LATEST NEWS
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది. రాబోయే 2027 నాటికి దేశంలో భయంకరమైన కరువు ముప్పు పొంచి ఉందన్న పర్యావరణ వేత్తల హెచ్చరికలు గుండెల్ని పిండేస్తున్నాయి. కేవలం వర్షాభావమే కాదు, సరైన ప్రణాళిక లేకపోవడం, జవాబుదారితనం లోపించడం వల్ల రాబోయే రోజుల్లో తాగునీటి కోసం, పూట గూడు కోసం జనం పడే పాట్లు తలచుకుంటేనే కన్నీళ్లు ఆగవు. నేడు పట్టణాల్లోనే అక్టోబర్, నవంబర్ మాసాల్లో అపార్టుమెంట్లు నీళ్ల కోసం కటకటలాడుతున్న దృశ్యాలు కళ్ల ముందు కదలాడుతున్నాయి.  ఈ నేపథ్యంలో తెలుగు వన్‌ ఎండీ కంఠమనేని రవిశంకర్, జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్‌తో కలిసి వాస్తవ వేదిక కార్యక్రమంలో రాబోయే కరువు ముప్పుపై  క్లుప్తంగా విశ్లేషణ చేశారు. ఇక రాబోయే కాలంలో గ్రామీణ ప్రాంతాల పరిస్థితి, రైతుల దయనీయ స్థితి మరింత దారుణంగా మారనుంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో కృష్ణా, తుంగభద్ర, కావేరి నదుల్లో నీటి మట్టాలు గణనీయంగా పడిపోతుండటంతో కరువు ఛాయలు ముప్పేట దాడి చేస్తున్నాయి. సాగునీరు అందక అన్నదాత కన్నీరు మున్నీరు అవుతుంటే, మరోవైపు కూరగాయలు, బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  ఒకవైపు దేశంలో 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత బియ్యం ఇస్తున్నామని ప్రభుత్వాలు ఘనంగా చెప్పుకుంటున్నాయి. అంటే అర్థం ఏమిటి? దేశంలో సగానికి పైగా జనం పూట గడవక, తిండికి లేక అలమటిస్తున్నారనే కదా నగ్న సత్యం? ఎఫ్.సి.ఐ (FCI) గోదాముల్లో నిల్వ ఉన్న ఆహార ధాన్యాలు ఎలుకలపాలవుతున్నా, సరిగ్గా సరఫరా చేసే లాజిస్టిక్స్  సప్లై చైన్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల ఒకచోట పండన పంటలు కుళ్లిపోతుంటే, మరోచోట ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. వరి పంట వేయొద్దంటున్న ప్రభుత్వాలు, ప్రత్యామ్నాయంగా ఏ పంట వేయాలో రైతులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వట్లేదు. పరిశోధనల పేరుతో కోట్లాది రూపాయలు విడుదలవుతున్నా, క్షేత్రస్థాయిలో రైతులకు ఒరిగేదేమీ లేదు. పాలకుల ఉదాసీన వైఖరి, ప్రణాళికా లోపం వెరసి సామాన్యుడి జీవితాన్ని అగమ్యగోచరంగా మారుస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని, రాబోయే ముప్పును ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు చేపట్టకపోతే.. అన్నం గింజ కోసం, గుక్కెడు నీళ్ల కోసం జరిగే అంతులేని క్షామం మనలను కబలించడం ఖాయం.     [ 2027 drought, Krishna river water shortage, El Nino effect, FCI godowns, farmer problems, Telugu news, drinking water problem, agricultural crisis, food security, government negligence, Telugu One news ]
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని పెద్దకోడూరు గ్రామంలో చోటుచేసుకుంది.  బాధితుడు కొనింటి శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున శ్రీహరి తన భార్య పల్లవి, కుమారుడు మనస్తిత్, కూతుళ్లు వివేక, స్వాతితో కలిసి తన ఇంట్లో ప్రశాంతంగా నిద్రిస్తున్నారు.  అదే సమయంలో గ్రామంలో వీధుల్లో మారుమోగిన భారీ డీజే సౌండ్ తీవ్రమైన ప్రకంపనలను సృష్టించింది. ఆ తీవ్రమైన శబ్ద తరంగాల ధాటికి దెబ్బతిన్న పాత ఇందిరమ్మ ఇల్లు ఒక్కసారిగా కదిలిపోయి, స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ప్రమాదంలో గాఢ నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులపై పెచ్చులు పడటంతో తీవ్ర ప్రమాదం సంభవించింది. కుమారుడు మనస్తిత్, కూతురు వివేకలకు తీవ్ర గాయాలు కాగా, శ్రీహరితో పాటు మిగతా కుటుంబ సభ్యులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. తెల్లవారుజామున జరిగిన ఈ అనూహ్య ప్రమాదంతో ఇంట్లో ఒక్కసారిగా హాహాకారాలు చెలమెత్తాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను రక్షించి, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం అక్కడ వారికి వైద్య చికిత్స కొనసాగుతోంది. గ్రామాల్లో పండుగలు, ఉత్సవాల పేరిట రాత్రింబవళ్లు విపరీతమైన శబ్దాలతో మోగే డీజేల కారణంగా ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చెవిలో హోరెత్తించే డీజేల ఏర్పాటుపై అధికారులు ఉక్కుపాదం మోపాలని, ఇకపై ఇలాంటి వాటికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని ప్రజలు గట్టిగా కోరుతున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. పండుగలు, ఊరేగింపుల పేరుతో అధిక శబ్దంతో డీజేలు మోగించడం ప్రజలకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా ప్రమాదాలకు కూడా కారణమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శబ్ద కాలుష్యంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.       [ DJ sound accident, Medak news, Peddakodur incident, slab collapse, Telangana news, DJ sound vibration injury,  Telangana Police, DGP C.V.Anand, Devi navaratrulu, Telugu News, Telugu One ]  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది. గ్రామానికి సరైన రహదారి మార్గం లేకపోవడంతో ఆమె కనీవినీ ఎరుగని రీతిలో వినూత్న నిరసనకు తెరలేపింది.చక్రాతా ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. షర్మిల అనే యువతి తన వివాహం అనంతరం అత్తగారింటికి వెళ్లే తరుణంలో ఈ సాహసోపేతమైన ప్రయాణం చేసింది. సాధారణంగా పెళ్లి కూతురు అనగానే వాహనాల్లో, ప్రత్యేక అలంకరణల మధ్య అత్తారింటికి అడుగుపెట్టడం మనం చూస్తుంటాం. కానీ, ఈ వధువు మాత్రం అంతులేని రవాణా ఇబ్బందులతో పెళ్లి దుస్తులు ధరించి సుమారు 18 కిలోమీటర్ల దూరం కాలినడకనే ప్రయాణించాల్సి వచ్చింది.కొండ ప్రాంతాల గుండా సాగిన ఈ ప్రయాణంలో పెళ్లి దుస్తులు, బరువైన ఆభరణాలతో ఆమె పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. ఎత్తుపల్లాలతో కూడిన ప్రమాదకర కొండ దారుల్లో ఆమె నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ రోడ్లు లేకపోవడం వల్ల నిత్యం పడుతున్న నరకయాతనను ప్రభుత్వానికి చాటిచెప్పడమే ఈ ప్రయాణ ఉద్దేశమని ఆమె తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆమె ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.తనలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో మరే ఇతర యువతికి, గ్రామస్తులకు రాకూడదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లో వైద్యం అందక, ప్రయాణాలు చేయలేక తాము పడుతున్న వేదనకు చరమగీతం పాడాలని కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించి తమ దుస్థితిని మార్చాలని ఆ వధువు విజ్ఞప్తి చేశారు. తమ మారుమూల గ్రామానికి తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.ఈ ఘటనపై నెటిజన్లు, స్థానిక ప్రజల నుంచి తీవ్ర స్పందన వస్తోంది. సామాన్యుల కష్టాలను పట్టించుకోని అధికారుల తీరుపై మండిపడుతూ, ఆ వధువు ధైర్యసాహసాలను అందరూ అభినందిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి త్వరలోనే ఆ ప్రాంతానికి రోడ్లు నిర్మిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.       [ Uttarakhand bride walks 18 km, Chakrata road problem news, Bride walking in wedding dress, Sharmila, CM Pushkar Singh Dhami, Undawa Village Road, Chakrata Viral Video, Rural Road Connectivity ]  
