ఏపీలో ఇప్పుడు డీఎస్సీ లో అక్రమాలకు వ్యతిరేకంగా  వైసీపీ చేపట్టిన నిరసనలు, దీక్షలు రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి కోసం డిస్పరేట్ గా చేస్తున్న ప్రయత్నాలుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. కాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా కొద్ది కొద్దిగా క్రియాశీలంగా మారుతున్నారు. వారం అంతా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమై చుట్టపు చూపుగ వారంతంలో ఓ సారి రాష్ట్రానికి వస్తున్న జగన్.. డీఎస్సీకి వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చారు. బహుశా రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత తన జైలుపరామర్శ యాత్రలు కాకుండా.. పార్టీ  ఓ కార్యక్రమం చేపట్టేలా జగన్ ఇచ్చిన తొలి పిలుపు ఇదే కావచ్చు. అధినేత జగన్ స్వయంగా పిలుపునివ్వడం వల్ల.. ఆ పార్టీ సీనియర్లు కూడా కొద్ది సేపు తన రాజకీయ అజ్ణాత వాసానికి విరామం ప్రకటించి జనంలోకి వచ్చారు. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన నిరసనలు, దీక్షలలో ఆ పార్టీ సీనియర్ నేతలు, జగన్ అధికారంలో ఉండగా ప్రభుత్వంలో, పార్టీలో కీలకంగా వ్యవహరించి, ఫైర్ బ్రాండ్ మహిళా నేతలుగా గుర్పింపు పొందిన రోజా, విడదల రజనీ వంటి వారు కూడా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.  అయితే ఇక్కడ వైసీపీ మిస్సయిన లాజిక్ ఏమిటంటే. మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు. వైసీపీ చేపట్టిన నిరసన, దీక్షలు పూర్తిగా అసంబద్ధమనీ, జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఒక్కటంటే ఒక్క ఉద్యోగ ప్రకటన వెలువడలేదని ఈ సందర్భంగా ఈ సందర్భంగా యువత పేర్కొన్నారు. అది పక్కన పెడితే.. స్వయంగా తాను ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్న నిరసనలలో జగన్ ఎక్కడా కనిపించలేదు.  దీంతో వైసీపీ నిరసనలు తుస్సు మన్నాయి. జగన్ గైర్హాజర్ తో ఈ నిరసన కార్యక్రమానికి మీడియా కూడా ఏమంత ప్రాధాన్యత ఇవ్వలేదు. నెటిజనులు కూడా పట్టించుకోలేదు. దీంతో వైసీపీ నిరసనలకు  పొలిటికల్ గా ప్రాధాన్యతా లభించలేదని పరిశీలకులు అంటున్నారు. రోజా, విడదల రజని వంటి వారు బయటకు వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ.. వారి ప్రసంగాలలో మునుపటి ఫైర్ కనిపించలేదు. జగన్ పిలుపునిచ్చారు కనుక ఓ సారి ముఖం చూపిస్తే సరిపోతుందన్నట్లుగా వారి తీరు ఉంది.  దీంతో ఉనికి కోసం చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  YS Jagan Mohan Reddy, YSRCP Protests, AP DSC Irregularities, AP Political News, Jagan Absence
ప్రకాశం జిల్లాలో కూటమి పార్టీల మధ్య చిచ్చు రేగింది. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమిలో భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మ మధ్య ఒంగోలులో ఏర్పడిన విభేదాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఇరు పార్టీల నేతలూ రెచ్చి పోతున్న తీరు జిల్లాలో పొలిటికల్ హీట్ ను అమాంతంగా పేంచేసింది.  ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.    ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో బాలినేని పై  ఆరోపణలు గుప్పించారు. బాలినేని పేరుకే జనసేనలో ఉన్నారనీ, అయితే వైసీపీ తరఫునే, వైసీపీ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలినేని 2024 ఎన్నికల తరువాత వైసీపీకి గుడ్ బై చెప్ప జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ.. దామచర్ల.. బాలినేని వైసీపీ కోసం పని చేస్తున్నారంటూ ఆరోపించారు.  అలాగే తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే లక్ష్యంతో బాలినేని అనుచరుల ద్వారా కరపత్రాలు పంపిణీ చేయించారన్నారు.  కూటమి ధర్మాన్ని పాటిస్తూ.. ఇంత కాలం ఓర్పుగా ఉన్నానన్న దామచర్ల.. తన ఓర్పును బాలినేని బలహీనతగా భావించి రెచ్చిపోవాలని చూస్తుండటంతో ఇక భరించలేకే బాహాటంగా బాలినేని తీరును బయటపెట్టానన్నారు.  బాలినేని రౌడీయిజాన్ని ఉపేక్షించబోనని హెచ్చరించారు.  తనపై బాలినేని వర్గీయులు చేసిన అక్రమ వసూళ్ల ఆరోపణలు  నిరూపించాలని సవాల్ చేశారు.  ఈ క్రమంలో దామచర్ల బాలినేని కుమారుడు స్థానిక యువతను గంజాయి లాంటి తీవ్ర దురలవాట్లకు గురిచేశారని సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, యువత భవిష్యత్తును నాశనం చేసేలా గతంలో కొందరు వ్యవహరించారనీ,  కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలులో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు తాము కృషి చేస్తుంటే, కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు.   కూటమి పార్టీల అగ్రనాయకత్వం స్పష్టమైన అవగాహనతో ఐక్యంగా ముందుకు సాగుతున్నా,  ఒంగోలు నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం, జనసేన స్థానిక నాయకులు, శ్రేణుల మధ్య   సమన్వయం కుదరడం లేదన్న మాట చాలా కాలంగా వినిపిస్తూ వస్తోంది. ఇప్పుడు దామచర్ల బాలినేపిపై చేసిన ఆరోపణలు, విమర్శలు ఒంగోలులో కూటమి పార్టీల మధ్య సమన్వయ లేమికి అద్ధం పడుతున్నాయి.     ఎమ్మెల్యే దామచర్ల చేసిన తీవ్ర ఆరోపణలపై బాలినేని శ్రీనివాసరెడ్డి లేదా ఆయన వర్గం ఎలా స్పందిస్తుందనేది ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయంలో ఉత్కంఠగా మారింది. ఇరు పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు కలసి పనిచేస్తున్న వేళ, క్షేత్రస్థాయిలో సీనియర్ నేతల మధ్య సాగుతున్న ఈ శత్రుత్వం ఎటు దారితీస్తుందోనని స్థానిక ప్రజలు, కూటమి శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అధిష్ఠానం త్వరితగతిన దిద్దుబాటు చర్యలు చేపట్టి, ఒంగోలులో ప్రశాంత రాజకీయ వాతావరణాన్ని పునరుద్ధరించాలని నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు. Damacharla Janardhan, Balineni Srinivasa Reddy,  Ongole politics, TDP Janasena alliance, Prakasam district politics, TeluguOne
ఆంధ్రప్రదేశ్   ఐటీ, ఎలక్ట్రానిక్స్  విద్యా శాఖ  మంత్రి నారా లోకేష్‌ రైజింగ్ స్టారా? అంటే..  ప్రముఖ జాతీయ వ్యాపార  పత్రిక 'ఫార్చ్యూన్ ఇండియా' ఔననే అంటోంది. ఆ పత్రిక తన ఆగస్టు 2026 సంచిక కవర్ స్టోరీలో మంత్రి లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ రైజింగ్ స్టార్ గా అభివర్ణించింది.  యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.  2024 లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ చేపడుతున్న   విధివిధానాలు, తీసుకుంటున్న  నిర్ణయాలు రాష్ట్రంలో నూతన శకానికి నాంది పలుకుతున్నాయని పేర్కొంది. 2024లో ఐటీ, ఎలక్ట్రానిక్స్,  విద్యా శాఖల మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన క్షణం నుంచీ  నారా లోకేష్ రాష్ట్రాన్ని పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. విశాఖపట్నంలో   గూగుల్   ప్రాజెక్టు ఏపీ సాంకేతిక విప్లవానికి ఒక మైలురాయిగా నిలిచింది.  అలాగే..  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, ఆటోమోటివ్ రంగాల్లో విదేశీ, స్వదేశీ దిగ్గజ సంస్థల నుంచి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తూ పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నారని ఫార్చ్యూన్ ఇండియా కథనం ప్రస్తుతించింది. విదేశీ పర్యటనల ద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్లను కలవడం లోకేష్ కార్యాచరణలో భాగమైంది. ఇటీవలి దక్షిణ కొరియాలో పర్యటనలో లోకేష్,  ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, బ్యాటరీ తయారీ,   ఎలక్ట్రానిక్ రంగాలకు చెందిన అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. కేవలం ఒప్పందాల స్థాయిలోనే కాకుండా, కంపెనీలకు అవసరమైన   అనుమతులు,  మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఆయన తీసుకుంటున్న సత్వర నిర్ణయాలు ఏపీ పారిశ్రామిక రంగ పురోగతికి ఎంతగానో దోహదం చేస్తున్నాయి.  అదే విధంగా విద్యా రంగంలో కూడా నారా లోకేష్   కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయుల బదలీల్లో పారదర్శకత తీసుకురావడం, మెగా డీఎస్సీ ద్వారా వేల సంఖ్యలో   టీచర్ పోస్టులను భర్తీ చేయడం, పాఠశాలలకు  రేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి చర్యలతో పాఠశాల విద్య నాణ్యతను పెంచే సమగ్ర ప్రణాళిక  అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత  పెంచడంతో పాటు, విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగిన స్కిల్స్  అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా లోకేష్ ముందుకు సాగుతున్నారు.  గతంలో అంటే 2014, 2019 మధ్య కాలంలో  విద్యాశాఖ  మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో లోకేష్ రాజకీయ అనుభవం, మాట్లాడే తీరు, ప్రజలతో అనుసంధానమయ్యే విధానంపై ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రతిపక్షాల నుంచి వచ్చిన ట్రోలింగ్, రాజకీయ సవాళ్లను దాటుకుంటూ ఆయన తనను తాను మేకోవర్ చేసుకున్నారు. ముఖ్యంగా  యువగళం పాదయాత్ర ద్వారా ఆయన ప్రజలతో మమేకమై.. వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం ఆయన రాజకీయ ప్రయాణంలో  మైలురాయి అనడంలో సందేహం లేదు. ఆ పాదయాత్ర తరువాత లోకేష్ ప్రజా నాయకుడిగా ఎదిగారు.  ఇప్పుడు అంటే 2024లో రెండో సారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ  లోకేష్ పాలనాపరంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. సాంకేతికతను ఉపయోగిస్తూ పాలనలో వేగం పెంచడం, జెన్ జీ,   యువతతో నేరుగా సంభాషిస్తూ రాజకీయంలోకి వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి చర్యల ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రకటనల కంటే ఫలితాల ఆధారిత పాలనకే  ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.     Fortune India cover page story on Nara Lokesh, Andhra Pradesh Rising Star, AP IT Department, Nara Lokesh investments, Education Minister
ALSO ON TELUGUONE N E W S
Spider-Man: Brand New Day is turning into an unprecedented box-office blockbuster, with the Tom Holland-led superhero film creating history in India while continuing its phenomenal run worldwide. The film has officially crossed the ₹500 crore gross mark in India, making it the biggest-grossing Hollywood film in the country. Sony Pictures India has officially celebrated the milestone, calling it India's biggest Hollywood blockbuster. The achievement has come during the film's second weekend, underlining the extraordinary hold Brand New Day has established across the Indian market. The film's performance is particularly remarkable because it has managed to achieve this feat across multiple versions. Spider-Man: Brand New Day is running in English, Hindi, Tamil, Telugu, Malayalam and Kannada, with the dubbed versions playing a major role in expanding its reach. The character's enormous popularity in India, combined with the franchise's massive fan base, has translated into extraordinary theatrical demand. The worldwide numbers are equally staggering. According to Box Office Mojo, Spider-Man: Brand New Day has grossed $1.665 billion worldwide, including $655.09 million from North America and $1.01 billion from international markets. The Numbers also places the film at $1.665 billion, making it the No. 1 worldwide grosser among 2026 releases. The film has therefore comfortably moved ahead of this year's other billion-dollar blockbusters, with The Odyssey at $1.105 billion and Toy Story 5 at $1.094 billion. Brand New Day has established a massive lead at the top of the 2026 worldwide box-office chart. With the film continuing to run strongly in India and several international markets, the box-office journey is far from over. What started as another major Spider-Man release has now become a historic theatrical phenomenon, with Spider-Man: Brand New Day proving once again that the web-slinger remains one of the most powerful global movie brands. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
టాలీవుడ్ న‌టి సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై అక్కగా, వదినగా, తల్లిగా వైవిధ్యభరితమైన పాత్రలలో నటిస్తూ మెప్పించే ఆమె, రియల్ లైఫ్‌లో మాత్రం అత్యంత ట్రెండీగా కనిపించడానికి ఇష్టపడతారు. తాజాగా ఈ నటి పంచుకున్న ఫిట్‌నెస్ వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా గ్లామర్ ఫీల్డ్‌లో ఉండే నటీనటులకు ఫిట్‌నెస్ అనేది ఎంతో ముఖ్యం. అందులోనూ మారుతున్న కాలానికి అనుగుణంగా యంగ్‌గా కనిపించేందుకు టాలీవుడ్ తారలు జిమ్‌లలో తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఈ క్రమంలోనే సురేఖా వాణి సైతం తన దినచర్యలో వర్కవుట్‌లకు ఎంత ప్రాధాన్యమిస్తారో తెలిపేలా ఓ వర్కవుట్ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోలో ఆమె ఎంతో కష్టమైన జిమ్ ఎక్సర్‌సైజ్‌లను సైతం ఎంతో సులువుగా చేస్తూ కనిపించారు. పర్ఫెక్ట్ షేప్, స్టామినా కోసం ఆమె పడుతున్న తపన, క్రమశిక్షణ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని రేంజ్‌లో ఆమె హెవీ వర్కవుట్‌లు చేస్తూ అందరికీ ఫిట్‌నెస్ గోల్స్ నిర్దేశిస్తున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న సురేఖా వాణి, తన కూతురు సుప్రీతతో కలసి తరచుగా రీల్స్, డాన్స్ వీడియోలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఈసారి తన ఫిట్‌నెస్ ఫ్రీక్ అవతారంతో అభిమానులను ఆశ్చర్యపరిచారు. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత గ్లామరస్‌గా, ఫిట్‌గా తయారవుతున్నారంటూ సినీ ప్రేమికులు ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రత్యక్షమైన కొద్దిసేపటికే విపరీతంగా వైరల్ అయింది. సురేఖా వాణి పట్టుదలను, డెడికేషన్‌ను మెచ్చుకుంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "ఏజ్‌ ఈజ్ జస్ట్ ఏ నంబర్" అని ఆమె మరోసారి నిరూపించారని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా రంగానికి చెందిన నటులు కేవలం నటనకే పరిమితం కాకుండా, తమ ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్‌పై చూపుతున్న ఈ శ్రద్ధ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా సురేఖా వాణి మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా, తన గ్లామర్, ఫిట్‌నెస్ అప్‌డేట్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.   https://www.instagram.com/reel/Db1PvGwxOL2/?utm_source=ig_embed&ig_rid=AaEZt3L3lly82NZgR2JEKeP
Christopher Nolan has rewritten his own box-office record. The Odyssey has officially become the highest-grossing film of the acclaimed filmmaker’s career, crossing approximately $1.104 billion worldwide and surpassing The Dark Knight Rises, which had remained Nolan’s biggest commercial success for more than a decade. What makes the achievement even more remarkable is that The Odyssey has done this without being part of an established superhero or franchise universe. Nolan has turned Homer’s ancient epic into a massive theatrical spectacle, with Matt Damon leading an ensemble that includes Tom Holland, Anne Hathaway, Robert Pattinson, Zendaya and Lupita Nyong’o. The film’s extraordinary response to premium formats, particularly IMAX, has played a major role in its phenomenal run. The $1.104 billion milestone, however, may not be the final destination for The Odyssey. The film is still expanding into major international markets, with China yet to release the movie. Its Chinese release is scheduled for August 14, while Japan is also among the significant markets still ahead. Industry watchers are therefore beginning to look beyond the $1.2 billion and $1.3 billion marks. For The Odyssey to reach $1.5 billion, it needs roughly another $396 million from its remaining theatrical run. That is a massive number, but the film's current momentum makes the target worth discussing. Strong holds in existing territories, continued demand for IMAX and premium screens, and a potentially big run in China could give Nolan's epic the additional legs it needs. Crossing $1.5 billion would take The Odyssey into another league altogether. It would become Nolan's first-ever $1.5 billion grosser, further cementing his ability to turn original, filmmaker-driven cinema into global theatrical events. After Oppenheimer proved that Nolan could deliver a billion-dollar phenomenon without a traditional blockbuster franchise, The Odyssey is now pushing that success to an entirely different level. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
'క', 'కె- ర్యాంప్', 'చెన్నై లవ్‌స్టోరీ' వంటి హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. ఆయన కెరీర్ లో 15వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ కు.. 'ఇంద్రపుత్ర' (INDRAPUTRA) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.  ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే మహా పోరాటంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ పుప్పాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, ప్రేరణా అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓ సరికొత్త సినిమాటిక్ యూనివర్స్‌కు పునాది వేస్తున్న ఈ ఎపిక్ విజువల్ వండర్ 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  ప్రస్తుతం కిరణ్ అబ్బవరం లైనప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. తన 13వ సినిమా కోసం కిరణ్ స్వయంగా మెగా ఫోన్ పట్టాడు. ఇది రూరల్ మాస్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. 14వ సినిమాని సుకుమార్ రైటింగ్స్ లో చేయనున్నాడు. డెబ్యూ డైరెక్టర్ వీర కోగంటి దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ గా ఇది రానుంది. ఇక ఇప్పుడు 15వ సినిమాగా 'ఇంద్రపుత్ర' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు.  https://x.com/Kiran_Abbavaram/status/2086691954201612656     Kiran Abbavaram, INDRAPUTRA, Srikanth Puppala, KA15  
