LATEST NEWS
  టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ లైన్‌కు కట్టుబడి ఉన్నానని, భవిష్యత్తులో కూడా అదే విధంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలను శిరసావహిస్తూ పనిచేస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైన సందర్భంగా అక్కడ పలువురు రాజకీయ నాయకులు ఉన్నారని, ఆ సమయంలో వైసీపీ నేత అంబటి రాంబాబు తన వద్దకు వచ్చి పలకరించారని చెప్పారు.  మర్యాదపూర్వకంగా జరిగిన ఆ పలకరింపునే కొందరు వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటనను ఆధారంగా చేసుకుని తనపై విపరీతంగా ట్రోలింగ్ జరిగిందని, తన వ్యాఖ్యలను కూడా సందర్భానికి భిన్నంగా ప్రచారం చేశారని బోండా ఉమ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా భవిష్యత్తు లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తానని తెలిపారు. ఈ అంశంపై పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు ఇప్పటికే తన వివరణ ఇచ్చినట్లు వెల్లడించిన బోండా ఉమ, పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. పార్టీ క్రమశిక్షణకు తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని మరోసారి స్పష్టం చేశారు.   TDP MLA Uma, CM Chandrababu, TDP, Naralokesh, Mudragada Padmanabham, Social media,  Ambati Rambabu
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యవహారం  కలకలం రేపుతోంది.  ఇటీవల జరిగిన  ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో వైసీపీనాయకులతో కలిసి వేదిక పంచుకోవడం, అక్కడ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో బోండా ఉమా నుంచి వివరణ కోరింది. ఈ విషయంపై సీనియర్ జర్నలిస్టు కృష్ణాంజనేయులు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బోండా వైఖరిని చూస్తుంటే ఆయన తెలుగుదేశం కు గుడ్ బై చెప్పడానికి డిసైడైనట్లే కనిపిస్తోందన్నారు.  కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో పాల్గొన్న బోండా ఉమా, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడమే కాకుండా,  విజయవాడలో ముద్రగడ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఎమ్మెల్యే హోదాలో అక్కడ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్న నాయకులతో కలిసి బోండా ఉమా ఒకే వేదికపైకి రావడం రాజకీయ చర్చకు తావిచ్చింది. బోండా తీరుపై తెలుగుదేశం అధినేత సీరియస్ అయ్యారు.   పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణాంజనేయులు.. బోండా వ్యవహారం కేవలం ముద్రగడ సంస్మరణ లో వైసీపీ నేతలతో వేదిక పంచుకోవడానికి మించి రాజకీయ వ్యూహం ఉందని అన్నారు.   కూటమి ప్రభుత్వంలో మొదటి విడత మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న బోండా ఉమ ఆ అసంతృప్తిని ఇలా వ్యక్తం చేయడమే కాకుండా.. పార్టీని వీడతానని సంకేతాలు ఇవ్వడం ద్వారా అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావడానికి చూస్తున్నారనీ, అయితే గతంలో ఇటువంటి ఒత్తిడులకు చంద్రబాబు లొంగి ఉండొచ్చు కానీ, ఇప్పుడా పరిస్థితి లేదని కృష్ణాంజనేయులు అన్నారు. అందుకే ఒక వేళ ఒత్తిడికి చంద్రబాబు లొంగకుంటే..   తన భవిష్యత్ రాజకీయ అడుగుల ఎటు వేయాలన్న   నిర్ణయానికి బోండా ఉమ ఇప్పటికే  వచ్చేసి ఉంటారని కృష్ణాంజనేయులు అన్నారు.  కూటమి రాజకీయంలో సామాజిక వర్గాల సమతుల్యత కూడా ఈ వివాదానికి ఒక కారణమని పేర్కొన్నారు.  జనసేన పార్టీతో పొత్తు ఉన్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో టీడీపీ పరిమితులు ఎదుర్కొంటోందనీ,  దీనిని ఆసరాగా చేసుకుని విపక్షాలు టీడీపీలోని అసంతృప్త కాపు నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్రయత్నంలో వైసీపీ వలకు బోండా ఉమ చిక్కారని కృష్ణాంజనేయులు విశ్లేషించారు.     Bonda Uma, Telugu Desam Party, Vijayawada Politics, Ambati Rambabu, Andhra Pradesh News  
ఏపీ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్  చేస్తున్న ఆరోపణలపై జై భీమ్ భారత్ పార్టీ అధినేత,  న్యాయవాది జడ శ్రావణ్ కుమార్  మండిపడ్డారు. ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా ప్రభుత్వంపై బురద చల్లడం వైసీపీకే నష్టమన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడానికి ముందు కనీస రుజువులు చూపించాలని సవాల్ విసిరారు. కేంద్రంలో జరిగిన నీట్   పరీక్షా పత్రాల లీకేజీకి, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన డీఎస్సీ నియామకాలకు చాలా వ్యత్యాసం ఉందన్న జడ శ్రవణ్ కుమార్, నీట్ విషయంలో పేపర్ లీకైనట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్వయంగా అంగీకరించిందనీ,   ఏపీ డీఎస్సీ విషయంలో కేవలం అనుమానాలు తప్ప ఎలాంటి ఆధారాలూ లేవని పేర్కొన్నారు.  హైకోర్టులో వైఎస్సార్‌సీపీ వేసిన పిటిషన్‌ను కూడా ఆధారాలు లేకపోవడంతో కోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు.  డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు.  వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క సరైన డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయారనిఎద్దేవా చేసిన ఆయన.. . ఆ నాడు ఇచ్చిందల్లా 6 వేల ఒక వంద  పోస్టుల నోటిఫికేషన్ మాత్రమేననీ, అందులో కూడా 2వేల గిరిజన ప్రాంత పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా కలిపారని విమర్శించారు. దానికి నిరసనగా తాము హైకోర్టుకు వెళ్లి ఆ నిర్ణయాన్ని సవాలు చేసి, ఆ పోస్టులను మినహాయించేలా ఉత్తర్వులు తెచ్చామని గుర్తుచేశారు. అదే సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపట్టిన 16 వేల పోస్టుల డీఎస్సీలోనూ గిరిజన ప్రాంతాలకు సంబంధించిన 2వేల 800 పోస్టులను కలపడంపై తాము న్యాయపోరాటం చేస్తున్నామన్న జడ శ్రవణ్ కుమార్..  ఏ ప్రభుత్వం తప్పు చేసినా ప్రశ్నించడం తమ నైజమని, అయితే ఏ విమర్శ చేసినా ప్రాథమిక ఆధారాలు ఉండాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు వైఎస్సార్‌సీపీకి ఉందని, అయితే ఆధారాలు లేకుండా మంత్రి రాజీనామా కోరడం కేవలం పొలిటికల్ స్టంట్ మాత్రమే అవుతుందని శ్రావణ్ కుమార్ ముగించారు. భవిష్యత్తులో ప్రజల్లో విశ్వసనీయత కోల్పోకుండా ఉండాలంటే, గాలిలో ఆరోపణలు చేయడం మానుకొని ఆధారాలతో మాట్లాడాలని వైఎస్ జగన్‌కు హితవు పలికారు. YS Jagan Mohan Reddy, Nara Lokesh DSC, AP DSC Recruitment, TeluguOne,  AP Politics
ALSO ON TELUGUONE N E W S
సినిమా జగత్తులో కొన్ని కథలు భారీ యాక్షన్, హంగులతో ప్రేక్షకులను అలరిస్తే, మరికొన్ని చిత్రాలు మాత్రం మనసును తాకే నిశ్శబ్ద ఎమోషన్లతో గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాయి. ప్రముఖ నటి మధుబాల, విలక్షణ నటుడు ఇంద్రన్స్ ప్రధాన పాత్రలలో నటించిన 'చిన్న చిన్న ఆశై' చిత్రం కూడా సరిగ్గా అలాంటి ఒక విభిన్నమైన ప్రయత్నమే. వర్షా వాసుదేవ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ అనుభూతుల కావ్యం ఈ ఏడాది జూన్ 19వ తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత జులై 28వ తేదీ నుంచి డిజిటల్ దిగ్గజం జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌పై తమిళం, మలయాళంతో పాటు తెలుగు భాషలోనూ డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. గతంలో మధుబాల కథానాయికగా నటించిన ఆల్‌టైమ్ క్లాసిక్ 'రోజా' సినిమాలోని ఐకానిక్ పాట ఆధారంగా ఈ టైటిల్ నిర్ణయించడం మూవీ ప్రేమికులలో మొదటి నుంచే ఎంతో ఆసక్తిని, ప్రాధాన్యతను రేకెత్తించింది. ఈ కథ అంతా ఆధ్యాత్మిక నగరమైన వారణాసి నేపథ్యంలో, కేవలం ఒకే ఒక్క రోజు వ్యవధిలో సాగుతుంది. కేరళకు చెందిన మాధవన్ మాస్టారు (ఇంద్రన్స్) తన కూతురు జానకి (అపర్ణ బాలమురళి)ని చూడటానికి వారణాసి వస్తాడు. జానకి అక్కడ శాస్త్రీయ నృత్యం అభ్యసిస్తూ ఉంటుంది. అదే సమయంలో తంజావూరు నుంచి ఒక సాంస్కృతిక బృందంతో కలిసి వారణాసి వచ్చిన లీల (మధుబాల) అనే మహిళ అనుకోకుండా దొంగతనం బారిన పడుతుంది. దొంగ ఆమె సెల్ ఫోన్ మరియు పర్స్ కాజేయడంతో, అతనిని వెంబడించే క్రమంలో తన టీమ్ నుంచి విడిపోయి, భయంతో ఒంటరిగా మిగిలిపోతుంది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మాధవన్ ఆమెకు ధైర్యాన్ని చెప్పి, తప్పిపోయిన వారి సమాచార కేంద్రంలో ఫిర్యాదు నమోదు చేయిస్తాడు. మాధవన్ ఇచ్చిన భరోసాతో కోలుకున్న లీల తన గతాన్ని, భావాలను అతనితో పంచుకుంటుంది. మాధవన్ కూడా తన భార్య శాశ్వతంగా దూరమైపోయిన తీరును, తన జీవితంలో నిండిన ఒంటరితనాన్ని వివరిస్తాడు. లీలకు వారణాసి నగరాన్ని చూడాలనే కోరిక ఉండటంతో, మాధవన్ ఆమెను వెంటబెట్టుకుని ఆ పవిత్ర ప్రదేశాలను చూపిస్తాడు. ఈ ప్రయాణంలో వేదాంతం, వైరాగ్యం నిండిన దృశ్యాల మధ్య వీరిద్దరూ తమ జీవిత గాయాలను పంచుకుంటారు. జీవితంలో దెబ్బతిని, ఒంటరిగా మిగిలిన ఇద్దరు మనుషులు అనుకోకుండా కలిసినప్పుడు, వారి చిన్న చిన్న ఆశలు ఎలాంటి ఊరటను ఇచ్చాయనేది దర్శకురాలు వర్షా వాసుదేవ్ ఎంతో ఆత్మీయంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటుడు ఇంద్రన్స్ తన సహజ నటనతో అలరించగా, గోవింద్ వసంత అందించిన నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం సన్నివేశాలకు ప్రాణం పోశాయి. అపర్ణ బాలమురళిపై చిత్రీకరించిన పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే, ఫీల్ గుడ్ ఎమోషన్స్ కోసం కేటాయించిన సమయం కాస్త ఎక్కువ కావడంతో కథనం నిదానంగా సాగిన భావన కలుగుతుంది. అంతేకాకుండా మధుబాల పాత్ర రూపకల్పనలో కొంత అయోమయం నెలకొనడం ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తుంది. నిదానంగా సాగే మానవీయ సంబంధాల కథలను, హృదయాన్ని హత్తుకునే క్లైమాక్స్ ట్విస్ట్‌లను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుంది.
టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న కథానాయకుడు దుల్కర్ సల్మాన్. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి వరుస క్లాసిక్ విజయాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ఈ పాన్ ఇండియా స్టార్, ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్ 'శ్రీశ్రీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ అత్యున్నత నిర్మాణ విలువల బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు రవి నేలకుదితి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ మరియు భారీ హైప్‌ను క్రియేట్ చేయగా, తాజాగా ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో చిత్రబృందం ఒక ముందడుగు వేసింది. సినిమా విడుదల కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, మేకర్స్ 'బొమ్మ బొమ్మ' అనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసి గ్రాండ్‌గా మ్యూజికల్ ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు. ఈ రొమాంటిక్ మెలోడీ ట్రాక్ విడుదలైన నిమిషాల్లోనే శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. యువ సంగీత సంచలనం, ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ తనకంటూ ఉన్న ప్రత్యేకమైన శైలిలో అద్భుతమైన మెలోడీ మ్యాజిక్ క్రియేట్ చేశారు. వినగానే మైమరపించేలా సాగే ఈ ప్రేమ గీతం, మనసుని ఎంతగానో హత్తుకునేలా రూపుదిద్దుకుంది. ప్రసిద్ధ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం ఈ పాటలోని ప్రతి పదానికి ఒక కావ్యాలంటి సొగసును జోడించింది. ప్రేమికుల భావాలను అత్యంత సున్నితంగా, లోతుగా ఆవిష్కరించిన ఆయన కలం మేజిక్ అందరినీ కట్టిపడేస్తోంది. ఇక టాలెంటెడ్ సింగర్ కపిల్ కపిలన్ తన మంత్రముగ్ధులను చేసే గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశారు. ఆయన ఆలపించిన తీరు పాటలోని ఎమోషనల్ డెప్త్‌ను మరింత పెంచి, సంగీత ప్రియులకు ఒక అద్భుతమైన శ్రావ్యమైన అనుభూతిని అందిస్తోంది. పాట విజువల్స్ పరంగా చూస్తే, దుల్కర్ సల్మాన్ మరియు పూజా హెగ్డేల మధ్య ఉన్న ఫ్రెష్ కాంబినేషన్ మరియు రొమాంటిక్ కెమిస్ట్రీ ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. కథానాయకుడు దుల్కర్ సల్మాన్ మొదటిసారిగా పూజా హెగ్డేను చూసి ఫిదా అయిపోయే ఆ క్షణాన్ని దర్శకుడు ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా తెరకెక్కించారు. ఆ తొలి చూపుతో మొదలైన వారి ప్రయాణం, వారి మధ్య చోటుచేసుకున్న మధురమైన నవ్వులు, క్యూట్ ముచ్చట్లు, మర్చిపోలేని తీపి జ్ఞాపకాలను అత్యంత వర్ణరంజితంగా ఆవిష్కరించారు. తెరపై వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంటూ ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో ప్రత్యేకంగా మార్చింది. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య పండే లవ్ స్టోరీ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని ఈ పాట స్పష్టంగా నిరూపిస్తోంది. సాంకేతిక పరంగా ఈ పాట ఎంతో ఘనమైన క్వాలిటీతో అలరిస్తోంది. సినిమాటోగ్రఫీ అత్యంత రిచ్‌గా ఉంటూ, కనువిందు చేసే సుందరమైన లొకేషన్లలో ఈ పాటను పిక్చరైజ్ చేశారు. ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో చిత్రీకరించిన ప్రతీ విజువల్ ప్రేక్షకుల కళ్లను కట్టిపడేస్తోంది. ఆడియో మరియు వీడియో పరంగా అత్యున్నత ప్రమాణాలతో రూపొందిన ఈ 'బొమ్మ బొమ్మ' పాట రాబోయే రోజుల్లో అతిపెద్ద రొమాంటిక్ చార్ట్‌బస్టర్ హిట్‌గా నిలవడం ఖాయమని చిత్ర విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా సినిమాలు విడుదలయ్యే సమయానికి మాత్రమే ప్రమోషన్లు వేగవంతం చేస్తారు, కానీ 'శ్రీశ్రీ' చిత్రబృందం మాత్రం చాలా ముందుగానే ఈ రకమైన పవర్‌ఫుల్ ఫస్ట్ సింగిల్‌తో ప్రమోషన్ల హోరెత్తిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించింది. మొదటి పాటతోనే అత్యంత పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసి, పాన్ ఇండియా వ్యాప్తంగా ఆడియన్స్‌లో సినిమాపై ఉన్న ఆసక్తిని, క్యూరియాసిటీని ఒక్కసారిగా రెట్టింపు చేశారు. ఈ మ్యూజికల్ చార్ట్‌బస్టర్‌తో 'శ్రీశ్రీ' మూవీ విజయం దిశగా తొలి అడుగు వేసిందని చెప్పవచ్చు.   Srisri Movie, Dulquer Salmaan, Pooja Hegde, Bomma Bomma Song, GV Prakash Kumar, Tollywood Latest News
ప్రపంచ ప్రఖ్యాత పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ పేరు వినగానే 90ల కాలం నాటి మ్యూజిక్ మానియా, అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్ ప్రతి ఒక్కరి మదిలో మెదులుతాయి. తనదైన విశిష్టమైన గొంతు, ఐకానిక్ మూన్‌వాక్ డ్యాన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న మైఖేల్ జాక్సన్ 2009లో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన భౌతికంగా దూరమైనా, ఆయన అందించిన సంగీతం మరియు నృత్యం ఎప్పటికీ అమరమే. ఈ పాప్ లెజెండ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక బయోపిక్ చిత్రం 'మైఖేల్' (Michael). ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ అత్యంత ప్రతిభావంతంగా పోషించడం విశేషం. ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్స్‌పై విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను, సంగీత ప్రియులను అమితంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ బయోపిక్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన వసూళ్లు సినీ రంగాన్ని విస్మయానికి గురిచేశాయి. థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టుకున్న 'మైఖేల్' సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,000 కోట్ల రూపాయల భారీ కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టించింది. అంతేకాకుండా, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 1 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించిన తొలి హాలీవుడ్ బయోపిక్ మూవీగా చరిత్ర పుటల్లో నిలిచింది. మన భారతదేశంలో కూడా ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 54 కోట్ల రూపాయల మేర వసూళ్లను రాబట్టి హాలీవుడ్ బయోపిక్స్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. థియేటర్లలో ఈ ఊహించని విజయం తర్వాత, మూవీ లవర్స్ అంతా ఈ సంచలన చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత నెల జూన్ 9వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ ప్లస్, బుక్ మై షో వంటి ప్రముఖ డిజిటల్ వేదికలలో పే-పర్-వ్యూ లేదా అద్దె (Rent) ప్రాతిపదికన ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ చిత్రాన్ని ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగా ఓటీటీలో వీక్షించాలనుకునే వారి కోసం మేకర్స్ అద్భుతమైన శుభవార్త అందించారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney+ Hotstar) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఆగస్టు 29 నుంచి హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో 'మైఖేల్' చిత్రం అధికారికంగా స్ట్రీమింగ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాషలో కూడా వీక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ బయోపిక్ కథాంశం విషయానికి వస్తే, మైఖేల్ జాక్సన్ జీవితంలోని ఆసక్తికరమైన, భావోద్వేగభరిత ఘట్టాలను ఎంతో సహజంగా ఆవిష్కరించారు. అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఉన్న గ్యారీ అనే ఒక సాధారణ గ్రామంలో జన్మించిన మైఖేల్, తన తల్లి అందించిన ప్రోత్సాహంతో సోదరులతో కలసి 'జాక్సన్ 5' అనే మ్యూజిక్ బ్యాండ్‌ ద్వారా సంగీత ప్రయాణాన్ని ప్రారంభించాడు. అయితే, తండ్రి జోసెఫ్ జాక్సన్ (కోల్మన్ డొమింగో) ప్రదర్శించిన విపరీతమైన కఠిన వైఖరి, క్రూరత్వంతో కూడిన ప్రవర్తన మైకేల్‌ను చిన్నతనంలో తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది. ఆ బాల్యపు భయాలు, మానసిక గాయాల నీడలోనే పెరుగుతూ, తన ఒంటరితనంతో పోరాడుతూనే అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిన తీరు గుండెలను పిండేస్తుంది. పోగొట్టుకున్న తన బాల్యాన్ని వెతుక్కుంటూ ఆయన నిర్మించుకున్న కలల ప్రపంచం 'నెవర్ ల్యాండ్' వెనుక ఉన్న తీవ్రమైన ఎమోషన్ ఏంటి అనే విషయాలను ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా చూపెట్టారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవారు ఆగస్టు 29 నుంచి హాట్‌స్టార్‌లో ఈ పాప్ కింగ్ జీవిత కథను వీక్షించవచ్చు.     Michael Movie, Michael Biopic, jio Hotstar
డిజిటల్ వినోద ప్రపంచంలో కొరియన్ సినిమాలు, థ్రిల్లర్ సిరీస్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భయాందోళనకు గురిచేసే హారర్, మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లను అమితంగా ఇష్టపడే సినీప్రియులను కొరియన్ కంటెంట్ ఎప్పటికప్పుడు విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తీవ్రమైన భయంకరమైన సీన్లతో తెరకెక్కిన ప్రముఖ కొరియన్ హారర్ చిత్రం 'ఘోస్ట్ ట్రైన్' (Ghost Train) ఇప్పుడు భారతీయ ఓటీటీ రంగంలో సరికొత్త అలజడి సృష్టిస్తోంది. 2024 లో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో భయాందోళనలకు గురిచేసి భారీ ప్రశంసలు అందుకున్న ఈ కొరియన్ చిత్రం, దాదాపు 2 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మన ముందుకు వచ్చింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా ఈ హారర్ చిత్రం ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. మరింత సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాను కేవలం ఒరిజినల్ భాషలోనే కాకుండా మన తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా పూర్తి స్థాయి తెలుగు డబ్బింగ్‌లో కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు. దాదాపు గంటన్నర నిడివితో సాగే ఈ 'ఘోస్ట్ ట్రైన్' చిత్రం ప్రేక్షకులను మొదటి నిమిషం నుండి చివరి వరకు తీవ్ర ఉత్కంఠతో సీటు అంచున కూర్చోబెడుతుంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా క్రేజ్, వ్యూస్ మరియు లైక్స్ కోసం మనుషులు ఎంతటి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, వారి జీవితాలు ఎలా గందరగోళంలో పడుతున్నాయి అనే నయా కాన్సెప్ట్‌ ఆధారంగా ఈ కథను దర్శకుడు అత్యంత ప్రతిభావంతంగా మలిచారు. కథ వివరాల్లోకి వెళ్తే.. హారర్, సూపర్ నేచురల్, దెయ్యాల కథలపై డిజిటల్ వీడియోలు చేసే ఒక యువతి యూట్యూబర్ (Youtuber) చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నప్పటికీ ఆమె ఛానెల్‌కి అనుకున్న స్థాయిలో వ్యూస్, సబ్‌స్క్రైబర్లు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతుంది. ఎలాగైనా తన ఛానెల్‌ని పాపులర్ చేయాలనే ఆరాటంతో, తీవ్రమైన భయాందోళనలు రేకెత్తించే, గూస్‌బంప్స్ తెప్పించే భయంకర రూమర్స్ ఉన్న ఒక ప్రాచీన రైల్వే స్టేషన్‌కి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఆ భయంకరమైన మిస్టరీ రైల్వే స్టేషన్‌కి వెళ్లిన ఆ యూట్యూబర్, అక్కడ సుదీర్ఘకాలంగా విధినిర్వహణలో ఉన్న ఒక వృద్ధ స్టేషన్ మాస్టర్‌ను కలుస్తుంది. అక్కడ జరిగిన అప్రాకృతిక సంఘటనల వెనుక ఉన్న నిజాలను రాబట్టడానికి ఆ స్టేషన్ మాస్టర్‌ను ఇంటర్వ్యూ చేయడం ప్రారంభిస్తుంది. ఆ క్రమంలో స్టేషన్ మాస్టర్ ఆమెకు ఆ ప్రాంగణంలో జరిగిన 4 భయంకరమైన నిజ జీవిత సంఘటనలు, మిస్టరీ కథలను వివరిస్తాడు. ఆ స్టేషన్‌లో ప్రయాణికులు వింతగా మాయమవ్వడం, అనుమానాస్పద మరణాల వెనుక ఉన్న దాగిన సత్యాలను ఒకదాని తర్వాత ఒకటిగా చెబుతుంటే ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుడుతుంది. అయితే ఆ 4 కథలు విన్న తర్వాత ఆ యూట్యూబర్‌కు ఎదురైన ఊహించని పరిణామాలు ఏమిటి? వ్యూస్ కోసం వెళ్లిన ఆమె స్వయంగా ఆ భయంకరమైన ఘోస్ట్ ట్రైన్ ఉచ్చులో ఎలా చిక్కుకుంది? చివరకు ఆ వింత స్టేషన్ మిస్టరీ నుంచి ప్రాణాలతో బయటపడిందా లేదా అనేది అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. కేవలం హారర్ అంశాలే కాకుండా, ఆధునిక సమాజంలో నెటిజన్లు లైక్స్ మరియు పాపులారిటీ కోసం ఎంతటి ప్రాణాల మీదికి తెచ్చుకునే పనులు చేస్తున్నారో ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ వారాంతంలో థ్రిల్లింగ్ అనుభూతిని పొందాలనుకునే హారర్ ప్రియులకు అమెజాన్ ప్రైమ్‌లోని 'ఘోస్ట్ ట్రైన్' ఒక సరైన ఎంపిక అని చెప్పవచ్చు. దీనితో పాటుగా ఈ వారాంతంలో మరికొన్ని ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా వివిధ ఓటీటీ వేదికలలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. 'రావు బహదూర్', 'చిన్న చిన్న ఆశై', 'బాలన్ ద బాయ్', 'దీవాన', 'లవ్ ఓ లవ్' వంటి చిత్రాలు ప్రత్యక్షంగా స్ట్రీమింగ్ అవుతుండగా, 'అబ్జెషన్ మై లార్డ్', 'ఆజాదీ 501', 'హార్ట్ బీట్ సీజన్ 3' వంటి డబ్బింగ్ చిత్రాలు మరియు సిరీస్‌లు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తున్నాయి. కాబట్టి వీకెండ్‌లో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే సినీ ప్రేమికులకు ఈ కొరియన్ హారర్ థ్రిల్లర్ ఘోస్ట్ ట్రైన్‌తో పాటు ఈ చిత్రాలన్నీ మంచి వినోదాన్ని అందిస్తాయనడంలో సందేహం లేదు.
Madala Ravi started his inspiring journey as a child actor in Erra Mallelu made by his father Madala Ranga Rao, and his song "Nampally Station Kadi" was a blockbuster hit that topped the charts for many decades and won many awards as well. He studied MD in Internal Medicine and DM in Gastroenterology in Russia, and also worked as the managing director for a leading pharmaceutical company. He also served as a cultural secretary for Indian organizations and for cultural affairs in Russia. Coming back to India, he started his production house and produced and acted as a hero in many films like Nenu Saitham, Maa Ilavelpu, Broker 2, Panchamukhi, Veeragadha, Aaj Ka Inquilaab, Naag Laxmi, and many more. He continues to work as an actor and filmmaker. On his birthday, we celebrate a man whose life work demonstrates that true impact isn't measured by personal accolades, but by the lives uplifted and the voices amplified. Holding specialized medical qualifications as an MD in Internal Medicine and a DM in Gastroenterology, Dr. Madala Ravi’s true medical practice extends far beyond hospital doors. Driven by the belief that healthcare is a fundamental human right rather than a commercial privilege, he has dedicated a major part of his career to conducting extensive medical camps across the Telugu states. His outreach consistently prioritizes working-class families, daily wage laborers, and underprivileged communities who rarely have access to specialized gastroenterology care. By providing consultations and care selflessly, he has rightfully earned the reputation of a true "People's Doctor." As a leader of Praja Natya Mandali and Left parties like the CPI and CPI(M), he has led and participated in numerous public agitations. He firmly believes that art is the most powerful tool to sensitize people against social atrocities and injustices. Dr. Madala Ravi, the Vice President of Movie Artists Association (MAA), continues to support the welfare of MAA members through Medical Services, Free Health camps, and Also he took active part in all welfare schemes for the film fraternity and for the underprivileged workers. Beyond his accomplishments as an actor and filmmaker, he has been honored with many awards for his relentless work as a social activist, People's Doctor and Actor. Happy Birthday to Dr. Madala Ravi! Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Tiger Shroff has built his reputation as one of Bollywood's fittest action stars, with his martial arts skills, athleticism, and passion for sports often becoming a talking point. While fans have watched him perform gravity-defying stunts on screen for years, the actor may now be preparing to take on a completely different challenge—professional football. According to the latest reports, Tiger has been registered in Mumbay FC's squad for the 135th edition of the Durand Cup, Asia's oldest football tournament. The actor is said to have been training regularly with the Ali Ahmed-owned club and could feature during the tournament, marking a significant crossover from films to competitive sport. Tiger's association with Mumbay FC is not new. He has been closely involved with the club since its inception and has previously represented it in the Mumbai Premier League. Now, if reports are accurate, he is set to take the next step by playing in one of India's most prestigious football competitions. Mumbay FC will begin its Durand Cup campaign in Shillong, where all eyes will be on whether the Bollywood star makes his much-anticipated appearance. While an official announcement regarding his on-field debut is still awaited, the news has generated excitement among both football enthusiasts and Tiger's fans. If he takes the field, it will be a rare instance of a mainstream Bollywood actor competing in a major professional football tournament, further showcasing his commitment to the sport beyond his on-screen action persona. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
