు నెల్స‌న్ రాసిన ఎలివేష‌న్ షాట్స్‌కి అనిరుధ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుత‌మ‌ని చెప్పాలి. ఇది ఒక సాధార‌ణ‌మైన క‌థ‌. దానికి ఎన్నో హంగులు చేర్చ‌డం వ‌ల్ల ఒక బిగ్‌స్కేల్ మూవీగా నిలిచింది. హీరో ఎంట్రీ ఎంతో సాధార‌ణంగా చూపించ‌డంలోనే డైరెక్ట‌ర్ టాలెంట్ ఏమిటి అనేది తెలుస్తుంది. ఫ‌స్ట్ హాఫ్‌లో ముత్తు ఆప‌రేష‌న్ కొన‌సాగుతూనే ఉంటుంది. మ‌రో ప‌క్క కామెడీ కూడా బాగానే జ‌న‌రేట్ అయింది. యోగిబాబు, న‌మో నారాయ‌ణ వంటి ఆర్టిస్టులు న‌వ్వులు పూయించారు. ఇక ఈ సినిమాలో కేమియోల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఫ‌స్ట్ పార్ట్‌లో ఉన్న మోహ‌న్‌లాల్‌, శివ‌రాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్ సెకండ్ పార్ట్‌లోనూ ఉన్నారు. కొత్త‌గా మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, హృతిక్ రోష‌న్‌, విజ‌య్ సేతుప‌తి, విద్యాబాల‌న్ యాడ్ అయ్యారు. ఈ సినిమాలో కేమియోలు ఎక్కువై పోయాయి అనే కామెంట్స్ కూడా రిలీజ్‌కి ముందు వినిపించాయి. అయితే వారంతా క‌థ‌తోపాటే క‌నిపిస్తారు త‌ప్ప ఎక్క‌డా కావాల‌ని ఇరికించిన‌ట్టు అనిపించ‌దు. ఫ‌స్ట్ పార్ట్ చూసిన‌పుడు ఆడియ‌న్స్ ఎలా ఫీల్ అయ్యారో సెకండ్ పార్ట్ కూడా అదే రేంజ్ ఉంద‌ని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో రెండు స్పెష‌ల్ సాంగ్స్ ఉన్నాయి. ఫ‌స్ట్ హాఫ్‌లో పూర్ణ స్పెష‌ల్ సాంగ్‌.. నిజంగానే స్పెష‌ల్‌గా ఉంద‌నే చెప్పాలి. సెకండ్ హాఫ్‌లో వ‌చ్చే నోరా ఫ‌తేహి సాంగ్ ఎంతో గ్రాండియ‌ర్‌గా ఉన్న‌ప్ప‌టికీ పూర్ణ సాంగ్ ముందు ఇది నిల‌వ‌లేక‌పోయింది.  న‌టీన‌టులు: సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ సినిమా అన‌గానే ఒన్ మ్యాన్ షోలాగా ర‌జినీ ఒక్క‌రే క‌నిపిస్తారు. ఆయ‌న పెర్‌ఫార్మెన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. భారీ ఫైట్స్ ఏమీ లేక‌పోయినా త‌న లుక్స్‌తో, స్టైల్‌తో ఆడియ‌న్స్‌ని మెస్మ‌రైజ్ చేశారు ర‌జినీ. వ‌ర్మ స్థానంలో దిలీప్ పాత్ర‌లో క‌నిపించిన సూర‌జ్ వెంజ‌ర‌మూడు పెర్‌ఫార్మెన్స్ కూడా బాగుంది. అయితే వినాయ‌క‌న్ రేంజ్ ఇత‌ను మెప్పించ‌లేక‌పోయాడు అనిపించింది. మిగ‌తా పాత్ర‌ల్లో మూర్తిగా న‌టించిన న‌మో నారాయ‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఓ ప‌క్క సీరియ‌స్‌గా క‌థ న‌డుస్తున్న స‌మ‌యంలో త‌న పాత్ర చేసే విన్యాసాల‌తో బాగా న‌వ్వించారు. అలాగే యోగిబాబు కూడా త‌నదైన స్టైల్ కామెడీ చేశాడు. ఇక విల‌న్స్‌గా న‌టించిన మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, ఎస్‌.జె.సూర్య‌, విద్యాబాల‌న్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా చేశార‌ని చెప్పాలి. ముగ్గురి క్యారెక్ట‌ర్స్‌ని అద్భుతంగా డిజైన్ చేశాడు డైరెక్ట‌ర్‌. ఇక హృతిక్ రోష‌న్ ఎంట్రీ అదిరింద‌నే చెప్పాలి. అత‌ను ఎంట‌ర్ అయిన త‌ర్వాత చేసిన యాక్ష‌న్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. ముత్తు భార్య‌గా న‌టించిన ర‌మ్య‌కృష్ణ క్యారెక్ట‌ర్ సాదా సీదాగానే సాగుతుంది.  సాంకేతిక నిపుణులు :   డైరెక్ట‌ర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ షిప్ అంటారు. ఈ సినిమా విష‌యంలో అది నిజ‌మే అనిపిస్తుంది. ఎందుకంటే క‌థ‌గానీ, స్క్రీన్‌ప్లేగానీ ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆడియ‌న్స్‌కి ఎలాంటి క‌న్‌ఫ్యూజ‌న్ రాకుండా అద్భుతంగా రాసుకున్నారు. దాన్ని స్క్రీన్ మీద ప్ర‌జెంట్ చెయ్య‌డంలో మిగ‌తా టెక్నీషియ‌న్స్ టాలెంట్‌ని కూడా అద్భుతంగా వినియోగించుకున్నారు. డైరెక్ట‌ర్ త‌ర్వాత చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ గురించి. ఫ‌స్ట్ పార్ట్‌లో త‌న మ్యూజిక్‌తో ర‌జినీకాంత్‌కి ఎంత‌టి ఎలివేష‌న్ ఇచ్చాడో, సెకండ్ పార్ట్‌లో అంత‌కుమించి అనేలా త‌న మ్యూజిక్‌తో అద‌ర‌గొట్టాడు. మ‌రో ముఖ్య‌మైన టెక్నీషియ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్ విజ‌య్ కార్తీక్ క‌న్న‌న్‌. అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో స్క్రీన్ క‌న్నుల పండువ‌గా క‌నిపించింది. ఆర్‌.