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)..నాచురల్ స్టార్ నాని(Nani).. ఈ ఇద్దరి పేర్లు పక్కన పక్కన వింటేనే ఇద్దరి అభిమానులకి, సినీ అభిమానులకి ఒక రకమైన పులకింత. ఇప్పుడు ఈ ఇద్దరికి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. రైటర్ నుంచి డైరెక్టర్ గా మారి హిట్ ని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు వెంకీ అట్లూరి. 'తొలిప్రేమ', 'సార్' 'లక్కీ భాస్కర్ వంటి వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించాడు. లక్కీ భాస్కర్ అయితే  72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో 'ఉత్తమ డైలాగ్' విభాగంలో నేషనల్ అవార్డుని గెలుచుకుంది. దీంతో ఈ నెల 14 న రాబోతున్న  స్టార్ హీరో సూర్య, మమితా బైజూ ల  'విశ్వనాథ్ అండ్ సన్స్' పై భారీ అంచనాలు ఉన్నాయి.  రీసెంట్ గా వెంకీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'రెండేళ్ల వ్యవధిలో ధనుష్‌తో చేయబోయే మూవీతో పాటు పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించే చిల్డ్రన్ ఫిలిం పూర్తి చెయ్యాలి. ఇవే కాకుండా భవిష్యత్తులో హిందీ, పంజాబీ భాషల్లో కూడా సినిమాలు చేయాలనే ఆలోచన ఉంది.కథల ఎంపిక, స్క్రిప్ట్ రచన కోసం రోజుకి దాదాపు 12 నుంచి 13 గంటల పాటు  శ్రమిస్తూ, ఒక పూర్తిస్థాయి స్క్రిప్ట్‌ సిద్ధం చేయడానికి కనీసం 4 నెలల సమయం తీసుకుంటాను. ఇటీవల 8 నెలల సుదీర్ఘ వ్యవధిలో రెండు పూర్తి స్క్రిప్ట్‌లను పూర్తి చేసినట్లు చేశాను. అలాగే ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే నానితో కలిసి పనిచేయాలనే బలమైన కోరిక ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవితో చేయాలనీ జీవిత లక్ష్యం అని చెప్పుకొచ్చాడు. Also read: ఇక మాట్లాడుకోవడాలు లేవ్..ఈ వారం ఓటీటీలో 22 సినిమాల పండుగ Chiranjeevi, Nani, Suriya, Venki Atluri    
  సినీ కిక్ కోసం పరితపించే సినీ ప్రేమికులకి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే కంటే మీ భాషలో చెప్పాలంటే కిక్ ప్రాప్తిరస్తు. దీంతో ఎనలేని ఆనందంతో మీ ఆయుక్షు కూడా పెరగనుంది. అగస్టు 10 నుండి ఆగస్టు 17 వరకు వివిధ దిగ్గజ ఓటీటీ సంస్థలైన నెట్‌ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వంటి వేదికలలో ఏకంగా 22 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కి  వస్తున్నాయి.   ఈ వారం ప్రత్యేకత ఏమిటంటే, మొత్తం 22 కొత్త రిలీజెస్ అందుబాటులోకి రానుండటమే కాకుండా, అందులో ఒక్క రోజే ఏకంగా 7 సినిమాలు ఒకేసారి డిజిటల్ ప్రీమియర్ కాబోతున్నాయి. ఇది ఓటీటీ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్-డే రికార్డ్ విడుదలలో ఒకటిగా నిలుస్తుంది. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ డ్రామా, రొమాంటిక్ కామెడీ, మరియు వార్ డ్రామా వంటి వైవిధ్యమైన కథాంశాలతో రూపొందిన సినిమాలు మిమ్మల్ని    అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఏయే ఓటీటీల్లో ఏయే మూవీస్/ వెబ్ సిరీస్    ఓటీటీమూవీస్ / వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ (Netflix)    మిడ్ వింటర్ బ్రేక్ (ఇంగ్లిష్ మూవీ - ఆగస్ట్ 10), మారిన్హో (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ - ఆగస్ట్ 11), రోరీ స్కోవెల్ (ఆగస్ట్ 11), ఏ చైల్డ్ ఆఫ్ మై వోన్ (ఇంగ్లిష్ మూవీ - ఆగస్ట్ 13), నాండో బిట్వీన్ టూ వరల్డ్స్ (వెబ్ సిరీస్ - ఆగస్ట్ 12), డోంట్ సే గుడ్ లక్ (ఇంగ్లీష్ మూవీ - మే 13), కాక్ టెయిల్ 2 (హిందీ మూవీ - ఆగస్ట్ 14), మె బ్రిలియంట్ కెరీర్ (ఇంగ్లీష్ సిరీస్ - ఆగస్ట్ 13), ఉమెత్తో (ఆఫ్రికన్ సిరీస్ - ఆగస్ట్ 14), మై బెస్ట్ ఫ్రెండ్ (ఆగస్ట్ 14) అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)     ద ట్రెయిటర్స్ సీజన్ 2 (హిందీ రియాలిటీ షో - ఆగస్ట్ 13),జీ5 (ZEE5)    భారత భాగ్య విధాత (హిందీ మూవీ - ఆగస్ట్ 14), నిబ్బా నిబ్బీ (మరాఠీ మూవీ - ఆగస్ట్ 14), జియో హాట్ స్టార్ (Jio Hotstar)    హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్ - ఆగస్ట్ 10), 108 బేస్ హాస్పిటల్ (హిందీ సిరీస్ - ఆగస్ట్ 15) సన్ నెక్స్ట్ (Sunnxt)    మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు మూవీ - ఆగస్ట్ 14) ఆహా (Aha)    చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె - USA (తెలుగు కుకింగ్ షో - ఆగస్ట్ 13) సోనీ లివ్ (Sonyliv)    కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 18 (ఆగస్ట్ 10) మనోరమ మ్యాక్స్ (Manorama Max)    కాటాలన్ (మలయాళ మూవీ - ఆగస్ట్ 13) లయన్స్ గేట్ ప్లే (Lions Gateplay)    ఆఖరి సవాల్ (హిందీ మూవీ - ఆగస్ట్ 14) ఆపిల్ టీవీ ప్లస్ (Apple TV Plus)    ఉమెన్ ఇన్ బ్లూ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్ - ఆగస్ట్ 12) Also read: ఒకే కారులో రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఏపి 40 LE 1 ల్యాండ్ క్రూయిజర్ ఎవరిదో తెలుసా? ఈ విధంగా ఓటిటి సినిమా మీ ఆనందం కోసం ముస్తాబు అవుతుంది.   Ott, Tollywood, Bollywood
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఫిల్మ్ 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ.. ఆగస్టు 7న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి రోజే పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకున్న ఈ మూవీ.. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.  'కొరియన్ కనకరాజు'లో సత్య కామెడీ హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా వరుణ్ తేజ్, సత్య కాంబినేషన్ సీన్స్ థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాయి. దర్శకుడు మేర్లపాక గాంధీ.. లాజిక్స్ ని పక్కన పెట్టి, కామెడీతో మ్యాజిక్ చేశారు.  ఈ మూవీ మొదటి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 37.4 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి బిజినెస్ రికవరీని దాటేసింది. అంతేకాకుండా ఓవర్సీస్‌లో ముఖ్యంగా USA బాక్సాఫీస్ దగ్గర హాఫ్ మిలియన్ డాలర్ ($500K) మార్కు వైపు శరవేగంగా దూసుకుపోతోంది. దీనికి తోడు తెలంగాణలో బోనాలు సెలవుల అడ్వాంటేజ్ కూడా కలిసిరావడంతో.. సోమవారం కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ జోష్ లో ఉన్నాయి. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ప్రాఫిట్ జోన్‌కి వెళ్లిన 'కొరియన్ కనకరాజు', లాంగ్ రన్‌లో మరిన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాయడం ఖాయంగా కనిపిస్తోంది.     Korean Kanakaraju, Box Office, Varun Tej, Merlapaka Gandhi  
సూపర్‌స్టార్ మ‌హేష్‌బాబు తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి వెల్లువెత్తిన అభినందనలకు సోషల్ మీడియా వేదికగా వినూత్నంగా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు చూపించిన అమితమైన ప్రేమకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక భావోద్వేగమైన నోట్‌ను పంచుకున్నారు. తన సందేశంలో అభిమానులను ఉద్దేశించి మహేష్ బాబు ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. "ప్రతి ఏటా మీరు నాపై కురిపించే ప్రేమాభిమానాలే నాకు కొండంత బలాన్నిస్తాయి. మీ అభిమానం వల్ల నేను ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. మీ అందరినీ మరింత గర్వపడేలా చేసేందుకు ఇంకా కష్టపడి పనిచేస్తానని మాట ఇస్తున్నాను" అని పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రస్తుతం తాను నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'వారణాసి' గురించి కూడా మహేష్ బాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సినిమా తన కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకమైనదని, ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించబోతోందని చెప్పారు. ఈ చిత్రాన్ని వెండితెరపై చూసేందుకు తాను కూడా అభిమానుల తరహాలోనే ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా విడుదలైన 'వారణాసి' స్పెషల్ పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో దుమ్మురేపుతున్నాయి. ఇందులో 'రుద్ర' అనే శక్తివంతమైన పాత్రలో మహేష్ కనిపిస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో తెప్పపై పయనిస్తున్న లూక్, వన్యప్రాణుల మధ్య ఉన్న పోస్టర్లు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చాయి. ఇండియన్ సినిమా ప్రౌడ్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాను శ్రీ దుర్గా ఆర్ట్స్ మరియు షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్. కీరవాణి ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలు సమకూరుస్తున్నారు. సూపర్ స్టార్ షేర్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మహేష్ బాబు డెడికేషన్‌ను, ఫ్యాన్స్ పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని కొనియాడుతూ మెగా, సూపర్ స్టార్ అభిమానులు కామెంట్లతో రీట్వీట్లతో హంగామా చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రాజమౌళి విజన్, మహేష్ బాబు మాస్ మేనియాల కలయిక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.   Mahesh Babu, Varanasi Movie, SS Rajamouli, Mahesh Babu Birthday, SSMB29
  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తెలుగు సినిమాకి  అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకురావడమే ఈ ఇద్దరి లక్యం. అందుకు తగ్గట్టే అప్ డేట్ సినిమాలని సెల్యులాయిడ్ పైకి తీసుకువస్తున్నారు. కంబైన్డ్ గా, విడివిడిగా భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్న ఈ ఇద్దరికీ సంబంధించిన తాజా న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ వేర్వేరు సందర్భాల్లో ఒకే విలాసవంతమైన వైట్ కలర్ టయోటా ల్యాండ్ క్రూయిజర్ సువ్‌లో ప్రయాణించడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  ఈ ఆసక్తికర కథనంలోకి వెళితే.. కొన్ని నెలల క్రితం అంటే 2026 జూన్ నెలలో మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) టోర్నీ ప్రారంభోత్సవానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన విజయవాడ, మంగళగిరి పరిసరాల్లో 'AP 40 LE 1' రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన విలాసవంతమైన టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనంలోనే ప్రయాణించారు. చరణ్ రాకతో స్టేడియం ప్రాంగణమంతా అభిమానుల కోలాహలంతో మునిగిపోయింది. అప్పట్లో ఆ విలాసవంతమైన కారు నంబర్ ప్లేట్ దృశ్యాలు తెగ వైరల్ అయ్యాయి.  కట్ చేస్తే.. ఆదివారం రోజున వైజాగ్ నగరంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. విశాఖపట్నంలోని ప్రముఖ ఇనార్బిట్ మాల్ ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఏఏఏ' (AAA) మల్టీప్లెక్స్ సినిమా స్క్రీన్లను బన్నీ ఘనంగా ప్రారంభించారు. విమానాశ్రయం నుంచి ఇనార్బిట్ మాల్ వరకు వేలాది మంది అభిమానులు భారీ బైక్ ర్యాలీతో తమ అభిమాన నటుడికి ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం సరిగ్గా 1:00 గంట సమయంలో మాల్‌కు చేరుకున్న అల్లు అర్జున్, అక్కడ దాదాపు 2 గంటల పాటు గడిపారు. మల్టీప్లెక్స్‌లోని 'పుష్ప' ప్రత్యేక విగ్రహంతో పాటు తన సినీ ప్రస్థానానికి సంబంధించిన ఫొటో గ్యాలరీని తిలకించారు.  Also read: హీరోయిన్ కి లిప్ కిస్ పెట్టిన అభిమాని.. అతని బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు అయితే విమానాశ్రయం నుంచి ఈ ఈవెంట్‌కు రావడానికి బన్నీ వాడిన కారు నంబర్ 'AP 40 LE 1' కావడం విశేషం.  చరణ్, బన్నీ ఇద్దరూ 'AP 40 LE 1' నంబర్ గల ఒకే ల్యాండ్ క్రూయిజర్‌లో ప్రయాణించడం చూసిన అభిమానులు ఆ కారు ఎవరిదై ఉంటుందా అని గూగుల్, సోషల్ మీడియా వేదికగా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ దర్యాప్తులో ఆ ల్యాండ్ క్రూయిజర్ కారు అసలు యజమాని ఎవరనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ల్యాండ్ క్రూయిజర్ వాహనం భీమిలి నియోజకవర్గ శాసనసభ్యుడు, ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది అని తేలింది. గంటా శ్రీనివాసరావుకు మెగాస్టార్ చిరంజీవితో పాటు మొత్తం మెగా కుటుంబంతో దశాబ్దాలుగా అత్యంత ఆత్మీయ, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.  మెగా కుటుంబ సభ్యులు ఏపీకి, ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతానికి వచ్చిన ప్రతిసారీ వారికి కావలసిన ఆతిథ్య, పర్యటన ఏర్పాట్లను గంటా శ్రీనివాసరావు పర్యవేక్షిస్తుంటారు. అందులో భాగంగానే గత జూన్‌లో చరణ్ మంగళగిరి పర్యటనకు, ఇప్పుడు బన్నీ విశాఖ పర్యటనకు తన సొంత ల్యాండ్ క్రూయిజర్ 'AP 40 LE 1' వాహనాన్నే ఏర్పాటు చేశారు. దీంతో నెటిజన్లు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ ఈ కారులో దిగిన ఫొటోలను కొల్లాజ్‌గా చేసి సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. "హీరోల మధ్య అనుబంధం ఎప్పుడూ గట్టిగానే ఉంటుంది.. అనవసరమైన ఫ్యాన్ వార్స్ పక్కన పెట్టి కలసికట్టుగా ఉండాలి" అంటూ మెగా, అల్లు అభిమానులు సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ 'AP 40 LE 1' ల్యాండ్ క్రూయిజర్ వార్త టాలీవుడ్‌లో సరికొత్త సంచలనంగా నిలిచింది. Ram Charan, Allu Arjun, Tollywood
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపొందుతున్న‌ 'మెగా 158'పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి సంబంధించి తాజాగా ఫిలింనగర్‌లో ఒక ఆసక్తికరమైన ప్రచారం ఊపందుకుంది. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ చిత్రంలో ఆమె పూర్తిస్థాయి హీరోయిన్‌గా కాకుండా, కథను మలుపు తిప్పే ఒక విశిష్టమైన అతిథి పాత్రలో కనిపించనుందని సమాచారం. ముఖ్యంగా సినిమా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల్లో మీనాక్షి పాత్ర ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. చిరంజీవితో కలిసి ఆమె చేసే సీన్స్ అభిమానులకు మంచి థ్రిల్ ఇస్తాయని టాక్. ప్రస్తుతం ఈ పాత్ర విషయమై చిత్రబృందం ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి, బాబీ కలయికలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో వీరిద్దరి కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఈ రెండో సినిమాపై ట్రేడ్ వర్గాల్లోను, మెగా అభిమానుల్లోను విపరీతమైన క్రేజ్ నెలకొంది. మునుపటి చిత్రాల విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త ప్రాజెక్ట్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుండటంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మీనాక్షి కేమియో గురించిన వార్త బయటకు రావడంతో అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్ని పనులు శరవేగంగా పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్‌లో 'మెగా 158'ని థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అతిత్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని బిగ్ అప్‌డేట్స్ వెలువడే అవకాశం ఉంది.     Chiranjeevi, Bobby Kolli, Mega 158, Meenakshi Chaudhary, KVN Productions
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు అయితే.. రాత్రంతా రైళ్లలోనే ఉండాల్సి వస్తుంది.  అయితే రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది.  పక్కన ప్రయాణికుల నుండి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. రైల్వే రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ప్రత్యేక "నైట్ జర్నీ కండీషన్స్" అమలు చేసింది. ప్రతి రైలు ప్రయాణికుడు ఈ నియమాల గురించి తెలుసుకోవాలి. లేకపోతే రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అవేంటో తెలుసుకుంటే.. శబ్దం చేయకూడదు.. రాత్రి 10 గంటల తర్వాత రైలులో నిశ్శబ్ద వాతావరణాన్ని పాటించడం ప్రధాన నియమం. ఈ సమయంలో మొబైల్ ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడకూడదు, లేదా ఇయర్‌ఫోన్‌లు లేకుండా స్పీకర్‌లపై వీడియోలు లేదా సంగీతాన్ని ప్లే చేయకూడదు. ఇతర ప్రయాణికుల నిద్రకు భంగం కలగకుండా ఉండేందుకు, స్నేహితులతో గుంపులుగా బిగ్గరగా నవ్వడం , జోకులు వేయడం కూడా నిషేధించబడింది. లైట్స్ ఆఫ్.. కొన్నిసార్లు ప్రయాణికులు ఎవరైనా రాత్రి పొద్దుపోయే వరకు  ఏదో ఒక కారణంతో మెయిన్ లైటును ఆన్ చేసి ఉంచుతారు. దీనివల్ల ఇతర ప్రయాణికులు నిద్రపోలేరు. పక్క వారి నిద్రకు ఇబ్బంది అవుతుంది.  రైల్వే నిబంధనల ప్రకారం, రాత్రి 10 గంటల తర్వాత ప్రధాన కోచ్‌లోని లైట్లన్నీ తప్పనిసరిగా ఆపివేయాలి. రాత్రిపూట కేవలం నైట్‌లైట్ బల్బులు మాత్రమే ఆన్ చేసి ఉండవచ్చు. ఎవరైనా  అవసరం అనిపిస్తే వారు  తమ సీటులోని పర్సనల్ రీడింగ్ లైటును ఉపయోగించుకోవచ్చు. మధ్య బెర్త్ లకు రైల్వే నియమాలు.. లోయర్ బెర్త్  , మధ్య బెర్త్ ప్రయాణీకుల మధ్య సీట్ల తగాదాలను నివారించడానికి, రైల్వే ఒక స్పష్టమైన నియమాన్ని పెట్టింది. మధ్య బెర్త్ ప్రయాణీకుడు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య మాత్రమే తన సీటును విప్పి నిద్రపోవచ్చు. ఉదయం 6 గంటల తర్వాత, ఇతరులు దిగువ బెర్త్‌లో కూర్చోవడానికి వీలుగా  మధ్య బెర్త్‌ను దించాలి. అదేవిధంగా, రాత్రి 10 గంటల తర్వాత, లోయర్ బెర్త్ ప్రయాణీకుడు తన సీట్ లో ఎవరినీ కూర్చోబెట్టుకోకూడదు. వారు తమ పక్కన కూర్చోమని ఎవరినీ బలవంతం చేయలేరు. టికెట్ చెకింగ్.. ప్రయాణికుల నిద్రను దృష్టిలో ఉంచుకుని, రైల్వే తన టికెట్ చెకింగ్ సిబ్బందికి సూచనలు జారీ చేసింది. రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 6:00 గంటల మధ్య  టికెట్‌ను తనిఖీ చేయడానికి ఏ టిటిఇ మిమ్మల్ని నిద్రలేపకూడదు. వారు రాత్రి 10:00 గంటల లోపు తమ పనిని పూర్తి చేసుకోవాలి. అయితే, రాత్రి 10:00 గంటల తర్వాత రైలు ఎక్కిన ప్రయాణికులు ఈ సమయంలో తమ టికెట్లను తనిఖీ చేయించుకోవచ్చు. ఇది కాకుండా రాత్రి 10 గంటల తర్వాత రైలులో వీధి వ్యాపారులు లేదా విక్రయదారులు గట్టిగా అరుస్తూ ఎలాంటి వస్తువులను అమ్మకూడదు.  కానీ ఎవరైనా ఈ-క్యాటరింగ్ ద్వారా ఆహారాన్ని ముందుగానే బుక్ చేసుకుని ఉంటే, అది ఖచ్చితంగా వారి సీటుకే తెచ్చిస్తారు. నియమాలు ఉల్లింఘిస్తే.. రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికుడు ఈ నియమాలను ఉల్లంఘిస్తే, వారితో వాదించాల్సిన అవసరం లేదు.  వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), TTE, లేదా రైలులోని కోచ్ అటెండెంట్‌కు ఫిర్యాదు చేయవచ్చు.  రైల్వే అధికారిక యాప్ 'రైల్‌మదాద్' లేదా 139 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా కూడా సహాయం పొందవచ్చు. నియమాలను ఉల్లంఘించిన వారిపై రైల్వే జరిమానాలు కూడా విధించవచ్చు. కాబట్టి రైలు ప్రయాణం చేసేటప్పుడు పై నియమాలు గుర్తుంచుకుని,  వాటిని అనుసరిస్తూ ప్రయాణించడం మంచిది.                                      *రూపశ్రీ.  
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు.  వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని,  తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది.  రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం,  పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా  మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు.  అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల  భవిష్యత్తులో  చాలా సమస్యలు వస్తాయి.  మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం,  పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి.  ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు.  తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు.  ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు.  సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ  భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును,  తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు.  ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ  భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా  భాగస్వామిపై ఆధారపడటం  తప్పు. ఈ అలవాటు  భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం  సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు.  ఎవరి కోసమూ  అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం,  చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది.                                              *రూపశ్రీ.
సిబ్లింగ్ థెరపీ..  తోబుట్టువుల మధ్య వచ్చే మనస్పర్థలు సులువుగా తొలగించే భలే మార్గం..! అన్నా తమ్ముడు, అక్కా చెల్లి, అన్నా చెల్లెళ్లు,  అక్కా తమ్ముళ్లు.. ఇలా తోబుట్టువుల బంధాలు చాలా గొప్పవి. ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన వారి మధ్య బంధం ఎంతో అపురూపమైనది.  చిన్నతనంలో తోబుట్టువులు కొట్టుకున్నా, తిట్టుకున్నా, గొడవ పడినా అది జరిగిన తర్వాత కొన్ని నిమిషాలు లేదా గంటల్లోనే తిరిగి కలిసిపోతారు.  ఒక్కటిగా పెరుగుతారు.  కానీ పెద్దయ్యాకే సమస్యలు వస్తాయి.  చాలామందికి అపార్థాలు చోటుచేసుకుంటాయి. మనస్పర్థలు వస్తాయి. వీటి వల్ల కేవలం ఆ మనిషి మాత్రమే కాకుండా కుటుంబం అంతా కలత చెందుతుంది.  పైగా ఇలాంటి మనస్పర్థలు,  అపార్థాల వల్ల దూరం కూడా పెరుగుతుంది. ఇలాంటి దూరాలను తగ్గించి, మనస్పర్థలు పోగొట్టి తిరిగి తోబుట్టువులను ఒక్కటిగా ఉంచే మార్గమే సిబ్లింగ్ థెరపీ.. అసలు సిబ్లింగ్ థెరపీ అంటే ఏంటి? దీని ప్రయోజనం ఏంటి? ఇదెలా సహాయపడుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. సిబ్లింగ్ థెరపీ అంటే.. సిబ్లింగ్ థెరపీ అనేది కుటుంబ చికిత్సలో ఒక భాగం. తోబుట్టువుల మధ్య మాట్లాడుకునే విధానాన్ని  మెరుగుపరచడం, గత విభేదాలను పరిష్కరించడం,  సంబంధంలో నమ్మకాన్ని తిరిగి వచ్చేలా చేయడం  దీని లక్ష్యం. ఈ చికిత్సలో బాగా ట్రైనింగ్ అయిన వ్యక్తి మనస్పర్థలు ఉన్న ఇద్దరు వ్యక్తులను  స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తపరచనవు చెబుతారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడానికి గల కారణాలను అర్థం చేసుకోవడంలో సహాయపడతారు. తోబుట్టువుల మధ్య తరచుగా  జరిగే గొడవలు, ఇద్దరి మధ్య మాటలు లేకపోవడం, సవతి కుటుంబ సమస్యల కారణంగా సంబంధాలు దెబ్బతినడం, లేదా  పెద్దవయలు అయిపోయిన తల్లిదండ్రులను చూసుకోవడం.. ఇలా చాలా కారణాల వల్ల తోబుట్టువుల మధ్య విబేధాలు ఏర్పడితే వాటికి సరైన సొల్యుషన్ చెప్పి తోబుట్టువులను తిరిగి కలుపుతారు. ప్రయోజనం... సిబ్లింగ్ థెరపీ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, అది వారి మధ్య కమ్యునికేషన్ ను  మెరుగుపరుస్తుంది. థెరపీ సమయంలో, తోబుట్టువులు శ్రద్ధగా వినడం, తమ భావాలను సరైన విధంగా  వ్యక్తపరచడం,  అవతలి వ్యక్తి కోణాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. దీనివల్ల క్రమంగా అపార్థాలు తగ్గుతాయి. ఒకవేళ చిన్ననాటి అనుభవం లేదా గతంలోని వివాదం వారి సంబంధంలో సమస్యకు కారణమైతే, ఈ సమస్యలను బహిరంగంగా చర్చించడానికి థెరపీ ఒక మంచ వాతావరణాన్ని అందిస్తుంది. కొన్నిసార్లు, పక్షపాతం, పగ, లేదా చెప్పుడు మాటలు వంటివి సంవత్సరాల తరబడి ఆ సంబంధాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి.  థెరపిస్ట్ సహాయంతో ఈ సమస్యలను చర్చించి పరిష్కరించడం జరుగుతుంది, తద్వారా ఆ సంబంధం సాఫీగా  సాగడానికి వీలవుతుంది. ఎమోషనల్ సపోర్ట్.. సిబ్లింగ్ థెరపీ  రిలేషన్స్ ను ఎమోషన్ పరంగా బలంగా మారుస్తుంది.  తోబుట్టువులకు ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది. కష్ట సమయాల్లో  కలసికట్టుగా ఉండటం, ఒకరి సంతోషాన్ని మరొకరు పంచుకోవడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడుగా ఉండటం.. ఇలా   మొత్తం కుటుంబంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంట్లో ఒత్తిడి తగ్గుతుంది , ఇతర కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడటం ప్రారంభిస్తాయి. తోబుట్టువుల మధ్య ఎప్పుడూ గొడవలు ఉంటే,  లేదా పూర్తీగా మాటలు ఆగిపోయి ఉంటే.. కుటుంబంలో పెద్ద మార్పు తర్వాత సంబంధాలు క్షీణిస్తే, లేదా కుటుంబ నిర్ణయాలపై తరచుగా వివాదాలు అవుతూ ఉంటే, సిబ్లింగ్ థెరపీని తీసుకోవడం చాలా మంచిది.                              *రూపశ్రీ.  
కాల్షియం, ఐరన్ లోపం ఉందా? పాలు, పాల ఉత్పత్తుల విషయంలో కల్తీపై ఆందోళన ఉందా? అయితే మన ఇంట్లోనే సులభంగా లభించే ఒక ఆకుకూర మీ ఆహారంలో మంచి పోషక వనరుగా ఉపయోగపడవచ్చు. ఇంతకీ ఆ ఆకుకూర ఏంటి? దానిలో ఉండే పోషకాలు ఏమిటి? ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? ఎంత మోతాదులో తీసుకోవాలి? ఈ వీడియోలో ఆయుర్వేద వైద్యులు చిట్టి బొట్ల మధుసూదన్ శర్మ ఈ ఆకుకూర గురించి ఆసక్తికరమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. కాల్షియం మన ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజం. అలాగే ఐరన్ శరీరంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, ఇతర సహజ ఆహార పదార్థాలను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన ఆహార విధానంలో భాగం. అయితే ఒక ఆహార పదార్థం తీసుకోవడం వల్ల మాత్రమే కాల్షియం లేదా ఐరన్ లోపం పూర్తిగా సరిచేయబడుతుందని భావించకూడదు. ఇప్పటికే లోపం ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలితే, వైద్యుల సూచన మేరకు సరైన ఆహారం లేదా అవసరమైన చికిత్స తీసుకోవడం ముఖ్యం. ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: • కాల్షియం, ఐరన్ మన శరీరానికి ఎందుకు అవసరం? • ఇంట్లో సులభంగా లభించే ఈ ఆకుకూరలో ఉన్న పోషకాలు ఏమిటి? • ఈ ఆకుకూరను ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చు? • ఆకుకూరలను తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి? • సహజ ఆహారాల ద్వారా పోషకాలను పొందడంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలను ఈ వీడియోలో ఆయుర్వేద వైద్యులు చిట్టి బొట్ల మధుసూదన్ శర్మ వివరించారు. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా పోషక లోపం, అనారోగ్య సమస్య ఉంటే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి. వైద్యుల సూచన లేకుండా మందులు లేదా సప్లిమెంట్లను ప్రారంభించవద్దు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
ఐస్ క్రీమ్.. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. చాలామంది వర్షాకాలంలో కూడా ఐస్ క్రీమ్ తింటే ఆ కిక్కే వేరు అంటారు.  కాలం ఏదైనా ఐస్ క్రీమ్ పట్ల చాలా ఇష్టం ఉంటుంది. అయితే నేటి కాలంలో ఐస్ క్రీమ్ మాత్రమే కాకుండా ఫ్రోజెన్ డెజర్ట్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.  షాప్ కు వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ ఏదో,  ప్రోజెన్ డెజర్ట్ ఏదో అర్థం కాకుండా చాలా మంది పొరపాటుగా ఐస్ క్రీమ్ కు బదులు ఫ్రోజెన్ డెజర్ట్ ఎంచుకుంటారు. ఆ తర్వాత ఇది ఐస్ క్రీమ్ కాదని నాలుక కరుచుకుంటారు. అందుకే ఐస్ క్రీమ్ కు,  ఫ్రోజెన్ డెజర్ట్ కు మధ్య తేడా ఎలా తెలుసుకోవాలి? తెలుసుకుంటే.. ఫ్రోజెన్ డెజర్ట్‌లు ఐస్ క్రీమ్‌కు చాలా భిన్నంగా ఉంటాయి, కానీ  చాలామంది అవి  రెండూ ఒకటే అని పొరబడతారు. ఈ రెండూ చూడటానికి, రుచిలో ఒకేలా కనిపించినప్పటికీ, వాటి మధ్య చాలా తేడా ఉంటుంది. పదార్థాలు.. ఐస్ క్రీమ్ , ఫ్రోజెన్ డెజర్ట్‌ల మధ్య ఉన్న అతిపెద్ద తేడా వాటి తయారీలో ఉపయోగించే కొవ్వు పదార్థం. ఐస్ క్రీమ్‌ను పాలు, క్రీమ్ , పాల ఫ్యాట్ తో తయారు చేస్తారు. అందువల్ల, ఐస్ క్రీమ్‌గా పరిగణించబడాలంటే, ఏ ఫ్రోజెన్ డెజర్ట్‌లోనైనా కనీసం 10% పాల కొవ్వు ఉండాలి. మరోవైపు, ఫ్రోజెన్ డెజర్ట్‌లలో పాలకు బదులుగా పామాయిల్ లేదా పామ్ కెర్నల్ ఆయిల్ వంటి వెజిటెబుల్ నూనె లేదా వెజిటెబుల్ ఫ్యాట్ ను ఉపయోగిస్తారు. పాల ఘనపదార్థాలను కలుపుతారు, కానీ పాల కొవ్వును ఉపయోగించరు. రుచి, టెక్చర్.. పాల కొవ్వును ఉపయోగించడం వల్ల ఐస్ క్రీమ్ మరింత క్రీమీగా, రుచికరంగా , మృదువుగా తయారవుతుంది. ఐస్ క్రీమ్ నోటిలో సులభంగా కరిగిపోతుంది. మరోవైపు, ఫ్రోజెన్ డెజర్ట్‌లు కొద్దిగా జిగటగా లేదా నూనెగా ఉంటాయి. అంతేకాకుండా, పాల కొవ్వుతో పోలిస్తే వెజిటబుల్  కొవ్వుకు కరికే గుణం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ప్యాకెట్ల పై లేబులింగ్.. చాలామంది ఐస్ క్రీమ్ అనుకుని  ఫ్రోజెన్ డెజర్ట్ లు కొనుగోలు చేసి తరువాత బాధపడుతూ ఉంటారు. అందుకే.. ఉత్పత్తి ఐస్ క్రీమా లేక ఫ్రోజెన్ డెజర్టా అనేది కంపెనీలు ప్యాకేజింగ్‌పై స్పష్టంగా పేర్కొనాలి. ఉత్పత్తిలో 0.5% కంటే ఎక్కువ వెజిటేబుల్ ఆయిల్  ఉంటే, దానిని ఐస్ క్రీమ్‌గా కాకుండా, కేవలం ఫ్రోజెన్ డెజర్ట్‌గా మాత్రమే అమ్మాలని FSSAI నిబంధనలు విధించింది. ధర తేడా.. పాల కొవ్వు కంటే వెజిటేబుల్ ఆయిల్  చాలా చౌకగా ఉంటుంది. అందువల్ల ప్రోజెన్ డెజర్ట్‌లు కంపెనీలకు మరింత పొదుపుగా ఉంటాయి . తక్కువ ధరకే లభిస్తాయి. మరోవైపు, ఐస్ క్రీమ్‌లో పాల కొవ్వును ఉపయోగిస్తారు, అందుకే దీని ధర ప్రోజెన్  డెజర్ట్‌ల కంటే ఎక్కువగా ఉంటుంది. కొనుగోలు చేసేముందు ఇవి గుర్తుంచుకోవాలి..  ప్యాక్ చేసిన డెజర్ట్‌ను కొనుగోలు చేసినప్పుడల్లా, ప్యాకేజీ ముందు లేదా వెనుక ఉన్న పదార్థాల జాబితాను జాగ్రత్తగా చదవాలి. ఆ పదార్థాలలో పామాయిల్ లేదా కూరగాయల నూనె ఉంటే, అది ఫ్రోజెన్ డెజర్ట్,  అందులో పాల కొవ్వు ఉంటే, అది ఐస్ క్రీమ్. ఇవన్నీ ప్యాకెట్ పైన కూడా మెన్షన్ చేసి ఉండాలి.                                    *రూపశ్రీ  
చండీపురా వైరస్ (Chandipura Virus) ప్రస్తుతం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న వైరస్‌లలో ఒకటి. ముఖ్యంగా 15 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ వైరస్ తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. వర్షాకాలంలో దీని ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ ప్రధానంగా సాండ్ ఫ్లై (Sand Fly) అనే చిన్న ఈగ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇది సాధారణంగా ఒకరి నుంచి మరొకరికి నేరుగా వ్యాపించదు. అయితే వైరస్ సోకిన పిల్లల్లో చాలా వేగంగా ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశం ఉండటంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. చండీపురా వైరస్ సోకినప్పుడు మొదట జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి సాధారణ లక్షణాలు కనిపించవచ్చు. కొంతమందిలో మూర్ఛలు, స్పృహ కోల్పోవడం, మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తవచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో 24 నుంచి 36 గంటల్లోనే ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్‌కు ప్రత్యేకమైన వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదు. అందువల్ల లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స ప్రారంభిస్తే ప్రాణాపాయం తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణుడు డా. హరిచరణ్ మోడమ్ చండీపురా వైరస్ ఎలా వ్యాపిస్తుంది, ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంది, ప్రారంభ లక్షణాలు ఏమిటి, ఏ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి వంటి ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: చండీపురా వైరస్ అంటే ఏమిటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? పిల్లల్లో కనిపించే ప్రారంభ లక్షణాలు ప్రమాదకర లక్షణాలను ఎలా గుర్తించాలి? ఎవరికి ఎక్కువ రిస్క్? వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాండ్ ఫ్లై కాట్ల నుంచి ఎలా రక్షించుకోవాలి? వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పిల్లల సంరక్షణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. అవగాహన, పరిశుభ్రత మరియు త్వరితగతిన వైద్య సహాయం తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచడం కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)