కూటమి పార్టీల మధ్య.. మరీ ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన మధ్య ఐక్యతకు విఘాతం కలిగేలా ఒంగోలు కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కూటమిలో భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన ఒంగోలు నేతల మధ్య నెలకొన్న విభేదాలు రోడ్డున పడి మీడియా సమావేశంలో పరస్పరం విమర్శలు, ఇరోపణలూ చేసుకునే వరకూ వెళ్లింది. ఈ విషయంలో  ఇరు పార్టీల అగ్రనాయకత్వం జోక్యం చేసుకుని ఇరువురు నేతలకూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో పరిస్థితి కొంత వరకూ సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా.. అసలు పరిస్థితి ఇంత వరకూ రావడానికి కారణం ఎవరన్న దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు.   ముఖ్యంగా మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు. అయితే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు నచ్చచెప్పడంతో.. అంగీకరించి సర్దుకు పోయారు.  అయితే తాజాగా బాలినేని జనార్దర్ రెడ్డి    ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు అండదండలతోనే భూ, ఇసుక, రేషన్ మాఫియాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు.   జనసేన   మద్దతు, ఓట్లతోనే దామచర్ల గెలిచారంటూ వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీ చేయాలని సవాల్ విసిరారు.   ఈ ఆరోపణలపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు కూడా ఘాటుగా రియాక్టయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి  ఫస్ట్రేషన్‌తో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.   గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బాలినేని, ఆయన కుమారుడు కలిసి సిండికేట్ మద్యం వ్యాపారాలు నడుపుతూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో తనపై, తన అనుచరులపై ఏకంగా 79 కేసులు పెట్టి తీవ్రంగా వేధించారని గుర్తుచేశారు. తనను రాజకీయంగా ఎదిరించే ధైర్యం లేక,  బాలినేని ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. 2024 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు ప్రజలు దామచర్ల జనార్ధన్ రావును  34వేల026 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించిన సంగతిని గుర్తు చేశారు.  మైనింగ్ సహా అన్ని అంశాలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. అవన్నీ పక్కన పెడితే.. ఇప్పుడు కూటమి నాయకులలో బాలినేని శ్రీనివాసరెడ్డి తీరు పట్ల హాట్ హాట్ చర్చ జరుగుతోంది. బాలినేని విమర్శలు, సవాళ్లు చూస్తుంటే.. పేరుకు ఆయన జనసేన జండా పట్టుకున్న అజెండా మాత్రం వైసీపీయే అన్నట్లుగా ఉందంటున్నారు. కూటమి పార్టీల మధ్య వివాదాలు సృష్టించడం ద్వారా వైసీపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే వ్యూహంతో బాలినేని వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.    Balineni versus Damacharla, Prakasham, Politics, Janasena Janda, YCP, Ajenda, TeluguOne 
  పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..? తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన, ఇప్పుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేయడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి..? అసలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఏం జరుగుతోంది? అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో కండువా కప్పిన కీలక నాయకుల్లో పోచారం ఒకరు.  కానీ, ఇప్పుడు ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని, కానీ కొన్ని అనివార్య రాజకీయ పరిణామాల వల్లే కాంగ్రెస్‌లోకి రావలసి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించడం పెద్ద చర్చనీయాంశమైంది. అన్నం పెట్టిన నాయకుడిని మరవడం చాలా కష్టంగా ఉందంటూ పోచారం పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం వెనుక అర్థమేంటి? నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం వల్లే తాను పార్టీ మారానని ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు.  అయితే, ఇక్కడే మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. తాను అసలు కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పుకోలేదని, కేవలం జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నానని చెప్పడం అందరినీ విస్తుపోయేలా చేసింది. డెవలప్‌మెంట్ నిధుల కోసం పార్టీ మారానని చెప్తూనే, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదనడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు పొలిటికల్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రజలను అంత అమాయకులుగా భావిస్తున్నారా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వంలోని అంతర్గత విభేదాలను కూడా పోచారం బహిర్గతం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలను సొంత క్యాబినెట్ మంత్రులే అస్సలు లెక్క చేయడం లేదని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పనుల కోసం మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం లిఫ్ట్ చేయడం లేదని తన ఆవేదనను వెళ్లగక్కారు. కాంగ్రెస్ పార్టీలో పాత నాయకులకు, కొత్తగా వచ్చిన నాయకులకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇప్పుడు పోచారం మాటల ద్వారా స్పష్టంగా బయటపడింది. అయితే, పోచారం మాత్రమే కాకుండా దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి వంటి మరికొందరు నాయకుల వైఖరిపై కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగిత్యాల ప్రాంతంలో దశాబ్దాలుగా జీవన్ రెడ్డి చెప్పిందే శాసనంగా ఉండేది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా ఎన్నో పదవులు అనుభవించిన జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చింది. కానీ, అక్కడ పరిస్థితులు మారాయి. మరోవైపు, రాజగోపాల్ రెడ్డి కూడా కాషాయం కప్పుకుని మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటికీ పార్టీ వ్యవహారాలపై విమర్శలు రావడం గమనార్హం.  కేసీఆర్ గడీలోకి వెళ్లిన వారైనా లేదా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారైనా కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి అసలైన నిబద్ధత కలిగిన నాయకులు ఎవరో, కేవలం ప్రయోజనాల కోసం వచ్చే వారెవరో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బీఆర్‌ఎస్ సవాలును తట్టుకోవాలంటే హైకమాండ్ తక్షణమే స్పందించి ఈ ఆధిపత్య పోరుకు, అసమ్మతి వ్యాఖ్యలకు ముగింపు పలకాల్సి ఉంది. Pocharam Srinivas Reddy,  CM Revanth Reddy Congress Party, Telangana Politics News, KCR BRS, Pocharam Comments, Telangana Congress News
కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకపోయినా, నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పని సరై కాంగ్రెస్ లో చేరానని ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.   కేసీఆర్ వల్లే అభివృద్ది జరిగింది,  అన్నం పెట్టినోడిని మరవడం కష్టంగా ఉంది, అయినా   కొన్ని రాజకీయ పరిణామాల వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని ఆయన అన్నారు. తాను కప్పుకున్నది జాతీయ జెండా అనీ, కాంగ్రెస్ జెండా ఎంత మాత్రం కాదనీ చెప్పారు.   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.  నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని సీఎం స్వయంగా చెబితేనే కాంగ్రెస్ లో చేరానన్న ఆయన..   ఆరు నెలల్లో బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్‌  సమస్యలు పరిష్కరిస్తామని సీఎం ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు.   నువ్వైనా నిధులు విడుదల చేయమని వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెప్పినా కూడా ఫలితం లేకపోయిందన్నారు. తాను    వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేశాననీ, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదనీ చెప్పిన పోచారం..    నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం నిర్వహించిన సమావేశంలో  రేవంత్ రెడ్డిని ఈ విషయమై సూటిగా ప్రశ్నించానని చెప్పారు.  పెండింగ్ బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారని పోచారం తెలిపారు.  Pocharam Srinivas Reddy, Revanth Reddy Congress, Banswada Constituency, Telangana Politics News, Pending Bills Release, Pocharam News Telugu
ALSO ON TELUGUONE N E W S
వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'సార్', 'లక్కీ భాస్కర్' సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి. అయితే ఈ రెండు కథలను కొందరు ప్రొడ్యూసర్లు రిజెక్ట్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా వెంకీ అట్లూరి చెప్పడం విశేషం. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన 'విశ్వనాథ్ & సన్స్' మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ.. 'రంగ్ దే' సినిమా తర్వాత తాను నాగవంశీ నిర్మాణంలోనే సినిమా చేయడానికి గల కారణాన్ని వివరించారు. 'రంగ్ దే' సినిమా తర్వాత వెంకీ అట్లూరి వేరే ప్రొడ్యూసర్లను కలిసి 'సార్' కథ చెప్పారట. కానీ వాళ్లకు ఆ కాన్సెప్ట్ నచ్చలేదు. ఆ తర్వాత 'లక్కీ భాస్కర్' లైన్ చెప్పారు.. అది కూడా వాళ్లకు కనెక్ట్ అవ్వలేదు. "మరి ప్రొడ్యూసర్లు రిజెక్ట్ చేసినప్పుడు మీకేమనిపించింది? వాళ్ల మీద కోపం రాలేదా?" అని అడిగితే, వెంకీ అట్లూరి ఇచ్చిన ఆన్సర్ ఆయన మెచ్యూరిటీకి అద్దం పడుతోంది."నాకేం కోపం రాలేదు.. అది ఒక హ్యూమన్ ఎమోషన్. ఒక దర్శకుడికి ఒక సినిమా సరిగ్గా ఆడనప్పుడు, అతని మీద మళ్లీ కోట్లు పెట్టి రిస్క్ చేయడానికి ఏ నిర్మాత అయినా ఆలోచిస్తాడు. నేను ప్రొడ్యూసర్ స్థానంలో ఉన్నా అలాగే ఆలోచిస్తాను" అని చాలా నిజాయితీగా ఒప్పుకున్నారు. అలాంటి టైమ్‌లోనే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ.. వెంకీ అట్లూరిని పూర్తిగా నమ్మారు. "ఎవ్వరూ నమ్మని కథలను వంశీ గారు నమ్మారు. అందుకే నేను ఆయనతోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాను" అని తన సక్సెస్ వెనుక ఉన్న సపోర్ట్ గురించి చెప్పారు వెంకీ.     Venky Atluri, Naga Vamsi, Vishwanath And Sons, Sir Movie, Lucky Bhaskar Movie  
Jr NTR is undergoing shoulder surgery at KIMS Hospitals in Secunderabad, Hyderabad, on Wednesday. The actor had sustained a shoulder injury in July, following which doctors conducted a detailed medical evaluation and recommended surgical treatment. According to the latest reports, NTR was admitted to KIMS Hospitals for the procedure. His team had earlier confirmed that the surgery was scheduled after a medical evaluation of the shoulder injury and that a team of doctors would oversee his treatment and recovery. The actor's injury is understood to have occurred on July 27. Doctors have advised him to take complete rest following the procedure, with reports indicating that his recovery period could extend to around six to eight weeks. An official update on Jr NTR's health condition is expected after the surgery. His team has also requested fans and the media to respect his privacy while he undergoes treatment and recovers. Meanwhile, NTR has several highly anticipated projects lined up, including his upcoming film Dragon. The latest health update is therefore being closely followed by fans, particularly with the actor expected to take a break from his professional commitments during his recovery. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
