LATEST NEWS
  శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా గాంధీ, పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపింది పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని తీసుకొస్తే మోదీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.  కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్. కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.
  జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు (28న) గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు మహాత్మాగాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాయని ఆయన తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహాత్మా ఉపాధి హామీ పథక అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని చూస్తోందని, పేదలు, గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దీనికి నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని సూచించారు.రేపు జరగబోయే నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందా? రేపో మాపో రేవంత్ కెబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారా? అన్న చర్చ తెలంగాణ రాజకీయాలలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం రేవంత్ హస్తిన పర్యటకు బయలుదేరనున్నారు. శనివారం (డిసెంబర్ 28) హస్తినలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతారు. ఈ భేటీ ప్రధాన అజెండా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణే అంటున్నారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు. ఇక బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, ఎస్టీ కోటాలో బాలూ నాయక్ లూ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ కేవలం కేబినెట్ విస్తరణ కాకుండా పునర్వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వాలని హైకమాండ్ ను కోరనున్నారు. ఇందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మార్పులు, చేర్పులతో కేబినెట్ ను పున్వ్యవస్థీకరించి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   
ALSO ON TELUGUONE N E W S
  'తమిళగ వెట్రి కళగం'(TVK) పేరుతో కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి(Vijay Thalapathy) ఓ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇక ఆయన సినిమాలకు దూరమై, పూర్తిగా రాజకీయాలతో బిజీ అవుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. విజయ్ చివరి సినిమా 'జన నాయగన్‌'  అవుతుందని..ఆయన అభిమానులు కూడా ఓ అంచనాకు వచ్చేశారు. తాజాగా ఇదే విషయాన్ని విజయ్ స్పష్టం చేశాడు. (Jana Nayagan)   తాజాగా కౌలాలంపూర్‌లో 'జన నాయగన్‌' ఆడియో లాంచ్ ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో విజయ్ మాట్లాడుతూ.. జన నాయగన్‌ తన ఆఖరి చిత్రమని ప్రకటించారు.    "ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలన్న ఆశతో ఇండస్ట్రీకి వచ్చా. కానీ, అభిమానులు నాకు రాజ భవనం ఇచ్చారు. నా కోసం ఎంతోమంది అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూశారు. ఇంతకాలం నన్ను సపోర్ట్‌ చేసిన వారి కోసం.. ఇప్పుడు నేను నిలబడతాను. ప్రజలకు సేవ చేసేందుకే సినిమాలు వదిలేస్తున్నా" అని విజయ్ అన్నారు. అభిమానుల కోరిక మేరకు స్టేజ్‌పై విజయ్ స్టెప్పులేయడం విశేషం.    కాగా, 'జన నాయగన్‌' సినిమా 2026 జనవరి 9న విడుదల కానుంది. ఇది బాలకృష్ణ-అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమా ఆధారంగా రూపొందుతోందనే ప్రచారం ఉంది. అయితే దర్శకుడు హెచ్. వినోద్ మాత్రం ఇది రీమేక్ కాదని చెప్పారు.   
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీ 'ది రాజా సాబ్'(The Raja Saab). హారర్ కామెడీ జానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి మారుతి దర్శకుడు . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్. సంక్రాంతి కానుకగా జనవరి 9న 'రాజా సాబ్' రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లో 'రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రాజా సాబ్ గురించి ప్రభాస్, మారుతి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. వారి స్పీచ్ లతో ఒక్కసారిగా సినిమాపై హైప్ పెరిగింది అనడంలో డౌట్ లేదు.   ప్రభాస్ మాట్లాడుతూ.. "ఇది నానమ్మ, మనవడి కథ. జరీనా వాహబ్ గారు నాకు నానమ్మ క్యారెక్టర్ లో నటించారు. డబ్బింగ్ చెబుతుంటే నా సీన్స్ మర్చిపోయి నానమ్మ సీన్స్ చూస్తూ ఉండిపోయా. నాతో పాటు జరీనా గారు కూడా రాజా సాబ్ లో హీరోనే. ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ పెరిగింది. అయినా ఎంతో ధైర్యంగా విశ్వప్రసాద్ గారు సినిమా నిర్మించారు. ఈ రేంజ్ హారర్ ఫాంటసీ సినిమాకు తమన్ మాత్రమే మ్యూజిక్ చేయగలడు అనిపించింది. మా డీవోపీ కార్తీక్ గారు ఎంతో స్పీడ్ గా క్వాలిటీగా మూవీ చేశారు. మీ వల్లే మా సినిమా క్వాలిటీ ఇంత బాగా వచ్చింది. మూడేళ్ల రాజా సాబ్ స్ట్రెస్, బాధ్యత అన్నీ కలిసి మారుతి గారికి కన్నీళ్లు వచ్చాయి. మారుతి గారిని ఫస్ట్ కలిసినప్పుడు డార్లింగ్ అన్నీ యాక్షన్ మూవీస్ అవుతున్నాయి, మంచి ఎంటర్ టైనింగ్ మూవీ మన ఫ్యాన్స్ కు ఇవ్వాలి అని అన్నాను. హారర్ కామెడీ జానర్ తో ఈ ప్రాజెక్ట్ రెడీ చేశాం. ఈ మూవీ క్లైమాక్స్ కు వచ్చేసరికి మారుతి గారి రైటింగ్ కు నేను ఫ్యాన్ అయ్యాను. ఆయన పెన్ తో రాశారా మెషీన్ గన్ తో రాశారా అనే డౌట్ వచ్చింది. మనకు 15 ఏళ్ల తర్వాత మారుతి డార్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నాడు. సంక్రాంతికి అన్ని సినిమాలతో పాటు మా రాజా సాబ్ కూడా బ్లాక్ బస్టర్ కావాలి." అన్నారు.   డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. "రాజా సాబ్ వెనక బలంగా నిలబడింది ఇద్దరు. ఒకరు ప్రభాస్ గారు, మరొకరు విశ్వప్రసాద్ గారు. రాజా సాబ్ కథ విని ప్రభాస్ గారు చాలా నవ్వుకున్నారు. అయితే ఆయనకు ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ప్రపంచమంతా ప్రభాస్ గారు గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభాస్ గారితో మేము ఏదో సినిమా చేశాం అనిపించుకోకుండా ఒక పెద్ద స్పాన్ మూవీ చేశాం. ఈ జానర్ లో మంచి పొటెన్షియాలిటీ ఉంది. దాన్ని మేము మరో రేంజ్ కు తీసుకెళ్తున్నాం. నేను 11 సినిమాలు చేశాను, నువ్వు పెద్ద రేంజ్ దర్శకుడివి కావాలని రెబల్ యూనివర్సిటీలో ప్రభాస్ గారు అవకాశం కల్పించారు. నేను రాశాను, తీశాను కానీ ప్రభాస్ గారు ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్స్, ఆయన మాకు ఇచ్చిన సపోర్ట్ మాటల్లో చెప్పలేను. సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నా విశ్వప్రసాద్ గారు చాలా ధైర్యంగా రాజా సాబ్ ను తీసుకొస్తున్నారు. అన్ని భాషల్లో రాజా సాబ్ సాధించే విజయం మామూలుగా ఉండదు. నేను నా సినిమాలను ఒక  ఆడియెన్ లాగే చూస్తా. ఈ సినిమా సీన్స్ ఆర్ఆర్ చేసిన తర్వాత చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి. ప్రభాస్ గారి పర్ ఫార్మెన్స్ చూసి ఎమోషనల్ అయ్యాను. ప్రభాస్ గారికి రుణపడి ఉంటాను. మాటల్లో చెప్పలేను డార్లింగ్. నేను సాధారణంగా కన్నీళ్లు పెట్టుకోను. కానీ ప్రభాస్ గారు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ కు, ఆయనను నా ముందు చూస్తూ ఎమోషనల్ అవుతున్నా. ఈ సినిమా మీలో ఎవర్ని ఒక్క సీన్ నిరాశపర్చినా, నా ఇంటి అడ్రెస్ ఇస్తా రండి." అన్నారు.  
  2016లో 'నిర్మలా కాన్వెంట్'తో టీనేజ్ లో ప్రేక్షకులను పలకరించిన శ్రీకాంత్ తనయుడు రోషన్(Roshan Meka).. 2021లో 'పెళ్లి సందడి'తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అందులో తన లుక్స్, డ్యాన్స్ లతో ఆకట్టుకున్నప్పటికీ.. రావాల్సినంత క్రెడిట్ రాలేదు. ఈ క్రమంలోనే కాస్త గ్యాప్ తీసుకొని తాజాగా 'ఛాంపియన్'(Champion)గా థియేటర్లలో అడుగుపెట్టాడు. ఈ సినిమా రోషన్ కి మంచి పేరు తీసుకు రావడమే కాకుండా, పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది.   'ఛాంపియన్' విడుదలకు ముందు నుంచే రోషన్ తో సినిమాలు చేయడానికి పలువురు నిర్మాతలు, దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. సితార బ్యానర్ ఓ సినిమాని ప్లాన్ చేస్తోంది. 'ఛాంపియన్'ని నిర్మించిన స్వప్న సినిమా కూడా మరో మూవీ చేసే సన్నాహాల్లో ఉంది. అలాగే శైలేష్ కొలను, ఇంద్రగంటి మోహనకృష్ణ వంటి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో సీనియర్ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. ఆయనే గౌతమ్ వాసుదేవ్ మీనన్. (Gautham Vasudev Menon)   కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో గౌతమ్ మీనన్ ఒకరు. తెలుగులోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. తెలుగులో ఘర్షణ, ఏ మాయ చేసావే వంటి సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. చివరిగా తెలుగులో 2016లో వచ్చిన 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలుగు మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రోషన్, గౌతమ్ మీనన్ మధ్య కథా చర్చలు జరిగినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే 'ఛాంపియన్' తర్వాత రోషన్ నుండి రాబోయే సినిమా ఇదేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.   
  టాలీవుడ్ లో ఎన్నికల సందడి నెలకొంది. నేడు(డిసెంబర్ 28) ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం 1 వరకు కొనసాగనుంది. సాయంత్రం  ఫలితాలు వెల్లడి కానున్నాయి. (Film Chamber Elections)   ఫిల్మ్ ఛాంబర్ లో నాలుగు సెక్టార్లు భాగమయ్యాయి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం 3,355 మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్ష కార్యదర్శిలతో పాటు 32 మంది కార్యవర్గ సభ్యుల ఎంపిక జరగనుంది. ఈ సారి ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు సభ్యులు.   ప్రతి రెండేళ్లకు ఒకసారి ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఛాంబర్ ఎన్నికల్లో మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. చిన్న నిర్మాతలు అంతా కలిసి మన ప్యానల్ గా, అగ్ర నిర్మాతల వర్గమంతా ప్రోగ్రెసివ్ ప్యానల్ గా బరిలోకి దిగారు. మన ప్యానల్ ను బలపరుస్తున్న వారిలో సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్ లాంటి వారు ఉండగా.. ప్రోగ్రెసివ్ ప్యానల్ ను బల పరుస్తున్న అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు వంటి వారున్నారు.   మరి ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో చిన్న నిర్మాతలు పైచేయి సాధిస్తారో లేక పెద్ద నిర్మాతలు పైచేయి సాధిస్తారో చూడాలి. మరి కొద్ది గంటల్లో ఫలితం తేలనుంది.  
Chief Minister Nara Chandrababu Naidu expressed immense pride in the unique philanthropic legacy of the NTR Trust during the 20th-anniversary celebrations of the NTR Educational Institutions. Addressing the students, he emphasized the institution's noble origin in 2005, which was founded to provide free, high-quality education to orphaned and underprivileged children.  He credited the enduring success and management of the trust to his wife, Nara Bhuvaneshwari, noting that her leadership has been the backbone of the organization for two decades. The Chief Minister highlighted that the reputation of these institutions continues to grow globally through the achievements of its talented alumni.  He joked about her rampant usage of Ipad, while he is still using a paper. He stated that he did not think that their brain-child would grow into such a mighty tree and he is happy to be part of a party that values Service more than self-ambition.  He reiterated his vision for the country, stating his desire to see India emerge as the world’s leading nation through the Vikasit Bharat initiative by 2047. Encouraging a spirit of lifelong learning, he praised Bhuvaneshwari’s transition into leadership as a prime example of excellence and dedication for all students to follow. Nara Bhuvaneshwari also addressed the gathering, noting that the institution’s mission is to nurture creativity and leadership through the support of dedicated faculty. She reaffirmed that the principles and ideals set by the legendary NTR remain the guiding force in shaping the future of the Trust. The event concluded with a shared commitment to brightening the lives of students and continuing the trust's extensive service to the community. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Shivaji appeared in front of Telangana Women Commission after he was summoned to appear regarding his comments at Dhandoraa event about dressing sense of women. He commented that girls and women should prefer saree at public events and not revealing dresses. Anasuya, Prakash Raj and Nagababu reacted on these comments.  While Nagababu and Prakash Raj stated that his opnion is not right, they also stated that they do not want to attack him or try to talk against him as the issue broader than confining it to one person. Anasuya, Chinmayi and many others took to social media to state that his comments are unacceptable.  Shivaji stated that he retracted his comments and also apologised, so peole should end the issue here. He also stated that he did not watch what Prakash Raj and Nagababu stated and denied to comment. But he stated that people who are working against him to blow up the issue should note that he is not afraid of them.  He asserted that he is a person who spoke truth and it is indigestible to people. He also remarked that people are unnecessarily getting agitated for harmless comments he made and they are threatened by him. He affirmed that he would stick to his principles no matter what and he is concerned just about acting career.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
      -ఏంటి ఆ మూవీ  -హీరో ఎవరు -ఎప్పుడు రిలీజ్  -వారణాసి అప్ డేట్ ఏంటి       భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో రాజమౌళి(SS Rajamouli)ది అగ్ర స్థానం అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన ట్రాక్ రికార్డు అలాంటిది మరి. ఈ సారి తన రికార్డుల్ని తానే బద్దలు కొట్టేలా 'వారణాసి'(Varanasi)ని ముస్తాబు చేస్తున్నాడు. ఇండియన్ చిత్ర సీమలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంటుండగా మహేష్ బాబు(Mahesh Babu) కెరీర్ తో పాటు తన కెరీర్ లో ఒక మర్చిపోలేని మూవీగా నిలిచిపోయేలా చెయ్యాలనే కంకణంతో చిత్రీకరిస్తున్నాడు. అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడు 'వారణాసి' ని చూద్దామా అనే ఆశతో ఉన్నారు. కానీ వాళ్ల ఆశ ఫలించటానికి రెండు సంవత్సరాలు ఆగాల్సిందే. కానీ రాజమౌళి అప్పటి దాకా తన అభిమానుల్ని బాధపెట్టడం ఎందుకని వచ్చే ఏడాది సిల్వర్ స్క్రీన్ పై తాను ఇప్పటి దాకా వదిలిన బాణాల్లోని ఒక బాణాన్ని మరోసారి రీ రిలీజ్ చేయనున్నాడు.     రాజమౌళి, నాని(Nani),సమంత(Samantha), సుదీప్ కాంబోలో వచ్చిన ఈగ(Eega)ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. 2012 లో వచ్చిన ఈ మూవీలో నటీనటుల పెర్ ఫార్మెన్స్, రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, గ్రాఫిక్స్ ఒకదానికొకటి పోటీపడి మరి మెస్మరైజ్ చెయ్యడంతో   ప్రతి ఒకరు ఎంతగానో ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ లో రీ రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు వారణాసి టీం నుంచి అధికార ప్రకటన కూడా వచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.       also read:  అనసూయకి సలహా ఇస్తున్న ప్రకాష్ రాజ్.. వినలేదంటున్న శివాజీ           
      పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.         ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ మర్లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతు 'నేను ఐటీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను. సినిమా అంటే ఇష్టం. ఆ ప్యాషన్ తో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాను. నా స్నేహితుడు శశిధర్ చెప్పిన ఒక లైన్ నచ్చి ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించాం. డైరెక్టర్ రాకేష్ మాధవన్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ కథతో తప్పకుండా మూవీ చేయాలని "నీలకంఠ" ప్రాజెక్ట్ ప్రారంభించాం. షూటింగ్ టైమ్ లో ప్రకృతి సహకరించక, కొన్నిసార్లు తుఫాన్ లు ఎదుర్కొన్నాం. దీంతో  కొద్ది రోజుల పాటు షూట్  ఆపేశాం. ఇలాంటి కొన్ని అవాంతరాలని దాటుకుని మీ ముందుకు మా చిత్రాన్ని జనవరి 2న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కి  తీసుకొస్తున్నాం. మా సినిమా టీమ్ సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. మీరంతా "నీలకంఠ" చిత్రాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అన్నారు.       డీవోపీ, ఎడిటర్ శ్రావణ్ జి.కుమార్ మాట్లాడుతూ నేను డైరెక్టర్ రాకేష్ స్నేహితులం. ఇక్కడే ప్రసాద్ ల్యాబ్స్ లో మా  షార్ట్ ఫిలింస్ స్క్రీనింగ్ చేసేవాళ్లం. అప్పుడు ఒక మంచి సినిమా చేయాలని కలగన్నాం. అది "నీలకంఠ" చిత్రంతో నిజమైనందుకు సంతోషంగా ఉంది. మా టీమ్ అంతా పెట్టిన ఎఫర్ట్  తో ట్రైలర్ ఇంత క్వాలిటీగా వచ్చింది. సినిమా కూడా అంతే బాగా ఆకట్టుకుంటుందని చెప్పాడు.ప్రొడ్యూసర్ వేణుగోపాల్ దీవి మాట్లాడుతూ - మా "నీలకంఠ" సినిమా ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. ట్రైలర్ లాగే సినిమా కూడా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. జనవరి 2న థియేటర్స్ కి  వచ్చి  చూస్తారని కోరుకుంటున్నానని అన్నారు.     చిత్ర సమర్పకులు శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి మాట్లాడుతు నా సోదరుడి వల్లే నేను ఈ ప్రొడక్షన్ లోకి రావాల్సివచ్చింది. ట్రైలర్ చూశారు కదా మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను. నాకు బాగా నచ్చింది. ట్రైలర్ చూస్తుంటే నా లైఫ్ లో జరిగినవి గుర్తుకొచ్చాయి. మా చిత్రంలో ప్రతి ఆర్టిస్ట్ బాగా చేశారు. నేను స్కూల్ లో చదివే టైమ్ నుంచి కబడ్డీ, త్రోబాల్, వాలీబాల్ వంటి గేమ్స్ లో మంచి పేరు తెచ్చుకున్నాను. బహుమతులు గెలుచుకున్నాను. బాక్సాఫీస్ గేమ్ లో కూడా ప్రేక్షకులు మమ్మల్ని గెలిపించి మాకు కప్ అందిస్తారనే నమ్మకంతో ఉన్నాం. అన్నారు.     డైరెక్టర్ రాకేష్ మాధవన్(Rakesh Madhavan)మాట్లాడుతూ - నేను చాలా షార్ట్ ఫిలింస్ చేశాను. ఫీచర్ ఫిలిం చేయాలనే కోరిక ఉండేది.  ఆ కోరిక మా నిర్మాతలు శ్రీనివాస్, వేణుగోపాల్ వారి వల్ల నిజమవుతోంది. ఇది దర్శకుడిగా నా మొదటి సినిమా. ట్రైలర్ చూసిన వాళ్లు కొత్త దర్శకుడు చేసినట్లు లేదు అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి ఔట్ పుట్ వచ్చేందుకు మా టీమ్ అందరు కృషి చేశారు. మా సినిమాలో మంచి ఎమోషన్స్ ఉన్నాయి, ఫైట్స్, సాంగ్స్ ఆకట్టుకుంటాయి. సినిమా చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోకుండా ఉంటుంది. జనవరి 2న మంచి చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం. మన దగ్గర ఇతర భాషల చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. అందుకే మనం చేసిన మంచి చిత్రాన్ని కూడా ఇతర భాషలకు చూపించాలనే పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. అన్నారు.       హీరోయిన్ యష్న(Yashna)మాట్లాడుతూ -  "నీలకంఠ" చిత్రంలో నటించడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. మేము ఒక విలేజ్ కు వెళ్లి అక్కడే లోకల్ టాలెంట్ ని  సెలెక్ట్ చేశాం. వాళ్లు మా మూవీలో మంచి రోల్స్ చేశారు. ట్రైలర్ లో మీకు ఆ క్వాలిటీ పెర్ ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, లవ్ స్టోరీ అన్నీ ఉన్నాయి. జనవరి 2న మా చిత్రాన్ని థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది .     హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ - నేను తెలుగువాడినే. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించాను. తెలుగు ఆడియెన్స్, తెలుగు మేకర్స్ సినిమాను ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. అందుకే తెలుగు ఫిలింమేకర్స్ ఎవరైనా స్క్రిప్ట్ పంపిస్తే ఆత్రుతగా చదివేస్తుంటా. నాకు కంటెంట్ ఉన్న మూవీస్ చేయడం ఇష్టం. కథలో మంచి ఎమోషన్ ఉండాలని కోరుకుంటా. అలాంటి కంటెంట్, ఎమోషన్ ఈ చిత్రంలో ఉన్నాయి. చేయని తప్పుకు ఊరు ఊరంతా తన మీద నింద మోపితే హీరో ఎలా ఎదుర్కొన్నాడు, తప్పు చేయలేదని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనే కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా మా డైరెక్టర్ రూపొందించాడు. మంచి ఫైట్స్, సాంగ్స్ కూడా ఉన్నాయి.అందరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మనం కష్టపడుతుంటే సక్సెస్ తప్పకుండా వస్తుందని నమ్ముతాను. ఆ సక్సెస్ "నీలకంఠ" తో ప్రేక్షకులు ఇస్తారని ఆశిస్తున్నానని  అన్నాడు.      రాంకీ,శుభలేక సుధాకర్, 30 ఇయర్స్ పృథ్వీ, చిత్రం శ్రీను, అఖండ శివ, కంచరపాలెం రాజు, సురభి ప్రభావతి, సత్య ప్రకాశ్, కిరాక్ ఆర్పీ, భరత్ రెడ్డి, రాజు, అప్పాజీ, తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆర్ట్ - నాని పండు, సతీష్ శెట్టి, కొరియోగ్రాఫర్స్ - సాగర్, శివ గిరీష్,  యాక్షన్ - రవి, డీవోపీ, ఎడిటింగ్ - శ్రావణ్ జి.కుమార్, మ్యూజిక్ - మార్క్ ప్రశాంత్    సమర్పణ - శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి, పీఆర్ఓ - సతీష్. కె.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది.  ఎదుటి వారు ఏమనుకుంటారో అనే సందిగ్ధం కూడా ఉంటుంది.  దీని వల్ల వారు చాలా విషయాలు బయటకు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోతుంటారు.  కానీ ఇలా నిశ్శబ్దంగా ఉండటం వల్ల  తరువాత చాలా బాధపడతారు కూడా.  అప్పుడు అలా చెప్పి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అని అనుకునేవారు చాలా అధికంగా ఉంటారు. కానీ మనసులో మాటను ధైర్యంగా చెప్పడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయని అంటున్నారు మనస్తత్వ విశ్లేషకులు. ఇంతకూ మనసులో మాటను ధైర్యంగా బయటకు చెప్పడం వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుంటే.. నమ్మకం, సాన్నిహిత్యం.. ప్రతి బలమైన సంబంధానికి ఓపెన్ కమ్యూనికేషన్ పునాది అవుతుంది. మనం మన భావాలను నిజాయితీగా వ్యక్తపరిచి, ఇతరుల మాటలను విన్నప్పుడు అపార్థాలు తొలగిపోతాయి.  నమ్మకం మరింత పెరుగుతుంది. మనసు విప్పి మాట్లాడగల  వ్యక్తులు పారదర్శకత,  పరస్పర గౌరవం కలిగి ఉంటారు. ఇది బందం దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం.. మనసులో ఉన్న ఆలోచనలను భయం లేదా సంకోచం లేకుండా వ్యక్తం చేసినప్పుడు..  చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాం అనే ఒక శాటిస్పాక్షన్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇది  ఆత్మగౌరవాన్ని పెంచుతుంది,  క్రమంగా ఇలాంటి ప్రవర్తన వల్ల ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది. ఎప్పుడైనా, ఎలాంటి సందర్భంలో అయినా తన మనసులో ఉన్నది చెప్పడానికి ఎలాంటి భయం ఉండదు. తేడాలు, పరిష్కారాలు.. జీవితంలో ప్రతి ఒక్కచోట విభేదాలు ఉండనే ఉంటాయి. అవి స్నేహం అయినా, కుటుంబం అయినా,  ప్రేమ అయినా, ఉద్యోగం చేసే చోట అయినా.. ఎక్కడైనా సరే.. విభేదాలు గొడవలుగా మారకుండా పరిష్కరించుకోవడానికి  సహాయపడుతుంది. అభిప్రాయాలను స్పష్టంగా , సంకోచం లేకుండా వ్యక్తపరిచినప్పుడు అవతలి వ్యక్తులు కూడా వినడానికి ఆసక్తి చూపిస్తారు.  ఇలా మాట్లాడటం అనేది సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆత్మవిమర్శ.. ఏదైనా విషయాన్ని స్పష్టంగా చెప్పే అలవాటు ఉండటం వల్ల కేవలం ఇతరులతో ఏదైనా చెప్పడమే కాదు.. తమతో తాము స్పష్టంగా మాట్లాడుకోగలుగుతారు. ఇది వ్యక్తులను కన్ప్యూజన్ లేకుండా చేస్తుంది. బలాలు, బలహీనతలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత అభివృద్దికి మొదటి అడుగు అవుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన.. భావోద్వేగాలను అణిచివేసినప్పుడు అవి లోపల ఒత్తిడి కలిగిస్తాయి. కానీ వాటిని సరైన విధంగా బయటకు వ్యక్తం చేసినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఇది మానసిక ఒత్తిడి,  ఆందోళన సమస్యలు పెరగకుండా ఉండటానికి కారణం అవుతుంది. శారీరక ఆరోగ్యం.. స్పష్టంగా ఏదైనా విషయాన్ని బయటకు చెప్పడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒత్తిడి తక్కువగా ఉండటం మంచి నిద్ర, రక్తపోటు సాధారణంగా ఉంటాయి. ఇది గుండెజబ్బు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. సక్సెస్ కోసం.. స్పష్టంగా, మంచిగా కమ్యూనికేషన్ చేయడంలో వ్యక్తి విజయం ఆధారపడి ఉంటుంది. ఉద్యోగంలో అయినా, రాజకీయంలో అయినా,  కుటుంబంలో అయినా,  బంధంలో అయినా స్పష్టంగా మాట్లాడటం వల్ల అవతలి వ్యక్తులు అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  ఇది అన్ని చోట్ల విజయాన్ని,  గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. స్పష్టంగా మాట్లాడటం అంటే ఇతరుల పైన ఆధిపత్యం చెలాయించడం కాదు. భావాలను గౌరవంగా, పద్దతిలో వ్యక్తపరచడం. ఇతరులు ఏమనుకుంటారో అనుకోకుండా మనసులో ఉన్నది  చెప్పడం, మనసులో ఉన్నది తొక్కి పెట్టి మౌనంగా ఉండకుండా బయటకు వ్యక్తం చేయడం వల్ల మానసికంగా బలంగా ఉండటమే కాకుండా ఇతరుల ముందు సరైన విధంగా మాట్లాడటం ఎలాగో కూడా అర్థం  అవుతుంది.  కాబట్టి ఇతరుల గురించి ఆలోచించి మనసులో ఉన్నది దాచిపెట్టాల్సిన అవసరం లేదు.                          *రూపశ్రీ.
