కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకపోయినా, నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పని సరై కాంగ్రెస్ లో చేరానని ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.   కేసీఆర్ వల్లే అభివృద్ది జరిగింది,  అన్నం పెట్టినోడిని మరవడం కష్టంగా ఉంది, అయినా   కొన్ని రాజకీయ పరిణామాల వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని ఆయన అన్నారు. తాను కప్పుకున్నది జాతీయ జెండా అనీ, కాంగ్రెస్ జెండా ఎంత మాత్రం కాదనీ చెప్పారు.   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.  నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని సీఎం స్వయంగా చెబితేనే కాంగ్రెస్ లో చేరానన్న ఆయన..   ఆరు నెలల్లో బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్‌  సమస్యలు పరిష్కరిస్తామని సీఎం ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు.   నువ్వైనా నిధులు విడుదల చేయమని వేం నరేందర్ రెడ్డికి స్వయాన ముఖ్యమంత్రి చెప్పినా కూడా ఫలితం లేకపోయిందన్నారు. తాను    వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేశాననీ, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదనీ చెప్పిన పోచారం..    నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం నిర్వహించిన సమావేశంలో  రేవంత్ రెడ్డిని ఈ విషయమై సూటిగా ప్రశ్నించానని చెప్పారు.  పెండింగ్ బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారని పోచారం తెలిపారు.  Pocharam Srinivas Reddy, Revanth Reddy Congress, Banswada Constituency, Telangana Politics News, Pending Bills Release, Pocharam News Telugu
రాజకీయ పార్టీలలో వైసీపీ స్టైలే వేరు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన ఒక్కటంటే ఒక్క లక్షణం కూడా ఆ పార్టీకి లేదని గతంలో పలుమార్లు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు విమర్శలు గుప్పించారు కూడా. అయితే వైసీపీ వ్యవహరించే తీరు చంద్రబాబు విమర్శలకు బలం చేకూర్చేదిగానే ఉంటోంది. తాజాగా ఆ పార్టీ బుధవారం (ఆగస్టు 12) శాసన సభా పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. దీనిపై.. రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తం అవుతున్నది.   2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ  రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు.  ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు.  అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం  అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. అటువంటి పార్టీ, అసెంబ్లీలో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన తీరు, సభలో జరిగే చర్చలకు ఎలా స్పందించాలి అనే విషయాలపై చర్చించేందుకు శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేయడమేంటా అన్న విస్మయం ఇప్పుడు రాజకీయ పరిశీలకుల్లోనే కాదు.. సొంత పార్టీ నాయకులలోనూ.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వైసీపీ ఎమ్మెల్యేలలోనూ కూడా వ్యక్తమౌతోంది. ఈ నెలలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సెషన్ లో పార్టీ అనుసరించాల్సి వ్యూహం ఏమిటన్నదానిపై చర్చిస్తారా? లేక సభకు హాజరు కావాలా వద్దా? అన్న విషయంపై చర్చిస్తారా అన్నవిషయం ఇప్పుడు పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది.    గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సభలో వైసీపీ ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టింది. అయితే ప్రతిపక్ష హోదాకు అవసరమైనంత మంది సభ్యులు ఆ పార్టీ తరఫునుంచి గత ఎన్నికలలో విజయం సాధించలేకపోవడంతో  వైసీపీకి  ప్రతిపక్ష హోదా దక్కలేదు. జగన్ కు ప్రతిపక్ష  నాయకుడి హోదా రాలేదు. దీంతో..   శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం ఉండదని పేర్కొంటూ.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో అడుగుపెడతానంటూ జగన్ శపథం చేసి.. అసెంబ్లీకి గైర్హాజరవుతున్నారు. ఆయనతో పాటు వైసీపీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు కూడా అసెంబ్లీకి ముఖం చాటేశారు.  అంత వరకూ బానే ఉన్నా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలలో అంతర్మథనం ఆరంభమైందని పరిశీలకులు అంటున్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తరువాత వరుసగా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైతే ఎదురయ్యే చట్టపరమైన సమస్యలను ఎలా ఎదుర్కోవాలన్న భయం వారిలో బలంగా వ్యక్తమౌతోంది.  శాసనసభ నిబంధనల ప్రకారం సుదీర్ఘకాలం  సభకు గైర్హాజరైతే  . అనర్హత వేటు పడుతుందన్న ఆందోళనతో.. ఈ సారి సమావేశాలకు హాజరు కావాలని ఉన్న పదకొండు మంది సభ్యులలో మెజారిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. వారి ఒత్తిడి కారణంగానే జగన్ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కనీసం ఒకరోజో, రెండు రోజులో సభకు హాజరై.. అటెండెన్స్ వేయించుకుంటే.. అనర్హత వేటు గండం నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతోనే, ఆ విషయంపై చర్చించేందుకు శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉంటారని అంటున్నారు.    