LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత తన పాదయాత్రకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 2029 ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడమనే ఏకైక లక్ష్యంతో ఆయన చేపట్టబోతున్న పాదయాత్ర వచ్చే ఏడాది జులైలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున ప్రారంభించనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ పాదయాత్ర కోసం ఇప్పటి నుంచే గ్రౌడ్ వర్క్ మొదలు పెట్టనున్నారు.  2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు. అయితే 2019 ఎన్నికలలో విజయం తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జనంతో మమేకమై అధికార పగ్గాలు చేపట్టిన జగన్ అధికారం చేజిక్కిన తరువాత జనానికి ముఖం చాటేశారు. రోడ్లకు ఇరు వైపులా పరదాలు కట్టుకుని మరీ పర్యటనలు సాగించారు. అలాగే పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన వాగ్దానాల అమలు అటుంచి, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో కూడా పట్టించుకోవడం మానేశారు.   ఈ నేపథ్యంలో  ఈసారి జగన్ పాదాయత్రకు రాజకీయ సమీకరణాలు  భిన్నంగా ఉన్నాయి. గతంలో 2019 ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్ర ద్వారా ప్రజల్లో అపారమైన నమ్మకాన్ని సంపాదించుకున్నప్పటికీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కొన్ని ఆ నమ్మకాన్ని   నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని వైసీపీయులే చెబుతున్నారు. రాజకీయ పరిశీలకులు సైతం.. 2017లో పాదయాత్రకు లభించిన ప్రాజాదరణ ఈ సారి అనుమానమేనని విశ్లేషిస్తున్నారు.   అది పక్కన పెడితే.. సెంటిమెంట్ ప్రకారం వైయస్ఆర్ జయంతి నాడే యాత్రను ప్రారంభించడం ప్రజలకు దగ్గర కావడానికి, వారి విశ్వాసాన్ని తిరిగి పొందడానికి దోహదపడుతుందని జగన్ విశ్వసిన్తున్నారు. వచ్చే ఏడాదిజులై నుంచి జగన్ పాదయాత్రకు సంబంధించిన ప్రకటన ఇంకా అధికారికంగా వెలువడకపోయినా.. పార్టీ వర్గాలు మాత్రం పాదయాత్రకు అదే ముహూర్తం ఖారరైందని గట్టిగా చెబుతున్నాయి.  2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఈ రెండేళ్ల కాలంలో పెద్దగా జనంలోకి వచ్చిన దాఖలాలు లేవు. జగన్ కూడా చుట్టపు చూపుగా రాష్ట్రానికి రావడం వినా.. ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో  పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. ఇక ఒకరిద్దరు వినా పార్టీ నేతలు కూడా పొలిటికల్గా ఇన్ యాక్టివ్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయాలంటే.. పాదయాత్ర వినా మరో మార్గం లేదని జగన్ భావిస్తున్నారు.  ఈ కారణంతోనే ఎన్నికలకు రెండేళ్లు ముందే పాదయాత్ర చేపట్టడం ద్వారా నిరంతరం జనంలో ఉండేలా పాదయాత్రను ఎంచుకున్నారు.    [Jagan Padayatra From July 2027, jagan padayatra 2.0, ys jagan mohan reddy, ap politics, ysr jayanthi,, andhra pradesh News, Telugu One]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత తెలుదేశం పార్టీ తెలంగాణలో ఉనికి మాత్రంగానే మిగిలిందన్నది వాస్తవం. అయితే..  తెలంగాణ రాజకీయాలలో తెలుగుదేశం పాత్ర  ఆ పార్టీపై  ప్రత్యర్థులు   కొనసాగిస్తున్న  విమర్శల దాడి  మాత్రం అలాగే కొనసాగుతున్నాయి.  దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించిన ఒక ప్రధాన రాజకీయ శక్తిగా టీడీపీకి తిరుగులేని  చరిత్ర ఉంది. అయితే రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.  రాష్ట్ర విభజన అనంతర  కాలంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయినప్పటికీ.. ఇప్పటికీ  ప్రత్యర్థి పార్టీల నేతలు తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తుండటం రివాజుగా మారిపోయింది. తెలంగాణ గడ్డపై పార్టీకి ఉన్న బలమైన పునాదులను, చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యర్థులు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు పరిశీలకులు చెబుతుంటారు.   గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే..  టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారాలు చేయడం లేదా ఆ పార్టీ ప్రాభవాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయడం రాజకీయ ప్రత్యర్థులకు మామూలైపోయింది. ఇందుకు కారణం క్షేత్రస్థాయిలో పార్టీకి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న క్యాడర్.  ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం నాటి పరిస్థితులు,  ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు నేటికీ రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వస్తుండటమే ఇందుకు నిదర్శనం.  అయితే..  తెలుగుదేశంపై విమర్శలను ప్రత్యర్థి పార్టీలు కేవలం   ఎన్నికల సమయాలకే పరిమితం చేయడంలేదు.. తమకు అవసరమైన ప్రతిసంర్భంలోనూ రాజకీయ వేడిని రగల్చడానికి ఒక సాధనంగా మార్చుకుంటున్నారు.  రాష్ట్రంలో అధికార,  ప్రతిపక్ష పార్టీలక మధ్య   మాటల యుద్ధంలో తెలుగుదేశం ప్రస్తావన అన్నది అనివార్యంగా మారిపోయిన పరిస్థితి ఉంది. తెలుగుదేశం ప్రస్తావనే తమ రాజకీయ ఉనికిని బలోపేతం చేస్తుందన్న భావన తెలంగాణ రాజకీయ పార్టీలలో బలంగా పేరుకుపోయిందనడానికి ఇది నిదర్శనమని చెప్పుకోవాల్సి ఉంటుంది.   తాజాగా కొండా సురేఖ ఎపిసోడ్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలకు ఆమె తెలుగుదేశం పార్టీనే ఆశ్రయించారు. రేవంత్ లో ఉన్నది తెలుగుదేశం రక్తం కనుకనే కక్ష పూరితంగా తనపై చర్యలు తీసుకున్నారని విమర్శించారు. ఇలా బీఆర్ఎస్, అలాగే కొత్తగా సొంత కుంపటి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసుకున్న కల్వకుంట్ల కవిత, అధికార కాంగ్రెస్ తెలుగుదేశం జపం లేకుండా రాష్ట్రంలో రాజకీయాలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే తెలంగాణలో తెలుగుదేశం బలానికీ, ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో ఉన్న పట్టుకూ నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [TDP in Telangana Politics, Telugu Desam Party, Telangana PoliticsNews, TDP Rivals Target, TeluguOne]
  తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖను రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుండి సడన్ గా బర్తరఫ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కలకలమే రేపింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమె పేరు మీద ఒక భారీ ప్రకటన లేదా "బిగ్ అప్‌డేట్" త్వరలోనే రాబోతోందంటూ విపరీతంగా ప్రచారం సాగింది. దీంతో రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ శ్రేణులు మరియు సామాన్య ప్రజలు కొండా సురేఖ తదుపరి అడుగు ఎటువైపోనని ఉత్కంఠగా గమనించారు. అయితే, ఈ వైరల్ ప్రచారాలపై మాజీ మంత్రి కొండా సురేఖ స్వయంగా స్పందిస్తూ ఒక కీలక వివరణ ఇచ్చారు. తన పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవన్నీ తప్పుడు ప్రచారాలని స్పష్టం చేశారు. కేవలం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రజలు, మీడియా నమ్మాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ వివాదానికి ప్రధాన బీజం కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యల నుంచే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. దీనివల్ల దాదాపు 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  కొందరు మంత్రులు సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.  అయితే, తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని సురేఖ పార్టీకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వేరొకరి అభిప్రాయాలకు తండ్రికి లేదా తల్లికి రాజకీయ బాధ్యత అప్పగించడం సరికాదని సమర్థించుకున్నారు. అయినప్పటికీ, పార్టీ క్రమశిక్షణ దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్లు ఏఐసీసీ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం సెప్టెంబర్ 3న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదంతో కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనిపై సురేఖ తీవ్రంగా స్పందిస్తూ, తనకు కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండానే బర్తరఫ్ చేశారని వాపోయారు. ఉరిశిక్ష పడిన ఖైదీకి కూడా చివరి నిమిషంలో మాట్లాడే అవకాశం ఇస్తారని, కానీ తన పట్ల కనీస ప్రజాస్వామ్య సూత్రాలను కూడా పాటించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, మంత్రి పదవి తనకు కేవలం ఒక అలంకారం మాత్రమేనని పేర్కొన్నారు.    తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని తేల్చిచెప్పారు. మరోవైపు, కొండా సురేఖ బర్తరఫ్‌తో పాటు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి జి. చిన్నారెడ్డిని కూడా తప్పించి, ఆ స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నియమించారు. అలాగే తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద, కుడా చైర్‌పర్సన్‌గా సుధారాణిలను నియమిస్తూ ప్రభుత్వం కొన్ని కీలక ప్రక్షాళనలు చేపట్టింది. ప్రస్తుతం కొండా సురేఖ ఇచ్చిన వివరణతో ఆమె పార్టీ మారే ఆలోచనలో లేరని స్పష్టమైనప్పటికీ, తెలంగాణ కాంగ్రెస్‌లో ఉద్రిక్తతలు ఇంకా సమసిపోలేదని స్పష్టమవుతోంది.     (Konda Surekha sacked, Telangana Cabinet churn, CM Revanth Reddy, Konda Surekha, Konda Sushmitha Patel comments, Telangana Congress news, Konda Surekha social media clarification, Telugu One, Telugu news)
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్ పాపులర్ యాంకర్ అండ్ వర్సటైల్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ గ్లామరస్ బ్యూటీ పంచుకున్న ఒక ప్రత్యేకమైన డివోషనల్ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తన భావప్రకటనతో వివాదాలకు దూరంగా ఉంటూనే, ఈసారి మరింత ప్రత్యేకమైన భక్తి రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ కృష్ణాష్టమి సందర్బంగా అనసూయ సంప్రదాయబద్ధమైన రాధా దేవి అవతారంలో మెరిసిపోయారు. ఎరుపు రంగు పట్టు చీర ధరించి, డిజైనర్ జ్యువెలరీ మరియు ప్రత్యేకమైన ముస్తాబుతో అలరించారు. కన్నడ భక్తి గీతమైన 'తులసి కోమలవేణి' పాటకు ఆమె చేసిన అభినయం, ఎక్స్‌ప్రెషన్స్ మరియు నృత్య రీతులు అభిమానులను ఎంతగానో కట్టిపడేస్తున్నాయి. అయితే ఈ వీడియో కంటే కూడా ఆమె జోడించిన క్యాప్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. "కృష్ణుడికి అంతా తెలుసు.. నాకు అది చాలు" అంటూ అనసూయ రాసుకొచ్చారు. అంతేకాకుండా శాంతం, నిగ్రహం, పవిత్రత, విశ్వాసం, జ్ఞానం వంటి ఆత్మపరిశీలన పదాలను సైతం ఆమె తన పోస్ట్‌లో ప్రస్తావించారు. గతంలో సనాతన ధర్మం మరియు కొన్ని ఆధ్యాత్మిక అంశాలపై అనసూయ చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద ఎత్తున వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆమె, తాజాగా శ్రీకృష్ణుడి పాటకు రాధగా మారి చేసిన నాట్యం ద్వారా తనపై వచ్చిన విమర్శలన్నింటికీ పరోక్షంగా ఎండ్ కార్డ్ వేసినట్లయిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. టీవీ రంగంలో స్టార్ యాంకర్‌గా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న అనసూయ, 'రంగస్థలం', 'పుష్ప' వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో నటిగా సత్తా చాటారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ఆమె, ఎలాంటి విమర్శలు ఎదురైనా తన వ్యక్తిత్వాన్ని వదులుకోనని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ రాధా-కృష్ణుల కాన్సెప్ట్ వీడియోకు నెటిజన్లు, అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. కృష్ణాష్టమి రోజున ఇంత ఆధ్యాత్మికంగా, అందంగా కనిపించినందుకు నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తుండగా, వివాదాల జోలికి వెళ్లకుండా సైలెంట్‌గా ఇచ్చిన ఈ కౌంటర్ కామెంట్‌పై ఆసక్తికర చర్చ నడుస్తోంది.     [Anasuya Bharadwaj, Anasuya Krishna Dance Video, Janmashtami 2026 Special, Anasuya Instagram Viral Video, Tollywood Celebrities News]
మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ డైరెక్టర్ బాబీ (కె.ఎస్.రవీంద్ర) కలయికలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కాకా' (KAAKA) చిత్రానికి సంబంధించి సాలిడ్ అప్‌డేట్ వెలువడింది. ఇప్పటికే 'వాల్తేరు వీరయ్య'తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ క్రేజీ కాంబోపై సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ అపారమైన అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తదుపరి బిగ్ షెడ్యూల్ సెప్టెంబర్ 7వ తేదీ నుంచి హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను, భారీ యాక్షన్ బ్లాక్‌లను తెరకెక్కించేందుకు దర్శకుడు బాబీ ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి 'సూపర్‌వైజర్ సత్యం'గా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ పాత్రలో అలరించనున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్‌లో చూపించిన మేకింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ అభిమానులకు మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ముగింపులో వచ్చే ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఈ సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవనుందని చిత్రవర్గాల టాక్. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) పతాకంపై వెంకట్ నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటి అనస్వర రాజన్, నివేతా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, కథకు తగ్గట్టుగా అద్భుతమైన నటీనటుల బృందం ఈ ప్రాజెక్ట్‌లో భాగమైంది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సరికొత్త మాస్ వైబ్‌తో రాబోతున్న ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.     [Chiranjeevi Kaaka Movie, Director Bobby, KVN Productions, Kaaka Hyderabad Schedule, Sankranthi 2027 Release]
  సింగర్ గా, గేయరచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బల్జీత్ సింగ్  తన నివాసంలో శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. పంజాబ్‌లోని లుధియానా జిల్లా పరిధిలో గల సుధార్ పట్టి ధాలివాల్ ఏరియాలో బల్జీత్ సింగ్ నివసిస్తున్నాడు. ఇటీవల ఆయన తల్లిదండ్రులు మరణించడంతో ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. అయితే కొన్ని రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడం, కుటుంబ సభ్యులకు కానీ, స్నేహితులకు కానీ అందుబాటులోకి రాకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. గురువారం ఉదయం ఆయన ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడం గమనించిన స్థానికులు స్థానిక పోలీసులకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీస్ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. ఇంటి తలుపులు తెరిచి చూడగా మంచంపై బల్జీత్ సింగ్ మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. మరణించి దాదాపు 4 నుండి 5 రోజులు అయి ఉండవచ్చని నిరాదరించారు. మృతదేహం పూర్తిగా పాడవడంతో పాటు ఇంటి ప్రాంగణంలో కొన్ని రక్తపు మరకలు  కనిపించడంతో ఈ మృతి వెనుక ఏదైనా కుట్ర లేదా అనుమానాస్పద కోణం ఉందా అనే చర్చ నడిచింది. Also Read: వాళ్ళకోసమే ఓటిటిలు: శివాజీ సంచలన వ్యాఖ్యలు       దీంతో పోలీసులు వెంటనే ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్, సీఐఏ బృందాలను పిలిపించి క్లూస్ సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సివిల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షల నివేదిక ఆధారంగా SHO కుల్విందర్ సింగ్ కీలక విషయాలను వెల్లడించారు. బల్జీత్ సింగ్ గుండెపోటు (హార్ట్ ఎటాక్) కారణంతోనే మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. దీంతో  ఆయన మృతిలో ఎలాంటి కుట్ర గానీ, హత్య కోణం గానీ లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బల్జీత్ సింగ్ కి పెళ్లి కాలేదు. వయసు 35 ఏళ్ళు .     [Baljit Singh,  Punjabi singer Baljit Singh, Heart Attack, TeluguCinema, Tollywood, TeluguCinemaNews, Teluguone, TollywoodNews]   
భారతీయ చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు కథనం కంటే కూడా అవి ఎదుర్కొనే వివాదాల వల్లే వార్తల్లో నిలుస్తుంటాయి. కథలో ఉండే బోల్డ్ కంటెంట్ లేదా సమాజంలో చర్చనీయాంశంగా మారే సున్నితమైన అంశాల కారణంగా సెన్సార్ బోర్డ్ ఆంక్షలు ఎదుర్కొన్న చిత్రాలు చాలానే ఉన్నాయి. అటువంటి జాబితాలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది బాలీవుడ్ వివాదాస్పద చిత్రం 'అన్‌ఫ్రీడమ్'. దర్శకుడు రాజ్ అమిత్ కుమార్ తెరకెక్కించిన ఈ డ్రామా మూవీలో స్వలింగ సంపర్కం, ఉగ్రవాదం, మత ఛాందసవాదం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అత్యంత సున్నితమైన విషయాలను సవాలుగా తీసుకుని ఆవిష్కరించారు. 2015లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నించగా, భారతదేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ థియేటర్లలో ప్రదర్శనకు అనుమతి నిరాకరించింది. సినిమాలోని కొన్ని శృంగార సన్నివేశాలు, బోల్డ్ సంభాషణలతో పాటు ఉగ్రవాద నేపథ్యానికి సంబంధించిన ఘట్టాలను తొలగిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డ్ స్పష్టం చేసింది. అయితే సన్నివేశాలను కట్ చేస్తే కథలోని ఆత్మ దెబ్బతింటుందని భావించిన దర్శకనిర్మాతలు, బోర్డ్ సూచించిన మార్పులను చేయడానికి నిరాకరించారు. అప్పీల్ చేసినప్పటికీ థియేట్రికల్ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. థియేటర్లలో విడుదల కాకపోయినప్పటికీ, ఈ చిత్రం అంతర్జాతీయంగా పలు చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భావప్రకటనా స్వేచ్ఛ, సెన్సార్‌షిప్‌పై పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన ఈ మూవీలో విక్టర్ బెనర్జీ, ఆదిల్ హుస్సేన్, ప్రీతి గుప్తా ప్రధాన పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఈ సంచలన చిత్రం ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు డిజిటల్ మాధ్యమంలో ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో, ఓటీటీ వేదికగా 'అన్‌ఫ్రీడమ్' మరోసారి సినీ ప్రియుల్లో హాట్ టాపిక్‌గా మారింది.       [Unfreedom Banned Movie, Unfreedom Netflix OTT, Raj Amit Kumar, Controversial Bollywood Movies, OTT Release Updates]
    శివాజీ సెల్యులాయిడ్ పై పెర్ఫార్మ్  చేస్తుంటే మనకి కూడా అర్జెంటుగా నటుడు కావాలని అనిపిస్తుంది. అంతలా మెస్మరైజ్ చేసే పెర్ఫార్మ్ శివాజీ సొంతం.  సెకండ్ ఇన్నింగ్స్ లో సరికొత్త డైలాగ్ మాడ్యులేషన్ తో దూసుకుపోతున్న శివాజీ ఈ నెల 11 న  ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన 'ఎపిక్' తో మరో సారి సెల్యులాయిడ్ పై సందడి చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో ఓటిటి లపై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.   శివాజీ మాట్లాడుతు  ఓటీటీలు కేవలం సోమరిపోతుల కోసమేనని, అవి థియేటర్లలో లభించే అసలైన సినిమాటిక్ అనుభవాన్ని హరించివేస్తున్నాయి. సినిమా అంటే కేవలం ఒక కథని చూడటం మాత్రమే కాదు. పెద్ద స్క్రీన్, శక్తివంతమైన సౌండ్ సిస్టమ్, పక్కనున్న వందలాది మంది ప్రేక్షకుల రెస్పాన్స్, థియేటర్ వాతావరణం అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన ఎనర్జీని ఇస్తాయి.ఇంట్లో టీవీలు లేదా మొబైల్ ఫోన్లలో పాజ్ చేసుకుంటూ సినిమాలు చూస్తే ఆ అసలైన అనుభూతి దక్కదని చెప్పుకొచ్చాడు. Also read: హఠాత్తుగా విజయ్ లండన్ ప్రయాణం.. ఆమెతో రాజీ కోసమా, లేక!       శివాజీ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం ప్రేక్షకులు శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తూ, బిగ్ స్క్రీన్ అనుభవాన్ని కాపాడుకోవాలనే ఆవేదనతోనే ఆయన అలా మాట్లాడారని అంటుంటే, మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. పెరిగిన టికెట్ ధరలు, పాప్‌కార్న్ రేట్లు మరియు కుటుంబంతో థియేటర్‌కు వెళ్తే అయ్యే ఖర్చుల వల్ల సామాన్యులు ఓటీటీలను ఆశ్రయిస్తున్నారని, అలాంటి వారిని సోమరిపోతులు అనడం సరికాదని నెటిజన్లు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు.       [Sivaji, Epic movie promotions, ott, TeluguCinema, Tollywood, TeluguCinemaNews, Teluguone, TollywoodNews]
జయశ్రీ మీడియా సమర్పణలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కలాల్ శ్రీనివాస్ నిర్మాణంలో నాగరాజ్ కొట్టే ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ న‌టుడు బ్రహ్మాజీ  మార్కండేయ పాత్రను పోషిస్తున్నారు. కృష్ణాష్టమి కానుకగా బ్రహ్మాజీ  'కృష్ణంభ‌జే' ఫస్ట్ లుక్‌ను సోష‌ల్ మీడియాలో లాంచ్ చేశారు. పోస్ట‌ర్‌లో బ్రహ్మాజీ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. బ్రహ్మాజీ మార్కండేయుడి గెటప్‌లో ఆకట్టుకుంటున్నారు. కాషాయ వస్త్రధారణ, రుద్రాక్ష మాలలు, నుదుటిపై విభూతి, చేతిలో యోగ దండంతో ఆయన లుక్‌ ప్రత్యేకంగా నిలుస్తోంది. భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతిబింబంగా కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. పౌరాణిక, భక్తిరస అంశాలను మేళవిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగరాజ్ కొట్టే రచనతో పాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథకు అనుగుణంగా ప్రత్యేకమైన పాత్రలు, ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో మురళీ గౌడ్, రచ్చ రవి, అభయ్ బెతిగంటి, గౌతమ్ రాజు, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు తదితరులు కీల‌క‌ పాత్రల్లో నటిస్తున్నారు. హీరోగా ప్రదీష్, హీరోయిన్‌గా వంగమయి పటేల్ నటిస్తున్నారు. రచ్చ రవి డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ‘కృష్ణంభజే’కు సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలను త్వరలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.       [Krishnam Bhaje Movie, Actor Brahmaji, Markandeya Look, Krishna Janmashtami, Telugu Film News, Telugu News]  
    సినిమాకి ఉన్న కెపాసిటీ తెలియచేస్తూ ఇళయదళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంలో రాయల్టీగా కూర్చున్న విషయం తెలిసిందే. దీంతో స్వపక్షం, ప్రతిపక్షం వల్ల సోషల్ మీడియాలో నిత్యం విజయ్ కి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజా న్యూస్ విజయ్ ఓల్డ్ న్యూస్ అన్నింటిని పక్కకి నెట్టేసి మై హునా అంటుంది.  Also Read: Rambha Oorvasi Menaka Movie Review: రంభ, ఊర్వశి, మేనక మూవీ రివ్యూ  తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత విజయ్  ఫస్ట్ టైం ఈ నెల 10 న విదేశీ ప్రయాణం చేస్తున్నాడు.  బ్రిటన్ రాజధాని లండన్ నగరంలో ల్యాండ్ అవ్వబోతున్నాడు. పెట్టుబడులు తెచ్చేందుకే మా సార్ వెళ్తున్నారు అంటూ అభిమానులు, పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో మరో వాదన కూడా వినపడుతుంది. విజయ్ వైఫ్ సంగీత మొన్న ఆగస్టులో కోర్టుకెళ్లి సైలెంట్‌గా  విడాకుల పిటిషన్‌ వెనక్కి తీసుకుంది.  ఆ కేసు క్లోజ్ అయి నెల రోజులు కూడా గడవక ముందే  విజయ్  లండన్ వెళ్తున్నాడు. ప్రస్తుతం సంగీత లండన్‌లోనే సెటిల్ అయ్యింది. కాబట్టి ఈ టూర్ వెనుక అసలు స్క్రిప్ట్ ‘పెట్టుబడులు’ కాదని, భార్యామణిని కలవడానికి అనే న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.     [ Vijay, Sangeetha, Tollywood, TeluguCinema, TeluguCinema News, Tollywood News]          
కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సూర్య కెరీర్ ప్రస్తుతం సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆయన తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 50వ చిత్రాన్ని లాక్ చేసినట్లు తెలుస్తోంది. సినీ ప్రేమికులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సన్సేషనల్ కాంబినేషన్‌లో ఈ ల్యాండ్‌మార్క్ మూవీ రూపుదిద్దుకోనుండటంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా బజ్ నెలకొంది. కమల్ హాసన్ బ్లాక్‌బస్టర్ హిట్ 'విక్రమ్' క్లైమాక్స్‌లో కొన్ని నిమిషాల పాటు 'రోలెక్స్'గా కనిపించి సూర్య చేసిన విధ్వంసం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ క్యారెక్టర్ సృష్టించిన ఇంపాక్ట్ ఆధారంగా లోకేష్ కనగరాజ్ ఒక స్టాండ్‌అలోన్ ‘రోలెక్స్’ సినిమా తీయాలని ప్లాన్ చేశారు. సరిగ్గా ఈ వైలెంట్ యాక్షన్ డ్రామానే సూర్య 50వ ప్రాజెక్ట్‌గా పట్టాలెక్కించేందుకు లోకేష్ స్క్రిప్ట్ పనులను ముమ్మరం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సూర్య చేతిలో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లు లైన్‌లో ఉన్నాయి. జితు మాధవన్ కాంబినేషన్‌లో వస్తున్న 'సూర్య 47', అలాగే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'సూర్య 48' పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటి తర్వాత హెచ్. వినోద్‌తో 'సూర్య 49' ప్రకటన రానుంది. వీటిన్నింటినీ పూర్తి చేసిన వెంటనే లోకేష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. లోకేష్ కనగరాజ్ కూడా తన ప్రణాళికలను వేగవంతం చేస్తున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో భాగమైన ఈ 'రోలెక్స్' చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో ఆవిష్కరించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ ల్యాండ్‌మార్క్ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అవ్వడంతో మెగా అభిమానులతో పాటు యాక్షన్ లవర్స్ ఖుషీ అవుతున్నారు. సూర్య-లోకేష్ కాంబోలో రాబోయే ఈ వైలెంట్ అండ్ క్లాసీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.       [Suriya 50, Lokesh Kanagaraj, Rolex Standalone Movie, Suriya Upcoming Movies, LCU Movie Updates]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
నేటి ఆధునిక డిజిటల్ యుగంలో చిన్న పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఇంట్లో పిల్లలు ఏడుపు ఆపడానికైనా, రచ్చ చేయకుండా సమయానికి అన్నం తినిపించడానికైనా చాలామంది తల్లిదండ్రులు వెంటనే సులువైన మార్గంగా తమ చేతిలోని స్మార్ట్‌ఫోన్ తీసి పిల్లల చేతిలో పెట్టడం లేదా టీవీలో కలర్‌ఫుల్ కార్టూన్లు పెట్టడం సర్వసాధారణమైన అలవాటుగా మారిపోయింది. కానీ, ఈ అలవాటు మీ పిల్లల భవిష్యత్తును తీవ్రమైన ప్రమాదంలోకి నెడుతోందని పిల్లల వైద్య నిపుణులు మరియు తాజా అధ్యయనాలు స్పష్టమైన హెచ్చరికలు చేస్తున్నాయి. ముఖ్యంగా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లల్లో అధికంగా ఉండే ఈ స్క్రీన్ టైమ్ వారి శారీరక, మానసిక వికాసంపై అత్యంత ప్రతికూల ప్రభావం చూపుతోందని నూతన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ అధ్యయనం ప్రకారం చిన్నతనంలో పిల్లలు అధికంగా డిజిటల్ స్క్రీన్లు చూడటం వల్ల కలిగే ప్రధాన నష్టాల్లో మొదటిది మాటలు రావడం తీవ్రంగా ఆలస్యం కావడం. సాధారణంగా 0 నుండి 6 ఏళ్ల వయస్సులో పిల్లలు తమ చుట్టూ ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాట్లాడే మాటలు, వారి ముఖ కవళికలు మరియు హావభావాలను నిశితంగా గమనిస్తూ సహజంగా భాషను నేర్చుకుంటారు. అయితే నిరంతరం స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్ డిస్‌ప్లే వైపే చూస్తుండటం వల్ల అక్కడ కేవలం ఏకపక్ష సమాచారం మాత్రమే జరుగుతుంది. దీనివల్ల సంభాషణ కొరవడి, పిల్లల్లో సకాలంలో మాటలు రాకపోవడం మరియు భాషా నైపుణ్యాలు పూర్తిగా లోపించడం జరుగుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరొక తీవ్రమైన సమస్య పిల్లల మానసిక వికాసం మందగించడం మరియు శ్రద్ధ లోపించడం. నిరంతరం డిజిటల్ స్క్రీన్ల చిత్ర విచిత్రమైన వెలుగులు చూడటం వల్ల పిల్లల మెదడు అభివృద్ధి వేగం తగ్గుతుంది. వారు ఏ ఒక చిన్న విషయంపైనా ఎక్కువ సేపు దృష్టి కేంద్రీకరించలేరు. అంతేకాకుండా, వారి చేతిలో ఉన్న ఫోన్‌ను అనుకోకుండా లాక్కుంటే విపరీతమైన కోపం ప్రదర్శించడం, చిరాకు పడటం, గట్టిగా ఏడవడం మరియు మొండితనం చూపించడం వంటి మానసిక వైపరీత్యాలకు గురవుతున్నారు. దీంతో పాటు డిజిటల్ சாதனాల నుండి వెలువడే ప్రమాదకర నీలి కాంతి (Blue Light) పిల్లల లేత కంటి చూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. చాలా చిన్న వయస్సులోనే సైట్ రావడం, కళ్లు పొడిబారడం వంటి తీవ్రమైన శారీరక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నీలి కాంతి మెదడులో నిద్రకు సహకరించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని భారీగా తగ్గిస్తుంది, దీనివల్ల పిల్లలు రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రపోక తీవ్ర నిద్రలేమితో బాధపడుతున్నారు. బయటకు వెళ్లకుండా, ఆటలు ఆడకుండా ఒకే చోట గంటల తరబడి కూర్చుని ఫోన్ చూడటం వల్ల 6 ఏళ్ల లోపు పిల్లల్లో ఊబకాయం మరియు శారీరక బలహీనత వంటి సమస్యలు రాపిడ్‌గా పెరుగుతున్నాయి.       smartphone dangers toddlers study,speech delay kids screen time.
ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న శరీర బరువు, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే మొండి కొవ్వు ప్రతి ఒక్కరినీ తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్య. ఈ జిడ్డు కొవ్వును కరిగించుకోవడానికి, బరువు తగ్గి సన్నబడటానికి చాలామంది ఎన్నో రకాల వ్యాయామాలు, కఠినమైన డైటింగ్ పద్ధతులు అనుసరిస్తుంటారు. అయితే, అతి సులువైన మరియు ప్రాచుర్యం పొందిన గృహ చిట్కాలలో బ్లాక్ కాఫీ తాగడం ఒకటిగా మారింది. పాలు, చక్కెర మరియు ఎటువంటి స్వీట్నర్లు లేకుండా కేవలం వేడి నీటితో మాత్రమే తయారుచేసే ఈ బ్లాక్ కాఫీ నిజంగానే పొట్ట కొవ్వును కరిగించడంలో ఎంతవరకు సహాయపడుతుంది, దీని వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ రహస్యాలు ఏమిటి మరియు ఇది తాగేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన ఆరోగ్య నియమాలు ఏమిటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. అసలు బ్లాక్ కాఫీ బరువు తగ్గించడంలో ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే అందులోని కేలరీలు మరియు కెఫిన్ పాత్రను తెలుసుకోవాలి. సాధారణ బ్లాక్ కాఫీలో కేలరీలు దాదాపు శూన్యం. మనం తాగే బ్లాక్ కాఫీలోని కెఫిన్ శరీరంలోని మెటబాలిజం రేటును లేదా జీవక్రియ వేగాన్ని గణనీయంగా పెంచుతుంది. మన జీవక్రియ వేగవంతం కావడం వల్ల శరీరం విశ్రాంతిగా ఉన్న సమయంలో లేదా సాధారణ పనులు చేసుకుంటున్నప్పుడు కూడా ఎక్కువ కేలరీలను వేగంగా బర్న్ చేయగలుగుతుంది. ఇది బరువు తగ్గడానికి ప్రాథమిక పునాదిగా పనిచేస్తుంది. దీనికితోడు, బ్లాక్ కాఫీలో 'క్లోరోజెనిక్ ఆసిడ్' అనే అత్యంత శక్తివంతమైన ముఖ్యాంశ కాంపౌండ్ లభిస్తుంది. ఈ క్లోరోజెనిక్ ఆసిడ్ శరీరంలో కొత్తగా గ్లూకోజ్ ఉత్పత్తి కాకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరం కొత్తగా కొవ్వును తయారు చేసుకోకుండా అడ్డుకోవడమే కాకుండా, ఇప్పటికే కణజాలాల్లో పేరుకుపోయిన పాత కొవ్వును వేగంగా కరిగించి శక్తిగా మార్చడంలో ఇది అద్భుతంగా తోడ్పడుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో బ్లాక్ కాఫీ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆకలిని సమర్థవంతంగా నియంత్రించడం. బ్లాక్ కాఫీ తాగిన వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అకస్మాత్తుగా వచ్చే ఆకలి కోరికలను తగ్గిస్తుంది మరియు సమయానికి మించి ఆహారాన్ని అమితంగా తినకుండా అరికడుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో అన్-హెల్దీ స్నాక్స్ తినే అలవాటు ఉన్నవారు, ఆ సమయంలో ఒక కప్పు బ్లాక్ కాఫీ తీసుకుంటే కేలరీల వినియోగం చాలావరకు తగ్గుతుంది. అంతేకాకుండా, మీరు వ్యాయామం లేదా జిమ్ వర్కౌట్ చేయడానికి సరిగ్గా 30 నిమిషాల ముందు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి మరియు అదనపు స్టామినా లభిస్తాయి. ఇది వ్యాయామం చేసే సమయంలో కండరాల అలసటను తగ్గించి, శరీరం వేగంగా కొవ్వును బర్న్ చేసేలా ప్రోత్సహిస్తుంది.       does black coffee burn belly fat,black coffee health benefits telugu.  
  మనదేశంలో చాలామందికి ఉదయాన్నే లేవగానే వేడివేడిగా ఒక కప్పు టీ పడాల్సిందే. అలసటను పారద్రోలి శరీరానికి, మనస్సుకు తక్షణ ఉత్సాహాన్ని ఇవ్వడంలో టీ కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు ఒకటి రెండు కప్పుల టీ తాగడం సాధారణ అలవాటు అయినప్పటికీ, చాలామంది రోజులో పదే పదే టీ తాగుతుంటారు. అయితే, ఇలా పరిమితికి మించి ఎక్కువ మొత్తంలో టీ తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయని, శరీరంలో కాల్షియం స్థాయిలు గణనీయంగా పడిపోతాయని సోషల్ మీడియాలో నిరంతరం వార్తలు ప్రచారమవుతుంటాయి. ఈ ప్రచారం వినగానే టీ ప్రేమికుల్లో తీవ్ర ఆందోళన మొదలవుతుంది. అసలు టీ తాగడానికి, ఎముకల ఆరోగ్యానికి మధ్య ఉన్న అసలు సంబంధం ఏమిటి? అతిగా టీ తాగడం వల్ల ఎముకల సాంద్రత తగ్గి ఆస్టియోపోరోసిస్ వంటి ప్రమాదకర సమస్యలు వస్తాయా? ఈ విషయాలపై వైద్య నిపుణులు మరియు పరిశోధకులు వెల్లడించిన శాస్త్రీయ నిజాలను వివరంగా తెలుసుకోవడం ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. పరిశోధనల ప్రకారం టీలో  కెఫిన్  అనే సమ్మేళనం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ప్రతి కప్పు టీలో దాదాపు 30 నుండి 50 మిల్లీగ్రాముల వరకు కెఫిన్ ఉంటుంది. మనం అధిక మొత్తంలో కెఫిన్ తీసుకున్నప్పుడు, అది మూత్రపిండాల (కిడ్నీల) ద్వారా శరీరంలోని కాల్షియం మూత్రం రూపంలో బయటకు విసర్జించబడేలా చేస్తుంది. సాధారణంగా మనం ప్రతి 60 మిల్లీగ్రాముల కెఫిన్ తీసుకున్నప్పుడు, శరీరం నుండి సుమారు 1 నుండి 2 మిల్లీగ్రాముల కాల్షియం నష్టపోతామని వైద్య అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే రోజుకు 4 నుండి 5 కప్పుల కంటే ఎక్కువ మోతాదులో టీ తాగే వారిలో కాల్షియం లోపం ఏర్పడే అవకాశాలు స్వల్పంగా పెరుగుతాయి. ముఖ్యంగా, మనం తీసుకునే రోజువారీ ఆహారంలో కాల్షియం శాతం తక్కువగా ఉన్నప్పుడు, ఈ కెఫిన్ ప్రభావం ఎముకల ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఎముకల నుండి కాల్షియం కరిగిపోవడం వల్ల వయసు పెరిగే కొద్దీ ఎముకలు లొసుగుబారి, త్వరగా విరిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే ఇక్కడే మరొక ఆసక్తికరమైన సైంటిఫిక్ కోణం దాగి ఉంది. టీలో కేవలం కెఫిన్ మాత్రమే కాకుండా  ఫ్లేవనాయిడ్లు  (Flavonoids) మరియు  ఫైటోఈస్ట్రోజెన్లు  అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల క్షీణతను అడ్డుకోవడంలో మరియు ఎముకల సాంద్రతను (Bone Mineral Density) మెరుగుపరచడంలో ఎంతో సాయపడతాయి. ముఖ్యంగా గ్రీన్ టీ మరియు బ్లాక్ టీలలో ఉండే పాలిఫెనాల్స్ అనే కాంపౌండ్లు ఎముకలను పునర్నిర్మించే  ఆస్టియోబ్లాస్ట్  కణాల పనితీరును వేగవంతం చేస్తాయని, అదే సమయంలో ఎముకలను కరిగించే  ఆస్టియోక్లాస్ట్  కణాల చర్యలను అదుపు చేస్తాయని రీసెర్చ్‌లో తేలింది. కాబట్టి మిితంగా అంటే రోజుకు 2 నుండి 3 కప్పుల టీ తాగే వారిలో ఎముకలు బలహీనపడటం అటుంచి, పైగా ఎముకల ఆరోగ్యం మరింత బలపడుతుందని బహుళ అధ్యయనాలు నిరూపించాయి. మరి టీ తాగే అలవాటు ఉన్నవారు ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటిది టీ తాగే పరిమాణాన్ని రోజుకు 2 లేదా 3 కప్పులకు పరిమితం చేసుకోవడం చాలా మంచిది. రెండవది, టీ చేసేటప్పుడు అందులో తగినంత పాలు ఉపయోగించడం వల్ల, టీ ద్వారా కోల్పోయే స్వల్ప కాల్షియంను పాలలోని ఉత్కృష్టమైన కాల్షియం భర్తీ చేస్తుంది. భోజనం చేసిన వెంటనే లేదా ఐరన్, కాల్షియం సప్లిమెంట్లు తీసుకునే సమయంలో టీ తాగకపోవడం ఉత్తమం, ఎందుకంటే టీలోని టాన్సిన్లు పోషకాల శోషణను అడ్డుకుంటాయి. మీ రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు, ఆకుకూరలు, రాగులు మరియు విటమిన్ డి లభించే పదార్థాలను సమృద్ధిగా చేర్చుకుంటే టీ వల్ల ఎముకలకు ఎలాంటి నష్టం జరగదు. కాబట్టి టీని పరిమితంగా, సరైన పద్ధతిలో ఆస్వాదిస్తే ఆరోగ్యానికి ఎలాంటి భయం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. How much tea is safe for bones,tea and bone health myths vs reality.
  అల్లం అనేది మన ప్రాచీన వంటకాల్లోనూ, ఆయుర్వేదంలోనూ ఎంతో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్న ఒక సహజమైన ఔషధం. అజీర్ణం గా ఉన్నప్పుడు, వాంతులు అవుతున్నప్పుడు, దగ్గు, జలుబు లాంటి సమస్యలు ఎదురైనప్పుడు అల్లాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఇక వంటింట్లో కూరల్లోనూ, మసాలా తయారీలోనూ అల్లాన్ని వాడుతుంటారు. ఇలా కాకుండా  ప్రతిరోజూ ఒక చిన్న అల్లం ముక్కను నమిలి మింగడం అలవాటు చేసుకుంటే  ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే విషయంపై ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అవేంటో తెలుసుకుంటే..  అల్లం ప్రభావం..  వరసగా రెండు నెలలు, అంటే అరవై రోజుల పాటు రోజూ క్రమం తప్పకుండా ఒక చిన్న అల్లం ముక్కను నమలడం వల్ల మన శరీరంలో శ్వాసకోశ వ్యవస్థ నుండి జీర్ణవ్యవస్థ వరకు అనేక సానుకూల మార్పులు కనిపిస్తాయి. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం , ఉపశమనం.. రోజు ఒక చిన్న అల్లం ముక్క నమలడం వల్ల గొంతులో ఏర్పడే అసౌకర్యం, మంట క్రమంగా తగ్గుతాయి. ఊపిరితిత్తులకు వెళ్లే గాలి మార్గాలను ఇది సడలించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. సుమారు ఆరు నుండి ఎనిమిది వారాల పాటు ఈ అలవాటును కొనసాగించడం వల్ల దగ్గు తీవ్రత గణనీయంగా తగ్గుతుంది.  గాలిలో దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల గొంతు , శ్వాసనాళాల్లో కలిగే మంటను అల్లం తగ్గిస్తుంది. అల్లంలోని సహజ సిద్ధమైన వేడి చేసే గుణం ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని లేదా శ్లేష్మాన్ని పలచబడేలా చేస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తుల నుండి కఫం సులువుగా బయటకు వచ్చేస్తుంది. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, రొంప, , చిన్న శ్వాస సమస్యల నుండి ఇది ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఆస్తమా లేదా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు అల్లాన్ని  కేవలం  ఒక సహాయక పదార్థంగా మాత్రమే ఉపయోగించాలి తప్ప, వైద్యులు సూచించిన మందులకు ప్రత్యామ్నాయంగా తీసుకోకూడదు. జీర్ణవ్యవస్థ మెరుగుదల.. రోజువారీ ఆహారంలో అల్లాన్ని భాగం చేసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఎవరికి మంచిది కాదు?  అల్లం నమలడం చాలా మంచిదే అయినప్పటికీ, కొందరి విషయంలో ఇది ప్రతికూల ప్రభావాలను చూపవచ్చు. అల్లాన్ని పరిమితికి మించి ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే నోటిలో మంట లేదా పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. సున్నితమైన జీర్ణాశయం ఉన్నవారికి లేదా కడుపులో మంట, ఆసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిటిస్ ఉన్నవారికి రోజూ పచ్చి అల్లం నమలడం వల్ల కడుపులో అసౌకర్యం పెరగవచ్చు. రక్త ప్రసరణను పలచబరిచే మందులు  వాడేవారు కూడా అల్లాన్ని అధికంగా తీసుకోకూడదు, ఎందుకంటే అల్లానికి కూడా రక్తాన్ని పలచబరిచే స్వభావం కొంతవరకు ఉంటుంది. తీసుకోవాల్సిన పరిమాణం , జాగ్రత్తలు..  అల్లం ఆరోగ్యానికి మంచిదే అయినా తీసుకోవలసిన పరిమాణం చాలా ముఖ్యం. మన బొటనవేలి పరిమాణంలో ఉన్న ఒక చిన్న అల్లం ముక్క లేదా రెండు చిన్న పలచటి ముక్కలు సరిపోతాయి. ఒకవేళ పచ్చి అల్లం నమలడం వల్ల కడుపులో మంటగా అనిపిస్తే, దానిని నేరుగా నమలకుండా గోరువెచ్చని నీటిలో అల్లం రసం లేదా అల్లం ముక్కలు వేసి మరిగించి ఆ నీటిని తాగడం మంచిది. అల్లం అనేది శారీరక ఆరోగ్యానికి మేలు చేసే   ఒక మంచి ఆహార పదార్థం మాత్రమే గానీ, ఏ రోగానికీ పూర్తి స్థాయి చికిత్స లేదా నివారణ కాదు. తరచూ ఆయాసం రావడం, ఎడతెగని తీవ్రమైన దగ్గు ఉండటం, లేదా గుండెలో  నొప్పి వంటివి  ఉన్నట్లయితే, అల్లంపై మాత్రమే ఆధారపడకుండా వెంటనే  వైద్యులను కలిసి సరైన పరీక్షలు చేయించుకోవాలి.                             *రూపశ్రీ.  
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం. ట్రికట చూర్ణం, ధనియాల పొడి, పసుపు పొడి వంటి మూడు పదార్థాలను సరైన మోతాదులో ఎలా కలపాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? రోజులో ఏ సమయంలో తీసుకుంటే మంచిది? వంటి విషయాలను ఈ వీడియోలో సులభంగా వివరించారు. థైరాయిడ్‌కు సంబంధించిన సమస్యల్లో ఇంటి చిట్కాలను పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. ఇప్పటికే థైరాయిడ్ మందులు వాడుతున్నవారు వైద్యుల సూచన లేకుండా మందులను ఆపకండి లేదా మార్చకండి. థైరాయిడ్ ఆరోగ్యం, ఆయుర్వేద చిట్కాలు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health‌ను ఫాలో అవ్వండి. Disclaimer: ఈ వీడియోలోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు.