తెలంగాణ రాజయాలలో పెను సంచలనంగా మారిన కొండా సురేఖ ఎపిసోడ్ లో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంటోందా? కేబినెట్ నుంచి కొండా సురేఖకు ఉద్వాసన పలికిన తరువాత.. ఆమె పార్టీకి రాజీనామా చేయకపోవడానికి హస్తిన స్థాయిలో ఆమెకు దక్కిన హామీలే కారణమా? ఆమె విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సాఫ్ట్ కార్నర్ తో ఉందా? అంటే తాజాగా జరుగుతన్న ప్రచారాన్ని బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె హైకమాండ్ పిలుపు మేరకుఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.  గతంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అలాగే సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖకు ఏర్పడిన విభేదాల కారణంగా.. క్రమశిక్షణ చర్య అంటూ ఆమెకు రేవంత్ కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. సాధారణంగా కాంగ్రెస్ రాజకీయాలలో ఇటువంటి కఠిన చర్య చాలా అరుదు. దీంతో కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడం పార్టీ వర్గాలలో సంచలనంగా మారింది.   అయితే,   సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలిగా  కొండా సురేఖను పూర్తిగా దూరం పెట్టడం మంచిది కాదని భావించిన హైకమాండ్.. కేబినెట్ మంత్రిగా ఉద్వాసనకు గురైన ఆమెకు మరో కీలక పదవిని అప్పగించడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలగకుండా ఆమె సేవలను పార్టీకి అందేలా చేయాలని నిర్ణయించిందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొండా సురేఖకు ఆర్టీసీ చైర్మన్ పదవిని ఆఫర్ చేసే     అవకాశం ఉందని తెలుస్తోంది ఆర్టీసీ చైర్మన్ పదవికి   కేబినెట్ హోదా  ఉండటంతో ఆమె గౌరవానికి తగిన పదవి అవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.   కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైనప్పటికీ..  కొండా సురేఖ   పార్టీ నాయకత్వంపై  దుందుడుకుగా ఎటువంటి విమర్శలు, వ్యాఖ్యలూ చేయలేదు. ఆమె సహజ వైఖరికి ఇది పూర్తి విరుద్ధం.  రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే తన అంతిమ లక్ష్యమని కస్పష్టం చేసిన సురేఖ.. తనకు అవమానం జరిగినా..  తాను కాంగ్రెస్ ను వీడే ప్రశక్తే లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.   కేవలం తన పదవి కోల్పోవడం పట్ల కాకుండా, సరైన కారణం లేకుండా తనను తప్పించారనే చిన్న అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనన్న కొండా సురేఖ.. ఆ అసంతృప్తి వినా.. పార్టీని వీడాలన్న యోచన తనలో ఇసుమంతైనా లేదని స్పష్టం చేశారు. ఆమెఅనుసరించిన ఈ వైఖరే కొండా పట్ల హైమాండ్ లో సాఫ్ట్ కార్నర్ ఏర్పడటానికి కరాణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    [Konda Surekha, Telangana Congress Politics, Cabinet Rank Post,  RTC Chairman, Revanth Reddy, Telugu One]
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..! తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త చర్చనీయాంశంగా మారిన పరిణామంలో, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సంచలన సవాల్ విసిరారు. మాక్ అసెంబ్లీలు పెట్టి బీసీ నేతకు ముఖ్యమంత్రి స్థానం కల్పించడం కేవలం డ్రామాలని, నిజంగా దమ్ముంటే బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.  ఎలాగో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభకు రారూ కదా, మరి బీసీలు  ఎస్సీలపై ఈ కపట ప్రేమ ఎందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్ తన స్థానంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రతిపక్ష నేత బాధ్యతలు అప్పగిస్తే, ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం మాయమాటలు చెబుతూ దళితులు, బీసీలను మోసం చేయడం బీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు ఏమాత్రం లేదని మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా ఆరోపించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పుగా మలిచారని, మూడెకరాల భూమి పంపిణీ గానీ, ప్రతిష్టాత్మకమైన దళిత బంధు పథకం అమలును గానీ పూర్తిగా విస్మరించారని గుర్తుచేశారు. కేవలం ఎన్నికల సమయంలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం సరికాదని, ఆయన ఆశయాలను, సూచనలను నిజ జీవితంలో పాటించాలని హితవు పలికారు.  నాటి TRS 2003 డాక్యుమెంట్‌ను కూడా సరిగా పట్టించుకోని చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని విమర్శించారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తామనడం సరికాదని, ముందుగా తమ బుర్రలోని పాత, కుహనా ఆలోచనలను శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చురకలంటించారు. కాలం మారిపోయిందని, నేడు దళితులు నగరాలకు వచ్చి ఉన్నత స్థాయికి చేరుకున్నారని, కాలం చెల్లిన దొరలను ప్రజలు ఫామ్ హౌస్‌లకు పరిమితం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి దళితులకు, వెనుకబడిన వర్గాలకు తీవ్రమైన అవమానాలు జరిగినా కేసీఆర్ నుంచి ఎన్నడూ సరైన స్పందన రాలేదని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను చూసి 'అధ్యక్షా' అనాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎలాంటి స్పష్టమైన విజన్ లేకుండా రాష్ట్రాన్ని పాలించి, రాష్ట్రాన్ని తీవ్రమైన అప్పులపాలు చేశారని మండిపడ్డారు.  అయినప్పటికీ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే, మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మిగిలిన రెండున్నరేళ్ల పాలనా కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క ఎన్నికల హామీని కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ పీసీసీ చీఫ్ తన ప్రసంగాన్ని ముగించారు.       [ MLC Mahesh Kumar Goud, Talasani Srinivas Yadav, KCR, PCC Chief, BRS, Congress,  BRS, CM Revanth reddy, KCR, KTR, Telugu One, Telugu News ]
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు. కొండా కుటుంబానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు.“కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు” అని కొండా మురళి స్పష్టం చేశారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. కొండా సురేఖకు మద్దతుగా వచ్చిన కార్యకర్తలు ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  “కొండాను ఢీకొట్టడం ఈ గొర్రెల వల్ల కాదు” అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని గొర్రెలు, గుంటనక్కలు అన్నీ ఒక్కటై కొండాను ఢీకొట్టాలని చూస్తున్నాయని, అయితే అది సాధ్యం కాదని అన్నారు. ఈ సందర్భంగా కార్యక ర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. “పులి.. పులి.. పులి.. బెబ్బులి.. కొండా మురళి వేట పులి” అంటూ నినాదాలతో హోరెత్తించారు. కొండా కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కార్యకర్తలు తెలిపారు. “మీరు నక్సల్స్‌లోకి వెళ్తే.. మీతోనే నక్సల్స్‌లోకి వస్తాం” అంటూ కొండా మురళికి, కొండా సురేఖకు అభయం ఇచ్చారు. కొండా కుటుంబం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. తాజా పరిణా మాలతో స్థానికంగా కొండా వర్గం రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.       [ Konda Murali, Konda Surekha, Congress party, Warangal, CM Revanth reddy, Konda sushmitha, Telugu One, Telugu News]  
ALSO ON TELUGUONE N E W S