సత్యసాయి జడ్పీ చైర్మన్ బరిలో పరిటాల శ్రీరామ్ దిగనున్నారు. సత్యసాయి జెడ్పీ చైర్మన్ రేసులో పరిటాల రవిని నిలబెట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అయితే జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.   ఒక నల్ల చెరువు జెడ్పీటీసీగా పరిటాల శ్రీరామ్ నామినేషన్  సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు, కూటమి నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.   ధర్మవరం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌తో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల ముఖ్య నేతలు, టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పరిటాల శ్రీరామ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.  తద్వారా కూటమి పార్టీల మధ్య ఐక్యతను చాటాలని భావిస్తున్నారు.   పరిటాల కుటుంబానికి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా బలమైన కేడర్ ఉంది.  అలాంటి కుటుంబానికి చెందిన యువ నాయకుడు జిల్లా స్థాయి పదవి బాధ్యతల్లోకి అడుగుపెడుతుండటంతో స్థానిక శ్రేణుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.  నల్లచెరువు నుంచి ప్రారంభం కానున్న ఈ రాజకీయ ప్రయాణం, శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ పీఠం కైవసంతో ముగుస్తుందని తెలుగుదేశం నాయకత్వం ధీమాగా చెబుతోంది.   [Paritala Sriram  ZP Chairman Race,  Sri Sathya Sai District, ZPTC Member  Nallacheruvu, Nomination, TDP, Andhra Pradesh, AP politics, Telugu One]
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది. ఇంట్లో జరిగిన ఓ చిన్న ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి.. నీళ్ల బకెట్‌లో పడి ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. బీహార్ నుంచి హైదరాబాద్‌కు వలస.! బీహార్‌కు చెందిన పప్పూ రవిదాస్ ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాండు బస్తీలో కుటుంబంతో కలిసి నివసిస్తూ, దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఆయనకు ఏడాదిన్నర వయసున్న దివాంశి కుమారి అనే చిన్నారి ఉంది. చిన్నారి తల్లి బీహార్‌లోనే ఉండటంతో.. ఇంట్లో దివాంశి ఆలనాపాలనా బాధ్యతను పదేళ్ల పెద్ద కుమార్తె చాందిని చూసుకుంటోంది. అక్క వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో.! రోజూ మాదిరిగానే ఇంట్లోని పెద్దవాళ్లు పనుల కోసం బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో పదేళ్ల చాందిని, ఏడాదిన్నర దివాంశి మాత్రమే ఉన్నారు. అయితే, సాయంత్రం సమయంలో చాందిని వాష్‌రూమ్‌కు వెళ్లింది. ఆ కొద్దిసేపే చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆడుకుంటున్న దివాంశి పాకుతూ వెళ్లి ఇంట్లో ఉన్న నీళ్ల బకెట్‌లో ప్రమాదవశాత్తు తలకిందులుగా పడిపోయింది. నీటిలో మునిగిన చిన్నారికి ఊపిరాడకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. బకెట్‌లో పడి ఉన్న చిన్నారిని చూసి షాక్‌.! వాష్‌రూమ్‌ నుంచి బయటకు వచ్చిన చాందిని.. నీళ్ల బకెట్‌లో పడి ఉన్న చెల్లెలిని చూసి ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. వెంటనే గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి పరుగున వచ్చారు. చిన్నారిని బయటకు తీసి, ప్రాణాలు కాపాడేందుకు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జరగరాని విషాదం జరిగిపోయింది. చిన్నారి దివాంశి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆ కుటుంబంలో తీరని శోకం..! అల్లారుముద్దుగా పెరగాల్సిన చిన్నారి ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లి దూరంగా ఉండగా, చెల్లెలి ఆలనాపాలనా చూసుకుంటున్న పదేళ్ల చాందిని కళ్ల ముందే ఈ విషాదం చోటుచేసుకోవడం స్థానికులను సైతం కలచివేసింది. పాండు బస్తీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.సమాచారం అందుకున్న సురారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారుల భద్రతపై అప్రమత్తత అవసరం.! ఈ ఘటన ప్రతి తల్లిదండ్రికి ఓ హెచ్చరిక. చిన్నారులు ఉన్న ఇళ్లలో నీటితో నింపిన బకెట్లు, టబ్బులు ప్రమాదకరంగా మారవచ్చు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు క్షణం కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉపయోగించిన వెంటనే బకెట్లలోని నీటిని ఖాళీ చేయాలి. నీటి పాత్రలను చిన్నారులకు అందకుండా ఉంచాలి. ఎందుకంటే, చిన్నారులకు కొద్దిపాటి నీటిలోనూ మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అప్రమత్తతే వారి ప్రాణాలకు రక్షణ.       [ Hyderabad Child Death, Baby Girl Death, Divanshi Kumari, Suraram Police Station, Pandu Basti, Water Bucket Accident, Toddler Drowning, 18-Month-Old Baby, Child Safety, Domestic Accident, Pappu Ravidas, Chandini, Hyderabad News, Telangana News, Suraram Police Station ]  
ALSO ON TELUGUONE N E W S
A chance encounter, a mysterious woman and a secret that refuses to stay buried. Tamil film - Immortal explores the darker side of attraction as an ordinary connection turns into a terrifying mystery. Blending romance, mystery and supernatural horror, Immortal, written and directed by debutant Mariyappan Chinna premieres on October 30, 2026, on Sony LIV in five languages Tamil, Telugu, Malyalam, Kannada and Hindi. Set in present-day Chennai, Immortal follows Magi (played by G. V. Prakash Kumar), a printing press worker looking for an affordable place to stay. He meets Sindhu (played by Kayadu Lohar), a mysterious woman who offers him a room in her luxurious apartment at a surprisingly low rent. What seems like a lucky break soon turns unsettling as strange events draw Magi deeper into Sindhu’s world, leading him to a mystery that dates back much further than he imagined. G. V. Prakash Kumar said, Magi is a very relatable guy who finds himself in a situation he never expected. What I enjoyed about the character is that he keeps discovering things along with the audience. There is a sense of curiosity, fear and uncertainty running through his journey, and that made the role exciting for me. I am happy that audiences can now experience Immortal on Sony LIV and discover the mystery for themselves. Along with G. V. Prakash Kumar and Kayadu Lohar, the film features T. M. Karthik, Kumar Natarajan, Lollu Sabha Maaran, Aaditya Kathir, Arshu Maharjan, Pema Tsamchoe and Sunita Shresthain prominent roles. Immortal premieres on October 30, 2026, only on Sony LIV. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Prashanth Neel presented 418, the horror movie, released on 23rd October. On this occasion, he met Prabhas to help them promote the movie. Directed by Kirtan Nadagouda, the movie is produced by Mythri Movie Makers. Prabhas talked about his birthday present from Prashanth and the director told that he will meet him personally.  But Prabhas asked Prashanth to give him Salaar 2 as his gift and nothing else. The director confirmed that the movie shoot will start from next year. He further stated that the movie will go on floors from June, 2027. That means, Prashanth will complete all his works for NTR's Dragon by May.  Well, the actor has to complete Kalki 2 and Spirit before he can start shooting for Salaar 2. He has given continuous dates to Fauzi team to complete the film by next year February and then for Spirit and Kalki 2, stated reports. Looks like by June, he will finish one film at least to join Salaar 2 sets.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘సలార్ 2’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు. అలాగే, ప్రశాంత్ నీల్ సమర్పణలో రూపొందిన '418' మూవీ కూడా ఈరోజే రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ ను కలిశారు నీల్. ఈ సందర్భంగా బర్త్ డే విషెస్ చెప్పగా.. నా గిఫ్ట్ ఏదని ప్రభాస్ సరదాగా అడిగారు. నీల్ తర్వాత ఇస్తానని చెప్పగా.. "సలార్ 2 ఎప్పుడో చెప్పండి. అదే గిఫ్ట్" అన్నారు. దానికి వెంటనే ప్రశాంత్ నీల్.. 2027 జూన్ లో ‘సలార్ 2’ స్టార్ట్ అవుతుందని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2027 జూన్ లో ‘సలార్ 2’ స్టార్ట్ అవుతుందన్న అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.  ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా 2027 జూన్ లో విడుదల కానుంది. అంటే, ‘డ్రాగన్’ రిలీజ్ తర్వాత ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా.. ‘సలార్ 2’తో నీల్ బిజీ కానున్నారు అన్నమాట. ‘సలార్’ మొదటి భాగం దేవా, వరద రాజ మన్నార్‌ల మధ్య స్నేహం, ఖాన్సార్‌లో అధికార పోరు చుట్టూ సాగింది. చివర్లో ఇచ్చిన ట్విస్టులు రెండో భాగంపై ఆసక్తిని మరింత పెంచాయి. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మళ్లీ తమ పాత్రల్లో కనిపించనున్న ఈ సీక్వెల్‌లో కథ ఏ మలుపులు తిరుగుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది కూడా చదవండి: డార్లింగ్‌తో వంగా వైల్డ్ సెలబ్రేషన్.. ‘స్పిరిట్’ ఫొటో వైరల్.! https://x.com/MythriOfficial/status/2113595231824429358       [Salaar 2 Starts In June 2027, Salaar 2 Shooting Update, Salaar 2 June 2027, Prabhas Birthday, Prabhas Salaar 2, Salaar 2 Movie, Prabhas, Prashanth Neel, NTR Dragon, Telugu Film News]  
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డే అంటే అభిమానులకు పండగే. సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుంటే.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం తనదైన స్టైల్‌లో డార్లింగ్ పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న వంగా.. ఆయనతో దిగిన ఓ ఫొటోను షేర్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సందీప్ రెడ్డి వంగా షేర్ చేసిన ఈ ఫొటోలో ఆయన బాటిల్ ఓపెన్ చేస్తూ కనిపిస్తుండగా, పక్కనే ప్రభాస్ సరదాగా నవ్వుతూ పోజిచ్చారు. ‘SPIRITING things up….’ అనే క్యాప్షన్ ఈ ఫొటోకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. సినిమా టైటిల్‌ను గుర్తుచేసేలా ఉన్న ఈ క్యాప్షన్‌తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇద్దరి మధ్య ఉన్న ఈ సరదా మూమెంట్ చూసి.. ‘స్పిరిట్’లో వంగా ఎలాంటి రచ్చ చేయబోతున్నారో అంటూ నెటిజన్లు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో తనదైన మేకింగ్ స్టైల్‌తో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి.. ఇప్పుడు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన త్రిప్తి డిమ్రి నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్‌ను వంగా తనదైన శైలిలో ఎలా చూపించబోతున్నారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలకు తోడు, తాజాగా షేర్ చేసిన ఫొటో కూడా సినిమాపై చర్చను పెంచుతోంది. మరోవైపు ఇటీవల ‘స్పిరిట్’ కొత్త విడుదల తేదీని కూడా చిత్రబృందం ప్రకటించింది. మొదట 2027 మార్చి 5న విడుదల చేయాలని భావించిన ఈ సినిమాను ఇప్పుడు 2027 అక్టోబర్ 29న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. మొత్తానికి ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా వంగా షేర్ చేసిన ఈ ఫొటో అభిమానులకు మంచి ట్రీట్‌గా మారింది. ఇక తెరపై ఈ ఇద్దరి కలయిక ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఇది కూడా చదవండి: ఎవరీ వైకోమ్ విజయలక్ష్మి.. చూపు లేకపోయినా గాత్రంతో జాతీయ అవార్డు.! https://x.com/InSpiritMode/status/2113588852153843822       [Prabhas Birthday Celebration, Prabhas Spirit Photo, Prabhas, Sandeep Reddy Vanga, Spirit Movie, Prabhas Birthday, HBD Prabhas, Triptii Dimri, Telugu Film News]  
