నేటి వేగవంతమైన ప్రపంచంలో ఉద్యోగాలు చేసేవారు, డిగ్రీలు అభ్యసించే విద్యార్థులు మరియు కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండే మహిళలు తమకు ఇష్టమైన నైపుణ్యాలను నేర్చుకోవడానికి సమయం కేటాయించడం ఎంతో సవాలుతో కూడుకున్న పనిగా మారింది. ముఖ్యంగా బ్యూటీ, మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ రంగాలపై అమితమైన ఆసక్తి ఉన్నప్పటికీ, పని వేళలు మరియు కళాశాల టైమింగ్స్ వల్ల చాలామంది తమ కలలను వాయిదా వేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి ఒక అద్భుతమైన పరిష్కారం లభించింది. వారమంతా తమ రెగ్యులర్ పనుల్లో బిజీగా ఉండే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన "ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్" (Fresh Look Beauty Classes) వీకెండ్ కోర్సులు సరికొత్త అవకాశాలను అందిస్తున్నాయి. శని మరియు ఆదివారాల్లో మాత్రమే నిర్వహించే ఈ తరగతులు, మీ దైనందిన జీవితానికి ఎటువంటి అంతరాయం కలగకుండా బ్యూటీ పరిశ్రమలో ప్రొఫెషనల్‌గా మారడానికి ఒక గొప్ప వేదికగా నిలుస్తున్నాయి. ఈ వీకెండ్ బ్యూటీ కోర్సుల యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, ఇవి కేవలం సిద్ధాంతపరమైన బోధనకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరికీ ప్రాక్టికల్ ప్రాక్టీస్ పొందేందుకు తగినంత సమయాన్ని కేటాయిస్తాయి. వారానికి కేవలం 2 రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో ప్రాథమిక స్కిన్‌కేర్ రూటీన్స్, అడ్వాన్స్‌డ్ మేకప్ టెక్నిక్స్, హెయిర్ స్టైలింగ్, నెయిల్ ఆర్ట్, బ్రైడల్ మేకప్ మరియు ఆర్గానిక్ బ్యూటీ ట్రీట్‌మెంట్లపై సమగ్రమైన అవగాహన కల్పిస్తారు. దాదాపు 100% ప్రాక్టికల్ ఓరియెంటెడ్ మోడల్‌లో సాగే ఈ క్లాసెస్ ద్వారా అభ్యర్థులు నేరుగా హ్యాండ్స్-ఆన్ ఎక్స్‌పీరియన్స్ పొందుతారు. పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న నిపుణులు మరియు ప్రసిద్ధ బ్యూటీ కన్సల్టెంట్లు క్లాసులను నిర్వహించడం వల్ల, మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ ట్రెండ్స్ మరియు టెక్నాలజీపై విద్యార్థులకు పూర్తి స్పష్టత లభిస్తుంది. అంతేకాకుండా, ఈ వీకెండ్ ప్రోగ్రామ్‌లు ఆర్థికంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంటాయి. పూర్తిస్థాయి రెగ్యులర్ కోర్సులతో పోలిస్తే, వీకెండ్ బ్యాచ్‌లు తక్కువ సమయంలో ఎక్కువ విలువైన సమాచారాన్ని, నైపుణ్యాలను అందిస్తాయి. దాదాపు 80% కంటే ఎక్కువ మంది పార్ట్-టైమ్ అభ్యర్థులు తమ చదువు లేదా ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేయడం విశేషం. ప్రతి విద్యార్థికి ప్రత్యేక శ్రద్ధ లభించేలా బ్యాచ్‌కు పరిమిత సంఖ్యలో మాత్రమే విద్యార్థులను అనుమతిస్తారు. దీనివల్ల నిపుణుల నుండి నేరుగా ఫీడ్‌బ్యాక్ పొందడం, సందేహాలను నివృత్తి చేసుకోవడం సులభమవుతుంది. శిక్షణ పూర్తయిన తర్వాత అందించే ప్రామాణిక సర్టిఫికేషన్ ద్వారా అభ్యర్థులు సొంతంగా ఫ్రీలాన్స్ మేకప్ ఆర్టిస్ట్‌లుగా మారవచ్చు లేదా బ్యూటీ పార్లర్, సెలూన్ వ్యాపారాలను ప్రారంభించవచ్చు. weekend beauty courses for busy students,fresh look weekend makeup training
  టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ లైన్‌కు కట్టుబడి ఉన్నానని, భవిష్యత్తులో కూడా అదే విధంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలను శిరసావహిస్తూ పనిచేస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైన సందర్భంగా అక్కడ పలువురు రాజకీయ నాయకులు ఉన్నారని, ఆ సమయంలో వైసీపీ నేత అంబటి రాంబాబు తన వద్దకు వచ్చి పలకరించారని చెప్పారు.  మర్యాదపూర్వకంగా జరిగిన ఆ పలకరింపునే కొందరు వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటనను ఆధారంగా చేసుకుని తనపై విపరీతంగా ట్రోలింగ్ జరిగిందని, తన వ్యాఖ్యలను కూడా సందర్భానికి భిన్నంగా ప్రచారం చేశారని బోండా ఉమ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా భవిష్యత్తు లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తానని తెలిపారు. ఈ అంశంపై పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు ఇప్పటికే తన వివరణ ఇచ్చినట్లు వెల్లడించిన బోండా ఉమ, పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. పార్టీ క్రమశిక్షణకు తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని మరోసారి స్పష్టం చేశారు.   TDP MLA Uma, CM Chandrababu, TDP, Naralokesh, Mudragada Padmanabham, Social media,  Ambati Rambabu
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యవహారం  కలకలం రేపుతోంది.  ఇటీవల జరిగిన  ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో వైసీపీనాయకులతో కలిసి వేదిక పంచుకోవడం, అక్కడ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో బోండా ఉమా నుంచి వివరణ కోరింది. ఈ విషయంపై సీనియర్ జర్నలిస్టు కృష్ణాంజనేయులు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బోండా వైఖరిని చూస్తుంటే ఆయన తెలుగుదేశం కు గుడ్ బై చెప్పడానికి డిసైడైనట్లే కనిపిస్తోందన్నారు.  కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో పాల్గొన్న బోండా ఉమా, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడమే కాకుండా,  విజయవాడలో ముద్రగడ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఎమ్మెల్యే హోదాలో అక్కడ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్న నాయకులతో కలిసి బోండా ఉమా ఒకే వేదికపైకి రావడం రాజకీయ చర్చకు తావిచ్చింది. బోండా తీరుపై తెలుగుదేశం అధినేత సీరియస్ అయ్యారు.   పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణాంజనేయులు.. బోండా వ్యవహారం కేవలం ముద్రగడ సంస్మరణ లో వైసీపీ నేతలతో వేదిక పంచుకోవడానికి మించి రాజకీయ వ్యూహం ఉందని అన్నారు.   కూటమి ప్రభుత్వంలో మొదటి విడత మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న బోండా ఉమ ఆ అసంతృప్తిని ఇలా వ్యక్తం చేయడమే కాకుండా.. పార్టీని వీడతానని సంకేతాలు ఇవ్వడం ద్వారా అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావడానికి చూస్తున్నారనీ, అయితే గతంలో ఇటువంటి ఒత్తిడులకు చంద్రబాబు లొంగి ఉండొచ్చు కానీ, ఇప్పుడా పరిస్థితి లేదని కృష్ణాంజనేయులు అన్నారు. అందుకే ఒక వేళ ఒత్తిడికి చంద్రబాబు లొంగకుంటే..   తన భవిష్యత్ రాజకీయ అడుగుల ఎటు వేయాలన్న   నిర్ణయానికి బోండా ఉమ ఇప్పటికే  వచ్చేసి ఉంటారని కృష్ణాంజనేయులు అన్నారు.  కూటమి రాజకీయంలో సామాజిక వర్గాల సమతుల్యత కూడా ఈ వివాదానికి ఒక కారణమని పేర్కొన్నారు.  జనసేన పార్టీతో పొత్తు ఉన్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో టీడీపీ పరిమితులు ఎదుర్కొంటోందనీ,  దీనిని ఆసరాగా చేసుకుని విపక్షాలు టీడీపీలోని అసంతృప్త కాపు నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్రయత్నంలో వైసీపీ వలకు బోండా ఉమ చిక్కారని కృష్ణాంజనేయులు విశ్లేషించారు.     Bonda Uma, Telugu Desam Party, Vijayawada Politics, Ambati Rambabu, Andhra Pradesh News  
ALSO ON TELUGUONE N E W S
విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'పెళ్ళి చూపులు'. ఈ సినిమా విడుదలై నేటితో పదేళ్ళు పూర్తయింది. 2016, జూలై 29న ఎటువంటి అంచనాలు లేకుండా, కేవలం రూ.1.2 కోట్ల పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా, బాక్సాఫీస్ వద్ద ఏకంగా ₹30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళను సాధించి టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచింది. కేవలం వసూళ్ళ పరంగానే కాకుండా, రెండు నేషనల్ ఫిలిం అవార్డులను కైవసం చేసుకుని తెలుగు సినిమా సత్తాను చాటిచెప్పింది. అప్పటివరకు షార్ట్ ఫిలింస్‌తో తన మార్కు చూపించిన తరుణ్ భాస్కర్, ఒక ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వెండితెరకు పరిచయమవ్వాలని భావించారు. అయితే ఈ కథను నమ్మి బడ్జెట్ పెట్టడానికి చాలామంది నిర్మాతలు ముందుకు రాలేదు. చివరకు రాజ్ కందుకూరి, బిగ్ బెన్ సినిమాస్ భాగస్వామ్యంతో ఎంతో నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్ళగా, సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరగడం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. 'నువ్విలా', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాల్లో చిన్న పాత్రలు పోషించి.. 'ఎవడే సుబ్రమణ్యం'లో కీలక పాత్రతో మెప్పించిన విజయ్ దేవరకొండ.. 'పెళ్ళి చూపులు' సినిమాతోనే పూర్తిస్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించి, తిరుగులేని హీరోగా నిలదొక్కుకున్నాడు.  "ది స్పిట్‌ఫైర్ BBQ" (The Spitfire BBQ) నిజ జీవిత కథ స్ఫూర్తితో 'పెళ్ళి చూపులు' స్క్రిప్ట్ రాసుకున్నారు తరుణ్ భాస్కర్. ఆయన రైటింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ముఖ్యంగా డైలాగ్స్ ఫ్రెష్ గా అనిపించాయి. డైలాగ్స్ తో నేషనల్ అవార్డు కూడా అందుకోవడం విశేషం.  ప్రశాంత్ అనే బద్ధకస్తుడైన కుర్రాడిగా విజయ్ దేవరకొండ, స్ఫూర్తి అనే బాధ్యతాయుతమైన, ఆశయాలున్న అమ్మాయిగా రీతూ వర్మ తమ నటనా ప్రతిభతో ప్రాణం పోశారు. ఇక ప్రియదర్శి పోషించిన 'కౌశిక్' పాత్రలోని తెలంగాణ యాస, హాస్యం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. "నా సావు నే సస్తా.. నీకెందుకు?" అనే డైలాగ్ యూత్‌లో ఒక ట్రెండ్‌లా మారిపోయింది. చిన్న సినిమాలకు థియేటర్లలో సరైన ఆదరణ లభించదనే అభిప్రాయాన్ని తిరగరాస్తూ, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో 'పెళ్ళి చూపులు' నిరూపించింది. ఈ పదేళ్ళ ప్రయాణంలో ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో ఎందరో కొత్త దర్శకులు, నటులు పరిశ్రమలోకి అడుగుపెట్టారు.      Pelli Choopulu 10 Years, Vijay Deverakonda, Ritu Varma, Tharun Bhascker  
  లవ్, రొమాన్స్, ఇన్ స్పిరేషన్ తో కూడిన సాంగ్స్ కి తన కలంతో సరికొత్త అక్షర సుగంధాలని నింపే గేయ రచయిత అనంత శ్రీరామ్. ముఖ్యంగా అనంత శ్రీరామ్ రాసిన  లవ్ సాంగ్ లోని పదాలని ఒక యువకుడు తన ప్రేమని ఇంకా యాక్స్ ఫ్ట్ చెయ్యని ప్రియురాలికి చూపిస్తే ప్రేమని యాక్స్ ఫ్ట్ చేస్తుందనే నానుడి ఉంది. అంత  అచ్చ తెలుగు పదాలతో పాటలు రాయడంలో  అనంత శ్రీరామ్ దిట్ట. ఆ అక్షరాలు వింటే తెలుగు భాషలో పిహెచ్ డి చేసినట్టే అనే మాటని కూడా అభిమానులు అంటూ ఉంటారు. ఇప్పుడు  దుల్కర్ సల్మాన్,పూజా హెగ్డే తొలిసారి కలసి నటిస్తున్న క్రేజీ పాన్-ఇండియా చిత్రం 'శ్రీ శ్రీ' ల్లో ఒక అదిరిపోయే సాంగ్ రాసాడు. 'బొమ్మ బొమ్మ' అనే లిరిక్ తో స్టార్ట్ అవుతు  సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, సంగీతాభిమానులని  మైమరిపిస్తోంది. ఈ మెలోడీ సాంగ్ ఆరంభమే చాలా ఆహ్లాదకరంగా, ప్రేమలోని మొదటి అనుభూతిని ఎంతో సున్నితంగా పలకరించేలా ఉంది. రైల్వే స్టేషన్‌లో ఓ బెంచ్‌పై ప్రశాంతంగా కూర్చున్న దుల్కర్ సల్మాన్, ఒక్కసారిగా ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన పూజా హెగ్డే అందాన్ని చూసి ఫిదా అయిపోయే మధురమైన  సన్నివేశంతో పాట ప్రారంభమవుతుంది. అక్కడ మొదలైన వారి చూపుల కలయిక, ఒకరినొకరు చూసుకునే విధానం ప్రేక్షకుల మనస్సుని  టచ్ చేసేలా ఉంది. .నాయిక సౌందర్యాన్ని, కథానాయకుడి మనసులోని ప్రేమ భావనలను అభివర్ణిస్తూ ఆయన రాసిన పదాలు హృదయానికి హత్తుకుంటాయి. గాయకుడు కపిల్ కపిలన్ తన మృదువైన, అత్యంత భావోద్వేగమైన గాత్రంతో ఈ పాటకు మరింత అందాన్ని చేకూర్చారు.  Also read: పావలా శ్యామల కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా!..ఈ మహానుభావులే పేరు పెట్టింది సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ సైతం  తన అద్భుతమైన స్వరాలతో 'బొమ్మ బొమ్మ' పాటకు ప్రాణం పోశారు. క్లాసికల్ అండ్ మోడ్రన్ టచ్‌తో కూడిన ఆర్కెస్ట్రేషన్, సాఫ్ట్ గాలులని గుర్తుచేసేలా వినసొంపుగా సాగుతూ ప్రతి శ్రోతను మైమరిపిస్తుంది.  టాలెంటెడ్ డైరెక్టర్ రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో విజయవంతమైన నిర్మాణ సంస్థ ఎస్‌ఎల్‌వీ (SLV) సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. దీక్షిత్ శెట్టి, జగపతి బాబు, రమ్యకృష్ణ, సచిన్ ఖేడేకర్, రావు రమేష్ వంటి దిగ్గజ తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనయ్ ఓమ్ గోస్వామి అందించిన ఛాయాగ్రహణం, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ ఈ విజువల్ వండర్‌కి మరింత గ్రాండ్‌నెస్‌ను తీసుకొచ్చాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ప్రధాన భారతీయ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో అత్యంత గ్రాండ్‌గా విడుదలకి సిద్ధంగా ఉంది. Anantha Sriram, Dulquer Salmaan, Pooja Hegde    
  తెలుగు చిత్ర పరిశ్రమతో పావలా శ్యామల(Pavala Shyamala)గారికి ఉన్న అనుబంధం యొక్క వయసు నాలుగు  దశాబ్దాలపైనే. ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ట్రేడ్ మార్క్ కూడా క్రియేట్ చేసుకున్న పావలా శ్యామల జెన్ జి బ్యాచ్ ని సైతం మత్తు వదలరా మూవీతో నవ్వించింది. పావలా శ్యామల'  అసలు పేరు నేతి శ్యామల.   1951వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా అమరావతి గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన శ్యామల గారు పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. కేవలం 13 సంవత్సరాల అతిపిన్న వయసులోనే ఆమెకు వివాహం జరిగింది. . కుమార్తె జన్మించిన కొద్ది కాలానికే ఒక భయంకరమైన ప్రమాదంలో భర్త కన్నుమూయడంతో శ్యామల గారి జీవితం ఒక్కసారిగా చీకటిమయమైంది. పిల్లల పెంపకం, జీవనాధారం కోసం ఆమె ధైర్యంగా అడుగు ముందుకు వేసి నటననే తన శ్వాసగా ఎంచుకున్నారు. ఆమె నటనా ప్రస్థానం మొదట రంగుల వెండితెరపై కాదు, వేదికలపై వెలిగే రంగస్థలం నుంచి ప్రారంభమైంది. 'దొంగాటకం' అనే నాటకంతో నాటక రంగానికి పరిచయమైన శ్యామల గారు తన అద్భుతమైన హావభావాలు, గంభీరమైన సంభాషణలతో నాటక ప్రియులను మంత్రముగ్ధులను చేశారు. ఈ క్రమంలో ప్రముఖ రచయిత గణేష్ పాత్రో రాసిన ‘పావలా’ అనే విప్లవాత్మక నాటకంలో ఆమె పోషించిన క్యారక్టర్  ఒక సంచలనాన్ని సృష్టించింది. ఆ నాటకంలో ఆమె కనబరిచిన జీవాన్ని చూసి ముగ్ధులైన ప్రేక్షకులు మరియు విమర్శకులు ఆమెను ఆప్యాయంగా 'పావలా శ్యామల' అని పిలవడం ప్రారంభించారు. అలా ఒక నాటకం పేరు ఆమె ఇంటి పేరుగా మారి, జీవితాంతం నిలిచిపోవడం చిత్రసీమ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం. రంగస్థలంపై ఉత్తమ నటిగా పలు పురస్కారాలు అందుకున్న పావలా శ్యామల గారు, 1984-85 ప్రాంతంలో జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన 'బాబాయ్ అబ్బాయ్' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. అక్కడ నుంచి ఆమె వెనుతిరిగి చూడలేదు. 'స్వర్ణకమలం', 'కర్తవ్యం', 'బాబాయ్ హోటల్', 'ఇంద్ర', 'ఖడ్గం', 'వర్షం', 'ఆంధ్రావాలా', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'గోలీమార్' నుంచి 'మత్తు వదలరా' వరకు దాదాపు 250కి పైగా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. హాస్యంతో పాటు విలక్షణమైన పల్లెటూరి యాసతో ఆమె చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. Also read: అభిమానులకి వరం ఇచ్చిన అల్లు అర్జున్.. 5 లక్షలు, 3 లక్షలుతో... అయితే, వందలాది సినిమాల్లో నటించి తరతరాల ప్రేక్షకులకు నవ్వులు పంచిన ఈ మహానటి చివరి రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలు వర్ణనాతీతం. వృద్ధాప్య సమస్యలు, తీవ్రమైన అనారోగ్యం, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఆమెను చుట్టుముట్టాయి. తన కూతురు క్షయ వ్యాధితో ) మంచాన పడటంతో వైద్య ఖర్చుల కోసం తాను సంపాదించుకున్న నంది అవార్డులను, జ్ఞాపికలను సైతం అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఈ కష్టసమయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించగా, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ₹20,000 తక్షణ సాయంతో పాటు నెలకు ₹10,000 పెన్షన్ మంజూరు చేశారు. అలాగే నిర్మాత దిల్ రాజు గారి బృందం, సినీ ప్రముఖులు ఆమె వైద్యానికి ఆసరాగా నిలిచారు. ఎన్నో ఇబ్బందుల నడుమ పోరాటం సాగించిన పావలా శ్యామల గారు, 74 ఏళ్ల వయసులో మొన్న  హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో కన్నుమూశారు. పేరుకే ఆమె మరణించింది.. సినిమాతో ప్రతి తెలుగు వాడి ఇళ్లల్లో నిత్యం తిరుగుతూనే ఉంటుంది. Pavala Shyamala, Tollywood
వర్సటైల్ యాక్టర్ ధనుష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక 55వ చిత్రం 'ఓం' నుండి మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ 'అలాకా లూవా' విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనం సృష్టిస్తోంది. అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఎనర్జిటిక్ సెలబ్రేషన్ ఆంథమ్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ధనుష్ సరసన ఊరమాస్ డ్యాన్స్ మూమెంట్స్, దద్దరిల్లిపోయే బీట్స్‌తో రూపుదిద్దుకున్న ఈ పాట ప్రేక్షక లోకాన్ని విశేషంగా ఆకట్టుకుంటూ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. మాస్ ఆడియన్స్‌ను కట్టిపడేసే విధంగా రూపొందించిన ఈ సింగిల్ సినిమాపై ఉన్న భారీ అంచనాలను మరింత పెంచేసింది. ఈ విజువల్ అండ్ మ్యూజికల్ ఫీస్ట్‌కు మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ స్వరాలు సమకూర్చడం విశేషం. పాటను అత్యంత శక్తివంతంగా ట్యూన్ చేయడమే కాకుండా సాయి అభ్యంకర్ స్వయంగా ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఇక తెలుగు వెర్షన్‌కు ప్రముఖ గాయకులు రామ్ మిరియాల, అరుణ్ కౌండిన్య తమ గొంతు కలపడంతో ఈ పాటలో మరింత జోష్ నిండింది. ఆస్కార్ విజేత, ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ అందించిన సాహిత్యం మాస్ పల్స్‌ను కచ్చితంగా పట్టుకుంది. ఇక ఈ పాటలో ధనుష్ వేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులు చూసి అభిమానులు మురిసిపోతున్నారు. పాట ముగిసేవరకు ఆయన చూపించిన ఈజ్, గ్రేస్ ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన 'ఫస్ట్ స్ట్రైక్' టైటిల్ టీజర్ కూడా నెట్టింట విశేషమైన స్పందన రాబట్టుకున్న సంగతి తెలిసిందే. 'ఓం – చాప్టర్ 1: ఉధిరమ్- ది బ్లడ్ వుడ్' అనే పూర్తి టైటిల్‌తో వచ్చిన ఈ టీజర్ సినిమా ఎంతటి తీవ్రమైన యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోందో స్పష్టం చేసింది. ఈ టీజర్‌లో ధనుష్ చూపించిన రౌద్రం, మాస్ అవతార్ తో పాటు విజువల్ క్వాలిటీ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. కేవలం పోస్టర్లు, టీజర్‌లతోనే కాకుండా ఇప్పుడు ఫస్ట్ సింగిల్ 'అలాకా లూవా'తో సినిమా ప్రమోషన్స్ హోరెత్తిపోతున్నాయి. సినిమాకు సంబంధించి ప్రకటించిన భారీ తారాగణం సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఊహించని రేంజ్‌లో అంచనాలను పెంచేసింది. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక అత్యంత శక్తివంతమైన, కీలకమైన పాత్రలో నటిస్తుండటం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. అంతేకాకుండా 'మారి 2' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ కాంబినేషన్ తర్వాత ధనుష్ మరియు సాయి పల్లవి మరోసారి ఈ చిత్రంతో జతకడుతున్నారు. వీరి కాంబోలోని కెమిస్ట్రీ కోసం ప్రేక్షకులు కాతురతగా ఎదురుచూస్తున్నారు. అలాగే నేటితరం క్రేజీ కథానాయకి శ్రీలీల కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన రోల్ పోషిస్తుండటంతో ఈ గ్లామర్, యాక్షన్ కాంబినేషన్ పాన్-ఇండియా స్థాయిలో ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 'అమరన్' వంటి సంచలన బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకని జోరుమీదున్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ అయిన వండర్‌బార్ ఫిల్మ్స్‌తో పాటు ఆర్-టేక్ స్టూడియోస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ పాన్ ఇండియా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రపంచవ్యాప్తంగా 2026 అక్టోబర్ 16న విజయదశమి పండుగ కానుకగా థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అద్భుతమైన నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల కలయికతో వస్తున్న 'ఓం' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.   Dhanush Om movie, Alaka Luva song released, Dhanush 55th film Om, Rajkumar Periasamy Dhanush, Sai Pallavi Sreeleela Om, Dhanush Om first single
విక్టరీ వెంకటేష్ ‘చిట్టిబాబు’గా, శ్రీనిధి శెట్టి ‘స్వర్ణ’గా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొందిన తర్వాత, ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ చిత్ర బృందం కుటుంబంలోని మరో సభ్యురాలిని పరిచయం చేసింది. ఈ చిత్రంలో చిట్టిబాబు, స్వర్ణ దంపతుల ముద్దుల కుమార్తె ‘సంపూర్ణ’ పాత్రలో బాలనటి యువినా పార్థవి నటిస్తోంది. అమాయకత్వం, చిలిపితనం, అల్లరితో నిండిన సంపూర్ణ పాత్ర చిట్టిబాబు జీవితంలో నవ్వులు పూయించడంతో పాటు, అనూహ్యమైన చిన్న చిన్న సంఘటనలకు కూడా కారణమవుతుంది. ఈ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉండనుందని చిత్ర బృందం తెలిపింది. 'సంపూర్ణ'గా యువినా పార్థవి పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ గ్లింప్స్ లో.. త్రివిక్రమ్ మార్కు డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. "ఇంకా మనకు ప్రాబ్లమ్స్ ఏమీ లేవండి.. ఆ రిజిస్ట్రేషన్ చేసేసి, మీ కమిషన్ మీకు ఇచ్చేసానంటే.. హిందూ పేపర్ చదువుకుంటూ రిటైర్డ్ తెలుగు టీచర్ లాగా లుంగీ నలకుండా బతికేస్తా" అంటూ వెంకటేష్ చెప్పే మార్క్ డైలాగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వెంకీ మార్కు నటన, ఆయన టైమింగ్ ప్రేక్షకులకు పాత రోజులను మళ్లీ గుర్తుచేసేలా ఉన్నాయి. ఈ ప్రోమోలో తండ్రీకూతుళ్ల మధ్య సాగే సంభాషణ ఎంతో సరదాగా సాగింది. "నాన్న ఐ యమ్ ఇన్ లవ్" అని సంపూర్ణ చెప్పగానే.. "ఛీ దీనబ్బా.. ఈసారి ఎవడే? కార్ మెకానికా? అసలు నీ వయస్సుకి లవ్ అంటే మీనింగ్ తెలుసా?" అని తండ్రి పాత్రలో వెంకటేష్ క్లాస్ పీకే ప్రయత్నం చేస్తారు. దానికి సమాధానంగా ఆ చిన్నారి "నాకేమవుతుందో అనే బాధ కన్నా, వాడికేమవుతుందో అనే భయం ఎక్కువ అయితే.. అదే ప్రేమ" అంటూ చాలా అమాయకంగానే త్రివిక్రమ్ శైలిలో చెప్తుంది. పాత్రల పరిచయాలతో సినిమాపై రోజురోజుకూ ఆసక్తిని పెంచుతున్న మేకర్స్, తదుపరి ‘సర్వ’ పాత్రలో నటిస్తున్న రాజా ప్రజ్వల్ ను పరిచయం చేయనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2026 అక్టోబర్ 2న థియేటర్లలో అడుగు పెట్టనుంది.     Aadarsha Kutumbam, Venkatesh, Trivikram, Yuvina Parthavi  
After the terrific response to Venkatesh as Chittibabu and Srinidhi Shetty as Swarna, the makers of Aadarsha Kutumbam House No: 47 – AK47 have now introduced the next member of the family.  Yuvina Parthavi steps into the role of Sampoorna, the adorable daughter, whose playful antics seem to bring plenty of fun and trouble into Chittibabu’s life. With the character introduction campaign continuing to build excitement, the makers will next unveil Raja Prajwal as Sarwa.  Written and directed by Trivikram Srinivas and produced by S. Radha Krishna (Chinababu) under Haarika & Hassine Creations, the film features music by S. Thaman, cinematography by Ravi K. Chandran, and editing by Sreekar Prasad. Aadarsha Kutumbam House No: 47 – AK47 is all set for a grand worldwide theatrical release on October 2, 2026.   Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. ఈజీ యాక్టింగ్ కి, డాన్స్ కి  పెట్టింది పేరు. అందుకే సినిమా సినిమాకి అభిమానులని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ప్రెజెంట్ 'రాకా'తో సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్న అల్లు అర్జున్ నిన్న హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హోటల్ లో 'అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్’ (AAFA) ఆధ్వర్యంలో గ్రాండ్ సరిహద్దుల నడుమ ‘AAFA ఆన్యువల్ సమిట్ 2026’ నిర్వహించబడింది. ఈ మీటింగ్ కి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ  మహారాష్ట్ర నుండి దాదాపు 900 నుండి 1000 మంది అభిమానులు  తరలివచ్చారు. అభిమానుల కోలాహలంతో ప్రాంగణం అంతా సందడిగా మారింది. అభిమానుల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించిన అల్లు అర్జున్, సుమారు  6 గంటలకు పైగా వారితో కలిసి గడిపారు. ప్రతీ ఒక్కరితో నవ్వుతూ మాట్లాడటంతో పాటు వ్యక్తిగతంగా పలకరించారు  ఫొటోలు కూడా  దిగి  అభిమానులందరికీ భోజన వసతులు ఏర్పాటు చేశాడు ఈ సమిట్‌లో అల్లు అర్జున్ ప్రకటించిన విప్లవాత్మక నిర్ణయం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. సినిమా విడుదల సమయంలో భారీ కటౌట్లు కట్టడం, థియేటర్ల వద్ద హంగామా చేయడం, నిరంతరం ప్రచారం చేయడంలో అభిమానులు ముందుంటారు. అయితే వారి ప్రాణ రక్షణ, వారి కుటుంబాల భవిష్యత్తు ఎంతో ముఖ్యమని భావించిన అల్లు అర్జున్ , ఉచిత ప్రమాద బీమా (Accident Insurance) పథకాన్ని ప్రారంభించాడు. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు, అలాగే జిల్లా కమిటీ సభ్యులకు 3 లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా కవరేజీని కల్పించారు. ఇందుకు సంబంధించిన ఇన్సూరెన్స్ కార్డులను  స్వయంగా అభిమానులకి  తన చేతుల మీదుగానే ఇచ్చాడు. అంతేకాకుండా, ఈ కార్యక్రమంలో అభిమానులకు ఒక ప్రేరణాత్మక సందేశాన్ని కూడా బన్నీ ఇచ్చారు. ప్రతీ మనిషికి సమయం, శక్తి ఒక 100 శాతం ఛార్జింగ్ ఉన్న బ్యాటరీ లాంటిదని, ఆ శక్తిని ఇతరులపై ద్వేషం చూపించడానికి లేదా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడానికి వృథా చేయవద్దని పిలుపునిచ్చారు. ప్రతికూలతలకు దూరంగా ఉంటూ మీకు నచ్చిన పనులపై, మీ లక్ష్యాలపై ఆ శక్తిని వెచ్చించాలని హితవు పలికారు. కేవలం సినిమాల పరంగానే కాకుండా, సామాజిక దృక్పథంతో అభిమానుల జీవితాల్లో వెలుగులు నింపేలా అల్లు అర్జున్ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంపై సోషల్ మీడియాలో, నెటిజన్లలో మరియు సినీ వర్గాల్లో తీవ్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఒక హీరో తన అభిమానుల సంక్షేమం కోసం ఇలాంటి ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టడం ఇండస్ట్రీలోనే సరికొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచింది. Allu Arjun, Raaka
తనదైన సహజసిద్ధమైన హాస్యంతో, వైవిధ్యమైన క్యారెక్టర్ రోల్స్‌తో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి పావలా శ్యామల (75) మృతి చెందడం టాలీవుడ్‌ను తీవ్ర విచారంలో ముంచెత్తింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆమె, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 1:52 గంటల సమయంలో తీవ్ర గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. నాలుగు పదుల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో వందలాది చిత్రాల్లో నటించి మెప్పించిన శ్యామల, చివరి రోజుల్లో అత్యంత దీనస్థితిలో కాలం వెళ్లదీయడం చిత్రసీమలోని పలువురిని కలచివేసింది. ఆమె మరణవార్త తెలుసుకున్న తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. చిత్ర పరిశ్రమకు ఒక నటిగా ఆమె అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ నివాళులర్పించింది. అంతేకాకుండా, ఈ కష్టసమయంలో ఆమె కుటుంబానికి అండగా నిలిచేందుకు దర్శకుల సంఘం ముందుకు వచ్చింది. దర్శకుల సంఘం ట్రస్ట్ తరఫున రూ. 50,000, అలాగే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తరఫున రూ. 50,000 కలిపి మొత్తం లక్ష రూపాయలు విరాళాన్ని నటి కుటుంబానికి అందజేస్తున్నట్లు దర్శకుల సంఘం ప్రకటించింది. గుంటూరు జిల్లా అమరావతిలో 1951లో జన్మించిన నేతి శ్యామల, నాటకరంగంలో ప్రదర్శించిన 'పావలా' అనే ప్రసిద్ధ నాటకంతో 'పావలా శ్యామల'గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించి.. 'బాబాయ్ అబ్బాయ్', 'ఖడ్గం', 'వర్షం', 'ఆంధ్రావాలా', 'గోలీమార్', 'మత్తు వదలరా' వంటి ఎన్నో చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించారు.     Pavala Shyamala, Pavala Syamala, Directors Association, K Raghavendra Rao  
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని వారసుడు జయకృష్ణ టాలీవుడ్ అరంగేట్రం చేస్తుండగా, బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ నాయికగా పరిచయమవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. 'ఆర్‌ఎక్స్ 100', 'మంగళవారం' వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు అజయ్ భూపతి ఈ లవ్, రొమాంటిక్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందించారు. అశ్వినీదత్ సమర్పణలో జెమినీ కిరణ్ నిర్మించిన ఈ సినిమా రేపు(జూలై 30) ప్రేక్షకుల ముందుకు రానుంది. 'శ్రీనివాస మంగాపురం'పై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. ఇప్పటికే సినిమా చూసిన సన్నిహిత వర్గాలు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చాయి. సెన్సార్ టాక్ కూడా అదిరిపోయింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి UA సర్టిఫికెట్‌ ఇచ్చింది. రన్ టైమ్ ను 2 గంటల 35 నిమిషాలు(155 నిమిషాలు)గా లాక్ చేశారు.  ఈ సినిమా కథ ప్రధానంగా తిరుపతి నేపథ్యంలో సాగుతుంది. శ్రీనివాస్ అలియాస్ వాసు బాబు (జయకృష్ణ), మంగతాయారు అలియాస్ మంగ (రషా తడానీ) మధ్య చిగురించిన గాఢమైన ప్రేమాయణం చుట్టూ కథ తిరుగుతుంది. అయితే వీరి ప్రేమకు మైనింగ్ డాన్ వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు) అడ్డుగా మారతాడు. అసలు వీరికి, వెంకటప్పయ్య నాయుడుకి సంబంధం ఏంటి? వీరి ప్రేమకథ రెండు వర్గాల మధ్య రక్తపాతానికి కారణం ఎలా అయింది? వంటి ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. సెన్సార్ టాక్ తో పాటు, ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి అందుతున్న ఫస్ట్ రివ్యూస్ ప్రకారం, అజయ్ భూపతి మార్క్ రొమాన్స్, లవ్ అండ్ యాక్షన్ సన్నివేశాలు గ్రాండ్ లెవెల్‌లో రూపొందాయి. రెగ్యులర్ లవ్ స్టోరీలా కాకుండా, తన మార్క్ ఇంటెన్స్ లవ్ స్టోరీలా దీనిని మలిచారు. కొత్త నటులైనప్పటికీ జయకృష్ణ, రషా తడానీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారని టాక్. మోహన్ బాబు విలనిజం, ఆయన డైలాగ్ డెలివరీ ఈ సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి. జయకృష్ణ, రషా తడానీ మధ్య లవ్ సీన్స్ ఎంత క్యూట్ గా ఉంటాయో, మోహన్ బాబు పాత్ర ఎంట్రీ తర్వాత సీన్స్ అంత ఎఫెక్టివ్ గా మారతాయని తెలుస్తోంది. జూలై 30న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఘట్టమనేని వారసుడు జయకృష్ణకు మంచి లాంచ్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.      Srinivasa Mangapuram First Review, Jaya Krishna Ghattamaneni, Rasha Thadani, Ajay Bhupathi  
సినిమా జగత్తులో కొన్ని కథలు భారీ యాక్షన్, హంగులతో ప్రేక్షకులను అలరిస్తే, మరికొన్ని చిత్రాలు మాత్రం మనసును తాకే నిశ్శబ్ద ఎమోషన్లతో గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాయి. ప్రముఖ నటి మధుబాల, విలక్షణ నటుడు ఇంద్రన్స్ ప్రధాన పాత్రలలో నటించిన 'చిన్న చిన్న ఆశై' చిత్రం కూడా సరిగ్గా అలాంటి ఒక విభిన్నమైన ప్రయత్నమే. వర్షా వాసుదేవ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ అనుభూతుల కావ్యం ఈ ఏడాది జూన్ 19వ తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత జులై 28వ తేదీ నుంచి డిజిటల్ దిగ్గజం జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌పై తమిళం, మలయాళంతో పాటు తెలుగు భాషలోనూ డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. గతంలో మధుబాల కథానాయికగా నటించిన ఆల్‌టైమ్ క్లాసిక్ 'రోజా' సినిమాలోని ఐకానిక్ పాట ఆధారంగా ఈ టైటిల్ నిర్ణయించడం మూవీ ప్రేమికులలో మొదటి నుంచే ఎంతో ఆసక్తిని, ప్రాధాన్యతను రేకెత్తించింది. ఈ కథ అంతా ఆధ్యాత్మిక నగరమైన వారణాసి నేపథ్యంలో, కేవలం ఒకే ఒక్క రోజు వ్యవధిలో సాగుతుంది. కేరళకు చెందిన మాధవన్ మాస్టారు (ఇంద్రన్స్) తన కూతురు జానకి (అపర్ణ బాలమురళి)ని చూడటానికి వారణాసి వస్తాడు. జానకి అక్కడ శాస్త్రీయ నృత్యం అభ్యసిస్తూ ఉంటుంది. అదే సమయంలో తంజావూరు నుంచి ఒక సాంస్కృతిక బృందంతో కలిసి వారణాసి వచ్చిన లీల (మధుబాల) అనే మహిళ అనుకోకుండా దొంగతనం బారిన పడుతుంది. దొంగ ఆమె సెల్ ఫోన్ మరియు పర్స్ కాజేయడంతో, అతనిని వెంబడించే క్రమంలో తన టీమ్ నుంచి విడిపోయి, భయంతో ఒంటరిగా మిగిలిపోతుంది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మాధవన్ ఆమెకు ధైర్యాన్ని చెప్పి, తప్పిపోయిన వారి సమాచార కేంద్రంలో ఫిర్యాదు నమోదు చేయిస్తాడు. మాధవన్ ఇచ్చిన భరోసాతో కోలుకున్న లీల తన గతాన్ని, భావాలను అతనితో పంచుకుంటుంది. మాధవన్ కూడా తన భార్య శాశ్వతంగా దూరమైపోయిన తీరును, తన జీవితంలో నిండిన ఒంటరితనాన్ని వివరిస్తాడు. లీలకు వారణాసి నగరాన్ని చూడాలనే కోరిక ఉండటంతో, మాధవన్ ఆమెను వెంటబెట్టుకుని ఆ పవిత్ర ప్రదేశాలను చూపిస్తాడు. ఈ ప్రయాణంలో వేదాంతం, వైరాగ్యం నిండిన దృశ్యాల మధ్య వీరిద్దరూ తమ జీవిత గాయాలను పంచుకుంటారు. జీవితంలో దెబ్బతిని, ఒంటరిగా మిగిలిన ఇద్దరు మనుషులు అనుకోకుండా కలిసినప్పుడు, వారి చిన్న చిన్న ఆశలు ఎలాంటి ఊరటను ఇచ్చాయనేది దర్శకురాలు వర్షా వాసుదేవ్ ఎంతో ఆత్మీయంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటుడు ఇంద్రన్స్ తన సహజ నటనతో అలరించగా, గోవింద్ వసంత అందించిన నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం సన్నివేశాలకు ప్రాణం పోశాయి. అపర్ణ బాలమురళిపై చిత్రీకరించిన పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే, ఫీల్ గుడ్ ఎమోషన్స్ కోసం కేటాయించిన సమయం కాస్త ఎక్కువ కావడంతో కథనం నిదానంగా సాగిన భావన కలుగుతుంది. అంతేకాకుండా మధుబాల పాత్ర రూపకల్పనలో కొంత అయోమయం నెలకొనడం ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తుంది. నిదానంగా సాగే మానవీయ సంబంధాల కథలను, హృదయాన్ని హత్తుకునే క్లైమాక్స్ ట్విస్ట్‌లను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే దిండు మీద రాలిన జుట్టును చూసినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసానికి మరియు మన వ్యక్తిత్వానికి ప్రతీక. ఆడవారికైనా, మగవారికైనా ఒత్తైన కురులు ఉండాలని కోరుకోవడం సహజం. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో జుట్టు రాలడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. అసలు జుట్టు ఎందుకు రాలుతుంది? దీనికి పరిష్కారాలు ఏమిటి? డాక్టర్ల అభిప్రాయం ప్రకారం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను Expert Dermatologist Dr. Sunaina Shaik (MD, DNB Dermatology, FRGUHS Trichology) విషయాలు Video Link క్లిక్ చేసి తెలుసుకోండి.  మనం జుట్టుపై ఎందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి? (Why Should We?) జుట్టు రాలడం అనేది కేవలం పైకి కనిపించే సమస్య మాత్రమే కాదు, అది మన శరీరంలో ఉన్న అంతర్గత మార్పులకు లేదా ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. • ఆత్మవిశ్వాసం: ఒత్తైన జుట్టు మన అందాన్ని పెంచడమే కాకుండా మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. • ఆరోగ్య సూచిక: జుట్టు అధికంగా రాలుతుంటే అది మన శరీరంలో పోషకాహార లోపం (Vitamin D, Iron, Zinc) లేదా థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నాయని సూచిస్తుంది. • ముందస్తు జాగ్రత్త: ప్రారంభంలోనే జుట్టు రాలడాన్ని గమనించి తగిన చర్యలు తీసుకుంటే, భవిష్యత్తులో జుట్టు పల్చబడకుండా (Hair Thinning) చూసుకోవచ్చు. ఏం చేయకూడదు? (What Not To Do) తెలిసో తెలియకో మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు జుట్టు విపరీతంగా రాలడానికి కారణమవుతాయి. వాటిని వెంటనే ఆపండి: 1. బిగుతైన హెయిర్ స్టైల్స్ (Tight Hairstyles): జుట్టును గట్టిగా లాగి ముడి వేయడం లేదా పోనీటైల్స్ వేయడం వల్ల 'ట్రాక్షన్ అలోపేషియా' (Traction Alopecia) వచ్చి నుదురు భాగంలో జుట్టు రాలిపోతుంది. 2. టైట్ హెల్మెట్లు వాడటం: మగవారిలో టైట్ హెల్మెట్లు వాడటం వల్ల కలిగే ఘర్షణ (Friction) జుట్టు షాఫ్ట్ బలహీనపడి విరిగిపోవడానికి కారణమవుతుంది. 3. ఇతరుల వస్తువులు వాడటం: ఒకరు వాడిన హెల్మెట్ లేదా దువ్వెన మరొకరు వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉంది. 4. జంక్ ఫుడ్‌పై ఆధారపడటం: సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల జుట్టుకు అందాల్సిన ప్రోటీన్ అందదు. జుట్టును ఎలా సంరక్షించుకోవాలి? (How To) జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే కేవలం పైన రాసే నూనెలు, సీరమ్స్ మాత్రమే కాదు, లోపలి నుండి పోషణ అవసరం. • సరైన డైట్ (High Protein Diet): జుట్టు అనేది కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. కాబట్టి మీ బరువులో ప్రతి కిలోగ్రాముకు 1 గ్రాము ప్రోటీన్ అవసరం (ఉదాహరణకు 60 కేజీల బరువు ఉంటే 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి). మీ ఆహారంలో పన్నీర్, సోయా, చికెన్, చేపలు మరియు గుడ్లు ఉండేలా చూసుకోండి. • గింజలు మరియు విత్తనాలు (Nuts & Seeds): ప్రతిరోజూ గుప్పెడు నట్స్, గుమ్మడి గింజలు (Pumpkin Seeds), పొద్దుతిరుగుడు గింజలు (Sunflower Seeds) మరియు నువ్వులు తీసుకోవడం జుట్టుకు చాలా మేలు చేస్తుంది. • ఒత్తిడి తగ్గించుకోండి: అధిక ఒత్తిడి వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. • స్కాల్ప్ పరిశుభ్రత: చెమట పట్టినప్పుడు జుట్టును తరచుగా వాష్ చేయడం మరియు హెల్మెట్ లోపల ఉండే ప్యాడింగ్‌ను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్ర: రోజుకు ఎన్ని వెంట్రుకలు రాలడం సహజం?  జ: సాధారణంగా రోజుకు 100 వెంట్రుకల వరకు రాలడం సహజమే. అయితే మీ జుట్టు పల్చగా ఉంటే, 50 వెంట్రుకలు రాలినా అది సమస్యగానే పరిగణించాలి. ప్ర: హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు ఊడిపోతుందా?  జ: కేవలం హెల్మెట్ వల్ల జుట్టు ఊడదు. కానీ టైట్ హెల్మెట్ వల్ల కలిగే ఘర్షణ మరియు చెమట వల్ల ఇన్ఫెక్షన్లు ఉంటే జుట్టు రాలవచ్చు. ప్ర: జుట్టు రాలడం మొదలైన వెంటనే చికిత్స తీసుకోవాలా?  జ: సాధారణంగా ఏదైనా స్ట్రెస్ లేదా అనారోగ్యం (జ్వరం వంటివి) వచ్చిన మూడు నెలల తర్వాత జుట్టు రాలడం మొదలవుతుంది. అది ఆరు నెలల వరకు ఉంటే పర్వాలేదు కానీ, ఏడాది కంటే ఎక్కువ కాలం విపరీతంగా రాలుతుంటే తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. జుట్టు సంరక్షణ అనేది ఒక ప్రయాణం. మనం తీసుకునే ఆహారం, మన జీవనశైలి మరియు మనం చేసే చిన్న చిన్న మార్పులే మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ, మీ జుట్టును ప్రేమించండి. మీకు మరిన్ని ఆరోగ్య చిట్కాలు మరియు నిపుణుల సలహాలు కావాలా? అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ను క్లిక్ చేయండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మీ పిల్లలు చదువును ఇష్టపడట్లేదా? ప్రతి తల్లిదండ్రి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు! పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా ఆనందంగా భావించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. చాలామంది తల్లిదండ్రులు మంచి మార్కులు రావాలని ఆశపడతారు. కానీ పిల్లల్లో చదువుపై ఆసక్తి, నేర్చుకోవాలనే తపన, ఆత్మవిశ్వాసం పెరగడానికి సరైన వాతావరణం కల్పించడం మరింత ముఖ్యమైన విషయం. ఈ వీడియోలో ప్రముఖ నిపుణురాలు డాక్టర్ పూర్ణిమ నాగరాజ గారు పిల్లలు చదువుని ప్రేమించేలా తల్లిదండ్రులు ఎలా ప్రోత్సహించాలి, ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉండాలి, పిల్లలపై అనవసర ఒత్తిడి ఎందుకు పెట్టకూడదు, ప్రశంసల ప్రాముఖ్యత, వారి ఆసక్తులను ఎలా గుర్తించాలి వంటి అనేక విలువైన సూచనలను సులభంగా వివరించారు. అలాగే పిల్లల వయస్సుకు తగ్గట్టు చదువు అలవాట్లు ఎలా పెంచాలి, మొబైల్ మరియు టీవీ వినియోగాన్ని ఎలా నియంత్రించాలి, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మాట్లాడాలి, పరీక్షల సమయంలో ఎలా ప్రోత్సహించాలి వంటి అంశాలపై కూడా ఉపయోగకరమైన చిట్కాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మీ పిల్లలు చదువులో మాత్రమే కాకుండా జీవితంలో కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలంటే ఈ వీడియోలో చెప్పిన సూచనలు ప్రతి తల్లిదండ్రికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: పిల్లల్లో చదువుపై ఆసక్తిని ఎలా పెంచాలి? తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎందుకు అవసరం? చదువును భయంగా కాకుండా ఆనందంగా మార్చే మార్గాలు పిల్లలపై ఒత్తిడి వల్ల కలిగే సమస్యలు ప్రశంసలు, ప్రోత్సాహం పిల్లల ఎదుగుదలలో పాత్ర పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పాటించాల్సిన సూచనలు మంచి చదువు అలవాట్లు పెంచే సులభమైన చిట్కాలు పిల్లల మానసిక ఆరోగ్యం మరియు విద్య మధ్య సంబంధం పిల్లల భవిష్యత్తు బలంగా ఉండాలంటే తల్లిదండ్రుల అవగాహన ఎంతో అవసరం. ఈ వీడియోను పూర్తిగా చూసి, ఇతర తల్లిదండ్రులతో కూడా తప్పకుండా పంచుకోండి.  
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు. అయితే ఎంత శుభ్రం చేసినా చాలా ఇళ్లలో సాలీడు పురుగులు చాలా మళ్లీ మళ్లీ వచ్చి చేరుతుంటాయి.  బూజు కూడా చాలా తొందరగా ఏర్పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? వీటికి కారణాలు ఏంటి? వీటిని పరిష్కరించుకోవడానికి ఏం  చేయాలి? పూర్తీగా తెలుసుకుంటే.. సాలీడు గూళ్లు కట్టడానికి కారణాలుయ.. ఇల్లు శుభ్రం చేసిన కొద్ది రోజులకే మూలల్లో, సీలింగ్‌పై, లేదా ఫర్నిచర్ వెనుక సాలీ గూళ్లు మళ్లీ కనిపిస్తుంటే ఇల్లు సరిగా శుభ్రం చేయలేదని అర్థం కాదు.. పదేపదే గూళ్లు ఏర్పడటానికి చాలా కారణాలు ఉండవచ్చు. వాస్తవానికి, సాలీలు తమకు సురక్షితమైన ప్రదేశం , తినడానికి చిన్న కీటకాలు సులభంగా దొరికే చోట మాత్రమే తమ గూళ్లను అల్లుతాయి. స్టోర్‌రూమ్‌లు, అటకలు, మెట్ల దారులు, కిటికీల అంచులు లేదా బరువైన ఫర్నిచర్ వెనుక.. ఇలా ఇంట్లో ఎక్కువ కాలం శుభ్రం చేయకుండా ఉండే ప్రదేశాలు సాలీడులకు ఇష్టమైన స్థలాలుగా మారతాయి. ఈ ప్రదేశాలు నిశ్శబ్దంగా ఉండి, మనుషుల సంచారం తక్కువగా ఉండటం వల్ల, అవి గూళ్లు అల్లడానికి సులభంగా ఉంటాయి. సాలీడులు పదే పదే ఇంట్లోకి ఎందుకు వస్తాయంటే.. సాలీడులు పదేపదే గూళ్లు కట్టడానికి ఒక ప్రధాన కారణం ఇంట్లో చిన్న కీటకాలు ఉండటమే. సాలీడులు ఈ కీటకాలను తిని బ్రతుకుతాయి. ఇంట్లో దోమలు, ఈగలు లేదా ఇతర చిన్న కీటకాలు ఎక్కువగా ఉంటే, సాలీడులు కూడా తరచుగా అక్కడికి వచ్చి గూళ్లు కడతాయి. వర్షాకాలం , శీతాకాలంలో , సాలీడులు బయట కంటే ఇళ్లలోని సురక్షిత ప్రదేశాలను వెతుకుతాయి.  దీని వల్ల వర్షాకాలంలో ఇళ్లలో సాలీడుల నివాసం,  సాలీడు గూడులు పెట్టడం వంటివి ఎక్కువ అవుతాయి. సాలీడుగూళ్లు  ఎలా తొలగించాలి?  ఇంట్లో సాలెగూళ్లు ఏర్పడితే, వాటిని వీలైనంత త్వరగా తొలగించాలి. వాక్యూమ్ క్లీనర్‌తో పైకప్పులు, మూలల్లోని సాలెగూళ్లను సులభంగా శుభ్రం చేయవచ్చు. వాక్యూమ్ చేరలేని ప్రదేశాల కోసం పొడవాటి పిడి ఉన్న చీపురు లేదా డస్టర్‌ను ఉపయోగించవచ్చు. భారతీయులు వాడే బూజు కర్రతో బాగా శుభ్రం చేయవచ్చు. శుభ్రం చేసిన తర్వాత, మిగిలిపోయిన దుమ్ము, సాలెగూళ్లను పూర్తిగా తొలగించడానికి ఆ ప్రదేశాన్ని తడి గుడ్డతో తుడవడం  మంచిది. సాలెగూళ్లు మళ్లీ ఏర్పడకుండా ఉండాలంటే..  ఇంట్లో సాలెపురుగులు మళ్లీ గూళ్లు కట్టకుండా నిరోధించాలంటే, ముందుగా  ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ముఖ్యంగా మూలలు, పైకప్పులు, ఫర్నిచర్ వెనుక , స్టోర్‌రూమ్‌ల వంటి ప్రదేశాలను నిర్లక్ష్యం చేయకూడదు. కిటికీలు, తలుపులు , గోడలలోని పగుళ్లు లేదా చిన్న రంధ్రాలను మూసివేయాలి. ఎందుకంటే సాలెపురుగులు వీటి ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తాయి.  ఇంట్లో చిన్న కీటకాల తిరగడం, దోమలు, ఈగలు వంటివి ఉండకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సాలెపురుగులకు ఆహారం దొరకనప్పుడు, అవి అక్కడ ఎక్కువసేపు ఉండవు. ముఖ్యంగా తలుపులు , కిటికీల చుట్టూ  పుదీనా నూనెను కలిపిన నీటిని చల్లడం కూడా సాలెపురుగులను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.                                   *రూపశ్రీ.
పిల్లల శారీరక మరియు మానసిక ఎదుగుదలలో సరైన పోషకాహారం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా Brain Development, Growth మరియు Immunity బలంగా ఉండాలంటే పిల్లలకు అవసరమైన పోషకాలు సరైన మోతాదులో అందాలి. అయితే చాలామంది తల్లిదండ్రులకు పిల్లలకు ఏ ఆహారం ఇవ్వాలి? ఏ వయసులో ఎలాంటి పోషకాలు అవసరం? Protein ఎంత ముఖ్యమనే విషయాలపై అనేక సందేహాలు ఉంటాయి. ఈ వీడియోలో ప్రముఖ Dietitian Srilatha పిల్లల ఆరోగ్యానికి అవసరమైన సమతుల్య ఆహారం గురించి సులభమైన తెలుగులో వివరించారు. Protein Deficiency వల్ల పిల్లల్లో ఎదుగుదల మందగించడం, కండరాల బలహీనత, తరచూ అనారోగ్యం, రోగనిరోధక శక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎలా వస్తాయో వివరించారు. అలాగే పిల్లల Brain Development కోసం Protein, Healthy Fats, Vitamins, Minerals, Iron, Calcium వంటి పోషకాల ప్రాముఖ్యతను తెలియజేశారు. రోజువారీ ఆహారంలో పాలు, గుడ్లు, పప్పులు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను ఎలా చేర్చాలో కూడా సూచనలు అందించారు. పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా ఎదగాలంటే ఎలాంటి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి? Junk Food వల్ల కలిగే నష్టాలు ఏమిటి? ఇంట్లోనే పోషక విలువలు అధికంగా ఉండే ఆహారం ఎలా అందించాలి? వంటి అనేక ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ప్రతి తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన ఈ వీడియో ద్వారా పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన ముఖ్యమైన ఆహార సూచనలను తెలుసుకోండి.    
నేటికాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం చాలా సాధారణం అయిపోయింది.   ఏ వయసు వారికైనా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల పిల్లలు,  యువకులలో కిడ్నీలో రాళ్ల సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం దాదాపు 10 మందిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో కిడ్నీలో రాళ్ల సమస్యను ఎదుర్కుంటూ ఉన్నారట. ఈ సమస్యలు సాధారణంగా తేలికపాటి చికిత్స లేదా శస్త్రచికిత్స ద్వారా సులభంగా  పరిష్కారం అవుతాయి.  కానీ కొంతమందిలో రాళ్ల సమస్యలు తీవ్రమైన మూత్రపిండాల సమస్యలకు దారితీయవచ్చు. అసలు కిడ్నీలో రాళ్ల సమస్య ఎలా ఏర్పడుతుంది? బీర్ తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుందనే మాట నిజమా? దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే.. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు.. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి అతిపెద్ద కారణం తగినంత నీరు తీసుకోకపోవడం. తగినంత నీరు త్రాగనప్పుడు మూత్రం ఘాడతగా మారుతుంది.  దానిలోని ఖనిజాలు స్ఫటికాలను ఏర్పరుస్తాయి. ఇవే   కిడ్నీలో రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.    ఉప్పు అధికంగా తీసుకోవడం, ప్రోటీన్ అధికంగా తీసుకోవడం, ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలైన పాలకూర, చాక్లెట్  వంటివి తినడం,  అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ల  ప్రమాదం పెరుగుతుంది. ఊబకాయం, మధుమేహం,  జీవక్రియ సమస్యలు కూడా రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. మూత్రపిండాలలో రాళ్లు ఎలా నయమవుతాయి? వైద్యులు చెబుతున్న దాని ప్రకారం..  కిడ్నీలో రాళ్ళు సాధారణంగా  ఎక్కువ నీరు త్రాగడం ద్వారా వాటంతట అవే బయటకు వస్తాయి.  నొప్పిని తగ్గించడానికి,  రాళ్ల పరిమాణాన్ని తగ్గించడానికి వైద్యులు  మందులను సూచించవచ్చు. అయితే రాళ్ల పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు  శస్త్రచికిత్స అవసరం ఏర్పడవచ్చు. కిడ్నీలో రాళ్లను ముందుగానే తొలగించడం చాలా ముఖ్యం ఎందుకంటే అవి కాలక్రమేణా కిడ్నీ లోపలి పొరను దెబ్బతీస్తాయి. బీరు తాగితే కిడ్నీలో రాళ్లు తగ్గుతాయా? బీరు తాగడం వల్ల మూత్ర ఉత్పత్తి పెరుగుతుందని, తరచుగా మూత్ర విసర్జన జరుగుతుందని,  రాళ్లు బయటకు వెళ్లడానికి సహాయపడుతుందని  చాలామంది నమ్ముతారు. కానీ వైద్యులు  ఈ నమ్మకాన్ని తోసిపుచ్చుతున్నారు. బీరు తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు బయటకు వెళ్లడానికి సహాయపడతాయనే నమ్మకం ప్రజలలో ఉన్నా.. బీరు తాగితే చాలు కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి అనుకోవడం చాలా తప్పని, అది వైద్యులు రికమెండ్ చేయరని చెబుతున్నారు. బీరు తాత్కాలికంగా మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది, కానీ అది శరీరం డీహైడ్రేట్ అవ్వడానికి కారణం అవుతుంది.  ఇది రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం అవుతుంది. బీరులో ప్యూరిన్లు కూడా ఉంటాయి, ఇవి యూరిక్ ఆమ్లాన్ని పెంచుతాయి, మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి, అప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బీర్ తాగితే.. ఈ రాళ్ల ప్రమాదం మరింత పెరుగుతుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్యకు ఔషదంగా బీర్ ను తీసుకోవడం అస్సలు మంచిది కాదు.                            *రూపశ్రీ.  
IBS (Irritable Bowel Syndrome) సమస్యకు సహజమైన మరియు ఆయుర్వేద పరిష్కారాలు కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, తరచుగా విరేచనాలు వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ లక్షణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి Irritable Bowel Syndrome (IBS). ఈ TeluguOne Health వీడియోలో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు IBS అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? IBS లక్షణాలు ఏమిటి? అనే విషయాలను వివరంగా తెలియజేస్తున్నారు. అలాగే IBS సమస్యను నియంత్రించడానికి సహాయపడే సహజమైన జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు, ఆయుర్వేద పద్ధతులు మరియు ఇంట్లో పాటించగల కొన్ని చిట్కాలను ఈ వీడియోలో వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: • Irritable Bowel Syndrome (IBS) అంటే ఏమిటి? • IBS రావడానికి కారణాలు ఏమిటి? • IBS ప్రధాన లక్షణాలు • గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం తగ్గించే మార్గాలు • IBS కోసం పాటించాల్సిన ఆహార నియమాలు • సహజమైన మరియు ఆయుర్వేద పద్ధతులు • ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు IBS అనేది దీర్ఘకాలిక జీర్ణ సంబంధ సమస్య కావచ్చు. సరైన ఆహారం, జీవనశైలి మార్పులు మరియు నిపుణుల సూచనలతో దీనిని నియంత్రించుకోవచ్చు. IBS సమస్యతో బాధపడుతున్న వారు ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం ఉపయోగకరమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కూడా షేర్ చేయండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యకు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)