Home

»

Latest News

సమరం: తప్పదా డార్లింగు 

Aug 12, 2026 11:29AM

 


ఎన్ని సినిమా న్యూస్ లు వచ్చిన పాన్ ఇండియా కట్ అవుట్ ప్రభాస్ సినిమా న్యూస్ ఇచ్చే కిక్ వేరు. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ తో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయనేది నిజం. బాహుబలి సిరీస్, సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాలతో హిందీ మార్కెట్‌లో ప్రభాస్ 100 కోట్లకి  పైగా వసూళ్లు సాధించి తన సత్తా చాటాడు. దీంతో నార్త్ లో కూడా ఫౌజీ ప్రభావం పీక్ లో ఉండనుంది.  కానీ ఇప్పుడు ఫౌజీ కి  నార్త్ లో పోటీ ఎదురుకానుంది.


 'స్త్రీ 2' బ్లాక్‌బస్టర్ విజయంతో హిందీ సినీసీమలో సంచలనాలకి కేర్ ఆఫ్ గా మారిన శ్రద్ధా కపూర్ కథానాయికగా లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ చిత్రం ‘ఈఠా’. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమషా కళాకారిణి విఠాబాయి నారాయణగాంవకర్ జీవిత చరిత్ర ఆధారంగా  నిర్మిస్తున్నారు.  కళారంగానికి చేసిన విశేష సేవలకుగాను విఠాబాయి  1957లో, 1990లో ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పురస్కారాలను అందుకున్నారు. మొదట ఈ ‘ఈఠా’ చిత్రాన్ని  ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు నిశ్చయించారు. అయితే, సరిగ్గా అదే సమయానికి అంటే ఆగస్టు 26న కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ విడుదల ఖరారైంది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత దాదాపు 4 ఏళ్ల నిరీక్షణ అనంతరం వస్తున్న యష్ సినిమాతో నేరుగా ఢీకొట్టడం వల్ల కలెక్షన్లకు గండి పడుతుందని భావించిన ఈఠా మేకర్స్, తమ విడుదల తేదీని ఏకంగా మూడున్నర నెలల ముందుకి  జరిపారు. ఇక్కడే  అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆగస్టు 28 నుంచి వాయిదా పడిన శ్రద్ధా కపూర్ ‘ఈఠా’ని  డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.  ‘ఫౌజీ’  డిసెంబర్ 3న విడుదల కానుంది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ప్రభాస్, శ్రద్ధా కపూర్ల సినిమాలు థియేటర్ల ముందుకు రాబోతున్నాయి. దీంతో ఆగస్టులో యష్‌తో క్లాష్‌ను తప్పించుకున్న శ్రద్ధా కపూర్, ఇప్పుడు డిసెంబర్‌లో నేరుగా పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోరుకు సిద్ధపడక తప్పని పరిస్థితి ఏర్పడింది.

 

Also read: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్: ప్రియాంకా చోప్రా అసలు రహస్యం ఇదేనా! 

బాక్సాఫీస్ సమీకరణాలను పరిశీలిస్తే, ప్రభాస్ నటించే 'ఫౌజీ' చిత్రానికి నార్త్ ఇండియాలోనూ భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.  పైగా హను రాఘవపూడి రూపొందిస్తున్న పీరియోడిక్ డ్రామా కావడం, ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సాంస్కృతిక నేపథ్యంతో, ఎమోషనల్ విజువల్స్‌తో రాబోతున్న ‘ఈఠా’ టీజర్‌కి కూడా ఇప్పటికే మంచి స్పందన లభించింది. దీంతో  హిందీ బెల్ట్‌లోని మల్టీప్లెక్స్‌లు, స్క్రీన్ల కేటాయింపులో తీవ్ర పోటీ ఏర్పడటం ఖాయం. ఈ రెండు భారీ చిత్రాల్లో ఏది ప్రేక్షకుల మనసులను గెలుచుకుని నెంబర్ వన్‌గా నిలుస్తుందో చూడటం ఆసక్తికరంగా మారింది! సాహూ, కల్కి 2898ad లో ప్రభాస్, శ్రద్హ కపూర్ జంటగా నటించిన విషయం తెలిసిందే. 

Prabhas, Shraddha Kapoor, Eetha, Fauji

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com