భారత్-పాక్ ఉద్రిక్తతలను తగ్గించడానికి తదుపరి చర్చలు కొనసాగించాలని  డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌ల సమావేశంలో నిర్ణయించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. మే 10వ తేదీన ఇరు దేశాల డీజీఎంఓల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమలవుతోంది. తాజాగా, ఈ ఒప్పందాన్ని మరింత కాలం కొనసాగించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య విశ్వాసం పెంపొందించే చర్యలను కొనసాగించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక బెల్లెట్ కూడా పేల్చకూడదని బోర్డర్ల నుంచి సైన్యాన్ని వెనక్కి మళ్లించాలని తీర్మానం చేసినట్లు పేర్కొంది. అయితే సింధూ జలాల ఒప్పందంపై ఎలాంటి చర్చలు జరగబోవని తేల్చి చెప్పింది. పరిస్థితులు మరింత మెరుగుపడిన కొద్దీ, తదుపరి సమాచారం మీకు తెలియజేస్తాం అని అధికారులు పేర్కొన్నారు.  
  కాళేశ్వరం ఆలయాన్ని గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆలయ సమగ్రాభివృద్ధికి అవసరమైతే రూ.200 కోట్ల వరకు నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సరస్వతీ పుష్కరాలకు విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగాన్ని అభినందించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం మొట్టమొదటిసారిగా టెంట్ సిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే గోదావరి, కృష్ణా పుష్కరాలు రానున్నాయని తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలు కూడా ఘనంగా నిర్వహించే అదృష్టం తనకు కలగనుందని అన్నారు. కాళేశ్వరం క్షేత్ర వైభవాన్ని మరింత ఇనుమడింపజేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.  
  దేశంలో ఏదైనా బిల్లును రాష్ట్రపతి  ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గవర్నర్ తీసుకోవాల్సిన అత్యధిక గడువు నెలరోజులు మాత్రమేనని 415 పేజీలతో కూడిన తీర్పును అత్యున్నత ధర్మాసనం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. రాజ్యాంగం లో అలాంటి నిబంధనలేవీ లేనప్పుడు కోర్టు అలా ఎలా తీర్పు ఇచ్చిందని ముర్ము ప్రశ్నించినట్లు గా సమాచారం. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు తీర్పుపై 14 రాజ్యాంగ సంబంధిత ప్రశ్నలపై సలహా కోరారు. ఈ ప్రశ్నల్లో రాజ్యాంగ అధికారాలు, పరిమితులు, శాసన ప్రక్రియలకు సంబంధించినవి ఉన్నాయి. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నరు రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.  దీనికి సంబంధించి 415 పేజీల తీర్పు వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి/గవర్నర్‌ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు గల కారణాలనూ జత చేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సుప్రీంకోర్టు  నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టంచేసింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ మహాదేవన్‌ ధర్మాసనం తేల్చి చెప్పింది. భారత రాష్ట్రపతి ముర్ము అత్యున్నత ధర్మాసనంకు రాసిన లేఖపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె  స్టాలిన్ స్పందించారు. రాష్ట్రపతి ముర్ము కు మరో మూడు కీలక ప్రశ్నలు స్టాలిన్ సంధించారు.  
ALSO ON TELUGUONE N E W S
  మూవీ: మరణ మాస్ నటీనటులు: బాసిల్ జోసెఫ్, అనిష్మా అనిల్ కుమార్, సైజు సన్నీ, బాబు ఆంటోని, రాజేశ్ మాధవన్ తదితరులు ఎడిటింగ్:  చమన్ చాకో సినిమాటోగ్రఫీ: నీరజ్ రవి మ్యూజిక్: జేకే నిర్మాతలు: టొవినో థామస్ దర్శకత్వం: శివప్రసాద్ ఓటీటీ: సోనిలివ్ కథ: కేరళలోని ఓ గ్రామంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. చీకటిపడితే చాలు, బయటికి రావడానికి జనాలు భయపడుతూ ఉంటారు. కిల్లర్ హత్య చేసిన అనంతరం శవాల నోట్లో 'అరటిపండు' పెడుతూ ఉంటాడు. దాంతో అందరూ అతనిని 'బనానా కిల్లర్' అని పిలుచుకుంటూ ఉంటారు. అదే గ్రామానికి చెందిన ల్యూక్ (బాసిల్) జెస్సీ (అనీష్మా)ని లవ్ చేస్తూ ఉంటాడు. ల్యూక్ లుక్ .. స్టైల్ కాస్త డిఫరెంట్ గా ఉండటంతో, అతనే కిల్లర్ అనే ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది.  బనానా కిల్లర్' కేసును ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ అజయ్ రామచంద్రన్ (ఆంటోని) రంగంలోకి దిగుతాడు. ఒకరోజు జెస్సీ కోసం ల్యూక్ బస్సు ఎక్కుతాడు. అదే బస్ లో కొంతమంది జాయిన్ అవుతారు. అసలు సైకో కిల్లర్ ఎవరు? ల్యూక్, జెస్సీ మళ్ళీ కలుస్తారా లేదా అనేది మిగతా కథ. విశ్లేషణ: సినిమా పేరు 'మరణ మాస్'. డార్క్ కామెడీ అని చెప్పారు కానీ మాస్ కామెడీ లేదు సినిమా పూర్తిగా చూస్తే మరణమే. జోక్స్ సరిగ్గా పేలలేదు. అటో ఎటో గాల్లోకి ఎగిరిపోయినట్టున్నాయి జోక్స్. అందుకే కథపై పెద్దగా ఆసక్తి ఉండదు.  సైకో కిల్లర్ అనగానే కాస్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. కానీ ఇందులో అదే లోపించింది. డార్క్ కామెడీని దృష్టిలో పెట్టుకున్న దర్శకుడు అసలు మెయిన్ పాయింట్ ని వదిలేశాడు. సినిమాలో ఏ పాత్రలో అంత బలమైన ఇంపాక్ట్ కనపడదు‌ దానికి తోడు డ్రాగ్ చేసిన స్టోరీ.. ఫస్ట్ అరగంట చూసేసరికే గంట గడిచిన ఫీల్ కలుగుతుంది. ప్రొసీడింగ్స్ అంత దారుణంగా ఉంటాయి మరి. అడల్ట్ సీన్లు లేవు. అశ్లీల పదాలు లేవు. కానీ బాసిల్ పాత్రను ఇంకాస్త స్ట్రాంగ్ గా రాసి ఉంటే బాగుండేది. అలాగే బస్సు డ్రైవర్, కండక్టర్ పాత్రల వైపు నుంచి కథను టైట్ చేయవలసింది. ఇక పోలీస్ ఆఫీసర్ అజయ్ రామచంద్రన్ పాత్రను కూడా పెద్దగా ఉపయోగించుకోలేదు. ఆయన కుక్క వైపు నుంచి కూడా కామెడీ ట్రాక్ ను కూడా సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు. సినిమా మొత్తం ఎంగేజింగ్ థ్రిల్లర్ గా ఉండాల్సింది పోయి.. నీరసం తెప్పించేలా ఉంటుంది.  నటీనటుల పనితీరు : ల్యూక్ పాత్రలో బాసిల్ జోసెఫ్, జెస్సీ పాత్రలో అనిష్మా , అజయ్ రామచంద్రన్ పాత్రలో ఆంటోని తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు. ఫైనల్ గా : జస్ట్ ఒకే కామెడీ థ్రిల్లర్ బట్ నాట్ ఎంగేజింగ్. రేటింగ్:  2.25/ 5 ✍️. దాసరి మల్లేష్