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ. ఇప్పుడైతే తొందరలోనే కొత్త ఏడాది రాబోతోంది.  క్యాలెండర్ తో పాటు తమ జీవితం కూడా మారాలని కొండంత ఆశ పెట్టుకుని ఉంటారు అందరూ. మరీ ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రి తమ కంటే ఎక్కువగా తమ పిల్లల జీవితం గురించే ఆలోచిస్తారు.  తమ పిల్లలు సంతోషంగా ఉండాలని,  చదువులో, కెరీర్ లో విజయం సాధించాలని కోరుకుంటారు. చదువుకునే పిల్లల తల్లిదండ్రులు ఈ కొత్త ఏడాదిలో తమ పిల్లలు సక్సెస్ గా ముందుకు సాగాలని కోరుకుంటారు.  అయితే పిల్లలు కొత్త ఏడాదిలో సక్సెస్ కావాలన్నా, వారి భవిష్యత్తు మరెంతో గొప్పగా  ఉండాలన్నా  కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి.  అవేంటో తెలుసుకుంటే.. రీడింగ్.. చదవడం వల్ల పిల్లల ఊహ, భాష,  ఆలోచన అన్నీ బలపడతాయి. రోజూ చదివే పిల్లలకు మంచి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత  పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. కొత్త సంవత్సరం నుండి రోజుకు కనీసం 30 నిమిషాలు రీడింగ్ అలవాటు చేసుకోవాలని పిల్లలకు చెప్పాలి.  ఇందుకోసం ఏదైనా చదవవచ్చు.  కథ, కామిక్ లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్  అందించే పుస్తకం.. ఇలా ఏవైనా ఎంచుకోవచ్చు. స్క్రీన్ సమయం.. కొత్త సంవత్సరంలో పిల్లలు  ఫోన్‌కు దూరంగా ఉండటం అలవాటు చేయాలి. పగటిపూట  నిర్ణీత  సమయం కంటే ఎక్కువసేపు స్క్రీన్‌లను చూడటం వల్ల నిద్ర,  కంటి చూపు దెబ్బతింటుంది. పడుకునే గంట ముందు  మొబైల్ ఫోన్‌ను దూరంగా ఉండటం  కూడా చాలా ముఖ్యం. నిద్ర..  ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా ఫాలో కావల్సిన మంచి అలవాటు ఏంటంటే..  సరైన సమయానికి  పడుకుని, సరైన సమయానికి మేల్కోవడం. పిల్లల మానసిక అభివృద్ధికి చదువు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. కాబట్టి రాత్రి సరైన సమయానికి పడుకుని, ఉదయాన్నే నిద్రలేచే అలవాటు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. నేర్చుకోవడం.. నేర్చుకునే అలవాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఇది పిల్లలను పోటీ ప్రపంచానికి సిద్ధం చేస్తుంది. పిల్లలు కొత్త పదజాలం, చిత్రలేఖనం, సంగీతం లేదా క్రీడలు ఏదైనా కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి. ఇందుకోసం తల్లిదండ్రులు పిల్లలకు చాలా సహకారం అందించాలి. నడవడిక.. ఎవరికైనా సరే ధాంక్స్  చెప్పడం, పెద్దలను గౌరవించడం,  సహాయం చేయడం వంటివి వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసే  అలవాట్లు. ఇతరులను గౌరవించడం, మంచి మర్యాదలను అలవర్చుకోవడం చేయాలి. ఆహారం.. పిల్లల ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త తీసుకోవడం తప్పనిసిరి.  జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.   జంక్ ఫుడ్ కు బదులుగా పండ్లు, కూరగాయలు,  ఇంట్లో వండిన ఆహారాన్నితీసుకోవాలి. పిల్లల రోగనిరోధక శక్తి,  పెరుగుదలకు మంచి ఆహారపు అలవాట్లు చాలా అవసరం. వ్యాయామం.. ఆటలు..  పిల్లలను ఆరోగ్యంగా ఉంచడంలో వ్యాయామం, ఆటలు చాలా బాగా సహాయపడతాయి. పిల్లలను బయటకు వెళ్లి ఆడుకోవడం ప్రోత్సహించాలి.  ఇది  పిల్లలను సామాజికంగా కలిసిపోయేలా చేస్తుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పిల్లలకు ప్రతిరోజూ కనీసం 60 నిమిషాల శారీరక శ్రమ అవసరం. అందువల్ల పిల్లలు తమ శారీరక వ్యాయామాన్ని,  బయటకు వెళ్లి తోటి పిల్లలతో ఆడుకోవడాన్ని ప్రోత్సహించాలి.  దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించాలి.                                    *రూపశ్రీ.
క్రిస్మస్ అనేది  క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగ. దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఏటా డిసెంబర్ 25న   జరుపుకుంటారు. ఈ పండుగ ప్రేమ, కరుణ, శాంతి,  మానవత్వం యొక్క సందేశాన్ని ప్రపంచమంతా తెలియజేస్తుంది.  క్రిస్మస్ పండుగ రోజున ప్రతి  ఇల్లు దీపాలతో,  నక్షత్ర ఆకారపు విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు.  అంతే కాదు.. క్రిస్మస్ మతం తో సంబందం లేకుండా అన్ని మతాల వారినీ కేక్ కటింగ్ కు పిలుస్తారు.  ఇలా అందరూ క్రిస్మస్ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటారు.  అయితే డిసెంబర్ 25వ తేదీనే క్రిస్మస్ పండుగ జరుపుకోవడం వెనుక కారణం ఏమిటి? క్రిస్మస్ పండుగ రోజు స్నేహితులకు ఎలాంటి బహుమతులు ఇవ్వడం మంచిది? తెలుసుకుంటే.. డిసెంబర్ 25నే క్రిస్మస్ ఎందుకంటే మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ,  త్యాగం యొక్క మార్గాన్ని చూపిం చాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు. క్రిస్మస్ సంప్రదాయాలు క్రిస్మస్ రోజున ప్రజలు చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రభువైన యేసు జీవితాన్ని, ఆయన  బోధనలను గుర్తుచేసుకుంటారు.  క్రైస్తవుల ప్రతి ఇంట్లో  క్రిస్మస్ చెట్లను అలంకరిస్తారు, కరోల్స్ పాడతారు,  కేకులు కట్ చేస్తారు. పిల్లలలో శాంతా క్లాజ్ ఆనందంగా గడుపుతారు.  క్రిస్మస్ ముఖ్యంగా  బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి  పెద్ద పీట వేస్తుంది. ముఖ్యంగా  ఈ పండుగ పేదలకు సహాయం చేయడానికి,  దాతృత్వానికి దానం చేయడానికి కూడా ప్రేరణనిస్తుంది. క్రిస్మస్ రోజున స్నేహితులకు, పరిచయస్తులకు గిఫ్ట్ లు ఇస్తుంటారు.   స్నేహితులకు, పరిచయస్తులకు ఎలాంటి గిఫ్ట్ లు ఇవ్వాలి చాక్లెట్లు, ప్లం కేకులు,  కుకీలను క్రిస్మస్ కోసం సాంప్రదాయంగానూ,  గొప్ప  బహుమతులుగానూ భావిస్తారు. ముఖ్యంగా ఇంట్లో తయారుచేసిన కేకులు,  కుకీలు స్నేహాలకు తీపిని జోడిస్తాయి,  సాన్నిహిత్యాన్ని బలపరుస్తాయి. గ్రీటింగ్ కార్డ్, ఫోటో ఫ్రేమ్ లేదా  ఏదైనా చాలా సొంతంగా తయారు చేసిన బహుమతులు  చాలా ప్రత్యేకమైనవి. అలాంటి బహుమతులు సమయాన్ని,  ఓపికను,  కష్టాన్ని స్నేహితుల కోసం వినియోగిస్తే చాలా మంచి ఎమోషనల్ అటాచ్మెంట్ ను పెంచుతాయి. పుస్తకాలను చాలా గొప్ప  బహుమతిగా పరిగణిస్తారు. స్నేహితుడి ఆసక్తికి సంబంధించిన ప్రేరణాత్మక, ఆధ్యాత్మిక పుస్తకాలు ఇవ్వవచ్చు.    పుస్తకం జ్ఞానాన్ని పెంచడమే కాకుండా చాలా కాలం పాటు గుర్తుండిపోతాయి. సువాసనగల కొవ్వొత్తులు,  అలంకరణ వస్తువులు, షోపీస్‌లు,  క్రిస్మస్ నేపథ్య అలంకరణ వస్తువులు ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి. ఈ బహుమతులు పండుగకు గల ఉద్దేశ్యాన్ని  మరింత ప్రత్యేకంగా చేస్తాయి. పర్సనల్ గా ఇచ్చి పుచ్చుకునే బహుమతులు కూడా క్రిస్మస్ లో ప్రాధాన్యత కలిగి ఉంటాయి.  మగ్గులు, కుషన్లు, డైరీలు, పేరు లేదా ఫోటోతో కూడిన కీ చైన్‌లు వంటి పర్సనల్  బహుమతులు  బాగుంటాయి. పైన పేర్కొన్న బహుమతులు అవతలి వ్యక్తికి ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. పిల్లల కోసం ప్రత్యేక బహుమతులు ఇవ్వాలంటే  వారికి బొమ్మలు, కథల పుస్తకాలు, డ్రాయింగ్ లేదా పెయింటింగ్ కిట్‌లను బహుమతిగా ఇవ్వడం చాలా మంచి సెలెక్షన్ అవుతుంది. ఇది పిల్లల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. -రూపశ్రీ
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి.  ధర కాస్త ఎక్కువ అనే కారణంగా సాధారణ ప్రజలు వాల్నట్స్ కు దూరంగా ఉంటారు. అయితే వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా బెస్ట్ అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  వాల్నట్స్ ను తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు సులువుగా నయం  అవుతాయని అంటున్నారు. ఇంతకూ వాల్నట్స్ ను తినడం వల్ల తగ్గే వ్యాధులు ఏంటి? వాల్నట్స్ లో ఉండే పోషకాలు ఏంటి? తెలుసుకుంటే.. వాల్నట్స్ లో పోషకాలు.. వాల్నట్స్ లో  అత్యంత ప్రయోజనకరమైన పోషకాలు ఉంటాయి.  వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి.  వాల్నట్స్ లో చాలా పోషకాలు ఉంటాయి. వాల్నట్స్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుందని చాలామంది చెబుతారు. అయితే ఇది మాత్రమే కాకుండా చాలా రకాల వ్యాధులు కూడా నయం అవుతాయి. గుండె ఆరోగ్యం.. వాల్నట్స్ ను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందట.  అంతేకాదు ఇది చెడు కోలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుందట. రక్తపోటు.. రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు రోజు వాల్నట్స్ ను తీసుకుంటూ ఉంటే చాలా మంచిది.  రక్తపోటును నియంత్రించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది. బరువు.. బరువు తగ్గడానికి ట్రై చేసేవారు వాల్నట్స్ తింటే చాలా మేలు. వాల్నట్స్ లో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు పెరగకుండా నిరోధిస్తాయి. తర్వాత బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం.. మానసిక ఆరోగ్యం కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వాటితో పాటు వాల్నట్స్ ను కూడా తింటూ ఉంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది.  ఇది మెదడు పనితీరుకు అవసరమైన ఒమెగా-3 ఆమ్లాలను కలిగి ఉండటం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.  అలాగే అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ.. జీర్ణవ్యవస్థ సరిగా లేకున్నా, జీర్ణాశయం పనితీరు మందగించినా చాలా సమస్యగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను సరిచేసి తిరిగి ఆరోగ్యంగా చేయడంలో వాల్నట్స్ కీలకపాత్ర పోషస్తాయి.  వాల్నట్స్ లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.  మలబద్దకాన్ని కూడా తగ్గిస్తుంది. వాపులు, నొప్పులు.. వాల్నట్స్ లో ఉంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ల7ణాలు వాపులను, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.  ఇవి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ఇంట్లో కుదరక పోతే కనీసం బయట అయినా స్నాక్స్ లాగించేవారు ఉంటారు. అయితే కొన్ని రకాల స్నాక్స్ ను సాయంత్రం 6గంటల తర్వాత అస్సలు తినవద్దని చెబుతున్నారు ఆహార నిపుణులు.  దీని వల్ల గ్యాస్ సమస్య ఎక్కువ అవుతుందని,  రాత్రంతా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండాల్సిందే అని అంటున్నారు. ఇంతకీ సాయంత్రం 6 గంటల తర్వాత తినకూడని స్నాక్స్ ఏంటో తెలుసుకుంటే.. సాయంత్రం 6 గంటల తర్వాత కొన్ని స్నాక్స్ తినకూడదని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్లు చెబుతున్నారు.  సమోసాలు, జిలేబీలు, పానీపురి, వడ పావ్, కచోరీలు, వేయించిన మోమోలు,  నామ్కీన్‌లను సాయంత్రం 6 గంటల తర్వాత తినకూడదట. ఎక్కువ బటర్ తో కూడిన  బర్గర్‌లు, పావ్ భాజీలు కూడా సాయంత్రం 6 తరువాత తినకూడదని అంటున్నారు. పైన చెప్పుకున్న  ఆహారాలను అప్పుడప్పుడు తినడం వల్ల ఏమీ కాదని అనుకుంటారు. కానీ అప్పుడ్పుడు తినడం అనేది అలవాటు అయితే చాలా కష్టమట.  ఈ అలవాటు శరీరానికి ఎక్కువ కేలరీలు, కొవ్వు,  చక్కెరను ఇస్తాయి. ఇది బరువు పెరగడం, గ్యాస్, ఎసిడిటీ,  రక్తంలో  చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది. వేయించిన ఆహారాలు,  టైప్ 2 డయాబెటిస్ మధ్య సంబంధం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. వేయించిన ఆహారాలు తినేవారిలో రక్తంలో చక్కెర నియంత్రణ తక్కువగా ఉంటుంది.  ఇన్సులిన్ నిరోధకత కూడా పెరిగే ప్రమాదం ఉంది. వేయించిన ఆహారాలు పేగు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మంచి బ్యాక్టీరియాను తగ్గిస్తాయి, వాపును పెంచుతాయి.   ఆకలిని, షుగర్ క్రేవింగ్స్ ను నియంత్రించే హార్మోన్లు కూడా తగ్గుతాయి.  దీని వల్ల వీటిని పదేపదే తినాలని అనిపిస్తుంది. ఇది బరువు పెరగడానికి కూడా కారణం అవుతుందట. కాబట్టి  పైన పేర్కొన్న ఆహారాలను అప్పుడప్పుడు తినడం కూడా కాస్త ఇబ్బందే. అలాగే కొన్ని ఆహారాలను 6 గంటల తర్వాత అస్సలు తినకూడదు కూడా.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...