418 will not be arriving in theatres on September 18 as planned. The horror thriller, presented by Prashanth Neel and backed by Mythri Movie Makers, has been postponed as the team works on a grand multi-language release. The decision comes after the film reportedly received encouraging feedback from special screenings held for select audiences and industry members. The makers say exhibitors from other language markets have responded positively, with the response from the Hindi exhibition sector being particularly strong. This has prompted the team to explore a Hindi release along with the South Indian versions. Rather than rushing the film into theatres on the already announced date, the production house now wants additional time to plan its release across multiple markets. The idea is to give 418 wider visibility and take advantage of the interest that has emerged beyond its original target audience. The postponement is therefore being presented as a strategic expansion rather than a production-related delay. The film had already generated curiosity with its trailer, while its recent screenings have apparently strengthened the makers’ confidence in its theatrical potential. Directed by Kirtan Nadagouda, 418 stars Chaitra Achar, Surya Raj, Charan Lakkaraju and Preethi Pagadala in key roles. The film has received an A certificate and a new release date will be announced soon. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Nani’s The Paradise is getting another major boost from its music, with Yasha Nagula turning into a viral sensation within days of its release. The second single has crossed 100 million views and 705K likes, reportedly becoming the fastest Telugu song to reach the milestone. The song’s appeal comes largely from its Telangana folk flavour, which has been given a contemporary treatment by Anirudh Ravichander. Lyrics by Kasarla Shyam, combined with the voices of folk artists, have given Yasha Nagula a distinctly rooted sound while retaining the mass energy expected from a big-screen action film. The track has remained at the No. 1 trending position globally since its release, while the glimpses featuring Nani and Keerthy Suresh have added to the buzz. Interestingly, Anirudh is now finding himself competing with his own numbers, as Aaya Sher, the film’s first single, has already crossed 200 million views. The musical momentum is arriving at an important stage for The Paradise, which is heading for a September 24 worldwide release. Directed by Srikanth Odela, the film stars Nani alongside Mohan Babu, Kayadu Lohar and Raghav Juyal, with Sudhakar Cherukuri producing the project. With the songs already creating a strong digital footprint, the film’s theatrical expectations are naturally getting bigger. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ '418' మూవీ రిలీజ్ సడన్‌గా వాయిదా పడింది. ప్రశాంత్ నీల్ శిష్యుడు కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ హారర్ లవర్స్ ని ఆకట్టుకుంది. "ఇన్నాళ్లూ హారర్ సినిమాల్లో కామెడీ చూసి నవ్వుకున్నది చాలు.. ఇక నుంచి నిజమైన భయం అంటే ఏంటో చూస్తారు" అని మేకర్స్ సవాల్ విసరడమే కాకుండా, సెన్సార్ బోర్డ్ నుండి 'A' సర్టిఫికేట్ సాధించి అందరిలో తీవ్ర ఉత్కంఠను పెంచేశారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు, కొందరు ప్రత్యేక ప్రేక్షకులకు ఎక్స్‌క్లూజివ్ ప్రివ్యూ షోలు వేశారు. అలాగే నార్త్ ఇండియాకు చెందిన ప్రముఖ హిందీ ఎగ్జిబిటర్లు కూడా ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మైండ్ బ్లాక్ అయ్యే రెస్పాన్స్ ఇచ్చారు. ముఖ్యంగా బాలీవుడ్ ఎగ్జిబిటర్స్ అయితే.. "ఈ రేంజ్ హారర్ కంటెంట్‌ను కేవలం సౌత్ లాంగ్వేజెస్‌కే పరిమితం చేస్తే ఎలా? హిందీలో కూడా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయాల్సిందే" అని మేకర్స్‌కు సూచించారట. హిందీ బెల్ట్‌లో సరైన ప్రాపర్ హారర్ సినిమాలకు ఉన్న డిమాండ్ తెలిసిందే. ఉత్తరాది ఎగ్జిబిటర్ల నుండి వచ్చిన ఈ అనూహ్య స్పందనతో మైత్రీ మూవీ మేకర్స్, ప్రశాంత్ నీల్ ఆలోచనలో పడ్డారు. ఒక గొప్ప కంటెంట్‌ను తక్కువ స్కేల్‌లో రిలీజ్ చేయడం కంటే, కొద్ది రోజులు టైమ్ తీసుకుని దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి భారీగా విడుదల చేస్తే రేంజ్ వేరేలా ఉంటుందని భావించారు. అందుకే మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. "మీ నిరీక్షణ కాస్త పెరిగినా, '418' అనుభవం మాత్రం అంతకు మించిన గ్రాండ్ రేంజ్‌లో ఉండబోతోంది" అని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల మార్కెట్లలో విస్తృతంగా ప్రమోషన్స్ నిర్వహించి, సరికొత్త విడుదల తేదీని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.       [418 Movie Postponed, 418 Pan India Release, 418 Release Date, Prashanth Neel, Mythri Movie Makers, Kirtan Nadagouda, Telugu Film News, Telugu News]  
  గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'దాదా' తర్వాత చేయబోయే మూవీ కొరటాల శివతో అని అనౌన్స్ మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. కమర్షియల్ టచ్ కి సోషల్ మెసేజ్ ని నింపడంలో కొరటాల సిద్ధహస్తుడు కావడంతో స్టోరీతో పాటు బాలకృష్ణ క్యారక్టర్ పై ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ పలురకాల కథల్ని ఊహించుకోవడం స్టార్ట్ చేసారు.    అంతేకాకుండా, ఈ చిత్రానికి సౌత్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నట్లు వార్తలు రావడంతో అంచనాలు స్థాయి కూడా పెరిగింది. అయితే, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ఆగిపోయిందంటూ అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేయగా, బాలకృష్ణ గారు ఇటీవల బడ్జెట్ మరియు కమర్షియల్ సేఫ్టీ విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం మొదలైంది. రూ. 100 కోట్ల పరిధిలోనే ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారని, అందుకే రూ. 150 కోట్ల బడ్జెట్ హర్డిల్ కారణంగా కొరటాల శివ సినిమాపై అనిశ్చితి ఏర్పడిందని వార్తలు వ్యాపించాయి. ఈ పుకార్లతో నందమూరి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురై, సినిమా అప్‌డేట్ వెంటనే ఇవ్వాలని నెట్టింట డిమాండ్ చేయడం ప్రారంభించారు.         Also Read: జై జై రామ్ సాంగ్: ఎందుకిలా చేసారు? ఉన్న అర్హత ఏంటి! అయితే అదే సమయంలో బాలయ్య డై హార్డ్ ఫాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు' అనవసరమైన రూమర్లని  నమ్మవద్దని, త్వరలోనే అధికారిక ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్‌మెంట్ అప్‌డేట్ రాబోతోందని సమాచారం.ఏది ఏమైనా బాక్స్ ఆఫీస్ కూడా కొత్తగా బరిలోకి దిగబోతున్న ఒంగోలు గిత్తలా బాలయ్య, కొరటాల మూవీ కోసం కాసుకొని కూర్చుంటుందనేది పక్కా.         [Balakrishna, Koratala Siva, , NBK112 , Fans Demand, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]  