మొత్తానికి ఏపీ అసెంబ్లీ సమావేశాల  సమయంలో జగన్ ఏర్పాటు చేసిన ఈ వైసీపీ శాసనసభాపక్ష సమావేశం ఇప్పుడు రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. జగన్ సహా ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి హాజరైనా వారికే నష్టం, గైర్హాజరైనా వారికే నష్టం అన్నట్లుగా పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సభకు హాజరైతే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వైదొలగినట్లౌతుందనీ, హాజరు కాకుండా అనర్హత వేటు ప్రమాదం పొంచి ఉందనీ అంటున్నారు.   Jagan, AP Assembly sessions, YCP strategy, YCPLP Meeting, Andhra Pradesh News, TeluguOne
రాజకీయ సన్యాసం ప్రకటించి.. వ్యవసాయమే తన వ్యాపకమన్న విజయసాయి యూటర్న్ తీసుకున్నారు. అన్యాపదేశంగా కాదు నేరుగానే తన రాజకీయ రీఎంట్రీ గురించిన సంకేతాలు, ప్రకటనలు గుప్పిస్తున్నారు. కొత్త రాజకీయ పార్టీ అంటూ లీకులిస్తున్నా విజయసాయి అడుగులు మాత్రం జగన్ పంచన చేరే దిశగానే పడుతున్నాయి. ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో దారి అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఆయన మారుస్తున్న మాటలు, రంగులు వింటే.. చూస్తే.. ఊసరవిల్లి కూడా సిగ్గుపడేలా ఉన్నాయి.   తాజాగా విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా  తన పొలిటికల్ రీఎంట్రీ విషయాన్ని దాదాపు కన్ ఫర్మ్ చేసేశారు. తన రాజకీయ రీ-ఎంట్రీ,  భవిష్యత్ కార్యాచరణ, సొంత పార్టీయా కాదా అన్న విష యాలన్నీ త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇస్తానంటూ ప్రకటించి సస్పెన్స్ క్రియోట్ చేశారు. అయితే పరిశీలకులు మాత్రం ఆయన సోషల్ మీడియా పోస్టును ప్రస్తావిస్తూ.. సస్పెన్సేమీ లేదు.. విజయసాయి చేరేది జగన్ గూటికే అని విశ్లేషణలు చేస్తున్నారు. వారు తమ విశ్లేషణలకు  ఇటీవలి విజయసాయి వ్యాఖ్యలు, విమర్శలను ఉదాహరణలుగా చూపుతున్నారు.   విజయసాయి ఇటీవలి ట్వీట్ లో ఏపీలో శాంతి భద్రతల సమస్య, బాలికలు, మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అక్కడితో ఆగకుండా పనిలో పని అన్నట్లు వైసీపీనీ దుయ్యబట్టారు. సమస్యలపై, శాంతి భద్రతల అంశంపై, మహిళలూ బాలికల భద్రతపై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఘోరంగా విఫలమైందంటూ చెరిగేశారు.  ప్రత్యేకంగా ఆయన విమర్శలన్నీ వైసీపీలో కొంందరిని టార్గెట్ చేశాయి. అందులో దాపరికం ఏమీ లేదు. ఆయన విస్పష్టంగా కొందరు వైసీపీ నేతలు అధికార తెలుగుదేశం కూటమితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా, పార్టీ పరంగా ఆందోళనలు జరగకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. సాధారణంగా శాంతి భద్రతలు, మహిళల భద్రత వంటి అంశాలపై ఎవరైనా ప్రభుత్వాన్నీ, పోలీసుల పని తీరునూ నిలదీస్తుంటారు. కానీ విజయసాయి మాత్రం వైసీపీని టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించారు. అందులోనూ కొందరు నేతలు అంటూ ఆయన విస్పష్టంగా చేసిన విమర్శలు.. గతంలో తాను వైసీపీలో ఉండగా తనకు అడుగడుగునా అవరోధంగా నిలిచి.. చివరకు తాను పార్టీ వీడటానికి కారణమైన సజ్జల బ్యాచ్ పై పరోక్షంగా ఎక్కుపెట్టిన అస్త్రాలేనని పరిశీలకులు అంటున్నారు.  ఇక్కడ ఇటీవల సజ్జల టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూ ఏకంగా తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేసిన బోరుగడ్డ అనీల్ విషయాన్ని అనివార్యంగా ప్రస్తావించాలి. ఎందుకంటే.. వైసీపీలో సజ్జల వ్యతిరేకులందరూ ఇప్పుడు ఏక కాలంలో బయటకు వచ్చి విమర్శలకు దిగుతున్నారంటే.. విజయసాయి వైసీపీ రీఎంట్రీకి సజ్జల అడ్డంకి తొలగిపోయేలా పార్టీ అధినేత జగన్ మనసు మార్చడానికేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  Vijayasai Reddy political re Entry,  YCP  News, YS Jagan, AP Politics, TeluguOne News
ALSO ON TELUGUONE N E W S
Megastar Chiranjeevi attended the success celebrations of Varun Tej’s Korean Kanakaraju and had high praise for the film’s approach to entertainment. Calling the film a success that proves audiences are willing to embrace something different, Chiranjeevi particularly highlighted the combination of Varun Tej and Satya. “I am jubilant that Korean Kanakaraju found so much appreciation. Varun Tej and Satya are pillars of the film. Their comical chemistry and scenes have made the movie such a thorough entertainer. I need to appreciate Varun's outlook to always bring something new and he did give his best in this one,” he said. Chiranjeevi also spoke about Varun’s choices as an actor and expressed his personal enjoyment of KOKA. “I am always proud of how Varun chooses variety of scripts. He never failed as an actor while content might had ups and downs. I enjoyed KOKA