
శివాజీ సెల్యులాయిడ్ పై పెర్ఫార్మ్ చేస్తుంటే మనకి కూడా అర్జెంటుగా నటుడు కావాలని అనిపిస్తుంది. అంతలా మెస్మరైజ్ చేసే పెర్ఫార్మ్ శివాజీ సొంతం. సెకండ్ ఇన్నింగ్స్ లో సరికొత్త డైలాగ్ మాడ్యులేషన్ తో దూసుకుపోతున్న శివాజీ ఈ నెల 11 న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన 'ఎపిక్' తో మరో సారి సెల్యులాయిడ్ పై సందడి చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో ఓటిటి లపై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
శివాజీ మాట్లాడుతు ఓటీటీలు కేవలం సోమరిపోతుల కోసమేనని, అవి థియేటర్లలో లభించే అసలైన సినిమాటిక్ అనుభవాన్ని హరించివేస్తున్నాయి. సినిమా అంటే కేవలం ఒక కథని చూడటం మాత్రమే కాదు. పెద్ద స్క్రీన్, శక్తివంతమైన సౌండ్ సిస్టమ్, పక్కనున్న వందలాది మంది ప్రేక్షకుల రెస్పాన్స్, థియేటర్ వాతావరణం అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన ఎనర్జీని ఇస్తాయి.ఇంట్లో టీవీలు లేదా మొబైల్ ఫోన్లలో పాజ్ చేసుకుంటూ సినిమాలు చూస్తే ఆ అసలైన అనుభూతి దక్కదని చెప్పుకొచ్చాడు.
Also read: హఠాత్తుగా విజయ్ లండన్ ప్రయాణం.. ఆమెతో రాజీ కోసమా, లేక!

శివాజీ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం ప్రేక్షకులు శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తూ, బిగ్ స్క్రీన్ అనుభవాన్ని కాపాడుకోవాలనే ఆవేదనతోనే ఆయన అలా మాట్లాడారని అంటుంటే, మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. పెరిగిన టికెట్ ధరలు, పాప్‌కార్న్ రేట్లు మరియు కుటుంబంతో థియేటర్‌కు వెళ్తే అయ్యే ఖర్చుల వల్ల సామాన్యులు ఓటీటీలను ఆశ్రయిస్తున్నారని, అలాంటి వారిని సోమరిపోతులు అనడం సరికాదని నెటిజన్లు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు.
[Sivaji, Epic movie promotions, ott, TeluguCinema, Tollywood, TeluguCinemaNews, Teluguone, TollywoodNews]





