మామూలుగా మన తెలుగు ప్రాంతాన్ని ‘రత్నగర్భ’ అని పిలుస్తూ వుంటారు. ఎందుకంటే, మన ప్రాంతంలో రత్నాలు బాగా దొరికేవి కాబట్టి. ఇప్పుడు ఈ న్యూస్‌లో చెప్పబోయేది మన రత్నగర్భ గురించి కాదు.. మన తెలుగింటి ‘రాళ్ళగర్భ’ గురించి. కోనసీమ జిల్లా అమలాపురానికి సమీపంలోని దేవగుప్తం గ్రామానికి చెందిన జాలెం నరసవేణి అనే 31 సంవత్సరాల వయసున్న మహిళ గాల్‌స్టోన్స్ సమస్య, విపరీతమైన కడుపునొప్పి సమస్యలతో అమలాపురంలోని ఎ.ఎస్.ఎ. ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు షాకైపోయారు. ఆమె కడుపులో ఒకటి కాదు.. రెండు కాదు.. పోనీ వంద కూడా కాదు.. ఏకంగా ఐదు వందల డెబ్భై (570) రాళ్ళున్నాయి. డాక్టర్లు జాగ్రత్తగా ఆపరేషన్ చేసి ఆమె కడుపులో వున్న ఆ రాళ్ళను బయటకి తీసేశారు. ఒక వ్యక్తి కడుపులో ఇన్ని రాళ్ళు వుండటం చాలా అరుదైన విషయమని డాక్టర్లు చెబుతున్నారు. 570 రాళ్ళను పొట్టలో భద్రపరుచుకున్న ‘రాళ్ళగర్భ’ నరసవేణి ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా వుంది. 
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు పెద్ద సమస్య వచ్చిపడింది. క్యాట్‌ తీర్పు ఇచ్చినా ఆయనకు పోస్టింగ్ దక్కలేదు. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినా స్పందన లేదు. ఈ నెల 31తో ఆయన పదవీకాలం పూర్తి కాబోతోంది.  2019 ఎన్నికల తర్వాత, ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ లేకుండా పోయింది. ఆయన్ను రెండుసార్లు సస్పెండ్ చేసింది జ‌గ‌న్ ప్రభుత్వం. క్యాట్‌ను ఆశ్రయించిన తర్వా త తీర్పు అనుకూలంగా వచ్చింది.  చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం అధిపతిగా ఉన్న సమయంలో నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని జ‌గ‌న్ ప్రభుత్వం ఆయ‌న‌పై ఆరోపించింది. దీంతో ఆయ‌న  రెండు సార్లు సస్పెండ్ కు గురైయ్యారు.  దీనిపై ఆయన క్యాట్ ను ఆశ్రయించారు. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ మాత్రం ఆయనకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వాలని, సస్పెన్షన్ కాలంలో జీతం కూడా చెల్లించాలని తీర్పు చెప్పింది.  ఆ తీర్పుకు సంబంధించిన పేపర్లు మూడు రోజుల తర్వాత బయటకు వచ్చాయి. ఆ వెంటనే ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఆ తీర్పు ప్రతుల్ని అందజేశారు. తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.. ఈ మేరకు దరఖాస్తును కూడా అందజేశారు.  ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ దగ్గర అనుమతి పొందిన తర్వాత ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.  ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఫైల్‌ను ఎలక్షన్ కమిషన్‌కు పంపాలి. కానీ చీఫ్ సెక్రటరీ,  ఏబీ వెంకటేశ్వర రావు ఫైల్‌ను సీఎం జగన్‌కు పంపించారు. పదవీ విరమణ చేసేవరకూ విధుల్లోకి తీసుకోకూడదనే ఎత్తుగడతోనే ఇలా వ్య‌వ‌హ‌రించార‌నే చర్చ ఐపీఎస్‌ వర్గాల్లో నడుస్తోంది. ఏబీ వెంకటేశ్వరరావుపై, సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి, ఐదేళ్లూ అక్రమ కేసులతో వేధించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంకా అదే ధోరణి కొనసాగిస్తోంది.   మరోవైపు ఏబీవీ సస్పెన్షన్‌ను ఎత్తేస్తూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఏపీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌లో సీఎస్‌ జవహర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ అనుమతి లభించకపోవడంతో ఆ పిటిషన్‌ అడ్మిట్‌ కాలేదు. ఈలోగా ఏబీవీపై ప్రాసిక్యూషన్‌కు  కేంద్రం నుంచి అనుమతి పొందారు. రాష్ట్రంలోని ఓ ప్రముఖ దేవస్థానం ఈఓ.. కేంద్ర హోంశాఖలో మంత్రాంగం నడిపించి ఏబీవీ ప్రాసిక్యూషన్‌కు అనుమతి తెచ్చారని సమాచారం.  క్యాట్‌ ఆదేశాలు అమలుచేసి ఏబీవీకి పోస్టింగ్‌ ఇవ్వడానికి, ప్రాసిక్యూషన్‌తో సంబంధం లేకపోయినా సరే ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వట్లేదు.    జగన్ సీఎం అయ్యాక.. అనేక మంది అధికారులపై కుట్రలు చేసి తప్పుడు కేసులు పెట్టారు. ఇందు కోసం సవాంగ్ అనే డీజీపీ హోదాలో ఉన్న అధికారి ఫోర్జరీ కూడా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో ఒక్క ఏబీవీ మాత్రమే బయటకు కనిపిస్తున్నారు. ఆయన ఐదేళ్ల సర్వీస్ ను తప్పుడు పద్దతిలో సస్పెన్షన్ పేరు చెప్పి నాశనం చేశారని క్యాట్ చెప్పింది. సుప్రీంకోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. అయినా పోస్టింగ్ ఇవ్వలేదు.  ఆయన రిటైరయ్యే వరకూ పోస్టింగ్ ఇవ్వకుండా ఉండాలని ప్ర‌భుత్వం అనుకుంటోంది. ఇదంతా సీఎస్ కనుసన్నల్లోనే జరుగుతోంది.   ప్రభుత్వం మారిన త‌రువాత‌.. ఇప్పుడు జ‌గ‌న్ ఆడించిన‌ట్లు ఆడుతున్న అధికారుల ప‌రిస్థితి ఏమిటి? రాజకీయ పార్టీల ట్రాప్ లో పడిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ నెత్తి మీద తాము చేయి పెట్టుకున్నట్లే. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
 తెలుగు మహిళ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. సప్త సముద్రాలు దాటిన ఈ వనిత భారత దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింజేసింది.  అగ్ర‌రాజ్యం అమెరికాలో తెలుగు మ‌హిళ జ‌య బాదిగ‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. కాలిఫోర్నియాలోని శాక్ర‌మెంట్ కౌంటీ సుపీరియ‌ర్ కోర్టు జ‌డ్జిగా ఆమె నియ‌మితుల‌య్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జ‌డ్జిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి వ్య‌క్తిగా నిలిచారు. 2022 నుంచి ఇదే కోర్టులో క‌మీష‌న‌ర్‌గా కొన‌సాగుతున్నారు.  ఏపీలోని విజ‌య‌వాడ‌కు చెందిన జ‌య బాదిగ.. హైద‌రాబాద్‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. అనంత‌రం అమెరికా వెళ్లిన ఆమె బోస్ట‌న్ విశ్వ‌విద్యాల‌యంలో ఎంఏ పూర్తి చేశారు. ఆ తర్వాత‌ శాంటా క్లారా విశ్వ‌విద్యాల‌యం నుంచి లా ప‌ట్టా అందుకున్నారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్‌ బార్ ఎగ్జామ్ క్లియ‌ర్ చేశారు.  10 ఏళ్ల‌కు పైగా న్యాయ‌వాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్‌లో కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలో లాభాపేక్ష లేకుండా ప‌లు కేసుల్లో ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాదించారామె. అలాగే మెక్‌జార్జ్ స్కూల్ ఆఫ్ లాలో అధ్యాపకురాలిగాను ప‌ని చేశారు.