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్‌లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇక ఆగస్ట్ నెలలోనే ఈ మూవీని అనకాపల్లి ప్రజలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. ‘అనకాపల్లి’ సినిమాని అనకాపల్లి ప్రజలు వీక్షించి అద్భుతమైన రెస్సాన్స్‌ను అందించారు. ఈ మూవీని తెలుగులో పాటుగా తమిళంలోనూ భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రధాన పాత్రల్ని చూపిస్తూ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు అందరిలోనూ మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తోంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్, పూర్వి డిస్ట్రిబ్యూషన్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నాయి. ఈ చిత్రానికి మాయా.వి కెమెరామెన్‌గా, శ్రీకృష్ణ అత్తలూరి ఎడిటర్‌గా పని చేశారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు.        [Anakapalli Release Date, Anakapalli on October 2, Anakapalli Movie Telugu, Trinadha Rao Nakkina, Vikram Sahidev, Telugu Film News, Telugu News]  
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సై ఫై థ్రిల్లర్ మూవీ 'కిల్లర్'. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. 'కిల్లర్' సినిమా అక్టోబర్ 30న రిలీజ్ రాబోతోంది. ఈ రోజు మహిళల కోసం 'కిల్లర్' మేకర్స్ 'సూపర్ షీ ఛాలెంజ్'ను అనౌన్స్ చేశారు. రాత్రికి రాత్రే మీకు సూపర్ పవర్ వస్తే ఏం చేస్తారో చెబుతూ రీల్స్ చేసి పంపితే వారిలో బెస్ట్ రీల్స్ చేసిన పది మందికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున క్యాష్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అలాగే తమ ఆన్సర్స్ ను టెక్ట్స్ మెసేజ్ పంపిన వారిలో బెస్ట్ ఆన్సర్స్ పంపిన 20 మంది ఒక్కొక్కరు 2 వేల రూపాయల చొప్పున క్యాష్ ప్రైజ్  అందుకోవచ్చు. త్వరలో జరగనున్న కిల్లర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజేతలను వేదిక మీదకు పిలిచి ఈ క్యాష్ ప్రైజ్ అందిస్తారు. ఔత్సాహికులు తమ రీల్స్, టెక్ట్స్ మెసేజ్ లు హీరోయిన్ జ్యోతి పూర్వజ్ ఇన్ స్టాగ్రామ్ అక్కౌంట్ కు ట్యాగ్ చేసి, #SuperSHE #KilleR అనే హ్యాష్ ట్యాగ్స్ రాయాలి. ఈ వివరాలను వెల్లడిస్తూ హీరోయిన్ జ్యోతి పూర్వజ్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఓవర్సీస్ లో "కిల్లర్" మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఓఎంజి పిక్చర్స్ ఈ సినిమాను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సంస్థ "కిల్లర్" సినిమాను అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా వంటి దేశాల్లో విడుదల చేయబోతోంది. https://www.instagram.com/reel/DdThJ8nzLPg/       [Killer Movie, Super She Challenge, Jyothi Poorvaj, Instagram, Sci Fi Thriller Telugu, KilleR, Telugu Film News, Telugu News]
      భారతీయ సినీ ప్రేమికులతో పాటు, రామభక్తులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రామాయణకి కౌంట్ డౌన్ కి స్టార్ట్ అయ్యింది. ఇంకెంత మహా అయితే నెలన్న రోజులు.  దీంతో రిలీజ్ డేట్ నవంబర్ 6 వడివడిగా వస్తుండటంతో మేకర్స్ కూడా ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఈ క్రమంలోనే నిన్న వినాయకుడికి చవితి శుభాకాంక్షలు చెప్తూ  'జై జై రామ్' సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. అయితే 'సియారామ్ సియారామ్' అనే హుక్ లైన్ వెంటనే క్యాచ్ అయ్యేలా ఉంది. దీంతో ఇంతటి ప్రెస్టేజియస్ట్ పాటలో ఇప్పటికే చాలా భక్తి పాటల్లో వినిపించిన  'సియారామ్' ఫీల్ ని ఎందుకు నమ్ముకున్నారని, పరిచయమైన భక్తి సాంగ్ లాగానే ఉందనే విమర్శలు వస్తున్నాయి. ప్రశ్న ని సోషల్ మీడియా వేదికగా కొంత మంది లేవనెత్తుతున్నారు. ఏది ఏమైనా అందరకీ నచ్చాల్సిన అవసరం లేదు. కానీ సాంగ్ రిలీజైన కొద్దీ సేపటి నుంచే రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.   రామాయణ నుంచి రిలీజైన తొలి సాంగ్ కూడా కావడంతో పండగ మూడ్ లో కూడా అభిమానులు,సంగీత ప్రియులు జై జై రామ్'  సాంగ్ మూడ్ లో ఉండిపోయారు. రామ భక్తులైతే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'ఆస్కార్ విజేతలు ఏ.ఆర్. రెహమాన్ హన్స్ జిమ్మర్ సంగీత సారథ్యంలో రూపొందిన జై జై రామ్ వింటుంటే ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రశాంతతను, మైమరిపించే భక్తి భావాన్ని అందిస్తోంది. డాక్టర్ కుమార్ విశ్వాస్ అందించిన అత్యద్భుతమైన సాహిత్యం భక్తి రసాన్ని పండించగా, భారతీయ సంగీత దిగ్గజాలు అరిజిత్ సింగ్ మరియు శ్రేయా ఘోషాల్ తమ అమృతతుల్యమైన గాత్రంతో ఈ పాటకు మరింత జీవం పోశారు.ఈ పాట కేవలం ఒక కమర్షియల్ సినిమా గీతంలా కాకుండా ఒక పవిత్రమైన ప్రార్థనలా ప్రారంభమై, శ్రోతలను నేరుగా రామరాజ్యపు ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్తుందనే అభిప్రయాన్ని వ్యక్తం చేస్తున్నారు.       Also Read: ఒంటిపై బట్టలు లేకుండా ఈ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా!  సాంగ్ లో  విజువల్స్ పరంగా చూసుకుంటే  శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి తమ క్యారెక్టర్స్ లో ఒదిగిపోయిన తీరు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటోంది. రణబీర్ కపూర్ దైవికమైన కాంతి, తేజస్సుతో మెరిసిపోతుండగా, సాయి పల్లవి సీతమ్మవారి పాత్రలో చూపించిన పవిత్రత మరియు సాత్వికమైన వ్యక్తీకరణలు ఈ వీడియోకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విఎఫ్ఎక్స్ (VFX), సిజిఐ (CGI) హంగుల కంటే కూడా భావోద్వేగాలకే ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు నితిన్ తివారి ప్రతి ఫ్రేమ్‌ని  ఎంతో భక్తి  శ్రద్ధల తో రూపొందించినట్లు స్పష్టమవుతోంది.  ప్రపంచ సినీ ప్రేమికులని రామాయణ థియేటర్స్ కి తీసుకురావడమే లక్ష్యంగా రామాయణని నమిత్ మల్హోత్రా నిర్మించాడు.          [Ramayana,Jai Jai Ram Song Review, Ranbir Kapoor, Sai Pallavi, Namith Malhotra,Nitesh Tiwari, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]  
'ఆ నలుగురు', 'మధుమాసం', 'అందరి బంధువయా', 'ఇదీ సంగతి', 'ఆటగదరా శివా' తదితర సినిమాలతో విలక్షణ దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు చంద్ర సిద్ధార్థ్. ఆయన తెరకెక్కించిన తాజా సినిమా 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు'. ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా... అనేది ఉపశీర్షిక. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత పొడవైన టైటిల్‌తో వస్తున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథతో వై.వి.సత్యనారాయణ రాజు సమర్పణలో ఫిల్మోత్సవ్ పతాకంపై చంద్ర సిద్ధార్థ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదల కానుంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు.  