LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు ఓవీ రమణ టీటీడీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీలో చేరనున్నారు. రాబోయే పార్టీలో చేరబోయే తొలి నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీలో చేరేందుకు ఆయన తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తాననీ,   రాజీనామా చేయడమే కాదు, తాను విజయసాయి రెడ్డితో కలిసి కొత్త రాజకీయ అడుగులు వేయనున్నట్లు ప్రకటించారు.   గతంలో తిరుపతి పర్యటన సందర్భంగా విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీలోకి ఓవీ రమణను బహిరంగంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు.  కాగా ఈ ఇరువురి మధ్యా   సుదీర్ఘ  రాజకీయ అనుబంధం ఉంది. గతంలో వీరిరువురూ   టీటీడీ పాలకమండలి సభ్యులుగా కలిసి పనిచేశారు. ఆ పరిచయం,  కారణంగానే ఇప్పుడు కొత్త రాజకీయ ప్రయాణంలోనూ కలిసి సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి ప్రాంతీయ రాజకీయాల్లో ఓవీ రమణకు బలమైన పట్టు ఉంది. ఆ కారణంగానే ఓవీ రమణ విజయసాయితో కలిసి కొత్త రాజకీయపార్టీలో కలిసి పని చేస్తారన్న వార్త పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.  విజయసాయి తన కొత్త రాజకీయ పార్టీ తెలుగుదేశం, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని చెబుతున్నారు.  త్వరలో పార్టీ ఆవిర్భావ వేడుక నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ ఆవిర్భావ వేడుకల్లోనే ఓవీ రమణ చేరికకు సంబంధించిన లాంఛనం పూర్తి అవుతుందని పరిశీలకులు అంటున్నారు.   [OV Ramana Resign TDP, Join, Vijayasai Reddy New Party, Andhra Pradesh Politics, TTD Board Former Member, Telugu One] 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  జగన్‌మోహన్ రెడ్డి పులివెందులలో   మున్సిపల్ ఎన్నికల సందర్భంగా  ప్రత్యర్థులకు స్టాంగ్ వార్నింగ్ ఇచ్చి సంచలనం సృష్టించారు. సొంత అడ్డా, తనకు కంచుకోట లాంటి పులివెందులలో  స్థానిక పోలింగ్ సందర్భంగా వైసీపీకి ప్రతికూల పరిస్థితులు కనిపించడంతో ఆయన పరిధి దాటి తీవ్ర పదజాలంతో ప్రత్యర్థులను బెదరించే రీతిలో, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేశారు.   ఈ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ మున్సిపల్ పోలింగ్ బూత్‌లను పరిశీలిస్తున్న సమయంలో పలు చోట్ల వ్యతిరేకత ఎదుర్కొన్నారు.  ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో  అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఆయనను నేరుగా అడ్డుకుని ఆరోపణలు గుప్పించడం ఉద్రిక్తతకు దారి తీసింది.  ఈ అనూహ్య పరిణామాల మధ్య అధికార తెలుగుదేశం పార్టీ నేతలు పోలింగ్ ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. వైసీపీ తరఫున   మొత్తం ఎనభై మంది ఏజెంట్లు ఉంటే, కేవలం పది చోట్ల మాత్రమే అనుమతించి మిగిలిన డెబ్బై చోట్ల వారిని అణచివేశారని ఆయన ఆరోపించారు. పోలింగ్‌లో రిగ్గింగ్‌కు పాల్పడుతూ పోలీసుల అండతో అధికార పార్టీ అక్రమాలకు తెరలేపిందని జగన్  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లినప్పటికీ,   లోపలకు అనుమతించకపోవడంతో ఆయన కార్యాలయం వెలుపలే పార్టీ శ్రేణులు, బాధితులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. పార్టీ కార్యకర్తలు మరియు నాయకులపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ ఆయన చేసిన హెచ్చరికలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.  పులివెందులలో తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని  డిమాండ్ చేశారు.ఈ మొత్తం వ్యవహారంపై అధికార తెలుగుదేశం పార్టీ వైసీపీ నేతలే  కావాలని ఎన్నికల్లో అలజడి సృష్టించేందుకు యత్నించారని విమర్శించింది.  ఓటమి భయంతోనే జగన్ బెదరింపు నాటకాలకు  తెరలేపారని ఆరోపించింది.   మొత్తం మీద జగన్ కు సొంత గడ్డ, సొంత అడ్డాలోనూ అనూహ్య రీతిలో తీవ్ర ప్రతిఘటన వ్యక్తమైంది.  [Protests Pulivendula Against Jagan,  Pulivendula Municipal Elections, Jagan Violent Warnin, Pulivendula Election, Telugu One]
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు  నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. పట్టణ ప్రాంతాల భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక ప్రజాస్వామ్య పండుగలో పౌరులు తమ బాధ్యతను నిర్వర్తించేందుకు బారులు తీరారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు నిరంతరాయంగా కొనసాగింది. ఉదయపు వేళల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల నుంచి విశేష స్పందన లభించగా, మధ్యాహ్న సమయానికి ఎండ తీవ్రత కారణంగా కొద్దిగా మందగించింది. అయినప్పటికీ, సాయంత్రం సమయానికి పోలింగ్ ఊపందుకుంది. కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు  చెదురుమదురు సంఘటనలు మినహా మిగిలిన అన్ని చోట్ల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పోలీసులు  ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం మూడు గంటల సమయానికే రాష్ట్రవ్యాప్తంగా సగటున నలభై ఎనిమిది శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, నగర పంచాయతీల్లో ఓటర్లు చూపిన ఉత్సాహం అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రామీణ సరిహద్దు పట్టణ ప్రాంతాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ జిల్లాల్లో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ ఓటింగ్ శాతంలో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ప్రకాశం, కనిగిరి, నగరి, బద్వేలు వంటి మున్సిపాలిటీలలో కూడా అత్యధిక పోలింగ్ శాతం రికార్డయింది. అయితే, మహానగరాలతో పోలిస్తే చిన్న పట్టణాల్లోనే ఓటర్ల ఉత్సాహం ఎక్కువగా కనిపించడం విశేషం. మరోవైపు, విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో మాత్రం ఆశించిన స్థాయిలో ఓటర్లు ముందుకు రాలేదు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన ఇక్కడ అత్యల్ప పోలింగ్ శాతం నమోదు కావడంతో అధికార యంత్రాంగం రాజకీయ పార్టీల్లో దీనిపై విశ్లేషణలు సాగుతున్నాయి. పట్టణ ఉదాసీనత మరోసారి ప్రధాన నగరాల్లో స్పష్టమైంది. సాయంత్రం ఐదు గంటల సమయానికి పోలింగ్ కేంద్రాల వెలుపల క్యూ కట్టిన ఓటర్లందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. గడువు ముగిసే సమయానికి లైన్లలో ఉన్నవారికి టోకెన్లు జారీ చేసి మరీ ఓటింగ్ పూర్తి చేయించారు. దీంతో తుది పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ ముగియడంతో అధికారులు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులను పటిష్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. అవసరమైన కొన్ని కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల తుది ఫలితాలు పట్టణ రాజకీయాల్లో ఎవరికి పట్టం కట్టనున్నాయనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా సగటున 48.03 శాతం పోలింగ్ నమోదైంది. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే.. కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ ఏకంగా 73.96 శాతం పోలింగ్‌తో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది.  ఆ తర్వాతి స్థానాల్లో ప్రకాశం జిల్లా చీమకుర్తి (73.64%), మార్కాపురం జిల్లా కనిగిరి (73.20%), చిత్తూరు జిల్లా నగరి (71.78%), కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీల్లో (71.52%) భారీ పోలింగ్ రికార్డైంది. మరోవైపు మహానగరాల్లో ఓటర్ల నుంచి ఆశించిన స్పందన లభించకపోవడంతో విశాఖపట్నం జీవీఎంసీ (GVMC) పరిధిలో కేవలం 39.72 శాతం మాత్రమే ఓట్లు పోలై రాష్ట్రంలోనే అత్యల్ప పోలింగ్ నమోదైన నగరంగా మిగిలింది.        [ AP Municipal Elections, Andhra Pradesh Civic Polls, Municipal Polling Percentage, AP Local Body Elections 2026, Vote Counting Date ]  
ALSO ON TELUGUONE N E W S
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా డిజిటల్ రిలీజ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్వయంగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ పోస్ట్ పెట్టి.. ఆ తర్వాత దాన్ని డిలీట్ చేసింది. దీంతో ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన సినిమా కావడంతో ‘రణబాలి’పై మొదటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా సోషల్ మీడియా వేదికగా ‘రణబాలి’ నవంబర్ 13, 2026 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. అయితే పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆ పోస్టును తొలగించింది. అప్పటికే కొందరు నెటిజన్లు స్క్రీన్‌షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అంటే నవంబర్ 13న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ‘రణబాలి’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.80 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికీ మంచి వసూళ్లనే రాబడుతోంది. అయితే ఓటీటీ డేట్ బయటకు వస్తే.. కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే మేకర్స్ సూచనతో నెట్‌ఫ్లిక్స్ ఆ ఓటీటీ రిలీజ్ డేట్ పోస్ట్ ను డిలీట్ చేసి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా చదవండి: షారుఖ్ ఖాన్ టాప్-10 సినిమాలు.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు.!     [Ranabaali OTT Release Date, Ranabaali Netflix Release, Ranabaali Movie OTT, Ranabaali Collections, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Mythri Movie Makers]  
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "సమ్మర్ హాలిడేస్" అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. "సమ్మర్ హాలిడేస్" సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ నయన్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 6న "సమ్మర్ హాలిడేస్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ శ్రీకర్ నయన్. - మాది విశాఖ. కాలేజ్ డేస్ లోనే షార్ట్ ఫిలింస్ రూపొందించాను. అలా స్క్రిప్ట్, షార్ట్ ఫిలింస్ మేకింగ్ మీద ఆసక్తి పెరిగింది. చదువులు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చి తెల్లవారితే గురువారం, మరికొన్ని చిత్రాలకు దర్శకత్వశాఖలో పనిచేశాను. కొన్ని కథలు సిద్ధం చేసుకుని అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాను. మధుర శ్రీధర్ రెడ్డి గారి ద్వారా ధీరజ్ మొగిలినేనిని కలిశాను. ఆయనకు ఒక థ్రిల్లర్ మూవీ కథ చెప్పాను. కథ ఆయనకు నచ్చింది. అయితే ఫిలింమేకింగ్ లో అనుభవం ఉంటే బాగుంటుంది మనం ఖచ్చితంగా చేద్దామని చెప్పారు. ఆ తర్వాత కొన్ని ప్రొడక్షన్ హౌస్ లు అవకాశం ఇచ్చాయి కానీ అక్కడ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు చాలా టైమ్ పట్టేలా కనిపించింది. ఆ తర్వాత ధీరజ్ కు సమ్మర్ హాలీడేస్ కథ నచ్చి అవకాశం ఇచ్చారు. ఆయన ఓకే అన్నాక చకచకా కాస్టింగ్, టెక్నీషియన్స్ ఫైనల్ అవడం..ఇలా పనులన్నీ జరిగిపోయాయి. - ఫస్ట్ మా సినిమాకు అనుకున్న టైటిల్ సమ్మర్ ఫ్రెండ్. రెండు వేర్వేరు ప్రపంచాలు ఉన్న ఇద్దరు పిల్లలు సమ్మర్ లో స్నేహితులు అయితే ఎలా ఉంటుందనే పాయింట్ మీద ఈ కథను రెడీ చేశాను. మనం అమ్మమ్మ ఊరికి సమ్మర్ లో వెళ్లినప్పుడు ఎన్నో మెమొరీస్ ఉంటాయి. క్రికెట్ ఆడటం, తాటి ముంజలు తినడం, అమ్మమ్మ చెప్పే కబుర్లు వినడం, ఊరిలో కొత్త స్నేహాలు..