LATEST NEWS
  తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పొత్తులో భాగంగా విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తమిళనాడ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపధ్యంలో ఈ ప్రచారానికి ప్రాధాన్యత సంతరించుకుంది.  టీవీకేతో పొత్తుకు సంబంధించి చర్చలు తుది దశకు చేరుకున్నాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి. విజయ్ పార్టీకి 80 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ ప్రతిపాదించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. అయితే విజయ్ సీఎం పదవిపై దృష్టి పెట్టారని, చర్చల్లో ఆ విషయం కీలకంగా మారిందని చెప్తున్నారు. బీజేపీ, డీఎంకేలతో తమకు పొత్తులు ఉండవన విజయ్ గతంలోనే తేల్చి చెప్పారు. అయినా పొత్తులపై ప్రచారం జరుగుతూనే ఉండటం విశేషం.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. సీఈసీపై అభిశంసన విషయంలో జగన్ తీసుకునే స్టాండ్ ఏమిటి అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. గత ఏన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి ఈవీఎంల ట్యాంపరింగే కారణం అంటూ సమయం వచ్చినా, రాకున్నా వైసీపీయులు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.  2024 ఎన్నికల్లో  కూటమి విజయం వెనుక ఈసీ హస్తం ఉందని పదేపదే ఆరోపిస్తున్న వైసీపీ ఇప్పుడు  సీఈసీపై ప్రతిపక్షాల అభిశంసన తీర్మానానికి మద్దతుగా నిలబడుతుందా? అలా నిలబడే ధైర్యం చేస్తుందా? జగన్ కు ఆ దమ్ముందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  2024  ఎన్నికల ఫలితాల తర్వాత  వైసీపీ ఈసీ పనితీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ఓట్ల లెక్కింపులో తేడాలు ఉన్నాయనీ, అరకోటికి పైన ఓట్లపై స్పష్టత లేదనీ పలు విమర్శలు చేసింది.  రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీలు దీనిపై ప్రశ్నలు కూడా సంధించారు. ఇప్పుడు  అదే ఈసీపై పక్షపాత వైఖరి, ఎన్నికల మోసం అనే ఆరోపణలతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అభిశంసన తీర్మానం నోటీసు ఇచ్చింది. ఇప్పుడు ఆ తీర్మానానికి  వైసీపీ   మద్దతు ఇస్తుందా లేదా అన్న చర్చ జోరందుకుంది.   ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే..   ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ  వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం  కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి. తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేసిన పార్టీగా ప్రజల ముందు తలదించుకుని నిలబడాల్సి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే ఆ పార్టీకి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా పార్లమెంటులో వైసీపీ ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా ఒరిగేదేం లేదు. కానీ   తమ ఓటమికి ఈసీనే కారణమని  వైసీపీకి నిజంగా నమ్ముతుంటే.. తీర్మానాన్ని బలపరచాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా వైసీపీ వ్యవహరిస్తే.. ఆ పార్టీ విశ్వసనీయత పాతాళంలోకి దిగజారిపోవడం ఖాయం.    సీఈసీపై అవిశ్వాస తీర్మానంపై ఇప్పటి వరకూ దాదాపు 195 మంది ఎంపీలు సంతకాలు చేశారు.  అలా సంతకాలు చేసిన వారిలో ఒక్కరంటే ఒక్కరైనా వైసీపీ ఎంపీ లేరు. దీంతో వైసీపీది ద్వంద్వ నీతి, నైతికతనీ నైతికత లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ విషయమేంటంటే.. కేసుల భయంతో జగన్ వైసీపీకి వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ కారణంగానే సీఈసీపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఆ పార్టీ ఎంపీలు నిలబడే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రజా విశ్వాసాన్ని చూరగొనడం కంటే.. జగన్ కు కేసుల నుంచి రక్షణ పొందడమే ముఖ్యమనీ, అందుకే  వైసీపీ ఎంపీలు సీఈసీపై అవిశ్వాన తీర్మానంపై సంతకాలు చేయడానికి ముందుకు రావడం లేదనీ అంటున్నారు. రాజకీయవర్గాలలో వైసీపీ నైతిక పతనానికి దీనిని సంకేతంగా చూపుతూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చూడాలి మరి సీఈసీపై అవిశ్వాత తీర్మానం విషయంలో జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో?
మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అదే ఫామ్ హౌస్.. ఇప్పుడు డ్రగ్స్ పార్టీ, కాల్పుల కలకలం తో మరోసారి తెరమీదకు వచ్చింది.   బీఆర్ఎస్   హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.  అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో  పెను సంచలనం సృష్టించింది.  ఇప్పుడు అదే ఫామ్ హౌస్ లో అప్పటి ఫిర్యాదుదారుగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి.. ఇప్పుడు డ్రగ్స్ పార్టీ, కాల్పుల కలకలం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు.  అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు సోదాలు నిర్వహిస్తే.. ఇప్పుడు డ్రగ్స్ పార్టీ గురించిన విశ్వసనీయ సమాచారంతో  ఈగల్ టీమ్ మెరుపు దాడి నిర్వహించి రోహిత్ రెడ్డితో సహా 11 మందిని అరెస్టు చేసింది. ఇప్పుడు స్వయంగా రోహిత్ రెడ్డి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలారు.   గతంలో రోహిత్ రెడ్డి పోలీసులకు సహకరించిన అదే ఫామ్ హౌస్ లో, ఈసారి రోహిత్ రెడ్డి సమక్షంలోనే  పోలీసులపై కాల్పులు జరిగాయి.  ఒకే ఫామ్ హౌస్ గతంలో రాజకీయ కుట్రలకు వేదికగా, ఇప్పుడు డ్రగ్స్ పార్టీలను చిరుమానాగా ఉండటం గమనార్హం.  గతంలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వస్తే, ఇప్పుడు ప్రముఖ రాజకీయ నేతలు, ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల సమక్షంలో డ్రగ్స్ పార్టీకి వేదికగా మారడం ప్రాధాన్యత సంతరించుకుంది.   గతంలో జరిగిన ఘటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటే.. ఇప్పుడు క్రిమినల్ యాక్టివిటీలో ప్రముఖుల ప్రమేయం ప్రాధాన్యతాంవంగా ఉంది.  
ALSO ON TELUGUONE N E W S
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కథానాయకుడిగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. సినిమా ట్రైలర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉందని చిరంజీవి కొనియాడారు. "మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి “ఉస్తాద్ భగత్ సింగ్” తో అన్నీ శుభాలే" అని అని ఆయన ట్వీట్ చేశారు. ట్రైలర్ లింక్‌ను కూడా ఆయన అభిమానులతో పంచుకున్నారు. మెగాస్టార్ ప్రశంసలపై దర్శకుడు హరీష్ శంకర్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. చిరంజీవి గారు విదేశాల్లో ఉన్నప్పటికీ, సమయం కేటాయించి మరీ ట్రైలర్ చూసి అభినందించడం తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు.  "అయ్యబాబోయ్... అన్నయ్య. మీ టైమింగ్, రైమింగ్ చూస్తుంటే మీకు ట్రైలర్ ఏ రేంజులో నచ్చిందో నాకర్థమైంది. మీరు ఔట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారని తెలిసింది, అయినా సరే వీలు చేసుకుని మా ట్రైలర్ చూసినందుకు, అభినందనలు తెలిపినందుకు నా ఆనందానికి అవధులు లేవు. మెగా ఆశీర్వాదం' కూడా దొరికింది కాబట్టి ఇక మెరుపు వేగంతో దూసుకెళ్ల డమే, ఎందుకంటే.. "మీరు ట్వీటు పెడితే...హీటు పెరిగినట్టే" అంటూ హరీష్ శంకర్ రిప్లై ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'ఉస్తాద్ భగత్ సింగ్'లో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లు. ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది. నేడు (మార్చి 15) హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. https://x.com/harish2you/status/2033053569335833066
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ"(Couple Friendly) ఓటిటిలోనూ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది.  వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన కపుల్ ఫ్రెండ్లీ మూవీ మంచి వసూళ్లతో సత్తా చాటింది. ఇప్పుడు ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్ అందుకుంది. సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక మంచి మూవీ చేశారంటూ యూత్ సోషల్ మీడియాలో చాలా అప్రిషియేట్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా బాగుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా మూవీకి బాగా మైలేజ్ తీసుకొచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో సినిమా చూస్తున్న ప్రేక్షకులు కపుల్ ఫ్రెండ్లీ మూవీని అప్రిషియేట్ చేస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. "కపుల్ ఫ్రెండ్లీ" చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.  
టాలీవుడ్‌లో ఊరమాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu). ఇప్పుడు ఆయన బాలీవుడ్ బాక్సాఫీస్‌పై కన్నేసినట్లు కనిపిస్తోంది. సన్నీ డియోల్ హీరోగా బోయపాటి శ్రీను ఒక భారీ యాక్షన్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ఒక క్రేజీ వార్త వైరల్ అవుతోంది. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ నటించిన 'జాట్' (Jaat) సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సన్నీ డియోల్ మార్క్ యాక్షన్, గోపీచంద్ మలినేని మాస్ ఎలివేషన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.  ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ 'జాట్ 2' రూపొందించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే గోపీచంద్ మలినేని ప్రస్తుతం 'NBK111' ప్రాజెక్టుతో బిజీగా ఉండటంతో, సీక్వెల్ కోసం నిర్మాతలు మరో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనును సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. బోయపాటి శ్రీను సినిమాల్లో హీరోల ఎలివేషన్లు, భారీ యాక్షన్ సీన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో మనకు తెలుసు. సన్నీ డియోల్ బాడీ లాంగ్వేజ్‌కు, బోయపాటి మేకింగ్ స్టైల్ పక్కాగా సరిపోతుందని నిర్మాతలు భావిస్తున్నారట. ఒకవేళ బోయపాటి ఈ ప్రాజెక్టుకు ఓకే చెబితే, బాలీవుడ్‌లో సరికొత్త యాక్షన్ విస్ఫోటనం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సన్నీ డియోల్ ఇటీవల 'బార్డర్ 2'తో ప్రేక్షకులను పలకరించి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం 'రామాయణ'తోపాటు 'గబ్రు', 'లాహోర్' వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ లోపు 'జాట్ 2'కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తవుతాయని సమాచారం.  బోయపాటి డైరెక్షన్‌లో సన్నీ డియోల్ సినిమా అంటే అది ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుంది అనడంలో డౌట్ లేదు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. సాధారణంగా గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకునే ఈ బ్యూటీ.. ఇప్పుడు ఇద్దరు లెజెండరీ మహిళల జీవిత కథల్లో నటించబోతున్నట్లు సమాచారం. మధుబాల బయోపిక్: భారతీయ సినీ చరిత్రలో 'వినోదాల రాణి'గా పేరుగాంచిన నటి మధుబాల. ఆమె అందం, అభినయం ఇప్పటికీ ఎందరికో స్ఫూర్తి. మధుబాల జీవిత ఆధారంగా బాలీవుడ్‌లో ఒక భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మధుబాల పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ముఖకవళికలు, క్లాసిక్ లుక్ ఆ పాత్రకు సరిగ్గా సరిపోతాయని మేకర్స్ భావిస్తున్నారట. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్: కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత కథ కూడా వెండితెరపైకి రాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సుబ్బలక్ష్మి పాత్ర కోసం కూడా సాయి పల్లవి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవికి క్లాసికల్ డ్యాన్స్ తెలిసి ఉండటం, ఆమె సంప్రదాయ రూపం ఈ పాత్రకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతాయని టాక్. సాయి పల్లవి ప్రస్తుతం రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న 'రామాయణ'లో సీతమ్మ తల్లిగా నటిస్తోంది. అలాగే హిందీలో ఏక్ దిన్ తో పాటు తమిళ్ లో ధనుష్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది.   
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది(Peddi) సినిమా చేస్తున్నాడు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్. శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. డాల్బీ సినిమా ఫార్మాట్‌లో విడుదల కాబోతున్న మొట్టమొదటి తెలుగు చిత్రంగా 'పెద్ది' రికార్డు సృష్టించనుంది. ఈ సాంకేతికత వల్ల సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు థియేటర్లో ఒక సరికొత్త లోకంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. విజువల్స్ చాలా స్పష్టంగా, రంగులు సహజంగా కనిపిస్తాయి. బుచ్చిబాబు ఈ సినిమాను విజువల్ పరంగా చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మనం థియేటర్లలో 'డాల్బీ అట్మాస్' సౌండ్ గురించి వింటుంటాం. కానీ 'డాల్బీ సినిమా' అనేది అంతకంటే మెరుగైన సాంకేతికత. ఇందులో అద్భుతమైన విజువల్స్, హై-క్వాలిటీ సౌండ్ రెండూ కలిసి ఉంటాయి. ఇప్పటివరకు హాలీవుడ్ సినిమాలు మాత్రమే ఈ ఫార్మాట్‌లో ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు తెలుగులో 'పెద్ది' సినిమా ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకోబోతోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 30న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది. 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశి ఖన్నా(Raashii Khanna)ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 'పుష్ప'తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన బన్నీ సరసన నటించే అవకాశం రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఒకవేళ ఇది నిజమైతే, రాశి ఖన్నా కెరీర్‌లో ఇది ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది. లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలను కూడా చాలా బలంగా డిజైన్ చేస్తారు. ఈ సినిమాలో రాశి ఖన్నా పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ గురించి చర్చలు జరిగినప్పటికీ, ఇప్పుడు అది పట్టాలెక్కేలా కనిపిస్తోంది. రాశి ఖన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కూడా ఆమె ఖాతాలో చేరితే, మెగా ఆఫర్ కొట్టేసినట్టే. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. Also Read: కాస్టింగ్ కౌచ్‌పై మెగా కోడల సంచలన వ్యాఖ్యలు
మెగా కోడలు, ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదురైన ఇబ్బందుల గురించి మనసు విప్పారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే 'కాస్టింగ్ కౌచ్' గురించి ఆమె షాకింగ్ విషయాలు వెల్లడించారు. కరోనా సమయంలో లావణ్య ఒక తమిళ సినిమాలో నటించాల్సి ఉంది. అయితే, ఆ సినిమా షూటింగ్ సమయంలో అక్కడి వాతావరణం, ముఖ్యంగా దర్శకుడి ప్రవర్తన ఆమెకు అస్సలు నచ్చలేదు. అక్కడ తనకు రక్షణ లేదని, అసౌకర్యంగా ఉందని అనిపించడంతో ఆమె ధైర్యంగా ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. సినిమా వదులుకున్న తర్వాత లావణ్యకు మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. ఆ చిత్ర బృందం ఆమెపై పగ తీర్చుకునే ప్రయత్నం చేసింది. పత్రికల్లో లావణ్య గురించి తప్పుడు వార్తలు రాయించారు. ఆమెపై కేసులు కూడా పెట్టారు. ఆ సమయంలో ఇండస్ట్రీలో ఎవరూ తనకు మద్దతుగా నిలవలేదని, ఒంటరిగా చాలా బాధపడ్డానని ఆమె తెలిపారు. "ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక చాలా సార్లు ఏడ్చేశాను" అని లావణ్య తన బాధను పంచుకున్నారు. అయితే ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం ఆమె బయటపెట్టలేదు. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటిస్తున్న మొదటి సినిమా 'సతీ లీలావతి'. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.  ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె ధైర్యాన్ని అభినందిస్తున్నారు.
