Home

»

Latest News

షాకింగ్ న్యూస్: ప్రముఖ సింగర్ మరణం.. కుళ్ళిన స్థితిలో బాడీ

Sep 4, 2026 5:57PM

 

సింగర్ గా, గేయరచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బల్జీత్ సింగ్  తన నివాసంలో శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. పంజాబ్‌లోని లుధియానా జిల్లా పరిధిలో గల సుధార్ పట్టి ధాలివాల్ ఏరియాలో బల్జీత్ సింగ్ నివసిస్తున్నాడు. ఇటీవల ఆయన తల్లిదండ్రులు మరణించడంతో ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. అయితే కొన్ని రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడం, కుటుంబ సభ్యులకు కానీ, స్నేహితులకు కానీ అందుబాటులోకి రాకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

గురువారం ఉదయం ఆయన ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడం గమనించిన స్థానికులు స్థానిక పోలీసులకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీస్ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. ఇంటి తలుపులు తెరిచి చూడగా మంచంపై బల్జీత్ సింగ్ మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. మరణించి దాదాపు 4 నుండి 5 రోజులు అయి ఉండవచ్చని నిరాదరించారు. మృతదేహం పూర్తిగా పాడవడంతో పాటు ఇంటి ప్రాంగణంలో కొన్ని రక్తపు మరకలు  కనిపించడంతో ఈ మృతి వెనుక ఏదైనా కుట్ర లేదా అనుమానాస్పద కోణం ఉందా అనే చర్చ నడిచింది.

Also Read: వాళ్ళకోసమే ఓటిటిలు: శివాజీ సంచలన వ్యాఖ్యలు  

 

 

దీంతో పోలీసులు వెంటనే ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్, సీఐఏ బృందాలను పిలిపించి క్లూస్ సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సివిల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షల నివేదిక ఆధారంగా SHO కుల్విందర్ సింగ్ కీలక విషయాలను వెల్లడించారు. బల్జీత్ సింగ్ గుండెపోటు (హార్ట్ ఎటాక్) కారణంతోనే మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. దీంతో  ఆయన మృతిలో ఎలాంటి కుట్ర గానీ, హత్య కోణం గానీ లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బల్జీత్ సింగ్ కి పెళ్లి కాలేదు. వయసు 35 ఏళ్ళు .

 

 

[Baljit Singh,  Punjabi singer Baljit Singh, Heart Attack, TeluguCinema, Tollywood, TeluguCinemaNews, Teluguone, TollywoodNews]
  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com