ఇలాంటివి మనందరి జీవితాల్లో చూసి ఉంటాం. అవే ఈ కథకు స్ఫూర్తి. నా జీవితంలో జరిగిన ఘటనలు స్ఫూర్తి అని చెప్పలేను. మాది పిల్లల సినిమా కాదు పిల్లలు నటించిన పెద్దల సినిమా. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్. మా సినిమాను థియేటర్ లో చూసి ఎక్సిపీరియన్స్ చేయాలి. - అరుణ్ అమ్మమ్మ పాత్రలో జయసుధ గారు నటించారు. ఆమెకు మా కుటుంబమంతా అభిమానులం. ఆమె అమ్మమ్మ పాత్ర అనగానే మొదటి సీన్ లోనే ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు. అరుణ్, జయసుధ గారి మధ్య వచ్చే సీన్స్ కన్నీళ్లు పెట్టిస్తాయి. ఆ సీన్స్ అన్నీ ప్రేక్షకులు హార్ట్ టచింగ్ గా ఫీలవుతారు. వాసుకి గారిది మంచి ఇంపార్టెంట్ రోల్. నేను ఈ కథ రాసినప్పుడు వాసుకి గారిని పాత్ర కోసం అనుకున్నాను. అలాంటి మంచి యాక్ట్రెస్ కు కీలకమైన పాత్రే ఇవ్వాలని అనిపించింది. మా మూవీలోని మెసేజ్, క్లైమాక్స్ లో స్ట్రాంగ్ డైలాగ్స్ కూడా ఆమెకే ఉంటాయి. హర్షిణి, రాజీవ్ కనకాల, హర్షవర్థన్ ఇలా ప్రతి ఒక్కరికీ మంచి రోల్స్ ఉన్నాయి. వాళ్ల పర్ ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. - ఈ సినిమా కోసం వర్క్ షాప్స్ పెట్టాం. అరుణ్, రోహన్ లీడ్ రోల్స్, ఖుషిని మనశంకరవరప్రసాద్ గారు సినిమా ట్రైలర్ చూసి తీసుకున్నాం. వందమంది పిల్లలు కూడా నటించారు. అరుణ్, రోహన్ ఇద్దరూ వెరీ టాలెంటెడ్. గోదావరి యాస కూడా నేర్చేసుకుని నటించారు. కానీ మిగతా వందమంది పిల్లలతో షూటింగ్ చేయడం అంత సులువుగా జరగలేదు. వాళ్లు ఒకరు ఉంటే మరొకరు దొరికేవారు కాదు ఎక్కడో ఆడుకునే వారు. - సమ్మర్ హాలిడేస్ సినిమా సమ్మర్ కు రిలీజై ఉంటే చాలా బాగుండేది. కానీ మాకు సమ్మర్ స్లాట్ దొరకలేదు. జూలైలో రిలీజ్ కు వద్దామని అనుకున్నా అప్పుడు చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ ఉంది కాబట్టి ధీరజ్ వెయిట్ చేద్దామన్నారు. అలా డేట్ మారుతూ ఈ నెల 6న రిలీజ్ కుదిరింది. మనం ఈ మధ్య బ్లడ్ షెడ్, యాక్షన్ , వయలెంట్ మూవీస్ చూసి చూసి విసిగిపోయి ఉన్నాం. ఇలాంటి టైమ్ లో సమ్మర్ హాలీడేస్ మూవీ ప్లెజెంట్ ఎమోషన్స్ తో వెళ్తూ మన మొహం మీద చిన్న చిరునవ్వు తెప్పిస్తుంది. ఇలాంటి టైమ్ లో సమ్మర్ హాలీడేస్ వంటి ఫీల్ గుడ్ మూవీని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్లు కూడా ఈ తరహా సినిమా కోసం వేచి చూస్తున్నారు.  - రోహన్ ఒక ప్రాబ్లమ్, అరుణ్ కు ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. సమ్మర్ హాలీడేస్ లో వారి వారి సమస్యలను ఎలా డీల్ చేసుకున్నారు అనేది మా మూవీలో చూస్తారు. ఈ కథలో మేసేజ్ చెప్పేకంటే సత్యం సుందరం సినిమా లాంటి కథ చూపించాలని అనిపించింది. రోహన్, అరుణ్ పాత్రలు సత్యం, సుందరం పాత్రల్లా అనిపిస్తాయి. మా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అరుణ్ కు 35 ఇది చిన్న కథ కాదు సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ విషయం తెలిసినప్పుడు అరుణ్ తో పాటు మా టీమ్ అంతా చాలా హ్యాపీగా ఫీలయ్యాం. - మా మూవీ సక్సెస్ పట్ల నేను, ధీరజ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మా సినిమాను ధీరజ్ తన క్లోజ్ సర్కిల్ కు చూపించారు. ప్రతి ఒక్కరూ బాగుందనే రెస్పాన్స్ ఇచ్చారు. ఈ దీపావళికి మా సమ్మర్ హాలీడేస్ మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం.       [Summer Holidays Movie, Director Srikar Nayan, Dheeraj Mogilineni, Telugu Movies 2026, Telugu Film News]  
The pooja ceremony of Ajith Kumar's upcoming film Daredevil was held in Chennai on Monday. Directed by Adhik Ravichandran, the film marks the actor's second collaboration with the filmmaker after Good Bad Ugly. Producer Shalini Ajith Kumar attended the ceremony along with several members of the cast and technical team. Sreeleela, Unni Mukundan, Parthiban, Prabhu, Sunil and music composer Anirudh Ravichander were among the prominent attendees. The film marks Shalini's debut as a producer under her Brave Hearts Productions banner. Interestingly, Ajith Kumar was not present at the pooja ceremony. Anirudh is composing the music, while cinematographer Abinandhan Ramanujam, editor Vijay Velukutty and stunt choreographer Supreme Sundar are part of the technical team. The film brings Ajith and Anirudh together again after Vidaamuyarchi. The makers had initially planned to shoot the film in Chennai but shifted the Indian shooting schedule to Hyderabad due to weather conditions. The regular shoot is scheduled to begin on November 12. The team is also planning schedules in Thailand and Malaysia.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సినిమాలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. వీకెండ్ వచ్చిందంటే కొత్త సినిమా చూడాలని థియేటర్లకు వెళ్లేవారు కొందరైతే.. ఓటీటీలో వచ్చిన ప్రతి సినిమానూ చూసేవారు మరికొందరు. కానీ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం సినిమాలు చూడటాన్నే తన లక్ష్యంగా మార్చుకున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడాదిలో 1,207 సినిమాలను థియేటర్లలో చూసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఆయన పేరు గ్లెన్‌వుడ్ హోస్కిన్ జూనియర్. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం యార్క్ హేవెన్‌కు చెందిన 60 ఏళ్ల గ్లెన్‌వుడ్ హోస్కిన్.. ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు తన స్థానిక రీగల్ సినిమా థియేటర్‌లో ఈ సినిమాలన్నీ చూశారు. 12 నెలల వ్యవధిలో మొత్తం 1,207 చిత్రాలను వీక్షించారు. అంటే రోజుకు సగటున 3.3 సినిమాలు చూసినట్లు లెక్క. ఈ ఘనతతో ఒక ఏడాదిలో అత్యధిక సినిమాలను థియేటర్లలో చూసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించారు. ఇంతకుముందు ఈ రికార్డు అమెరికాకే చెందిన జకారియా స్వోప్ పేరిట ఉండేది. ఆయన ఏడాదిలో 777 సినిమాలు చూసి రికార్డు సృష్టించారు. ఇప్పుడు గ్లెన్‌వుడ్ ఏకంగా 430 సినిమాలు ఎక్కువగా చూసి ఆ రికార్డును అధిగమించారు. ఈ రికార్డు కోసం గ్లెన్‌వుడ్ ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకునేవారు. ప్రతిరోజూ థియేటర్ షెడ్యూల్ పరిశీలించి, ఏ సినిమాలు ఎప్పుడు ప్రదర్శిస్తున్నారో తెలుసుకునేవారు. తక్కువ నిడివి ఉన్న సినిమాలను గుర్తించి, వీలైనన్ని ఎక్కువ చిత్రాలు చూసేలా తన రోజును ప్లాన్ చేసుకునేవారు. ఉదయం మొదలుపెట్టి అర్ధరాత్రి వరకు సినిమాలు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయట. సినిమాల మధ్య ఖాళీ సమయంలో థియేటర్ పరిసరాల్లో నడుస్తూ వ్యాయామం చేసేవారు. ఖర్చు తగ్గించుకోవడానికి ఇంటి నుంచే ఆహారం తీసుకెళ్లేవారు. నెలకు సుమారు 28 డాలర్లు చెల్లించే రీగల్ అన్‌లిమిటెడ్ మెంబర్‌షిప్ ఉండటంతో ఎక్కువ సినిమాలు చూడటం ఆర్థికంగా కూడా సాధ్యమైంది. థియేటర్ సిబ్బంది, మేనేజ్‌మెంట్ కూడా ఆయనకు సహకరించేవారట. గ్లెన్‌వుడ్‌కు కార్టూన్ సినిమాలు, కామెడీ చిత్రాలంటే ప్రత్యేకమైన ఇష్టం. తక్కువ నిడివి ఉండటంతో కార్టూన్ సినిమాలను ఎక్కువగా ఆస్వాదించేవారట. ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో కామెడీ సినిమాలు చూస్తూ నవ్వుకోవడం తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని ఆయన చెప్పారు. తాను చూసిన సినిమాల్లో ‘ది వైల్డ్ రోబోట్’, ‘డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్’ చిత్రాలు ప్రత్యేకంగా నచ్చాయని వెల్లడించారు. ఈ రికార్డు సాధించాలనే ఆలోచన తనకు ఆన్‌లైన్‌లో గిన్నిస్ రికార్డుల గురించి తెలుసుకుంటున్నప్పుడు వచ్చిందని గ్లెన్‌వుడ్ తెలిపారు. మొదట ఒకే సినిమాను అత్యధికసార్లు చూసే రికార్డుపై ఆసక్తి చూపినా.. ఆ రికార్డును అధిగమించడం కష్టమని భావించి, ఏడాదిలో ఎక్కువ సినిమాలు చూసే లక్ష్యాన్ని ఎంచుకున్నారు. సినిమాలు చూడటం తనకు కేవలం వినోదం మాత్రమే కాదని, ఇంటి నుంచి బయటకు వచ్చి కొత్త అనుభవాలను పొందే అవకాశమని ఆయన చెబుతున్నారు. ఒకప్పుడు సినిమాలను సరదాగా చూసిన ఈ వ్యక్తి.. ఇప్పుడు అదే అభిరుచితో ప్రపంచ రికార్డు సృష్టించడం విశేషం. సినిమా పట్ల ఇంతటి ప్రేమ, పట్టుదల ఉంటే ఇలాంటి అరుదైన ఘనతలు కూడా సాధ్యమేనని గ్లెన్‌వుడ్ నిరూపించారు. ఇది కూడా చదవండి: టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఎఫెక్ట్.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ వెనుక అమితాబ్ బచ్చన్.!       [1207 Movies Guinness World Record, American movie lover Glenwood, 1207 Movies in One Year, Glenwood Hoskin Jr, 1200 Movies Guinness Record, Movie Lover, Cinema Record, Guinness Records]  
సినిమాల సెన్సార్ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై నిర్మాతలు సినిమాలను సెన్సార్‌కు పంపేటప్పుడు పూర్తి స్థాయి ఫైనల్ వెర్షన్‌ను మాత్రమే సమర్పించాలని స్పష్టం చేసింది. గ్రాఫిక్స్, టైటిల్స్, క్రెడిట్స్, సబ్‌టైటిల్స్, డిస్‌క్లెయిమర్లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు అవసరమైన యాక్సెసిబిలిటీ అంశాలు కూడా పూర్తిగా సిద్ధంగా ఉండాలని పేర్కొంది. సినిమా టైటిల్ విషయంలోనూ బోర్డు కీలక స్పష్టత ఇచ్చింది. సెన్సార్ దరఖాస్తు సమయంలో పేర్కొన్న టైటిల్‌ను తుది పేరుగా భావించకూడదని, దానిని పరిశీలించిన తర్వాత అవసరమైతే మార్పులు సూచించే అధికారం బోర్డుకు ఉంటుందని తెలిపింది. అందువల్ల సెన్సార్ ప్రక్రియ పూర్తయ్యే వరకు టైటిల్‌పై ప్రచారం విషయంలోనూ నిర్మాతలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తాత్కాలిక గ్రాఫిక్స్, ప్లేస్‌హోల్డర్ కంటెంట్, పూర్తికాని సౌండ్ ట్రాక్ లేదా అవసరమైన సబ్‌టైటిల్స్, యాక్సెసిబిలిటీ సదుపాయాలు లేని సినిమాలను సమర్పిస్తే దరఖాస్తు ఆలస్యం కావడం, తిరిగి పంపించడం లేదా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని బోర్డు హెచ్చరించింది. అలాగే సినిమా విడుదల తేదీ ప్రకటించినంత మాత్రాన సెన్సార్ సర్టిఫికెట్‌ను త్వరగా జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఇక సెప్టెంబర్‌లో విడుదల చేసిన సవరించిన సర్టిఫికేషన్ మార్గదర్శకాల్లోనూ కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. మాదకద్రవ్యాల వినియోగం, వాడకం లేదా అక్రమ రవాణాను చూపించే సన్నివేశాలకు తప్పనిసరిగా హెచ్చరిక సందేశం ఉండాలి. పిల్లలపై హింస, మహిళలపై లైంగిక హింస, జంతువులపై క్రూరత్వం వంటి అంశాలను అనవసరంగా చూపించకూడదని సూచించింది. అలాగే UA 7+, UA 13+, UA 16+ వయో విభాగాల మార్గదర్శకాలను కూడా స్పష్టం చేసింది. ఈ మార్పులతో సినిమా నిర్మాణం, సెన్సార్ దరఖాస్తుల విషయంలో నిర్మాతలు మరింత ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాల్సి ఉంటుంది.     [CBFC New Guidelines 2026, Censor Board Rules, Indian Film Certification, CBFC Film Certification, Movie Censor Rules, UA 7 UA 13 UA 16, Film Makers New Rules, Telugu Cinema News]
వెంకటేశ్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం.47’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తుండగా.. తాజాగా ఈ చిత్ర బృందానికి ఓ వివాదం ఎదురైంది. సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ‘జిమ్‌ జిమ్‌ తార’ పాటను సినిమాలో ఉపయోగించడంపై ఒరిజినల్‌ సింగర్‌ లక్ష్మీదేవి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అనుమతి తీసుకోకుండా పాటను సినిమాలో ఎలా వాడతారని ప్రశ్నించారు. వెంటనే ఆ పాటను తొలగించాలని, లేదంటే కేసు వేస్తామని హెచ్చరించారు. ‘జిమ్‌ జిమ్‌ తార.. జిలేబీ తేరా చిన్నోడా’ అనే పాట కొద్దిరోజుల క్రితం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. గోగుల లక్ష్మీదేవి పాడిన ఈ పాట ‘పర్ణశాల’ సినిమాలోనిది. ఆమె సరదాగా పాడిన పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. ఆ తర్వాత చిత్ర బృందం అధికారికంగా పూర్తి పాటను విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ పాటలోని సుమారు 15 సెకన్ల భాగాన్ని ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో ఉపయోగించడమే వివాదానికి కారణమైంది. ఈ విషయంపై లక్ష్మీదేవి ఓ వీడియో విడుదల చేసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో తమ పాటను ఉపయోగించే ముందు ‘పర్ణశాల’ చిత్ర బృందాన్ని సంప్రదించారా? తమకు లేదా ఆ సినిమా నిర్మాతలకు డబ్బులు చెల్లించారా? అని ప్రశ్నించారు. పెద్ద సినిమాల్లో తమ పాటలను ఉపయోగించుకుంటూ.. చిన్న సినిమాలకు మాత్రం నష్టం కలిగించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. వెంటనే ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలోని ఆ పాటను తొలగించాలని ఆమె డిమాండ్‌ చేశారు. లేదంటే ‘పర్ణశాల’ చిత్ర నిర్మాతలతో కలిసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరి ఈ వివాదంపై ‘ఆదర్శ కుటుంబం’ టీమ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.  ఇది కూడా చదవండి: లాలో రీమేక్‌గా RC17.. అసలు నిజమేంటి.. సుకుమార్ తప్పు చేస్తున్నారా.?       [AK47 Movie Controversy, Jim Jim Tara Copyright Issue, Aadarsha Kutumbam Movie, Jim Jim Tara Song, Singer Lakshmi Devi, Venkatesh, Trivikram, Parnashala Movie]  
టెలివిజన్ నటుడు అనూజ్ ఠాకూర్ (33) కన్నుమూశారు. ముంబైలోని ఓషివారాలో ఉన్న తన నివాసంలో అక్టోబర్ 27న ఆయన తుదిశ్వాస విడిచారు. నిద్రలో ఉండగా మూర్ఛ (సీజర్) రావడంతోనే ఆయన మరణించినట్లు స్నేహితుడు, కాస్టింగ్ డైరెక్టర్ రూపేష్ సోనార్ వెల్లడించారు. ఈ విషాద వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనూజ్ మృతి గురించి రూపేష్ సోనార్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. అనూజ్ తనకు స్నేహితుడు మాత్రమే కాదని, తమ్ముడిలాంటి వాడని గుర్తుచేసుకున్నారు. ఆయనతో కలిసి ఎన్నో ప్రాజెక్టులు చేయాలని అనుకున్నామని, కానీ ఇంతలోనే ఇలా జరగడం బాధాకరమని పేర్కొన్నారు. మరణానికి పది రోజుల ముందు కూడా అనూజ్‌ను కలిశానని, అప్పట్లో ఆయన మళ్లీ నటనలోకి రావాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారని రూపేష్ వెల్లడించారు. అనూజ్ ప్రతిరోజూ తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్రలేచి వ్యాయామం, జాగింగ్ చేసేవారని రూపేష్ తెలిపారు. అయితే అక్టోబర్ 27న అలారం మోగినా ఆయన నిద్రలేవకపోవడంతో తల్లి గదిలోకి వెళ్లి చూడగా స్పందన లేకుండా కనిపించారని చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలోనూ అనూజ్‌కు ఒకసారి మూర్ఛ వచ్చిందని, అప్పటి నుంచి మందులు వాడుతున్నారని కుటుంబ సభ్యులు తనకు చెప్పినట్లు రూపేష్ వివరించారు. ‘ధూమ్ మచావో ధూమ్’, ‘బంధన్ సాత్ జన్మో కా’, ‘బీంద్ బనూంగా ఘోడి చఢూంగా’, ‘మహిసాగర్’ వంటి టెలివిజన్ షోలతో అనూజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్న ఆయన తిరిగి బుల్లితెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆయన మృతితో టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది.     [Anuj Thakur, Anuj Thakur Death, TV Actor Anuj Thakur, Anuj Thakur Dies at 33, Dhoom Machao Dhoom Actor, Rupesh Sonar, Television Actor Death, TV Industry News]
The Central Board of Film Certification (CBFC) has issued a fresh advisory making it mandatory for filmmakers to submit complete final versions of their films for certification. The move is particularly significant for the Telugu film industry, where producers have often approached the censor board with raw final-edit copies, even while important post-production works such as re-recording, sound design, background score mixing and DI are still pending. According to the advisory dated October 26, 2026, films submitted for certification must be complete in every aspect, including final graphics, titles, credits, subtitles, disclaimers, final background score, sound mix and accessibility features. The board has also explicitly stated that incomplete or work-in-progress prints containing temporary graphics, placeholder elements or scratch scores will be treated as non-compliant and could face delays, returns or rejection. This effectively means filmmakers can no longer submit an unfinished edit to secure certification ahead of their planned release and complete the remaining technical works later. Only the version duly certified by the CBFC can be exhibited in theatres. This is a new headache for TFI producers as there have been multiple delays, reshoots, release postponements and last minute hurried releases due to financial and OTT pressures.  If CBFC decides to strictly adhere to these guidelines, then the producers will be needed to give time for scripting before going for shoots and plan ahead. With choatic prodcution and lazy last minute rush becoming the norm, can this bring a change? We have to wait and see. Even the last minute release date rush won't help as officials are advised to not sympathize.  They made it clear that announced theatrical release dates or trailer launches will not influence certification timelines. Producers have been advised to plan submissions well in advance, as the board will follow its prescribed examination and revision process without compromising timelines. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
మన శరీరానికి రోజూ తగినంత పోషకాహారం అందాలంటే నిత్యం ఏదో ఒక రూపంలో పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రతిరోజూ కాసిని మొలకవచ్చిన గింజలను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ ఆరోగ్యానికి ఎంత మంచివైనప్పటికీ, మొలకలను అలాగే తినమంటే పిల్లలు పెద్దగా సహించరు, ఇష్టపడకుండా మొండికేస్తుంటారు. వాళ్ళ కోసం కేవలం రెండు నిమిషాలు కేటాయించి కొంచెం రుచిగా మార్చితే చాలు, ఇలా గనుక చేశారంటే క్షణాల్లో ప్లేట్ ఖాళీ చేసేస్తారు. మరి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ రుచికరమైన మొలకల చాట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆరోగ్యకరమైన చాట్ తయారీకి కావలసిన పదార్థాలు ఏమిటంటే: ముందుగా మొలకెత్తిన శనగలు, పెసలు, సోయాబీన్స్ అన్నీ కలిపి ఒక కప్పు నిండుగా తీసుకోవాలి. అలాగే ఉల్లి, పన్నీర్, క్యారెట్, కొత్తిమీర తరుగు, టొమాటో ముక్కలు గుప్పెడు చొప్పున సిద్ధం చేసుకోవాలి. వీటితో పాటుగా 2 పచ్చిమిర్చి, 3 స్పూన్లు సన్న కారప్పూస, రుచికి సరిపడా ఉప్పు, ముప్పావు స్పూన్ చొప్పున మిరియాల పొడి, చాట్ మసాలా, నిమ్మరసం తీసుకోవాలి. ఇంకా అర స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల చొప్పున దానిమ్మ గింజలు, వేయించిన పల్లీలు సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇక దీని తయారీ విధానం చాలా సులభం. ముందుగా గింజలన్నింటినీ ముందురోజు ఉదయం నానబెట్టి, రాత్రి సమయంలో ఆ నీళ్లను వంపేయాలి. అలా చేస్తే మరుసటి ఉదయానికి గింజలకు చక్కగా మొలకలు వస్తాయి. ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగి ఒక వెడల్పాటి పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ వెడల్పాటి పాత్రలో పచ్చిమిర్చి, టొమాటో, ఉల్లి, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర తరుగు, సన్న కారప్పూస వేయాలి. వీటికి తోడుగా తగినంత ఉప్పు, చాట్ మసాలా, నిమ్మరసం, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి కలపాలి. చివరగా దానిమ్మ గింజలు, వేయించిన పల్లీలను కూడా కలిపి బాగా మిక్స్ చేస్తే చాలు, నోరూరించే కరకరలాడే  మొలకల చాట్  క్షణాల్లో సిద్ధమైపోతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.     Sprouts Chaat Recipe, Healthy Evening Snacks, Protein Rich Indian Recipes, Weight Loss Snacks, Sprouted Moong Chaat, Quick Healthy Food Ideas, Cooking Tips In Telugu.
శరీరానికి సరైన పోషకాలు అందకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మంది పౌష్టికాహారాన్ని సరిగ్గా తీసుకోలేక బలహీనపడుతున్నారు. అయితే, ప్రకృతి మనకు ప్రసాదించిన కొన్ని అద్భుతమైన గింజలు, ఆహార పదార్థాల ద్వారా రోజూ శరీరానికి కావలసిన శక్తిని సులభంగా పొందవచ్చు. ముఖ్యంగా పొద్దుతిరుగుడు గింజలు (Sunflower Seeds) మన ఆరోగ్యానికి ఒక గొప్ప దివ్యౌషధంలా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండే ఈ గింజలు శరీరానికి అద్భుతమైన పోషణను అందిస్తాయి. సాధారణంగా మనం తీసుకునే పండ్లు లేదా లీటర్ల కొద్దీ పాలు తాగినా లభించని శక్తి కేవలం గుప్పెడు ఈ గింజల ద్వారా లభిస్తుందంటే అతిశయోక్తి కాదు. కేవలం 100 గ్రాముల పొద్దుతిరుగుడు పప్పు బాదం పప్పుకు సమానమైన శక్తిని, పోషకాలను అందిస్తూ శరీరానికి అవసరమైన బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా, ఇది చికెన్, మటన్ కంటే సుమారు ఐదు రెట్లు ఎక్కువ బలాన్ని మరియు శక్తిని చేకూర్చడంలో ఎంతగానో సహాయపడుతుంది. మన శరీర కణాల పనితీరుకు, మానసిక ఆరోగ్యానికి విటమిన్ బి6 ఎంతో అవసరం. ఇది నరాల పనితీరును మెరుగుపరచడంలోనూ, జీర్ణకోశ సంబంధిత సమస్యలు దరిచేరకుండా నిరోధించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో ఎంజైములు, హార్మోన్లు సమృద్ధిగా ఉత్పత్తి కావడానికి విటమిన్ బి6 ఎంతగానో దోహదపడుతుంది. రక్తం ఉత్పత్తికి కూడా ఇది ఎంతో అవసరం. సాధారణంగా మనం తినే దంపుడు బియ్యం, మిల్లెట్స్ వంటి వాటిలో విటమిన్ బి6 ఉన్నప్పటికీ, వాటిని ఉడికించడం వల్ల అందులోని కొన్ని పోషకాలు నశించే అవకాశం ఉంటుంది. అయితే, పొద్దుతిరుగుడు గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టి తినడం వల్ల విటమిన్ బి6 ఎలాంటి నష్టం లేకుండా పూర్తిగా శరీరానికి అందుతుంది. ఇక చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించడానికి, ముడతలు పడకుండా నిరోధించడానికి, అలాగే స్ట్రెచ్ మార్క్స్ త్వరగా రాకుండా ఉండడానికి విటమిన్ ఇ అత్యంత కీలకం. ఇది శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల బారి నుంచి రక్షించడంలోనూ సహాయపడుతుంది. సాధారణంగా ఒక వ్యక్తికి రోజువారీగా 15 మిల్లీగ్రాముల విటమిన్ ఇ అవసరం కాగా, బాదం పప్పులో 28 మిల్లీగ్రాములు ఉండగా, పొద్దుతిరుగుడు పప్పులో మాత్రం ఇది ఏకంగా 35 మిల్లీగ్రాముల వరకు లభిస్తుంది. అందుకే చాలా మంది సినిమా నటీనటులు యవ్వనంగా కనిపించడానికి ప్రత్యేకంగా విటమిన్ ఇ క్యాప్సూల్స్, లోషన్స్ వాడుతుంటారు. శరీరానికి అత్యంత అవసరమైన ఖనిజాలలో మెగ్నీషియం ఒకటి. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మందిలో మెగ్నీషియం లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పొద్దుతిరుగుడు గింజలు ఈ మెగ్నీషియం లోపాన్ని సమర్థవంతంగా నివారించి, ఈ ఖనిజాన్ని సమృద్ధిగా అందిస్తాయి. శరీరానికి అవసరమైన మెగ్నీషియంను పొందడానికి దీన్ని నంబర్ వన్ ఆహారంగా చెప్పుకోవచ్చు. ఈ గింజలను తీసుకోవడానికి సరైన విధానం ఏమిటంటే.. వీటిని ఉదయం నీటిలో నానబెట్టి సాయంత్రం పూట పండ్లతో పాటు డిన్నర్‌లో తీసుకోవచ్చు. లేదా రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు ఉదయం అల్పాహారంలో మొలకలతో పాటు తినవచ్చు. ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల ఇవి సులభంగా జీర్ణమవుతాయి మరియు పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి. ఒకవేళ ప్రయాణాలలో నానబెట్టడం సాధ్యం కాకపోతే, డ్రై రోస్ట్ చేసుకున్న విత్తనాలను కూడా తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు తక్కువ మోతాదులో, అలాగే బరువు పెరగాలనుకునేవారు కాస్త ఎక్కువ మోతాదులో అంటే రోజుకు దాదాపు 25 నుండి 40 గ్రాముల వరకు వీటిని తమ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.     Sunflower Seeds Benefits, Energy Boosting Superfoods, Nutritious Seeds For Health, Sunflower Seeds For Stamina, Healthy Diet Tips, Immunity Boosting Foods, Health Tips In Telugu.
నేటి ఆధునిక జీవనశైలిలో ఫిట్‌నెస్ అనేది చాలా మందికి ఒక పెద్ద సవాల్‌గా మారుతోంది. జిమ్‌లకు వెళ్లడానికి సమయం దొరకకపోవడం, కఠినమైన వ్యాయామాలు చేయలేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది శారీరక శ్రమకు దూరమవుతున్నారు. ఇలాంటి వారి కోసం సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన ఒక అద్భుతమైన ట్రెండ్  కోజీ కార్డియో  (Cozy Cardio). ఇది కేవలం చెమటోడ్చే వ్యాయామం మాత్రమే కాదు, మనసుకి ఎంతో ప్రశాంతతను ఇస్తూ చేసే ఒక సులువైన శారీరక కసరత్తు. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ హోప్ జుకర్‌బ్రో ద్వారా 2022లో ప్రాచుర్యం పొందిన ఈ  కోజీ కార్డియో  విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఇది ముఖ్యంగా మహిళలకు, బిజీ షెడ్యూల్ ఉండే వారికి ఒక అద్భుతమైన ఆరోగ్య మార్గంగా నిలుస్తోందని నిపుణులు వెల్లడిస్తున్నారు. సాధారణంగా జిమ్‌లలో చేసే తీవ్రమైన వ్యాయామాలు కీళ్లపై, ఎముకలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. కానీ, కోజీ కార్డియో పూర్తిగా లో-ఇంపాక్ట్, లో-ఇంటెన్సిటీతో కూడుకున్నది. ఇంట్లోనే ఉంటూ మనకు నచ్చిన వాతావరణంలో, మనకు ఇష్టమైన వ్యాపకాలతో దీనిని సులభంగా చేయవచ్చు. ఉదాహరణకు, ఇంట్లోని వాకింగ్ పాడ్ లేదా పోర్టబుల్ ట్రెడ్‌మిల్‌పై నెమ్మదిగా నడుస్తూనే మీకు ఇష్టమైన వెబ్‌సిరీస్ చూడవచ్చు, లేదా ఆడియో బుక్స్ వినవచ్చు. లేదంటే గదిలో మందమైన లైటింగ్ ఏర్పాటు చేసుకుని, ఆహ్లాదకరమైన సంగీతం వింటూ సైక్లింగ్ చేయడం, తేలికపాటి యోగా స్ట్రెచ్‌లు చేయడం వంటివి ఈ ట్రెండ్‌లో భాగం. దీనివల్ల వ్యాయామం ఒక బరువైన బాధ్యతలా అనిపించకుండా, ఎంతో ఆనందదాయకంగా మారుతుంది. ఈ సరికొత్త ఫిట్‌నెస్ విధానం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగానూ అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ప్రతి వారం కనీసం 150 నిమిషాల పాటు మోస్తరు శారీరక శ్రమ చేయడం గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కోజీ కార్డియో ద్వారా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. వ్యాయామ సమయంలో కలిగే మానసిక ప్రశాంతత వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇది రోజువారీ పని ఒత్తిడిని, ఆందోళనను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కఠినమైన వ్యాయామాలతో అలసిపోయిన కండరాలకు తగిన విశ్రాంతిని ఇస్తూనే, శరీరం చురుగ్గా ఉండేలా ఇది తోడ్పడుతుంది. జిమ్‌లకు వెళ్లడానికి ఇష్టపడని వారికి, లేదా పబ్లిక్‌లో వ్యాయామం చేయడానికి మొహమాటపడే వారికి ఇది సరైన ఎంపిక. దీనికి కావలసిన ఖర్చు కూడా చాలా తక్కువ మరియు ప్రారంభించడానికి పెద్దగా అడ్డంకులు ఉండవు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే తమ శరీర తత్వానికి తగినట్లుగా దీని తీవ్రతను మార్చుకోవచ్చు. రోజూ గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేసే ఉద్యోగులకు, గృహిణులకు ఇది సరికొత్త శక్తిని అందిస్తుంది. కాబట్టి, మీ దైనందిన జీవితంలో చిన్న మార్పులు చేసుకుంటూ, మీకు నచ్చిన రీతిలో కోజీ కార్డియోను అలవాటు చేసుకోండి. ఇది మీ శారీరక బలాన్ని పెంచడమే కాకుండా, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించి మిమ్మల్ని రోజంతా సంతోషంగా ఉంచుతుంది.     Cozy Cardio Trend, Gentle Home Workouts, Low Impact Exercise Benefits, Mental Health And Fitness, Stress-Free Workouts, Cozy Cardio Routine, Wellness Tips In Telugu.
ఉపవాసం అనగానే మనలో చాలామందికి ముందుగా గుర్తువచ్చేది ఏదో ఒక పూట భోజనం మానివేయడం లేదా దేవుడి పేరుతో చేసే పూజా కార్యక్రమాలు. అయితే ఆధునిక వైద్య శాస్త్రం , మన పురాతన కాలం నాటి ఆచారాలు కూడా ఉపవాసం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఎటువంటి ఖర్చు లేకుండా, మనం పాటించే చిన్న ఉపవాస పద్ధతి శరీరం లోపల ఎన్నో అద్బుతమైన మార్పులకు కారణమవుతుంది. ఉపవాసం గురించి మూర్ఖంగా వాదించే వారు కూడా ఉంటారు.  అలాంటి వారు ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తీగా అర్థం చేసుకోవాలి.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. జీర్ణవ్యవస్థకు విశ్రాంతి.. శరీరానికి ఎప్పుడూ ఆహారాన్ని అందిస్తూనే ఉంటే జీర్ణవ్యవస్థ విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల కాలక్రమేణా శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం, కణాల పనితీరు మందగించడం జరుగుతుంది. అదే మనం ఉపవాసం ఉన్నప్పుడు జీర్ణక్రియకు కాస్త విరామం దొరుకుతుంది. ఈ సమయంలో శరీరం తనను తాను శుభ్రం చేసుకునే ప్రక్రియపై పూర్తిగా దృష్టి పెడుతుంది. ఉపవాసం వల్ల శరీరానికి కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు.. బరువు నియంత్రణ.. మనం తినడం ఆపినప్పుడు శరీరం శక్తి కోసం మొదట గ్లూకోజ్ ను, ఆ తర్వాత నిల్వ ఉన్న కొవ్వును కరిగించడం మొదలుపెడుతుంది. దీనివల్ల అనవసరమైన కొవ్వు సులభంగా కరిగిపోయి బరువు అదుపులోకి వస్తుంది.   రోగనిరోధక శక్తి పెరుగుదల.. ఉపవాస సమయాల్లో శరీరం పాత , దెబ్బతిన్న కణాలను తొలగించి కొత్త కణాల ఉత్పత్తికి పెద్దపీట వేస్తుంది. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ మరింత బలంగా తయారవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ.. కొద్దిసేపు ఆహారానికి దూరంగా ఉండటం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గి, మధుమేహం అదుపులో ఉండేందుకు చక్కటి అవకాశం లభిస్తుంది. మెదడు చురుకుదనం.. ఉపవాసం ఉన్న సమయంలో మెదడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి , ఏకాగ్రత మెరుగుపడటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నిజం తెలుసుకోవాలి.. అయితే ఉపవాసం అంటే రోజంతా పస్తులు ఉండమని కాదు. మన శరీర తత్వానికి తగినట్లుగా, నీళ్లు లేదా పండ్ల రసాలు తాగుతూ తేలికపాటి పద్ధతిలో ఉపవాసం ఉండటం మంచిది. ఒకసారి ఈ చిన్న అలవాటును మన దినచర్యలో భాగం చేసుకుంటే, అనారోగ్యాలొచ్చే అవకాశాలు చాలావరకు తగ్గిపోయి నిత్యం ఉత్సాహంగా ఉండవచ్చు. కాబట్టి  ఉపవాసాన్ని కేవలం ఆచారంలా కాకుండా ఆరోగ్య రహస్యంగా భావించి పాటించడం వల్ల మరింత స్పష్టత వస్తుంది.                                                                                                                                        *రూపశ్రీ.
రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయా? రక్త ప్రసరణ సరిగా జరగడం లేదా? రక్తనాళాల్లో బ్లాకులు ఎందుకు ఏర్పడతాయి? వాటి వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుందా? మన వంటింట్లోనే దొరికే నాలుగు దినుసులతో ఆయుర్వేద చూర్ణాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు? ఈ చూర్ణంలో ఉపయోగించే దినుసులు ఏమిటి? వాటిని ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎలా ఉపయోగించాలి? అనే విషయాలను ఆయుర్వేద, వంటింటి వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వివరించారు. రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడటానికి గల కారణాలు, కొలెస్ట్రాల్ సమస్యలు, రక్త ప్రసరణకు సంబంధించిన విషయాలు, నాలుగు దినుసులతో ఆయుర్వేద చూర్ణం తయారీ విధానం గురించి డాక్టర్ మధుసూదన శర్మ గారి వివరణను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. రక్తనాళాల ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారు, కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు, రక్త ప్రసరణ గురించి తెలుసుకోవాలనుకునే వారు ఈ వీడియోను చూడండి. ముఖ్య గమనిక: రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి. ఆయుర్వేద చూర్ణం లేదా ఇతర ఇంటి వైద్యాలను ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించాలి. డాక్టర్ సూచించిన మందులను స్వయంగా ఆపకూడదు. రక్తనాళాల్లోని బ్లాకులకు మందులు లేదా స్టెంట్ అవసరమా అనే విషయాన్ని వైద్యులే నిర్ణయించాలి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)