Prabhas, India's biggest superstar, has joined hands with one of the most sought-after filmmakers, Sandeep Reddy Vanga, for the action cop drama Spirit. The film promises to present Prabhas in a raw and intense avatar, with his character described as a cop with “One Bad Habit,” an uncompromising attitude and an impressive track record. On the occasion of Prabhas' birthday, the makers shared a candid picture of the actor and Sandeep Reddy Vanga holding the alcohol bottle showcased in the film's first-look poster. The image offers a callback to the introduction of Prabhas as “Ajanubhau” and adds to the intrigue surrounding his character. The picture also captures the camaraderie between the actor and director as they gear up to bring their ambitious collaboration to the big screen. The shoot is progressing as planned, with expectations high for the raw action and intense characterisation that the combination promises. Produced by Bhadrakali Pictures and T-Series on a lavish scale, Spirit features Triptii Dimri and Vivek Oberoi in prominent roles. The film is scheduled for a worldwide theatrical release on 20 October 2027, coinciding with Diwali. Further details about the highly anticipated action drama are awaited. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  ఏ దేవి వరమూ నీవూ...చిరు నీడలేల కనులా అని సినీ ప్రియులు సినిమాని చూస్తూ ఎంతగానో మురిసిపోతుంటారు.  ఎందుకంటే ఈ అనంత విశ్వంలో తనని మించిన అద్భుత శక్తీ లేదని అదృష్ట దేవత అని కూడా వాళ్ల నమ్మకం. వాళ్ళు చెప్పేది కూడా కరెక్ట్ కావచ్చు. ఎందుకంటే పొలిచెర్ల హరినాధ్ అనే ఒక వ్యక్తి హీరోగా ఉన్నాడనే విషయం కూడా తెలియదు. కానీ తాపీ పని చేసుకొని జీవించే సినీ దంపతులు ఎక్కడ సినిమా టైం దాటిపోతుందో,  స్టార్ట్ చేస్తారో అని పరిగెత్తుకుంటూ వెళ్లారు. సినిమా అంటే అంత సినీ ప్రియులకి అంత ప్రేమ, అభిమానం,కుతూహలం. అలాంటి సినిమా ఇప్పుడు తన ప్రభావాన్ని తగ్గించుకుంటుందా? పెంచుకుంటుందా?అనే చర్చ సోషల్ మీడియా వేదికగా సినీ ప్రియుల చిట్ చాట్ లో హైలెట్ న్యూస్ గా ఉంది. అదేంటో చూద్దాం వెండితెరపై మెరిసే ప్రతి కథా ఒక కలల ప్రపంచం. కానీ ఆ కథను ప్రేక్షకుడికి చేరువ చేసే మార్గంలో సినిమా ప్రమోషన్లు నేడు వందల కోట్ల రూపాయల వ్యాపార వ్యూహంగా మారాయి. గతంలో ఏలాంటి ముందస్తు ప్రచార ఆర్భాటాలు, టీజర్లు, గ్లింప్స్‌లు లేకుండానే కేవలం థియేటర్ వద్ద ఉన్న పోస్టర్లు, పత్రిక ప్రకటనలతో సినిమాలు నెలల తరబడి విజయోత్సవాలు జరుపుకునేవి. నాటి రోజుల్లో ప్రేక్షకులు సినిమాపై పెట్టుకునే ఆశలు, కథపట్ల కనబరిచే జిజ్ఞాస థియేటర్‌లో మొదటి సీన్ పడినప్పుడే బయటకు వచ్చేవి. ఆ సస్పెన్స్, అనుభూతి అద్భుతంగా ఉండేవి. కానీ, నేటి ఆధునిక డిజిటల్ సినీ యుగంలో ప్రమోషన్ల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒక చిత్రం థియేటర్లలోకి అడుగుపెట్టడానికి ముందే నెలల కొద్దీ ప్రమోషన్ల దాడి జరుగుతోంది. ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోలు, గ్లింప్స్‌లు, టీజర్లు, రెండుమూడు ట్రైలర్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, సోషల్ మీడియా పెయిడ్ క్యాంపెయిన్‌లతో ప్రేక్షకుడి మైండ్‌ లో  నింపేస్తున్నారు.  అయితే ఈ ప్రమోషన్ల వల్ల సినిమాకి నిజంగా మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రచారాలు సినిమాపై ఆసక్తిని పెంచినప్పటికీ, క్యూరియాసిటీని చంపేస్తున్నాయా అనే కోణంలో తీవ్ర విశ్లేషణలు సాగుతున్నాయి. పరిశ్రమలో 410,000 కంటే ఎక్కువ వీడియోలు కేవలం ప్రమోషనల్ కంటెంట్ రూపంలోనే సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమవుతున్నాయి. వీటికి ఏకంగా 361 మిలియన్లకు పైగా లైక్స్ లభిస్తూ ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్నా, ప్రతి వివరాలు ముందే తెలిసిపోవడం వల్ల ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లేసరికి తన అసలైన ఉత్సాహాన్ని కోల్పోతున్నాడు. ఇది కూడా చదవండి: అదిరిపోయే సైకలాజికల్ థ్రిల్లర్.. ఏ ఓటిటిలో అంటే!    ఒక ట్రైలర్ సినిమాలోని ముఖ్యమైన మలుపులు, ఫైట్ సీన్లు, లేదా కామెడీ సన్నివేశాల అన్నింటినీ ప్రచారంలో చూపించేస్తే, థియేటర్‌లో కొత్తగా పొందే థ్రిల్ సున్నాకి చేరుకుంటుంది. ట్రైలర్‌ను చూసి భారీ అంచనాలు పెంచుకుని థియేటర్‌కు వెళ్లే 100% మంది ప్రేక్షకులలో, కంటెంట్ కొద్దిగా తగ్గినా తీవ్ర అసంతృప్తికి లోనై నెగటివ్ టాక్ వ్యాప్తి చేస్తున్నారు. ఇది ఓపెనింగ్స్ తెచ్చినా, లాంగ్ రన్‌లో బాక్సాఫీస్ కలెక్షన్లపై దెబ్బతీస్తోంది. ఆనాడు సినిమా ప్రపంచాన్ని అలరించిన ఆకర్షణ, రహస్య అనుభూతి నేడు మార్కెటింగ్ ఆర్భాటంలో కనుమరుగవుతున్నాయి అసలు ట్రైలర్ చూస్తే సినిమా చూడక్కర్లేదు అనే నానుడి కూడా సినీ సర్కిల్స్ లో వినిపిస్తూ ఉంటుంది..అందుకే ప్రమోషన్లు పరిమితి దాటితే అంచనాలు పెరిగి సినిమా ఉనికికే ప్రమాదంగా మారతాయని సినీ  నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సమతుల్యతని పాటిస్తూ ప్రచారం చేయడమే సినిమాకి, సినిమాని నమ్మకున్న వాళ్ళకి, ప్రేక్షకులకి శ్రీరామరక్ష.    [Cinema Promotions Impact On Movie Curiosity, cinema promotions impact, movie trailer hype, audience curiosity, Telugunews, TeluguCinema, Tollywood, Tollywood News]
  మనలో మన మాట పక్క ఫోటోలో చూస్తున్న మూవీ మామూలు మూవీ కాదు. క్షణం క్షణం  ఉత్కంఠతతో సాగే సూపర్  సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్. తెలుగులో కూడా వచ్చేసింది   అదే 'అయ్యన మనే సీజన్ 2'.  ప్రముఖ డిజిటల్ ఓటీటీ వేదిక అయిన జీ5 (Zee5) వేదికగా ఈ రోజు నుంచి  స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. మొదటి సీజన్ సృష్టించిన అపూర్వ విజయం, విమర్శకుల ప్రశంసలు మరియు ఊహించని ఉత్కంఠభరితమైన మలుపుల తర్వాత ఇప్పుడు ఈ రెండో భాగంపై దేశవ్యాప్తంగా ఉన్న థ్రిల్లర్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. మొత్తం 6 ఎపిసోడ్స్‌తో స్ట్రీమ్ అవుతోన్న మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‌ ఫస్ట్ సీజన్‌లో మిగిలిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. 'అయ్య ఇంట్లో ప్రతీ ఒక్కరూ ఒక ముసుగు ధరించి ఉంటారు. ప్రతీ ముసుగు వెనుక ఒక కథ దాగి ఉంటుంది. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో? బయటపడే సమయం ఇది.' అంటూ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.  ఓ గొప్ప ఇంట్లో అడుగు పెట్టిన ముగ్గురు కోడళ్లు అనుమానాస్పద స్థితిలో మరణిస్తారు. కుల దేవత శాపం అని ఆ ఫ్యామిలీతో పాటు ఆ ఊరి గ్రామస్థులు కూడా నమ్ముతుంటారు. ఆ ఇంటికి వచ్చిన కొత్త కోడలు ఆ మరణాల వెనుక మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తుంది. క్షణ క్షణం ట్విస్టులతో సాగుతుంది . ఇంతకంటే ఎక్కువగా చెప్తే బాగోదు. వెంటనే చేసి సినీ మజా పొందండి. ఈ వెబ్ సిరీస్ కథాంశం విషయానికి వస్తే, ఒకే ఇంట్లో జరిగిన కోడళ్ల మరణాలు మరియు ఆ కుటుంబానికి సంబంధించిన భయంకరమైన నిజాలు ఈ కథలో ప్రధాన కేంద్ర బిందువుగా నిలుస్తాయి. పాతకాలపు పెద్ద ఇల్లు, ఆ ఇంటి గోడల వెనుక కాలగర్భంలో కలిసిపోయిన చీకటి రహస్యాలు, ఎవరికీ అంతుచిక్కని వరుస మరణాలు ప్రేక్షకులను సీట్లలో కదలకుండా కూర్చోబెడతాయి. మొదటి భాగం ఎక్కడైతే ముగిసిందో, సరిగ్గా అక్కడి నుంచే ఈ రెండో సీజన్ కథ కొనసాగుతుంది. "ఆ రాత్రి అసలు అక్కడ ఏం జరిగింది?" అనే ఎన్నో ఉత్కంఠభరితమైన ప్రశ్నలకు ఈ కొత్త భాగంలో స్పష్టమైన సమాధానాలు లభించనున్నాయి.  ఇది కూడా చదవండి: ఇడుపు కాయితం రిలీజ్ డేట్ వచ్చేసింది: గడప సాంగ్ రిలీజ్!     ముఖ్యంగా ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ప్రసిద్ధ నటి ఖుషి రవి, అక్షయ్ నాయక్ తమ అద్భుతమైన సహజ నటనతో మరోసారి ప్రేక్షకులను కథలో లీనం అయ్యేలా చేశారు.   ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను శ్రుతి నాయుడు ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత రిచ్ వాల్యూస్‌తో నిర్మించగా, దర్శకుడు రమేష్ ఇందిరా దీన్ని ఎక్కడా తడబాటు లేకుండా అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ యొక్క మరో ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా తెలుగు, కన్నడ, తమిళం మరియు హిందీ అనే మొత్తం 4 ప్రధాన భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబడింది.    [Ayyana Mane Season 2 Ott Release, Ayyana Mane Season 2, Kushee Ravi, Zee5 OTT, Telugu web series, suspense thriller, mystery web series, Telugunews, TeluguCinema, Tollywood, Tollywood News]  