and wanted to watch it again for him and Satya. I would credit this success to Vaayuv Tej, Varun's son, he brought all the luck,” he added. The Megastar credited director Merlapaka Gandhi for handling the film effectively and praised UV Creations and First Frame Entertainment for their planning and controlled execution. He said, "New filmmakers should learn from KOKA makers. When I enquired in what budget did they execute the Korean portions which looked rich, I was shocked." He continued to say, "They planned meticulously to bring such output in controlled budget. People should stop extending days during shoot without any clarity. They should take this as an example and work in future." He also appreciated Thaman’s music and Satya’s natural comic timing. Chiranjeevi felt the film’s Korean backdrop connected well with the current generation and said its success once again demonstrates the potential of well-made entertainers. Korean Kanakaraju has crossed Rs.40 crore gross worldwide in four days and entered the profit zone across all areas. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Megastar Chiranjeevi has once again lived up to his reputation for giving away interesting updates about his upcoming films. The actor appears to have accidentally revealed the title of his next film, currently referred to as Mega 158, even before the makers officially announce it. Chiranjeevi is teaming up with director Bobby Kolli for the film, which is being produced by KVN Productions. The project has been one of the most awaited announcements among Mega fans, with expectations that a major update would be unveiled on Chiranjeevi's birthday on August 22. However, Chiranjeevi let the cat out of the bag during the success meet of Korean Kanakaraju. While interacting with music director S Thaman, he was discussing the background score for the upcoming teaser. Chiranjeevi mentioned that the teaser would be released on his birthday and, while talking about Thaman working on the score, asked whether he had noticed the title, before saying "Kadiri." The slip has immediately sparked curiosity among fans. The film's title had earlier been speculated to be Kaakaji, but Chiranjeevi's latest comment indicates that the makers have chosen a different title. It is still unclear whether the official title will simply be Kadiri or whether the word will be accompanied by a subtitle or an additional phrase. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Lokesh Kanagaraj’s DC is continuing its strong run at the box office, with the film crossing the ₹50 crore mark worldwide in just four days. The makers officially announced the milestone through a new poster, celebrating the film’s early theatrical success. Starring Lokesh Kanagaraj and Wamiqa Gabbi in the lead roles, DC is directed by Arun Matheswaran and backed by Sun Pictures. The film has been generating strong interest since its release, with the latest official update indicating that the momentum has continued through its opening weekend. The ₹50 crore milestone in four days gives DC a strong start and puts the focus on its performance in the coming days. With the film now entering its first full week, the makers will be hoping that the positive momentum translates into sustained collections. Anirudh Ravichander's music has been the biggest driving force for the film with everyone praising his work. The film has exploded highly in Telugu States, Kerala for the filmmaking and Ani's soundtracks.  Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
టాలీవుడ్ లో 'చిరు లీక్స్'కి మామూలు క్రేజ్ లేదు. మెగాస్టార్ చిరంజీవి తన అప్ కమింగ్ సినిమాల గురించి లీక్స్ ఇస్తుంటారు. ఈ ఆనవాయితీ ఎప్పటినుంచో కొనసాగుతోంది. తాజాగా 'కొరియన్ కనకరాజు' సక్సెస్ మీట్ లో చిరంజీవి తన కొత్త సినిమా 'మెగా 158' టైటిల్ లీక్ చేసి, సర్ప్రైజ్ చేశారు. చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'మెగా 158'. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ ఉంటుందని అభిమానులు ఆ రోజు చూస్తున్నారు. అయితే అంతకంటే ముందే చిరు సర్ప్రైజ్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో మాట్లాడుతూ.. ఆగస్టు 22న టీజర్ రిలీజ్ అవుతుంది. ఆ టీజర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్న టైంలో టైటిల్ చూశావా. 'కదిరి' కదా" అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. గతంలో ఈ సినిమాకి 'కాకాజీ' అనే టైటిల్ ప్రచారం జరిగింది. ఇప్పుడు చిరు లీక్స్ తో టైటిల్ అది కాదని క్లారిటీ వచ్చింది. మరి టైటిల్ 'కదిరి' అని మాత్రమే ఉంటుందా? కొనసాగింపుగా ఇంకా ఏమైనా ఉంటుందా? అనేది ఆగస్టు 22న క్లారిటీ రానుంది.     Chiru Leaks, Mega 158, Chiranjeevi  
Jr NTR is set to undergo shoulder surgery on Wednesday, August 12, at KIMS Hospitals in Hyderabad. The actor’s office issued an official statement on Tuesday confirming that the surgery has been scheduled following a medical evaluation of his shoulder injury. According to the statement, NTR will be undergoing the procedure after doctors assessed the injury and recommended surgery. The medical team at KIMS Hospitals is now working towards ensuring a smooth recovery for the actor. The actor’s office also assured fans and well-wishers that updates regarding his health and recovery will be shared following the surgery. The statement requested everyone’s understanding and continued support during this period. NTR has several major projects in his lineup, making his recovery timeline particularly significant. However, the actor’s immediate focus will be on completing the procedure and recovering from the shoulder injury before returning to his professional commitments. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా మారి చేసిన మూవీ 'DC'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. విడుదలైన మొదటి 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా లోకేష్ కనగరాజ్‌ను మనం ఒక స్టార్ డైరెక్టర్‌గా చూశాం. కానీ ఈ సినిమాలో ఆయన ఒక పవర్ ఫుల్ మాస్ రోల్ అదరగొట్టడం, ఆయనకు తోడుగా వామికా గబ్బి గన్స్ పట్టుకుని స్క్రీన్ మీద చేసిన అరాచకం ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెడుతున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.  ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే.. ఈ 'DC' ప్రయాణం 50 కోట్లతో ఆగేలా లేదు. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. https://x.com/sunpictures/status/2087138361731666199     DC Movie Collections, Lokesh Kanagaraj, Wamiqa Gabbi  
తెలుగు చిత్రపరిశ్రమలో విజయాలు, రికార్డులు ఎంత ముఖ్యమో.. దిగ్గజ నిర్మాతల మధ్య ఉన్న ఆత్మీయ బంధాలు కూడా అంతే ప్రత్యేకమైనవి. టాలీవుడ్ వర్గాల్లో ఎందరికో ఆదర్శంగా నిలిచే అలాంటి ఓ అరుదైన మైత్రికి కేరాఫ్ అడ్రస్ స్టార్ ప్రొడ్యూసర్స్ ఎంఎస్ రాజు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి. గత 40 ఏళ్లుగా వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. సినీ ప్రపంచంలో హెచ్చుతగ్గులు, పోటీ కారణంగా ఎంతోమంది మధ్య సంబంధాలు కాలక్రమేణా మారుతుంటాయి. కానీ, ఎంఎస్ రాజు మరియు శ్యామ్ ప్రసాద్ రెడ్డిల మైత్రి మాత్రం నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా చెక్కుచెదరకుండా కొనసాగుతోంది. ఇండస్ట్రీలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, విజయాపజయాల్లో తోడుగా నిలవడం వీరి ప్రత్యేకత. చిత్రపరిశ్రమలో ఇద్దరు అగ్ర నిర్మాతలు దశాబ్దాల పాటు ఒకే రకమైన సాన్నిహిత్యాన్ని, నమ్మకాన్ని కాపాడుకోవడం నిజంగా అరుదైన విషయమని సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. వ్యాపారపరమైన ఆలోచనలకు అతీతంగా వీరిద్దరి మధ్య ఉన్న ఆత్మీయత ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎంఎస్ రాజు 'శత్రువు', 'మనసంతా నువ్వే', 'ఒక్కడు', 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి ఆల్‌టైమ్ క్లాసిక్స్ అందించి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ప్యాషన్ ఉన్న నిర్మాతగా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. మరోవైపు, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి 'అమ్మోరు', 'అంజి', 'అరుంధతి' వంటి విజువల్ వండర్స్ రూపొందించి తెలుగు సినిమా స్థాయిని పెంచారు. నిర్మాతలుగా విభిన్న శైలి ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో వీరు ప్రాణస్నేహితులుగా కొనసాగడం విశేషం. సోషల్ మీడియాలోనూ ఈ సీనియర్ నిర్మాతల మైత్రిపై సినీ అభిమానులు ఎంతో పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. నేటితరం సినీ వర్గాలకు వీరిద్దరి నిలకడైన స్నేహబంధం ఒక గొప్ప ఉదాహరణ అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు సినిమాకు ఎన్నో మరపురాని విజయాలను అందించిన ఈ ఇద్దరు దిగ్గజ నిర్మాతలు మున్ముందు కూడా తమ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించాలని, వీరి మైత్రి మరెన్నో ఏళ్లు ఇలాగే సాగాలని టాలీవుడ్ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.
మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ 'వారణాసి'. ఈ సినిమాలోని రామాయణ ఎపిసోడ్‌ గురించి సంచలన నిజాలు బయటకొచ్చాయి. ఈ ప్రత్యేకమైన రామాయణ సీక్వెన్స్‌లో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌లో సీతాదేవి, రావణాసురుడు వంటి పాత్రలు ఉండవట. కేవలం శ్రీరాముడు, కుంభకర్ణుడు మధ్య జరిగే భయంకరమైన యుద్ధ సన్నివేశాన్ని మాత్రమే రాజమౌళి అద్భుతంగా చూపించనున్నారట.  ఈ ఎపిసోడ్ మొత్తం కేవలం ఒక్క సీక్వెన్స్ చుట్టూనే ఎంతో పవర్‌ఫుల్‌గా తిరుగుతుందని తెలుస్తోంది. అదే.. రాముడు, కుంభకర్ణుడి మధ్య జరిగే మహా యుద్ధం. రాముడిగా మహేష్ బాబు గ్లోరీ అప్పీరియన్స్, ఆ దివ్య రూపం, ఆ బాణాల వర్షం... వీటన్నింటినీ ఒక విజువల్ వండర్‌లా రాజమౌళి స్క్రీన్ మీద ప్రెసెంట్ చేయబోతున్నారు. ఈ పర్టికులర్ చాప్టర్‌లో కేవలం శ్రీరాముడు, కుంభకర్ణుడు, ఆంజనేయ స్వామి, వానర సేన మాత్రమే ఉంటారట. కొండంత ఆకారంతో ఉన్న కుంభకర్ణుడు ఒకవైపు... విల్లు చేతబూని, దైవికమైన తేజస్సుతో శ్రీరాముడిగా మహేష్ బాబు ఇంకోవైపు. పక్కనే హనుమంతుడి గర్జన, వానర సేన హుంకారం. ఈ ఒక్క ఎపిసోడ్‌కే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని చెప్పవచ్చు.  రాజమౌళి ఒక పర్టికులర్ రామాయణ చాప్టర్‌ను మాత్రమే ఎంచుకుని, దానికి గ్లోబల్ రేంజ్ విఎఫ్ఎక్స్, మైండ్ బ్లాకింగ్ యాక్షన్ కోరియోగ్రఫీ జోడించి ప్రజెంట్ చేయబోతున్నారు. అందుకే ఈ ఎపిసోడ్‌లో సీతమ్మ తల్లి, రావణాసురుడు లేదా ఇతర రామాయణ పాత్రలు కనిపించవట.     SS Rajamouli, Mahesh Babu, Varanasi, Ramayana Episode  
  కరుడుగట్టిన సినీ అభిమానులు కొలువు తీరి ఉన్న రాష్ట్రం ఇండియాలో ఏదైనా ఉంది అంటే అది తమిళనాడు అని చెప్పవచ్చు. అభిమానాన్ని చూపించుకునే క్రమంలో ఇండియా వైడ్ గా   పోటీ పెట్టిన తమిళనాడుకి చెందిన ఫ్యాన్స్ నే గెలిచే పరిస్థితి. అంతటి డై హార్ట్ ఫ్యాన్స్ తమ హీరో సినిమా రిలీజ్ ఉన్నా లేకపోయినా సినీ మార్కెట్ లో తచ్చాడుతూ ఉంటారు.      స్టార్ హీరో ధనుష్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడనే న్యూస్ కొన్ని రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల 'ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్'  కోయంబత్తూర్ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల వారీగా సంక్షేమ సంఘాలని బలోపేతం చేయడంతో పాటు నూతన సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపునివ్వడం ఈ ఊహాగానాలకు మరింత బలమిచ్చింది. ముఖ్యంగా కోయంబత్తూర్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలను రెండు ప్రధాన భాగాలుగా విభజించి, ప్రతి నియోజకవర్గంలో నూతన కమిటీలను నియమించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయడం తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.  ఆగస్టు 8వ తేదీన ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్ ఇండియా సెక్రటరీ బి. రాజా, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వి. సుబ్రహ్మణ్య శివ సంతకాలతో కూడిన అధికారిక సర్క్యులర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఈ సర్క్యులర్ ప్రకారం, కోయంబత్తూర్ జిల్లాలోని మొదటి విభాగంలో కోయంబత్తూర్ సౌత్, తొండముత్తూర్, కిణత్తుక్కడవు, పొల్లాచి, వాల్పరై అనే 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, రెండో విభాగంలో కోయంబత్తూర్ నార్త్, కౌండంపాలయం, సింగనల్లూర్, సులూర్, మెట్టుపాలయం అనే 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లోని ధనుష్ అభిమానులందరూ ప్రత్యేక సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేసి, సభ్యత్వ నమోదు ముమ్మరం చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. కోయంబత్తూర్ జిల్లా అధ్యక్షుడు జి. శంకర్ నేతృత్వంలో ఈ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. కేవలం ఒక జిల్లాకే పరిమితం కాకుండా, ఇదే తరహా నియోజకవర్గాల వారీ నెట్‌వర్క్ విస్తరణను తమిళనాడులోని మిగిలిన జిల్లాలకు కూడా వర్తింపజేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.  ఈ పరిణామాల వెనుక ధనుష్ ఇటీవల చేసిన కీలక వ్యాఖ్యలు, నిర్వహించిన భారీ సామాజిక సేవా కార్యక్రమాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.  జూలై 28న ధనుష్ పుట్టినరోజు సందర్భంగా చెన్నైలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, "మనమందరం ఒకే చోట కూడటంలో ఒక గొప్ప శక్తి ఉంది. ఆ ఐక్యతకు ఒక సరైన ప్రయోజనాన్ని, లక్ష్యాన్ని ఇవ్వాలి. కేవలం సినిమా ఆడియో లాంచ్‌లు, థియేటర్ సెలబ్రేషన్లకే పరిమితం కాకుండా మీ ప్రాంతంలోని పేద ప్రజల అవసరాలను గుర్తించి, సహాయం చేయండి" అని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, అదే వేదికపై ఫ్యాన్ క్లబ్ నూతన పతాకాన్ని కూడా ఆయన ఆవిష్కరించడం విశేషం. దానికి తోడు, ఆగస్టు 4న చెన్నై సాలిగ్రామంలో తాను చదువుకున్న థాయ్ సత్య మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌కు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 3 అంతస్తుల నూతన భవనాన్ని సొంత ఖర్చులతో నిర్మించి ఇచ్చారు. దానికి 'ధనుష్ బ్లాక్' అని నామకరణం చేసి, తన పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు.  సాధారణంగా తమిళనాడులో సినీ తారల ఫ్యాన్స్ క్లబ్‌లు కేవలం అభిమాన సంఘాలుగానే కాక, క్షేత్రస్థాయి రాజకీయ నెట్‌వర్క్‌లుగా మారడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ.  ఇటీవల విజయ్ తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' స్థాపించడానికి ముందు కూడా తన 'విజయ్ మక్కల్ ఇయక్కం' ద్వారా నియోజకవర్గాల వారీగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, గ్రాస్‌రూట్ స్థాయి నెట్‌వర్క్ నిర్మించారు. ఇప్పుడు ధనుష్ కూడా అదే శైలిలో పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే, ధనుష్ వర్గం మాత్రం ఇది కేవలం సామాజిక సేవా కార్యక్రమాల విస్తరణ మాత్రమేనని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ, నియోజకవర్గాల వారీగా కమిటీల ఏర్పాటు మరియు సభ్యత్వ నమోదు డ్రైవ్‌లు చూస్తుంటే ధనుష్ భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది.  మరోవైపు రాజకీయ ఊహాగానాలు షికారు చేస్తున్నప్పటికీ, ధనుష్ తన సినీ కెరీర్‌పై కూడా అంతే శ్రద్ధ చూపిస్తున్నారు. Also Read: 72 పాటలతో ప్రపంచ రికార్డు సృష్టించిన భారతీయ సినిమా ధనుష్  ప్రస్తుతం  రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న 'ఓమ్: చాప్టర్ 1' (Om: Chapter 1) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తమిళ సినీ రంగానికి, రాజకీయాలకు ఉన్న అనుబంధం అయితే మాత్రం దశాబ్దాల నాటిది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, విజయ్ కాంత్ , కమల్ హాసన్, రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.  Dhanush, Vijay, Om
ఒకప్పుడు కామెడీ కింగ్ గా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్.. కొన్నేళ్లుగా సీరియస్ కథలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు రూట్ మార్చి మళ్ళీ కామెడీ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అదే 'రంభ ఊర్వశి మేనక'. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి చంద్రమోహన్ చింతాడ దర్శకుడు. ఈ ఫాంటసీ కామెడీ ఫిల్మ్ సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఒక మ్యాజిక్ బుక్, ప్రత్యేక పూజలతో దేవలోకం నుండి రంభ, ఊర్వశి, మేనకలను భూమి మీదకు రప్పించే రాజమండ్రి కుర్రాడి వినోదాత్మక ప్రయాణమే ఈ చిత్రం. ఒక ఫ్యామిలీ మ్యాజిక్ బుక్ ఆధారంగా ఈ కథ నడుస్తుంది. ఆ బుక్ మీద కరెక్ట్‌గా ఒక ముగ్గు గీస్తే చాలు.. స్వర్గలోకం నుంచి రంభ, ఊర్వశి, మేనకలు నేరుగా భూమి మీదకు దిగివస్తారు. దాంతో హీరో 15 ఏళ్ల నుంచి ప్రతి రోజూ ముగ్గులు గీస్తూనే ఉంటాడు. చివరికి హీరో ప్రయత్నాలు ఫలించి.. నిజంగానే దేవకన్యలు భూమికి దిగి వస్తారు. 'నా పర్మిషన్ లేకుండా అదర్ ప్లానెట్స్‌కి వెళ్తారా?' అని ఇంద్రుడు దేవలోకంలో సీరియస్ అవుతుంటే... ఇక్కడ భూమి మీద ల్యాండ్ అయిన దేవకన్యలు మాత్రం, 'చాలా ఆకలిగా ఉంది... పులావ్ ఏమైనా తీసుకొస్తారా?' అని అడగడం టీజర్‌లో హైలైట్ సీన్ అని చెప్పాలి. 'రంభ ఊర్వశి మేనక' కోసం పూజ చేసిన హీరో.. తీరా వాళ్ళు వచ్చాక కంగారు పడిపోవడం ఆసక్తికరంగా ఉంది. ఇక టీజర్ చివరిలో అల్లు నరేష్ 'మేనక మాల' ధరించి.. 'స్వామి శరణం మేనక శరణం' అనడం మరో హైలైట్ అని చెప్పొచ్చు. నరేష్ కెరీర్‌లో ఒక పూర్తిస్థాయి అవుట్ అండ్ అవుట్ హలేరియస్ ఫాంటసీ కామెడీ రాబోతోందని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది. మరి ఈ సినిమాతో నరేష్ థియేటర్లలో నవ్వులు పూయించి, కాసుల వర్షం కురిపిస్తాడేమో చూడాలి.     Ramba Oorvasi Menaka Teaser, Allari Naresh, Telugu Comedy  
స్ట్రెస్, ఆందోళన, బీపీ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరగడంతో మనసుతో పాటు శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామాలు కొంతమందికి రిలాక్సేషన్‌కు సహాయపడవచ్చు. అనులోమ విలోమ ప్రాణాయామం శ్వాసను నియంత్రిస్తూ చేసే ఒక సాధారణ యోగాభ్యాసం. దీన్ని సరైన పద్ధతిలో, సరైన సమయంలో చేయడం ముఖ్యమని యోగా నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ప్రాణాయామం చేయడం సరికాదు. వయసు, ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం ఉన్న సమస్యలను బట్టి విధానం మారవచ్చు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్, ఆయుర్వేద డైటీషియన్ శ్రావంతి రఘు అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎవరు చేయవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలి? వీడియోలో అనులోమ విలోమాన్ని స్టెప్ బై స్టెప్‌గా ఎలా చేయాలో చూపించారు. శ్వాసను నెమ్మదిగా, నియంత్రణతో తీసుకోవడం, వదలడం వంటి అంశాలను సరైన పద్ధతిలో పాటించడం గురించి వివరించారు. ప్రాణాయామం చేసేటప్పుడు శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచడం, తొందరపడకుండా శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యమైన అంశాలు. మొదటిసారి ప్రయత్నించేవారు నిపుణుల సూచనతో ప్రారంభించడం మంచిది. BP ఉన్నవారు చేయవచ్చా? అధిక రక్తపోటు ఉన్నవారు కూడా కొన్ని శ్వాసాభ్యాసాలను తగిన జాగ్రత్తలతో