Home

»

Latest News

మెగాస్టార్ మళ్లీ టైటిల్ లీక్ చేశారు: ఆచార్య సెంటిమెంట్ వెంటాడుతుందా!

Aug 12, 2026 10:11AM

 

సెంటిమెంట్.. మరి ముఖ్యంగా సినీ అభిమానుల్లో 'సెంటిమెంట్' అనేది దర్జాగా తిష్ట వేసుకొని కూర్చుంది. దాంతో  మెగాస్టార్ చిరంజీవి నిన్న ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్ లో తన 158వ సినిమా టైటిల్‌ లీక్ చేయడంతో మెగాస్టార్ నోటి నుంచి టైటిల్ లీక్ అయినప్పుడు  ఫలితం తేడా కొడుతుందేమోనన్న నెగెటివ్ సెంటిమెంట్ భయం కొందరిలో కనిపిస్తోంది. 

గతంలో బ్రహ్మాజీ కుమారుడు నటించిన ఒక పిట్ట కథ సినిమా ఫంక్షన్ కి చిరంజీవి హాజరయ్యారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ కొరటాల శివ దర్శకత్వంలో తాను చేస్తున్న భారీ ప్రాజెక్ట్ పేరు ‘ఆచార్య’ అని చెప్పేశారు. అప్పట్లో ఆ లీక్ తీవ్ర దుమారమే రేపింది. నిర్మాతలు అనౌన్స్ చేయకముందే చిరునే టైటిల్ చెప్పడంతో వైరల్ అయింది. అయితే, 140 కోట్ల భారీ బడ్జెట్‌తో, రామ్ చరణ్ కూడా ఒక హీరోగా చేసిన ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద 50 శాతానికి పైగా నష్టాలతో  డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో టైటిల్ లీక్ సెంటిమెంట్ అనేది  మెగా ఫ్యాన్స్ మనసులో ఒక చిన్న భయంగా నాటుకుపోయింది.


Also read: Vishwanath And sons:విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ రివ్యూ!

అయితే  సినిమా విజయం అనేది కథ, కథనం, దర్శకుడి ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది కానీ, వేదికలపై అనుకోకుండా చెప్పే టైటిల్ లీకులపై కాదని కొంత మంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏది ఏమైనా, తన 158వ ప్రాజెక్ట్‌పై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో, ఈ లీక్ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏది ఏమైనా కంటెంట్ బాగుంటే సెంటి మెంట్ అయినా ఆయిల్ మెంట్ రాసుకొని మూలన కూర్చోవాల్సిందే. మెగా 158 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది

Chiranjeevi, Mega 158, Varun Tej, Bobby

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com