'ఈ పాట కోరినవారు..' టీజర్ విడుదల చేసిన అనిల్ రావిపూడి, సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ''ఇంత పెద్ద టైటిల్‌తో సినిమా రావడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చంద్ర సిద్ధార్థ్ గారి దగ్గర 'మధుమాసం', 'హౌస్‌ఫుల్', 'అందరి బంధువయా' చిత్రాలకు నేను స్క్రిప్ట్ విభాగంలో పని చేశాను. ఆయన సెన్సిబుల్ సినిమాలు తీశారు. పొడవాటి టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు. దర్శక నిర్మాత చంద్ర సిద్దార్థ్ మాట్లాడుతూ... ''మా సినిమా టీజర్ విడుదల చేసిన అనిల్ రావిపూడి గారికి థాంక్స్. మేం అడిగిన వెంటనే ఓకే చెప్పారు. ఆయన బిజీ షెడ్యూల్‌లో మాకు కొంత టైమ్ ఇచ్చారు. ఆయనకు టైటిల్, టీజర్ నచ్చడం పాజిటివ్ సైన్. మాకు సంతోషంగా ఉంది. టైటిల్ రెస్పాన్స్ బావుంది. ఆడియన్స్ అందరిలో సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన థ్రిల్లర్ సినిమాల్లో ఇదొక డిఫరెంట్ సినిమా అవుతుంది. థియేటర్లలో మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం'' అని అన్నారు. హర్ష హీరోగా,  అమైరా గోస్వామి, సుజనా రెడ్డి హీరోయిన్లుగా పరిచయమవుతున్న 'ఈ పాట కోరినవారు...' సినిమాలో ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌ వర్ధన్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. టీజర్ విషయానికి వస్తే... 'నీ రేడియో కావాలి' అంటూ హీరో హర్ష ఒకరి ఇంటికి వెళతాడు. అక్కడ రేఖా నిరోషా 'నేను వద్దా' అని అడుగుతారు. అది చూసి ఆమె భర్త ఓ లుక్ ఇస్తారు. తర్వాత 'ఇంత అందంగా ఉన్నారు. మిమ్మల్ని ఎలా వదులుకున్నారు' అని ఇనాయ సుల్తానాను అడిగితే... 'ఎప్పుడూ మీరే వదిలేయాలా? మేం వదలకూడదా' అని ఆమె సమాధానం ఇస్తారు. ప్రేయసిని షేర్ చేసుకోవాలనుకునే ప్రియుడు, పెళ్లి పీటల మీద భర్తతో పాటు మరొకరు కావాలని కోరిన భార్య వంటి సన్నివేశాలు సినిమాపై ఆసక్తి పెంచాయి. ఈ మిస్టికల్ మ్యూజికల్ థ్రిల్లర్ మీద అంచనాలు పెంచాయి.   'ఆ నలుగురు'తో మానవ సంబంధాలు, భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించిన చంద్ర సిద్ధార్థ్, ఈసారి ఆధునిక థ్రిల్లర్ నేపథ్యంతో మరో భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా మలుస్తూ రూపొందిన చిత్రమిది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, మెమరీస్, గిల్ట్ వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించిన చిత్రమిది.        [Ee Paata Korinavaaru Movie, Ee Paata Korinavaaru Teaser, Anil Ravipudi, Chandra Siddhartha, Telugu Movies 2026, Telugu Film News, Telugu News]  
    ప్రపంచ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు 'సిడ్నీస్వీనీ.. 'యుఫోరియా' సిరీస్ తో అయితే తన కట్ అవుట్ కి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. వివాదాలని ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిపించుకొనే ఆత్మీయ బంధువులా లూప్ లైన్ లో ఉంచుకునే   'సిడ్నీ స్వీనీ'  మరోసారి అంతర్జాతీయంగా తీవ్ర వివాదంలో చిక్కుకొని గ్లోబల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. స్పోర్ట్స్ ప్రిడిక్షన్,  ట్రేడింగ్ వేదిక'నోవిగ్' (Novig) అనే బ్రాండ్ ప్రచారం కోసం సిడ్నీ స్వీనీ చేసిన నూతన స్పోర్ట్స్  ప్రకటన సోషల్ మీడియా వేదికల్లో వైరల్ కావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారుల నుంచి తీవ్ర విమర్శలని ఎదుర్కొంటోంది. యాడ్‌లో సిడ్నీ స్వీనీ ఒంటిపై దుస్తులు లేకుండా, కేవలం టెన్నిస్ రాకెట్లు, బాస్కెట్‌బాల్స్, ఫుట్‌బాల్స్, హాకీ స్టిక్స్ మరియు వివిధ క్రీడా పరికరాల సహాయంతో శరీరాన్ని కప్పుకుంటూ ఉంది. అయితే నోవిగ్ బ్రాండ్ కేవలం స్పోర్ట్స్ ప్రిడిక్షన్ మార్కెట్ అని చాటిచెప్పడమే దీని ప్రధాన ఉద్దేశమని సదరు కంపెనీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. అంతేకాకుండా, మొదటి నుంచి ఈ ప్రచారాన్ని ఎంతో క్రియేటివ్‌గా, హ్యూమర్ మరియు కాన్ఫిడెన్స్‌తో రూపొందించడంలో తాను స్వయంగా భాగస్వామ్యం వహించానని సిడ్నీ స్వీనీ గతంలో చెప్పుకొచ్చింది.  అయితే, యాడ్ విడుదలైన కొద్దిసేపటికే ప్రపంచం నలుమూలల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా క్రీడా ప్రపంచం నుండి ప్రతికూల స్పందనలు వెల్లువెత్తాయి. ఆస్ట్రేలియాకు చెందిన నాలుగు సార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, మాజీ స్విమ్మర్ అరియార్న్ టిట్మస్ ఈ ప్రచారంపై సోషల్ మీడియాలో  ఘాటుగా స్పందించింది. మహిళా అథ్లెట్లు క్రీడల్లో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి, గౌరవం సాధించడానికి కొన్ని దశాబ్దాలుగా ఎంతో కష్టపడుతుంటే, కేవలం బ్రాండ్ ప్రచారం కోసం మహిళల శరీరాలను ఇలా సరుకుగా మార్చడం దారుణమని మండిపడ్డారు. బ్రిటీష్ రన్నర్ ఏమీ హంట్, యుఎస్ జిమ్నాస్ట్ గ్రేసీ క్రామర్, రగ్బీ ప్లేయర్ సోఫీ ఫెల్లా వంటి పలువురు క్రీడాకారిణులు కూడా ఈ యాడ్‌ను తీవ్రంగా తప్పుపట్టారు.       Also Read: ఎపిక్ షాకింగ్ కలెక్షన్స్: డిజాస్టర్ అంటుంది ఎవరు! అయితే ఈ వ్యాఖ్యలపై సిడ్నీ స్వీనీ నేరుగా ఏ ప్రకటన చేయకుండా, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక ఆసక్తికరమైన సైలెంట్ కౌంటర్ ఇచ్చారు. గతంలో స్పోర్ట్స్ విభాగంలో ప్రముఖ మ్యాగజైన్లకు నగ్నంగా లేదా దాదాపు దుస్తులు లేకుండా ఫొటోషూట్లు చేసిన దిగ్గజ అథ్లెట్ల ఫొటోలను ఆమె వరసగా షేర్ చేశారు. అందులో టెన్నిస్ లెజెండ్ సెరెనా విలియమ్స్, బాస్కెట్‌బాల్ స్టార్ మేగన్ రాపినో, యూఎఫ్‌సీ ఫైటర్ రోండా రౌసీ, ఎన్‌ఎఫ్‌ఎల్ స్టార్స్ రాబ్ గ్రోంకోవ్స్కీ, జేసన్ కెల్స్ వంటి దిగ్గజాల ESPN 'బాడీ ఇష్యూ' ఫొటోషూట్స్ ఉన్నాయి. క్రీడా దిగ్గజాలు చేసినప్పుడు లేని అభ్యంతరం, తన వరకు వచ్చేసరికి ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారనే ప్రశ్నని  ఆమె పరోక్షంగా లేవనెత్తి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. గత ఏడాది అమెరికన్ ఈగిల్ డెనిమ్ బ్రాండ్ ప్రచారంతో చర్చనీయాంశమైన రెండు సార్లు ఎమ్మీ నామినీ పొందిన ఈ హాలీవుడ్ నటి, ఇప్పుడు ఈ కొత్త గ్లోబల్ స్పోర్ట్స్ యాడ్ వివాదంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచారు.     [Sydney Sweeney , Sports Ad Controversy, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood Cinema News, Tollywood]    
Chandra Siddharth, the acclaimed filmmaker known for his distinctive and sensitive storytelling in films such as Aa Naluguru, Madhumasam, Andari Bandhuvaya, Idhi Sangathi and Aatagadara Siva, is now coming up with yet another unconventional film titled ‘Ee Paata Korinavaaru Nemalipalem Nundi Rama, Jyotsna, Nandu, Murali, Kabir, Dhol Ravi Modhalagunavaru’. The film carries the intriguing subtitle ‘A Forbidden Raag from a Forbidden Saga’ and has already entered the record books as the film with one of the longest titles in the history of Telugu cinema. Based on a story by noted filmmaker and writer Madan, the film is presented by Y.V. Satyanarayana Raju and produced by Chandra Siddharth under the banner of Filmotsav. The film is slated for a grand theatrical release on September 18. The teaser of ‘Ee Paata Korinavaaru…’ was unveiled by blockbuster director and ‘Hit Machine’ Anil Ravipudi, who wished the team great success. Speaking on the occasion, Anil Ravipudi said, “ It is interesting to see a film coming with such a long title. I worked in the script department with Chandra Siddharth garu on Madhumasam, Housefull and Andari Bandhuvaya. He has always made sensible and meaningful films. I hope this film, which