Jayam Ravi or Ravi Mohan, has announced his separation from his wife, Aarti, two years ago. Aarti stated that she did not agree for divorce and unilaterally Ravi decided on separation. The actor has found love again and recently, he appeared with singer Keneeshaa, at Ishari Ganesh daughter's wedding.  Aarti immediately released an open letter talking about how she got abandoned by Ravi unceremoniously and she accused him of neglecting his duties as a father. She stated that she is reacting as a mother and not as a wife. Keneeshaa reacted to this stating that Aarti can directly talk to her about their personal lives.    Ravi Mohan reacted to it with a huge open letter. He described how he had been financially abused over 15 years and his career decisions have been influenced by his wife and her mother. He stated that while he silently took all of it, he decided to no longer take it and called Keneeshaa as his light in darkness.    He stated that he understands where best interests lie and he can easily understand who is seeking attention and who is thinking about him. He stated that rather than dragging their personal lives into public and seek attention, it would be better to stop and "Live, Let Live". 
Cast: Kaitlyn Santa Juana, Teo Briones, Richard Harmon, Owen Patrick Joyner, Rya Kihlstedt, Anna Lore, Brec Bassinger, Tony Todd Crew:  Based on Characters by Jeffrey Reddick Written by Jon Watts, Guy Busick, Lori Evans Taylor Cinematography by Christian Sebaldt Edited by Sabrina Pitre Music by Tim Wynn Directed by Zach Lipovsky, Adam Stein Produced by Craig Perry, Sheila Hanahan Taylor, Jon Watts, Dianne McGunigle, Toby Emmerich   Final Destination series has a mix of ironic comedy and horror in a way that we feel like laughing at the probability of death yet feel terrified about the threat looming around. After a gap of 14 years, the new film from the franchise, Final Destination Bloodlines has released on 15th May. The movie trailers and teasers have created good buzz and hype among Indian Audiences, too. Let's discuss about the movie, in detail.      Plot:  Iris Campbell (Gabrielle Rose) saves people who should have died in 1968 as she has a vision about how they would die. After 50 years, her grand daughter Stefani Reyes (Kaitlyn Santa Juana), starts having nightmares about the death of her family members. Can she chase to end of the mystery while death looms surrounding her? What can she do to escape the wrath of death? Watch the movie to know more.      Analysis:  The movie tries to be more entertaining than the previous installments. While it uses its weird deaths to shock audiences it also understands the comic sense behind it. Gore elements and horror are handled better than the last installment yet this seems like a soft reboot of the franchise than a solid addition. It entertains us with the kills being so weird yet we don't connect with the characters to really feel the weight of them.  While Final Destination films never tried to represent emotional depth and great story elements, they did have great amount of fun showcasing several ways of death. But that weird tone needed a lot more integrity in this version. The movie doesn't resort to tried and tested ways to scare audiences and it keeps being innovative in designing deaths throughout.  The screenplay could have been tighter in the fitst houe while the second hour is much better. The runtime also helps the film to be short and racy. With even better writing and script, the movie could have been the best reboot to this franchise. Overall, the movie Final Destination Bloodlines has a lot of gore and violence, which could be too much for few people. Still, if you're a fan of Final Destination series, you can easily watch the movie.    Bottomline:  The movie is a light-hearted installment to reboot the series.      Rating: 2.75/5      Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them.   
పాకిస్థాన్ తో యుద్ధవాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్ మూలాలు ఉన్న సినిమాలు, వెబ్ సిరిస్, పాటలు, పాడ్ కాస్ట్ లతో సహా ఇతర మీడియా కంటెంట్ లని నిలిపివేయాలని అన్ని ఓటిటి సంస్థలకి ఈ నెల 8 న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఆ ఆదేశాల్లో భాగంగా ప్రముఖ ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ 'స్ఫోటిఫై'(Spotify)పాక్ నటీనటుల పాటలని పూర్తిగా  తొలగించింది. దీంతో ప్రముఖ మాండ్, జోల్ వంటి ఫేమస్ ట్రాక్స్  స్ఫోటిఫై నుంచి మాయమయ్యాయి. దీంతో పాకిస్థాన్ ని సినిమాల పరంగాను దెబ్బ కొట్టినట్టయ్యింది. మరోవైపు పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా హిందీలో నటించిన 'అభీర్ గులాల్'(Abir Gulaal)మూవీ మే 9 న విడుదల కావాల్సి ఉంది. హీరోయిన్, నిర్మాత, మిగతా నటీనటులు మన దేశం వాళ్లేనటించారు. కానీ ఈ సినిమాని బ్యాన్ చెయ్యాలని ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. దీంతో ఈ చిత్రం బ్యాన్ అయ్యింది. ఫవాద్ ఖాన్ గతంలో కొన్ని హిందీ చిత్రాల్లో నటించాడు.        
  ఇటీవల 'తండేల్'తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అక్కినేని నాగ చైతన్య.. తన తదుపరి సినిమాని 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్నాడు. 'NC24' అనేది వర్కింగ్ టైటిల్. ఎస్.వి.సి.సి. బ్యానర్ లో మిథికల్ థ్రిల్లర్ గా భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాపై ప్రకటనతోనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే షూటింగ్ స్టార్టింగ్ దశలో ఉండగానే.. ఈ సినిమాకి అదిరిపోయే బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. (Naga Chaitanya)   సాధారణంగా షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడో లేక షూటింగ్ పూర్తయిన తర్వాతనో బిజినెస్ డీల్స్ క్లోజ్ అవుతుంటాయి. కానీ, 'NC24' విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతోంది. ఇప్పటిదాకా కేవలం పది శాతం షూటింగ్ పూర్తి కాగా, అప్పుడే థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను రూ.34 కోట్లకు తీసుకున్నట్లు సమాచారం. షూటింగ్ పూర్తయ్యి, సినిమా విడుదల కావడానికి అటూఇటుగా ఏడాది పడుతుంది. ఈ లెక్కన ఇది నిర్మాతలకు మంచి డీల్ అనే చెప్పాలి.   చైతన్య గత చిత్రం 'తండేల్' రూ.35 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేయగా, రూ.50 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఘన విజయం సాధించింది. తండేల్ తర్వాత చైతన్య నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు, 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకుడు కావడంతో 'NC24'పై భారీ అంచనాలు ఉన్నాయి. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా తండేల్ ని మించిన వసూళ్లు రాబట్టే అవకాశముంది. ఈ లెక్కలతోనే 'NC24' రైట్స్ ను నాగవంశీ ముందే దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, చైతన్య సోదరుడు అఖిల్ అప్ కమింగ్ మూవీ 'లెనిన్'కి కూడా నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.  
వివి వినాయక్(VVvinayak)దర్శకత్వంలో వచ్చిన అల్లుడు శ్రీను ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai srinivas) అనతికాలంలోనే ప్రేక్షకుల్లో తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. జయజనకినాయక, రాక్షసుడు, అల్లుడు అదుర్స్, స్పీడున్నోడు, సీత, కవచం వంటి పలు విభిన్న చిత్రాల్లో నటిస్తు తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా సాయి శ్రీనివాస్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ ఉన్న తన నివాసానికి వెళ్లే సమయంలో తన కారుని అపసవ్య దిశలో నడిపినట్టుగా పోలీసులు గుర్తించి ప్రశ్నించడం జరిగింది. కానీ తనని అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసుతో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో జూబ్లీహిల్స్(JUbilee Hills)పోలీస్ స్టేషన్ లో శ్రీనివాస్ పై కేసు నమోదయ్యింది. ప్రస్తుతం సాయి శ్రీనివాస్  మే 30 నరిలీజ్ కాబోతున్న తన కొత్త మూవీ 'భైరవం'కి సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. సాయి శ్రీనివాస్ తో పాటు మంచు మనోజ్(Manchu Manoj) నారారోహిత్(Naara Rohith)కూడా నటించడం జరిగింది . సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ భైరవాన్ని నిర్మించగా విజయ్ కనకమేడల(VIjay Kanakamedala) దర్శకత్వం వహించాడు.  
  'వర్జిన్ బాయ్స్' మూవీ టీజర్ రిలీజై, యూత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గీతానంద్, మిత్రా శర్మ హీరో హీరోయిన్లుగా, శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్‌లతో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ, దయానంద్ దర్శకత్వంలో రాజా దరపునేని నిర్మాణంలో రాజ్‌గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కింది.    తాజాగా విడుదలైన టీజర్‌లో యూత్‌ఫుల్ వైబ్స్, కలర్‌ఫుల్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. స్మరణ్ సాయి సంగీతం టీజర్‌కు జోష్‌ని జోడించగా, వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఫ్రెష్‌గా కనిపిస్తోంది. టీజర్‌లో గీతానంద్, మిత్రా శర్మ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్‌తో కూడిన ఈ కథ, ఆధునిక రిలేషన్‌షిప్స్‌ను తమదైన స్టైల్‌లో చూపించనుందని తెలుస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ శ్రీహన్ క్యారెక్టర్ & కామెడీ టైమింగ్ కి రెస్పాన్స్ బాగా వస్తుంది. చిత్రంలో శ్రీహన్ నుండి మరింత కామెడీని ఆశించవచ్చు అనిపిస్తుంది. టీజర్‌లోని డైలాగ్స్, సీన్స్ ఫన్ ఎలిమెంట్స్‌ను హైలైట్ చేస్తున్నాయి. ఈ సమ్మర్‌లో ‘వర్జిన్ బాయ్స్’ యూత్‌ను థియేటర్స్‌కు రప్పించే ఫుల్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.   నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ.. "ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దాం. గతంలో ఎన్నో మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లు వచ్చాయి. కానీ వాటిని మైమరిపించేలా ఈ సినిమా ఉంటుంది. రొటీన్ కి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది.  కచ్చితంగా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను" అన్నారు.  
  మూవీ : అనగనగా నటీనటులు: సుమంత్, కాజల్ చౌదరి, మాస్టర్ విహార్ష్, అవసరాల శ్రీనివాస్, అను హసన్,  రాకేశ్ రాచకొండ, బి.వి.ఎస్ రవి, కౌముది నెమని తదితరులు ఎడిటింగ్: వెంకటేష్ చందురు మ్యూజిక్: చందు రవి సినిమాటోగ్రఫీ: పవన్ పప్పుల నిర్మాతలు: రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్ర మదిరెడ్డి రచన, దర్శకత్వం: సన్నీ సంజయ్ ఓటీటీ: ఈటీవీ విన్  కథ: ఇద్దరు తల్లిదండ్రులు ఒక పిల్లాడిని సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ ఆ పిల్లాడు.. స్కూల్ వెళ్ళను..చనిపోవాలనుంది అంటు చెప్తుంటాడు. అది విన్న డాక్టర్ పిల్లాడికి కావల్సింది వైద్యం కాదని చెప్తూ వ్యాస్ లివింగ్ స్కూల్ కి తీసుకెళ్తాడు. అక్కడ విద్యని చెప్పే పద్దతి చూసి ఆ పిల్లాడు అట్రాక్ట్ అవుతాడు. దాంతో వ్యాస్ సర్ ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు.‌ వ్యాస్‌(సుమంత్‌) ఒక కార్పొరేట్‌ స్కూల్‌లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ టీచర్‌గా పని చేస్తుంటాడు. బట్టీ చదువులు వద్దంటూ కథల రూపంలో కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలని చెప్తుంటాడు. అయితే అదే స్కూల్‌లో తన భార్య భాగ్య(కాజల్‌ చౌదరీ) ప్రిన్సిపల్‌గా పని చేస్తుంది. ఆమె మేనేజ్‌మెంట్‌ చెప్పింది చేయాల్సి వస్తుంది. వ్యాస్‌కి, ఆయన భార్య భాగ్యకి మధ్య ఈ విషయంలో గొడవలు అవుతుంటాయి. ఈ క్రమంలో వ్యాస్‌ ఉద్యోగం మానేస్తాడు. ఆ తర్వాత తన కొడుకు రామ్ చెప్పిన సలహా ప్రకారం సాయంత్రం ట్యూషన్ ని స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత వ్యాస్ కి ఎదురైన సవాళ్లేంటి? తాను అనుకున్నది సాధించాడా? అసలు వ్యాస్ లివింగ్ స్కూల్ ఎలా మొదలైందనేది మిగతా కథ. విశ్లేషణ: ఇది సినిమా కాదు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కథ. ప్రతీ ప్రైవేట్ స్కూల్లో నిత్యం మార్కుల కోసం ర్యాంకుల కోసం పిల్లలపై చేసే ఒత్తిడికి చాలా మంది చనిపోతున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చేద్దామనే ప్రెష్ పాయింట్ తో సన్నీ సంజయ్ ఈ సినిమాని తెరకెక్కించాడు. మరి ఇందులో అతను సక్సెస్ అయ్యాడా అంటే అవుననే చెప్పాలి. బట్టీ మార్కుల ఫలితాలకి దూరంగా కథల రూపంలో, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చదువుని ప్రతీ విద్యార్థికి అందిద్దామని అనుకునే వ్యాస్ పాత్రతో ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఓ విద్యార్థి సూసైడ్ చేసుకోవాలనుకోవడం చూసిన వ్యాస్ అతడిని ఎలాగైనా పాస్ చేపించాలనే ఉద్దేశ్యంతో ట్యూషన్ స్టార్ట్ చేయడం ఆకట్టుకుంటుంది. విద్యార్థులు ప్రెజర్‌ ఫీల్‌ కావడం, అటు టీచర్స్ పెట్టే ప్రెజర్‌, ఇటు పేరెంట్స్ ప్రెజర్‌కి వాళ్లు ఎలా స్ట్రగుల్‌ అవుతున్నారనేది కళ్లకి కట్టినట్టు చూపించారు. ఆయా సన్నివేశాలు రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉంటాయి.   ఫస్టాఫ్ అంతా చూసి ఫ్రెష్ కాన్సెప్ట్ అనిపిస్తుంది కానీ సెకెంఢాఫ్ లో వ్యాస్ బాల్యం, రామ్ తో జరిగే సన్నివేశాలు ఉంటాయి. కథల రూపంలో పాఠాలు చెప్పాలని, ప్రత్యామ్నాయ విద్యావ్యవస్థని తీసుకురావాలని వ్యాస్‌ పాత్ర పడే బాధ, ఆయన ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ని చూపించారు. ఈ ఆటుపోట్లు, బాధలు వంటి సీన్లు కాస్త సాగదీసినట్టుగా ఉంటాయి.  సినిమాలో ఎక్కడ అడల్డ్ సీన్లు లేకుండా, బూతులు లేకుండా జాగ్రత్తగా నీట్ గా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. ఇంకా క్లైమాక్స్ లో రామ్, వ్యాస్ ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ చూసి ఎవరైనా కనెక్ట్ అవ్వాల్సిందే. నాన్న, కొడుకు బాండింగ్ ని చక్కగా చూపించాడు దర్శకుడు. పవన్ పప్పుల సినిమాటోగ్రఫీ బాగుంది. వెంకటేష్ చందు ఎడిటింగ్ నీట్ గా ఉంది. సెకెంఢాఫ్ లో ఓ పది నిమిషాలు ట్రిమ్ చేస్తే నెక్ట్ లెవెల్ ఉండేది. చందు రవి మ్యూజిక్ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.  నటీనటుల పనితీరు: వ్యాస్ గా సుమంత్, భాగ్యగా కాజల్ చౌదరి, రామ్ గా మాస్టర్ విహార్ష్ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఇక మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు. ఫైనల్ గా : ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా ఇది. ప్రతీ స్టూడెంట్, టీచర్స్, పేరెంట్స్ మస్ట్ వాచ్. రేటింగ్: 2.75 / 5 ✍️. దాసరి మల్లేష్
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
   ఎవరితోనైనా ప్రేమ గురించి మాట్లాడటం చాలా సులభం, కానీ ఆ సంబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం చాలా కష్టం. చాలా మంది కొన్ని రోజుల రిలేషన్ లో ఉన్న  తర్వాత విసుగు ప్రదర్శిస్తూ ఉంటారు. వారు చేసే కొన్ని తప్పుల వల్ల ఇద్దరి మధ్య  సంబంధం బలహీనపడుతుంది. ఈ తప్పుల వల్ల  రిలేషన్  లోతును,  దాని బాధ్యతలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రేమ అయినా, పెళ్లి అయినా, స్నేహం అయినా.. ఇలా ఏ రిలేషన్ అయినా సరే.. కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.  ఆ నియమాలను తెలుసుకోకపోతే ఎంత మందితో కొత్తగా రిలేషన్ మొదలుపెట్టినా సరే.. అది తొందరగా బ్రేకప్ అవుతుంది.  ముఖ్యంగా ప్రేమికులు, భార్యాభర్తలు వారి రిలేషన్ లో ఈ క్రింది విషయాలను తప్పనిసరిగా తెలుసుకుని ఆచరించాలి. నమ్మకం.. సంబంధంలో నమ్మకం లేకపోతే దాని పునాది బలహీనంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో  భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకూడదు. ఇద్దరి  మధ్య ఏదైనా అపార్థం ఉంటే ఇద్దరూ కలిసి కూర్చుని దాని గురించి మాట్లాడి, అపార్థాన్ని తొలగించుకోవాలి. ఏ సంబంధంలోనైనా ఓపెన్ గా మాట్లాడటం,  సమస్యను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల ఇద్దరి మధ్య  సమన్వయం కూడా పెరుగుతుంది. స్వేచ్ఛ.. ప్రతి సంబంధంలో ఎదుటి వ్యక్తికి స్పేస్  ఇవ్వడం చాలా ముఖ్యం. చాలా మంది తమ హక్కులను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎదుటి వ్యక్తిపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తారు, ఎదుటి వారి స్వేచ్ఛను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. దీని కారణంగా సంబంధం బలహీనపడటం ప్రారంభమవుతుంది. అందుకే భార్యాభర్తలు తమ భాగస్వాములకు  స్పేస్ ఇవ్వాలి. వారికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే పూర్తి హక్కు వారికి ఉందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇది చేయకపోతే భాగస్వామి సంబంధంలో ఊపిరాడకుండా పోవడం ప్రారంభిస్తాడు. దీని వల్ల బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. కమ్యూనికేషన్.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు  సంభాషించకపోతే, సంభాషణలో పారదర్శకత ఉండదు. మాట్లాడకపోవడం వల్ల ఇద్దరి మధ్య  అపార్థాలు ఏర్పడతాయి. దీని కారణంగా సంబంధం  పునాది బలహీనపడటం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడాలి. శ్రద్ద.. చిన్న చిన్న విషయాలు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఏం తింటావని అడగడం, జాగ్రత్తగా ఉండమని చెప్పడం, నచ్చిన చోటకు వెళ్లడం, గొడవను పెద్దవి చేసుకోకుండా ఒకరి బాధను మరొకరు పంచుకోవడం వంటివి చేస్తుంటే భాగస్వామికి  ఖచ్చితంగా నచ్చుతుంది. వారు ఎల్లప్పుడూ బంధంలో ఉండాలని అనుకుంటారు.  ఏవైనా గొడవలు జరిగినా వాటిని పరిష్కరించుకుని బంధం నిలబెట్టుకోవాలి అనుకుంటారు. పోలిక.. భార్యాభర్తలు ఇద్దరూ ఎవరూ ఎవరిని ఇతరులతో పోల్చకూడదు.  బయట సంబంధంలో ఉన్నవారిని,  ఇతరులను చూసి వాళ్లు బాగున్నారు, వాళ్లు మంచివారు,  నువ్వు చెడ్డ.. ఇలాంటి కోణంలో ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇలా పోలిస్తే అది వారి మనసును బాధపెడుతుంది.  తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, చిన్న చూపు చూస్తున్నారని భావిస్తారు.  దీనివల్ల బంధంలో అప్యాయత తగ్గుతుంది.                                                   *రూపశ్రీ.  
  నేటి కాలంలో విడాకుల కేసులు పెరిగినప్పటికీ, విడాకుల కొత్త పోకడలు కూడా ఉనికిలోకి వచ్చాయి. ఈ కొత్త విడాకుల నిబంధనలలో గ్రే విడాకులు, స్లీవ్ విడాకులు, సిల్వర్ విడాకులు మొదలైనవి ఉన్నాయి. అదే సమయంలో ఈ రోజుల్లో  నిశ్శబ్ద విడాకుల కేసులు కూడా పెరుగుతున్నాయి. సైలెంట్ డైవోర్స్ అంటే నిశ్శబ్ద విడాకులు. ఈ రకమైన విడాకులలో చాలా సార్లు దంపతులకు తమ సంబంధం నిశ్శబ్ద విడాకుల వైపు కదులుతోందని లేదా వారు ఇప్పటికే సైలెంట్ డైవర్స్   తీసుకున్నారని వారి కూడా  తెలియదు. తమ మధ్య సైలెంట్ గా విడాకులు  జరిగాయని ఆ జంట గ్రహించినప్పుడు వారు చట్టబద్ధంగా విడిపోతారు. ఇది విడాకుల చట్టపరమైన ప్రక్రియకు ముందు దశ కావచ్చని ఫ్యామిలీ కౌన్సిలర్లు అంటున్నారు. సైలెంట్ డైవర్స్ అంటే.. సైలెంట్ డైవర్స్  అంటే భార్యాభర్తలు చట్టబద్ధంగా కలిసి ఉండే వైవాహిక పరిస్థితి. అంటే విడాకులు తీసుకోలేదు కానీ భావోద్వేగ, మానసిక,  కమ్యూనికేషన్ స్థాయిలో ఒకరి నుండి ఒకరు పూర్తిగా విడిపోతారు. ఇద్దరూ ఒకే ఇంట్లో  నివసిస్తుంటారు కానీ వారి మధ్య ఎటువంటి భావోద్వేగ సంబంధం లేదా సంభాషణ ఉండదు. వారి మధ్య భౌతిక దూరం కూడా ఉండవచ్చు. ఇది బంధం నిశ్శబ్దంగా అదృశ్యమవడాన్ని సూచిస్తుంది. సైలెంట్ డైవోర్స్ లో ఇద్దరి మధ్య సంబంధం సజీవంగా ఉంటుంది.  కానీ బంధంలో ఆత్మ,  జంట మధ్య పరస్పర అనుబంధం చనిపోతుంది. సైలెంట్ డైవర్స్ సిగ్నల్స్ ఇవే.. భార్యాభర్తల మధ్య బంధం సైలెంట్ డైవోర్స్ వైపు వెళుతోందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి కొన్ని సిగ్నల్స్ కనిపిస్తాయి.  వాటి ద్వారా దీన్ని గుర్తించి జాగ్రత్త వడవచ్చు. సంభాషణ ఉండదు.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు సాధారణ విషయాలే కాదు.. ఒకరితో ఒకరు ముఖ్యమైన విషయాల గురించి కూడా మాట్లాడుకోరు. వారి మధ్య దాదాపుగా కమ్యూనికేషన్ ఉండదు. రోజువారీ విషయాలు కేవలం లాంఛనాలుగా జరుగుతూ ఉంటాయి. ఎమోషనల్ డిస్టెన్స్.. భార్యాభర్తలు ఒకరి భావాలను ఒకరు పట్టించుకోరు. ఇద్దరి మధ్య ఎమోషన్ డిస్టెన్స్ ఏర్పడుతుంది. ఒకరి సుఖదుఃఖాలను ఒకరు పంచుకోరు.  ఒకరి సమస్యలను లేదా ఆలోచనలను ఒకరు పట్టించుకోరు. శారీరక దూరం.. సైలెంట్ డైవర్స్ దిశగా వేళ్లే భార్యాభర్తల బంధంలో  వారి శారీరక  సంబంధాన్ని కోల్పోతారు. కలిసి కూర్చోవడం, ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం, కౌగిలించుకోవడం,  కలిసి పడుకోవడం వంటివి దూరం అవుతాయి.   గదిని పంచుకోవచ్చు కానీ రూమ్‌మేట్ లాగా ఎవరికి వారు ఉంటారు. సమయం ఇవ్వకపోవడం.. భార్యాభర్తలు ఒకరికొకరు సమయం ఇవ్వనప్పుడు సమయాన్ని కలిసి  గడపాలని అనుకోరు . కలిసి తినాలనే కోరిక, బయటకు వెళ్లాలనే కోరిక లేదా సెలవు దినాల్లో కలిసి సమయం గడపాలనే కోరిక తగ్గినప్పుడు వారు సైలెంట్ డైవోర్స్ వైపు  ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఆసక్తి.. సాధారణంగా భార్యాభర్తలు  ఒకరి జీవితం గురించి ఒకరు తెలుసుకోవాలనుకుంటారు. వారు గొడవ పడినా, తమ భాగస్వామి రోజు ఎలా గడిచిందో, ఏం చేశారో, తమ స్నేహితులు ఎలా ఉన్నారో తెలుసుకోవడంలో   ఆసక్తి కలిగి ఉంటారు. కానీ వారి మధ్య అలాంటి సాధారణ విషయాలు కూడా  అదృశ్యమైనప్పుడు, వారి మధ్య సైలెంట్ డైవర్స్ పరిస్థితి ఏర్పడుతుంది. గొడవలు.. కొన్నిసార్లు వాదనలు లేదా విభేదాలు లేకపోవడం మంచిదని అనిపించవచ్చు. కానీ వాటి మధ్య ఎటువంటి భావోద్వేగ సంబంధం లేదని కూడా ఇది సూచిస్తుంది. వారికి ఒకరి నుండి ఒకరు ఎటువంటి ఆశలు ఉండవు. కాబట్టి వారు ఒకరితో ఒకరు గొడవ పడటానికి కూడా ఇష్టపడరు. సైలెంట్ డైవోర్స్ గురించి కొన్ని నిజాలు.. భార్యాభర్తలు చాలా మంది తమ పిల్లలను పెంచడానికి మాత్రమే కలిసి ఉంటారు. వారు భార్యాభర్తలుగా తమ సంబంధంలో సంతోషంగా లేరు కానీ తమ పిల్లల కోసం చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా ఉంటారు విడాకులు సమాజంలో అవమానానికి కారణమవుతున్నాయి. సామాజిక కళంకం, కుటుంబ ఒత్తిడి,  విమర్శల భయాన్ని నివారించడానికి, జంటలు విడాకులు తీసుకోరు,  అందుకే ఇద్దరి మధ్య సైలెంట్ వాతావరణం ఏర్పడుతుంది. దీన్నే సైలెంట్ డైవోర్స్ అంటారు. భర్తలు డైవోర్స్ వల్ల ఆర్థికంగా లాస్ అవుతారు. దీని వల్ల విడాకులు ఇవ్వకుండా  ఆర్థిక లక్ష్యాల  కోసం రాజీగా  సైలెంట్ డైవోర్స్ ఎంచుకుంటారు. బంధంలో ప్రేమ, గౌరవం,  అవగాహన కాలక్రమేణా ముగిసినప్పుడు ప్రజలు బాధ్యతల కోసం మాత్రమే కలిసి ఉంటారు.                                         *రూపశ్రీ.  
వివాహం ఇద్దరు వ్యక్తుల జీవితాలను మార్చే సంఘటన.  ఇది జీవితంలో చాలా ముఖ్యమైన దశ.  వివాహం తరువాత సంతోషకరమైన వైవాహిక జీవితం కావాలి అంటే  మగవాళ్లు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. ఇంతకీ అవేంటో ఎందుకు చేయకూడదో తెలుసుకుంటే.. వివాహం తర్వాత పురుషులు చేయకూడని పనులు.. వివాహం అయిన మగవాళ్లు ఎక్కడికైనా వెళ్ళేముందు ఆలోచించాలి.  తొందర పడి సొంతంగా ఎక్కడికైనా వెళ్లాలని అనుకోవడం వల్ల అతని జీవితంలో నష్టపోయే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఇతరుల ఉద్దేశాలు ఏంటో అర్థం చేసుకోకుండా ఇతరులతో వెళ్లడం చాలా నష్టాలకు దారి తీస్తుంది. వివాహం అయిన తరువాత మగవాళ్లు బయటి మహిళల పట్ల ఆకర్షితులు అవుతుంటారు. ఇలా ఆకర్షితులు అయ్యే మగవాళ్లకు వారి వైవాహిక జీవితంలో చాలా ప్రమాదాలు ఎదురవుతాయి.  ఇది అవతలి వ్యక్తి మనోభావాలను కూడా దెబ్బతీస్తుంది.  అలాంటి ప్రవర్తన వల్ల మొత్తం కుటుంబం అంతా ప్రభావితమవుతుంది. మనిషికి సంతృప్తి అనేది లభించడం చాలా కష్టం.  ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలని అనుకుంటూనే ఉంటాడు. వివాహం అయిన మగవాళ్లు ఉన్న వాటితో తృప్తి చెందలేకపోతే  ఆ వ్యక్తి అశాంతికి లోనవుతాడు. ఈ అసంతృప్తి వైవాహిక జీవితంలో కూడా చాలా నష్టాలు,  సమస్యలకు కారణం అవుతుంది. నిర్ణయాలు అందరూ తీసుకుంటారు. కానీ వివాహం అయిన మగవాళ్లు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాల్సి ఉంటుంది.  భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా నష్టపోతారు. అలాగే నిర్ణయాలు తీసుకునే ముందు భార్యకు తప్పకుండా చెప్పాలి.                                 *రూపశ్రీ.  
  పసుపు,  తేనె భారతీయ వంటగదిలో రెండు ప్రధాన పదార్థాలు. ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. పసుపులో  కుర్కుమిన్ ఉంటుంది, అలాగే తేనెలో  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పసుపును శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇది కీళ్ల నొప్పులు , చర్మ వ్యాధులు,  జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది . సహజ తీపి, ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన తేనె గొంతు నొప్పి, దగ్గు,  గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. పసుపు మరియు తేనె కలయిక ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, దానిని తీసుకునే ముందు సరైన మోతాదు,  దాని దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. దీని గురించి తెలుసుకుంటే.. వాపును తగ్గించడంలో సహాయపడతాయి.. పసుపులో ఉండే కర్కుమిన్,  తేనెలోని యాంటీఆక్సిడెంట్లు కలిసి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కలయిక కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్,  ఇతర శోథ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. రోగనిరోధక శక్తి.. పసుపు,  తేనె రెండూ రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ కలయిక ముఖ్యంగా సీజన్ మారే సమయంలో  ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణక్రియ.. పసుపు,  తేనె మిశ్రమం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం,  ఇతర జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే అధిక వినియోగాన్ని నివారించాలి. చర్మ ఆరోగ్యం.. మొటిమలు, మచ్చలు,  మంట వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి పసుపు,  తేనెను ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్‌గా ఉపయోగించడం వల్ల చర్మం ప్రకాశవంతంగా,  ఆరోగ్యంగా ఉంటుంది. ఎలా తీసుకోవాలి..? పసుపు,  తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి, టీగా లేదా పాలతో కలిపి వివిధ రకాలుగా తీసుకోవచ్చు. అయితే, దాని పరిమాణం,  తీసుకునే సమయం వ్యక్తి ఆరోగ్య స్థితిని బట్టి ఉండాలి. గర్భిణీ స్త్రీలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు,  ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
నిమ్మకాయ చాలా పానీయాలలో ఉపయోగిస్తారు.  అటు వంటలలోనూ, ఇటు స్వీట్ల లోనూ, మరొక వైపు రిఫ్రెషింగ్ పానీయాలలోనూ నిమ్మకాయను ఉపయోగిస్తారు.  చాలామంది ఉదయాన్నే నీటిలో నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. అయితే నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల శరీరంలో షుగర్ కూడా తగ్గుతుందని కొందరు అంటారు. ఈ కారణంగా చాలామంది షుగర్ పేషెంట్ లు నిమ్మరసం కలిపిన నీళ్లు తాగుతూ ఉంటారు.  అయితే నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల నిజంగానే శరీరంలో షుగర్ శాతం తగ్గుతుందా?  నిమ్మరసం నీరు శరీరంలో షుగర్ తగ్గించడంలో సహాయపడుతుందా? తెలుసుకుంటే.. నిమ్మరసాన్ని నీటిలో కలిపి తాగితే రక్తంలో చక్కెర శాతం తగ్గుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి నిమ్మరసం కలిపిన నీరు రక్తంలో చక్కెరను తగ్గించదు, కానీ చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఈ రెండింటికి తేడా ఏంటని చాలా మంది అయోమయానికి గురవుతూ ఉంటారు. తీసుకునే ప్రతి ఆహారంలో ఉండే గ్లూకోజ్ పరిమాణాన్ని బట్టి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ను నిర్ణయిస్తారు.  అలాగే నిమ్మకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ ను గమనిస్తే ఇది చాలా తక్కువగా ఉంటుంది.  తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఆకస్మికంగా పెరగకుండా చేస్తాయి. నిమ్మకాయలో కరికే ఫైబర్ ఉంటుంది.  ఈ కరిగే ఫైబర్ నెమ్మదిగా జీర్ణం అవుతూ రక్తంలో శోషించబడుతుంది.  తద్వారా  రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెంచడంలో సహాయపడుతుంది. సహాయపడుతుంది. అలాగే కొన్ని అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..  నిమ్మరసం కలిపిన నీరు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని చెబుతున్నాయి. నిమ్మకాయ నీరు హైడ్రేషన్ ను నిర్వహిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతుంది.  ఈ కారణంగా నిమ్మరసాన్ని వేసవిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే నిమ్మరసానికి చక్కెర,  చక్కెర సంబంధిత పదార్థాలు జోడించడం వల్ల షుగర్ ఉన్నవారికి నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. నిమ్మరసంలో విటమిన్-సి ఉంటుంది.  ఇది వాపును, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.  రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ కారణంగానే కడుపు ఉబ్బరం, గ్యాస్,  అజీర్తి వంటివి చేసినప్పుడు నిమ్మరసం నీటిలో కాసింత జీలకర్ర పొడి కూడా కలిపి తాగమని చెబుతూ ఉంటారు. నిమ్మకాయ నీరు కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.  ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నియంత్రించడంలో సహాయపడుతుంది.                                     *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..