కొన్ని చిత్రాల రాక కోసం సౌత్ సినీ ప్రేమికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి ఒక చిత్రమే 'ఆకాశంలో ఒక తార'. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి,శ్రుతి హాసన్ కీలక పాత్రలు కాగా  పవన్ సాదినేని దర్శకుడు. ఈ రోజు  దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు. ఈ  సందర్భంగా  చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు మొదటి సింగిల్ 'చిట్టి చిట్టి చీమ' పాటని అధికారికంగా విడుదల చేశారు.  జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ 'చిట్టి చిట్టి చీమ' పాట సంగీతాభిమానుల హృదయాలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రముఖ గీత రచయిత శ్రీమణి అందించిన సాహిత్యం పాటలోని అంతరార్థాన్ని ఎంతో లోతుగా ఆవిష్కరించింది. "చిగ్గ రాని చోట మొలకెత్తే విత్తనంలా, ఆకాశాన్ని తాకాలనే చిన్న చీమ సంకల్పంలా" ఉండే భావాలు ఎంతో మధురంగా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి. గాయని నిత్య మామ్మన్ తన మధురమైన గొంతుతో ఈ మెలోడీకి ప్రాణం పోసింది. నాలుగు భాషల్లో విడుదలైన ఈ పాట తమిళంలో 'మిట్టాయి మళై', మలయాళంలో 'కుట్టి కుట్టి పువే', హిందీలో 'సన్ సన్ హవా' పేరుతో శ్రోతలని  మంత్రముగ్ధులని  చేస్తోంది. Also read: ఆ హీరో వల్లనే నాకు పేరు వచ్చింది.. బాలకృష్ణ మాత్రం  ఈ పాట వీడియో గ్లింప్స్‌లో దర్శకుడు పవన్ సాదినేని ఎమోషన్స్‌ను ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది. చిన్ననాటి కలలు, గ్రామీణ వాతావరణం, దుల్కర్ సల్మాన్ చూపించిన సహజమైన అభినయం ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. రాక్షస పరిమాణంలో ఉన్న సమస్యల ముందు ఒక చిన్న చీమలాంటి మనిషి తన అసాధ్యమైన కలను ఎలా సాకారం చేసుకుంటాడు అనే ప్రేరణాత్మకమైన కథాంశం ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తుంది. దుల్కర్, సాత్వికల మధ్య ఉన్న ఆత్మీయమైన బాండింగ్,  విజువల్స్ సినిమాపై అంచనాలని  ఒక్కసారిగా పెంచేశాయి. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం కచ్చితంగా ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుందని అభిమానులు నమ్ముతున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. సందీప్ గుణ్ణం మరియు రమ్య గుణ్ణం కూడా నిర్మాతలుగా ఉన్నారు. Aakasamlo oka tara, Dulquer Salmaan,Satvika Veeravalli,Pavan Sadineni,  
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ సింగిల్ ‘ది రైజ్ అఫ్ లింగా’, ఫోక్ సాంగ్ ‘నచ్చాకే వచ్చేరా’ అనే పాటలు అన్నీ కూడా అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా మరో పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ‘కలతేలా’ అంటూ సాగే సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇదొక ఫ్యామిలీ, మోటివేషనల్ సాంగ్‌లా కనిపిస్తోంది. ఇందులో విశాల్, దుషారలతో పాటుగా పిల్లలు కూడా కనిపిస్తున్నారు. ఈ పాటను రాజశ్రీ సుధాకర్ రచించగా.. కృష్ణ తేజస్వీ ఆలపించారు. ఇక జీవీ ప్రకాష్ అందించిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఇక ఈ పాట యూట్యూబ్‌లో ఇట్టే ట్రెండ్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమాకి రిచర్డ్ ఎం. నాథన్, అభినందన్ రామానుజం కెమెరామెన్లుగా, N.B. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. నటీనటులు : విశాల్, అంజలి, దుషార విజయన్, జాన్ విజయ్, జయ ప్రకాష్, అజయ్, వంశీ కృష్ణ, అబూ సలీం, అర్జయ్, ఝాన్సీ, పదం కుమార్, సభుమోన్ తదితరులు నిర్మాణం: సూపర్ గుడ్ ఫిల్మ్స్, నిర్మాతలు: బి. సురేష్, ఆర్.బి. జీవన్ చౌదరి, జితన్ రమేష్, జీవా, సమర్పణ : R.B. చౌదరి, స్క్రీన్ ప్లే & దర్శకత్వం: విశాల్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రిచర్డ్ ఎం. నాథన్ & అభినందన్ రామానుజం, సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్: జి. దురైరాజ్, యాక్షన్ డైరెక్టర్: దిలీప్ సుబ్బరాయన్, ఎడిటర్: N.B. శ్రీకాంత్. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
మీ పిల్లలు చదువును ఇష్టపడట్లేదా? ప్రతి తల్లిదండ్రి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు! పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా ఆనందంగా భావించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. చాలామంది తల్లిదండ్రులు మంచి మార్కులు రావాలని ఆశపడతారు. కానీ పిల్లల్లో చదువుపై ఆసక్తి, నేర్చుకోవాలనే తపన, ఆత్మవిశ్వాసం పెరగడానికి సరైన వాతావరణం కల్పించడం మరింత ముఖ్యమైన విషయం. ఈ వీడియోలో ప్రముఖ నిపుణురాలు డాక్టర్ పూర్ణిమ నాగరాజ గారు పిల్లలు చదువుని ప్రేమించేలా తల్లిదండ్రులు ఎలా ప్రోత్సహించాలి, ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉండాలి, పిల్లలపై అనవసర ఒత్తిడి ఎందుకు పెట్టకూడదు, ప్రశంసల ప్రాముఖ్యత, వారి ఆసక్తులను ఎలా గుర్తించాలి వంటి అనేక విలువైన సూచనలను సులభంగా వివరించారు. అలాగే పిల్లల వయస్సుకు తగ్గట్టు చదువు అలవాట్లు ఎలా పెంచాలి, మొబైల్ మరియు టీవీ వినియోగాన్ని ఎలా నియంత్రించాలి, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మాట్లాడాలి, పరీక్షల సమయంలో ఎలా ప్రోత్సహించాలి వంటి అంశాలపై కూడా ఉపయోగకరమైన చిట్కాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మీ పిల్లలు చదువులో మాత్రమే కాకుండా జీవితంలో కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలంటే ఈ వీడియోలో చెప్పిన సూచనలు ప్రతి తల్లిదండ్రికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: పిల్లల్లో చదువుపై ఆసక్తిని ఎలా పెంచాలి? తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎందుకు అవసరం? చదువును భయంగా కాకుండా ఆనందంగా మార్చే మార్గాలు పిల్లలపై ఒత్తిడి వల్ల కలిగే సమస్యలు ప్రశంసలు, ప్రోత్సాహం పిల్లల ఎదుగుదలలో పాత్ర పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పాటించాల్సిన సూచనలు మంచి చదువు అలవాట్లు పెంచే సులభమైన చిట్కాలు పిల్లల మానసిక ఆరోగ్యం మరియు విద్య మధ్య సంబంధం పిల్లల భవిష్యత్తు బలంగా ఉండాలంటే తల్లిదండ్రుల అవగాహన ఎంతో అవసరం. ఈ వీడియోను పూర్తిగా చూసి, ఇతర తల్లిదండ్రులతో కూడా తప్పకుండా పంచుకోండి.  
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు. అయితే ఎంత శుభ్రం చేసినా చాలా ఇళ్లలో సాలీడు పురుగులు చాలా మళ్లీ మళ్లీ వచ్చి చేరుతుంటాయి.  బూజు కూడా చాలా తొందరగా ఏర్పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? వీటికి కారణాలు ఏంటి? వీటిని పరిష్కరించుకోవడానికి ఏం  చేయాలి? పూర్తీగా తెలుసుకుంటే.. సాలీడు గూళ్లు కట్టడానికి కారణాలుయ.. ఇల్లు శుభ్రం చేసిన కొద్ది రోజులకే మూలల్లో, సీలింగ్‌పై, లేదా ఫర్నిచర్ వెనుక సాలీ గూళ్లు మళ్లీ కనిపిస్తుంటే ఇల్లు సరిగా శుభ్రం చేయలేదని అర్థం కాదు.. పదేపదే గూళ్లు ఏర్పడటానికి చాలా కారణాలు ఉండవచ్చు. వాస్తవానికి, సాలీలు తమకు సురక్షితమైన ప్రదేశం , తినడానికి చిన్న కీటకాలు సులభంగా దొరికే చోట మాత్రమే తమ గూళ్లను అల్లుతాయి. స్టోర్‌రూమ్‌లు, అటకలు, మెట్ల దారులు, కిటికీల అంచులు లేదా బరువైన ఫర్నిచర్ వెనుక.. ఇలా ఇంట్లో ఎక్కువ కాలం శుభ్రం చేయకుండా ఉండే ప్రదేశాలు సాలీడులకు ఇష్టమైన స్థలాలుగా మారతాయి. ఈ ప్రదేశాలు నిశ్శబ్దంగా ఉండి, మనుషుల సంచారం తక్కువగా ఉండటం వల్ల, అవి గూళ్లు అల్లడానికి సులభంగా ఉంటాయి. సాలీడులు పదే పదే ఇంట్లోకి ఎందుకు వస్తాయంటే.. సాలీడులు పదేపదే గూళ్లు కట్టడానికి ఒక ప్రధాన కారణం ఇంట్లో చిన్న కీటకాలు ఉండటమే. సాలీడులు ఈ కీటకాలను తిని బ్రతుకుతాయి. ఇంట్లో దోమలు, ఈగలు లేదా ఇతర చిన్న కీటకాలు ఎక్కువగా ఉంటే, సాలీడులు కూడా తరచుగా అక్కడికి వచ్చి గూళ్లు కడతాయి. వర్షాకాలం , శీతాకాలంలో , సాలీడులు బయట కంటే ఇళ్లలోని సురక్షిత ప్రదేశాలను వెతుకుతాయి.  దీని వల్ల వర్షాకాలంలో ఇళ్లలో సాలీడుల నివాసం,  సాలీడు గూడులు పెట్టడం వంటివి ఎక్కువ అవుతాయి. సాలీడుగూళ్లు  ఎలా తొలగించాలి?  ఇంట్లో సాలెగూళ్లు ఏర్పడితే, వాటిని వీలైనంత త్వరగా తొలగించాలి. వాక్యూమ్ క్లీనర్‌తో పైకప్పులు, మూలల్లోని సాలెగూళ్లను సులభంగా శుభ్రం చేయవచ్చు. వాక్యూమ్ చేరలేని ప్రదేశాల కోసం పొడవాటి పిడి ఉన్న చీపురు లేదా డస్టర్‌ను ఉపయోగించవచ్చు. భారతీయులు వాడే బూజు కర్రతో బాగా శుభ్రం చేయవచ్చు. శుభ్రం చేసిన తర్వాత, మిగిలిపోయిన దుమ్ము, సాలెగూళ్లను పూర్తిగా తొలగించడానికి ఆ ప్రదేశాన్ని తడి గుడ్డతో తుడవడం  మంచిది. సాలెగూళ్లు మళ్లీ ఏర్పడకుండా ఉండాలంటే..  ఇంట్లో సాలెపురుగులు మళ్లీ గూళ్లు కట్టకుండా నిరోధించాలంటే, ముందుగా  ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ముఖ్యంగా మూలలు, పైకప్పులు, ఫర్నిచర్ వెనుక , స్టోర్‌రూమ్‌ల వంటి ప్రదేశాలను నిర్లక్ష్యం చేయకూడదు. కిటికీలు, తలుపులు , గోడలలోని పగుళ్లు లేదా చిన్న రంధ్రాలను మూసివేయాలి. ఎందుకంటే సాలెపురుగులు వీటి ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తాయి.  ఇంట్లో చిన్న కీటకాల తిరగడం, దోమలు, ఈగలు వంటివి ఉండకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సాలెపురుగులకు ఆహారం దొరకనప్పుడు, అవి అక్కడ ఎక్కువసేపు ఉండవు. ముఖ్యంగా తలుపులు , కిటికీల చుట్టూ  పుదీనా నూనెను కలిపిన నీటిని చల్లడం కూడా సాలెపురుగులను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.                                   *రూపశ్రీ.
ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు.  భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం.  భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని, అది పెద్దదైనా లేదా చిన్నదైనా, పంచుకోవడం ఎల్లప్పుడూ సరైనది కాదు. కొన్నిసార్లు, తెలివిగా ఉండటం,  కొన్ని విషయాలు షేర్ చేసుకోకుండా ఉండటం కూడా మంచిదని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.  కేవలం ఇవి మాత్రమే కాదు.. బంధాల మధ్య ఆరోగ్యకరమైన వాతావారణం ఉండాలన్నా,  బంధం ఏ చీకు చింతలు లేకుండా సంతోషంగా ఉండాలన్నా కొన్ని విషయాలు దాచిపెట్టడమే మంచిది అంటున్నారు.  బంధాలు బాగుండాలంటే ఎలాంటి విషయాలను చెప్పకుండా ఉండటం మంచిది? తెలుసుకుంటే.. మాజీ ప్రేమికుల గురించి..  భాగస్వామికి  గతం గురించి చెప్పడంలో తప్పు లేదు, కానీ ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా  మాజీ భాగస్వామి గురించి చర్చించడం, వారిని గొప్పగా పొగడటం లేదా వారితో  గడిపిన సన్నిహిత క్షణాలను చెప్పడం వల్ల  ప్రస్తుత భాగస్వామిలో అనవసరమైన అసూయ మరియు పోలిక ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది బంధంలో అభద్రతాభావం, అసౌకర్యం, అపార్ఠాలు ఏర్పడేలా చేస్తుంది.  అందుకే  ఒక కొత్త బంధం మొదలుపెట్టాక   గతాన్ని గురించి వదిలిపెట్టడం చాలా మంచిది.  దాని గురించి గుర్తుచేసుకోకపోవడం మంచిది. సొంత వ్యక్తుల చెడుగుణం..  భాగస్వామి స్నేహితుల్లో  లేదా కుటుంబ సభ్యులలో ఎవరైనా  మీకు నచ్చకపోవచ్చు. వారు మీతో సరిగా ఉండకపోవచ్చు. కానీ  బిగ్గరగా అరవాల్సిన అవసరం లేదు. "మీ అమ్మ చాలా చెడ్డగా  ఉంటుంది" లేదా "మీ స్నేహితుడు  పద్దతిగా ఉండటం లేదు" అని మీరు చెబితే భాగస్వామి బాధపడే అవకాశం ఉంది.  సమస్య పెద్దది కాకపోతే ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇతరుల రహస్యాలు..  ప్రాణ స్నేహితుడు లేదా స్నేహితురాలు ఇలా ఎవరైనా సరే..   