ALSO ON TELUGUONE N E W S
మే 20 యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు అనే విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం నుంచే సినీ, రాజకీయ ప్రముఖులు, నెటిజన్లు, యంగ్‌ టైగర్‌ అభిమానులు ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సైతం ట్విట్టర్‌ ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కాంక్షిస్తూ ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్‌ దానికి రిప్లయ్‌ ఇస్తూ ‘మీరు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశారు.    
తనను తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నట్లు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాను 2019-2020 ప్రాంతంలో 'రక్షణ' మూవీ చేశానని, కానీ అది విడుదల ఆలస్యమైందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇటీవల తాను సక్సెస్ లో ఉండటంతో.. ఇప్పుడు ఆ సినిమాని రిలీజ్ చేసి, నిర్మాతలు లబ్ది పొందాలని చూస్తున్నారని తెలిపింది. అంతేకాదు తనకి బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వకపోగా, ప్రమోషన్స్ కి రమ్మంటున్నారని.. తన టీంతో మాట్లాడిస్తే, తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తాం అంటున్నారని చెప్పుకొచ్చింది.  అయితే 'రక్షణ' సినిమా విషయంలో పాయల్ వెర్షన్ ఒకలా ఉంటే.. మేకర్స్ వెర్షన్ మరోలా ఉంది. ఆ సినిమా నిర్మాతకు మద్దతుగా తాజాగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. కోవిడ్ కారణంగా సినిమా ఆలస్యమైందని, అన్ని అడ్డంకులను దాటుకొని సినిమాని పూర్తి చేశామని నిర్మాత చెప్పినట్లుగా ఆ నోట్ లో ఉంది. ఈ సినిమా కోసం 50 రోజులు వర్క్ చేసేలా పాయల్ అగ్రిమెంట్ చేయగా, 47 రోజుల్లోనే ఆమె పోర్షన్ కంప్లీట్ చేశారట. అంతేకాదు, పాయల్ కి ఇవ్వాల్సింది రూ.6 లక్షలు అని.. ప్రమోషన్స్ కి వస్తే అవి కూడా ఇస్తామని తెలుపుతూ, ఆమె పేరు మీద చెక్ రాసి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి ఇచ్చారట. పాయల్ కి, 'రక్షణ' నిర్మాతకి మధ్య సమస్యని పరిష్కరించడానికి నిర్మాతల మండలి ఎంతో ప్రయత్నిచిందట. ఆమె మేనేజర్ ని సంప్రదించగా.. ఆయన నుంచి పాజిటివ్ స్పందన లేదని మండలి తెలిపింది. తాము సమస్యను  పరిష్కరించడానికి ప్రయత్నించగా సరైన స్పందన లేకపోగా.. సోషల్ మీడియాలో ఆమెని బ్యాన్ చేయడానికి ట్రై చేస్తున్నట్లు పాయల్ పోస్ట్ పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు నిర్మాతల మండలి పేర్కొంది.  
'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సినిమాలతో తక్కువ సమయంలోనే యూత్ లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. టాలీవుడ్ లో నెక్స్ట్ సూపర్ స్టార్ అనే అభిప్రాయాన్ని కలిగించాడు. అయితే కొంతకాలంగా విజయ్ కి అంతగా టైం కలిసి రావడం లేదు. వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. భారీ సినిమాలు ఆగిపోతున్నాయి. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చేసిన పాన్ ఇండియా మూవీ 'లైగర్'పై ఎన్నో అంచనాలు పెట్టుకోగా.. అది డిజాస్టర్ అయింది. ఆ దెబ్బకి పూరి-విజయ్ కాంబోలో రావాల్సిన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'జనగణమన' ఆగిపోయింది. అలాగే మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేయాల్సి ఉండగా.. అదసలు ఏమైందో కూడా తెలీదు. ఇలాంటి టైంలో విజయ్ ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. 'పుష్ప' విడుదల కాకముందే.. విజయ్-సుకుమార్ కాంబినేషన్ లో సినిమా ప్రకటన వచ్చింది. అయితే 'పుష్ప' విడుదలై సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోవడం.. 'పుష్ప-2' పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండి, సుకుమార్ తో సినిమా చేయడానికి బడా బడా స్టార్స్ ఆసక్తి చూపిస్తుండటంతో.. ఇక విజయ్ సినిమా ఆగిపోయినట్లేనని భావించారంతా. అందుకు తగ్గట్టుగానే తన తదుపరి సినిమాని రామ్ చరణ్ (Ram Charan) తో ప్రకటించాడు సుకుమార్. దీంతో ఇక విజయ్ ప్రాజెక్ట్ అటకెక్కినట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు విజయ్-సుకుమార్ కాంబినేషన్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. వీరి కాంబో మూవీ ఆగిపోలేదట. రామ్ చరణ్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక విజయ్ తో సుకుమార్ సినిమా చేస్తాడని తెలుస్తోంది. హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన న్యూ మూవీ 'గం గం గణేశా' కూడా ఇదే బ్యానర్ లో రూపొందడం విశేషం.
‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ పుట్టినరోజు వేడుకలు సోమవారం నాడు తెలుగువన్ కుటుంబం సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. నిజానికి కంఠంనేని రవిశంకర్ పుట్టినరోజు ఆదివారం, మే 19. నిన్న వారాంతపు సెలవు కావడం వల్ల ఆయన తెలుగువన్ ఫ్యామిలీ మెంబర్లందరి నుంచి ‘డిజిటల్ పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అందుకున్నారు. సోమవారం నాడు తెలుగువన్ కుటుంబం సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. కంఠంనేని రవిశంకర్ గత పాతికేళ్ళుగా తన పుట్టినరోజు వేడుకలను తెలుగువన్ కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరుపుకుంటూ వస్తున్నారు. ఆ సంప్రదాయాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా తెలుగువన్ కుటుంబ సభ్యుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్న కంఠంనేని రవిశంకర్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.  అనంతరం కంఠంనేని రవిశంకర్ మాట్లాడుతూ, ‘‘ఇది నాకు 25వ పుట్టినరోజు. అంటే, ‘ఆబ్జెక్ట్ వన్‌ సంస్థను స్థాపించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ‘తెలుగువన్’ స్థాపించి వచ్చే ఏడాదికి పాతికేళ్ళు పూర్తవుతాయి. వచ్చే ఏడాది తెలుగువన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకుందాం. దేశంలోనే పాతికేళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నమొట్టమొదటి డిజిటల్ మీడియా సంస్థగా తెలుగువన్ నిలవబోతోంది. ఈ పాతికేళ్ళ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన తెలుగువన్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అన్నారు. ఈ పుట్టినరోజు వేడుకలలో ఆబ్జెక్ట్ వన్ డైరెక్టర్ కంఠంనేని హిమబిందు కూడా పాల్గొన్నారు.  