నిర్మ‌ల్ ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. సినిమా ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు ఎంతో రిచ్‌గా క‌నిపిస్తుంది. క‌థ‌కు, సినిమాకి ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌కి త‌గ్గ‌ట్టుగా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ భారీగా ఈ చిత్రాన్ని నిర్మించింది.  ఫైన‌ల్‌గా చెప్పాలంటే..  ‘జైల‌ర్‌’కి ఏమాత్రం త‌గ్గ‌కుండా.. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ఫ‌స్ట్ పార్ట్‌ని మించి ‘జైల‌ర్‌2’ ఉంద‌ని చెప్పొచ్చు.  రేటింగ్ : 3/5 - జి.హ‌రా     [jailer2 movie review, rajinikanth movie jailer2 review, super star rajinikanth, nelson dilipkumar, anirudh ravichandar, mithun chakraborty, hrithik roshan, mohan lal, sivarajkumar, jakie shroff]
Cast: Rajinikanth, Ramyakrishnan, Vidya Balan, Mirnaa Menon, Rithvik, Mohanlal, Shiva Rajkumar, Mithun Chakraborthy, SJ Suryah, Hrithik Roshan, Suraj Venjaramoodu, Jackie Shroff, Vijay Sethupathi, Namo Narayana Crew:  Music by Anirudh Ravichander Cinematography by Vijay Kartik Kannan Editing by R. Nirmal Written and Directed by Nelson Dilipkumar Produced by Kalanithi Maran Production house: Sun Pictures Superstar Rajinikanth is known for his aura and charisma on the screen. Everyone can identify themselves and admire him on the big screens because of his energy and charm. Now, he is back as Jailer, with his blockbuster sequel, Jailer 2. Let's discuss if the magic of 2023 film is repeated by Nelson or not.  Plot:  Tiger Muthuvel Pandian (Rajinikanth) is living as a supermarket supervisor back in his hometown. He decides to check on how the big network behind Varman is following him. He goes to a local fruit seller and rowdy, Moorthi (Namo Narayana) as a driver and encourages him to do the idol theft and selling business to find Dileep (Suraj Venjaramoodu).  Through Dileep, he traces out that Kalpak family, mainly, Bodhi Kalpak (SJ Suryah), Kaantha Kalpak (Vidya Balan) and their father Chakri Kalpak (Mithun Chakraborthy) from Goa, run the business. So, how he uses Narasimha (Shiva Rajkumar), Mathew (Mohanlal) and Roddy (Hrithik Roshan) to overcome the threat, forms the story. Will his family be able to accept the fact that he killed his own son? Watch the movie to know more.  Analysis:  Rajinikanth oozes aura in every frame and even at the age of 75, he is able to showcase his own charm on big screen. His walk, his ability to give small reactions that bring out big emotion, his charisma and his style have been framed well by Nelson. Rajni does well in emotional scenes too but do not accept at the level as in the first part. He carries the character who is carrying weight of his decisions from the first, really well.  Vidya Balan is good in her portions and leaves audiences wanting for more. Ramyakrishnan, Mirnaa Menon give right emotional push from their side. SJ Suryah got more meat after Namo Narayana and he is good but he became routine. Still, he is able to command the screen in his scenes even with Rajinikanth in the same frame. Mithun Chakraborthy is pale in comparison. Suraj Venjramoodu doesn't get Varma type typical characterisation, still, he pulled off his role excellently.  Mohanlal, Shiva Rajkumar, Hrithik Roshan, Jackie Shroff cameos are well placed but lack similar impact as the first one. Still, they are used well in screenplay and they do not feel like shoe horned in some manner. Nelson is at his best when he is using Namo Narayana character as a fool and dark humor works well in first hour.  The shock and awe of Jailer interval and elevation scenes are tough to match but Nelson decided to work within the same format yet bring new additions to the world without disturbing the set pieces. As a continuation to Tiger Muthuvel Pandian story, this works well and Nelson used it his smarts to make it worth a watch.  Anirudh Ravichander's BGM is apt for the film. He doesn't go out of the script and gave apt scores to every character. Production values from Sun Pictures are brilliant and technically movie is very good. The first half humor and second half cameos, make it a proper packaged commercial entertainer and celebration for fans. Positives:  Rajinkanth's aura Big Star cameos Anirudh Ravichander BGM Nelson mark humor Tight commerical package A perfect Rajini trademark film Negatives:  Slight drag at few places Predictability as movie follows Jailer mould Bottomline: A complete celebration of Rajinikanth in Nelson style!  Rating: 3/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నాన్‌వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే వంటకాల్లో మటన్ బోటి కూర కచ్చితంగా ఉంటుంది. సాధారణంగా చికెన్, మటన్‌ను ఇష్టపడేవారు మేకలోని ప్రతి భాగాన్ని రుచిగా వండుకుంటారు. అయితే మేక లేదా గొర్రె పేగులతో తయారయ్యే బోటిని క్రమం తప్పకుండా లేదా వారానికి, పదిరోజులకు ఒకసారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం బలంగా, దృఢంగా మారుతుందని డైటీషియన్లు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మేక కేవలం పచ్చని ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది కాబట్టి, దాని పేగులలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు సమృద్ధిగా దాగుంటాయి. బోటిలో అధికంగా లభించే ప్రోటీన్, ఫ్యాట్స్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఎప్పుడూ అలసటగా, నీరసంగా లేదా బలహీనంగా అనిపించేవారికి బోటి కూర ఒక అద్భుతమైన వరం లాంటిదడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పోషకభరితమైన వంటకంలో శరీరానికి అవసరమైన ఐరన్, ఫైబర్‌తో పాటు విటమిన్ బి12, విటమిన్ ఎ, ఇ, మరియు కె వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. జిమ్‌కు వెళ్లి కఠినమైన వర్కౌట్స్ చేసేవారికి మరియు కండరాల బలం పెంచుకోవాలనుకునేవారికి బోటి ఒక ఉత్తమమైన ఆహార ఎంపిక. ఇందులో ఉండే జింక్ చర్మం కాంతివంతంగా ప్రకాశించడానికి, జుట్టు దృఢంగా పెరగడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే, విటమిన్ బి12 జ్ఞాపకశక్తిని (మెమరీ పవర్) మెరుగుపరిచి, మెదడును ఎప్పుడూ చురుకుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని ప్రతి కణానికి, ముఖ్యంగా నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహకరించి నరాల బలహీనతను సమర్థవంతంగా నివారిస్తుంది. అంతేకాకుండా, బోటిలో లభించే ఐరన్ రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రక్తహీనతతో బాధపడేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బోటి కూరలో ఉండే ప్రోబయోటిక్స్ మన గట్ హెల్త్‌కి, జీర్ణవ్యవస్థ పనితీరుకు చాలా మేలు చేస్తాయి. అలాగే సన్నగా బలహీనంగా ఉండేవారు త్వరగా బరువు పెరగడానికి ఇది ఒక బెస్ట్ ఫుడ్ అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, మార్కెట్లో తక్కువ ధరకే దొరుకుతుందని దీనిని అధికంగా లేదా పరిమితికి మించి తింటే శరీరంలో కొలెస్ట్రాల్ గణనీయంగా పెరిగి గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు (బీపీ) సమస్య ఉన్నవాళ్లు బోటి కూరను అస్సలు తినకూడదని హెచ్చరిస్తున్నారు. వండేటప్పుడు వేడి నీటితో నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి, సరిగ్గా ఉడికించి మితంగా తీసుకుంటేనే బోటి ద్వారా సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.     mutton boti health benefits, goat intestine nutrition, boti benefits, benefits of eating mutton boti, goat tripe health benefits, non veg health benefits, mutton boti curry nutrition.
మన దైనందిన ఆహారంలో కూరగాయలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా గ్రీన్ బీన్స్‌ను మనం అనేక రకాల వంటకాల్లో, ఫ్రైడ్ రైస్‌లలో, బిర్యానీలలో విరివిగా ఉపయోగిస్తాము. నూనె లేకుండా నాన్‌స్టిక్ పాత్రల్లో చేసే బీన్స్ ఫ్రై అద్భుతమైన రుచిని అందించడమే కాకుండా, ప్రకృతి వైద్య విధానాలను అనుసరించే వారికి చక్కటి ఆరోగ్యకరమైన ఎంపికగా నిలుస్తుంది. అయితే ఈ గ్రీన్ బీన్స్‌ కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా, మన శరీరంలోని ఎముకల బలాన్ని పెంచడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, గ్రీన్ బీన్స్‌లో విటమిన్  కె  చాలా సమృద్ధిగా లభిస్తుంది. ప్రతి 100 గ్రాముల గ్రీన్ బీన్స్‌లో దాదాపు 14 మైక్రోగ్రాముల విటమిన్  కె ఉంటుంది. ఈ విటమిన్‌తో పాటు బీన్స్‌లో ఉండే ప్రత్యేక రసాయన సమ్మేళనాలు మనం తీసుకునే ఆహారంలోని కాల్షియంను ఎముకలు సమర్థవంతంగా గ్రహించేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా మనం తీసుకునే కాల్షియం నేరుగా శరీరంలోకి వెళ్లినంత మాత్రాన సరిపోదు, అది ఎముకలకు పట్టి గట్టిపడటం ఎంతో ముఖ్యం. ఈ ప్రక్రియలో గ్రీన్ బీన్స్ శరీరానికి ఎంతగానో సహకరిస్తాయి. గ్రీన్ బీన్స్ ఎముకల బలానికి ఏ విధంగా దోహదపడతాయో పరిశీలిస్తే, ఇవి శరీరంలో "ఆస్టియోక్యాల్సిన్" అనే ప్రోటీన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆస్టియోక్యాల్సిన్ ఎముక కణజాలాన్ని ఆరోగ్యంగా, దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. దీనివల్ల ఎముకలు గట్టిగా, పటిష్టంగా తయారవుతాయి. అంతేకాకుండా, ఎముకల్లో గుజ్జు సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ పవర్ఫుల్ ఆహారం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. కొంతమందికి మామూలు చిక్కుడుకాయలు తింటే సరిగ్గా అరగవని, గ్యాస్ లేదా కడుపు బరువుగా అనిపించే సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిలో ఒలిగోశాకరైడ్స్ ఎక్కువగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. అయితే గ్రీన్ బీన్స్‌లో అటువంటి సమస్యలు అసలు తలెత్తవు. ఇవి చాలా తేలికగా ఉంటాయి, సులభంగా జీర్ణమవుతాయి మరియు ఏ రూపంలో వండినా ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించవు. ఈ బీన్స్‌లోని గింజలు కూడా మెత్తగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ డైట్‌లో రెగ్యులర్‌గా భాగం చేసుకోవచ్చు. సంవత్సరం పొడవునా లభించే గ్రీన్ బీన్స్‌ను రోజూ తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నాన్‌స్టిక్ పాత్రలో తక్కువ నూనెతో లేదా కొద్దిగా మీగడతో గ్రీన్ బీన్స్ ఫ్రై చేసుకుని, పైన నువ్వుల పొడి లేదా కొబ్బరి తురుము చల్లుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే బీన్స్‌లోని పచ్చిదనం పూర్తిగా పోవాలంటే, వాటిని పది నిమిషాల పాటు పుల్లటి పెరుగు లేదా నిమ్మరసం కలిపిన నీటిలో ఉడికించి ఆపై వేయించుకోవచ్చు. ఈ సరైన వంట పద్ధతుల ద్వారా పోషకాలు ఏమాత్రం కోల్పోకుండా గ్రీన్ బీన్స్ యొక్క పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.     green beans health benefits, green beans for bone strength, joint cartilage foods, bone density foods, green beans nutrition, vegetable benefits for joint pain, green beans health secrets.
ప్రకృతి మనకు ప్రసాదించిన ప్రతి కూరగాయలోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కానీ మనం తరచుగా వాటి ఆకారాన్ని, రుచిని బట్టి కొన్నింటిని ఇష్టపడతాం, మరికొన్నింటిని చిన్నచూూపు చూసి పక్కన పెడుతుంటాం. అలా ఆకారం కారణంగా చాలా మంది నిర్లక్ష్యం చేసే కూరగాయల్లో 'పొట్లకాయ' ముందుంటుంది. అయితే, ఈ పాములాంటి కూరగాయలో మన శరీరానికి అవసరమైన ఎన్నో అద్భుతమైన పోషకాలు, ఔషధ గుణాలు నిండి ఉన్నాయని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. పొట్లకాయలో కేలరీలు అత్యంత తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి లతో పాటు మాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటి కీలక ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో పొట్లకాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే 'కుకుర్బిటాసిన్' అనే సహజ రసాయన సమ్మేళనం రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించే లక్షణాలను కలిగి ఉంది. సాధారణ జ్వరం, జలుబు లేదా సీజనల్ అనారోగ్యాల బారిన పడినప్పుడు పొట్లకాయను ఆహారంలో తీసుకుంటే నీరసం, అలసట పూర్తిగా తగ్గిపోయి శరీరం త్వరగా కోలుకుంటుంది. ముఖ్యంగా గుండె పదిలంగా ఉండటానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు, గుండె కొట్టుకునే వేగాన్ని సాధారణ స్థితికి తీసుకురావడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ పొట్లకాయ కూర తినడం లేదా సుమారు 30 మిలీలీటర్ల పొట్లకాయ రసం తాగడం ద్వారా గుండె పనితీరు మెరుగుపడి, గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకల దృఢత్వానికి కావలసిన కాల్షియం పొట్లకాయలో సమృద్ధిగా లభిస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనతను ఇది సమర్థవంతంగా నివారిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. అలాగే, కామెర్లు సోకినప్పుడు కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారుతుంటాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పొట్లకాయ అద్భుతంగా పనిచేస్తుంది. కొత్తిమీర ఆకులను, పొట్లకాయ ఆకులను కలిపి రసం తీసి, నిపుణుల సలహాతో రోజుకు మూడుసార్లు తీసుకోవడం ద్వారా కామెర్ల నుంచి వేగంగా కోలుకోవచ్చు. ఇది శరీరంలోని మలినాలను మరియు హానికారక టాక్సిన్లను బయటకు పంపి లివర్‌ను శుభ్రం చేస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు తమ డైట్‌లో పొట్లకాయను కచ్చితంగా చేర్చుకోవాలి. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉండటం, కొవ్వు అస్సలు లేకపోవడం దీని ప్రధాన ప్లస్ పాయింట్. నీటి శాతం, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల తక్కువ తిన్నప్పటికీ కడుపు నిండిన భావన కలుగుతుంది, ఇది అనవసరమైన ఆకలిని నియంత్రించి బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా, పొట్లకాయ శరీరానికి సహజమైన చలవ చేస్తుంది. దీనిని మెత్తని పేస్ట్‌లా చేసి తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడాన్ని, చుండ్రు సమస్యను అరికట్టవచ్చు. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర పడుతుంది. కాబట్టి ఇప్పటివరకు పొట్లకాయను దూరంగా పెట్టిన వారు, ఇకపై ఆరోగ్య ప్రయోజనాల కోసం దీనిని మీ దైనందిన ఆహారంలో తప్పకుండా చేర్చుకోండి.     snake gourd health benefits, potlakaya benefits, snake gourd for heart health, strong bones foods, vegetable health benefits, potlakaya nutrition, healthy vegetables telugu health tips.  
మహిళల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల్లో అండాశయ క్యాన్సర్ (Ovarian Cancer) గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ క్యాన్సర్ ప్రారంభ దశల్లో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. కొన్నిసార్లు సాధారణ జీర్ణ సమస్యలుగా లేదా రోజువారీ ఆరోగ్య ఇబ్బందులుగా భావించే లక్షణాల వెనుక కూడా అండాశయాలకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. అందుకే శరీరంలో తరచూ కనిపించే మార్పులను గమనించడం, అవసరమైనప్పుడు వైద్య సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యం. అండాశయ క్యాన్సర్‌కు సూచనగా ఉండే లక్షణాలు ఏమిటి? కడుపు తరచూ ఉబ్బరంగా అనిపించడం, పొత్తికడుపు కింది భాగంలో నొప్పి రావడం, కొద్దిగా ఆహారం తిన్నా కడుపు నిండినట్లు అనిపించడం, తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఈ సమస్యలు తరచూ రావడం, తగ్గకుండా కొనసాగడం లేదా సాధారణ స్థితికి భిన్నంగా అనిపించడం గమనించాల్సిన విషయం. అయితే ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన అండాశయ క్యాన్సర్ ఉందని నిర్ధారించలేం. ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. లక్షణాలు ఎంతకాలంగా ఉన్నాయి, ఎంత తరచుగా వస్తున్నాయి, వాటితో పాటు ఇతర మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయా అనే విషయాలను వైద్యులు పరిశీలించి అవసరమైన పరీక్షలను సూచిస్తారు. అండాశయ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం? అండాశయ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దీని లక్షణాలు ఇతర సాధారణ సమస్యలను పోలి ఉండవచ్చు. కాబట్టి కడుపు ఉబ్బరం, పొత్తికడుపు నొప్పి, ఆకలి తగ్గడం లేదా తరచూ మూత్రం రావడం వంటి సమస్యలు నిరంతరం కొనసాగితే వాటిని చిన్నవిగా భావించి వాయిదా వేయకూడదు. సరైన సమయంలో వైద్యులను సంప్రదించడం ద్వారా సమస్యకు కారణాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో డాక్టర్ రాహుల్  గారు అండాశయ క్యాన్సర్‌కు సంబంధించిన ముఖ్యమైన లక్షణాలు, వాటిని