మీతో రహస్యంగా మాట్లాడి ఏదైనా రహస్యం చెప్పినట్లయితే, దానిని భాగస్వామితో పంచుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది "మేము భార్యాభర్తలం, లేదా జంట, మా మధ్య ఎటువంటి రహస్యాలు లేవు, లేదా ఉండకూడదు" అని అనుకుంటారు, కానీ ఇది ఆ మూడవ పక్షం నమ్మకాన్ని దెబ్బతీసినట్లే. భాగస్వామికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, స్నేహం లేదా ఇతర కుటుంబ సభ్యులు, పుట్టింటి వారికి అంతే ప్రాధాన్యత  ఉంటుంది. కాబట్టి  స్నేహితుల గోప్యతను గౌరవించాలి.   వారి రహస్యాలను భాగస్వామి ముందు గాసిప్ లాగా చర్చించకూడదు. ఇష్టాలు, అయిష్టాలు.. భాగస్వామి ప్రేమతో మీకు బహుమతి కొన్నప్పుడు, అది మీకు అస్సలు నచ్చకపోతే  నిజాయితీతో అది నచ్చలేదు అని చెప్పడం మంచిది కాదు. నాకు ఈ రంగు అస్సలు నచ్చలేదు లేదా ఇది క్వాలిటీగా లేదు  అని చెప్పడం వారి మనసును బాధపెట్టినట్టే..   ఇక్కడ అబద్ధం చెప్పడం మంచిది. వారి భావాలను గౌరవించాలి,  చిరునవ్వుతో బహుమతిని తీసుకోవాలి. కొన్నిసార్లు, నిజం చెప్పడం కంటే అబద్దం చెప్పడం వల్ల భాగస్వామిని సంతోషపెట్టవచ్చు. సోషల్ మీడియా పాస్వర్డ్ లు.. నేటి డిజిటల్ యుగంలో ఇది ఒక పెద్ద సమస్య. చాలా మంది భార్యాభర్తలు ఒకరి పాస్‌వర్డ్‌లు ఒకరు తెలుసుకోవడం ప్రేమకు సంకేతం అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ప్రతి ఒక్కరికీ కొంత పర్సనల్ స్పేస్  అవసరం.  ఫోన్ లేదా సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను చెప్పకపోవడం నేరం కాదు. ఏ తప్పు చేయనంత వరకు, తనకంటూ కొంత పర్సనల్ ఉంచుకోవడం తప్పే కాదు. సంబంధాలు నమ్మకంపై ఆధారపడి ఉంటాయి, కానీ అర్థం చేసుకోవడం ఆ నమ్మకాన్ని మరింతగా పెంచుతుంది. కొన్ని విషయాలను దాచడం మోసం కాదు, అనవసరమైన గొడవలు, అపార్థాలు కలగకుండా బంధాన్ని రక్షించుకునే మార్గమది.                                *రూపశ్రీ
పిల్లల శారీరక మరియు మానసిక ఎదుగుదలలో సరైన పోషకాహారం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా Brain Development, Growth మరియు Immunity బలంగా ఉండాలంటే పిల్లలకు అవసరమైన పోషకాలు సరైన మోతాదులో అందాలి. అయితే చాలామంది తల్లిదండ్రులకు పిల్లలకు ఏ ఆహారం ఇవ్వాలి? ఏ వయసులో ఎలాంటి పోషకాలు అవసరం? Protein ఎంత ముఖ్యమనే విషయాలపై అనేక సందేహాలు ఉంటాయి. ఈ వీడియోలో ప్రముఖ Dietitian Srilatha పిల్లల ఆరోగ్యానికి అవసరమైన సమతుల్య ఆహారం గురించి సులభమైన తెలుగులో వివరించారు. Protein Deficiency వల్ల పిల్లల్లో ఎదుగుదల మందగించడం, కండరాల బలహీనత, తరచూ అనారోగ్యం, రోగనిరోధక శక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎలా వస్తాయో వివరించారు. అలాగే పిల్లల Brain Development కోసం Protein, Healthy Fats, Vitamins, Minerals, Iron, Calcium వంటి పోషకాల ప్రాముఖ్యతను తెలియజేశారు. రోజువారీ ఆహారంలో పాలు, గుడ్లు, పప్పులు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను ఎలా చేర్చాలో కూడా సూచనలు అందించారు. పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా ఎదగాలంటే ఎలాంటి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి? Junk Food వల్ల కలిగే నష్టాలు ఏమిటి? ఇంట్లోనే పోషక విలువలు అధికంగా ఉండే ఆహారం ఎలా అందించాలి? వంటి అనేక ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ప్రతి తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన ఈ వీడియో ద్వారా పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన ముఖ్యమైన ఆహార సూచనలను తెలుసుకోండి.    
IBS (Irritable Bowel Syndrome) సమస్యకు సహజమైన మరియు ఆయుర్వేద పరిష్కారాలు కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, తరచుగా విరేచనాలు వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ లక్షణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి Irritable Bowel Syndrome (IBS). ఈ TeluguOne Health వీడియోలో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు IBS అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? IBS లక్షణాలు ఏమిటి? అనే విషయాలను వివరంగా తెలియజేస్తున్నారు. అలాగే IBS సమస్యను నియంత్రించడానికి సహాయపడే సహజమైన జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు, ఆయుర్వేద పద్ధతులు మరియు ఇంట్లో పాటించగల కొన్ని చిట్కాలను ఈ వీడియోలో వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: • Irritable Bowel Syndrome (IBS) అంటే ఏమిటి? • IBS రావడానికి కారణాలు ఏమిటి? • IBS ప్రధాన లక్షణాలు • గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం తగ్గించే మార్గాలు • IBS కోసం పాటించాల్సిన ఆహార నియమాలు • సహజమైన మరియు ఆయుర్వేద పద్ధతులు • ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు IBS అనేది దీర్ఘకాలిక జీర్ణ సంబంధ సమస్య కావచ్చు. సరైన ఆహారం, జీవనశైలి మార్పులు మరియు నిపుణుల సూచనలతో దీనిని నియంత్రించుకోవచ్చు. IBS సమస్యతో బాధపడుతున్న వారు ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం ఉపయోగకరమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కూడా షేర్ చేయండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యకు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)