comes with such an unusual title, will also receive a great response from audiences.” Director and producer Chandra Siddharth said, “ I sincerely thank Anil Ravipudi garu for launching our teaser. He immediately agreed when we approached him and graciously gave us some time despite his busy schedule. The fact that he liked both the title and the teaser is a very positive sign for us, and we are extremely happy. The response to the title has been very encouraging, and it has already created a great deal of curiosity among audiences. Among the thrillers made in Telugu so far, we believe this film will stand out as something truly different. We are confident that it will receive a good response in theatres.” Starring Harsha as the male lead, with Amaira Goswami and Sujana Reddy making their debuts as female leads, Ee Paata Korinavaaru… features Inaya Sultana, Ravi Varma, Ashok Vardhan and Rekha Nirosha in prominent roles.The teaser opens with Harsha visiting someone’s house saying, “I want your radio.” Rekha Nirosha then asks, “Don’t you want me?”, prompting a telling reaction from her husband. In another intriguing moment, when Inaya Sultana is asked, “You are so beautiful. How could he leave you?”, she responds, “Why should you always be the one to leave? Can’t we be the ones to leave too?” The teaser also features unusual and provocative situations—a lover who wants to share his girlfriend and a wife who wants someone else along with her husband at the wedding altar. These intriguing situations have heightened curiosity around the film and have raised expectations for this mystical musical thriller. Chandra Siddharth, who powerfully explored human relationships and emotions in Aa Naluguru, is now presenting audiences with a completely different cinematic experience set against the backdrop of a contemporary thriller. The film explores the fascinating relationship between music, sound and the human brain, weaving elements such as sound therapy, brain mapping, memories and guilt into an intriguing mystery narrative. With its unconventional title, mysterious premise and distinctive storytelling, Ee Paata Korinavaaru… promises to offer audiences a thriller unlike anything they have seen before. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
లైఫ్ లో సక్సెస్ కావాలంటే  మనిషి ఆలోచన ఎలా ఉండాలి.! జీవితంలో విజయం సాధించడం అనేది అనుకోకుండా జరిగే ఒక సంఘటన కాదు. అది ఒక నిరంతర ప్రయాణం. ఈ ప్రయాణంలో మన గమ్యాన్ని, మన స్థాయిని నిర్ణయించేది మన ఆలోచనా సరళి మాత్రమే. ఒక మనిషి ఎలా ఆలోచిస్తే అతని జీవితం అలానే తయారవుతుంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం స్పందించే తీరు, మన మానసిక స్థితి , మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును రూపుదిద్దుతాయి. విజేతలకు, సాధారణ వ్యక్తులకు మధ్య ఉండే ప్రధాన తేడా వారి ప్రతిభ లేదా అదృష్టం మాత్రమే కాదు, వారి ఆలోచనా విధానం కూడా. విజయం సాధించడానికి  మనిషి ఆలోచనా సరళి ఎలా ఉండాలో వివరంగా తెలుసుకుంటే..  చాలామంది తమ సామర్థ్యాలకు ఒక హద్దును ఏర్పరచుకుంటారు. కానీ, సరైన శిక్షణ, శ్రమ , నిరంతరం  నేర్చుకుంటూ ఉండటం వంటి వాటి ద్వారా ఏ నైపుణ్యాన్నైనా పెంపొందించుకోవచ్చనే నమ్మకం ఉండాలి. ఓటమి అనేది ప్రయాణానికి ముగింపు కాదని, అది ఒక అనుభవమని గ్రహించాలి. ప్రతి వైఫల్యం ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగే ఆలోచన ఉన్నప్పుడే వ్యక్తిగత వికాసం సాధ్యమవుతుంది. స్పష్టమైన లక్ష్యాలు.. మనిషి ఆలోచన ఎప్పుడూ స్పష్టమైన లక్ష్యాల వైపు మొగ్గు చూపాలి. స్పష్టత లేని ఆలోచనలు గమ్యం లేని ప్రయాణం లాంటివి.  జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు, దాని కోసం ఏ రోజు ఏమి చేయాలి అనే విషయంలో స్పష్టత ఉండాలి. లక్ష్యాలను షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అని విభజించుకుని, వాటిని సాధించడానికి  ప్రణాళికలు రచించుకోవాలి. కేవలం ఆలోచించడమే కాకుండా, ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టే క్రమశిక్షణ ఉండాలి. పారిపోవడం కాదు పరిష్కారం వెతకాలి.. పరిస్థితులు ఎల్లప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు నిరాశపడకుండా ధైర్యంగా నిలబడే ఆలోచనా ధోరణి ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు "ఇది నాకే ఎందుకు జరిగింది" అని బాధపడటం కంటే, "ఈ సమస్యను నేను ఎలా పరిష్కరించగలను" అని ఆలోచించడం ముఖ్యం. సమస్యల వైపు కాకుండా పరిష్కారాల వైపు దృష్టి సారించే ఆలోచనా సరళి మనిషిని మానసికంగా బలంగా మారుస్తుంది. పరిస్థితుల సర్దుబాటు.. విజయం  సాధించాలంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మనిషి కూడా మారడం చాలా అవసరం. ప్రపంచం వేగంగా మారుతోంది. పాత ఆలోచనలకే పరిమితమైపోతే పురోగతి సాధ్యం కాదు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, కొత్త సాంకేతికతలను అవగాహన చేసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండటం  అనేది మనిషి ఆలోచనను పదునుపెడుతుంది. ఏ వయసులోనైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి వెనుకాడకూడదు. పాజిటివ్ ఆలోచన.. ఆలోచనల్లో పాజిటివ్నెస్ ఉండటం చాలా ముఖ్యం. మన ఆలోచనలే మన భావోద్వేగాలను, మన చర్యలను శాసిస్తాయి. ప్రతికూల ఆలోచనలు మన శక్తిని క్షీణింపజేస్తాయి , భయాన్ని పెంచుతాయి. పాజిటివ్ ఆలోచనలు మనలో నమ్మకాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయి. మీ చుట్టూ ఉన్న పరిసరాలు, మీరు సహవాసం చేసే వ్యక్తులు కూడా మీ ఆలోచనలపై ప్రభావం చూపుతారు. కాబట్టి సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులతో సమయం గడపడం, ప్రేరణనిచ్చే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. సమయం విలువ.. గొప్ప విజయాలు సాధించిన వారెవరూ సమయాన్ని వృథా చేయరు. కాలం అత్యంత విలువైనది. నేటి పనిని నేడే పూర్తి చేయాలనే ఆలోచన ఉండాలి. వాయిదా వేసే అలవాటు విజయానికి అతిపెద్ద శత్రువు. ప్రతి నిమిషాన్ని ఉపయోగకరంగా మార్చుకునే ఆలోచన ఉన్నప్పుడే అనుకున్న గమ్యాన్ని త్వరగా చేరుకోగలము. అవరోధాలు అధిగమించడం.. విజయం సాధించే క్రమంలో అనేక అడ్డంకులు వస్తాయి. మొదట్లోనే ఫలితాలు రాకపోవచ్చు. అంత మాత్రాన ప్రయత్నాన్ని ఆపకూడదు. పట్టుదల, సహనం అనేవి ఆలోచనా విధానంలో భాగం కావాలి. ఫలితం ఆలస్యమైనా, సరైన మార్గంలో పయనిస్తున్నామనే నమ్మకంతో నిలకడగా శ్రమించాలి. చివరగా.. విజయం అనేది కేవలం డబ్బు లేదా హోదాకు మాత్రమే పరిమితం కాదు. సమాజానికి ఉపయోగపడేలా, ఇతరులకు ప్రేరణగా నిలిచేలా ఆలోచించడం నిజమైన విజయం. మన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటే, మన జీవితం కూడా అంత ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి మీ ఆలోచనలను సానుకూలంగా, స్పష్టంగా, , లక్ష్య సాధన వైపు నడిపించేలా మలుచుకోవాలి. అలా చేస్తే జీవితంలో విజయం తప్పక సొంతమవుతుంది.                       *రూపశ్రీ.  
మానవ శరీరానికి ఇంధనం అందించే పోషకాహారంలో కొవ్వులు (Fats) అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే, మనం రోజూ తీసుకునే ఆహారంలో ఉండే అన్ని రకాల కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేయవు. ముఖ్యంగా మన హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో  సంతృప్త కొవ్వులు (Saturated Fats) మరియు  అసంతృప్త కొవ్వులు  (Unsaturated Fats) మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడం ఎంతో అవసరం. వైద్య నిపుణులు మరియు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల ప్రకారం, అసంతృప్త కొవ్వులు గుండెకు రక్షణ కవచంలా పనిచేస్తే, పరిమితికి మించి తీసుకునే సంతృప్త కొవ్వులు ప్రాణాంతకమైన గుండె జబ్బులకు దారితీస్తాయి. ఈ రెండు రకాల కొవ్వుల వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు, అవి మన రక్తనాళాలపై చూపే ప్రభావం మరియు గుండెను సురక్షితంగా ఉంచుకునే మార్గాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. మొదటగా  సంతృప్త కొవ్వులు  (Saturated Fats) గురించి పరిశీలిస్తే, ఇవి సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఘనరూపంలో ఉంటాయి. వెన్న, నెయ్యి, రెడ్ మీట్, చీజ్, పామాయిల్ మరియు కొబ్బరి నూనె వంటి ఆహార పదార్థాలలో ఇవి ఎక్కువగా లభిస్తాయి. ఆహారంలో సంతృప్త కొవ్వులు ఎక్కువైతే, అవి కాలేయంలో చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్‌డిఎల్ (LDL , Low Density Lipoprotein) ఉత్పత్తిని గణనీయంగా పెంచుతాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడలలో కొవ్వు పొరలుగా (Plaque) పేరుకుపోయి, ధమనులను మూసివేస్తుంది. దీనిని వైద్య పరిభాషలో  అథెరోస్క్లెరోసిస్  (Atherosclerosis) అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదికల ప్రకారం, మనం రోజూ తీసుకునే మొత్తం క్యాలరీలలో సంతృప్త కొవ్వుల వాటా 7 శాతం నుండి 10 శాతానికి మించకూడదు. ఈ పరిమితి దాటితే గుండెపోటు (Heart Attack) మరియు పక్షవాతం (Stroke) వచ్చే ప్రమాదం 30 శాతానికి పైగా పెరుగుతుంది.   దీనికి భిన్నంగా  అసంతృప్త కొవ్వులు  (Unsaturated Fats) గుండెకు అమృతం లాంటివి. ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉంటూ, ఆలివ్ ఆయిల్, ఆవనూనె, పొద్దుతిరుగుడు నూనె, బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు (Flaxseeds) మరియు సాల్మన్ వంటి కొవ్వు చేపల్లో పుష్కలంగా లభిస్తాయి. అసంతృప్త కొవ్వులను ఏక అసంతృప్త (MUFA) మరియు బహుళ అసంతృప్త (PUFA) కొవ్వులుగా వర్గీకరిస్తారు. ఇవి రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తూ, మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డిఎల్ (HDL  , High,Density Lipoprotein) స్థాయిలను పెంచుతాయి. అంతేకాకుండా, ఇవి శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ (Triglycerides) స్థాయిలను తగ్గించి, రక్తనాళాల వాపును (Inflammation) నివారిస్తాయి. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం క్రమబద్ధంగా ఉండటమే కాకుండా, రక్తప్రసరణ ఎలాంటి అవరోధాలు లేకుండా సాగుతుంది. శాస్త్రీయ పరిశోధనలు మరియు అంతర్జాతీయ న్యూట్రిషన్ అధ్యయనాలు వెల్లడించిన గణాంకాల ప్రకారం, మన దైనందిన ఆహారంలో సంతృప్త కొవ్వుల నుండి వచ్చే 5 శాతం క్యాలరీలను అసంతృప్త కొవ్వులతో భర్తీ చేయడం వల్ల హృద్రోగాల ప్రమాదం ఏకంగా 13 శాతం నుండి 25 శాతం వరకు తగ్గుతుంది. అలాగే, ప్రాసెస్ చేసిన ఆహారాలు, బేకరీ తినుబండారాలలో ఉండే  ట్రాన్స్ ఫ్యాట్స్  (Trans Fats) నిత్య జీవితంలో 1 శాతం కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలని వైద్యులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మొత్తం రోజువారీ క్యాలరీలలో కొవ్వుల శాతం 20 నుండి 35 శాతం వరకు ఉండవచ్చని, కానీ అందులో అత్యధిక భాగం అసంతృప్త కొవ్వులే ఉండాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, ఆరోగ్యకరమైన గుండె కోసం మనం రోజూ వాడే వంట నూనెలు మరియు ఆహార పదార్థాల ఎంపికలో మార్పులు చేయడం అత్యంత ఆవశ్యకం. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, రెడ్ మీట్, అధికంగా వెన్న మరియు డాల్డా వాడకాన్ని తగ్గించి, వాటి స్థానంలో డ్రై ఫ్రూట్స్, సీడ్స్, ఆలివ్ ఆయిల్, నాణ్యమైన అసంతృప్త నూనెలను ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజువారీ ఆహారంలో సరైన కొవ్వుల సమతుల్యతను పాటించడంతో పాటు నిత్యం 30 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల గుండె సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటుంది. సరైన ఆహార అవగాహనే శ్రేయోభరితమైన సుదీర్ఘ జీవితానికి పునాది.       [Saturated Fats, Unsaturated Fats, Heart Health, LDL Cholesterol, HDL Cholesterol, Atherosclerosis, Trans Fats, Healthy Fats, Cholesterol, Cardiovascular Health]
స్త్రీ సంతానోత్పత్తి వ్యవస్థ మరియు గర్భధారణ విషయంలో మహిళల్లో తరచుగా అనేక అపోహలు, సందేహాలు నెలకొంటాయి. ముఖ్యంగా తల్లికావాలని కోరుకునే మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన చర్చ  అండాల సంఖ్య  (Egg Quantity) మరియు  అండాల నాణ్యత  (Egg Quality). చాలామంది మహిళలు అండాల సంఖ్య ఎక్కువగా ఉంటే చాలు, త్వరితగతిన గర్భం దాల్చవచ్చని భావిస్తుంటారు. కానీ, సంతానోత్పత్తి నిపుణులు (Fertility Experts) వెల్లడిస్తున్న నిజాల ప్రకారం అండాల సంఖ్య ఎంత ముఖ్యమో, అంతకంటే అండాల నాణ్యత అత్యంత ప్రాధాన్యమైనది. సంతానలేమి సమస్యలతో బాధపడేవారిలో ఈ రెండింటి మధ్య తేడాను సరిగ్గా అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. గర్భధారణ విజయవంతం కావడానికి ఈ రెండు అంశాలు ఏ విధంగా తోడ్పడతాయి, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలేంటో ఇప్పుడు సమగ్రంగా తెలుసుకుందాం. జన్యుపరంగా పరిశీలిస్తే, ప్రతి పెళ్లైన మహిళ లేదా అమ్మాయి తన పుట్టుకతోనే అండాల నిల్వలతో జన్మిస్తుంది. శారీరక నిర్మాణం ప్రకారం ఒక ఆడపిల్ల జన్మించినప్పుడు ఆమె అండాశయాలలో దాదాపు 10 లక్షల నుండి 20 లక్షల (1 to 2 million) అండాలు ఉంటాయి. అయితే, వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ నిల్వలు సహజంగానే క్షీణిస్తూ ఉంటాయి. యుక్తవయస్సుకు (Puberty) చేరుకునేసరికి ఈ అండాల సంఖ్య దాదాపు 3,00,000 నుండి 4,00,000 వరకు తగ్గిపోతుంది. ఒక మహిళ తన జీవితకాలంలో కేవలం 300 నుండి 400 అండాలను మాత్రమే అోవ్యులేషన్ (Ovulation) ద్వారా విడుదల చేస్తుంది. మిగిలిన అండాలన్నీ శరీరంలో కరిగిపోతాయి. ముఖ్యంగా 30 సంవత్సరాల వయసు నాటికి మహిళల్లో ప్రారంభ నిల్వలలో కేవలం 12 శాతం అండాలు మాత్రమే మిగులుతాయి. 40 ఏళ్లు దాటేసరికి ఈ నిల్వలు మరింత పడిపోయి కేవలం 3 శాతానికి చేరుకుంటాయి. వైద్య భాషలో అండాల సంఖ్యను  ఓవేరియన్ రిజర్వ్  (Ovarian Reserve) అని పిలుస్తారు. దీనిని అంచనా వేయడానికి బ్లడ్ టెస్ట్ ద్వారా AMH (Anti Müllerian Hormone) మరియు ఆంత్రల్ ఫోలికల్ కౌంట్ (AFC) స్కాన్ నిర్వహిస్తారు. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. AMH పరీక్ష అనేది కేవలం మీ అండాశయంలో ఎన్ని అండాలు అందుబాటులో ఉన్నాయో (Quantity) మాత్రమే చెబుతుంది తప్ప, ఆ అండాలు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాయో (Quality) చెప్పలేదు. ఉదాహరణకు, 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళకు మంచి AMH స్థాయిలు ఉన్నప్పటికీ, వయస్సు ప్రభావం వల్ల అండాల నాణ్యత తగ్గిపోవచ్చు. మరోవైపు, 25 సంవత్సరాల యువతికి తక్కువ AMH (ఉదాహరణకు 1.0 ng/mL కంటే తక్కువ) ఉన్నప్పటికీ, ఆమె అండాల నాణ్యత చాలా బాగుండటం వల్ల త్వరగా గర్భం దాల్చే అవకాశాలు 60 నుండి 70 శాతం వరకు ఉంటాయి.   అండాల నాణ్యత అంటే అండంలోని జన్యు పదార్థం (DNA/Chromosomes) ఎంత ఆరోగ్యకరంగా ఉందనేది సూచిస్తుంది. నాణ్యమైన అండం మాత్రమే శుక్రకణంతో విజయవంతంగా ఫలదీకరణ (Fertilization) చెంది, ఆరోగ్యకరమైన పిండంగా (Embryo) మారగలదు. నాణ్యత లోపిస్తే ఫలదీకరణ జరగకపోవడం, లేదా పిండం ఏర్పడినా గర్భస్రావం (Miscarriage) కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మహిళ వయస్సు 35 ఏళ్లు దాటిన తర్వాత అండాల్లో క్రోమోజోమ్ లోపాలు (Aneuploidy) పెరిగే అవకాశం దాదాపు 50 శాతానికి పైగా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల సంతానోత్పత్తి క్రమంగా తగ్గుతుంది. అయితే అండాల నాణ్యతను కేవలం వయస్సే కాకుండా మన రోజువారీ జీవనశైలి, ఆహార అలవాట్లు, శరీర బరువు (BMI), మానసిక ఒత్తిడి మరియు ధూమపానం వంటి దురలవాట్లు తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అండాల సంఖ్యను తిరిగి పెంచడం సాధ్యం కాకపోయినప్పటికీ, అందుబాటులో ఉన్న అండాల నాణ్యతను మెరుగుపరచడం లేదా కాపాడుకోవడం ఖచ్చితంగా సాధ్యమేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, ఆకుకూరలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు నిపుణుల సలహాతో కోఎంజైమ్ Q10 (CoQ10), ఫోలిక్ యాసిడ్ వంటి సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల అండాల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాగే రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, రసాయనాలు మరియు ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉండటం, తగినంత నిద్రపోవడం ద్వారా అండాశయ ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుంది. కాబట్టి గర్భధారణకు ప్రయత్నించే మహిళలు కేవలం AMH స్కోర్ చూసి కంగారు పడకుండా, అండాల నాణ్యతను పెంపొందించే ఆరోగ్యకరమైన మార్గాలను ఎంచుకోవడం ఎంతో శ్రేయస్కరం.     [Egg Quality, Egg Quantity, Ovarian Reserve, AMH Test, Fertility, Female Fertility, Ovulation, Pregnancy, Reproductive Health, Fertility Tips]
ఎక్కువగా తింటేనే కడుపు నిండినట్లు అనిపించడం అనేది ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. దీనివల్ల బరువు పెరగడం, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మనం ఎంత తింటున్నాం అనే దానికంటే, మన మెదడుకు కడుపు నిండిందనే సంకేతం ఎప్పుడు అందుతోంది అనేది ఇక్కడ చాలా ముఖ్యం. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి ముగింపు పలికి, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ఎలా అలవర్చుకోవాలి. ఎక్కువగా తింటేనే కడుపు నిండింది అని అనుకునే సమస్యకు ఎలా చెక్ పెట్టాలి? వివరంగా తెలుసుకుంటే.. ఎక్కువ తింటేనే కడుపు నిండిన ఫీలింగ్ ఎందుకు వస్తుంది? మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు కడుపు నిండింది అనే విషయాన్ని మెదడుకు చేరవేసేందుకు కొన్ని రకాల హార్మోన్లు పనిచేస్తాయి. అయితే కొన్ని తప్పుడు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.. ఆహారాన్ని వేగంగా తినడం.. త్వరత్వరగా ఆహారాన్ని మింగేయడం వల్ల కడుపు నిండిందనే సంకేతం మెదడుకు చేరేలోపే మనం తినాల్సిన దానికంటే ఎక్కువ ఆహారాన్ని తినేస్తాం. సాధారణంగా కడుపు నిండిన భావన మెదడుకు చేరడానికి దాదాపు ఇరవై నిమిషాల సమయం పడుతుంది. ఆలోచనలు వేరే చోట ఉంచి తినడం..  టీవీ చూస్తూ, ఫోన్ వాడుతూ లేదా ఏదైనా పనిలో మునిగిపోయి తిన్నప్పుడు ఎంత తింటున్నామో గమనించలేం. దీనివల్ల సాధారణ పరిమాణంలో తిన్నా కడుపు నిండిన తృప్తి లభించదు. తక్కువ పీచు, ఎక్కువ ప్రాసెస్డ్ ఆహారం..  మనం తినే ఆహారంలో పీచు పదార్థాలు తక్కువగా ఉండి, మైదా, షుగర్ వంటి ప్రాసెస్డ్ పదార్థాలు ఎక్కువగా ఉంటే అవి త్వరగా అరిగిపోతాయి. దీనివల్ల కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉండదు. మానసిక ఒత్తిడి, నిద్రలేమి.. తీవ్రమైన ఒత్తిడి లేదా సరిపడా నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఆకలిని పెంచే హార్మోన్లు ఎక్కువై, కడుపు నిండినా ఇంకా తినాలనే భావన కలుగుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి పాటించాల్సిన మార్గాలు.. ఆహారాన్ని నమిలి నెమ్మదిగా తినడం.. ప్రతి ముద్దను బాగా నమిలి మింగడం అలవాటు చేసుకోవాలి. ఆహారాన్ని నెమ్మదిగా తినడం వల్ల మెదడుకు కడుపు నిండుతున్న సంకేతాలు సమయానికి అందుతాయి. దీనివల్ల తక్కువ ఆహారంతోనే పూర్తి తృప్తి లభిస్తుంది. మైండ్‌ఫుల్ ఈటింగ్ అలవాటు చేసుకోవడం..  తినే సమయంలో ఫోన్లు, టీవీలు, పుస్తకాలు పక్కన పెట్టాలి. ఆహారం రంగు, రుచి, సువాసనను ఆస్వాదిస్తూ ద్యాస అంతా తిండిపైనే ఉంచి తినాలి. ఇది అతిగా తినడాన్ని సమర్థవంతంగా అడ్డుకుంటుంది. పీచు, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం.. భోజనంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు , ప్రోటీన్ సమృద్ధిగా ఉండే పప్పుధాన్యాలు, గుడ్లు, పనీర్ వంటివి చేర్చుకోవాలి. ఇవి పొట్టను ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. భోజనానికి ముందు నీళ్లు తాగడం..  భోజనం చేయడానికి ఒక అరగంట ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సిద్ధమవ్వడమే కాకుండా, అతిగా తినే అలవాటు తగ్గుతుంది. అయితే తింటున్న సమయంలో లేదా తిన్న వెంటనే ఎక్కువ నీళ్లు తాగడం మంచిది కాదు. చిన్న ప్లేట్లు వాడడం..  పెద్ద ప్లేట్లలో ఆహారం తింటే తక్కువగా ఉన్నా ఖాళీగా కనిపిస్తుంది. అదే చిన్న ప్లేట్ వాడితే తక్కువ ఆహారమే ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది మానసికంగా త్వరగా తృప్తిని కలిగిస్తుంది. ఆకలికి, దాహానికి తేడా గుర్తించడం.. చాలాసార్లు శరీరానికి దాహం వేసినప్పుడు కూడా ఆకలి వేస్తున్నట్లే అనిపిస్తుంది. కాబట్టి ఆకలిగా అనిపించినప్పుడు ముందుగా ఒక గ్లాసు నీళ్లు తాగి కొన్ని నిమిషాలు వేచి చూడడం మంచిది. సరిపడా నిద్ర, ఒత్తిడి నిర్వహణ..  ప్రతిరోజూ ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. అలాగే యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటే ఆకలిని నియంత్రించే హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. చివరగా తెలుసుకోవాల్సింది.. ఎక్కువ తింటేనే కడుపు నిండుతుంది అనుకోవడం ఒక తప్పుడు జీవనశైలి అలవాటు మాత్రమే. కొద్దిరోజుల పాటు పైన పేర్కొన్న నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తే, తక్కువగా,  సరైన పరిమాణంలో ఆహారం తీసుకుంటూనే కడుపు నిండిన అనుభూతిని పొందవచ్చు. ఇది కేవలం బరువును అదుపులో ఉంచడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరిచి రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది.                          *రూపశ్రీ.  
వయసు పెరగడం సహజం.. కానీ వయసుతో వచ్చే ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన తర్వాత మన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకలు వంటి ముఖ్యమైన అవయవాల పనితీరులో కూడా వయసుకు అనుగుణంగా మార్పులు వస్తాయి. 60+ వయసులో పడిపోవడం, నీరసం, వినికిడి తగ్గడం, చూపు సమస్యలు, నిద్రలో మార్పులు వంటి సమస్యలు సాధారణంగా కనిపించవచ్చు. అయితే వీటిని చిన్న సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో General Geriatrics & Lifestyle Specialist డాక్టర్ శ్రావణి కుమారి 60 ఏళ్లు దాటిన వారు తమ ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. వయసుకు తగ్గట్టుగా మందుల మోతాదు, పోషకాహారం, నిద్ర, శారీరక ఆరోగ్యం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ ఎందుకు అవసరమో తెలియజేస్తున్నారు. అంతేకాదు, నాగార్జున, చిరంజీవి వంటి ప్రముఖులు వయసు పెరిగినా ఫిట్‌గా, యాక్టివ్‌గా మరియు గ్రేస్‌ఫుల్‌గా కనిపించడానికి కారణం ఏమిటి? వయసును ఆరోగ్యంగా, అందంగా స్వీకరించేందుకు ఎలాంటి జీవనశైలి పాటించాలి? అనే అంశాలపై కూడా ఈ వీడియో ఆసక్తికరమైన అవగాహన కల్పిస్తుంది. మీ వయసు 60 దాటిందా? లేదా మీ కుటుంబంలో 60+ వయసున్న వారు ఉన్నారా? అయితే ఈ వీడియోను తప్పక చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులు, ఆహారం లేదా ఇతర చికిత్సలకు సంబంధించి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
కీళ్ల నొప్పులు, వాపు, ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ (Rheumatoid Arthritis)లో కనిపించవచ్చు. ఇది సాధారణ కీళ్ల నొప్పులతో పోలిస్తే భిన్నమైన ఆటో ఇమ్యూన్ సమస్య. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ఆయుర్వేదం పనిచేస్తుందా? ఇంగ్లీష్ మెడిసిన్ తప్పనిసరా? కొన్ని సందర్భాల్లో సంప్రదాయ వైద్య చికిత్స అవసరం లేదా? ఆటో ఇమ్యూన్ కీళ్ల సమస్యల్లో ఆయుర్వేదాన్ని ఎందుకు కొందరు నిపుణులు సిఫారసు చేయరు? ఫంక్షనల్ మెడిసిన్ విధానం ఎలా భిన్నంగా ఉంటుంది? ఈ వీడియోలో Acupuncture మరియు Functional Medicine నిపుణులు డా. పి.ఎస్. సాగర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు సంబంధించిన వివిధ చికిత్సా విధానాల గురించి వివరిస్తున్నారు. ఆయుర్వేదం, కన్వెన్షనల్ మెడిసిన్, ఫంక్షనల్ మెడిసిన్ మధ్య ఉన్న తేడాలు, వాటి విధానాలు, పరిమితులు మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో చికిత్సను ఎంచుకునేటప్పుడు పరిగణించాల్సిన అంశాల గురించి తెలుసుకోండి. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య పరిస్థితికి సరైన చికిత్సను నిర్ణయించుకునే ముందు అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)