సెల్యులాయిడ్ మరోసారి తెలంగాణ సువాసన, సొగసు, యాస, రీతి, ఖ్యాతిని చెప్పడానికి ముస్తాబవుతోంది. వైవిధ్యభరితమైన హీరో ప్రియదర్శి, తెలంగాణ జానపద గాయని నాగదుర్గ జంటగా తెరక్కేక్కిన ‘ఇడుపు కాయితం' అందుకు వేదిక.  ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ నిర్మాణంలో, సుకుమార్ రైటింగ్స్ మరియు బన్నీ వాస్ వర్క్స్ పతాకాలపై  అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది.  వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు. మేకర్స్ రీసెంట్ గా  డిసెంబర్ 11 రిలీజ్ డేట్ అని ప్రకటించారు ఈ క్రమంలో   ప్రముఖ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ లిరికల్  సాంగ్‌  అధికారికంగా విడుదల చేసింది.  ఈ ‘గడప’ పాట పూర్తిగా పల్లెటూరి వాతావరణం, గ్రామీణ సాంప్రదాయ విలువలు ఉట్టిపడేలా రూపుదిద్దుకుంది. పెళ్లైన అనంతరం కొత్త కోడలు అత్తగారింట్లో అడుగుపెట్టే మధురమైన సందర్భాన్ని, ఆ ఇంటి గడప దాటే వేళ ఆమె మనసులో మెదిలే భావోద్వేగాలను ఈ పాట అత్యంత సహజంగా కళ్లకు కట్టింది. అభినయ శ్రీనివాస్ అందించిన అద్భుతమైన, అర్థవంతమైన సాహిత్యంతో ఈ పాటలోని ప్రతి చరణం శ్రోతల మనసును హత్తుకునేలా సాగింది. ఇక యువ గాయని తేజు విజయ తన మధురమైన, పకడ్బందీ గొంతుతో ఈ పాటకు సరికొత్త ప్రాణం పోశారు. సురేష్ బొబ్బిలి అందించిన మట్టి వాసనల జానపద బాణీలు శ్రోతలను నేరుగా ఒక పల్లెటూరి వాతావరణంలోకి తీసుకువెళ్తాయి. ప్రియదర్శి మరియు నాగదుర్గల మధ్య ఉన్న స్వచ్ఛమైన గ్రామీణ ప్రేమను, సంప్రదాయ బద్ధమైన కుటుంబ జీవన శైలిని ఈ గడప పాట చాలా చక్కగా ప్రతిబింబిస్తుంది.  ఇది కూడా చదవండి: హర్రర్ సినిమాలంటే ఇప్పుడు భయం లేదా? కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!   ఈ పాటలో వాడిన ప్రతీ పదం తెలంగాణ మట్టి సువాసనలను, పల్లె ప్రజల ఆచార వ్యవహారాలను అద్భుతంగా కళ్లకు కట్టేలా ఉంది. కొత్తగా పెళ్లయిన జంటల మధ్య ఉండే అమాయకమైన సరదాలు, బాధ్యతలు, కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధాలను ఈ ల్య్రారికల్ వీడియోలో అత్యంత రమణీయంగా చూపించారు. కేవలం ఒక సాధారణ సినిమా పాటగా కాకుండా, అచ్చమైన పల్లెటూరి సంస్కృతికి అసలైన అద్దం పట్టేలా దర్శకుడు వంశీరెడ్డి ఈ ప్రతి సన్నివేశాన్ని అత్యంత జాగ్రత్తగా మలిచిన తీరు సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సుకుమార్ రైటింగ్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ అందించిన నిర్మాణ విలువలు ఈ చిత్రానికి మరింత దృశ్యమాన బలాన్ని చేకూరుస్తున్నాయి. సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో నెలకొన్న విపరీతమైన క్యూరియాసిటీని ఈ సెకండ్ సింగిల్ మరింత రెట్టింపు చేసింది. సోషల్ మీడియాలో విడుదలైన క్షణం నుంచే ఈ ‘గడప’ పాట ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. జానపద పాటల అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ గడప ల్య్రారికల్ వీడియో విశేషంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. త్వరలోనే గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న ఇడుపు కాయితం కోసం  తెలుగు సినీ ప్రేక్షకులు అత్యుత్సాహంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇడుపు కాయితం అంటే విడాకుల పత్రం.   [Idupu Kayitham Release Date, Idupu Kayitham Gadapa Song release, idupu kayitham, priyadarshi, naga durga, gadapa song, suresh bobbili,Telugunews, TeluguCinema, Tollywood, Tollywood News]  
భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సినిమా ప్రమోషన్లలో ఆమె కనిపించకపోవడం చర్చకు దారితీసింది. అసలు కాజల్ ఈ సినిమాలో ఉన్నారా? ఉంటే ఆమె సన్నివేశాలు తొలగించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘రామాయణ’లో రావణుడి భార్య మండోదరి పాత్రను కాజల్ అగర్వాల్ పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె గతంలోనే స్వయంగా వెల్లడించారు. అయితే మొదటి భాగంలో లంకకు సంబంధించిన సన్నివేశాలు తక్కువగా ఉంటాయని, అందువల్ల తన పాత్ర నిడివి కూడా పరిమితంగానే ఉంటుందని కాజల్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. రెండో భాగంలో మండోదరి పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటుందని కూడా తెలిపారు. అయితే సినిమా టీజర్‌, ట్రైలర్‌లో కాజల్ కనిపించకపోవడం, ప్రమోషనల్ ఈవెంట్లలోనూ ఆమె ప్రస్తావన లేకపోవడంతో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. ఫైనల్ ఎడిటింగ్‌లో ఆమె సన్నివేశాలను తొలగించి ఉంటారనే ప్రచారం వినిపిస్తోంది.  అయితే కాజల్ గతంలో చెప్పినట్లుగా తొలి భాగంలో పాత్ర నిడివి తక్కువగా ఉండటమే ప్రమోషన్లలో కనిపించకపోవడానికి కారణమై ఉండవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నితేశ్ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ‘రామాయణ’ తొలి భాగం దీపావళి సందర్భంగా విడుదల కానుంది. భారీ విజువల్స్, ప్రముఖ నటీనటులతో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ పాత్ర ఎంతసేపు కనిపిస్తుంది? ఆమె సన్నివేశాలు సినిమాలో ఉంటాయా? అనే ప్రశ్నలకు సినిమా విడుదలైన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: ఎవరీ వైకోమ్ విజయలక్ష్మి.. చూపు లేకపోయినా గాత్రంతో జాతీయ అవార్డు.!       [Kajal Aggarwal Ramayana Role, Kajal Aggarwal As Mandodari, Kajal Aggarwal In Ramayana, Kajal Aggarwal, Ramayana Movie, Mandodari, Ranbir Kapoor, Yash Ravana, Sai Pallavi, Telugu Film News]  
  హర్రర్ మూవీ.. సినీప్రేమికులు తమ జన్మ ధన్యమయ్యిందని భావించే జోనర్.. ఇక ప్రేక్షకులైతే నా సామిరంగా కళ్ళని తమ గుప్పెట్లతో మూస్తూ, తెరుస్తూ, మూస్తూ, తెరుస్తూ చూసి మహదానందాన్ని పొందుతారు. కొంత ముందైతే  సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాలకి ఇదేదో తేడాగా ఉందే అని వెళ్తూ హర్రర్ జోనర్ కి ఉన్న గొప్పతనాన్ని తను స్టే చేసిన ప్రతి చోట చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కంప్లీట్ గా చూసిన ప్రేక్షకులకైతే  రెండు మూడు రోజులు వెంటాడే మూవీ కూడా.  దీంతో  స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఆ హర్రర్ మూవీ విశేషాలని తానే దర్శకుడిగా తెరకెక్కించిన విధంగా చెప్పేవాడు.  కానీ, నేటి ఆధునిక కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎంతటి భారీ భయానక హర్రర్ సినిమా వచ్చినా, నేటి ప్రేక్షకులు అసలు   భయపడటం లేదు సరి  కదా, పైగా ఆ సినిమాలను ఒక రీసెర్చ్ అనలిస్ట్ లాగా, క్రిటిక్ లాగా విశ్లేషించడం మొదలుపెట్టారు. హర్రర్ సినిమా మేకర్స్ ఏమో సినిమా టైటిల్స్ కి   కి ముందు మా సినిమాలో భయపడే శబ్దాలు, సన్నివేశాలు ఉంటాయి. సౌండ్స్ కూడా భ యపుట్టిస్తాయి. కాబట్టి దయచేసి హార్ట్స్ పేషంట్స్, భయస్థులు మా సినిమా చూడకపోవడం మంచిది అని చెప్తున్నారు. కానీ ప్రేక్షకులు ఆ టైంలో కూడా తన బిజీలో తాను ఉంటూ వాళ్ళు చెప్పేది కళ్ళతో మాత్రమే చూస్తున్నాడు. అసలు ప్రేక్షకులలో ఈ విధమైన ఆశ్చర్యకరమైన మార్పు ఎందుకు వచ్చింది? హర్రర్ సినిమాల ప్రభావం తగ్గడానికి వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏమిటి అనే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి అత్యంత ముఖ్యమైన కారణం మన మైండ్ సెట్ మరియు టెక్నాలజీ అభివృద్ధి. ఒకప్పుడు రోజుకు కేవలం కొన్ని గంటల పాటు టీవీ ప్రసారాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్, చేతివేళ్ల చివర 24 గంటల వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రతిరోజూ వేలాది గంటల క్రైమ్, థ్రిల్లర్, సైంటిఫిక్, మరియు హర్రర్ కంటెంట్‌ను మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం. దీనివల్ల మన మెదడు ఈ తరహా భయానక దృశ్యాలకు పూర్తిగా అలవాటు పడిపోయింది. గతంలో ఒక చిన్న దెయ్యం నీడను చూసి భయపడిన ప్రేక్షకుడు, నేడు అంతకంటే భయంకరమైన విజువల్స్, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ , అడ్వాన్స్‌డ్ ఎఫెక్ట్స్‌ను నిత్యం చూస్తుండటంతో భయం అనే సహజ భావోద్వేగం చాలా వరకు తగ్గింది. ఇది కూడా చదవండి: సూపర్ స్టార్ టూ మెగాస్టార్: వయా ఐకాన్ స్టార్    మరొక ముఖ్యమైన కారణం హర్రర్ సినిమాల మేకింగ్ విధానంలో వైవిధ్యం లేకపోవడం. ప్రస్తుతం వస్తున్న చాలా హర్రర్ సినిమాలు ఒకే రకమైన మూస ధోరణిలో సాగుతున్నాయి. పాతకాలపు బంగ్లాలు, అర్ధరాత్రి వేళల్లో వచ్చే వింత శబ్దాలు, ఒకే రకమైన జంప్ స్కేర్లు, దెయ్యం పట్టిన పాత్రల ముఖ కవళికలు మరియు ప్రతికూల వాతావరణం... ఇలా అన్నీ ముందుగానే ఊహించగలిగేలా తయారయ్యాయి. తెరపై తర్వాతి సన్నివేశంలో ఏం జరగబోతోందో ప్రేక్షకుడు చాలా సులభంగా అంచనా వేయగలుగుతున్నాడు. కథనంలో ఎలాంటి కొత్తదనం, ఉత్కంఠ లేకపోవడంతో ప్రేక్షకులు భయపడటానికి బదులు ఆ సన్నివేశాలను సాంకేతికంగా విశ్లేషించడం ప్రారంభించారు. మేకప్ ఎలా ఉంది, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా ఇచ్చారు, కెమెరా యాంగిల్ ఎలా ఉందో గమనిస్తూ ఒక విశ్లేషకుడిలా ఆలోచిస్తున్నారు. సినీ ప్రేమికులు మాత్రం హర్రర్ బయపెట్టకపోవడానికి కారణం ప్రజలు అలియాస్ ప్రేక్షకులు నిత్యం జీవితమనే హర్రర్ తో యుద్ధం చేయడమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా హర్రర్ జోనర్ కూడా మెప్పిస్తే సినీ ప్రేమికులు, ప్రేక్షకులంతా అదృష్టవంతులు ఉండరు.   [Why People Are Not Afraid Of Horror Movies, Why people stop fearing horror movies, Horror movie psychology, Telugunews, TeluguCinema, Tollywood, Tollywood News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
దీపావళి, వివాహ వేడుకల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ అందంగా, ప్రకాశవంతంగా కనిపించాలని కోరుకుంటారు. ఈ ప్రత్యేక వేడుకల కోసం సిద్ధమయ్యే క్రమంలో చర్మానికి సరైన సంరక్షణ అందించడం చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పండుగలకు ముందు మెరిసే చర్మాన్ని పొందడానికి హైడ్రాఫేషియల్, కెమికల్ పీల్స్ మరియు లేజర్ ట్రీట్‌మెంట్లు అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతులు. అయితే, ఇవన్నీ వేర్వేరు పద్ధతుల్లో పనిచేస్తూ వివిధ చర్మ సమస్యలను పరిష్కరిస్తాయి. మీ చర్మం తత్వం, సమస్యలు, వైద్య చరిత్ర మరియు పండుగకు మీ దగ్గర ఉన్న సమయాన్ని బట్టి సరైన చికిత్సను ఎంచుకోవాలి. జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఏస్తెటిక్ డెర్మటాలజీ నివేదిక ప్రకారం, హైడ్రాఫేషియల్ అనేది క్లెన్సింగ్, ఎక్స్‌ఫోలియేషన్, ఎక్స్‌ట్రాక్షన్ మరియు హైడ్రేషన్‌లను మిళితం చేసే ఒక నాన్-ఇన్వాసివ్ చర్మ సంరక్షణ పద్ధతి. ఇది చర్మంపై ఉన్న మృతకణాలు మరియు మలినాలను తొలగించడానికి ఒక ప్రత్యేకమైన పరికరాన్ని ఉపయోగిస్తుంది. డెర్మటాలజిస్ట్ డాక్టర్ అదితి వాధ్వా తెలిపిన వివరాల ప్రకారం, ఈ చికిత్స తక్కువ లేదా అసలు రికవరీ సమయం లేకుండా తక్షణ కాంతిని, తేమను మరియు నునుపైన చర్మాన్ని కోరుకునే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇది పండుగకు ముందు ఎలాంటి చికాకు లేకుండా తక్షణ మెరుపును ఇస్తుంది. మరోవైపు, కెమికల్ పీల్స్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి గ్లైకోలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ మరియు సాలిసిలిక్ యాసిడ్ వంటి జాగ్రత్తగా ఎంచుకున్న ఆమ్లాలను ఉపయోగిస్తాయి. ఇవి అసమాన చర్మపు రంగు, తేలికపాటి వర్ణద్రవ్యం, మొటిమలు మరియు గరుకైన చర్మ ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే, భారతీయ చర్మ తత్వాలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి; ఎందుకంటే సరైన పీల్ ఎంచుకోకపోతే లేదా అనంతర సంరక్షణ లోపిస్తే హైపర్‌పిగ్మెంటేషన్ సమస్య రావచ్చు. అందువల్ల ఈ పద్ధతిని నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయించుకోవాలి. జర్నల్ ఆఫ్ లేజర్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నివేదిక ప్రకారం, లేజర్ చికిత్సలు నిర్దిష్ట చర్మ సమస్యలను నేరుగా లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రీకృత కాంతి శక్తిని ఉపయోగిస్తాయి. ఇవి మొటిమల మచ్చలు, మొండి పిగ్మెంటేషన్, వృద్ధాప్య సంకేతాలు మరియు కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే లేజర్ చికిత్సలకు ఎక్కువ ముందస్తు ప్రణాళిక అవసరం, ఎందుకంటే ఎరుపు, వాపు లేదా పొరలు ఊడిపోవడం వంటి లక్షణాలు ఉండవచ్చు మరియు మెరుగైన ఫలితాల కోసం బహుళ సెషన్లు అవసరమవుతాయి. కాబట్టి పండుగకు ముందే నిపుణులను సంప్రదించడం మంచిది.     Hydrafacial Vs Chemical Peel Vs Laser, Best Skin Treatment For Glow, Festive Skincare Routine, Dermatology Treatments For Face, Hydrafacial Benefits, Chemical Peel For Glowing Skin, Laser Skin Rejuvenation.
