తెలంగాణ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారబోతున్నాయా?   గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)  ఎన్నికలలో రాష్ట్రంలో ఒంటరి పోరేనని బీజేపీ స్పష్టం చేయడంతో రాష్ట్రంలో జనసేన బలోపేతానికి పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? జీహెచ్ఎంసీ, తెలంగాణ స్థానిక ఎన్నికలే కాకుండా.. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కూడా సత్తా చాటేందుకు జనసేనానిని  ప్రణాళికలు రచిస్తున్నారా? తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన పవన్ కల్యాణ్.. ఫైర్ బ్రాండ్ నాయకుడిగా తెలంగాణ సమాజంలో గుర్తింపు ఉన్న మాజీ బీజేపీ నాయకుడు,  గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్  కు గాలం వేస్తున్నారా? అంటే రాజకీయవర్గాలలో ఔనన్న సమాధానమే వస్తోంది.   గతంలో బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించి, హిందుత్వ వ్యవహారంలో బీజేపీని మించి మరీ గుర్తింపు పొందిన రాజాసింగ్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందుత్వ అజెండాను ఎత్తుకున్న పవన్ దృష్టి రాజాసింగ్ పై పడిందని అంటున్నారు. బీజేపీకి దూరమైన రాజాసింగ్..   ప్రస్తుతం తన రాజకీయ ప్రయాణాన్ని పునఃప్రారంభించేందుకు ఒక బలమైన వేదిక కోసం అన్వేషణలో ఉన్న సంగతి తెలిసిందే.  దీంతో రాజాసింగ్ కు జనసేన తలుపులు తెరిస్తే.. రాష్ట్రంలో జనసేన బలోపేతం అవుతుందన్నది పవన్ వ్యూహంగా కనిపిస్తోంది.  రాజాసింగ్ జనసేన గూటికి చేరే అవకావాలున్నాయన్న ప్రచారానికి బలం చేకూర్చేలా రాజాసింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  చేపడుతున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను, ఆయన నాయకత్వ పటిమను ప్రశంసిస్తూ రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు.  పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా జనసేన పార్టీ కార్యకలాపాలను విస్తరించడానికి, ఆ పార్టీని బలోపేతం చేయడానికి ఇదే సరైన సమయమంటూ రాజాసింగ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. దీంతో పరిశీలకులు  రాజాసింగ్ జనసేన గూటికి చేరడం ఖాయమని అంటున్నారు. జాతీయ స్థాయిలో బిజెపితో పవన్ కళ్యాణ్ సత్సంబంధాలను కొనసాగిస్తుండటం, ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పవన్ కల్యాణ్ జనసేన పార్టీని నడిపిస్తుండటం కూడా రాజాసింగ్ జనసేన గూటికి చేరే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్న అభిప్రాయం సర్వత్రా నెలకొనేలా  చేస్తున్నాయి.   Pawan Kalyan, Raja Singh, Telangana Janasena, Goshamahal MLA, GHMC Elections, Telangana Politics, TeluguOne
ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో వైసీపీ  చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.మెగా డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ..  మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నేతృత్వంలో జీలుగుమిల్లలో వైసీపీ  ర్యాలీ నిర్వహించింది.  ఈ ర్యాలీలో వైసీపీ ప్రదర్శించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే..  జీలుగుమిల్లిలో వైసీపీ చేపట్టిన ర్యాలీలో  ఆ పార్టీ కార్యకర్తలు    మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్  ఫ్లెక్సీలతో పాటు  ఏపీతో ఏ మాత్రం సంబంధం లేని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,  కేటీఆర్ ఫ్లెక్సీ కూడా  ప్రదర్శించారు. వైసీపీ ర్యాలీలో పొరుగు రాష్ట్రానికి చెందిన కీలక నాయకుడి ఫొటో కూడా దర్శనమివ్వడం అందరినీ విస్మయానికి గురి చేసింది,    ఈ ర్యాలీలో..  రాసి పెట్టుకోండి.. 2029లో మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే" అనే  నినాదాలతో ఉన్న ప్లకార్డులను, ఫ్లెక్సీలను వైసీపీయులు ప్రదర్శించారు. అయితే సదరు ఫ్లెక్సీపై  వైసీపీ అధినేత జగన్ పక్కన కేటీఆర్  ఫొటో కూడా ఉండటం కలకలం సృష్టించింది. వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న ప్రచారం ఇక్కడ ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  నెటిజన్లు ఈ   ఫ్లెక్సీలను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. రెండు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రధాన రాజకీయ పార్టీల నేతల బొమ్మలు ఒకే ఫ్లెక్సీలో దర్శనమివ్వడం వెనుక ఏదైనా  పొలిటికల్ స్ట్రాటజీ ఉందా అన్న కోణంలోనూ చర్చ జరుగుతోంది.   ఏపీ  డీఎస్సీ అవకతవకలకు నిరసనగా జరుగుతున్న ర్యాలీలో బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ ఫోటో ఎందుకంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. అయితే ర్యాలీలో కేటీఆర్ ఫొటోపై వైసీపీ నుంచి ఎటువంటి వివరణా రాలేదు.  YCP protest rally,  Jagan and KTR flexi, Eluru Rally, Former MLA Tellam Balaraju, Andhra Pradesh politics, TeluguOne
రాష్ట్రంలోని రైతులకు శాశ్వత భూ హక్కు కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు.  ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో సోమవారం (ఆగస్టు 10) నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం   పాల్గొని వైసీపీ వైఖరిపైవిమర్శలు గుప్పించారు. నెలనెలా స్వయంగా ప్రజల వద్దకు వచ్చి భూ హక్కు పత్రాలు అందిస్తున్నామన్న చంద్రబాబు జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు. గతంలో నేతల ఫోటోలతో పాసు పుస్తకాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని, తమ ప్రభుత్వంలో నిజమైన యజమానులకే పూర్తి హక్కులు కల్పిస్తున్నామన్నారు. ఆక్వా రంగానికి ఊరటనిస్తూ, పది ఎకరాల పరిమితి, జోన్ నాన్ జోన్ నిబంధనలను ఎత్తివేసి 1.50 కేనామలకే విద్యుత్ సరఫరా చేసే ప్రకటనపై చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వంపై ప్రతిఏటా రూ.1,150 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ, రైతులకు ఆర్థిక భద్రత కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యమన్నారు. అలాగే కొల్లేరు ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కైకలూరుకు  36 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ఆ పార్టీ చేస్తున్న  డిమాండ్ ను  ఖండించారు. ఏళ్ల తరబడి నిరుద్యోగులు ఎదురుచూసిన మెగా డీఎస్సీని సమర్థవంతంగా నిర్వహించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తే..  కోర్టు కేసులతో అడ్డుపడాలని చూశారని విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తును దెబ్బతీసేలా ప్రవర్తించిన వారే ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.  గత పాలనలో రాష్ట్రంలో అరాచకాలు, గంజాయి సంస్కృతి, రౌడీయిజం రాజ్యమేలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నా  అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.   ప్రజా సంక్షేమానికి అడ్డుపడే ఏ శక్తినైనా తిప్పికొట్టి, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని చంద్రబాబు విస్పష్టంగా చెప్పారు.  Chandrababu Naidu Speeches, AP CM Kalidindi Visit, AP Land Pattadar Passbooks, Aqua Farmers Subsidy, Mega DSC Andhra Pradesh, TeluguOne
ALSO ON TELUGUONE N E W S
Ravi Teja is stepping into a different space with Irumudi, an intense rural family drama directed by Shiva Nirvana. After exploring mass-action entertainers in recent years, the actor is attempting a more emotionally driven character in the Mythri Movie Makers production, and the director believes Ravi Teja is perfectly suited for the role. Shiva Nirvana revealed that the story revolves around an alcoholic father who is forced to confront himself for the sake of his daughter. His fascination with Ayyappa Deeksha from childhood became the starting point for the story. “I always pick a beautiful scene from my memory and write a story. I was fascinated by Ayyappa Deeksha from my childhood, and that led me to this character of an alcoholic father’s journey to discover himself for his daughter,” he explained. According to the director, Irumudi is not a spiritual film despite Ayyappa Deeksha being an important element in the story. Instead, it explores family relationships through a raw and rustic setting. Shiva Nirvana feels Ravi Teja’s inherent masculinity, particularly the quality associated with middle-class and lower-middle-class rural families, makes him ideal for the character. He also praised the actor’s performance, calling it phenomenal and emotionally intense. Music composer GV Prakash Kumar has also promised a rustic and distinctive score that complements the film’s core emotion. With Baby Nakshatra and Priya Bhavani Shankar in prominent roles, Irumudi has already generated interest through its teaser and songs. The trailer will be unveiled on August 12, ahead of the film’s theatrical release on August 21. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
అఖిల్ అక్కినేని హీరోగా ముర‌ళి కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్  ‘లెనిన్’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. థియేట‌ర్స్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో రూ.100 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 7 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. లెనిన్ సినిమా థియేట‌ర్స్‌లోనే కాదు.. జీ5లో స్ట్రీమింగ్‌లోనూ స‌రికొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుండ‌టం విశేషం. రెండు రోజుల్లోనే లెనిన్ సినిమా 100 మిలియ‌న్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా ఎంతలా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతుంద‌నే దానికి ఇప్పుడు జీ5లో ద‌క్కుతున్న ఆద‌ర‌ణ ఓ సాక్ష్యంగా పేర్కొన‌వ‌చ్చు. ఇదే ఊపులో ఈ చిత్రం ఓటీటీలో మ‌రిన్ని సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు.  రాయ‌ల‌సీమ‌లోని చిత్తూరు జిల్లాలోని రామ‌చంద్ర‌పురం గ్రామంలో జ‌రిగే ద్రౌప‌ద‌మ్మ తిరునాళ్లు నేప‌థ్యంలో లెనిన్ సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు. కోపం, ద్వేషం, ప‌గ‌, ప్ర‌తీకారాల‌తో ర‌గిలిపోయే ఓ స్నేహితుడు త‌న ప్రాణ స్నేహితుడైన లెనిన్‌కు చేసే ద్రోహం ఎలాంటిది?  దాని వ‌ల్ల లెనిన్ ఏం కోల్పోయాడు? అస‌లు లెనిన్ జైలుకు ఎందుకెళ్లాడు?  రామ‌చంద్ర‌పురంలో జ‌రిగిన కురుక్షేత్రంలో ఎవ‌రు విజ‌యం సాధించారు? అనే విష‌యాలు తెలియాలంటే జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న లెనిన్ సినిమా చూడాల్సిందే.  రా అండ్ ర‌స్టిక్ పాత్ర‌లో అఖిల్ పెర్ఫామెన్స్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. భాగ్య‌శ్రీ బోర్సె గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌తో మెప్పించింది. ముర‌ళి కిషోర్ అబ్బూరు క‌థ‌, క‌థ‌నం, టేకింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు.      Akhil Akkineni, Lenin Movie, OTT Telugu, Nagarjuna  
  ఎట్టకేలకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్లాప్స్ కి మంగళగీతం పాడి కొరియన్ కనకరాజు తో హిట్ అందుకున్నాడు. హిట్ అందుకోవడమే కాకుండా తనలో దాగి ఉన్న యాక్షన్ మోడ్ ని బయటపెట్టి రచయితలకి కొత్త పని కల్పించాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హారర్ కామెడీ నేపధ్యంలోతెరకెక్కగా యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి, ప్రమోద్ ఉప్పలపాటి, వంశీకృష్ణారెడ్డి నిర్మించారు. వాళ్ళకి కూడా ఈ హిట్ చాలా అవసరం.  ఒక సినిమాకు నిజమైన పరీక్ష మొదటి వీకెండ్ పూర్తయిన తర్వాత వచ్చే సోమవారం రోజే ఎదురవుతుంది. సాధారణంగా వర్కింగ్ డేలలో వసూళ్లు తగ్గుతుంటాయి, కానీ కొరియన్ కనకరాజు మాత్రం సోమవారం నాటి 'మండే టెస్ట్'లో ఊహించని రీతిలో రికార్డు నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 4వ రోజైన సోమవారం ఒక్క రోజే బుక్‌మైషో (BookMyShow) మరియు డిస్ట్రిక్ట్ యాప్స్ (District Apps) ద్వారా ఏకంగా 70,000 కంటే ఎక్కువ (70K+) టిక్కెట్లు అమ్ముడవ్వడం చిత్ర యూనిట్ విజయాన్ని స్పష్టం చేస్తోంది. తెలంగాణ ప్రాంతంలో బోనాలు పండుగ సెలవు కలిసిరావడంతో థియేటర్ల వద్ద జనం పోటెత్తారు. దీనివల్ల వర్కింగ్ డేలో కూడా వీకెండ్ తరహాలోనే హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఆర్థిక పరంగా కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులను తిరగరాసింది. కేవలం 3 రోజుల మొదటి వీకెండ్‌లోనే బాక్సాఫీస్ వద్ద గ్లోబల్ వైడ్‌గా 37 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నివేదికల ప్రకారం శనివారంతో పోలిస్తే ఆదివారం 16.9 శాతం ఎదుగుదలతో . 4.85 కోట్ల నెట్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద తన  స్టామినా నిరూపించుకుంది. స్రుమారు 38 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ వంటి నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలోనే 26 కోట్లని  రాబట్టుకుంది. Also Read: రౌండ్ అప్.. పవన్ పై మహేష్ ట్వీట్ తో సరికొత్త చర్చ  ఈ సినిమా థియేట్రికల్ హక్కుల బిజినెస్ సుమారు  12 కోట్లుగా నమోదు కాగా, విడుదలైన కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసుకుని లాభాల బాటలోకి అడుగుపెట్టింది. అంటే నాల్గవ రోజు నుంచే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ప్రాఫిట్ షేరింగ్ ఫేజ్‌లోకి వెళ్లడం విశేషం. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం తన ప్రభావాన్ని చూపుతోంది. ఉత్తర అమెరికా (USA) బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 500 కే ($500K) డాలర్ల మైలురాయిని దాటి వసూళ్ల వేటను కొనసాగిస్తోంది. మొత్తం మీద విదేశాల్లో . 4 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం వరుణ్ తేజ్ కెరీర్‌కు మళ్లీ మంచి కమర్షియల్ బూస్ట్ ఇచ్చింది. ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్ ఉత్సాహంలో చిత్ర యూనిట్ ఘనంగా విజయోత్సవ వేడుకను ఏర్పాటు చేసింది. ఈ గ్రాండ్ సక్సెస్ మీట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని, మండే టెస్ట్ పాస్ అయి, ప్రతిరోజు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సాగుతున్న 'కొరియన్ కనకరాజు' సుదీర్ఘ కాలం థియేటర్లలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.  korean kanakaraju, Varun Tej, Chiranjeevi, Merlapaka  Gandhi        
టాలీవుడ్ ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ చిక్కుల్లో పడ్డారు. ఒక యువతి ఫిర్యాదుతో.. విశాఖపట్నంలోని పోలీస్ స్టేషన్‌లో రాహుల్ సిప్లిగంజ్‌ సహా 11 మందిపై సంచలన కేసు నమోదైంది.  ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. రాహుల్ సిప్లిగంజ్ బంధువు అని చెప్పుకునే కర్పూరపు రాహుల్ రెడ్డి అనే వ్యక్తితో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతిని శారీరకంగా వాడుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ యువతి గర్భం దాల్చగా.. రాహుల్ రెడ్డి ఆ ప్రెగ్నెన్సీని బలవంతంగా తీసివేయించాడని ఆరోపించింది. ఆపై పెళ్లి మాట ఎత్తకుండా ముఖం చాటేయడంతో, బాధితురాలు గత ఏడాది మార్చిలోనే రాహుల్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం పోరాటం ప్రారంభించింది. ఈ కేసు తర్వాత కర్పూరపు రాహుల్ రెడ్డికి మద్దతుగా రంగంలోకి దిగిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్, అలాగే యశస్విని రెడ్డి, విగ్నేష్, హరిణ్య రెడ్డి, నరేష్, ఉదయ్, శివన్నారాయణ, సువర్ణ, కార్తీక్, కేఆర్ రెడ్డి, ప్రసన్న అనే వ్యక్తులు తనను తీవ్రంగా బెదిరిస్తున్నారని బాధితురాలు జూన్ నెలలో మరో ఫిర్యాదు ఇచ్చింది. దీంతో పోలీసులు మొత్తం 11 మందిపై కేసు నమోదు చేశారు. బాధితురాలు తన ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేసింది. తనపై హనీ ట్రాప్ ఆరోపణలు మోపారని, తనకు ఎయిడ్స్ ఉందంటూ దుష్ప్రచారం చేస్తూ పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా, ప్రైవేట్ ఫోటోలు, ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించింది. మధ్యవర్తిత్వం వహించడానికి వచ్చిన పెద్ద మనుషులు కూడా న్యాయం చేయకపోగా.. రాహుల్ రెడ్డికే కొమ్ముకాస్తూ, తన ప్రాణాలకు హాని కలిగిస్తామని బెదిరించారని ఆమె వాపోయింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు కేసులోని మిగతా వారికి కూడా నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.     Rahul Sipligunj, Controversy, Police Case, Vizag  
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ఇద్దర్ని చూసి తెలుగు సినిమా ఎప్పటికప్పుడు గర్వంతో ఊగిపోతూ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడు వచ్చాము కాదన్నాయ్, బులెట్ దిగిందా లేదా అనే రీతిలో అనేక రికార్డ్స్ కి మెయిన్ పిల్లర్స్. సినిమాలకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఈ ఇద్దరి మధ్య ఉండే అనుబంధం, ఒకరిపట్ల ఒకరికి ఉన్న పరస్పర గౌరవం మాత్రం ఎల్లప్పుడూ ఎంతో ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. మహేష్ బాబు మొన్న అగస్ట్ 9 న తన పుట్టిన రోజుని జరుపుకున్న విషయం తెలిసిందే. దీంతో   పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా 'తెలుగు చలన చిత్రసీమలో తనదైన పంథా కలిగిన అగ్రశ్రేణి కథానాయకుడు మహేష్. కథానాయకుడిగా అందుకున్న ఘన విజయాలు తెలుగు సినీ పరిశ్రమ వృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. తండ్రి నటశేఖర కృష్ణ గారి అడుగుజాడల్లో వెళ్తూ.. విభిన్న పాత్రల్లో మెప్పించే అభినయ సామర్థ్యం ఆయన సొంతం. సోదర సమానుడైన మహేష్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  Also read: గూఢచారి 116 కి 60 ఏళ్ళు..సృష్టించిన సంచలనం ఇదే పవన్ చేసిన ట్వీట్ పై మహేష్ స్పందిస్తు  ‘మీ హృదయపూర్వక శుభాకాంక్షలకి  ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా నుండి మీకు అపారమైన ప్రేమ ఎల్లప్పుడూ  ఉంటుంది. మీకు మరింత పవర్ చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ  రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండు పోస్ట్ లు సోషల్ మీడియాని రౌండ్ అప్ చేసాయి. Pawan Kalyan, Mahesh Babu, Tollywood
టాలీవుడ్ సీనియర్ హీరో, ‘కింగ్’ అక్కినేని నాగార్జున కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా కొత్త దర్శకులు, రచయితలకు ఆయన ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రకటించారు. మంచి కథతో వస్తే అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సినిమాలు తీసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి పరిశ్రమలోని యంగ్ మేకర్స్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఉదయ్ చౌహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పళ్ళ బురుసు’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ యంగ్ డైరెక్టర్లకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ప్రతిభ ఉన్నవారు, వైవిధ్యమైన కథలతో ఎవరైనా సరే నేరుగా అన్నపూర్ణ స్టూడియోస్‌ను సంప్రదించవచ్చని నాగ్ స్పష్టం చేశారు. స్టూడియో అంటే కేవలం స్థలాన్ని లీజుకు ఇచ్చి లాభాలు ఆర్జించడం మాత్రమే కాదని అక్కినేని నాగార్జున అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమ తనకు ఇచ్చిన గుర్తింపునకు తిరిగి సేవ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అందుకే కొత్త దర్శకులతో వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లను నిర్మించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ‘లెనిన్’ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘పళ్ళ బురుసు’ చిత్రాన్ని ఎపిక్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించారు. గోమతి రెడ్డి, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రూపొందింది. రాబోయే రోజుల్లో తమ బ్యానర్‌లో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లు రానున్నాయని నాగార్జున వెల్లడించారు. ‘రంభ, ఊర్వశి, మేనక’ చిత్రంతో పాటు తన మైలురాయి లాంటి 100వ సినిమా ‘కింగ్ 100’ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపైనే భారీ స్థాయిలో తెరకెక్కనుందని స్పష్టం చేశారు. నాగార్జున చేసిన ఈ ప్రకటనతో అక్కినేని అభిమానులతో పాటు టాలీవుడ్ యంగ్ మేకర్స్ సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమకు కొత్త నెత్తురు ఎంతో అవసరమని, నాగ్ లాంటి సీనియర్ హీరో యంగ్ టాలెంట్‌కు దారి చూపించడం పట్ల సినీ వర్గాలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఆగస్టు 14న థియేటర్లలోకి వస్తున్న ‘పళ్ళ బురుసు’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. అలాగే నాగార్జున ప్రతిష్ఠాత్మక 100వ సినిమా 'కింగ్ 100' గురించిన మరిన్ని వివరాల కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తన 64వ చిత్రం 'డేర్‌డెవిల్'ను రీసెంట్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో అజిత్‌కు సాలిడ్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈసారి కేవలం తమిళ మార్కెట్ మాత్రమే కాకుండా, పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేశారు. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఒక సంచలన మల్టీస్టారర్ కాంబినేషన్ కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ విక్టరీ వెంకటేష్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు స్టార్స్ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే.. థియేటర్లు షేక్ అవ్వడం గ్యారెంటీ. త్వరలోనే ఈ మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్‌ గురించి క్లారిటీ రానుంది. అజిత్ కుమార్ సతీమణి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ షాలిని తన కొత్త బ్యానర్ 'బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్'పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.     Ajith Kumar, Dare Devil, Venkatesh, Mohanlal  
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తన నెక్స్ట్ మూవీని ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ T-Series నిర్మాణంలో 'పోలీస్ కంపెనీ' (Police Company) అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. "ఇట్ ఈజ్ మోర్ డేంజరస్ దేన్ డీ కంపెనీ" అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా.. ముంబై అండర్‌వరల్డ్ ను వణికించిన, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థకే గనక పరిమితి లేని అధికారాలు లభిస్తే ఏమవుతుంది? ఒక ప్రభుత్వ సంస్థగా ఉండాల్సిన వ్యవస్థే, ఒక ప్రైవేట్ కార్పొరేట్ గ్యాంగ్ లాగా 'కంపెనీ'గా మారితే ఎలాంటి విధ్వంసం జరుగుతుంది? సరిగ్గా ఇదే పాయింట్‌ను ఎంచుకుని ఆర్జీవీ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. 'పోలీస్ కంపెనీ' మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందో తెలుపుతూ రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. ముంబై అండర్‌వరల్డ్ చరిత్రలో దావూద్ ఇబ్రహీం తన ప్రత్యర్థి గ్యాంగ్‌లను ఒక్కొక్కటిగా మట్టుబెట్టి, తన సామ్రాజ్యాన్ని 'డి కంపెనీ'గా మార్చుకోవడం.. ఆ తర్వాత దుబాయ్ పారిపోవడం అందరికీ తెలిసిందే. కానీ, ఆ తర్వాత ఛోటా రాజన్‌తో వచ్చిన తీవ్ర విభేదాల వల్ల డి కంపెనీ ముక్కలైంది. ఆ సమయంలో ముంబై క్రైమ్ వరల్డ్‌లో ఏర్పడిన ఆ ఖాళీని పూరించడానికి వందలాది చిన్న చిన్న గ్యాంగ్‌లు పుట్టుకొచ్చి నగరాన్ని నరకప్రాయంగా మార్చేశాయి. ఆ పరిస్థితుల్లో ముంబైని కాపాడేందుకు 1997 నుండి 2004 మధ్యకాలంలో ముంబై పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రత్యేక 'ఎన్‌కౌంటర్ స్పెషల్ స్క్వాడ్'ను ఏర్పాటు చేసింది. ఈ స్క్వాడ్ ఏకంగా వందలాది మంది గ్యాంగ్‌స్టర్లను మట్టుబెట్టింది. ఈ రియల్ లైఫ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్స్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన వ్యక్తి దయా నాయక్. ఆయన నిజ జీవిత సంఘటనలు, ఎన్‌కౌంటర్ల స్ఫూర్తితోనే ఈ 'పోలీస్ కంపెనీ' కథ రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ దయా నాయక్ పాత్రలో హర్షవర్ధన్ రాణే నటిస్తున్నారు. మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.  https://x.com/RGVzoomin/status/2086810786408898922     Ram Gopal Varma, Police Company, Daya Nayak, RGV, T Series  
  మెగాస్టార్ చిరంజీవి వన్ మాన్ మ్యాజిక్ మన శంకర వరప్రసాద్ గారు ఘన విజయం సాధించినా, అభిమానుల మనస్సులో ఆ మూవీ చూస్తున్నా  విశ్వంభర గురించి ఆలోచనే ఉంది. 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'అంజి' వంటి ఆల్ టైమ్ క్లాసిక్ సోషియో-ఫాంటసీ చిత్రాల తర్వాత, చిరంజీవి నుంచి వస్తున్న  అత్యంత ప్రతిష్టాత్మక భారీ సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ మూవీ  కావడంతో 'విశ్వంభర'   కోసం ఎదురుచూడని అభిమాని, సినీ ప్రేమికుడు లేడు. పైగా మన శంకర వరప్రసాద్ గారు కంటే ముందు స్టార్ట్ అయిన మూవీ. కానీ చాలా రోజుల నుంచి  ఈ భారీ ప్రాజెక్ట్‌ గురించి ఎలాంటి అప్ డేట్ రావడం లేదు.    అలాంటిది ఈ రోజు చిరంజీవి తన సోదరుడు కుమారుడు వరుణ్ తేజ్ నుంచి వచ్చిన కొరియన్ కనకరాజు హిట్ అవ్వడంతో హైదరాబాద్ లోని ఒక హోటల్ లో జరిగే సక్సెస్ సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిధిగా హాజరవుతున్నాడు. దీంతో విశ్వంభర గురించి మాట్లాడతాడనే చర్చ జరుగుతుంది. చర్చ జరగడానికి కారణం కూడా లేకపోలేదు. విశ్వంభర ని నిర్మించింది కొరియన్ కనకరాజు ని నిర్మించిన యు వి క్రియేషన్స్ నే. విశ్వంభరలో  మెగాస్టార్  ఆధ్యాత్మిక భావనలు కలిగిన హనుమాన్ భక్తుడి పాత్రలో కనిపిస్తుండటం విశేషం.   హీరోగా ఆయన పవర్ ఫుల్ ప్రెజెన్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడి ఉన్న యాక్షన్ సీక్వెన్సులు థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ అనుభూతిని అందించబోతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. కథను ఎంత రిచ్‌గా, గ్రాండ్‌గా చూపించవచ్చో ఆలోచించిన నిర్మాతలు, సినిమా కోసం ఏకంగా 13 భారీ సెట్లను ప్రత్యేకంగా నిర్మించి ఓ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు.  ఈ భారీ సెట్లలో చిత్రీకరించిన సన్నివేశాలు, గ్రాఫిక్స్ హంగులు సోషియో ఫాంటసీ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకోనున్నాయి. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలు సమకూరుస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాని  మరో స్థాయికి తీసుకెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉంటాయని కీరవాణి ఇప్పటికే స్పష్టం చేశారు. అందులో ఒక పవర్‌ఫుల్ ఇంట్రో సాంగ్‌తో పాటు ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్పెషల్ సాంగ్ కూడా ఉంది. Also read: వైరల్: #అల్లు అర్జున్ పై మమితా బైజు కీలక వ్యాఖ్యలు..  డైహార్డ్ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో ఈ భారీ ప్రాజెక్ట్‌లో చిరంజీవికి జోడీగా సీనియర్ నటి, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తుండగా, మరో కీలక రోల్ లో ఆషికా రంగనాథ్ అలరించనున్నారు.మొత్తం 5 గురు కథానాయికలు కనిపించనున్నారని ఫిలింనగర్ సమాచారం. అలాగే ప్రతినాయకుడి పాత్రలో కునాల్ కపూర్ నటిస్తూ సినిమాకు మరింత డ్రామాను జోడిస్తున్నారు. చిత్రీకరణ పరంగా ఇప్పటికే దాదాపు అన్ని టాకీ పార్ట్‌లు పూర్తయిపోయాయి. కేవలం 2 పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అయితే విడుదల తేదీ చుట్టూ నడుస్తున్న చర్చలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మొదట ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా లేదా వేసవి రేసులో విడుదల చేయాలని భావించినప్పటికీ, రెండో భాగంలో ఉండే అత్యంత ప్రతిష్టాత్మకమైన సీజీ (CG) మరియు వీఎఫ్‌ఎక్స్ (VFX) పనులు అత్యంత నాణ్యతతో రావడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.అత్యుత్తమ విజువల్ క్వాలిటీ కోసం మేకర్స్ రాజీ పడకుండా పనిచేస్తున్నారు. ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ సాధించడమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి వీఎఫ్‌ఎక్స్ టీమ్‌లు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. పండుగ సీజన్ దసరా లేదా ఈ ఏడాది చివర్లో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బింబి సార ఫేమ్ వశిష్ట దర్శకుడు  Chiranjeevi, VishwamBhara, Korean kanakaraju, Varun Tej     
  ప్రేమలు మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన మలయాళ భామ మమితా బైజు. ఆ తర్వాత తన హవా కొంచం తగ్గట్టుగా అనిపించినా ఈ నెల 14 న రాబోయే శ్వనాథ్ అండ్ సన్స్ తో సూర్య తో కలిసి ఆడిపాడనుంది. ప్రచార చిత్రాలు చూస్తుంటే థియేటర్స్ నుంచి వచ్చాక కూడా తన గురించే ఆలోచించడం ఖాయంలా ఉంది. తాజాగా 'విశ్వనాథ్ అండ్ సన్స్'  ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మమితా బైజు మాట్లాడుతూ  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే నాకు చిన్నప్పటి నుంచే విపరీతమైన అభిమానం. ఒక రకంగా  డైహార్డ్ ఫ్యాన్. 'హ్యాపీ', 'బన్నీ', 'జులాయి', 'ఇద్దరమ్మాయిలతో' వంటి ప్రతి సినిమాని కనీసం 10 సార్లకు పైగా రిపీట్ మోడ్‌లో చూశాను. మూవీస్ లో ఆయన వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, యాటిట్యూడ్ అంటే ప్రాణం. ముఖ్యంగా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో ధరించిన స్టైలిష్ క్యాసియో వాచ్ నచ్చి, నేను  కూడా సేమ్ అలాంటి వాచ్‌నే కొనుక్కుని వేసుకునేదాన్నీ. స్కూల్ రోజుల్లో అల్లు అర్జున్ డ్రెస్సింగ్ శైలిని పూర్తిగా కాపీ కొడుతూ, ఫుల్ స్లీవ్ టీషర్ట్ మీద షర్ట్ వేసుకుని, ఆ షర్ట్ చేతులను మడిచి టాంబాయ్‌లా స్కూలుకు వెళ్లేదాన్నని మమితా బైజు  చెప్పుకొచ్చింది.  Also read: హీరోల వల్ల ఉపయోగమేంటి.. ఏం చేస్తున్నారు! 2017లో 'సర్వోపరి పాలక్కారన్' చిత్రంతో చలనచిత్ర రంగానికి పరిచయమైన ఈ భామ, ఆ తర్వాత 'ఆపరేషన్ జావా', 'ఖో ఖో' (కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు గ్రహీత), 'సూపర్ శరణ్య' వంటి హిట్ చిత్రాల్లో తన ప్రతిభను చాటుకుంది. అయితే 'ప్రేమలు' తెచ్చిపెట్టిన గ్లోబల్ పాపులారిటీ ఆమె రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ, మానసిక ప్రశాంతత కోసమే  కొంతకాలంగా సోషల్ మీడియాకి  దూరంగా ఉంటున్నానని ఈ భామ స్పష్టం చేసింది.   Mamitha Bhaiju, Allu Arun, Suriya
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
 పిల్లలు సక్సెస్ కావాలంటే ఈ లక్షణాలు అలవాటు చెయ్యాలి..! "నేటి బాలలె రేపటి పౌరులు.." "విత్తనం మంచిదైతే పసిడి పంట పండుతుంది".  ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం. ఇవన్నీ పిల్లల వ్యక్తిత్వాన్ని వారి నడవడికను తెలియజేయడానికి, పిల్లల భవిష్యత్తు గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు.  ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు ఉన్నతంగా ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, తమకు మంచి పేరు తీసుకురావాలని అనుకుంటారు.  అయితే ఇవన్నీ జరగాలన్నా, పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలన్నా.. పిల్లలకు కొన్ని లక్షణాలు అలవాటు చేయాలి.  దీని వల్ల పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుంది.  తల్లిదండ్రులు పిల్లలకు అలవాటు చేయాల్సినవి ఏమిటో తెలుసుకుంటే.. జ్ఞానం, తెలివితేటలు.. జ్ఞానం , తెలివితేటలు  పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా బలాలుగా మారతాయి. నేర్చుకోవాలనే తపన, ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్న పిల్లలు జీవితంలో విజయ మార్గంలో సులభంగా పయనిస్తారు. అటువంటి పిల్లలు తమ వృత్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలరు. తెలివైన పిల్లలు తమ భవిష్యత్తును గొప్పగా మార్చుకోవడమే  చేసుకోవడమే కాకుండా వారి తల్లిదండ్రుల ప్రతిష్టను కూడా పెంచుతారు. అందుకే చిన్నతనం నుండే పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వాలి.   ప్రవర్తన.. మంచి ప్రవర్తన, నీతి, నిజాయితీ వంటి విలువలు గొప్ప ఆస్తిగా పరిగణించాలి. పెద్దల పట్ల గౌరవం, క్రమశిక్షణ, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన పిల్లలు కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి పిల్లలు ఇంట్లో శాంతి, సంతోషాన్ని నెలకొల్పి, సమాజంలో కుటుంబానికి గౌరవాన్ని తెస్తారు. అందుకే పిల్లలకు మంచి విలువలు నేర్పించాలి.  దీని వల్ల పిల్లల ప్రవర్తన కూడా ఉన్నతంగా మారుతుంది. నిజాయితీ.. అబద్ధాలు చెప్పడం, మోసం, వంచనలకు దూరంగా ఉండే పిల్లలు సమాజంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. పిల్లలు అయినా పెద్దలు అయినా.. వారి వ్యక్తిత్వాన్ని బలంగా ఉంచేది నిజాయితీనే..  ఇది  చుట్టూ ఉన్న వ్యక్తుల నమ్మకాన్ని పొందడంలో సహాయపడుతుంది. అటువంటి పిల్లలకు జీవితంలో విజయం సాధించడానికి గొప్ప అవకాశాలు ఉంటాయి. అందుకే వారి తల్లిదండ్రులు కూడా సమాజంలో గౌరవాన్ని పొందుతారు. దయ.. దయ కలిగి ఉండటం,  సహాయపడే గుణం ఉన్న పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు.  పేదలకు సహాయం చేస్తూ, ఇతరుల పట్ల సున్నితంగా ఉండే పిల్లలు సంతోషం, శాంతితో కూడిన జీవితాన్ని గడుపుతారు. అలాంటి పిల్లలకు  తల్లిదండ్రుల ఆశీర్వాదం, మద్దతు కూడా ఎప్పుడూ ఉంటుంది.   పిల్లలలో ఉండే ఈ దయ, జాలి, కరుణ, సహాయం చేసే గుణం వంటివి సమాజంలో గప్ప గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.                                *రూపశ్రీ.  
ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు అయితే.. రాత్రంతా రైళ్లలోనే ఉండాల్సి వస్తుంది.  అయితే రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది.  పక్కన ప్రయాణికుల నుండి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. రైల్వే రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ప్రత్యేక "నైట్ జర్నీ కండీషన్స్" అమలు చేసింది. ప్రతి రైలు ప్రయాణికుడు ఈ నియమాల గురించి తెలుసుకోవాలి. లేకపోతే రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అవేంటో తెలుసుకుంటే.. శబ్దం చేయకూడదు.. రాత్రి 10 గంటల తర్వాత రైలులో నిశ్శబ్ద వాతావరణాన్ని పాటించడం ప్రధాన నియమం. ఈ సమయంలో మొబైల్ ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడకూడదు, లేదా ఇయర్‌ఫోన్‌లు లేకుండా స్పీకర్‌లపై వీడియోలు లేదా సంగీతాన్ని ప్లే చేయకూడదు. ఇతర ప్రయాణికుల నిద్రకు భంగం కలగకుండా ఉండేందుకు, స్నేహితులతో గుంపులుగా బిగ్గరగా నవ్వడం , జోకులు వేయడం కూడా నిషేధించబడింది. లైట్స్ ఆఫ్.. కొన్నిసార్లు ప్రయాణికులు ఎవరైనా రాత్రి పొద్దుపోయే వరకు  ఏదో ఒక కారణంతో మెయిన్ లైటును ఆన్ చేసి ఉంచుతారు. దీనివల్ల ఇతర ప్రయాణికులు నిద్రపోలేరు. పక్క వారి నిద్రకు ఇబ్బంది అవుతుంది.  రైల్వే నిబంధనల ప్రకారం, రాత్రి 10 గంటల తర్వాత ప్రధాన కోచ్‌లోని లైట్లన్నీ తప్పనిసరిగా ఆపివేయాలి. రాత్రిపూట కేవలం నైట్‌లైట్ బల్బులు మాత్రమే ఆన్ చేసి ఉండవచ్చు. ఎవరైనా  అవసరం అనిపిస్తే వారు  తమ సీటులోని పర్సనల్ రీడింగ్ లైటును ఉపయోగించుకోవచ్చు. మధ్య బెర్త్ లకు రైల్వే నియమాలు.. లోయర్ బెర్త్  , మధ్య బెర్త్ ప్రయాణీకుల మధ్య సీట్ల తగాదాలను నివారించడానికి, రైల్వే ఒక స్పష్టమైన నియమాన్ని పెట్టింది. మధ్య బెర్త్ ప్రయాణీకుడు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య మాత్రమే తన సీటును విప్పి నిద్రపోవచ్చు. ఉదయం 6 గంటల తర్వాత, ఇతరులు దిగువ బెర్త్‌లో కూర్చోవడానికి వీలుగా  మధ్య బెర్త్‌ను దించాలి. అదేవిధంగా, రాత్రి 10 గంటల తర్వాత, లోయర్ బెర్త్ ప్రయాణీకుడు తన సీట్ లో ఎవరినీ కూర్చోబెట్టుకోకూడదు. వారు తమ పక్కన కూర్చోమని ఎవరినీ బలవంతం చేయలేరు. టికెట్ చెకింగ్.. ప్రయాణికుల నిద్రను దృష్టిలో ఉంచుకుని, రైల్వే తన టికెట్ చెకింగ్ సిబ్బందికి సూచనలు జారీ చేసింది. రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 6:00 గంటల మధ్య  టికెట్‌ను తనిఖీ చేయడానికి ఏ టిటిఇ మిమ్మల్ని నిద్రలేపకూడదు. వారు రాత్రి 10:00 గంటల లోపు తమ పనిని పూర్తి చేసుకోవాలి. అయితే, రాత్రి 10:00 గంటల తర్వాత రైలు ఎక్కిన ప్రయాణికులు ఈ సమయంలో తమ టికెట్లను తనిఖీ చేయించుకోవచ్చు. ఇది కాకుండా రాత్రి 10 గంటల తర్వాత రైలులో వీధి వ్యాపారులు లేదా విక్రయదారులు గట్టిగా అరుస్తూ ఎలాంటి వస్తువులను అమ్మకూడదు.  కానీ ఎవరైనా ఈ-క్యాటరింగ్ ద్వారా ఆహారాన్ని ముందుగానే బుక్ చేసుకుని ఉంటే, అది ఖచ్చితంగా వారి సీటుకే తెచ్చిస్తారు. నియమాలు ఉల్లింఘిస్తే.. రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికుడు ఈ నియమాలను ఉల్లంఘిస్తే, వారితో వాదించాల్సిన అవసరం లేదు.  వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), TTE, లేదా రైలులోని కోచ్ అటెండెంట్‌కు ఫిర్యాదు చేయవచ్చు.  రైల్వే అధికారిక యాప్ 'రైల్‌మదాద్' లేదా 139 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా కూడా సహాయం పొందవచ్చు. నియమాలను ఉల్లంఘించిన వారిపై రైల్వే జరిమానాలు కూడా విధించవచ్చు. కాబట్టి రైలు ప్రయాణం చేసేటప్పుడు పై నియమాలు గుర్తుంచుకుని,  వాటిని అనుసరిస్తూ ప్రయాణించడం మంచిది.                                      *రూపశ్రీ.  
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు.  వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని,  తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది.  రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం,  పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా  మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు.  అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల  భవిష్యత్తులో  చాలా సమస్యలు వస్తాయి.  మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం,  పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి.  ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు.  తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు.  ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు.  సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ  భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును,  తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు.  ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ  భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా  భాగస్వామిపై ఆధారపడటం  తప్పు. ఈ అలవాటు  భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం  సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు.  ఎవరి కోసమూ  అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం,  చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది.                                              *రూపశ్రీ.
మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో పొటాషియం (Potassium) ఒకటి. శరీరంలో పొటాషియం స్థాయి సరైన మోతాదులో ఉండటం చాలా ముఖ్యం. అయితే రక్తంలో పొటాషియం స్థాయి ఎక్కువగా ఉన్నా (Hyperkalemia), తక్కువగా ఉన్నా (Hypokalemia) ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అసలు పొటాషియం అంటే ఏమిటి? రక్తంలో పొటాషియం ఎందుకు పెరుగుతుంది? పొటాషియం తగ్గడానికి కారణాలు ఏమిటి? పొటాషియం ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఈ సమస్యను నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేయాలి? వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో ప్రముఖ వైద్యులు డా. N. Papa Rao సులభంగా వివరిస్తున్నారు. పొటాషియం ఎక్కువైతే ఏమవుతుంది? రక్తంలో పొటాషియం సాధారణ స్థాయికి మించి ఉండటాన్ని Hyperkalemia అంటారు. కొన్ని సందర్భాల్లో కిడ్నీల పనితీరు సరిగా లేకపోవడం, కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా కొన్ని మందుల కారణంగా పొటాషియం స్థాయి పెరగవచ్చు. పొటాషియం ఎక్కువగా ఉన్నప్పుడు కండరాల బలహీనత, అలసట, గుండె కొట్టుకునే విధానంలో మార్పులు వంటి సమస్యలు కనిపించవచ్చు. ముఖ్యంగా గుండె పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. పొటాషియం తగ్గితే? రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉండటాన్ని Hypokalemia అంటారు. వాంతులు, విరేచనాలు, అధికంగా చెమట పట్టడం, కొన్ని మందుల వాడకం వంటి కారణాలతో శరీరంలో పొటాషియం తగ్గే అవకాశం ఉంటుంది. పొటాషియం తక్కువగా ఉన్నప్పుడు నీరసం, కండరాల బలహీనత, కండరాలు పట్టేయడం, గుండె దడ వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి? పొటాషియం స్థాయి ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా అనేది కేవలం లక్షణాల ఆధారంగా నిర్ణయించలేం. అవసరమైతే వైద్యుల సూచనతో రక్త పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా కొన్ని మందులు క్రమం తప్పకుండా ఉపయోగించేవారు వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. పొటాషియం ఎక్కువగా ఉందని లేదా తక్కువగా ఉందని అనుమానం వచ్చినప్పుడు సొంతంగా మందులు తీసుకోవడం, పొటాషియం సప్లిమెంట్లు వాడటం లేదా ఆహారంలో పెద్ద మార్పులు చేయడం చేయకండి. వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. పొటాషియం ఎక్కువైనా ప్రమాదమే.. తక్కువైనా సమస్యే. కాబట్టి శరీరంలో పొటాషియం స్థాయి ఎందుకు మారుతుంది, దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయాలపై పూర్తి అవగాహన కోసం ఈ వీడియోను చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్యుల వ్యక్తిగత సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా అనుమానాలు ఉంటే అర్హత కలిగిన వైద్యులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అంటారు. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటే జీవితం చాలా వరకు దిగులు లేకుండా ఉంటుంది.   కంటికి ఏదైనా సమస్య వస్తే.. దాని ప్రభావం జీవితం మీద చాలా ప్రస్పుటంగా కనిపిస్తుంది. కంటి సమస్యలు అంటే చాలామంది కంటి శుక్లాలు రావడం,  కంటికి ఏదైనా దెబ్బ తగలడం... వీటి గురించి చెబుతుంటారు. కానీ వర్షాకాలంలో పిలవని అతిథి గా వచ్చేది కంటి ఇన్ఫెక్షన్ల సమస్య. కంటి ఇన్ఫెక్షన్లు వస్తే కన్ను ఎర్రబడటం,  కంటి నుండి నీరు కారడం, కళ్లు మసకగా మారడం, కళ్ల మంటలు వంటి సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో వచ్చే ఈ కంటి ఇన్ఫెక్షన్ల సమస్య.. ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది కూడా. అసలు కంటి ఇన్పెక్షన్ సమస్యలు ఎందుకు వస్తాయి? కారణాలు ఏంటి?  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  కంటి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు చికిత్స ఏంటి?  తెలుసుకుంటే.. వర్షాకాలంలో కంటి ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి? వర్షపు నీరు నేరుగా కంటి ఇన్ఫెక్షన్లకు కారణం కాదు.. అయినప్పటికీ ఈ కాలంలో బ్యాక్టీరియా , వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం, మురికి చేతులతో కళ్లను తాకడం, ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి వాడిన టవల్ లేదా చేతి రుమాలును ఇతరులు వాడటం, కాంటాక్ట్ లెన్స్‌లను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటివి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇన్ఫెక్షన్ సోకిన కంటిని తాకిన తర్వాత  డోర్‌నాబ్, మొబైల్ ఫోన్, టేబుల్ లేదా ఇతర వస్తువులను తాకితే, అక్కడ ఉన్న వైరస్‌లు లేదా బ్యాక్టీరియా ఇతరులకు వ్యాప్తి చెందవచ్చు. కంటి ఇన్పెక్షన్ లక్షణాలు.. కళ్లు ఎర్రబడటం, ఆగకుండా నీరు కారడం,  దురద లేదా మంట.  కళ్ల నుండి జిగటగా లేదా పసుపు-తెలుపు రంగులో స్రావం రావడం. కనురెప్పలు వాపు. కళ్లలో ఇసుక గుచ్చుతున్నట్లు అనిపించడం. ఉదయం నిద్రలేచినప్పుడు కనురెప్పలు జిగటగా ఉండటం.. వంటివి కంటి ఇన్పెక్షన్ లక్షణాలు. కన్ను ఎర్రబడితే ఇన్పెక్షన్ వచ్చినట్టా? వర్షాకాలంలో అలర్జీలు, దుమ్ము, కాలుష్యం లేదా ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల తరచుగా కళ్ళు ఎర్రబడవచ్చు. అందువల్ల,  కన్ను ఎర్రబడగానే అది  కంటి ఇన్పెక్షన్ అనుకోవడం పొరపాటు.   కొందరు ఇలా సందేహం రాగానే  సొంతంగా యాంటీబయాటిక్ కంటి డ్రాప్స్ వంటివి   వాడతారు,  ఇలా చేయడం మంచిది కాదు.  నొప్పి తీవ్రంగా ఉంటే, దృష్టి మసకబారితే, లేదా లైటింగ్ కు కళ్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే  వెంటనే కంటి వైద్య నిపుణుడిని సంప్రదించాలి. వీళ్లకు ఎక్కువ జాగ్రత్త అవసరం.. కాంటాక్ట్ లెన్స్ వాడేవారు,  చిన్న పిల్లలు,  వృద్ధులు కంటి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు మాత్రమే కాకుండా.. మధుమేహ వ్యాధిగ్రస్తులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఈ మధ్యనే  కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారు కంటి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో కళ్లను ఎలా కాపాడుకోవాలి? చేతులను సబ్బు ,  నీటితో బాగా కడుక్కోవాలి. మురికి చేతులతో  కళ్ళను తాకకూడదు. బయటి నుండి వచ్చిన తర్వాత  ముఖాన్ని, చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి.  కళ్ళలోకి దుమ్ము లేదా మురికి నీరు వెళితే, వాటిని శుభ్రమైన నీటితో కడగాలి. తువ్వాళ్లు, చేతి రుమాళ్లు లేదా దిండులను సెల్ఫ్ గా ఉంచుకోవడం, సెల్ఫ్ గా వాడుకోవడం మంచిది. ఇతరులకు ఇవ్వడం లేదా ఇతరులవి వాడటం మంచిది కాదు. కంటి అలంకరణ వస్తువులైన కాటుక,  ఐ లాషెస్,  ఐ లైనర్ వంటివి ఇతరులకు ఇవ్వడం, ఇతరులవి తీసుకోవడం మంచిది కాదు.  ఇన్ఫెక్షన్ సోకినట్లయితే కళ్లను అలంకరించుకోవడం మానెయ్యాలి. కాంటాక్ట్ లెన్స్ ధరించేవారు.. వర్షాకాలంలో కాంటాక్ట్ లెన్స్ ధరించేవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని పెట్టుకునే ముందు  చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. లెన్స్‌లను గానీ, వాటి కేస్‌ను గానీ కుళాయి నీటితో ఎప్పుడూ శుభ్రం చేయకూడదు. కళ్ళు ఎర్రబడటం, నొప్పి లేదా చీము కారడం వంటివి కనిపిస్తే, వెంటనే  లెన్స్‌లను తీసివేసి, వైద్యుడిని సంప్రదించాలి. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లెన్స్‌లు ధరించడం వల్ల ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. కంటి ఇన్ఫెక్షన్ వస్తే ఏం చేయాలి?  కళ్ళు ఎర్రబడినా లేదా నీరు కారుతున్నా, మొదటగా  వాటిని పదేపదే రుద్దడం ఆపాలి. శుభ్రమైన దూదితో లేదా మెత్తని గుడ్డతో వాటిని శుభ్రం చేసుకోవాలి. తక్కువ మంట లేదా వాపు ఉంటే చల్లటి కాపడం ఉపశమనాన్ని ఇస్తుంది.  డాక్టర్ రికమెండ్  చేస్తే కృత్రిమ ఐ డ్రాప్స్ ఉపయోగించవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా డాక్టర్‌ను సంప్రదించకుండా యాంటీబయాటిక్ లేదా స్టెరాయిడ్ కంటి చుక్కలను ఉపయోగించకూడదు. అన్ని రకాల ఇన్ఫెక్షన్లకు చికిత్స ఒకేలా ఉండదు. కానీ సొంత ప్రయోగాలు చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.                                *రూపశ్రీ.  
కాల్షియం, ఐరన్ లోపం ఉందా? పాలు, పాల ఉత్పత్తుల విషయంలో కల్తీపై ఆందోళన ఉందా? అయితే మన ఇంట్లోనే సులభంగా లభించే ఒక ఆకుకూర మీ ఆహారంలో మంచి పోషక వనరుగా ఉపయోగపడవచ్చు. ఇంతకీ ఆ ఆకుకూర ఏంటి? దానిలో ఉండే పోషకాలు ఏమిటి? ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? ఎంత మోతాదులో తీసుకోవాలి? ఈ వీడియోలో ఆయుర్వేద వైద్యులు చిట్టి బొట్ల మధుసూదన్ శర్మ ఈ ఆకుకూర గురించి ఆసక్తికరమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. కాల్షియం మన ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజం. అలాగే ఐరన్ శరీరంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, ఇతర సహజ ఆహార పదార్థాలను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఆహార విధానంలో భాగం. అయితే ఒక ఆహార పదార్థం తీసుకోవడం వల్ల మాత్రమే కాల్షియం లేదా ఐరన్ లోపం పూర్తిగా సరిచేయబడుతుందని భావించకూడదు. ఇప్పటికే లోపం ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలితే, వైద్యుల సూచన మేరకు సరైన ఆహారం లేదా అవసరమైన చికిత్స తీసుకోవడం ముఖ్యం. ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: • కాల్షియం, ఐరన్ మన శరీరానికి ఎందుకు అవసరం? • ఇంట్లో సులభంగా లభించే ఈ ఆకుకూరలో ఉన్న పోషకాలు ఏమిటి? • ఈ ఆకుకూరను ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చు? • ఆకుకూరలను తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి? • సహజ ఆహారాల ద్వారా పోషకాలను పొందడంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలను ఈ వీడియోలో ఆయుర్వేద వైద్యులు చిట్టి బొట్ల మధుసూదన్ శర్మ వివరించారు. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా పోషక లోపం, అనారోగ్య సమస్య ఉంటే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి. వైద్యుల సూచన లేకుండా మందులు లేదా సప్లిమెంట్లను ప్రారంభించవద్దు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)