Padma Vibhushan Megastar Chiranjeevi’s GodFather impressed fans but it ended up as average at the box office. Fans celebrated Megastar’s screen presence, body language, dialogue delivery, and intensity are absolutely terrific and his charisma. The film is directed by Mohan Raja and bankrolled together by Super Good Films and Konidela Productions. Now, this combination is getting together for an action entertainer. Mohan Raja will direct Megastar once again. BVS Ravi penned the story for this film. The writer working on the script for two years and recently got a nod from Megastar Chiranjeevi. Mohan Raja will start the pre-production work very soon. Chiranjeevi’s daughter Sushmitha Konidela in association with People Media Factory will produce this prestigious project. The final budgets and the remunerations are locked. Chiranjeevi will be pocketing big remuneration for the film. The shoot is expected to start in August. Megastar is current busy with Vishwambhara directed by Vashishta and it is slated for Sankranthi 2025 release.
Highly anticipated film, Mirai stars Teja Sajja as The Super Yodha with visionary Karthik Ghattamaneni helming it and TG Vishwa Prasad of People Media Factory bankrolling marks Manoj’s debut in a universe brimming with action, adventure, and unparalleled excitement. After an electrifying hiatus of eight years, the charismatic and beloved Telugu cinema star, Rocking Star Manoj Manchu is making a monumental return to the silver screen, redefining the Super Hero’s universe with his latest avatar as 'The Black Sword.' In a grand reveal amidst his birthday, the makers have unveiled the first look glimpse of Manchu Manoj as The Black Sword and it looks spectacular. At the launch event, the actor reveals his happiness coming back after 8 years with Mirai. He thanked Karthik Gattamneni for the opportunity and said, "I've learnt patience in these 8 years after listening multiple stories and few impressed me which couldn't materialize. I thought Mirai will be the perfect film for my comeback." He also leaked that the film will be coming in 2 parts. The story is so vast, makers decided to go with 2 parts strategy. The film, set against the backdrop of the visually stunning and narrative-rich world of Mirai, promises to deliver a blend of traditional heroics and modern storytelling that will captivate audiences worldwide. It explores the secrets of Ashoka’s 9 unknown books, weaving history and mythology into an epic tale. Previously, Super Hero Teja Sajja’s glimpse was released and received a tremendous response, and now it’s Rocking Star Manoj Manchu’s turn on his birthday. He is not just back; he's here to make a statement that will echo through the corridors of the Telugu film industry and beyond. Ritika Nayak is the lead actress opposite Teja Sajja. Karthik Ghattamaneni penned the screenplay, alongside Manibabu Karanam who also wrote dialogues. Gowra Hari is the music director. Sri Nagendra Tangala is the art director of the movie, whereas Vivek Kuchibhotla is the co-producer. Krithi Prasad is the Creative Producer, whereas Sujith Kumar Kolli is the Executive Producer. Mirai will be released in multiple languages- Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam languages on April 18th in the summer in 2D and 3D versions.
'సైతాన్', 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ లతో తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందిన యంగ్ హీరోయిన్ దేవయాని శర్మ. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అ‌వుతున్న ఈ సిరీస్ లతో ఆమె నటిగా మంచి గుర్తింపు పొందింది. దర్శకుడు మహీ వి రాఘవ్ రూపొందించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్ 2' సిరీస్ దేవయాని శర్మకు ఫేమ్ తీసుకొచ్చింది. ఇలాగే ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ ప్రేక్షకాభిమానం పొందాలని కోరుకుంటున్నట్లు చెబుతోంది దేవయాని శర్మ. దేవయాని శర్మ స్పందిస్తూ.. "నటిగా నా ప్రతిభను గుర్తించి సైతాన్, సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లలో మంచి రోల్స్ ఇచ్చిన దర్శకుడు మహీ వి రాఘవ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సిరీస్ లలో నా నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి మరిన్ని మంచి అవకాశాలు అందుకోవాలని ఉంది. ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ నటిగా ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం కొన్ని ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ కు డిస్కషన్స్ జరుగుతున్నాయి." అన్నారు.
‘HanuMan’, starring Teja Sajja, was directed by Prasanth Varma, who took viewers by surprise in January 2024. The movie was a huge hit in Telugu and Hindi, and there is a lot of talk about the sequel, ‘Jai HanuMan’. Although it's still a work in progress, Prasanth Varma is busy with Bollywood star Ranveer Singh project, a massively budgeted period film. We've revealed that this biggie titled as "Brahmarakshasa." Ranveer Singh, Prasanth Varma and Mythri Movie Makers are confirmed to team up for a film. It will be the immediate film in Prasanth Varma's cinematic universe and will got onto the floors even before Jai Hanuman.  The film's formal Pooja was recently held. Ranveer Singh also joined the sets of Brahmarakshasa recently and the shoot is happening in Hyderabad. A massive set was constructed in the outskirts of Hyderabad and the shoot is happening in the set. Prasanth Varma will also cut a glimpse from this shoot. The makers will release the glimpse along with the official announcement soon. Mythri Movie Makers are on board to produce Brahmarakshasa which is planned on a budget of Rs 300 crores. Ranveer Singh is the only actor participating in the shoot of the film and he allocates four days for the shoot. The entire footage will be used only for the glimpse as per the exclusive update. Its a part of the movie Universe PVCU as well. The film will release in 2025.
"అక్కడొకడుంటాడు, మధురపూడి గ్రామం అనే నేను, రాఘవరెడ్డి" చిత్రాలతో ఆకట్టుకున్న బహుముఖ ప్రతిభాశాలి శివ కంఠంనేని టైటిల్ పాత్రలో గోసంగి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన "బిగ్ బ్రదర్" ఈనెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి-రిలీజ్ వేడుక నిర్వహించి, చిత్ర విజయంపై పూర్తి నమ్మకం వ్యక్తం చేసింది. ఈ వేడుకలో హీరో శివ కంఠంనేని, నిర్మాత ఆర్.వెంకటేశ్వరరావు, దర్శకులు గోసంగి సుబ్బారావు, చిత్ర సమర్పకులు జి.రాంబాబు యాదవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాసరావు, ఈ చిత్రంలో నటించిన గుండు సుదర్శన్, రాజేంద్ర, ప్రముఖ నటులు మురళీమోహన్, అశోక్ కుమార్, నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు పాల్గొన్నారు. తెలుగులో పలు చిత్రాలు రూపొందించి భోజపురిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న గోసంగి సుబ్బారావు రీ-ఎంట్రీ ఇస్తూ తెరకెక్కించిన "బిగ్ బ్రదర్"లో సక్సెస్ కళ పుష్కలంగా కనబడుతోందని, హీరో శివ కంఠంనేని ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మురళీమోహన్ పేర్కొన్నారు. "బిగ్ బ్రదర్" లాంటి చిన్న సినిమాల విజయమే చిత్ర పరిశ్రమకు శ్రీరామరక్ష అని దామోదర్ ప్రసాద్, అశోక్ కుమార్ అన్నారు. తను నటించే ప్రతి చిత్రంలో అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో నటుడిగా అద్భుతంగా రాణిస్తున్న శివ కంఠంనేని "బిగ్ బ్రదర్"తో మరింత గుర్తింపు పొందాలని, "బింబిసార" చిత్రానికి ఫైట్స్ డిజైన్ చేసిన రామకృష్ణ "బిగ్ బ్రదర్"కి రూపకల్పన చేసిన పోరాటాలు ప్రత్యేక ఆకర్షణ అని ప్రభు పేర్కొన్నారు. "ప్లానింగ్ కి పెట్టింది పేరైన గోసంగి సుబ్బారావు తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ తెరకెక్కించిన "బిగ్ బ్రదర్"లో టైటిల్ రోల్ ప్లే చేయడం గర్వంగా ఉందని" హీరో శివ కంఠంనేని అన్నారు. "యాక్షన్ ఎంటర్టైనర్స్ ను ఇష్టపడేవారిని బిగ్ బ్రదర్ చక్కగా అలరిస్తుందని, ఈనెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో "బిగ్ బ్రదర్"ను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నామని" నిర్మాత ఆర్.వెంకటేశ్వరరావు, సమర్పకులు జి.రాంబాబు యాదవ్ తెలిపారు. ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల విశ్వ కార్తికేయ, గుండు సుదర్శన్, రాజేంద్ర సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర దర్శకులు గోసంగి సుబ్బారావు మాట్లాడుతూ... "అనుకోకుండా భోజపురి పరిశ్రమకు వెళ్లి, ఇప్పటికి 15 సినిమాలు చేశాను. అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. చాలా రోజుల తర్వాత తెలుగులో "బిగ్ బ్రదర్"తో రీ ఎంట్రీ ఇస్తుండడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఇకపై వరసగా తెలుగులో పాన్ ఇండియా సినిమాలు చేస్తాను" అన్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై జి.రాంబాబు యాదవ్ సమర్పణలో కె. శివశంకర్ రావు - ఆర్.వెంకటేశ్వరరావు "బిగ్ బ్రదర్" చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఘంటా శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో శివ కంఠంనేని సరసన ప్రియా హెగ్డే నటించగా... శ్రీ సూర్య, ప్రీతి శుక్లా ఇంకో జంటగా నటించారు. గౌతంరాజు, గుండు సుదర్శన్, రాజేందర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ప్రకాష్, ఎడిటర్ గా సంతోష్ వ్యవహరించారు.
Anand Deverakonda's next "Gam Gam Ganesha," directed by debutant Uday Shetty. Pragati Srivastava of Peddha Kapu 1 fame and Nayan Sarika are playing key roles. The teaser of the film created huge interest on the film. Every content from the film received well. Today, the makers released the theatrical trailer at a grand launch event. The trailer begins with Anand Deverakonda and his friend discussing their plans to become millionaires. Anand's character is a thief who falls in love with Neelaveni, played by Pragati Srivastava. After a few funny moments, the chaos begins. As the trailer progresses, more crazy characters are introduced, leading to confusion. Gunfire, action sequences, and chases promise a thrilling comedy entertainer. The trailer introduces Vennela Kishore, Satyam Rajesh, Raj Arjun, and others in key roles who significantly impact the story. Overall, the trailer is packed with hilarious moments, action elements, and compelling visuals, accompanied by a terrific background score. It raises expectations for the film, which is set to release worldwide in theaters on May 31st. Gam Gam Ganesha looks like a perfect quirky entertainer. Karishma, Vennela Kishore, Jabardast Emmanuel play other key roles in the film. Kedar Selagamsetty and Vamsi Karumanchi produced the movie under the Hy-Life Entertainment banner. The film is co produced by Anurag Paravatheneni.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతి మనిషి జీవితంలో ఎన్నో బంధాలు ఉంటాయి. తల్లిదండ్రులు, స్నేహితులు, చుట్టాలు, తెలిసిన వారు ఇలా చాలామంది జీవితంలో  ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. తల్లిదండ్రులు కన్నవారు కాబట్టి వారు జీవితాంతం పిల్లల విషియంలో పాజిటివ్ గానే ఉంటారు. ఇక స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు ఈ బంధాలన్నీ బయటినుండి వచ్చేవే.. అయితే అన్నింటి కంటే భాగస్వామి పాత్ర మాత్రం చాలా పెద్దది. జీవితంలో ఓ దశలో బంధంలోకి వచ్చి చివరి వరకు కలసి ఉండేవారు జీవిత భాగస్వాములు.  జీవిత భాగస్వాములతో బంధం  ఎంత బలంగా ఉంటే ఇద్దరి జీవితం, ఇద్దరి భవిష్యత్తు  అంతే గొప్పగా ఉంటుంది. ఈ బంధం ఎంత బలంగా ఉందో నిర్ణయించే   5 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు దొరికే సమాధానాలే బంధం బలాన్ని స్పష్టం చేస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేస్తున్నారా.. ఒక బంధం బలంగా ఉండాలంటే దానికి ముఖ్యంగా మంచి కమ్యూనికేషన్ అవసరం. మీరు,  మీ భాగస్వామి,  మీ ఆలోచనలు, భావాలు,  అవసరాలను బహిరంగంగా వ్యక్తపరచగలరో లేదో అంచనా వేయాలి.  ఒకరు చెప్పేది మరొకరు శ్రద్దగా వింటున్నారా? ఇద్దరి మధ్య చర్చలు వివాదాలు  వాదనలుగా మారుతున్నాయా? ఇలాంటివి  వివాదాలుగా మారకుండా   పరిష్కరించగలుగుతున్నారా? ఇవన్నీ కమ్యూనికేషన్  సమర్థవంతంగా ఉందా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తాయి.  కమ్యూనికేషన్ బాగుంటే ఇద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం, నమ్మకం పెరుగుతాయి. ఏకభావం.. బలమైన బంధానికి  భాగస్వాముల విలువలు, ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ఎలా ఉంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది . మీరు అయినా,  మీ భాగస్వామి అయినా, ఇద్దరి  ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నారా? ఇద్దరి నిర్ణయాలు  కెరీర్, కుటుంబం, జీవనశైలి లేదా వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించినవా అని ఆలోచించాలి. ఇద్దరూ జీవితంలో ఎలాంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు?  వంటివి ఇద్దరూ భవిష్యత్తు కోసం ఎంత మాత్రం ఏకభావంతో ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.  సంఘర్షణలు.. ఏ సంబంధంలోనైనా సంఘర్షణలు  తప్పనిసరిగా ఉంటాయి. అయితే వాటిని ఎలా డీల్ చేస్తారనే దానిపైనే బంధం ఆధారపడి ఉంటుంది.   భాగస్వామితో కలిగే  విభేదాలు,  సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో, ఎలా ఎదుర్కోవాలో పరిశీలించాలి. గొడవలు జరిగినప్పుడు రాజీ పడటం,  పరిష్కారం కోసం ప్రయత్నించడం వంటివి ఏ మేరకు జరుగుతున్నాయో తరచి చూసుకోవాలి.    వివాదాలు పెరుగుతున్నాయా?  వాటిని పరిష్కరించుకోవడానికి ఎంత సమయం తీసుకుంటున్నారు?  ఆరోగ్యకరమైన  రీతిలో గౌరవం మరియు పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలను కనుగొనే సుముఖత ఉంటాయి. భావోద్వేగాలు.. భావోద్వేగ సాన్నిహిత్యం భౌతిక సాన్నిహిత్యానికి మించినది.  భాగస్వామితో భావోద్వేగ పరంగా లోతుగా కనెక్ట్  అయితే  ఇద్దరి మధ్య బంధం కూడా బలంగా ఉంటుంది. ఇద్దరి ఆలోచనలు, భయాలు , ఇబ్బందులను ఒకరితో మరొకరు సరిగా ఓపెన్ అయ్యి చెప్పుకుంటున్నారా?  అవసరమైన సందర్భాలలో ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారా?  ఇవన్నీ ఇద్దరి మధ్య బంధం ఎంత గాఢంగా ఉందో తెలియజేస్తుంది.  పెట్టుబడి.. ఏ వ్యాపారానికి అయినా ఎలాగైతే డబ్బు, కష్టం పెట్టుబడిగా పెడతారో.. అదే విధంగా  బంధం బలంగా ఉండటానికి సమయం పెట్టుబడి పెట్టాలి. ఇద్దరూ ఒకరికోసం ఒకరు సమయం ఎలా కేటాయించుకుంటున్నారనే దానిపై బంధం ఆధారపడి ఉంటుంది. ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో చురుకుగా ఉంటున్నారా?. ఇద్దరూ  కలిసి  క్వాలిటీ టైమ్ మెయింటైన్ చేస్తున్నారా?  ఒకరి అవసరాలకు మరొకరు ప్రాధాన్యత ఇస్తున్నారా? ఒకరిని మరొకరు మెచ్చుకోవడం, ప్రోత్సహించడం, సపోర్ట్ ఇవ్వడం  వంటివి చేస్తున్నారా? ఇవన్నీ ఒక బంధం బలపడటానికి పెట్టుబడులే.                                                       *రూపశ్రీ.
పొగిడి చెడినవాడు లేడు. సమయోచితంగా పొగడలేని వారు అన్ని చోట్లా చెడిపోతారు. జీవితంలో కొందరికి జ్ఞానం ఒక దశలో వస్తుంది. అంతకు క్రితం నష్టమైపోయిన కాలాన్ని కూడదీసుకోవడానికి అన్నట్లుగా జ్ఞానోదయమైన మరుక్షణం నుండి అవతలివారిని అమితంగా, భరించలేనంతగా పొగడడం నేర్చుకుంటారు. ఇలాంటి వ్యక్తి తాను పొగిడేవాణ్ణి ఆకాశానికి ఎత్తేస్తాడు. 'ది స్కై ఈజ్ ది లిమిట్” అని రుజువు చేస్తాడు. అవతలి వ్యక్తి అలిసిపోయేంత వరకూ, లేక తాను అలిసేంత వరకూ పొగుడుతాడు.  ఒక్కొక్కసారి అక్కడ పొగడడానికి తగినంత విషయం లేనప్పుడు అతడి ఇంట్లో తనకు ఆతిథ్యమిచ్చిన ఆయన సతీమణి అమృతహస్తాన్ని, ఆవిడ వండి వడ్డించిన పదార్థాలు ఎంత రుచికరంగా వుంటాయో ఇలాంటి విషయాలను ఇరికించి మరీ చెప్తాడు. ఇలాంటి సబ్జక్టును గురించి ఎంతైనా చెప్పే వీలుంది. ఆ వంకాయ కూర, ఆ పాయసం, వారింటి నెయ్యి ఘుమఘుమలు, ఇట్లా చెప్పుకుపోతూ వుంటే దీనికి అంతుందా అనిపిస్తుంది. అక్కడ సన్మానంలో సన్మానితుడూ, ఉపన్యాసకుడూ అలసి పోయేలోగా శ్రోతలమైన మనం అలసిపోవడం ఖాయం. ఇలా ప్రసంగించేవాడికి సన్మానితుడు అసలెవరో తెలీని సందర్భాలు కూడా ఎదురావుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ ప్రాసంగికుడు ఏ మాత్రం జంకడు. ఎవర్ని సన్మానిస్తున్నారో వారిని గురించి చీటిమీద మూడు ముక్కలు వ్రాసి ఇలా ఇవ్వండి. మూడునిమిషాల్లో ప్రసంగ పాఠంతో రెడీ అయిపోతాను. మీరు వేదికమీద ఆహ్వానితులు నలుగురికీ పూలమాలలు వేసేలోగా నా చెవిలో నాలుగుముక్కలు ఊదితే దంచి పారేస్తాను. ఎవరిని గురించి చెప్పే వాక్యాలైనా నాకు కంఠస్థమే, తడుము కోవలసిన అవసరముండదు. రాజకీయ, పారిశ్రామిక, విద్యావేత్తలెవరైనా సరే, కళాకారులు, సినిమా స్టారులైనా సరే. ఎవరికి తగిన సన్మాన వాక్యాలు వారికి వప్పజెప్పడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగానే వుంటాను. గుటికెడు కాఫీ సేవించి గొంతు సవరించానంటే ఇక ఆ తర్వాత ఉపన్యాసం అనర్గళంగా సాగిపోతుంది" అని హామీ ఇస్తాడు. అన్ని రంగాల్లోనూ స్పెషలైజేషన్ చోటు చేసుకున్న నేటి కాలంలో పొగిడే కళలో కొందర్ని తర్ఫీదు చేసి, వారికి లైసెన్స్ మంజూరు చేయడంలో తప్పేమీ కనిపించదు అనిపిస్తుంది. ఈ లలితకళను శాస్త్రీయంగా ఎక్కడా అభ్యసించకపోయినా, అనేక సంవత్సరాల అలవాటు కొద్దీ దీనిని క్షుణ్ణంగా నేర్చినవారు మన రాష్ట్రంలో ఎందరో వున్నారు. ఇలాంటివి నేర్పటానికి  నెలకొల్పే సంస్థల్లో ప్రస్తుతానికి వీరిని అధ్యాపకులు గానూ, శిక్షకులుగానూ నియమించవచ్చు. ఒక బాచ్ విద్యార్థులు శిక్షణ పొందితే ఇక ఆ తర్వాత కావలసినంత మంది అధ్యాపకులు. సమోవా అనే చిన్న రాజ్యానికి ఒక రాజుండేవాడు. అతడి రాజ్యంలో డాక్టర్ విన్సెంట్ హైనర్ అనే పెద్దమనిషి కొన్నాళ్ళుండి కొంత ప్రజాసేవ చేశాడు. డాక్టరు మహాశయుడు ఆ రాజ్యాన్ని వదలి వెళ్ళే తరుణంలో ఆ రాజుగారు ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేశాడు. ఆ సందర్భంగా రాజు డాక్టర్ను గురించి నాలుగు వాక్యాలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కాని రాజు కుర్చీలో కదలకుండా కూచున్నాడు. రాజు లేచి నుంచోని ప్రసంగించకుండా అలానే కూచోనుండటం డాక్టర్ హైనర్కు ఆశ్చర్యం కలిగించింది. ఈలోగా పొగడ్తనే వృత్తిగా చేసుకున్న ఒక వక్త వచ్చి రాజు తరపున డాక్టర్ హైనర్ గురించి బ్రహ్మాండమైన వాక్యాలతో దంచి పారేశాడు. సుదీర్ఘమైన ఆ ప్రశంసా వాక్యాల తర్వాత హైనర్ కొంత కింధా మీదై. ఉచిత రీతిని సమాధానం చెప్పడానికి లేచి నుంచోబోయాడు. రాజుగారు హైనర్ను వారిస్తూ కూచోమంటూ సౌంజ్ఞ చేశాడు. "మీ తరపున ప్రసంగించటానికి కూడా ఒక వక్తను నియమించాను. ఇక్కడ మా రాజ్యంలో ఇలాంటి ప్రసంగాలు ఆ వృత్తి స్వీకరించిన వారే చేస్తారు. ఔత్సాహికుల్ని ప్రోత్సహించడం మా పద్ధతి కాదు" అని వివరించాడు. ఇది పొగడటానికి కూడా ఎంత ప్రతిభ ఉండాలో తెలియజేస్తుంది. వాక్చాతుర్యం మనిషికి ఎంత ముఖ్యమో స్పష్టపరుస్తుంది.                                    ◆నిశ్శబ్ద.
ఎవరైనా తమ వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాలి అనుకున్నప్పుడు మనల్ని మనం కొంత మెరుగుపరచుకోవాల్సి వుంటుంది. ఒక పద్ధతిలో ప్రయత్నిస్తే అది అసాధ్యమేమీ కాదు. ‘కష్టపడటం’ ఒక్కటే కాదు.. ఒక క్రమపద్ధతిలో ప్రయత్నించడం అవసరం. అందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ సూచనల్లో మొట్టమొదటి సూచన... సమాచార సేకరణ. కేవలం చదువుకునే విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికే ‘సమాచారాన్నిసేకరించే’ అవసరం వుంటుంది అనుకోవటం పొరపాటు అంటున్నారు నిపుణులు. పత్రికలు, ఇంటర్నెట్ వంటివి ‘విశ్వవ్యాప్త సమాచారాన్ని’ మన ముందు వుంచుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని తెలుసుకుంటూ అప్‌డేట్‌గా వుంటటం మనల్ని, మన వ్యక్తిత్వాన్ని, మన అవకాశాలని మెరుగుపరిచే మొట్టమొదటి అంశం అట. ‘అసాధ్యాలు’ అంటూ ప్రపంచం ముద్రవేసి వదిలేసిన వాటిని కూడా ఛాలెంజ్ చేసి సాధించినవారి కోసం వింటూంటాం. ఏంటి వాళ్ళ ధైర్యం అనిపిస్తుంది. వాళ్ళ ధైర్యమల్లా వారి బలాలని వారు  కరక్టుగా అంచనా వేయటమే. ఎప్పుడూ మన బలాలు, బలహీనతల గురించి సరైన అవగాహన కలిగి వుండాలన్నది నిపుణులు చేస్తున్న రెండో సూచన. ఓ పేపర్ పైన మన బలం, సామర్థ్యం వంటి వాటిని రాసిపెట్టుకోవాలి. అలాగే మన బలహీనతలు, భయాలు వంటి వాటిని ఇంకో కాగితం మీద రాసి పెట్టుకోవాలి. దగ్గరి వ్యక్తులకి ఈ రెండు కాగితాలనీ చూపించి వారి సూచనలు అడగండి. అప్పుడు బలాలు, బలహీనలతని సమీక్షించుకుని... ఏం చేయొచ్చో.. ఏం చేయగలమో నిర్ణయించుకోవడం సులువవుతుంది. మనల్ని మనం మెరుగుపరచుకోవటానికి పెద్ద అడ్డంకి మన ‘భయాలు’. కొత్త వ్యక్తులతో మాట్లాడటమన్నా, నలుగురిలో తిరగడమన్నా, కొత్తపని మొదలుపెట్టడమన్నా భయపడేవాళ్ళు వుంటారు. ఆ భయాలని వదిలించుకోవటం ఏమాత్రం ఇష్టంలేదన్నట్టు పట్టుకుంటారు. అయితే మనల్ని మనం గెలవలేనప్పుడు ప్రపంచాన్ని ఏం గెలవగలం చెప్పండి? అందుకే ముందు మీలోని ఒక భయాన్ని గుర్తించి దాన్ని ఎదుర్కోవటం మొదలుపెట్టండి. నలుగురిలో తిరగటం భయమనుకోండి.. కష్టంగా అనిపించినా నలుగురిలో కలవటం మొదలుపెట్టాలి. కొన్ని రోజులపాటు ఇబ్బంది అనిపిస్తుంది. పారిపోవాలనిపిస్తుంది. అయినా వెనక్కి తగ్గక ప్రయత్నిస్తే ఒకరోజున అది అలవాటుగా మారిపోతుంది. ఒక భయాన్ని దాటగలిగినా చాలు- ఆ అనుభం, దాని నుంచి లభించిన ఆత్మవిశ్వాసం మిగిలిన భయాలని సులువుగా దాటేలా చేస్తాయి. మన మాటలు సూటిగా, స్పష్టంగా వుండాలి. అవి సూటిగా, స్పష్టంగా వుండాలంటే మన ఆలోచనలు కూడా స్పష్టంగా వుండాలి. మన ఆలోచనలు గజిబిజిగా వున్నప్పుడు సూటిగా మాట్లాడలేం. సూటిగా మాట్లాడని వ్యక్తుల మాటలకు సమాజంలో గౌరవం వుండదు. అందుకే మన పరిసరాలని శుభ్రం చేసుకున్నట్టు మన ఆలోచనలనీ క్లియర్‌గా పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. అలాగే మన పనితీరు కూడా గజిబిజిగా కాకుండా ఒక పద్ధతిగా వుండాలి. అది మనల్ని రిలాక్స్‌గా వుంచుతుంది. అలాగే చూసేవారికీ మనపట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. నమ్మకం కుదురుతుంది. ఒత్తిడిని దూరంగా ఉంచగలిగితే చాలు... మన సామర్థ్యం రెండురెట్లు పెరుగుతుందట. అలా ఒత్తిడికి దూరంగా వుండాలంటే పనితీరు, సమయపాలన, పని విభజన వంటి వాటి పట్ల దృష్టి పెట్టాలి. అప్పుడు మన సామర్థ్యాన్ని వందశాతం వినియోగించుకోగలుగుతాం. అలాగే ఏ సమయంలోనైనా ఆత్మవిశ్వాసంతో, చెరగని చిరునవ్వుతో కనిపించే వ్యక్తులని ఇష్టపడని వారుండరు. చుట్టూ మనల్ని ఇష్టపడేవారి సంఖ్య పెరిగినకొద్దీ మన జీవితం ఆనందంగా మారిపోతుంది. కాబట్టి మనల్ని మనం ‘సరికొత్తగా’ ఆవిష్కరించుకోవడం అసాధ్యమేమీ కాదు. దీనికోసం నిపుణులు చేసిన సూచనలని తెలుసుకున్నారుగా.. ఇక ప్రయత్నించడమే మిగిలి వుంది. .....రమ  
నేడు దేశంలో ని సగానికి పైగా యువత తక్కువ వయసులోనే జుట్టు ఊడిపోవడం, బట్టతల సమస్య ఎదుర్కుంటున్నారు.ఈ సమస్యవల్లె చాలామందికి పెళ్ళికూడా కాక పోవడం సంభవిస్తోంది అందరిముందు బట్టతల తో తిరగాలంటే సిగ్గుపడడం గమనించవచ్చు. ఇందుకోసం అందంగా కనపడడానికి బాగా జుట్టుపెరగాదానికి చేయని ప్రయాత్నం అంటూ లేదు అందుకోసం పడుతున్న పడరాని పాట్లు వర్ణనాతీతం చివరగా ఎదిక్కులేక హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ అంటే జుట్టు మార్పిడి చేయించుకోడానికి సిద్ధమౌతున్నారు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసేందుకు ఇబ్బిడి ముబ్బిడిగా పుట్టుకొస్తున్న నేపధ్యంలో మే నెలలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వల్ల ౩5 సంవత్సరాల వ్యక్తి మృతి చెందం తీవ్ర కలకలం రేపింది. డిల్లి నార్త్ వెస్ట్ ప్రాంతం లోనిరోహిణి లో  హెయిర్ టాన్స్ ప్లాంట్ చేస్తున్న సమయంలో రోగి మరణిం చడం పై డిల్లి హైకోర్ట్ తీవ్రంగా పరిగణిస్తూ కేంద్రం ప్రభుత్వాలు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసేవారిపట్ల వైద్య నియమ నిబందనలు అనుగుణంగా ఉన్నాయో లేదో చూడాలని డిల్లి హైకోర్ట్ ఆదేశించింది. ఇందుకోసం జాతీయ స్థాయి ప్రమాణాలు నియమ నిబందనలకు అనుగుణంగా పరిశీలించాలని నష్నల్ మెడికల్ కమీషన్ కు ఆదేశాలు జారీచేసింది. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సమయంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించేందుకు అత్యవసర సమయంలో అందించాల్సిన చికిత్చలు కు సత్వరం అందించేందుకు సమీపంలో పెద్ద ఆసుపత్రులలో నిర్వహించాలని క్లినిక్ నిర్వాహకులకు సూచించింది.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వల్ల జీవితం అంతమై పోదు, మరనిస్తారాని కాదు నష్నల్ మెడికల్ కమీషన్ తీసుకున్న నిర్ణయం పట్ల హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది ప్రముఖ ఆసుపత్రులలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ నిర్వహిస్తే ఇబ్బందులు తప్పవని ప్రైవేట్ ఆసుపత్రులలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ బృందం ఉంటుందని క్లినిక్లకు పెద్దసవాలు కాగలదని హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ చండి జైన్ గుప్తాఅన్నారు ప్రైవేట్ క్లినిక్లను కార్పోరేట్ పెద్ద ఆసుపత్రులు అనుమతించ బోవని ఆయా ఆసుపత్రుల నుండి సవాళ్లు తప్పవని డాక్టర్ మయాంక్ సింగ్ అన్నారు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సమయం లో అనుసరించే పద్ధతి అలసటతో కూడుకున్నది పెద్ద పెద్ద వసతులు ఉన్నప్పుడు ఎంపిక సులభమని అన్ని సదుపాయాలు ఉన్న చోట అనుభవజ్ఞులైన వైద్యుల సేవలు అందుతాయని పి ఎస్ ఆర్ ఐ ఆసుపత్రి ఎల్లప్పుడూ స్వగాతిస్తుందని వైద్యులు అన్నారు.అయితే దీనికోసం నూతన విధి విధానాలు అమలు చేయాలని సరైన సదుపాయాలూ శిక్షణ లేని వారుహెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ నిర్వహించడం వల్ల ప్రజల ప్రాణాలకు హానికలిగే అవకాసం ఉంది. డిల్లి లో సరైన సదుపాయాలు లేని ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ లు చాలానే ఉన్నాయాని పద్దతి ప్రకారం నిర్వహించే ట్రాన్స్ ప్లాంట్ కు 1.5 నుండి 2 లక్షలు అవుతుందని అంటున్నారు నిపుణులు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ పరిశ్రమను నూతన జవసత్వాలు కల్పించడం నాణ్యత ప్రమాణాలు సాడుపాయాలు లేని ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ లపై ఉక్కు పాదం మోపడం అంటే నియంత్రించడం. జాతీయ ఆరోగ్య మిషాన్ ఎన్ ఎం సి నియమ నిబంధనల అనుగుణంగా పనిచేయాలని పేర్కొంది.ఈ విషయాన్ని మోడ్రన్ ఈస్థటిక్స్ స్వాగతించింది.ఇది కేవలం డే కేర్ సర్జరీ మాత్రమే అనిస్పష్టం చేసారు. ఎన్ ఎం సి నిబందనల ప్రకారం ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ కు సమీపం లో నర్సింగ్ హోం ఉండాలన్న నిబంధన విధించిందన్న విషయం గుర్తుచేశారు. అత్యవసర మైన పక్షం లో అవసరమైన సమయం లో చేర్చేందుకు అవసరమైన వైద్య సదుపాయాలు ఉండడం అత్యవసరమని పేర్కొంది తద్వారా రోగిని ప్రమాదం నుండి తపాయించావచ్చని పేర్కొంది. అయితే ట్రాన్స్ ప్లాంట్ లో సమయంలో ప్రమాదం జరగడం అరుదని డాక్టర్ గుప్తా అన్నారు.ఈ మధ్యకాలం లో దేశవ్యాప్తంగా చోటు చేసుకోవడం పై గుప్తా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. సర్జరీ సమయం లో ప్రత్యేక పద్దతి అనుసరించాలాని బలమైన అనస్తీషియా బృందం ఉండాలాని ఎందుకంటే దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయాని చాలా క్లినిక్స్ లో డర్మటాలాజిస్ట్ లు లేదా ప్లాస్టిక్ సర్జన్స్ ఎనేస్తీషియా ఎక్స్ పర్ట్ గా వ్యవహరిస్తున్నారని వారి వద్ద సురక్షిత మైన వారు లేరని రోగులు తీవ్రమైన విచిత్ర మైన పరిస్థితులు ఎదుర్కోవడం సంభవిస్తుందని అందుకే అప్రమత్తం గా ఉండాలని ఎన్ ఎం సి హేచారించింది.ఎన్ ఎం సి నియనిబంధనలకు లోబడే ప్లాస్టిక్ సర్జన్లు ఉండాలి. అర్హత లేని వ్యక్తుల పై చట్టప్రకారం చర్యలు ఉంటాయాని ఎన్ ఎం సి హెచ్చరించింది.                                          
ఒక లీటరు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌లో సగటున 2.4 లక్షల ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయట.  నానో ప్లాస్టిక్ కణాలు శరీరంలో అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అటు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంద‌ని,  ప్రాణాంతక వ్యాధులపై.... బెర్లిన్ - జర్మనీలో జ‌రిగిన‌ మెడికల్ కాన్ఫరెన్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే బెథాలేట్ అనే రసాయనం నీటిలో కలుస్తుంది. ఆ నీరు త్రాగినప్పుడు, అది రక్తంలో కలిసిపోతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాదు పురుషులలో స్పెర్మ్ కౌంట్‌తో పాటు, నాణ్యత  తగ్గుతుందని మెడికల్ కాన్ఫరెన్స్ హెచ్చ‌రిస్తూ,  కొన్ని సూచ‌న‌లు విడుద‌ల చేసింది.   1. చమురును తిరిగి ఉపయోగించ వద్దు   2. పొడి పాలు వద్దు   3. మ్యాగీ క్యూబ్స్ వద్దు   4. కార్బోనేటేడ్ జ్యూసులు వద్దు (లీటరుకు 32 చక్కెర ఘనాలు ఉంటాయి)   5. ప్రాసెస్ చేసిన చక్కెర వద్దు   6. మైక్రోవేవ్ చేసిన తినుబండారాలు    7. ప్రినేటల్ మామోగ్రామ్ వద్దు, కానీ ఎకోమామర్ ఉపయోగించవచ్చు   8. చాలా బిగుతుగా ఉండే బ్రాలను ధరించవద్దు   9. మద్యం వద్దు   10. చ‌ల్ల‌గా వున్న‌ భోజనాన్ని మళ్లీ వేడి చేయకూడదు   11. ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవద్దు.   