ఇంట్లో పండగలు వచ్చినా, ప్రత్యేక వేడుకలు జరిగినా లేదా దేవుడికి నైవేద్యం సమర్పించాలన్నా ముందుగా గుర్తుకు వచ్చే అద్భుతమైన పిండివంటకం జ్యూసీ జ్యూసీగా ఉండే రవ్వ లడ్డూ. ఈ రుచికరమైన మిఠాయిని ఎంతో సులభంగా, పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రెసిపీలో చెప్పిన కొలతల ప్రకారం తయారు చేస్తే సుమారు 30 నుంచి 32 గుండ్రని, రుచికరమైన లడ్డూలు తయారవుతాయి. ఈ రెసిపీ తయారీకి కావలసిన పదార్థాలను పరిశీలిస్తే: ప్రధాన పదార్థమైన బొంబాయి రవ్వ 2 కప్పులు, నెయ్యి పావు కప్పుతో పాటు అదనంగా మరో 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 10, కిస్మిస్ 10, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు (లేదా దీనికి బదులుగా ఎండు కొబ్బరి పొడిని కూడా వాడవచ్చు), పంచదార సుమారు 1.75 కప్పులు (అంటే దాదాపు అర కిలో), యాలకులు 10, అలాగే మిశ్రమం కలపడానికి తగినన్ని గోరువెచ్చటి పాలు అవసరమవుతాయి. ముందుగా స్టవ్ మీద మందపాటి అడుగు గల, వెడల్పాటి పాన్‌ను పెట్టి అందులో పావు కప్పు నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక, ముందుగా సిద్ధం చేసుకున్న 10 జీడిపప్పులు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత, 10 కిస్మిస్‌లను కూడా వేసి అవి బాగా ఉబ్బే వరకు వేయించి, నెయ్యి లేకుండా ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లోని మిగిలిన నెయ్యిలో 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలి. రవ్వ అడుగు మాడిపోకుండా ఉండటానికి మందపాటి పాన్ ఎంతగానో సహాయపడుతుంది. తక్కువ మంటపై రవ్వ నుంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు, రంగు కొద్దిగా మారేంత వరకు నిరంతరం కలుపుతూ వేయించాలి. రవ్వ చక్కగా వేగడానికి కొంత సమయం పడుతుంది, కానీ ఇది లడ్డూల టేస్ట్‌కి అత్యంత ముఖ్యం. రవ్వ బాగా వేగిన తర్వాత దానిని ఒక పెద్ద పళ్ళెంలోకి మార్చుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే పాన్‌ను ఉపయోగించి, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేయించాలి. తక్కువ మంటపై కొబ్బరిలోని తేమ పూర్తిగా తగ్గి, పొడిపొడిలాడేంత వరకు వేయించాలి. ఆ తరువాత, మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, కొబ్బరి ఎర్రగా మారుuntil వేయించాలి. ఇలా వేయించిన కొబ్బరి లడ్డూలకు మంచి సువాసనను, ఎక్కువ కాలం నిల్వ ఉండే గుణాన్ని ఇస్తుంది. ఈ వేయించిన కొబ్బరిని కూడా రవ్వ ఉన్న పళ్ళెంలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో 1.75 కప్పుల పంచదార, 10 యాలకులు వేసి, మరీ మెత్తని పౌడర్‌లా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పంచదార పొడిని రవ్వ, కొబ్బరి మిశ్రమంలో కలపాలి. స్పూన్‌తో కాకుండా చేతితో కలిపితే అన్ని పదార్థాలు చక్కగా కలిసిపోతాయి. బాగా రబ్ చేస్తూ మిశ్రమం ఒకేలా తయారయ్యేలా కలపాలి. ఇప్పుడు గోరువెచ్చటి పాలను కొద్దికొద్దిగా పోసుకుంటూ మిశ్రమాన్ని కలుపుకోవాలి. పాలు మరీ వేడిగా లేదా చల్లగా ఉండకూడదు. మొత్తం పాలు ఒకేసారి పోయకుండా, మిశ్రమం ముద్దగా అయ్యేలా చూసుకుంటూ సుమారు అర గ్లాసు పాలను తీసుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక పళ్ళెంలో పెట్టి, పైన కొద్దిగా అదిమి, 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల రవ్వ పాలను పీల్చుకొని మరింత జ్యూసీగా మారుతుంది. 15 నిమిషాల తర్వాత, నానిన రవ్వ మిశ్రమాన్ని ఒకసారి మళ్ళీ బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లను కలపాలి. కొద్దికొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ చేతితో గట్టిగా నొక్కుతూ లడ్డూలుగా చుట్టుకోవాలి. పైన అలంకరణ కోసం ఒకటి రెండు జీడిపప్పులు, కిస్మిస్‌లు పెట్టి కొంచెం గట్టిగా నొక్కితే ఊడిపోకుండా ఉంటాయి. ఇలా మొత్తం మిశ్రమాన్ని ఎంతో రుచికరమైన లడ్డూలుగా చుట్టుకుంటే, నోట్లో వేస్తే కరిగిపోయే కమ్మటి రవ్వ లడ్డూలు సిద్ధమవుతాయి.     Juicy Rava Laddu, Sooji Ladoo Recipe, Rava Laddu with Perfect Measurements, Indian Festival Sweets, Easy Semolina Laddu, Traditional Sweet Recipes, Homemade Rava Laddu.  
ఇంట్లో పాలు కాచే సమయంలో కొన్నిసార్లు పాలు విరిగిపోతుండటం సర్వసాధారణం. అలా విరిగిన పాలను చూసి చాలామంది వాటిని వృథాగా పారేస్తుంటారు లేదా ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. కానీ, ఆ విరిగిన పాల మీగడతో కూడా ఎంతో రుచికరమైన, స్వచ్ఛమైన దేశీ నెయ్యిని అత్యంత సులభంగా తయారు చేసుకోవచ్చనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది. దీనికోసం ఎటువంటి ఖరీదైన వస్తువులు లేదా ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేదు. ముందుగా మీరు సేకరించిన తగినంత మీగడను తీసుకుని, అది గడ్డకట్టేలా లేదా పెరుగు రూపంలోకి మారేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఆ పెరుగును ఒక మీడియం సైజు గిన్నెలోకి తీసుకుని, తగినన్ని నీటిని కలుపుతూ మజ్జిగ కవ్వంతో లేదా బ్లెండర్ సహాయంతో బాగా గిలకొట్టాలి. కొద్దిసేపటి తర్వాత పెరుగు నుంచి వెన్న వేరుపడటం గమనించవచ్చు. ఈ ప్రక్రియలో అడుగున మజ్జిగ మొత్తం పూర్తిగా ద్రవ రూపంలోకి మారుతుంది, పైకి తేలిన స్వచ్ఛమైన వెన్నను ఒక శుభ్రమైన స్పూన్ సహాయంతో జాగ్రత్తగా వేరు చేసి మరో పాత్రలోకి మార్చుకోవాలి. వెన్నకు అంటుకుని ఉన్న మిగిలిన మజ్జిగను పూర్తిగా తొలగించడానికి, దానిని స్వచ్ఛమైన నీటితో ఒకటి రెండు సార్లు సున్నితంగా కడగాలి. ఇలా చేయడం వల్ల నెయ్యి తయారీకి అసలైన వెన్న చక్కగా సిద్ధమవుతుంది. ఆ తరువాత ఒక చిన్న పాన్ లేదా గిన్నెను స్టవ్ మీద పెట్టి, మీడియం మంటపై ఈ వెన్నను వేడి చేయాలి. మంటను ఎప్పుడూ మితంగా ఉంచాలి, ఎందుకంటే మంట ఎక్కువగా ఉంటే వెన్న త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. వెన్న క్రమంగా కరుగుతూ చిన్న చిన్న బుడగలు మంచిగా ఏర్పడతాయి. ఈ సమయంలో అడుగు అంటకుండా గరిటెతో నిరంతరం కలుపుతూ ఉండాలి. క్రమంగా వెన్నలోని తేమ మరియు నీరు మొత్తం ఆవిరైపోయి, స్వచ్ఛమైన నెయ్యి స్పష్టంగా బంగారు రంగులో కనిపిస్తుంది. అప్పుడు మంచి సువాసన వెలువడిన వెంటనే గ్యాస్‌ను ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఈ నెయ్యిని గది ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత, ఏ మాత్రం తడి లేని శుభ్రమైన సన్నని జల్లెడ లేదా కాటన్ వస్త్రం ద్వారా దీనిని వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నిల్వ ప్రక్రియలో నెయ్యిలో కొద్దిగా కూడా నీరు చేరకుండా చూసుకోవడం చాలా ముఖ్యం, అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ తడి చెంచాలను దీనిలో ఉపయోగించకూడదు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే, మీరు ఇంట్లోనే తయారు చేసుకున్న స్వచ్ఛమైన దేశీ నెయ్యి నెలల తరబడి పాడవకుండా తాజాగానే ఉంటుంది.     Make Ghee From Spoiled Milk, Desi Ghee From Sour Milk, Curdled Milk Malai Hack, Homemade Pure Ghee Recipe, Kitchen Tips And Hacks, Reuse Spoiled Milk Ideas, Traditional Ghee Making.  
ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో ధనియాల నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? రోజూ నీళ్లు తాగే విషయంలో మనం చేసే పొరపాట్లు ఏమిటి? భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగవచ్చా? నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఆయుర్వేదం నీటిని తాగే విధానం గురించి ఏం చెబుతోంది? ఇలాంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఈ TeluguOne Health వీడియోలో సీనియర్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ శిరీష నీటి ప్రాముఖ్యత, నీళ్లు తాగే సరైన పద్ధతులు, ఉదయం నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, ధనియాల నీటి వినియోగం గురించి వివరిస్తున్నారు. అలాగే భోజనం చేసే సమయంలో నీళ్లు తాగడం మంచిదా కాదా, జీర్ణక్రియకు సంబంధించి ఉన్న అపోహలు ఎంతవరకు నిజం, ఆయుర్వేదంలో చెప్పే ఫాంట (Phanta) తయారీ విధానం వంటి ఆసక్తికరమైన విషయాలను వివరిస్తారు. మన శరీరానికి నీరు ఎంతో అవసరం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, పోషకాలు శరీరంలోని వివిధ భాగాలకు చేరడం, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లడం వంటి అనేక ముఖ్యమైన పనులకు నీరు సహాయపడుతుంది. అయితే నీటిని ఎప్పుడు తాగాలి, ఎంత తాగాలి, భోజనానికి ముందు లేదా తర్వాత తాగాలా అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. ఈ విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండటం ఆరోగ్యకరమైన జీవనశైలికి ఉపయోగపడుతుంది. ధనియాలను నీటిలో నానబెట్టి లేదా తగిన విధంగా తయారుచేసి తీసుకునే పద్ధతుల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ధనియాల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది? దానిని ఎలా తయారుచేసుకోవాలి? నీటిని తాగే విషయంలో పాటించాల్సిన పద్ధతులు ఏమిటి? అనే అంశాలపై డాక్టర్ శిరీష వివరణను తెలుసుకోండి. అలాగే ఆయుర్వేదంలో ఫాంట (Phanta) అని పిలిచే మూలికా పానీయాన్ని ఎలా తయారుచేస్తారు, దాని తయారీలో పాటించాల్సిన విధానం ఏమిటి అనే విషయాలను తెలుసుకోవచ్చు. జీర్ణక్రియకు సంబంధించిన అపోహలను తొలగించుకోవడానికి, రోజువారీ నీటి వినియోగంపై అవగాహన పెంచుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి, వయస్సు, శారీరక శ్రమను బట్టి నీటి అవసరాలు మారవచ్చు. కిడ్నీ లేదా గుండె సంబంధిత సమస్యల కారణంగా నీటి పరిమాణంపై పరిమితులు ఉన్నవారు వైద్యుల సూచనలను పాటించాలి. ధనియాల నీటిని ఏదైనా వ్యాధికి నిర్ధారిత చికిత్సగా భావించకూడదు. ధనియాల నీటిని తాగే పద్ధతి, నీటి ప్రాముఖ్యత, భోజన సమయంలో నీళ్లు తాగడం, జీర్ణక్రియపై అపోహలు, ఆయుర్వేద ఫాంట తయారీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి TeluguOne Health వీడియోను పూర్తిగా చూడండి.  
ఇయర్ బడ్స్ పెట్టుకుని రాత్రిళ్లు నిద్రపోయే అలవాటుందా.. ఈ నిజాలు తెలుసుకోండి..! ఈరోజుల్లో చాలామందికి రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా నిద్ర పట్టడం కోసం ఇయర్ బడ్స్ పెట్టుకుని పాటలు, భజనలు లేదా పాడ్‌కాస్ట్‌లు వినే అలవాటు ఉంటుంది. ఈ చిన్న అలవాటు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రి అంతా లేదా ఎక్కువ సమయం పాటు ఇయర్ బడ్స్ ధరించి పడుకోవడం వల్ల  చెవుల ఆరోగ్యానికి ఎంతో హానికరమని వైద్యులు చెబుతున్నారు. ఈ చిన్న అలవాటు వల్ల భవిష్యత్తులో చెవులకు సంబంధించి పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. రాత్రి సమయంలో ఇయర్ బడ్స్ పెట్టుకుని పడుకోవడం వల్ల మన చెవుల్లో రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా నిద్రలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు లేదా  బోర్లా పడుకున్నప్పుడు దిండుకు ఇయర్ బడ్స్‌కు మధ్య పడే ఒత్తిడి కారణంగా చెవి భాగంలో తీవ్రమైన నొప్పి, చికాకు లేదా మంట పుట్టే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రోజూ జరగడం వల్ల చెవి చుట్టూ ఉన్న సున్నితమైన చర్మం దెబ్బతింటుంది , నొప్పి మరింత పెరుగుతుంది. ఇయర్ బడ్స్ చెవి రంధ్రంలో బిగుతుగా ఉండటం వల్ల చెవి లోపలికి గాలి సరిగ్గా వెళ్లకుండా అడ్డుపడుతుంది. దీనివల్ల చెవిలో తేమ , చెమట పేరుకుపోయి బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది చెవిలో ఇన్‌ఫెక్షన్లు రావడానికి ప్రధాన కారణం అవుతుంది. కొందరు ఇయర్ బడ్స్‌ను శుభ్రం చేయకుండా వాడటం లేదా ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. చెవుల్లో దురద, వాపు లేదా ఒక రకమైన ద్రవం కారడం వంటి లక్షణాలు కనిపిస్తే అది ఇన్‌ఫెక్షన్‌గా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. రాత్రి మొత్తం ఇయర్ బడ్స్ ద్వారా పెద్ద శబ్దాలతో మ్యూజిక్ వినడం వల్ల మన వినికిడి శక్తి క్రమంగా మందగించే ప్రమాదం ఉంది. ఎక్కువ గంటలు చెవులకు శబ్దం తగలడం వల్ల చెవిలోని నరాలు బలహీనపడతాయి. కొందరు తక్కువ సౌండ్ పెట్టుకుని   వింటున్నాము కదా అనుకుంటారు, కానీ రోజంతా లేదా రాత్రంతా చెవుల్లో ఆ పరికరాలు ఉంచుకోవడం వల్ల చెవి లోపల ఉండే సున్నితమైన భాగాలకు  నష్టం కలుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో వినికిడి సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. మ్యూజిక్ వింటే ప్రశాంతంగా నిద్ర పడుతుందని అనుకుంటాం కానీ, రాత్రి అంతా పాటలు లేదా పాడ్‌కాస్ట్‌లు ప్లే అవుతూ ఉంటే  మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోలేకపోతుంది. శబ్దాల కారణంగా మధ్యమధ్యలో నిద్రకు డిస్టర్బ్  కలుగుతుంది. దీనివల్ల ఉదయం లేచిన తర్వాత కూడా శరీరం అలసిపోయినట్లుగా , సుస్తీగా అనిపిస్తుంది. నిద్ర నాణ్యత దెబ్బతినడం వల్ల రోజంతా ఉత్సాహం లోపిస్తుంది. ఈ సమస్యలన్నింటి నుంచి సురక్షితంగా ఉండాలంటే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం... మీకు ఒకవేళ మ్యూజిక్ వింటూ నిద్రపోయే అలవాటు ఉంటే, పాటలు ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా టైమర్ సెట్ చేసుకోవడం మంచిది. వీలైతే ఇయర్ బడ్స్‌కు బదులుగా తక్కువ సౌండ్‌తో రూమ్‌లో చిన్న స్పీకర్ ఉపయోగించవచ్చు.  ఇయర్ బడ్స్‌ను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి , అంతేకాదు  ఎవరితోనూ వాటిని షేర్ చేసుకోకూడదు. చెవుల్లో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది.                                                                                                                                                *రూపశ్రీ.
షుగర్ వ్యాధి ఉన్నవారిలో కిడ్నీ సమస్యలు ఎందుకు వచ్చే అవకాశం ఉంది? రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే మూత్రపిండాల పనితీరుపై ఎలాంటి ప్రభావం పడుతుంది? కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలను తెలుసుకోవడం ప్రతి డయాబెటిస్ పేషెంట్‌కు ఎంతో ముఖ్యం. ఈ TeluguOne Health వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ షుగర్ వ్యాధి, కిడ్నీల ఆరోగ్యం, సంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగించే ఔషధ మొక్కల గురించి వివరిస్తారు. ముఖ్యంగా తెల్ల గలిజేరు అని పిలిచే పునర్నవ మొక్క, పల్లేరు గింజలు, పండ్ల సంప్రదాయ ఉపయోగాల గురించి తెలుసుకోవచ్చు. ఈ మూలికలను సంప్రదాయ వైద్యంలో ఎలా పరిగణిస్తారు, వాటిని ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరమో తెలుసుకోవచ్చు. డయాబెటిస్ వల్ల కిడ్నీలపై ఎలాంటి ప్రభావం పడవచ్చు? షుగర్ పేషెంట్లు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? పునర్నవ (తెల్ల గలిజేరు) మొక్కకు సంప్రదాయ వైద్యంలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి? పల్లేరు గింజలు, పండ్లను సంప్రదాయ వైద్య విధానాల్లో ఎలా ఉపయోగిస్తారు? మూలికలతో తయారుచేసే ఔషధాలను వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించడానికి వైద్య పరీక్షలు ఎందుకు ముఖ్యం? వంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం, వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడటం, అవసరమైన కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీ సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అందువల్ల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ వ్యాధి ఉన్నవారు తమ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పునర్నవ మరియు పల్లేరు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ వివరణతో కూడిన ఈ TeluguOne Health వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మూలికలు కిడ్నీ వ్యాధులను నయం చేస్తాయని నిర్ధారిత ఆధారాలు లేవు. వైద్యుల సూచన లేకుండా షుగర్ మందులను ఆపకండి లేదా మూలికలను వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించకండి.