మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత దివంగత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేళ చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలు రాజకీయంగా మలుపు తిరిగాయి. ఈ వివాదానికి సంబంధించి వైసీపీ  సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసు కేసు నమోదైంది.  కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు.  విషయమేంటంటే.. ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో  బుధవారం (జులై 16) అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే..  దీనిని ముద్రగడ కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తమ కుటుంబ నిర్ణయం ప్రకారమే, సాధారణ పద్ధతిలో అంత్యక్రియలు జరగాలని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు, నేతలు కూడా ప్రభుత్వ లాంఛనాల నిర్వహణను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులకు, అక్కడ ఉన్న రాజకీయ నాయకులకు మధ్య  వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తుపాకులతో సెల్యూట్ చేస్తూ గార్డ్ ఆఫ్ హానర్ సమర్పించేందుకు సిద్ధమైన ఏఆర్ ఎస్సై అప్పలరాజుతో పాటు ఇతర కానిస్టేబుళ్లను అంబటి రాంబాబు, ఆయన అనుచరులు   నెట్టివేశారని పోలీసులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. విధినిర్వహణలో ఉన్న తమపై దాడి చేసి తోసి వేసి తన విధులకు ఆటంకం కల్పించారని బాధితులు ఆరోపించారు.   పోలీస్ సిబ్బంది ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు కిర్లంపూడి పోలీసులు  చట్టప్రకారం చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు,  ఇతర వైసీపీ   కేసు నమోదు చేశారు.  ఈ వివాదంపై రాజకీయవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముద్రగడ కుటుంబ సంప్రదాయాలు, వారి ఇష్టాయిష్టాలను గౌరవించకుండా బలవంతంగా ప్రభుత్వ లాంఛనాలు జరపాలని చూడటం వల్లే ఈ ఘర్షణ వాతావరణం ఏర్పడిందని ఒక వర్గం వాదిస్తుండగా,  విధుల్లో ఉన్న పోలీసుల  నెట్టేయడం చట్టరీత్యా నేరమని, శాంతిభద్రతలను కాపాడాల్సిన నాయకులే ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని  మరి కొందరు అంటున్నారు.   Mudragada Padmanabham Funeral Controversy, Kirlampudi Police Station FIR, YSRCP Leaders Police Push Case
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి నందమూరి వారసుడు, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నెల 18న ఎన్టీఆర్ తన అభిమానులతో ఒక భారీ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఆయన జూలై 18న నూతన రాజకీయ పార్టీని ప్రకటిస్తారా, లేక కేవలం సామాజిక సేవా సంస్థకే పరిమితం అవుతారా అనే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సంచలన పరిణామాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ్  తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.  కొందరు రాజకీయ నేతలు, న్యాయ నిపుణులు ఎన్టీఆర్ ఖచ్చితంగా పార్టీ పెడతారని, ఇందుకు సంబంధించిన ఆహ్వానాలు కూడా అందాయని బలంగా చెప్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయి సమీకరణాలు మాత్రం అందుకు  భిన్నంగా ఉన్నాయని భరధ్వాజ వెల్లడించారు.  గతంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (సీనియర్ ఎన్టీఆర్) తెలుగుదేశం పార్టీని స్థాపించడానికి ముందు.. తాను సినిమాలకు స్వస్తి పలుకుతున్నానని, కేవలం సమాజ సేవ కోసమే ఒక సంస్థ  పెడుతున్నానని ప్రకటించారు.  తర్వాతే ఆయన దానిని  తెలుగుదేశం' రాజకీయ పార్టీగా మార్చారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ ఇలాంటి వ్యూహమే నడుస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళ నటుడు విజయ్, గతంలో రజనీకాంత్ వంటి వారు కూడా అభిమాన సంఘాల బలాన్ని సమీకరించిన తీరును ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.   అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ వెంటనే రాజకీయ పార్టీని స్థాపించే సాహసం చేయకపోవచ్చనన్న భరద్వాజ ఇందుకు   ఆయనకున్న భారీ సినీ కమిట్ మెంట్లు కారణమన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో  డ్రాగన్ ,  త్రివిక్రమ్ ప్రాజెక్ట్,  దేవర 2 వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. ఇవి పూర్తి కావడానికి కనీసం ఐదారేళ్ల సమయం పడుతుంది.  ఈ దశలో సినిమాలను వదిలి పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించడం  జూనియర్ ఎన్టీఆర్ కు సాధ్యమయ్యే పని కాకపోవచ్చని భరద్వాజ అన్నారు.    మరోవైపు, పాన్ ఇండియా మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి, సోషల్ మీడియా వేదికగా తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి అభిమానుల నెట్వర్క్ ను ఒక నిర్మాణాత్మకమైన కమిటీగా మార్చేందుకే ఈ సమావేశం ఉపయోగపడవచ్చనీ,   హీరో అల్లు అర్జున్ సైతం జాతీయ స్థాయిలో తన ఆర్మీ కమిటీలను వేసిన విషయాన్ని భరద్వాజ గుర్తు చేశారు.  ఏది ఏమైనప్పటికీ, ఏపీలో ప్రాంతీయ పార్టీల మనుగడపై జాతీయ పార్టీల ఒత్తిడి ఎక్కువగా ఉన్న తరుణంలో.. ఎన్టీఆర్ అడుగులు ఎటు పడతాయనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన సేవా సంస్థను స్థాపించినా, భవిష్యత్తులో అది రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే అవకాశాలను కొట్టిపారేయలేము. ఈ సర్వత్రా వ్యక్తమవుతున్న సస్పెన్స్కు తెరపడాలంటే జూలై 18న జరగబోయే అభిమానుల సమావేశం వరకు వేచి చూడాల్సిందే.    Jr NTR July 18 Meeting, NTR Legacy, Telugu Politics News, Jr NTR New Party Launch
తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్న మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది.   అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్  మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ఈ నేపథ్యంలోనే  బీఆర్ఎస్ నాయకుడు, హుజూరాబాద్  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు సవాల్ విసిరారు. మేడిగడ్డ వద్ద గోదావరి నది గుండా ప్రతిరోజూ  9 టీఎంసీల  నీరు   వృథాగా పోతోందన్న ఆయన..  ఇంత నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా నిరాకరిస్తోందని విమర్శించారు.  ఈ వైఖరి వల్ల ఉత్తర తెలంగాణలోని లోయర్ మానేరు, మిడ్ మానేరు ఆయకట్టు పరిధిలోని వేలాది ఎకరాల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో  ఏర్పాటు చేసిన  ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసమే కాళేశ్వరం మౌలిక సదుపాయాలను వినియోగించుకోకుండా రైతులను   ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తాము చేసిన అబద్ధాల ప్రచారాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే కన్నెపల్లి పంపులను ఆన్ చేయడం లేదని ఆరోపించారు. నీరిస్తే రైతులకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని, రైతు భరోసా నిధులు చెల్లించాల్సి వస్తుందనే నెపంతోనే ఈ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని  విమర్శించారు. అంతేకాకుండా, గత రబీ సీజన్‌లో ప్రభుత్వం సేకరించిన మొక్కజొన్న పంటకు సంబంధించి దాదాపు 30 శాతం మంది రైతులకు ఇప్పటికీ అమ్మకపు సొమ్ము బకాయిలు అందలేదన్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు. ఆ నష్టానికి బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు తక్షణమే రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రైల్ ఫేజ్-2 కోసం కేంద్రానికి లేఖలు రాయడంపై పెడుతున్న శ్రద్ధను, బ్యారేజీల మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి   లేఖ రాయడంపై పెట్టడం లేదని విమర్శించారు. ఈ జాప్యం ఇలాగే కొనసాగితే ఉత్తర తెలంగాణలో సాగునీటి కొరతే కాకుండా తీవ్ర తాగునీటి ఎద్దడి కూడా ఏర్పడే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ హెచ్చరించింది. aleshwaram Project Row, Padi Kaushik Reddy Challenge, Revanth Reddy BRS, Kannepalli Pump House, Telangana Politics, BRS MLAs Resignation
ALSO ON TELUGUONE N E W S
  వైవిధ్యమైన కంటెంట్ తో కూడిన చిత్రాల దర్శకుడిగా తెలుగు సిల్వర్ స్క్రీన్ పై తనదైన ముద్ర వేసాడు పూరి జగన్నాధ్(Puri Jagannadh). లాంగ్ గ్యాప్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ట్రాక్ లోకి వచ్చినట్టే వచ్చి ప్రెజెంట్ మళ్ళీ  హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో చేస్తున్న అప్ కమింగ్ మూవీ స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్ పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు కంటెంట్ ఎంత ముఖ్యమో, దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే పబ్లిసిటీ కూడా అంతే ముఖ్యం. ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా, ఎంతటి సంచలన దర్శకుడు తెరకెక్కించినా సరైన ప్రమోషన్స్ లేకపోతే ఓపెనింగ్స్ రావడం కష్టమనేది నేటి ట్రెండ్. ఈ క్రమంలోనే ‘స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్’ గురించి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూరి ఇండస్ట్రీలోకి వచ్చి 26 ఏళ్లు దాటిన సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చారు. విజయ్ సేతుపతి ఏకంగా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో తనే స్వయంగా టీజర్ డబ్బింగ్ కూడా పూర్తి చేసేశాడు. కానీ ఆ తర్వాత నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఎందుకో సైలెంట్ అయిపోయారు. మొదట్లో ఈ సినిమా టీజర్ జూన్ 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదల కాబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఒక పక్క విజయ్ సేతుపతి నుంచి రాబోయే  'ట్రైన్' వంటి ఇతర సినిమాలు ఆగస్టు విడుదలకు సిద్ధమవుతూ జోరుగా ప్రమోషన్స్ జరుపుకుంటుంటే ‘స్లమ్ డాగ్’ అప్‌డేట్స్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయింది.  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇలా మొత్తం 5 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.మరి ఇలాంటి హై వోల్టేజ్ ప్రాజెక్ట్‌ను కేవలం థియేట్రికల్ రిలీజ్ కోసమే కాకుండా ఓటీటీ బిజినెస్ క్లోజ్ చేసుకోవాలన్నా సోషల్ మీడియాలో నిరంతరం బజ్ మెయింటైన్ చేయడం  అవసరం. మరి ఇప్పటికైనా పూరి కనెక్ట్స్ టీమ్ మేల్కొని, టీజర్ రిలీజ్ డేట్‌తో పాటు ప్రమోషన్స్ షెడ్యూల్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తుందో లేదో చూడాలి. 'యానిమల్', 'అర్జున్ రెడ్డి' చిత్రాల ఫేమ్ నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ నుంచి వస్తున్న స్లమ్ డాగ్ లో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేస్తుండగా, టబు, దునియా విజయ్ కుమార్, బ్రహ్మానందం వంటి భారీ తారాగణం  ఉన్నారు.పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ తమ ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్‌పై జేబీ మోషన్ పిక్చర్స్‌తో కలిసి  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా రక్తంతో తడిసిన కత్తి పట్టుకుని, కరెన్సీ నోట్ల మధ్య మాస్ లుక్‌లో విజయ్ సేతుపతి కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల చేత స్లమ్ డాగ్  కోసం వెయిట్ చేసేలా చేస్తుంది. vijaysethupathi, puri jagannadh, slum dog, charmy  
అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతున్న నేపథ్యంలో, చిత్రబృందం గుంటూరులో గ్రాండ్‌గా సక్సెస్ మీట్ వేడుకలను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ వేదికగా హీరో అఖిల్ అక్కినేని తన కెరీర్, కుటుంబం  వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్, 'లెనిన్' విజయంతో తన మనసులోని భావోద్వేగాలన్నింటినీ అభిమానుల ముందు పంచుకున్నారు. ముఖ్యంగా తన భార్య జైనబ్, తండ్రి నాగార్జున గురించి అఖిల్ మాట్లాడిన మాటలు అక్కినేని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ వేడుకలో అఖిల్ మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా తాను ఎన్నో ఒడుదొడుకులు, మానసిక సంఘర్షణలు ఎదుర్కొన్నానని ఓపెన్ అయ్యారు. ఆ కష్టకాలంలో తన భార్య జైనబ్ తనకు కొండంత అండగా నిలిచిందని చాలా ఎమోషనల్ గా చెప్పారు. తాను ఇంట్లో జైనబ్‌ను ఎంతో ప్రేమగా 'బంగారు తల్లి' అని పిలుచుకుంటానని ఈ సందర్భంగా బయటపెట్టారు. గత మూడేళ్ళుగా తాను తీవ్రమైన బాధలో ఉన్న ప్రతి క్షణంలోనూ ఆమె తన పక్కనే ఉంటూ, మానసిక ధైర్యాన్ని ఇస్తూ, ఒక మంచి గైడ్‌లా తనను నడిపించిందని ప్రశంసించారు. తన భార్య అందించిన సపోర్ట్ వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో నిలబడగలిగానని అఖిల్ కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు. భార్య గురించి మాత్రమే కాకుండా, తన తండ్రి కింగ్ నాగార్జున గురించి కూడా అఖిల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'లెనిన్' సినిమా ఘన విజయం సాధించిన తర్వాత జరిగిన ఓ ఈవెంట్‌లో తాను తండ్రి నాగార్జునను గట్టిగా కౌగిలించుకున్నానని, ఆ ఒక్క హగ్‌లోనే తాను గత పదేళ్లుగా మనసులో దాచుకున్న ఎమోషన్స్, బాధలు, ఒత్తిడి అంతా బయటకు వచ్చాయని చెప్పారు. గత 10 ఏళ్ల సినీ ప్రయాణంలో నాన్న తనను ఒక్కసారి కూడా తిట్టలేదని, ఎప్పుడూ నిరుత్సాహపరచకుండా నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉన్నారని అఖిల్ తెలిపారు. తనకు సర్వస్వం నాన్నేనని, ఒక ఉత్తమ స్నేహితుడిలా ఈ సుదీర్ఘ జర్నీలో తోడుగా నిలిచారని కొనియాడారు. 'లెనిన్' ప్రాజెక్ట్‌ను నాగార్జున తన భుజాలపై వేసుకుని మోశారని, అక్కినేని అభిమానులకు ఒక అద్భుతమైన సినిమాను అందించాలనే ఏకైక తపనతో రాత్రింబగళ్లు వర్క్ చేశారని అఖిల్ గుర్తుచేసుకున్నారు. చివరగా తనను ప్రాణంగా ప్రేమించే అభిమానుల గురించి అఖిల్ ఎంతో గొప్పగా మాట్లాడారు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి అభిమానులు దొరుకుతారని, తన ఫ్యాన్స్ కోసమైనా సరే ఎలాగైనా ఒక భారీ హిట్ కొట్టాలని తాను ఎప్పుడూ భార్యతో చెబుతుండేవాడినని అన్నారు. 'లెనిన్' సినిమాతో ఆ కల నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయితే ఈ విజయంతో తాను కాలర్ ఎగరేయనని, గర్వపడనని ప్రేక్షకులకు స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి తన కొత్త ప్రయాణం మొదలవుతోందని, తాను చేయాలనుకుంటున్న సినీ యుద్ధాన్ని ఇకపై అత్యంత ప్రశాంతంగా చేస్తానని అఖిల్ అక్కినేని తెలిపారు.     Akhil Akkineni, Emotional Speech, Lenin Success Meet  
అక్కినేని నాగ చైతన్య సినీ కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ మైలురాయి నమోదైంది. నాగ చైతన్య నటిస్తున్న సరికొత్త ఫాంటసీ మైథాలజికల్ థ్రిల్లర్ 'వృషకర్మ' సరికొత్త చరిత్ర సృష్టించింది. థియేట్రికల్ విడుదలకు ముందే ఈ చిత్రం టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తూ ఏకంగా 50 కోట్ల రూపాయల భారీ నాన్-థియేట్రికల్ డీల్‌ను కుదుర్చుకున్నట్లు సమాచారం. చైతన్య కెరీర్‌లోనే అత్యధిక ధర పలికిన ఈ భారీ ఒప్పందం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వచ్చిన 'తండేల్' సినిమా సక్సెస్‌తో మంచి ఫామ్‌లో ఉన్న నాగ చైతన్య, ఈసారి పూర్తిగా భిన్నమైన జానర్‌ను ఎంచుకున్నారు. మిస్టిక్ ఎలిమెంట్స్, పౌరాణిక నేపథ్యం, మైండ్ బెండింగ్ థ్రిల్లింగ్ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేసింది. ఆ గ్లింప్స్‌లో చూపించిన హాలీవుడ్ స్థాయి విజువల్స్, వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అత్యున్నత మేకింగ్ క్వాలిటీ చూశాక బిజినెస్ వర్గాల్లో ఈ సినిమాపై విపరీతమైన నమ్మకం ఏర్పడింది. అందుకే ప్రస్తుతం ఓటీటీ, శాటిలైట్ మార్కెట్ కాస్త మందగమనంలో ఉన్నప్పటికీ, ఈ చిత్రం ఆ హద్దులన్నింటినీ దాటి ఊహించని రేంజ్‌లో దూసుకుపోయింది. ప్రముఖ టీవీ అండ్ ఓటీటీ సంస్థ 'జీ' (Zee) ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్ హక్కులను ఏకంగా రూ. 50 కోట్ల ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో ఒక మీడియం రేంజ్ సినిమాకు ఈ స్థాయి నాన్-థియేట్రికల్ బిజినెస్ జరగడం రికార్డు అని చెప్పవచ్చు. ఈ భారీ డీల్ వెనుక దర్శకుడు కార్తీక్ దండు బ్రాండ్ వాల్యూ కూడా ప్రధాన కారణంగా నిలిచింది. గతంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో 'విరూపాక్ష' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ డైరెక్ట్ చేసిన కార్తీక్ దండు, ఈసారి అంతకంటే బలమైన ఫాంటసీ కథతో 'వృషకర్మ'ను తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్‌ఎన్ ప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. థియేటర్లలోకి రాకముందే 50 కోట్ల మార్క్‌ను అందుకోవడం ద్వారా ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న క్రేజ్, మార్కెట్ వాల్యూ పదింతలు పెరిగాయని చెప్పాలి. ఈ మెగా డీల్ న్యూస్, అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ నింపడమే కాకుండా, రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద 'వృషకర్మ' సృష్టించబోయే విధ్వంసానికి ఒక బలమైన పునాదిగా నిలిచింది.     Naga Chaitanya, Vrushakarma, OTT Deal  
తెలుగు సినీ ఇండస్ట్రీలో అభిమానానికి అవధులు ఉండవు అనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుంటూరుకు చెందిన నాగరాజు. సోషల్ మీడియా వేదికగా "అయ్యగారే నెంబర్ వన్" అంటూ అక్కినేని అఖిల్ పై తనకున్న విపరీతమైన ప్రేమను చాటుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించిన నాగరాజుకు ఒక అరుదైన, మరువలేని కల నిజమైంది.  అఖిల్ అక్కినేని హీరోగా నటించిన తాజా చిత్రం 'లెనిన్' ఘన విజయం సాధించిన వేళ, బుధవారం గుంటూరులో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల్ తన డైహార్ట్ ఫ్యాన్ ని ప్రత్యేకంగా కలిశాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఎమోషనల్ భేటీకి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అభిమాన హీరో కళ్లముందు కనిపించేసరికి నాగరాజు ఆనందాన్ని అస్సలు ఆపుకోలేకపోయాడు. గుంటూరు నగరంలో రోడ్డుపై పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే నాగరాజుకు సినిమా రంగంపై ఎలాంటి ఆశలు లేవు. కేవలం అఖిల్ సినిమా విడుదలైనప్పుడు మాత్రమే అతను థియేటర్ల వద్ద విపరీతమైన హంగామా చేస్తూ కనిపిస్తుంటాడు. ఇటీవల విడుదలైన 'లెనిన్' సినిమా సమయంలోనూ థియేటర్ వద్ద నాగరాజు చేసిన హంగామా, అఖిల్ భారీ కటౌట్లకు పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం వంటి అభిమాన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి.  నాగరాజు చూపిస్తున్న ఈ నిస్వార్థమైన అభిమానం హీరో అఖిల్ దృష్టికి వెళ్లడంతో, ఆయన ఎంతో మురిసిపోయి, సమయం దొరికినప్పుడు నాగరాజును కచ్చితంగా కలుస్తానని గతంలో మాట ఇచ్చారు. ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ బుధవారం రాత్రి నాగరాజును ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. అఖిల్ ను కలిసిన ఆ సెకనులోనే నాగరాజు కళ్లల్లో ఆనంద భాష్పాలు ఉబికి వచ్చాయి. తన అభిమాన చూసిన ఆనందంలో, హీరో ఎంత వద్దు అని వారిస్తున్నా వినకుండా అఖిల్ కాళ్లపై పడటానికి ప్రయత్నించాడు. ఆపై అఖిల్ అతడిని పైకి లేపి దగ్గరకు తీసుకోగా, నాగరాజు తన హీరోను గట్టిగా హత్తుకుని వెక్కివెక్కి ఏడ్చేశాడు. "ఈ జన్మకు ఈ ఒక్క అదృష్టం చాలు అయ్యగారు" అంటూ నాగరాజు భావోద్వేగానికి గురైన తీరు అక్కడ ఉన్న వారందరినీ కదిలించింది. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ ఎమోషనల్ వీడియోను పంచుకోగా, అది క్షణాల్లోనే లక్షలాది వ్యూస్ సాధించి టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ప్రస్తుత రోజుల్లో ఒక హీరో అభిమానులు మరో హీరోపై ట్రోలింగ్స్ చేసుకోవడం, సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ కు దిగడం సర్వసాధారణం అయిపోయింది. కానీ నాగరాజు వీటన్నిటికీ పూర్తి దూరంగా ఉంటూ, కేవలం తన హీరోను మాత్రమే ఆరాధించే స్వచ్ఛమైన అభిమానిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లలో వచ్చిన డిజిటల్ క్రేజ్ ను వాడుకుని సులభంగా డబ్బు సంపాదించే పలు రకాల మార్గాలు ఉన్నప్పటికీ, పండ్ల వ్యాపారమే చేసుకుంటూ ఒక సాధారణ ఫ్యాన్ గానే మిగిలిపోవడానికి ఇష్టపడ్డాడు. ఈ అరుదైన కలయికను చూసిన నెటిజన్లు "నిజమైన అభిమానికి దక్కిన గౌరవం ఇది" అంటూ కామెంట్లు పెడుతున్నారు. అఖిల్ చూపించిన ఈ పెద్ద మనసుకు అక్కినేని అభిమానులు కూడా పండుగ చేసుకుంటున్నారు. https://x.com/AnnapurnaStdios/status/2077448897509917038     Lenin Movie, Akhil Akkineni, Ayyagare Number One, Guntur Nagaraju, Akhil Fan  
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ (TheParadise). ‘దసరా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి క్రేజీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLVC) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ గ్లోబల్ యాక్షన్ డ్రామాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే, గత కొద్ది రోజులుగా ఈ సినిమా థియేట్రికల్ మరియు డిస్ట్రిబ్యూషన్ హక్కులకు సంబంధించిన రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలోనూ, కొన్ని వెబ్‌సైట్లలోనూ హల్చల్ చేస్తున్నాయి.  తాజాగా ఈ రూమర్లపై నిర్మాత సుధాకర్ చెరుకూరి అధికారికంగా స్పందిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  సినిమా బిజినెస్ పరంగా వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ ఎస్ఎల్‌వీసీ (SLVC) అధినేత సుధాకర్ చెరుకూరి ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు."ది ప్యారడైజ్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ఎలాంటి ప్రచారాలను, పుకార్లను నమ్మవద్దని మేం ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం. సినిమాకు సంబంధించిన ప్రతి అధికారిక అప్‌డేట్‌ను కేవలం మా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మాత్రమే తెలియజేస్తాం అని తెలిపారు సుధాకర్ చెరుకూరి.  సినిమా డిస్ట్రిబ్యూషన్ డీల్స్ పూర్తయ్యాయని, కొన్ని ఏరియాల రైట్స్ భారీ ధరలకు అమ్ముడయ్యాయంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత స్వయంగా రంగంలోకి దిగి వివరణ ఇవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా క్రేజీ సినిమాలకు సంబంధించి ఇలాంటి బిజినెస్ రూమర్స్ రావడం సర్వసాధారణమే అయినప్పటికీ, సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే ఇలాంటి తప్పుడు వార్తలు రావడం వల్ల బయ్యర్లలో అయోమయం నెలకొనే అవకాశం ఉంటుంది. అందుకే నిర్మాణ సంస్థ త్వరితగతిన స్పందించి ఈ ఊహాగానాలకు బ్రేక్ వేసింది. భారీ అంచనాలతో 'ది ప్యారడైజ్'‘ది ప్యారడైజ్’ సినిమా విషయానికి వస్తే, నాని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమిది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'ఆయా షేర్' (Aaya Sher) సాంగ్ మరియు 'రా స్టేట్‌మెంట్' (Raw Statement) గ్లింప్స్ ఇంటర్నెట్‌ను ఊపేసాయి. ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ రస్టిక్ పాత్రలో నటిస్తున్నారు. రాఘవ్ జుయాల్, మోహన్ బాబు, కాయాడు లోహర్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం పాన్-ఇండియా మాత్రమే కాకుండా గ్లోబల్ వైడ్‌గా ఎనిమిది భాషల్లో భారీగా విడుదల కానుంది.   సినిమా బిజినెస్ లేదా ప్రమోషన్ల విషయంలో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని, అన్నీ సరైన సమయంలో అధికారికంగా వెల్లడిస్తామని మేకర్స్ స్పష్టం చేశారు. కాబట్టి, నాని అభిమానులు, సినీ ప్రేమికులు సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక పోస్టులను మరియు గాసిప్స్ పట్టించుకోకుండా, కేవలం ఎస్ఎల్‌వీసీ (SLVC) అధికారిక ఖాతాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని స్పష్టమైంది. త్వరలోనే ఈ గ్లోబల్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఖండాతరాలు దాటించి, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మన సినిమా సత్తా చాటిన టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ దాటి పాన్ వరల్డ్ స్థాయిలో సరికొత్త రికార్డులు సృష్టించిన ఘనత జక్కన్నది. ప్రస్తుతం ఈ దర్శకధీరుడు సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకమైన యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'ని తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టును పక్కా ప్రణాళికతో, అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రాజమౌళి అండ్ టీమ్ శ్రమిస్తోంది. అయితే, ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మహేష్‌బాబుతో చేస్తున్న 'వారణాసి' తర్వాత రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టును ఏ హీరోతో చేయబోతున్నారు అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో జక్కన్న నెక్స్ట్ సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఉండబోతుందని ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగింది. అయితే ఆ వార్తలపై అల్లు అర్జున్ కానీ, రాజమౌళి టీమ్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఆ సస్పెన్స్ అలాగే ఉండిపోయింది. ఇదిలా ఉంటే, తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒక సరికొత్త కాంబినేషన్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సౌత్ ఇండియా వర్సటైల్ స్టార్ హీరో సూర్యతో కలిసి రాజమౌళి ఒక భారీ సినిమా చేయడానికి సానుకూలంగా ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్ గనుక సెట్ అయితే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే వీరిద్దరికీ సౌత్ తో పాటు నార్త్ బెల్ట్‌లో కూడా ఊహించని రేంజ్‌లో మార్కెట్, క్రేజ్ ఉన్నాయి. నిజానికి సూర్య మరియు రాజమౌళి కాంబినేషన్‌పై ఇలాంటి రూమర్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుందంటూ పలుమార్లు వార్తలు హల్‌చల్ చేశాయి. రాజమౌళి కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'మగధీర' చిత్రంలో హీరోగా మొదట సూర్య పేరునే పరిశీలించినట్లు అప్పట్లో ఒక బలమైన టాక్ నడిచింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ ఒకరికొకరు కథలు అనుకున్నట్లు వార్తలు వచ్చినా, అవి ఎప్పుడూ అధికారిక ప్రకటన వరకు వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత జక్కన్న-సూర్య కాంబో తెరపైకి రావడంతో సూర్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రాజమౌళి లేదా సూర్య కాంపౌండ్ నుండి ఎలాంటి అఫీషియల్ అప్‌డేట్ రాకపోయినప్పటికీ, ఈ క్రేజీ గాసిప్ మాత్రం ఇండస్ట్రీలో హాట్ కేకులా ప్రచారమవుతోంది. 'వారణాసి' ముగిసే సమయానికి ఈ కాంబోపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
  అఖిల్ అక్కినేని ‘లెనిన్' తో  బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు. త్వరలోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరబోతుండటంతో అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ వచ్చినట్లయింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు మనం ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మించిన లెనిన్ టాలీవుడ్‌ కి కూడా సరికొత్త జోష్ తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఈ సంచలన విజయాన్ని మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి చిత్ర బృందం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతమైన గుంటూరులో ఈ రోజు  బ్లాక్‌బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించనుంది. ఈ వేడుకలో  అఖిల్, భాగ్యశ్రీ బోర్సే, నాగార్జునతో పాటు చిత్ర యూనిట్ మొత్తం పాల్గొననుంది. గుంటూరు నగరం అక్కినేని నాగేశ్వరరావు దగ్గరనుంచి   అక్కినేని కుటుంబానికి భారీ ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న నగరం. నాగార్జునకి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ఫ్యాన్ బేస్ గుంటూరులో కూడా ఉంది. మూవీ ప్లాప్ అయితే కన్నీళ్లు పెట్టుకునే అభిమానులు ఉన్నారంటే అక్కినేని ఫ్యామిలీకి గుంటూరులో ఉన్న అభిమాన గణాన్ని అర్ధం చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా అఖిల్ కి అయ్యగారు అనే టాగ్ లైన్ ఇచ్చిన వీరాభిమాని కూడా గుంటూరు వాస్తవ్యుడే. ఈ నేపథ్యంలో లెనిన్ సెలబ్రేషన్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. Also read: యంగ్ హీరో ఖాతాలో 9 కోట్ల రూపాయలు.. వైరల్ అవుతున్న న్యూస్  akhil, lenin, bhagyashri borse, nagarjuna, guntur
సినిమా రంగంలో చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత కాలంలో వెండితెరపై హీరోలుగానో, హీరోయిన్లుగానో స్థిరపడిన వారిని మనం ఎందరినో చూశాం. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన అమ్మాయిలు చాలా వేగంగా హీరోయిన్లుగా మారిపోతుంటారు. అయితే, బాలనటులుగా గుర్తింపు తెచ్చుకున్న వారు కేవలం నటన వైపే అడుగులు వేయాలనే నియమమేమీ లేదు. సినిమా ఇండస్ట్రీలోనే తెర వెనుక ఉండే ఇతర కీలక విభాగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే అక్షయ్ బచ్చు. ఒకప్పుడు తెలుగు తెరపై తన క్యూట్ యాక్టింగ్‌తో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ఈ చిన్నారి, ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్యాస్టింగ్ డైరెక్టర్‌గా మారి సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. గతంలో కింగ్ నాగార్జున నటించిన సూపర్ హిట్ చిత్రం 'సంతోషం' సినిమాలో లక్కీ పాత్రలో నటించిన ఆ బుజ్జాయి అందరికీ బాగా గుర్తిండే ఉంటుంది. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుతో కలిసి 'బాయ్ బాయ్ హింసరాజు' అంటూ కళ్లద్దాలు పెట్టుకుని, బూరె బుగ్గలతో కనిపించిన ఆ అమాయకపు లుక్ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయింది. కేవలం సంతోషం సినిమా మాత్రమే కాకుండా, రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన బ్లాక్ బస్టర్ హిట్ 'వర్షం' సినిమాలో ప్రముఖ యాంకర్ సుమ కొడుకుగా, ప్రభాస్‌కు రీల్ మేనల్లుడిగా నటించి అప్పట్లో అక్షయ్ విపరీతమైన క్రేజ్ మరియు పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాలో తన చబ్బీ లుక్, నిష్కల్మషమైన చూపులతో చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వాంటెడ్' వంటి క్రేజీ హిందీ చిత్రాల్లో కూడా అక్షయ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, బాలనటుడిగా ఉన్న కాలంలోనే దాదాపు 45 కి పైగా ప్రముఖ కార్పొరేట్, కమర్షియల్ బ్రాండ్ల ప్రకటనలలో నటించి అక్షయ్ బచ్చు అప్పట్లోనే సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత తన ఉన్నత చదువులపై పూర్తి దృష్టి పెట్టడం కోసం కొన్నాళ్ల పాటు ఈ రంగుల ప్రపంచానికి, వెండితెరకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చాడు. చదువు పూర్తయిన తర్వాత తిరిగి చిత్ర పరిశ్రమలోకి సరికొత్త రూపంలో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అక్షయ్ బచ్చు లుక్ చూస్తే అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు కనిపిస్తుంది. ఒక హ్యాండ్సమ్ హీరోకి ఉండాల్సిన ఆకర్షణీయమైన ఫిజిక్, స్టైలిష్ లుక్, అన్ని రకాల లక్షణాలు ఇప్పుడు అతనిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ, అక్షయ్ అందరిలా హీరోగా మారాలనే రూట్ కాకుండా, తెర వెనుక ఉండి నటీనటులను ఎంపిక చేసే క్యాస్టింగ్ రంగాన్ని తన కెరీర్‌గా ఎంచుకుని సరికొత్త బాటలు వేసుకున్నాడు. హిందీ చిత్ర పరిశ్రమలో పలు బ్లాక్ బస్టర్ హిట్లు, క్రేజీ వెబ్ సిరీస్‌లకు క్యాస్టింగ్ డైరెక్టర్‌గా, అసోసియేట్‌గా వర్క్ చేస్తూ బాలీవుడ్‌లో మోస్ట్ బిజీ టాలెంట్‌గా మారిపోయాడు. హిందీలో భారీ విజయం సాధించిన 'సత్యమేవ జయతే 2', విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'రుద్ర', రాకెట్ బాయ్స్‌,  'ముంబై డైరీస్' వంటి ప్రతిష్టాత్మకమైన హిందీ ప్రాజెక్టులకు అక్షయ్ క్యాస్టింగ్ విభాగంలో అత్యంత కీలక పాత్ర పోషించి బాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. కేవలం క్యాస్టింగ్ డైరెక్టర్‌గానే కాకుండా, అక్షయ్‌లో ఒక అద్భుతమైన గాయకుడు కూడా దాగున్నాడు. పలు పాపులర్ సాంగ్స్ యొక్క కవర్ వెర్షన్స్ పాడుతూ, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాడు. ఒకప్పుడు కళ్లజోడు పెట్టుకుని, బొద్దుగా అమాయకంగా కనిపించిన ఈ చిన్నోడు, ఇప్పుడు స్టైలిష్ లుక్‌తో హ్యాండ్సమ్ హీరోలా గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో అతనికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్తులో ఈ టాలెంటెడ్ యువకుడు వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.
  టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. కేవలం కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోయే హీరోల కంటే, సినిమాకి  సంబంధించిన అన్ని విషయాలని  దగ్గరుండి చూసుకునే ఆల్‌రౌండర్లకే ఇండస్ట్రీలో క్రేజీ డిమాండ్ ఏర్పడింది. నటనతో పాటు సొంతంగా కథలు రాయడం, స్క్రీన్ ప్లే సమకూర్చడం, ఎడిటింగ్ టేబుల్ పై కూర్చోవడం, డైలాగ్స్ రాయడం వంటి మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలు ఉండాలి. ఆ విధంగా ఉండే  యువ నటుల వైపు దర్శక నిర్మాతలు మాత్రమే కాదు, దిగ్గజ ఓటీటీ సంస్థలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి.  తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఇలాంటి అరుదైన ప్రతిభ ఉన్న ఒక టాలెంటెడ్ యంగ్ హీరోకి  ఒక ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ ఏకంగా అక్షరాలా  9 కోట్ల భారీ ప్యాకేజీ ఆఫర్ చేసి సినిమా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సదరు యంగ్ హీరో కెరీర్‌ లోనే ఇదే అత్యధిక పారితోషికం కావడం కూడా  గమనార్హం. అయితే ఈ 9 కోట్ల రూపాయల భారీ డీల్ వెనుక ఒక ఆసక్తికరమైన కండిషన్ దాగి ఉంది. ఈ ఒప్పందం ప్రకారం, ఆ హీరో ఒక సరికొత్త కథని స్వయంగా సిద్ధం చేసుకోవాలి. ఆ కథకి  సరిగ్గా సరిపోయే ఒక ప్రతిభావంతుడైన దర్శకుడిని అతడే వెతికి ఎంపిక చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, అవసరమైతే ఆ చిత్రానికి తానే స్వీయ దర్శకత్వం  వహించి నటించాల్సి ఉంటుంది. నమ్మకమైన నిర్మాతను వెతికి తెచ్చే బాధ్యతని  కూడా ఓటీటీ సంస్థ సదరు హీరో భుజాలపైనే పెట్టింది. వీటన్నింటికీ ప్రతిఫలంగానే ఓటీటీ సంస్థ ఆ హీరోకు  9 కోట్లు సమర్పించుకోనుంది. ఈ డీల్‌కు ప్రతిగా సదరు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆ సినిమాకు సంబంధించిన పూర్తి ఓటీటీ హక్కులను తమ పేరిట రాయించుకుంటుంది. థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయంలో కూడా కొంత మేర వాటాను సొంతం చేసుకుంటుంది. మిగిలిన వ్యాపార లావాదేవీలు మరియు వాటాల లెక్కలను ఆ హీరో, అతను తీసుకువచ్చే ఒరిజినల్ నిర్మాత స్వయంగా మాట్లాడుకుని తేల్చుకుంటారు. ఈ విషయాలతో ఓటీటీ సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదు. ప్రస్తుతం సదరు యువ హీరో నటించిన ఒక క్రేజీ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయి ఫలితం తేలిన వెంటనే, ఈ సరికొత్త 9 కోట్ల ప్యాకేజీ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరిగి రాతకోతలు పూర్తవుతాయి. Also read: వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులని ఆ అగ్ర నిర్మాత ఎంత అమౌంట్ కి అడిగాడో తెలుసా!    సాధారణంగా ఈ రోజుల్లో ఒక కొత్త సినిమాకు థియేట్రికల్ విడుదలకు ముందే మంచి ఓటీటీ ఒప్పందం కుదరడం అంటే గగనమనే చెప్పాలి. అలాంటిది సినిమా పట్టాలెక్కక ముందే, కేవలం హీరో ప్రతిభను నమ్మి ఏకంగా  9 కోట్ల రూపాయల డీల్ కుదరడం తెలుగు చిత్రసీమలో ఒక అరుదైన రికార్డు. ఈ స్థాయిలో ఓటీటీ డీల్ ముందే ఖరారవ్వడంతో, అతనితో సినిమా చేయడానికి ఏ నిర్మాత అయినా రెడ్ కార్పెట్ పరచడం ఖాయం. పైగా ఆ హీరో వెనుక ఇప్పటికే ఇద్దరు ముగ్గురు అగ్ర నిర్మాతలు సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.   
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో 111వ సినిమా 'NBK 111'ను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'వీరసింహారెడ్డి' కాంబినేషన్ లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే టాలీవుడ్ సర్కిల్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ దశలో ఉన్నప్పుడే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ గురించి ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇటీవల బాలకృష్ణ సినిమాల డిజిటల్ రైట్స్ ను హాట్‌స్టార్ లేదా నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలే ఎక్కువగా సొంతం చేసుకుంటాయి. అయితే, 'NBK 111' విషయంలో ఈసారి సమీకరణాలు మారుతున్నట్లు కనిపిస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, జీ 5 (ZEE5) సంస్థ ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను దక్కించుకోవడానికి అత్యంత ఆసక్తిని చూపుతోంది. ఈ సంస్థ బాలకృష్ణ సినిమా కోసం ఒక ఫ్యాన్సీ ఆఫర్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు, ఈ సినిమా ఓటీటీ హక్కులు రూ. 50 కోట్లకు పైగా భారీ ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఎస్.ఎస్. థమన్ తన సంగీతంతో మరో మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.     Nandamuri Balakrishna, NBK 111 Movie, OTT Deal  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.. బయట ఎన్ని సమస్యలు ఉన్నా,  ఎంత ఇబ్బందులు ఎదుర్కున్నా ఇంటికి రాగానే సంతోషం బోలెడు ప్రశాంతత,  జీవితంలో ఊరట కలుగుతోంది అంటే.. ఆ కుటుంబం ఎంతో ఆరోగ్యంగా ఉందని అర్థం. కానీ కొన్ని కుటుంబాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు. ఇలా ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోతే కుటుంబ సభ్యులు చాలా వరకు మానసికంగా డిస్టర్బ్ అవుతుంటారు. అయితే  కుటుంబ వాతావరణం అనారోగ్యంగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో తరాల అంతరం వల్ల కుటుంబంలో వాతావరణం సరిగా లేకుండా ఉండే అవకాశం ఉంది, అలాగే కుటుంబ అలవాట్ల వల్ల కూడా వాతావరణం దెబ్బతింటుంది. కానీ కుటుంబ జీవితంలో నిర్లక్ష్యం చేయకూడని విషయాలు కొన్ని ఉన్నాయి.  వాటిని తెలుసుకుంటే.. కుటుంబం తిరిగి ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.  ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. ఎమోషన్స్ దుర్వినియోగం.. కుటుంబంలో సులభంగా గుర్తించగలిగే ప్రమాదకరమైన విషయాలు ఏవీ ఉండవు. కానీ చాలా సున్నితంగా ఉంటూనే మనుషుల్ని బాధపెడతారు. ఎమోషన్స్ తో ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యులు తమదే తప్పు అన్న భావనను కుటుంబంలో  వ్యక్తికి కలిగిస్తారు. కొన్నిసార్లు, వారు బాధితులుగా నటిస్తూ ఎదుటివారిని ఎక్కువగా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాతావరణం ఉన్న ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం, సంతోషం ఉండవు. నిర్ణయాల దగ్గర బంధనం..  కుటుంబంలో జీవిత నిర్ణయాల గురించి మిమ్మల్ని అడగకుండా, తమకు తాము నిర్ణయాలు తీసుకుని ఆఖరిగా మీకు చెబుతూ ఉంటే.. ఒకవేళ అదే నిజమైతే, ఇది నిర్లక్ష్యం చేయకూడని విషయమని లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు. . ఈ నియంత్రణ చిన్నతనం నుండి కౌమారదశ వరకు ఆరోగ్యకరంగానే ఉంటుంది. , కానీ  పెద్దయ్యాక కుటుంబ సభ్యుల నుండి ఇదే వైఖరి కొనసాగడం మంచిది కాదు. హద్దులు లేకపోవడం.. ప్రతిఒక్కరూ ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించుకున్నప్పుడే కుటుంబ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. అలా చేయడంలో విఫలమైతే, కాలక్రమేణా విషపూరితమైన సంబంధాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా, ఈ విషయాలు  వ్యక్తి యొక్క భావోద్వేగ ఎదుగుదలకు చాలా కీలకమైనవి. గొడవల పరిష్కారం.. పరిష్కారం కాని కుటుంబ వివాదాలు చాలా కుటుంబాలలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి పదేపదే మరో వాదనకు లేదా ఘర్షణకు దారితీసి, పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి. దీనివల్ల, ఆ విషయం పరిష్కారమైన తర్వాత కూడా ఎమోషనల్ దూరం పెరగవచ్చు. పట్టించుకోకపోవడం.. కుటుంబంలో మీ భావాలను లేదా అభిప్రాయాలను ఎప్పుడూ  పట్టించుకోవడం జరిగితే అది కుటుంబ సభ్యుల నుండి దూరాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఎప్పుడైతై ఎమోషనల్ సపోర్ట్ లేదా అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం జరుగుతుందో అప్పుడు ఆ ఇంట్లో వ్యక్తి పరాయివాడుగా ఫీలవుతారు.                                     *రూపశ్రీ.  
తండ్రిలో ఉండే ఈ అలవాట్లు  పిల్లలను బలహీనులను చేస్తాయ్ పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలు కేవలం వినడం ద్వారానే కాకుండా, తమ చుట్టూ ఉన్నవారి ప్రవర్తనను గమనించడం ద్వారా కూడా నేర్చుకుంటారు.  తండ్రి  రోజువారీ అలవాట్లే  అతని పిల్లల భవిష్యత్తును పాజిటివ్ గా ఉండాలా లేదా నెగిటివ్ గా ఉండాలా అనే విషయం డిసైడ్ చేస్తాయి.  ఇది ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం.. తండ్రి అలవాట్లు పిల్లలను బలహీనంగా కూడా మారుస్తాయి.  తండ్రిలో ఉండే ఏ అలవాట్లు పిల్లలను బలహీనులను చేస్తాయో  తెలుసుకుంటే.. ప్రతి చిన్న విషయానికి తిట్టడం లేదా కోపగించుకోవడం... ఎప్పుడూ తిట్టడం లేదా గట్టిగా మాట్లాడటం వల్ల పిల్లలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సంకోచించవచ్చు. తండ్రి ఇలా ఉండే పిల్లలు తండ్రికి భయపడతారు,  చాలామంది తండ్రి అంటే పిల్లలకు భయం ఉండాలని అనుకుంటారు, కానీ పిల్లలు మనసు విప్పి ఏదైనా మాట్లాడగలిగినప్పుడు, చెప్పగలిగినప్పుడు వారి మనసులో ఉండే ఎన్నో సందేహాలు,  దిగులు భయాలు తొలగిపోతాయి. ఏం చేయాలి? పిల్లలు ఏదైనా చెప్పేటప్పుడు ముందు మొత్తం వినాలి, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దాని గురించి చెప్పేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి,  పిల్లల వ్యక్తిత్వం గురించి కాకుండా, వారి ప్రవర్తన గురించి మాట్లాడాలి.  పోలిక.. "చూడు, నీ స్నేహితుడు నీకంటే గొప్పవాడు"  చుట్టాలబ్బాయికి నీ కంటే మంచి మార్కులు వచ్చాయి,  ఆ పిల్లాడు నీ కంటే చాలా బెటర్.. ఇలాంటి మాటలు చెప్పడం పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఏం చేయాలి? పిల్లలను పోల్చకూడదు,  ప్రతి పిల్లవాడిలో విబిన్న ప్రతిభ ఉంటుంది,  పిల్లలలో ఉన్న ప్రతిభ ఏంటో గుర్తించి ప్రోత్సహించాలి. చిన్న ప్రయత్నాలను సైతం అభినందించాలి,  పోల్చకుండా స్ఫూర్తినివ్వాలి. సమయం కేటాయించకపోవడం.. తీరికలేని  కారణంగా, కొన్నిసార్లు పిల్లలతో గడిపే నాణ్యమైన సమయం  చాలామంది తండ్రులకు  తగ్గిపోతుంది. ఇది ఎంత మాత్రం పిల్లలు భరించలేని విషయం. ఏం చేయాలి? ప్రతిరోజూ మొబైల్ కాకుండా  పిల్లలతో కొంత సమయం గడపాలి,  కలిసి ఆడుకోవడం, చదవడం లేదా కబుర్లు చెప్పుకోవడం చేయాలి. పిల్లలకు ఏ విషయాల మీద ఆసక్తి ఉంటుందో వాటిలో పార్టిసిపేట్ చేయాలి. మాట తప్పడం.. తండ్రి పదేపదే తన పిల్లలకు ఇచ్చిన మాటను  నెరవేర్చడంలో విఫలమైతే, పిల్లల నమ్మకం బలహీనపడుతుంది. ఏం చేయాలి? తండ్రి  నెరవేర్చగల ప్రామిస్ లను మాత్రమే పిల్లలకు చేయాలి. . ప్రణాళికలు మారితే, కారణం వివరించాలి. నిజాయితీకి, నమ్మకానికి ఆదర్శంగా ఉండాలి. పిల్లల ఎమోషన్స్ పట్టించుకోకపోవడం.. పిల్లలు ఏడుస్తున్నప్పుడు, బాధపడినప్పుడు,  అలిగినప్పుడు వారిని పట్టించుకోవాలి. . లేకపోతే వారు మానసికంగా చాలా దెబ్బతింటారు. తమకు ప్రాముఖ్యత లేదని అనుకుంటారు. ఏం చేయాలి? పిల్లల ఎమోషన్స్ ను గుర్తించాలి, వారి బాధను, వారు చెప్పే విషయాలను  ఓపికగా వినాలి. సమస్యకు కలిసి పరిష్కారం కనుగొందామని వారిని ఊరడించాలి.   చెడు ప్రవర్తన.. పిల్లలు తరచుగా ఇంట్లో చూసే వాటి నుండే నేర్చుకుంటారు. ఏ విషయాలను గుర్తుంచుకోవాలి? ఏవి మరచిపోవాలి, ఏ పనులు చేయాలి, ఏవి చేయకూడదు.. అందరితో మర్యాదగా ఎలా ఉండాలి?  ఇలాంటి విషయాలు పిల్లలకు వివరించాలి.  సామాజికంగా ఎలా ఉండాలో తెలియజెప్పాలి. నిర్ణయాలు.. పిల్లలకు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశం ఎప్పుడూ లభించకపోతే, వారి ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందడానికి ఆటంకం కలగుతుంది. ఏం చేయాలి? వయసుకు తగిన చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి,  నిర్ణయాలు తీసుకునే ముందు ఏం ఆలోచించాలో పిల్లలకు వివరించాలి. చదువు మాత్రమే కాదు.. మంచి మార్కులు ముఖ్యమే కావచ్చు, కానీ పిల్లల పూర్తిగా అభివృద్ధి  చెందడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. ఏం చేయాలి? క్రీడలు, కళలు , సృజనాత్మక కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.  ఫలితాన్ని మాత్రమే కాకుండా, చేసిన ప్రయత్నాన్ని కూడా అభినందించాలి.  నేర్చుకోవడంలో ఉన్న ఆనందాన్ని పిల్లలకు తెలిజెప్పాలి.                                        *రూపశ్రీ.  
కుటుంబ వాతావరణం ఆరోగ్యంగా ఉందా లేదా?  ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.. బయట ఎన్ని సమస్యలు ఉన్నా,  ఎంత ఇబ్బందులు ఎదుర్కున్నా ఇంటికి రాగానే సంతోషం బోలెడు ప్రశాంతత,  జీవితంలో ఊరట కలుగుతోంది అంటే.. ఆ కుటుంబం ఎంతో ఆరోగ్యంగా ఉందని అర్థం. కానీ కొన్ని కుటుంబాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు. ఇలా ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోతే కుటుంబ సభ్యులు చాలా వరకు మానసికంగా డిస్టర్బ్ అవుతుంటారు. అయితే  కుటుంబ వాతావరణం అనారోగ్యంగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో తరాల అంతరం వల్ల కుటుంబంలో వాతావరణం సరిగా లేకుండా ఉండే అవకాశం ఉంది, అలాగే కుటుంబ అలవాట్ల వల్ల కూడా వాతావరణం దెబ్బతింటుంది. కానీ కుటుంబ జీవితంలో నిర్లక్ష్యం చేయకూడని విషయాలు కొన్ని ఉన్నాయి.  వాటిని తెలుసుకుంటే.. కుటుంబం తిరిగి ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.  ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. ఎమోషన్స్ దుర్వినియోగం.. కుటుంబంలో సులభంగా గుర్తించగలిగే ప్రమాదకరమైన విషయాలు ఏవీ ఉండవు. కానీ చాలా సున్నితంగా ఉంటూనే మనుషుల్ని బాధపెడతారు. ఎమోషన్స్ తో ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యులు తమదే తప్పు అన్న భావనను కుటుంబంలో  వ్యక్తికి కలిగిస్తారు. కొన్నిసార్లు, వారు బాధితులుగా నటిస్తూ ఎదుటివారిని ఎక్కువగా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాతావరణం ఉన్న ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం, సంతోషం ఉండవు. నిర్ణయాల దగ్గర బంధనం..  కుటుంబంలో జీవిత నిర్ణయాల గురించి మిమ్మల్ని అడగకుండా, తమకు తాము నిర్ణయాలు తీసుకుని ఆఖరిగా మీకు చెబుతూ ఉంటే.. ఒకవేళ అదే నిజమైతే, ఇది నిర్లక్ష్యం చేయకూడని విషయమని లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు. . ఈ నియంత్రణ చిన్నతనం నుండి కౌమారదశ వరకు ఆరోగ్యకరంగానే ఉంటుంది. , కానీ  పెద్దయ్యాక కుటుంబ సభ్యుల నుండి ఇదే వైఖరి కొనసాగడం మంచిది కాదు. హద్దులు లేకపోవడం.. ప్రతిఒక్కరూ ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించుకున్నప్పుడే కుటుంబ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. అలా చేయడంలో విఫలమైతే, కాలక్రమేణా విషపూరితమైన సంబంధాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా, ఈ విషయాలు  వ్యక్తి యొక్క భావోద్వేగ ఎదుగుదలకు చాలా కీలకమైనవి. గొడవల పరిష్కారం.. పరిష్కారం కాని కుటుంబ వివాదాలు చాలా కుటుంబాలలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి పదేపదే మరో వాదనకు లేదా ఘర్షణకు దారితీసి, పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి. దీనివల్ల, ఆ విషయం పరిష్కారమైన తర్వాత కూడా ఎమోషనల్ దూరం పెరగవచ్చు. పట్టించుకోకపోవడం.. కుటుంబంలో మీ భావాలను లేదా అభిప్రాయాలను ఎప్పుడూ  పట్టించుకోవడం జరిగితే అది కుటుంబ సభ్యుల నుండి దూరాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఎప్పుడైతై ఎమోషనల్ సపోర్ట్ లేదా అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం జరుగుతుందో అప్పుడు ఆ ఇంట్లో వ్యక్తి పరాయివాడుగా ఫీలవుతారు.                                     *రూపశ్రీ.  
గట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి? కడుపు ఆరోగ్యం మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుందో తెలుసా? మన శరీర ఆరోగ్యానికి గట్ (Gut) ఎంత ముఖ్యమో చాలా మందికి పూర్తిగా తెలియదు. మన పేగుల్లో కోట్లాది సూక్ష్మజీవులు (Microbiome) నివసిస్తుంటాయి. వీటిలో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా మధ్య సరైన సమతుల్యత ఉండటం ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఈ సమతుల్యత దెబ్బతింటే దానిని డిస్బయాసిస్ (Dysbiosis) అంటారు. దీని వల్ల జీర్ణ సమస్యలతో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ Dr. Rakesh Kalapala గారు గట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి? అది మన శరీరంలో ఎలా పనిచేస్తుంది? మంచి బ్యాక్టీరియా పాత్ర ఏమిటి? చెడు బ్యాక్టీరియా పెరిగితే ఎలాంటి సమస్యలు వస్తాయి? వంటి విషయాలను సులభమైన భాషలో వివరించారు. అలాగే గట్ హెల్త్‌కు మెదడు (Gut-Brain Connection)తో ఉన్న సంబంధం, లివర్, ప్యాంక్రియాస్ వంటి ముఖ్యమైన అవయవాల పనితీరుపై గట్ ఆరోగ్యం ఎలా ప్రభావం చూపుతుందో వివరించారు. తరచూ గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎందుకు వస్తాయి? వాటిని ఎలా గుర్తించాలి? ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు? అనే అంశాలపై కూడా అవగాహన కల్పించారు. గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారం, ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలు, పులియబెట్టిన ఆహారాలు (Fermented Foods), ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్, తగినంత నీరు తాగడం, వ్యాయామం, సరైన నిద్ర, ఒత్తిడిని తగ్గించడం వంటి జీవనశైలి మార్పుల ప్రాముఖ్యతను వివరించారు. అంతేకాకుండా యాంటీబయోటిక్స్‌ను అవసరం లేకుండా తరచూ వాడటం వల్ల గట్ మైక్రోబయోమ్ ఎలా దెబ్బతింటుందో, ఏ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించాలో కూడా స్పష్టంగా తెలియజేశారు. గట్ ఆరోగ్యంపై శాస్త్రీయమైన, ఉపయోగకరమైన సమాచారం తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: గట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి? మంచి బ్యాక్టీరియా – చెడు బ్యాక్టీరియా మధ్య సమతుల్యత డిస్బయాసిస్ అంటే ఏమిటి? దాని ప్రభావాలు గట్-బ్రెయిన్ కనెక్షన్ ఎలా పనిచేస్తుంది? గట్ ఆరోగ్యం లివర్, ప్యాంక్రియాస్‌పై చూపే ప్రభావం గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కారణాలు గట్ హెల్త్‌ను మెరుగుపరిచే ఆహారం మరియు జీవనశైలి ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
వర్షాకాలంలో ఈ పప్పుధాన్యాలను తినకూడదు..! వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది, కానీ ఆహారం , పానీయాల విషయంలో మరింత  జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో పెరిగిన తేమ కారణంగా, బ్యాక్టీరియా , ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి, ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పప్పుధాన్యాలు ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.  పప్పుధాన్యాలలో ప్రోటీన్, ఫైబర్ , అనేక పోషకాలు సమృద్దిగా ఉంటాయి. అయితే  అన్ని రకాల పప్పుధాన్యాలు అన్ని కాలాల్లోనూ సులభంగా జీర్ణం కావు. వర్షాకాలంలో కొన్ని పప్పుధాన్యాలు గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం , జీర్ణ సమస్యలను పెంచుతాయి. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు వర్షాకాలంలో పప్పుధాన్యాలు తినేటప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ఏ పప్పుధాన్యాలను తినకూడదో , మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే.. నల్ల మినుములు.. మినుములను ఉద్దిపప్పు అని కూడా అంటారు. ఇవి చాలా పోషకమైనవి,  ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉన్నవి.  అయినప్పటికీ మినుములు శరీరానికి భారంగా అనిపిస్తాయి. చాలా నెమ్మదిగా జీర్ణం అవుతాయి.  వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం వల్ల, చాలా మంది జీర్ణవ్యవస్థ సాధారణం కంటే బలహీనపడుతుంది. అందువల్ల, మినుములను అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం , భారంగా అనిపించడం వంటి కడుపు సమస్యలు వస్తాయి.  ఒకవేళ వీటిని తినాలనుకుంటే, బాగా నానబెట్టి, తినే ముందు ఉడికించుకోవాలి. ఇంగువ, జీలకర్ర , అల్లం వంటి పదార్థాలను ఉపయోగించడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. శనగలు.. శనగలు ప్రోటీన్ , ఫైబర్‌కు మంచి మూలం, కానీ వాటిని అధిక పరిమాణంలో తినడం వల్ల కొంతమందికి సమస్యలు రావచ్చు. వర్షాకాలంలో జీర్ణక్రియ నెమ్మదిగా ఉండటం వల్ల, జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. శనగలను అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం , కడుపులో బరువుగా అనిపించడం వంటివి కలగవచ్చు. ముందు నుంచే గ్యాస్ లేదా పేగు సంబంధిత సమస్యలు ఉన్నవారు వీటిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.  శనగలను తినడానికి కొన్ని గంటల ముందు నానబెట్టి, ఆ తర్వాత బాగా ఉడికించుకోవడం మంచిది. అంతేకాదు.. శనగలను  తేలికపాటి మసాలాలతో వండటం వల్ల జీర్ణ సంబంధిత ఇబ్బందులను  తగ్గించుకోవచ్చు. రాజ్మా బీన్స్.. రాజ్మా బీన్స్ చాలా మందికి ఇష్టమైన వంటకం . ఇవి ప్రోటీన్, ఐరన్, ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. అయితే, ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉండే అవకాశం ఉన్నప్పుడు, రాజ్మా బీన్స్ తినడం వల్ల కొంతమందిలో గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం , ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. రాజ్మా బీన్స్‌ను ఎప్పుడూ తొందరగా వండెయ్యాలని, తక్కువ సమయం నానబెట్టడం, సరిగ్గా ఉడికించకుండా వండటం వంటివి చేయకూడదు.  వాటిని కనీసం 8 గంటల పాటు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత బాగా ఉడికించాలి. సరిగ్గా ఉడకని రాజ్మా  బీన్స్‌ సరిగ్గా అరకపోవడం,  కడుపు  నొప్పి వంటి సమస్యలకు కారణమవుతాయి. వర్షాకాలంలో పప్పుధాన్యాలు తినేటప్పుడు జాగ్రత్తలు..  పప్పులను తినే ముందు శుభ్రంగా కడగాలి,  పప్పు ధాన్యాలను తగినంత సమయం పాటు నానబెట్టి ఉడికించాలి.  మసాలాలు, నూనె ఎక్కువగా వాడకూడదు.  ఇది జీర్ణ ప్రక్రియను ఇబ్బంది పెడుతుంది.  తాజాగా వండిన పప్పు ధాన్యాలను  మాత్రమే తినాలి, ఎక్కువ కాలం నిల్వ ఉంచిన వాటిని  తినకూడదు.  పప్పు ధాన్యాలను వండేటప్పుడు అల్లం, జీలకర్ర, ఇంగువ వంటి మసాలాలను కలుపుకోవచ్చు, ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి.                                        *రూపశ్రీ.  
అజినమోటో  ఆరోగ్యానికి మంచిదేనా?  చౌ మెయిన్, మోమోస్, ఫ్రైడ్ రైస్, మంచూరియన్, పిజ్జా.. ఇవి మాత్రమే కాకుండా  అనేక ఇతర చైనీస్ స్ట్రీట్ ఫుడ్స్ లో  ఆహారాల రుచిని మెరుగుపరచడానికి అజినోమోటోను తరచుగా ఉపయోగిస్తారు. దీని అసలు పేరు మోనోసోడియం గ్లుటామేట్ (MSG), ఇది కూడా ఒక రుచిని పెంచే పదార్థమే. అయితే దీని గురించి  చాలా కాలంగా చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి. పరిశోధన ప్రకారం, చాలా మంది ఆరోగ్యవంతులకు అజినమోటో మితమైన మోతాదులో తీసుకోవడం మంచిదే, కానీ కొంతమందిలో, దీన్ని తీసుకోవడం వల్ల  తలనొప్పి, దాహం, వేడి ఆవిర్లు, వికారం లేదా అసౌకర్యం వంటి లక్షణాలను కలుగుతాయి. అసలు అజినోమోటో అంటే ఏమిటి, దాని వినియోగం ఎప్పుడు హానికరంగా మారుతుంది?  ఎవరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి  వైద్యులు చెప్పిన నిజాలేంటో తెలుసుకుంటే.. అజినమోటో.. అజినోమోటో  రసాయన నామం మోనోసోడియం గ్లుటామేట్ (MSG). ఇది ఆహార రుచిని మెరుగుపరచడానికి ఉపయోగించే ఒక ఫ్లేవర్ ఎన్‌హాన్సర్. ఇది గ్లుటామేట్ యొక్క ఒక రూపం, ఇది టమోటాలు, చీజ్ , పుట్టగొడుగులు వంటి కొన్ని ఆహారాలలో సహజంగా కూడా లభిస్తుంది. అజినమోటో ఎక్కువ వాడితే కలిగే సమస్యలు.. తలనొప్పి , అసౌకర్యం.. అజినమోటో అధికంగా ఉండే ఆహారాలు తిన్న తర్వాత కొంతమందికి తలనొప్పి, ముఖం ఎర్రబడటం, చెమట పట్టడం లేదా అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే ఇది అందరిలోనూ జరగదు. సోడియం.. అజినోమోటోలో సోడియం ఉంటుంది. దీనిని అధిక ఉప్పు ఉన్న ఆహారాలతో తరచుగా తీసుకుంటే, మొత్తం సోడియం తీసుకోవడం పెరుగుతుంది, ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి మంచిది కాదు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం తినడం.. ప్రాసెస్ చేసిన , ఫాస్ట్ ఫుడ్స్‌లో తరచుగా అజినమోటో ను  ఉపయోగిస్తారు. అలాంటి ఆహారాలలో ఉప్పు, నూనె , కేలరీలు కూడా అధికంగా ఉంటాయి, దీనివల్ల బరువు పెరగడం , ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరగవచ్చు. సెన్సిటివిటీ ఉన్నవారికి అసౌకర్యం.. కొంతమందికి అజినమోటో తీసుకుంటే సెన్సిటివిటీ రియాక్షన్ ఉంటుంది అలాంటి వ్యక్తులు అధిక మొత్తంలో తీసుకున్న తర్వాత వికారం, నీరసం, దాహం లేదా తేలికపాటి అసౌకర్యం కలుగుతుంది. ఇలా పదేపదే జరిగితే, వైద్యుడిని సంప్రదించడం మంచిది. అజినమోటో విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలి? అధిక రక్తపోటు ఉన్న రోగులు,  మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారు,  రక్తపోటు  అధికంగా ఉండే   వ్యక్తులు, చిన్న పిల్లలు మొదలైనవారు అజినమోటో విషయంలో జాగ్రత్తగా ఉండాలి.                                     *రూపశ్రీ.