12. అన్ని గర్భనిరోధక మాత్రలు మంచివి కావు ఎందుకంటే అవి మహిళ యొక్క హార్మోన్ల వ్యవస్థను మార్చి క్యాన్సర్‌కు కారణమవుతాయి.   13. డియోడరెంట్స్ ప్రమాదకరమైనవి, ముఖ్యంగా షేవింగ్ తర్వాత ఉపయోగించినప్పుడు.   14. డబ్బా పాల కంటే తల్లి పాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ.   15. క్యాన్సర్ కణాలు ఎక్కువగా చక్కెర మరియు అన్ని కృత్రిమ చక్కెర, బ్రౌన్ చక్కెరను కూడా తింటాయి.   16. తన ఆహారంలో చక్కెరను మానుకున్న క్యాన్సర్ రోగి తన వ్యాధి తగ్గుముఖం పట్టి దీర్ఘాయుష్షును పొందగలడు.  షుగర్ = ప్రాణ శత్రువు.   17. ఒక గ్లాస్ బీర్ శరీరంలో 5 గంటలు ఉంటుంది మరియు ఈ సమయంలో ఈ గ్లాస్ కారణంగా వ్యవస్థ యొక్క అవయవాలు స్లో మోషన్‌లో పనిచేస్తాయి.   18. చక్కెరకు బదులుగా సహేతుకమైన పరిమాణంలో తేనె   19. మాంసానికి బదులుగా బీన్స్ వంటి కూరగాయల ప్రోటీన్లు   20. పళ్ళు తోముకునే ముందు ఖాళీ కడుపుతో రెండు గ్లాసుల నీరు మరియు నిద్ర లేవగానే అదే గది ఉష్ణోగ్రత వద్ద గదిలో ఉంచిన నీరు త్రాగాలి   21. క్యాన్సర్ నిరోధక రసం:    కలబంద + అల్లం + పార్స్ లీ + సెలెరీ + బ్రోమెలైన్ (పైనాపిల్ మిడిల్).. మిక్స్ చేసి ఖాళీ కడుపుతో త్రాగాలి.   22. ప్రతి రోజూ పచ్చి లేదా వండిన క్యారెట్లు లేదా వాటి రసాన్ని తినండి/త్రాగండి.   23. ప్లాస్టిక్ కప్పులో టీ తాగవద్దు   24. కాగితం లేదా ప్లాస్టిక్ సంచిలో వేడి తినుబండారాలు ఏమీ తినవద్దు.  ఉదాహరణ: బంగాళదుంపలు (ఫ్రైస్).   25. మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్‌ని ఉపయోగించవద్దు - ఎం.కె. ఫ‌జ‌ల్‌
ఎండుద్రాక్ష సాధారణంగా పాయసం, స్వీట్ల తయారీలో ఉపయోగిస్తారు. కొన్నిచోట్ల వంటకాలలోనూ, స్పైసీ స్నాక్స్ లో కూడా వీటిని జత చేస్తుంటారు. అయితే ఎండుద్రాక్షను నానబెట్టి తినమని అమ్మమ్మల మొదలు అమ్మలు కూడా చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఎండుద్రాక్ష నానబెట్టుకుని తినడం వల్ల చాలా ఆరోగ్యమని అంటారు.  ఎండుద్రాక్షను నానబెట్టి ప్రతిరోజూ తింటే  కలిగే అద్భుత ఫలితాలు ఇవే.. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.. రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం   గుండెకు చాలా మంచిది.  నానబెట్టన ఎండు ద్రాక్ష  శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి  మంచి కొలెస్ట్రాల్ ను  ప్రోత్సహిస్తుంది . ఇది  ధమనులలో ఏర్పడే  ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిని తినడం వల్ల ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి ఇది స్ట్రోక్,  గుండె జబ్బుల నుండి  రక్షించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. యాంటీ ఆక్సిడెంట్లు  శరీరంలో ఫ్రీ రాడికల్స్ డ్యామేజీని తగ్గిస్తాయి. ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు త్వరగా విడుదలవుతాయి. యాంటీ-ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి  రక్షించడంలో సహాయపడతాయి. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.. ఎండు ద్రాక్ష  బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎండుద్రాక్ష తినడం వల్ల  చాలా శక్తి లభిస్తుంది, దీని వల్ల  పదే పదే ఆకలి అనిపించదు.   ఆహారం ఎక్కువగా తినాలనే  కోరికలు కూడా తగ్గుతాయి. ఆహారం నియంత్రణ కారణంగా  బరువు పెరిగే అవకాశాలు తగ్గుతాయి.  తద్వారా  బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. రక్తపోటును నిర్వహిస్తుంది.. ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది రక్త నాళాలు గట్టిపడకుండా నిరోధిస్తుంది. దీని కారణంగా రక్తపోటు ఎక్కువగా ఉండదు. ఒకవేళ రక్తపోటు ఎక్కవగా ఉంటే దాని ప్రభావం తగ్గిస్తుంది.  అంతేకాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది, ఇది అధిక రక్తపోటును కూడా నివారిస్తుంది. కాబట్టి రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల  రక్తపోటు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియకు ప్రయోజనకరం.. ఆహారం జీర్ణం కావడానికి,  మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి ఫైబర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండుద్రాక్షలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల  పేగు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ప్రేగులలో ఆహారాన్ని తరలించడంలో సహాయపడుతుంది, ఇది ఉబ్బరం,  మలబద్ధకాన్ని నివారిస్తుంది. కాలేయానికి మంచిది.. బయోఫ్లావనాయిడ్స్ ఎండుద్రాక్షలో ఉంటాయి. ఇవి  రక్తం,  కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి . యాంటీ-ఆక్సిడెంట్లు  కూడా ఎండుద్రాక్షలో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కాలేయానికి మేలు చేస్తాయి. శరీరం నుండి విషాన్ని తొలగించడానికి ఆరోగ్యకరమైన కాలేయాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల ప్రతిరోజూ రాత్రిపూట ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి తినడం  కాలేయానికి ప్రయోజనకరంగా ఉంటుంది.                                                     *నిశ్శబ్ద.