వైరల్ కి పేటెంట్ హక్కు పొందిన బాలీవుడ్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ భామ మల్లికా షెరావత్ 'మర్డర్', 'ఖ్వాహిష్' వంటి సినిమాలతో  కుర్రకారు గుండెల్లో మంటలు రేపి సినిమా చూసే వాళ్ళ సంఖ్యని పెంచింది.సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ భారతీయ డిజిటల్ స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'ది ట్రేటర్స్ సీజన్ 2' (The Traitors Season 2) ద్వారా ఆమె మళ్లీ ఓటీటీ ప్రేక్షకులను అలరించబోతోంది.  ఆగస్టు 13, 2026 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) అత్యంత వైభవంగా స్ట్రీమింగ్ కానున్న ఈ షో, విడుదలకు ముందే  క్రేజ్ సంపాదించుకుంది. మొత్తం 21 మంది ప్రముఖ సెలబ్రిటీ పోటీదారులు పాల్గొంటున్న ఈ గేమ్‌షోలో మైండ్ గేమ్‌లు, విద్రోహాలు, వ్యూహాలు ప్రధానాకర్షణగా నిలవనున్నాయి. అయితే ఈ షో ప్రోమో మరియు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో క్లిప్ లో మల్లికా చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.  'ది ట్రేటర్స్' హౌస్ లో ఉన్నప్పుడు మల్లికని తోటి పోటీదారుడైన ప్రముఖ కమెడియన్ ఆదిత్య కులశ్రేష్ఠ సరదాగా ఒక ప్రశ్న అడిగాడు. "మల్లికా జీ, మీకు ఎప్పుడైనా ఎవరిపైనా క్రష్ (Crush) కలిగిందా? లేక అందరూ మీపైనే మోజు పడతారా?" అని కుల్లు అడిగిన ప్రశ్నకు మల్లికా షెరావత్ స్పందిస్తూ నాకు ఎవరిపైనా క్రష్ ఉండదు. ఎప్పుడూ అందరికీ నాపైనే క్రష్ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో హాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, 'మిషన్: ఇంపాజిబుల్' (Mission: Impossible) సిరీస్ ఫేమ్ టామ్ క్రూజ్ (Tom Cruise) కు కూడా నాపై తీవ్రమైన క్రష్ ఏర్పడింది. నేను అబద్ధం చెప్పడం లేదు, నా దగ్గర ఇప్పుడు ఫోన్ ఉండి ఉంటే, ఆయన నాకు పంపిన ప్రైవేట్ వీడియోలు మరియు మెసేజ్‌లు మీకు చూపించేదాన్ని" అని చెప్పి హౌస్ మేట్స్‌తో పాటు ప్రేక్షకులందరికీ పెద్ద షాక్ ఇచ్చింది.  ఈ మాటకు తోటి పోటీదారులు  ఆశ్చర్యపోతూ "ఆయన మీకు ఎలాంటి వీడియోలు పంపుతున్నారు? స్నాప్‌లు పంపుతున్నారా?" అని ఆరా తీశారు. దానికి మల్లికా నవ్వుతూ "లేదండి, అవి స్నాప్‌లు కావు! మేముద్దరం కలిసి గ్రాండ్ గా పార్టీలు చేసుకున్నప్పటి వీడియోలు. ఆయన చాలా గ్రేట్, అద్భుతమైన వ్యక్తి" అని వెల్లడించింది.   Also read: సమరం: తప్పదా డార్లింగు  Mallika Sherawat, Tom Cruise  
  ఎన్ని సినిమా న్యూస్ లు వచ్చిన పాన్ ఇండియా కట్ అవుట్ ప్రభాస్ సినిమా న్యూస్ ఇచ్చే కిక్ వేరు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ తో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయనేది నిజం. బాహుబలి సిరీస్, సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాలతో హిందీ మార్కెట్‌లో ప్రభాస్ 100 కోట్లకి  పైగా వసూళ్లు సాధించి తన సత్తా చాటాడు. దీంతో నార్త్ లో కూడా ఫౌజీ ప్రభావం పీక్ లో ఉండనుంది.  కానీ ఇప్పుడు ఫౌజీ కి  నార్త్ లో పోటీ ఎదురుకానుంది.  'స్త్రీ 2' బ్లాక్‌బస్టర్ విజయంతో హిందీ సినీసీమలో సంచలనాలకి కేర్ ఆఫ్ గా మారిన శ్రద్ధా కపూర్ కథానాయికగా లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ చిత్రం ‘ఈఠా’. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమషా కళాకారిణి విఠాబాయి నారాయణగాంవకర్ జీవిత చరిత్ర ఆధారంగా  నిర్మిస్తున్నారు.  కళారంగానికి చేసిన విశేష సేవలకుగాను విఠాబాయి  1957లో, 1990లో ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పురస్కారాలను అందుకున్నారు. మొదట ఈ ‘ఈఠా’ చిత్రాన్ని  ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు నిశ్చయించారు. అయితే, సరిగ్గా అదే సమయానికి అంటే ఆగస్టు 26న కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ విడుదల ఖరారైంది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత దాదాపు 4 ఏళ్ల నిరీక్షణ అనంతరం వస్తున్న యష్ సినిమాతో నేరుగా ఢీకొట్టడం వల్ల కలెక్షన్లకు గండి పడుతుందని భావించిన ఈఠా మేకర్స్, తమ విడుదల తేదీని ఏకంగా మూడున్నర నెలల ముందుకి  జరిపారు. ఇక్కడే  అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆగస్టు 28 నుంచి వాయిదా పడిన శ్రద్ధా కపూర్ ‘ఈఠా’ని  డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.  ‘ఫౌజీ’  డిసెంబర్ 3న విడుదల కానుంది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ప్రభాస్, శ్రద్ధా కపూర్ల సినిమాలు థియేటర్ల ముందుకు రాబోతున్నాయి. దీంతో ఆగస్టులో యష్‌తో క్లాష్‌ను తప్పించుకున్న శ్రద్ధా కపూర్, ఇప్పుడు డిసెంబర్‌లో నేరుగా పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోరుకు సిద్ధపడక తప్పని పరిస్థితి ఏర్పడింది.   Also read: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్: ప్రియాంకా చోప్రా అసలు రహస్యం ఇదేనా!  బాక్సాఫీస్ సమీకరణాలను పరిశీలిస్తే, ప్రభాస్ నటించే 'ఫౌజీ' చిత్రానికి నార్త్ ఇండియాలోనూ భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.  పైగా హను రాఘవపూడి రూపొందిస్తున్న పీరియోడిక్ డ్రామా కావడం, ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సాంస్కృతిక నేపథ్యంతో, ఎమోషనల్ విజువల్స్‌తో రాబోతున్న ‘ఈఠా’ టీజర్‌కి కూడా ఇప్పటికే మంచి స్పందన లభించింది. దీంతో  హిందీ బెల్ట్‌లోని మల్టీప్లెక్స్‌లు, స్క్రీన్ల కేటాయింపులో తీవ్ర పోటీ ఏర్పడటం ఖాయం. ఈ రెండు భారీ చిత్రాల్లో ఏది ప్రేక్షకుల మనసులను గెలుచుకుని నెంబర్ వన్‌గా నిలుస్తుందో చూడటం ఆసక్తికరంగా మారింది! సాహూ, కల్కి 2898ad లో ప్రభాస్, శ్రద్హ కపూర్ జంటగా నటించిన విషయం తెలిసిందే.  Prabhas, Shraddha Kapoor, Eetha, Fauji    
మనం సాధారణంగా పొలిటిషియన్స్ పిల్లలను చూస్తే.. తండ్రి బాటలోనే రాజకీయం చేస్తారని లేదా సొంతంగా ఏవైనా బిజినెస్ లు చూసుకుంటారని అనుకుంటాం. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ, టాలీవుడ్ సర్కిల్స్ లోనూ ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు, మాజీ సీఎం కేసీఆర్ మనవడు అయిన కల్వకుంట్ల హిమాన్షు.. త్వరలోనే వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. కల్వకుంట్ల కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా హిమాన్షు ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ, అనూహ్యంగా ఆయన రాజకీయాల్లోకి కాకుండా.. వెండితెరపై మెరవడానికి రెడీ అవుతున్నారనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హిమాన్షు డెబ్యూ చాలా గ్రాండ్ గా ఉండబోతోందట. దీని కోసం టాలీవుడ్ లోని ఒక ప్రముఖ నిర్మాత, పవర్ ఫుల్ డైరెక్టర్ తో ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది.  ఇటీవల హిమాన్షు అద్భుతమైన మేకోవర్ తో ఫిట్ గా, పక్కా "హీరో మెటీరియల్"లా కనిపిస్తున్నారు. తన లుక్స్ పై, ఫిజిక్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం చూస్తుంటే.. ఈ సినీ ఎంట్రీ వార్తలు కేవలం పుకార్లు మాత్రమే కావు, దీని వెనుక పెద్ద ప్లానింగే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.     KCR Grandson, KTR Son, Kalvakuntla Himanshu, Hero Entry, Telangana  
  ప్రియాంక చోప్రా...సుదీర్గ కాలం నుంచి సినీ అభిమానులుగా ఉన్న వాళ్ళకి ప్రియాంక చోప్రా అనేది పేరు కాదు గ్లోబల్ లెవల్లో బ్రాండ్ అనే విషయం తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్, రాజమౌళి ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ వారణాసిలో మందాకినీగా బిజీగా ఉంది. ఆఫ్ కోర్స్ ప్రియాంకకి కూడా వారణాసి ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ నే. మేకర్స్ ఏరికోరి వారణాసి బ్రాండ్ ప్రపంచసినీ యవనిక పై సౌండ్ చేయాలని ప్రియాంకని ఎంపిక చేసుకున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న  ప్రియాంకా చోప్రాకి కేవలం ఒకే ఒక్క సినిమాతో లేదా ఒకే ఒక్క ప్రాజెక్ట్‌తో ఆమెకి గ్లోబల్ క్రేజ్ రాలేదు. దశాబ్దాల కష్టం, వైవిధ్యమైన పాత్రల ఎంపిక, హాలీవుడ్ మరియు బాహుబలి తరహా ఇండియన్ గ్లోబల్ ప్రాజెక్ట్‌లను సమాంతరంగా మేనేజ్ చేయడం వెనుక ఉన్న పక్కా ప్లానింగ్ ఆమెను ఒక బలమైన అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చింది. ప్రతి దశలోనూ కొత్త సవాళ్లను స్వీకరిస్తూ, డిఫరెంట్ జానర్స్‌ను ఎంచుకుంటూ తను వేసే ప్రతి అడుగు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యేలా చూసుకోవడంలో ప్రియాంకా చోప్రా సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఇటీవలే ప్రియాంకా చోప్రా లైనప్‌లో మరొక భారీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేరింది. అదే ‘బ్లూఫ్లై’ (Bluefly). హాలీవుడ్ దిగ్గజ నటుడు రస్సెల్ క్రోతో కలిసి ఆమె నటించనున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి ప్రముఖ దర్శకుడు నిమ్రోడ్ అంటాల్ తెరకెక్కిస్తున్నాడు. కాంగో నేపథ్యంలో సాగే సీక్రెట్ మిషన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ఎమోషనల్ క్యారెక్టర్‌లో ప్రియాంక కనిపించబోతుండటం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంది.  Also read: మెగాస్టార్ మళ్లీ టైటిల్ లీక్ చేశారు: ఆచార్య సెంటిమెంట్ వెంటాడుతుందా! ప్రియాంకా చోప్రా కెరీర్‌ను విశ్లేషిస్తే, ‘సీటాడెల్’ లాంటి భారీ వెబ్ సిరీస్‌ల ద్వారా ఇంటర్నేషనల్ డిజిటల్ ఆడియన్స్‌కు ఆమె అత్యంత సమీపమయ్యారు. ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సైన్స్ ఫిక్షన్, యాక్షన్, ఎమోషనల్ డ్రామా అంటూ వరుసగా వైవిధ్యమైన జానర్లను ఎంచుకుంటూ తన పరిధిని విస్తరించుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు వస్తున్నప్పటికీ, తన మూలాలైన ఇండియన్ సినిమాను వదలకుండా బ్యాలెన్స్ చేయడం ఆమె ప్రత్యేకత. వారణాసితో పాటు ఫర్హాన్‌ అక్తర్ తెరకెక్కించబోయే ‘జీ లే జరా’, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘క్రిష్ 4’ లాంటి క్రేజీ బాలీవుడ్ చిత్రాలు కూడా చర్చల దశలో ఉండటం విశేషం. ఈ భారీ ప్రాజెక్ట్‌ల వరుసతో ప్రియాంకా చోప్రా తన గ్లోబల్ బ్రాండ్‌ను మరిన్ని ఎత్తులకు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. 2000 వ సంవత్సరంలో ప్రపంచ సుందరిగా నిలిచిన ప్రియాంక చోప్రా తొలి చిత్రం తమిళన్. ఇళయ దళపతి విజయ్ హీరో కాగా 2002 లో రిలీజయ్యింది.   Priyanka Chopra, varanasi, Mahesh Babu, Rajamouli
  సెంటిమెంట్.. మరి ముఖ్యంగా సినీ అభిమానుల్లో 'సెంటిమెంట్' అనేది దర్జాగా తిష్ట వేసుకొని కూర్చుంది. దాంతో  మెగాస్టార్ చిరంజీవి నిన్న ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్ లో తన 158వ సినిమా టైటిల్‌ లీక్ చేయడంతో మెగాస్టార్ నోటి నుంచి టైటిల్ లీక్ అయినప్పుడు  ఫలితం తేడా కొడుతుందేమోనన్న నెగెటివ్ సెంటిమెంట్ భయం కొందరిలో కనిపిస్తోంది.  గతంలో బ్రహ్మాజీ కుమారుడు నటించిన ఒక పిట్ట కథ సినిమా ఫంక్షన్ కి చిరంజీవి హాజరయ్యారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ కొరటాల శివ దర్శకత్వంలో తాను చేస్తున్న భారీ ప్రాజెక్ట్ పేరు ‘ఆచార్య’ అని చెప్పేశారు. అప్పట్లో ఆ లీక్ తీవ్ర దుమారమే రేపింది. నిర్మాతలు అనౌన్స్ చేయకముందే చిరునే టైటిల్ చెప్పడంతో వైరల్ అయింది. అయితే, 140 కోట్ల భారీ బడ్జెట్‌తో, రామ్ చరణ్ కూడా ఒక హీరోగా చేసిన ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద 50 శాతానికి పైగా నష్టాలతో  డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో టైటిల్ లీక్ సెంటిమెంట్ అనేది  మెగా ఫ్యాన్స్ మనసులో ఒక చిన్న భయంగా నాటుకుపోయింది. Also read: Vishwanath And sons:విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ రివ్యూ! అయితే  సినిమా విజయం అనేది కథ, కథనం, దర్శకుడి ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది కానీ, వేదికలపై అనుకోకుండా చెప్పే టైటిల్ లీకులపై కాదని కొంత మంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏది ఏమైనా, తన 158వ ప్రాజెక్ట్‌పై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో, ఈ లీక్ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏది ఏమైనా కంటెంట్ బాగుంటే సెంటి మెంట్ అయినా ఆయిల్ మెంట్ రాసుకొని మూలన కూర్చోవాల్సిందే. మెగా 158 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది Chiranjeevi, Mega 158, Varun Tej, Bobby
  కరుప్పు అలియాస్ వీరభద్రుడుతో హిట్ జోష్ లో ఉన్న సూర్య మరో రెండు రోజుల్లో  'విశ్వనాథ్ అండ్ సన్స్' తో థియేటర్స్ లో ల్యాండ్ అవుతున్నాడు. టైటిల్ పాజిటివ్ గా ఉండటంతో పాటు పరాజయానికి ఆమడ దూరంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న వెంకీ అట్లూరి దర్శకుడు కావడం, ప్రచార చిత్రాలు బాగుండటంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు  విశ్వనాథ్ అండ్ సన్స్ రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ రివ్యూ ఇదేనంటూ ఒక న్యూస్ ఫిలిం సర్కిల్స్, సోషల్ మీడియాలో చాలా కాన్ఫిడెన్స్ గానే చక్కర్లు కొడుతుంది.   సెన్సార్ బోర్డు పూర్తి చేసుకుని 'U/A 13+' సర్టిఫికెట్‌ని  పొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ లో సూర్య 40 ఏళ్లకు పైబడిన సంజయ్ విశ్వనాథ్ అనే ఇంటర్నేషనల్ పిస్టల్ షూటర్‌గా కనిపించనున్నారు. సరోగసి పద్ధతి ద్వారా జన్మించిన అతని కుమారుడు ఒక అరుదైన తీవ్రమైన వ్యాధి బారిన పడటంతో కథలో ప్రధాన మలుపు ప్రారంభమవుతుంది. ఆ చిన్నారి ప్రాణాలను కాపాడుకోవాలంటే తక్షణమే బోన్ మ్యారో డోనర్ కావాల్సి వస్తుంది. ఆ మ్యాచ్ అయ్యే డోనర్ కోసం అమెరికాలో ఉన్న మ్యాడీ (మమితా బైజు)ని ఎంపిక చేస్తారు. బాబు సర్జరీ కోసం సంజయ్, మ్యాడీ కలసి సాగించే ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ జర్నీయే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం.  ఈ జర్నీ క్రమంలో 20 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, సంజయ్ వ్యక్తిత్వం నచ్చి మ్యాడీ  ప్రేమిస్తుంది. ఆ వయసు వ్యత్యాసం, సమాజం నుండి వచ్చే ప్రశ్నల వల్ల సంజయ్ ఆ ప్రేమను తిరస్కరించినప్పటికీ, వారిద్దరి మధ్య సాగే కోర్ ఎమోషన్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని సెన్సార్ సభ్యుల టాక్.  ఫస్ట్ హాఫ్‌లో ఎంటర్టైన్‌మెంట్, పిస్టల్ షూటింగ్ స్పోర్ట్స్ నేపథ్యం చాలా ఫ్రెష్‌గా ఉంటే, సెకండ్ హాఫ్‌లో వచ్చే ప్రధాన ట్విస్ట్ అండ్ బోన్ మ్యారో సర్జరీ సీన్స్ కంటతడి పెట్టిస్తాయని సమాచారం.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించగా రవీనా టాండన్, రాధిక శరత్ కుమార్, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నిమిష్ రవి విజువల్స్ మూవీకి  ప్రాణం పోశాయని అంటున్నారు. మరి ఇదే నిజమైతే  'లక్కీ భాస్కర్' సక్సెస్ తర్వాత  వెంకీ అట్లూరి మరోసారి సెంటిమెంట్, రోమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ సమపాళ్లలో మేళవించి బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్‌బస్టర్ ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. డ్యూరేషన్  2 గంటల 28 నిమిషాలు.  Vishwanath And sons, Suriya, Mamitha Bhaiju, Venki Atluri
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
మనిషి  మెదడు చాలా శక్తివంతమైనది.  మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది.  కానీ మెదడు పనితీరు సరిగా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి.  అయితే మనిషి మెదడు  ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా ఉండదని అంటున్నారు నిపుణులు. సమాచారాన్ని వేగంగా గ్రహించడంలో  సహాయపడటానికి..  మనస్సు కాగ్నిటివ్ బయాసెస్ అని పిలువబడే మానసిక పరిస్థితి పై ఆధారపడుతుంది. ఈ మార్గాలు సమయాన్ని ఆదా చేయగలిగినప్పటికీ, అవి ఆలోచించే, నిర్ణయాలు తీసుకునే ,  చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకునే విధానాన్ని కూడా వక్రీకరించగలవని అంటున్నారు. దీని ఫలితంగా  మెదడు ఒక విషయాన్ని వేరేగా అన్వయించుకుంటుంది, అందుకే అదే నిజమని నమ్మే అవకాశం ఉంటుంది.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నిర్థారణలో పక్షపాతం..  ఇప్పటికే నమ్ముతున్న విషయాలను బలపరిచే సమాచారం కోసం  మెదడు సహజంగానే వెతుకుతూ ఉంటుందట.  ఎవరితోనైనా విభేదిస్తే, వారితో విభేధించడానికి గల అభిప్రాయానికి గల కారణాలను,  సాక్ష్యాలను విస్మరించి, వారు తప్పు అని చెప్పడానికి గల ప్రతి కారణంపై  దృష్టి పెడతారట. నిజాన్ని తెలుసుకోవడానికి  బదులుగా, మనస్సు తరచుగా తను అనుకున్నదే కరెక్ట్ అనే విషయాన్ని నిరూపించడం  కోసం వెతుకుతూ ఉంటుందట.  ఇలా నిజాలు తెలుసుకునే విషయంలో మెదడు పక్షపాతం వహిస్తుందట. హెలో ఎఫెక్ట్.. చాలామంది చక్కగా దుస్తులు ధరించి,  శుభ్రంగా ఉంటూ, చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటుంటారు.  ఇలాంటి వారి విషయంలో చాలామంది పాజిటివ్ గానూ,  వాళ్లదిమంచి వ్యక్తిత్వం అని అనుకుంటారు.  దీని కారణం మెదడే.. ఇలాంటి వాళ్లు మంచోళ్లు అని మెదడు అనుకుంటుందట.  ఇలాంటి ప్రభావాన్ని హెలో ఎఫెక్ట్ అని అంటారు. ఒక వ్యక్తిలో  మంచి గుణాన్ని గమనించినప్పుడు, ఎటువంటి నిజమైన ఆధారం లేకపోయినా,  మెదడు వారికి ఇతర మంచి లక్షణాలు కూడా ఉన్నాయని దానంతట అదే ఊహించుకుంటుంది. వాస్తవాల ఆధారంగా ఒకరిని అంచనా వేయడానికి బదులుగా,  మనస్సు దానికి నచ్చినట్టు మంచి మంచి స్టోరీస్ ను ఊహించుకుని మరీ  వారిని చాలా మంచోళ్లను,  అన్నీ మంచి గుణాలే ఉన్నోళ్లుగా భావిస్తుంది. ఎమోషనల్ లాజిక్.. ఎమోషన్స్ అనేవి వాస్తవాన్ని చూసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. ఎప్పుడైనా ఆందోళనగా అనిపిస్తే, ఆ పరిస్థితి ప్రమాదకరమైనదని అనుకోవడం,  ఎందులో అయినా ఫెయిల్యూర్ ఎదురైతే నిజంగానే పూర్తీగా విఫలమయ్యారని అనుకోవడం జరుగుతుంది. మనిషిలో ఉండే ఫీలింగ్స్  సరైనవే అయినప్పటికీ, అవి ఎల్లప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండవు. ఎమోషన్స్ ను  వాస్తవాల నుండి వేరు చేయడానికి కొంత సమయం తీసుకోవాలి, యాంత్రికంగా రియాక్ట్ అయ్యే  బదులు మరింత ఆలోచనాత్మకంగా స్పందించాలి.  అలా ఉంటేనే మంచిది.  లేకపోతే మెదడు చేతిలో మోసపోవాల్సి వస్తుంది. సన్క్ కాస్ట్ పాలసీ.. ఇప్పటికే చాలా సమయం , శ్రమను  ఒక పని కోసం వెచ్చించారు అనే కారణంతో  అందులో  అలాగే కొనసాగుతూ ఉంటే దాన్ని 'సన్క్ కాస్ట్ ఫాలసీ' (sunk cost fallacy) అంటారు.  మెదడు తరచుగా గత పెట్టుబడిని భవిష్యత్ విలువతో గందరగోళానికి గురిచేస్తుంది. దీనివల్ల ఏదైనా  ఇకపై ఉపయోగపడకపోయినా దాని నుండి బయటపడటం కష్టమవుతుంది.  ఇప్పటికే గడిపిన సమయాన్ని తిరిగి పొందలేరని గుర్తుంచుకోవాలి.  ఎలా ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారో అదే  అత్యంత ముఖ్యం. నెగిటివ్  ప్రభావం.. ఎవరైనా విమర్మించినప్పుడు, తిట్టినప్పుడు, బాధపెట్టినప్పుడు.. అది  రోజుల తరబడి మనసులో నిలిచిపోతుంది, కానీ ఎన్నో మంచి విషయాలు, సంతోషకరమైన విషయాలు  త్వరగా మర్చిపోతారు. ఇలా జరగడానికి కారణం, మెదడు సహజంగానే సానుకూల అనుభవాల కంటే ప్రతికూల అనుభవాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం. ఇది  ఒకప్పుడు, ప్రమాదం పట్ల అప్రమత్తంగా ఉండటానికి,  మానవులు మనుగడ సాగించడానికి సహాయపడింది. అయితే ఈ రోజుల్లో, ఇది రోజువారీ ఎదురుదెబ్బలను అవి నిజంగా ఉన్నదానికంటే చాలా పెద్దవిగా అనిపించేలా చేస్తుంది. నెగిటివ్ కంటే పాజిటివ్ ను మెదడులో ఇముడ్చుకోవాలి. అప్పుడే మెదడు పనితీరు ఆరోగ్యకరంగా ఉన్నట్టు. స్పాట్ లైట్ ఎఫెక్ట్..  తప్పులను,  రూపాన్ని, లేదా ఒక ఇబ్బందికరమైన క్షణాన్ని అందరూ గమనిస్తారని నమ్మడం చాలా సులభం. వాస్తవానికి, చాలా మంది తమ సొంత జీవితాలు , విషయాలపైనే దృష్టి పెడతారు. ఈ స్పాట్‌లైట్ ఎఫెక్ట్ వల్ల అందరూ తమను నిరంతరం గమనిస్తున్నారనే భావన కలుగుతుంది. కానీ నిజానికి అలా జరగకపోయినా  అదేలా భావిస్తుంటారు. ఈ ఆలోచనను  వదిలేయడం వల్ల,  రోజువారీ జీవితంలో మరింత ఆత్మవిశ్వాసంతో, తక్కువ భయంతో  ఉండటానికి సహాయపడుతుంది. పైన చెప్పుకున్నవిధంగా.. వివిధ కారణాల వల్ల చాలామందికి తమ మెదడే శత్రువులా మారి మోసం చేస్తుంది.                                                                                                                                               *రూపశ్రీ.
 పిల్లలు సక్సెస్ కావాలంటే ఈ లక్షణాలు అలవాటు చెయ్యాలి..! "నేటి బాలలె రేపటి పౌరులు.." "విత్తనం మంచిదైతే పసిడి పంట పండుతుంది".  ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం. ఇవన్నీ పిల్లల వ్యక్తిత్వాన్ని వారి నడవడికను తెలియజేయడానికి, పిల్లల భవిష్యత్తు గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు.  ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు ఉన్నతంగా ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, తమకు మంచి పేరు తీసుకురావాలని అనుకుంటారు.  అయితే ఇవన్నీ జరగాలన్నా, పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలన్నా.. పిల్లలకు కొన్ని లక్షణాలు అలవాటు చేయాలి.  దీని వల్ల పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుంది.  తల్లిదండ్రులు పిల్లలకు అలవాటు చేయాల్సినవి ఏమిటో తెలుసుకుంటే.. జ్ఞానం, తెలివితేటలు.. జ్ఞానం , తెలివితేటలు  పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా బలాలుగా మారతాయి. నేర్చుకోవాలనే తపన, ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్న పిల్లలు జీవితంలో విజయ మార్గంలో సులభంగా పయనిస్తారు. అటువంటి పిల్లలు తమ వృత్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలరు. తెలివైన పిల్లలు తమ భవిష్యత్తును గొప్పగా మార్చుకోవడమే  చేసుకోవడమే కాకుండా వారి తల్లిదండ్రుల ప్రతిష్టను కూడా పెంచుతారు. అందుకే చిన్నతనం నుండే పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వాలి.   ప్రవర్తన.. మంచి ప్రవర్తన, నీతి, నిజాయితీ వంటి విలువలు గొప్ప ఆస్తిగా పరిగణించాలి. పెద్దల పట్ల గౌరవం, క్రమశిక్షణ, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన పిల్లలు కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి పిల్లలు ఇంట్లో శాంతి, సంతోషాన్ని నెలకొల్పి, సమాజంలో కుటుంబానికి గౌరవాన్ని తెస్తారు. అందుకే పిల్లలకు మంచి విలువలు నేర్పించాలి.  దీని వల్ల పిల్లల ప్రవర్తన కూడా ఉన్నతంగా మారుతుంది. నిజాయితీ.. అబద్ధాలు చెప్పడం, మోసం, వంచనలకు దూరంగా ఉండే పిల్లలు సమాజంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. పిల్లలు అయినా పెద్దలు అయినా.. వారి వ్యక్తిత్వాన్ని బలంగా ఉంచేది నిజాయితీనే..  ఇది  చుట్టూ ఉన్న వ్యక్తుల నమ్మకాన్ని పొందడంలో సహాయపడుతుంది. అటువంటి పిల్లలకు జీవితంలో విజయం సాధించడానికి గొప్ప అవకాశాలు ఉంటాయి. అందుకే వారి తల్లిదండ్రులు కూడా సమాజంలో గౌరవాన్ని పొందుతారు. దయ.. దయ కలిగి ఉండటం,  సహాయపడే గుణం ఉన్న పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు.  పేదలకు సహాయం చేస్తూ, ఇతరుల పట్ల సున్నితంగా ఉండే పిల్లలు సంతోషం, శాంతితో కూడిన జీవితాన్ని గడుపుతారు. అలాంటి పిల్లలకు  తల్లిదండ్రుల ఆశీర్వాదం, మద్దతు కూడా ఎప్పుడూ ఉంటుంది.   పిల్లలలో ఉండే ఈ దయ, జాలి, కరుణ, సహాయం చేసే గుణం వంటివి సమాజంలో గప్ప గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.                                *రూపశ్రీ.  
ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు అయితే.. రాత్రంతా రైళ్లలోనే ఉండాల్సి వస్తుంది.  అయితే రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది.  పక్కన ప్రయాణికుల నుండి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. రైల్వే రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ప్రత్యేక "నైట్ జర్నీ కండీషన్స్" అమలు చేసింది. ప్రతి రైలు ప్రయాణికుడు ఈ నియమాల గురించి తెలుసుకోవాలి. లేకపోతే రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అవేంటో తెలుసుకుంటే.. శబ్దం చేయకూడదు.. రాత్రి 10 గంటల తర్వాత రైలులో నిశ్శబ్ద వాతావరణాన్ని పాటించడం ప్రధాన నియమం. ఈ సమయంలో మొబైల్ ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడకూడదు, లేదా ఇయర్‌ఫోన్‌లు లేకుండా స్పీకర్‌లపై వీడియోలు లేదా సంగీతాన్ని ప్లే చేయకూడదు. ఇతర ప్రయాణికుల నిద్రకు భంగం కలగకుండా ఉండేందుకు, స్నేహితులతో గుంపులుగా బిగ్గరగా నవ్వడం , జోకులు వేయడం కూడా నిషేధించబడింది. లైట్స్ ఆఫ్.. కొన్నిసార్లు ప్రయాణికులు ఎవరైనా రాత్రి పొద్దుపోయే వరకు  ఏదో ఒక కారణంతో మెయిన్ లైటును ఆన్ చేసి ఉంచుతారు. దీనివల్ల ఇతర ప్రయాణికులు నిద్రపోలేరు. పక్క వారి నిద్రకు ఇబ్బంది అవుతుంది.  రైల్వే నిబంధనల ప్రకారం, రాత్రి 10 గంటల తర్వాత ప్రధాన కోచ్‌లోని లైట్లన్నీ తప్పనిసరిగా ఆపివేయాలి. రాత్రిపూట కేవలం నైట్‌లైట్ బల్బులు మాత్రమే ఆన్ చేసి ఉండవచ్చు. ఎవరైనా  అవసరం అనిపిస్తే వారు  తమ సీటులోని పర్సనల్ రీడింగ్ లైటును ఉపయోగించుకోవచ్చు. మధ్య బెర్త్ లకు రైల్వే నియమాలు.. లోయర్ బెర్త్  , మధ్య బెర్త్ ప్రయాణీకుల మధ్య సీట్ల తగాదాలను నివారించడానికి, రైల్వే ఒక స్పష్టమైన నియమాన్ని పెట్టింది. మధ్య బెర్త్ ప్రయాణీకుడు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య మాత్రమే తన సీటును విప్పి నిద్రపోవచ్చు. ఉదయం 6 గంటల తర్వాత, ఇతరులు దిగువ బెర్త్‌లో కూర్చోవడానికి వీలుగా  మధ్య బెర్త్‌ను దించాలి. అదేవిధంగా, రాత్రి 10 గంటల తర్వాత, లోయర్ బెర్త్ ప్రయాణీకుడు తన సీట్ లో ఎవరినీ కూర్చోబెట్టుకోకూడదు. వారు తమ పక్కన కూర్చోమని ఎవరినీ బలవంతం చేయలేరు. టికెట్ చెకింగ్.. ప్రయాణికుల నిద్రను దృష్టిలో ఉంచుకుని, రైల్వే తన టికెట్ చెకింగ్ సిబ్బందికి సూచనలు జారీ చేసింది. రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 6:00 గంటల మధ్య  టికెట్‌ను తనిఖీ చేయడానికి ఏ టిటిఇ మిమ్మల్ని నిద్రలేపకూడదు. వారు రాత్రి 10:00 గంటల లోపు తమ పనిని పూర్తి చేసుకోవాలి. అయితే, రాత్రి 10:00 గంటల తర్వాత రైలు ఎక్కిన ప్రయాణికులు ఈ సమయంలో తమ టికెట్లను తనిఖీ చేయించుకోవచ్చు. ఇది కాకుండా రాత్రి 10 గంటల తర్వాత రైలులో వీధి వ్యాపారులు లేదా విక్రయదారులు గట్టిగా అరుస్తూ ఎలాంటి వస్తువులను అమ్మకూడదు.  కానీ ఎవరైనా ఈ-క్యాటరింగ్ ద్వారా ఆహారాన్ని ముందుగానే బుక్ చేసుకుని ఉంటే, అది ఖచ్చితంగా వారి సీటుకే తెచ్చిస్తారు. నియమాలు ఉల్లింఘిస్తే.. రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికుడు ఈ నియమాలను ఉల్లంఘిస్తే, వారితో వాదించాల్సిన అవసరం లేదు.  వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), TTE, లేదా రైలులోని కోచ్ అటెండెంట్‌కు ఫిర్యాదు చేయవచ్చు.  రైల్వే అధికారిక యాప్ 'రైల్‌మదాద్' లేదా 139 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా కూడా సహాయం పొందవచ్చు. నియమాలను ఉల్లంఘించిన వారిపై రైల్వే జరిమానాలు కూడా విధించవచ్చు. కాబట్టి రైలు ప్రయాణం చేసేటప్పుడు పై నియమాలు గుర్తుంచుకుని,  వాటిని అనుసరిస్తూ ప్రయాణించడం మంచిది.                                      *రూపశ్రీ.  
స్ట్రెస్, ఆందోళన, బీపీ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరగడంతో మనసుతో పాటు శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామాలు కొంతమందికి రిలాక్సేషన్‌కు సహాయపడవచ్చు. అనులోమ విలోమ ప్రాణాయామం శ్వాసను నియంత్రిస్తూ చేసే ఒక సాధారణ యోగాభ్యాసం. దీన్ని సరైన పద్ధతిలో, సరైన సమయంలో చేయడం ముఖ్యమని యోగా నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ప్రాణాయామం చేయడం సరికాదు. వయసు, ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం ఉన్న సమస్యలను బట్టి విధానం మారవచ్చు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్, ఆయుర్వేద డైటీషియన్ శ్రావంతి రఘు అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎవరు చేయవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలి? వీడియోలో అనులోమ విలోమాన్ని స్టెప్ బై స్టెప్‌గా ఎలా చేయాలో చూపించారు. శ్వాసను నెమ్మదిగా, నియంత్రణతో తీసుకోవడం, వదలడం వంటి అంశాలను సరైన పద్ధతిలో పాటించడం గురించి వివరించారు. ప్రాణాయామం చేసేటప్పుడు శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచడం, తొందరపడకుండా శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యమైన అంశాలు. మొదటిసారి ప్రయత్నించేవారు నిపుణుల సూచనతో ప్రారంభించడం మంచిది. BP ఉన్నవారు చేయవచ్చా? అధిక రక్తపోటు ఉన్నవారు కూడా కొన్ని శ్వాసాభ్యాసాలను తగిన జాగ్రత్తలతో చేయవచ్చు. అయితే అధిక బీపీ ఉన్న ప్రతి వ్యక్తికి ఒకే విధమైన ప్రాణాయామ పద్ధతి సరిపోదు. ముఖ్యంగా శ్వాసను బిగపట్టడం వంటి పద్ధతులను స్వయంగా ప్రయత్నించకుండా, నిపుణుల సూచనలు పాటించడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారు చేయవచ్చా? డయాబెటిస్ ఉన్నవారు కూడా అనులోమ విలోమ ప్రాణాయామం గురించి నిపుణుల సలహా తీసుకుని సాధన చేయవచ్చు. అయితే ప్రాణాయామం ఏదైనా వ్యాధికి మందులకు ప్రత్యామ్నాయం కాదు. వైద్యులు సూచించిన మందులు, ఆహారం, వ్యాయామాన్ని కొనసాగిస్తూ మాత్రమే యోగాభ్యాసాన్ని జీవనశైలిలో భాగంగా చేసుకోవాలి. సైనసైటిస్ ఉన్నవారు? సైనసైటిస్ లేదా ముక్కు సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రాణాయామం చేసే ముందు తమ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. ముక్కు పూర్తిగా బ్లాక్‌గా ఉన్నప్పుడు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు బలవంతంగా శ్వాసాభ్యాసం చేయకూడదు. అవసరమైతే యోగా థెరపిస్ట్ లేదా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. రోజూ 10 నిమిషాలు చేస్తే స్ట్రెస్, BP శాశ్వతంగా పోతాయా? ప్రాణాయామం వల్ల రిలాక్సేషన్, శ్వాస నియంత్రణ, మానసిక ప్రశాంతతకు సహాయం లభించవచ్చు. అయితే రోజూ 10 నిమిషాలు అనులోమ విలోమం చేస్తే స్ట్రెస్ లేదా బీపీ శాశ్వతంగా పూర్తిగా నయమవుతాయని చెప్పడం సరైనది కాదు. ముఖ్యంగా అధిక రక్తపోటు ఒక వైద్య పరిస్థితి. దాని కోసం వైద్యుల సూచనలు, మందులు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అవసరం. ఈ వీడియోలో అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎవరు చేయవచ్చు? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? సరైన పద్ధతి ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను సీనియర్ యోగా థెరపిస్ట్ శ్రావంతి రఘు వివరిస్తున్నారు. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు బీపీ, డయాబెటిస్, సైనసైటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రాణాయామం ప్రారంభించే ముందు మీ వైద్యుడు లేదా అర్హత కలిగిన యోగా థెరపిస్ట్‌ను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో పొటాషియం (Potassium) ఒకటి. శరీరంలో పొటాషియం స్థాయి సరైన మోతాదులో ఉండటం చాలా ముఖ్యం. అయితే రక్తంలో పొటాషియం స్థాయి ఎక్కువగా ఉన్నా (Hyperkalemia), తక్కువగా ఉన్నా (Hypokalemia) ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అసలు పొటాషియం అంటే ఏమిటి? రక్తంలో పొటాషియం ఎందుకు పెరుగుతుంది? పొటాషియం తగ్గడానికి కారణాలు ఏమిటి? పొటాషియం ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఈ సమస్యను నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేయాలి? వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో ప్రముఖ వైద్యులు డా. N. Papa Rao సులభంగా వివరిస్తున్నారు. పొటాషియం ఎక్కువైతే ఏమవుతుంది? రక్తంలో పొటాషియం సాధారణ స్థాయికి మించి ఉండటాన్ని Hyperkalemia అంటారు. కొన్ని సందర్భాల్లో కిడ్నీల పనితీరు సరిగా లేకపోవడం, కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా కొన్ని మందుల కారణంగా పొటాషియం స్థాయి పెరగవచ్చు. పొటాషియం ఎక్కువగా ఉన్నప్పుడు కండరాల బలహీనత, అలసట, గుండె కొట్టుకునే విధానంలో మార్పులు వంటి సమస్యలు కనిపించవచ్చు. ముఖ్యంగా గుండె పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. పొటాషియం తగ్గితే? రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉండటాన్ని Hypokalemia అంటారు. వాంతులు, విరేచనాలు, అధికంగా చెమట పట్టడం, కొన్ని మందుల వాడకం వంటి కారణాలతో శరీరంలో పొటాషియం తగ్గే అవకాశం ఉంటుంది. పొటాషియం తక్కువగా ఉన్నప్పుడు నీరసం, కండరాల బలహీనత, కండరాలు పట్టేయడం, గుండె దడ వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి? పొటాషియం స్థాయి ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా అనేది కేవలం లక్షణాల ఆధారంగా నిర్ణయించలేం. అవసరమైతే వైద్యుల సూచనతో రక్త పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా కొన్ని మందులు క్రమం తప్పకుండా ఉపయోగించేవారు వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. పొటాషియం ఎక్కువగా ఉందని లేదా తక్కువగా ఉందని అనుమానం వచ్చినప్పుడు సొంతంగా మందులు తీసుకోవడం, పొటాషియం సప్లిమెంట్లు వాడటం లేదా ఆహారంలో పెద్ద మార్పులు చేయడం చేయకండి. వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. పొటాషియం ఎక్కువైనా ప్రమాదమే.. తక్కువైనా సమస్యే. కాబట్టి శరీరంలో పొటాషియం స్థాయి ఎందుకు మారుతుంది, దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయాలపై పూర్తి అవగాహన కోసం ఈ వీడియోను చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్యుల వ్యక్తిగత సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా అనుమానాలు ఉంటే అర్హత కలిగిన వైద్యులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)