తెలంగాణ బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని ప్రముఖ ఉదయ భాను కలిశారు. బీసి సామాజిక వర్గానికి చెందిన ఉదయ భాను తెలంగాణలో బలహీన వర్గానికి చెందిన అణగారిన మహిళల భవిష్యత్తు గురించి ప్రభాకర్ తో చర్చించారు. సినిమా రంగంలో, వ్యాపార రంగంలో మహిళలకు అవకాశాలు కలిపించాలని కోరారు. అంతేగాక వారికి వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విన్నపించారు.  తన లాగే ఉదయ భాను మహిళలపై చూపిస్తున్న ప్రేమకి, వారికి మంచి చేయాలానే ఆమె ప్రయత్నానికి ప్రభాకర్ ఆకర్షితులయ్యారు. ఉదయ్ భాను ఆలోచనలని, తన అభిప్రాయాలని మెచ్చుకున్నారు. తప్పకుండా తాను అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.  ఇప్పటికే ఎంతోమందికి ప్రభుత్వం తరుపున ఇంకా స్వంతంగా ఎన్నో ప్రయోజనాలు అందించిన ఆయన, ఇక నుంచి మరింత అండగా ఉంటానని చెప్పారు. మహిళల పట్ల ఉదయ భానుకున్న ప్రేమపై ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆమెతో చర్చించారు. తెలంగాణలో  వెనుకబడిన, అణగారిన మహిళల శ్రేయస్సు, సాధికారతపైన వారి చర్చ సాగింది. ముఖ్యంగా తదుపరి తరం మహిళలకు ఆత్మవిశ్వాసంతో, అవకాశాలతో, గౌరవంతో ఎదగడానికి మరింత బలమైన మార్గాలను ఎలా సృష్టించవచ్చో అనే దానిపైన ఉదయ భాను సుధీర్గంగా చర్చించారు.  అణగారిన మహిళల కోసం ముందుకు వచ్చి, వారి సంక్షేమం కోసం ఉదయ భాను చేస్తున్న ప్రయత్నం అభినందనీయంగా మారింది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టినా.. పెద్దయ్యాక జీవితాలు విడివడి దూరం పెరిగే బంధం తోబుట్టువుల బంధం. అయితే ఈ ప్రపంచంలో రక్త సంబంధానికి ఉన్న శక్తి, దాని ప్రత్యేకత చాలా గొప్పది. తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు తోబుట్టువుకు చెప్పుకునే వారు ఎందరో ఉంటారు.   పిల్లల మధ్య ఉన్న తోబుట్టువుల బంధం  జీవితాంతం నిలిచే సంబంధం. ఈ బంధం ప్రేమతో, గౌరవంతో, పరస్పర సహకారంతో ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం.  తల్లిదండ్రులు చేసే  ప్రవర్తన,  ప్రేమ చూపే విధానం, మందలించే తీరు, పోలికలు పెట్టడం లాంటి వాటి వల్ల ఈ బంధం బలపడవచ్చు లేదా బలహీనమవచ్చు. తోబుట్టువుల బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు నేర్పించాల్సినవి ఏంటో తెలుసుకుంటే.. తోబుట్టువుల బంధం బలంగా ఉండటానికి తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు.. సమాన ప్రేమ, గౌరవం.. తల్లిదండ్రులు పిల్లలను  అందరినీ సమానంగా ప్రేమించడం, గౌరవించడం చాలా ముఖ్యం. “నువ్వు పెద్దవాడివి కాబట్టి ఎప్పుడూ తక్కువగా వాదించు” లేదా “నువ్వు చిన్నవాడివి, నీ అక్క/అన్న మాట విను” అనే మాటలు కొన్నిసార్లు అన్యాయంగా అనిపిస్తాయి. పిల్లలు ఇద్దరూ తల్లిదండ్రుల దృష్టిలో సమానమైనవారమనే భావన కలిగి ఉండాలి. ఇది అసూయ లేదా అసమానత ఫీలింగ్ రాకుండా చేస్తుంది.  సహకారం, పంచుకోవడం నేర్పించాలి.. చిన్నప్పటి నుంచే కలిసి ఆటలు ఆడించడం, పని చేయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోడం అలవాటు చేయాలి. కలసి చేసే పనులు జట్టు భావన,  బాధ్యతా భావం పెంచుతాయి. కష్టాలు, ఇబ్బందులు పంచుకోవడం..  పిల్లలు తమ ఇబ్బందులను ఒకరితో ఒకరు చెప్పుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడు ఉండటం చిన్నతనం నుండే తల్లిదండ్రులు నేర్పించాలి. దీనివల్ల తోబుట్టువు అంటే ధైర్యం, భరోసా ఏర్పడతాయి.  వివాదాలు వచ్చినప్పుడు న్యాయంగా వ్యవహరించడం.. తల్లిదండ్రులు పిల్లల పట్ల న్యాయంగా ఉండాలి. ఎప్పుడు ఒకరికే తమ సపోర్ట్ ఇవ్వడం, తప్పు చేయకపోయినా ఇంకొకరిని తిట్టడం లాంటివి చేయకూడదు. వివాదాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరి వెంట మరొకరు ఎలా సపోర్ట్ ఉండాలో కూడా నేర్పించాలి.  పోలికలు కాదు ప్రోత్సాహం ఇవ్వడం.. “నీ తమ్ముడు బాగా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవడం లేదు?” లాంటి పోలికలు బంధాన్ని పాడుచేస్తాయి. ప్రతిఒక్కరి బలాలు వేరు.  ఒకరు చదువులో, మరొకరు క్రీడల్లో మెరుస్తారు.  “నీకు వంట బాగా వస్తుంది, నీ అక్క డ్రాయింగ్ బాగా వేస్తుంది”  ఇలాంటి మాటలు  వల్ల ఇద్దరూ తమతమ ప్రతిభను గౌరవిస్తారు.   సమయం కేటాయించడం.. పిల్లలతో సమయం గడపడటం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా పిల్లల అభిరుచిని బట్టి వారికి సమయాన్ని కేటాయించాలి.  ఇలా చేస్తే పిల్లలందరికీ తల్లిదండ్రులు “నన్ను ప్రత్యేకంగా చూసుకుంటున్నారు” అనే భావన వస్తుంది.  ఇది అసూయ తగ్గిస్తుంది. ప్రేమ చూపే విధానం నేర్పించడం.. తోబుట్టువులు ఒకరికి ఒకరు ప్రేమ చూపడం, క్షమించుకోవడం నేర్పించాలి. “అన్నకు sorry చెప్పు” అనడం కాకుండా, “నీ మాట వల్ల అన్నకి బాధ కలిగింది, ఇప్పుడు ఎలా సరిచేస్తావు?” అని అడగాలి.  ఇది మనసును అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచుతుంది.                           *రూపశ్రీ.
వేసవి కాలం అనగానే చాలామందికి కూలర్లు, ఏసీలు గుర్తుకు వచ్చేస్తాయి.  ఫిబ్రవరి నెల వరకు అంతగా అవసరం లేని, ఎక్కువగా వాడని వారు కూడా మార్చి నెలతో ఏసీలు వాడటం మొదలు పెడతారు. ఏసీ ఎంత చల్లదనం ఇస్తుందో.. అంతే కరెంట్ బిల్లు కూడా తెచ్చిపెడుతుంది.  ఏసీని ఎక్కువగా వాడితే వేలాది రూపాయల కరెంట్ బిల్లు వస్తుంది.  ఈ కారణంగానే చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఏసీ పెట్టించుకోవాలి అనే ఆశ ఉన్నా, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే భయంతో ఆ ఆలోచన మానుకుంటారు. అయితే ఏసీ రోజంతా వాడినా సరే.. కరెంట్ బిల్లు ఎక్కువ రాకూడదంటే కొన్ని సీక్రెట్ ట్రిక్స్  ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుంటే.. టెంపరేచర్... చాలామంది ఏసీ ఆన్ చేశారంటే తక్కువ టెంపరేచర్ సెట్ చేసుకుంటారు.  ఎక్కువ మంది 17 లేదా 15 వరకు కూడా పెడుతుంటారు. కానీ ఏసీ ని ఎప్పుడూ 26డిగ్రీల వద్ద పెడితే సరిపోతుంది.  ఇది రూమ్ మొత్తం చల్లదనాన్ని ఇస్తుంది. కరెంట్ బిల్లు కూడా తక్కువ వస్తుంది. ఏసీ, ప్యాన్ కాంబినేషన్.. ఏసీ, ప్యాన్ కాంబినేషన్ గురించి చాలామందికి తెలియదు.  ఏసీ వేసినప్పుడు ప్యాన్ ఎందుకు అని కొందరు అనుకుంటారు.  కానీ ఏసీ వేసినప్పుడు కొద్దిసేపు ఫ్యాన్ కూడా ఆన్ చేయాలి.  ఇలా చేస్తే గది తొందరగా చల్లబడుతుంది. ఆ తర్వాత ఫ్యాన్ ఆప్ చేసుకోవచ్చు. డోర్స్, విండోస్.. చాలామంది ఏసీ ఆన్ చేసి డోర్స్, విండోస్ తెరచి ఉంచుతారు. కానీ ఇది చాలా తప్పు.  డోర్స్, విండోస్ తెరచి ఉంచడం వల్ల బయటి వేడి గాలి లోపలి వస్తూ గదిని చల్లబడనివ్వదు.  దీనివల్ల ఏసీ ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. కర్టెన్లు.. కిటికీలకు గాజు అద్దాలు ఉంటే.. వేడి సెగ అనేది లోపలికి వస్తూ ఉంటుంది.  అందుకే కిటికీ ల దగ్గర కర్టెన్లు వేయాలి.  ఇలా చేస్తే వేడి లోపలికి రాదు. ఫిల్టర్.. చాలామంది వేసవి రాగానే ఏసీ వేయాలి అనే ఆలోచన ఉంటుంది కానీ,  ఏసీ ఫిల్టర్ల గురించి మాత్రం అంతగా పట్టించుకోరు.  ఏసీ ఫిల్టర్లను క్లీన్ చేయాలి.  వాటిలో డస్ట్ అలాగే ఉంటే ఏసీ పని చేయడానికి విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. పైగా ఫిల్టర్ల లో ఉండే డస్ట్ కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది.  శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. స్లీప్ మోడ్ లేదా టైమర్.. వేసవిలో కాసింత చల్లగాలి తగిలితే చాలు నిద్రపోవచ్చు అనుకునేవారు ఏసీని  ఆన్ చేసినప్పుడు స్లీప్ మోడ్ లేదా టైమర్ సెట్ చేసుకోవడం మంచిది. ఇది సెట్ చేస్తే ఏసీ దానంతకు అదే ఆఫ్ అవుతుంది.  ఇది సెట్ చేసుకొనేటప్పుడు రూమ్ లో ప్యాన్ ఆన్ లో ఉంచితే.. ఏసీ ఆప్ అయినా ఫ్యాన్ కారణంగా నిద్రకు ఆటంకం కలగకుండా హాయిగా నిద్రపోవచ్చు. పైన చెప్పుకున్న చిట్కాలు పాటిస్తే ఏసీ ఎంత వాడినా సరే.. కరెంట్ బిల్లు హడలిపోయేంతగా రాదు.  ఖచ్చితంగా విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవచ్చు.                                        *రూపశ్రీ.
అపజయాలు ప్రతి మనిషి జీవితంలో వస్తూనే ఉంటాయి. అపజయాలు లేకపోతే అసలు విజయానికి విలువ, విజయాలు అనుభూతి చెందలేదు. కానీ ప్రతి ఒక్కరూ అపజయం అనేది తమకు ఎదురు కాకూడదు అని అనుకుంటారు. అయితే అపజయాల విషయంలో మనిషి వైఖరి ఎలా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.  "ఒక వ్యక్తి వెయ్యిమార్లు విఫలుడైనా ఉన్నతమైన ఆదర్శానికి అంటిపెట్టుకుని ఉండాలి. అబద్ధాలు చెప్పడం రాని గోడలా ఉండడం కన్నా, తప్పు చేస్తూ ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ఉత్తమం" అని అనేవారు స్వామి వివేకానంద. అబ్రహమ్ లింకన్ తమ దేశ పార్లమెంటు సభ్యుడవ్వాలనుకున్నాడు. అయితే అతని మొదటి ప్రయత్నం విఫలమైంది. వ్యాపారంలో భాగస్వామి అతణ్ణి మోసం చేశాడు. వ్యాపారం కోసం చేసిన అప్పుల బారినుంచి బయటపడడానికి 17 సంవత్సరాల కాలం పట్టింది. అతను వివాహం చేసుకున్న కొద్దికాలానికే మొదటి భార్య మరణించింది. గయ్యాళి అయిన రెండవ భార్య అతనికి పెద్ద తలనొప్పిగా మారింది. అయినా అతడు తన లక్ష్యసాధనకై శక్తినంతా ఉపయోగిస్తూ, చేస్తున్న ప్రయత్నాలను మానలేదు. చివరకు అతను ఎన్నికల్లో నెగ్గడమే కాకుండా, అమెరికా అధ్యక్షుడై, చరిత్రపుటల్లోకి ఎక్కాడు. వ్యక్తిగత సమస్యలకు జడవకుండా, ఉన్నత ఆదర్శాన్ని విడవకుండా ప్రయత్నించిన వారే ఏ కార్యాన్నైనా సాధించగలరు. మనిషి వ్యక్తిగత, సామాజిక, మానసిక రంగాలలో తప్పకుండా అభివృద్ధి సాధించాలి. అలా సాధించినప్పుడు మనిషికి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ విషయం లోతు ఎంత అనేది అర్థం అవుతుంది. లేకపోతే ఎప్పటికీ ఏమీ తెలియకుండా బెల్లం కొట్టిన రాయి చందాన మనిషి ప్రవర్తన కూడా ఏమీ పట్టనట్టు, ఏమీ తెలియని ముర్ఖుడిలా ఉండిపోతారు. ఇలా ఉంటే అపజయాలు ఎదురైనప్పుడు వాటి నుండి ఏమీ నేర్చుకోలేరు. అపజయాల గురించి అసలు ఆలోచించలేరు. కేవలం అపజయాల కారణంగా తాము ఎదగలేక పోయామనే అసంతృప్తి మాత్రమే వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి అపజయాలను అనుభవాలుగా చూసినప్పుడే మనిషి సరైన ఆలోచనా మార్గంలో ఉండగలుగుతారు.                                  *నిశ్శబ్ద.
వేసవి వచ్చేసింది. వేసవి కాలం దానితో పాటు మండే ఎండలు,  ఎండ వేడిని వెంట పెట్టుకుని వస్తుంది. ఈ సీజన్‌లో చెమట, శరీరం తేమ కోల్పోవడం,   నిరంతరం  అలసటగా అనిపించడం వంటి సమస్యలు పెరుగుతాయి. పెరుగుతున్న వేడి,  వేడిగాలుల కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.  వేసవి కాలంలో  హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు తాగుతారు,  కానీ అది శరీరాన్ని చల్లబరచదు. ఎన్ని నీళ్లు తాగినా తృప్తి కలగదు.  మార్కెట్ లో పానీయాలు కొనుగోలు చేయడం,  మరీ ముఖ్యంగా కూల్ డ్రింకుల కొనుగోలు వేసవిలో బాగా పెరుగుతాయి. కానీ వీటిలో రసాయనాలు ఉంటాయి.  ఈ వేసవిలో శరీరం చల్లగా ఉండాలంటే ఇంట్లోనే చేసుకోదగిన కొన్ని పానీయాలు తీసుకోవడం మంచిది. భారతీయులకు ఎంతో సుపరిచితమైన,  ఆరోగ్యానికి మేలు చేస్తూ వేసవి తాపాన్ని తగ్గించే పానీయాలు ఏంటో తెలుసుకుంటే.. బేల్ షర్బత్.. పరమ శివుడి ఆరాధనలో ఉపయోగించే బిల్వ  పత్రం మాత్రమే మనకు తెలుసు. కానీ బిల్వ వృక్షానికి పండ్లు కూడా కాస్తాయి.  వీటినే బిల్వ పండ్లు లేదా బేల్ పండ్లు అని మారేడు కాయలు అని అంటూ ఉంటారు.  ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. బాగా పండిన బిల్వ పండ్లను జ్యూస్ చేసి తాగితే శరీరం చల్లబడుతుంది. కావలసిన పదార్థాలు.. పండిన బిల్వ పండు చల్లని నీరు.. 4 గ్లాసులు బెల్లం లేదా చక్కెర.. 3 నుండి 4 స్పూన్లు నల్ల ఉప్పు.. కొద్దిగా. తయారు విధానం.. బిల్వ పండును పగలగొట్టి గుజ్జు తీయాలి.  ఈ గుజ్డులో నీరు పోసి బాగా బ్లెండ్ చేయాలి.  స్ట్రైయినర్ సహాయంతో వడబోయాలి. ఇందులో బెల్లం లేదా పంచదార,  నల్ల ఉప్పు వేసి బాగా కరిగిన తర్వాత తాగాలి. ఆమ్ పన్నా.. వేసవి అంటే మామిడికాయలు.  పచ్చి మామిడి కాయలతో చేసే ఆమ్ పన్నా రుచిగానే కాకుండా శరీరానికి చలువ చేస్తుంది. కావలసిన పదార్థాలు.. పచ్చి మామిడికాయలు.. 2 బెల్లం లేదా చక్కెర.. 3 టీస్పూన్లు వేయించిన జీలకర్ర పొడి నల్ల ఉప్పు పుదీనా.. తయారీ విధానం.. మామిడికాయలు ఉడకబెట్టి గుజ్జు తీసుకోవాలి.  గుజ్జులో బెల్లం లేదా చక్కెర వేయాలి. ఇందులో కాసింత పుదీనాను వేసి మిక్సీ వేసుకోవాలి.  దీనికి కావలసినంత నీరు కలిపి జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇందులో వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి కలిపి తాగాలి.  ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. జల్ జీరా.. జల్ జీరా పేరు వింటేనే ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది.  ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం,  శరీరానికి చలువ,  గ్యాస్, అజీర్ణం నుండి ఉపశమనం కూడా ఇస్తుంది. కావలసిన పదార్థాలు.. జల్ జీరా పొడి నీరు పుదీనా నిమ్మరసం నల్ల ఉప్పు తయారీ విధానం.. చల్లని నీటిలో జల్ జీరా పొడి,  నిమ్మరసం, నల్ల ఉప్పు,  పుదీనా అన్నీ వేసి బాగా కలిపి తాగడమే.   సత్తు జ్యూస్.. బీహార్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలలో సత్తును వేసవిలో  తాగుతారు. ఇది చాలా శక్తివంతమైన పానీయం.  కడుపును చల్లబరుస్తుంది,  ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. కావలసిన పదార్థాలు.. సత్తు పొడి.. నల్ల ఉప్పు.. వేయించిన జీలకర్ర పొడి నిమ్మరసం తయారీ విధానం.. నీటిలో సత్తు పొడి, నల్ల ఉప్పు,  వేయించిన జీలకర్ర పొడి అన్ని వేసి బాగా మిక్స్ చేయాలి.  ఇందులో కాసింత నిమ్మరసం కలిపి తాగాలి. మజ్జిగ.. బారతీయులు ఎక్కువగా తాగే ఆరోగ్యకరమైన పానీయం మజ్జిగ.  పెరుగు నుండి  వెన్నను తీయగా మిగిలిన పానీయమే మజ్జిగ.  ఈ మజ్జిగ మరింత రుచిగా ఉండటానికి ఇందులో అల్లం, వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు,  పొదీనా వేసి తాగుతారు.  మజ్జిగ మరింత రుచిగా రావడానికి కరివేపాకుతో పోపు పెట్టి తాగుతారు.  ఇందులో కొత్తి మీర వేసుకుంటే రుచి మరింత బాగుంటుంది.                               *రూపశ్రీ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం పట్ల మనం చూపే నిర్లక్ష్యం మనల్ని ఎక్కడికి తీసుకువెళుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 బిలియన్ల మంది ఊబకాయం (Obesity) మరియు దాని సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నారు. ఇది కేవలం శరీర ఆకృతికి సంబంధించిన సమస్య కాదు.. ఇది మన ఆయుష్షును తగ్గించే ఒక నిశ్శబ్ద శత్రువు. ఈ రోజు మనం మన ఆరోగ్యం గురించి గంభీరంగా ఆలోచించకపోతే, రేపు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.  Metabolic and Bariatric Surgeon Dr. Kona Lakshmi చెప్పిన మరిన్ని విషయాలు Video Link క్లిక్ చేసి తెలుసుకోండి. మనం ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? (Why should we care?) ఊబకాయం అనేది ఇతర ప్రమాదకరమైన రోగాలకు ఒక ముఖద్వారం లాంటిది. దీనివల్ల కలిగే నష్టాలు ఊహించలేనంత దారుణంగా ఉంటాయి: గుండె మరియు ఊపిరితిత్తులపై ప్రభావం: మీ బరువు పెరిగేకొద్దీ మీ ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది, ఇది గుండె దెబ్బతినడానికి దారితీస్తుంది. సడన్ కార్డియాక్ డెత్స్‌కు ఊబకాయం ప్రధాన కారణం. క్యాన్సర్ ముప్పు: దాదాపు 13 రకాల క్యాన్సర్లు నేరుగా ఊబకాయంతో ముడిపడి ఉన్నాయి. మెటబాలిక్ వ్యాధులు: డయాబెటిస్ (షుగర్), హై బ్లడ్ ప్రెషర్, మరియు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు బాడీలోని "ఇంజిన్"ను లోపల నుండి దెబ్బతీస్తాయి. కీళ్ల నొప్పులు: అధిక బరువు వల్ల ఆర్థరైటిస్ వంటి కీళ్ల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఏమి చేయకూడదు? (What not to do?) మనం తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు మనల్ని అనారోగ్యం వైపు నెట్టేస్తాయి: పెద్ద సైజు దుస్తులపై ఆధారపడకండి: మార్కెట్‌లో 3XL నుండి 5XL వరకు దుస్తులు దొరుకుతున్నాయి కదా అని, బరువు తగ్గడానికి బదులు పెద్ద సైజు బట్టలు కొనడం అలవాటు చేసుకోవద్దు. మీ డ్రెస్ సైజు పెరుగుతుంటే, మీ అనారోగ్యం పెరుగుతోందని గుర్తించండి. నిర్లక్ష్యం వద్దు: "నేను బాగానే నడుస్తున్నాను కదా, నాకు ఏమీ కాదు" అని భ్రమపడకండి. లోపల షుగర్ లేదా కొలెస్ట్రాల్ ఎంత ఉందో బయటకి కనిపించదు. కెమికల్స్ వినియోగం: ఫుడ్ కలర్స్, పెస్టిసైడ్స్ ఉన్న ఆహారం మరియు విపరీతమైన కెమికల్స్ ఉన్న స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడటం వల్ల శరీర మెటబాలిజం దెబ్బతింటుంది. ఆరోగ్యం కోసం ఏం చేయాలి? (How to manage?) BMI పర్యవేక్షణ: మీ ఎత్తుకు తగ్గ బరువు (BMI) ఉన్నారో లేదో చూసుకోండి. సాధారణంగా BMI 18 నుండి 24 మధ్య ఉండాలి. ముందస్తు గుర్తింపు: మీకు ఆయాసం వస్తున్నా లేదా 15 నిమిషాలు కూడా నిరంతరంగా నడవలేకపోతున్నా మీ సిస్టమ్ ఫెయిల్ అవుతుందని అర్థం. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. జీవనశైలి మార్పులు: కాలుష్యం, జంక్ ఫుడ్ మరియు కెమికల్స్ కు దూరంగా ఉంటూ, శారీరక శ్రమను పెంచుకోవాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) 1. సన్నగా ఉన్నవారికి కూడా ఊబకాయం సమస్యలు ఉంటాయా?  అవును, బరువు తక్కువగా ఉన్నా మెటబాలిక్ సమస్యలు (షుగర్, బిపి) ఉండవచ్చు. ఊబకాయం అంటే కేవలం బయటకి కనిపించే కొవ్వు మాత్రమే కాదు, శరీర అంతర్గత వ్యవస్థల పనితీరులో లోపం కూడా. 2. 'మార్బిడ్ ఒబేసిటీ' అంటే ఏమిటి? BMI 40 కంటే ఎక్కువ ఉంటే దానిని 'మార్బిడ్ ఒబేసిటీ' అంటారు. ఈ స్థితిలో ఊబకాయం అనేది కేవలం బరువు సమస్య కాదు, అది ప్రాణాపాయ స్థితిని (Life risk) సూచిస్తుంది. 3. బేరియాట్రిక్ సర్జరీ అంటే కేవలం బరువు తగ్గడమేనా?  కాదు, ఈ సర్జరీ వల్ల బరువు తగ్గడంతో పాటు మెటబాలిక్ డిసీజెస్ (డయాబెటిస్, హై బిపి) కూడా కంట్రోల్ అవుతాయి, అందుకే దీనిని మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జరీ అంటారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఊబకాయం అనేది మనకు సమయం ఇస్తుంది, దాన్ని మనం కంట్రోల్ చేయాలి. రేపటి తరానికి ఆరోగ్యకరమైన భవిష్యత్తును ఇవ్వాలంటే ఈ రోజే మనం మారాలి. ఆరోగ్య విషయాలపై మరింత లోతైన అవగాహన కోసం మరియు నిపుణుల సలహాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!) ఆరోగ్యంగా ఉండండి.. ఆనందంగా జీవించండి!