గుర్తించాల్సిన అవసరం, ఆరోగ్య సమస్యల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పుడు వైద్యులను సంప్రదించాలనే అంశాల గురించి వివరిస్తారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవడానికి, శరీరంలో కనిపించే అసాధారణ మార్పులను గమనించడానికి, అండాశయ క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ముఖ్య గమనిక: కడుపు ఉబ్బరం, పొత్తికడుపు నొప్పి, త్వరగా కడుపు నిండిన భావన లేదా తరచూ మూత్రం రావడం వంటి లక్షణాలు నిరంతరం కొనసాగితే వైద్యులను సంప్రదించండి. లక్షణాల ఆధారంగా మాత్రమే క్యాన్సర్‌ను నిర్ధారించలేం. వైద్య పరీక్షల ద్వారా మాత్రమే సరైన నిర్ధారణ సాధ్యమవుతుంది. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే, వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా...మన హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
  నేటి వేగవంతమైన జీవనశైలిలో సరిగ్గా సమయానికి తినకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, సరిపడా నిద్రపోకపోవడం వంటి అలవాట్ల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి అలవాట్ల వల్ల శరీరంలోని జీవక్రియలు దెబ్బతిని దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేదం చెప్తోంది. ముఖ్యంగా మన శరీరంలో ఉండే వాత, పిత్త, కఫ అనే మూడు దోషాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడే వ్యాధులు మొదలవుతాయి. ఈ మూడు దోషాలు సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఆయుర్వేదం సూచించే ముఖ్యమైన నియమాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. జీవనశైలి లోపాల వల్ల వచ్చే ముప్పు.. రోజువారీ జీవితంలో వ్యాయామం లేకపోవడం, వేళపాళ లేని ఆహారం తీసుకోవడం, మద్యం లేదా ఇతర అలవాట్లు ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్, అధిక బరువు, టైప్ 2 మధుమేహం , ఊపిరితిత్తుల సమస్యల వంటి అనేక తీవ్రమైన రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. చిన్న వయస్సు నుంచే ఆహారపు అలవాట్లను, జీవనశైలిని సరిదిద్దుకోవడం ద్వారా ఈ ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల ఆహారంతో దోషాల నివారణ.. ఆయుర్వేద ప్రకారం సరైన ఆహారం అంటే కేవలం కొన్ని పదార్థాలు తినడం మాత్రమే కాదు. ఆహారంలో ఉండే రుచులు, గుణాలు , వాటి కలయికను కూడా అర్థం చేసుకోవాలి. ఆయుర్వేదంలో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు ఉన్నాయి. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఈ ఆరు రుచులు తగిన పాళ్లలో ఉండేలా చూసుకుంటే వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యంగా ఉంటాయి. ఆహారంలో తాజా కూరగాయలు, ఆయా కాలాల్లో దొరికే పండ్లు తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. సరియైన దినచర్య చాలా ముఖ్యం.. మంచి ఆరోగ్యం కోసం సరైన రోజువారీ అలవాట్లు కలిగి ఉండటం చాలా అవసరం. ఉదయాన్నే త్వరగా లేవడం, శరీరానికి నూనె మర్దన చేసుకోవడం, అభ్యంగన స్నానం , యోగా వంటి ప్రక్రియలు శరీరానికి విశ్రాంతినిస్తాయి.  ఉదయాన్నే ఆరోగ్యకరమైన టిఫిన్ చేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనస్సు, ఆరోగ్యకరమైన శరీరం కోసం ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. యోగా , ధ్యానంతో ప్రయోజనాలు.. యోగా , ప్రాణాయామం చేయడం వల్ల శరీరం, మనస్సు , ఆత్మ సమన్వయంతో పనిచేస్తాయి. ఇవి శరీరంలో ప్రాణశక్తి ప్రవాహాన్ని మెరుగుపరచడమే కాకుండా పట్టుత్వాన్ని, శారీరక బలాన్ని పెంచుతాయి. రోజూ సూర్య నమస్కారాలు, ఊపిరితిత్తుల వ్యాయామాలు , ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇది మూడు దోషాలను సమతుల్యంగా ఉంచి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది.                           *రూపశ్రీ.
మన కాళ్లకు సరైన రక్తప్రసరణ అందకపోతే నడవడం దగ్గర నుంచి రోజువారీ పనులు చేసుకోవడం వరకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. కొంతమందికి కొద్దిదూరం నడవగానే పిక్కల్లో నొప్పి రావడం, పాదాల్లో తీవ్రమైన నొప్పి, కాళ్ల వాపు, చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ సమస్యలన్నీ ఒకే కారణంతో వస్తాయని భావించకూడదు. వీటి వెనుక రక్తనాళాలకు సంబంధించిన వివిధ సమస్యలు ఉండవచ్చు. కాళ్లకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తప్రవాహం తగ్గవచ్చు. ముఖ్యంగా నడుస్తున్నప్పుడు పిక్కల్లో నొప్పి వచ్చి, విశ్రాంతి తీసుకున్నప్పుడు తగ్గిపోవడం కాళ్ల ధమనుల్లో రక్తప్రసరణ తగ్గడానికి సంకేతం కావచ్చు. అలాగే పాదాలు చల్లబడటం, గాయాలు త్వరగా మానకపోవడం, చర్మం రంగు మారడం వంటి లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మరోవైపు, కాళ్లలోని సిరలు రక్తాన్ని తిరిగి గుండెకు చేరవేయడంలో సమస్య ఎదురైతే వెరికోస్ వెయిన్స్ (Varicose Veins) వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కాళ్లలో వాపు, బరువుగా అనిపించడం, చర్మంపై ఉబ్బిన సిరలు కనిపించడం వంటి లక్షణాలు ఉండవచ్చు. ధమనుల్లో రక్తప్రసరణ తగ్గడం, సిరల్లో రక్తం తిరిగి ప్రవహించడంలో సమస్యలు రెండూ వేర్వేరు పరిస్థితులు. ఈ వీడియోలో వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ ఎస్. శ్రీకాంత్ రాజు గారు కాళ్లకు రక్తప్రసరణ తగ్గడానికి గల కారణాలు, కాళ్ల రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడినప్పుడు కనిపించే లక్షణాలు, వెరికోస్ వెయిన్స్ సమస్య గురించి వివరించారు. అలాగే రక్తప్రసరణను పరీక్షించడానికి ఉపయోగించే డాప్లర్ టెస్ట్ (Doppler Test) గురించి, సమస్య తీవ్రతను బట్టి అందుబాటులో ఉండే చికిత్సా విధానాల గురించి తెలియజేశారు. రక్తనాళాల్లో బ్లాకేజీలను తొలగించడానికి లేదా రక్తప్రవాహాన్ని మెరుగుపరచడానికి కొన్ని సందర్భాల్లో బెలూన్ యాంజియోప్లాస్టీ (Balloon Angioplasty), స్టెంట్ చికిత్స (Stent Treatment) అవసరమవుతాయి. అయితే ప్రతి ఒక్కరికీ ఈ చికిత్సలు అవసరం ఉండవు. సమస్య ఎక్కడ ఉంది, ఎంత తీవ్రంగా ఉంది, రోగి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే అంశాల ఆధారంగా వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు. కాళ్ల నొప్పులను వయసు పెరగడం వల్ల వచ్చే సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారా? నడిచేటప్పుడు పిక్కల్లో నొప్పి రావడానికి రక్తప్రసరణ తగ్గడం కూడా కారణమవుతుందా? డాప్లర్ పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి? రక్తనాళాల్లో బ్లాకేజీ ఉంటే ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి డాక్టర్ ఎస్. శ్రీకాంత్ రాజు గారి పూర్తి వీడియోను చూడండి. ముఖ్య గమనిక: కాళ్లలో నిరంతర నొప్పి, పాదాల రంగు మారడం లేదా మానని గాయాలు ఉంటే వైద్యులను సంప్రదించండి. అకస్మాత్తుగా తీవ్రమైన కాలి నొప్పి, పాదం చల్లబడటం, పాలిపోయినట్లు లేదా నీలంగా మారడం, తిమ్మిరి లేదా బలహీనత కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందండి. ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. వైద్య పరీక్షలు, చికిత్సలకు ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా...మన హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)