చేయవచ్చు. అయితే అధిక బీపీ ఉన్న ప్రతి వ్యక్తికి ఒకే విధమైన ప్రాణాయామ పద్ధతి సరిపోదు. ముఖ్యంగా శ్వాసను బిగపట్టడం వంటి పద్ధతులను స్వయంగా ప్రయత్నించకుండా, నిపుణుల సూచనలు పాటించడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారు చేయవచ్చా? డయాబెటిస్ ఉన్నవారు కూడా అనులోమ విలోమ ప్రాణాయామం గురించి నిపుణుల సలహా తీసుకుని సాధన చేయవచ్చు. అయితే ప్రాణాయామం ఏదైనా వ్యాధికి మందులకు ప్రత్యామ్నాయం కాదు. వైద్యులు సూచించిన మందులు, ఆహారం, వ్యాయామాన్ని కొనసాగిస్తూ మాత్రమే యోగాభ్యాసాన్ని జీవనశైలిలో భాగంగా చేసుకోవాలి. సైనసైటిస్ ఉన్నవారు? సైనసైటిస్ లేదా ముక్కు సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రాణాయామం చేసే ముందు తమ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. ముక్కు పూర్తిగా బ్లాక్‌గా ఉన్నప్పుడు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు బలవంతంగా శ్వాసాభ్యాసం చేయకూడదు. అవసరమైతే యోగా థెరపిస్ట్ లేదా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. రోజూ 10 నిమిషాలు చేస్తే స్ట్రెస్, BP శాశ్వతంగా పోతాయా? ప్రాణాయామం వల్ల రిలాక్సేషన్, శ్వాస నియంత్రణ, మానసిక ప్రశాంతతకు సహాయం లభించవచ్చు. అయితే రోజూ 10 నిమిషాలు అనులోమ విలోమం చేస్తే స్ట్రెస్ లేదా బీపీ శాశ్వతంగా పూర్తిగా నయమవుతాయని చెప్పడం సరైనది కాదు. ముఖ్యంగా అధిక రక్తపోటు ఒక వైద్య పరిస్థితి. దాని కోసం వైద్యుల సూచనలు, మందులు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అవసరం. ఈ వీడియోలో అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎవరు చేయవచ్చు? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? సరైన పద్ధతి ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను సీనియర్ యోగా థెరపిస్ట్ శ్రావంతి రఘు వివరిస్తున్నారు. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు బీపీ, డయాబెటిస్, సైనసైటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రాణాయామం ప్రారంభించే ముందు మీ వైద్యుడు లేదా అర్హత కలిగిన యోగా థెరపిస్ట్‌ను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో పొటాషియం (Potassium) ఒకటి. శరీరంలో పొటాషియం స్థాయి సరైన మోతాదులో ఉండటం చాలా ముఖ్యం. అయితే రక్తంలో పొటాషియం స్థాయి ఎక్కువగా ఉన్నా (Hyperkalemia), తక్కువగా ఉన్నా (Hypokalemia) ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అసలు పొటాషియం అంటే ఏమిటి? రక్తంలో పొటాషియం ఎందుకు పెరుగుతుంది? పొటాషియం తగ్గడానికి కారణాలు ఏమిటి? పొటాషియం ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఈ సమస్యను నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేయాలి? వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో ప్రముఖ వైద్యులు డా. N. Papa Rao సులభంగా వివరిస్తున్నారు. పొటాషియం ఎక్కువైతే ఏమవుతుంది? రక్తంలో పొటాషియం సాధారణ స్థాయికి మించి ఉండటాన్ని Hyperkalemia అంటారు. కొన్ని సందర్భాల్లో కిడ్నీల పనితీరు సరిగా లేకపోవడం, కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా కొన్ని మందుల కారణంగా పొటాషియం స్థాయి పెరగవచ్చు. పొటాషియం ఎక్కువగా ఉన్నప్పుడు కండరాల బలహీనత, అలసట, గుండె కొట్టుకునే విధానంలో మార్పులు వంటి సమస్యలు కనిపించవచ్చు. ముఖ్యంగా గుండె పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. పొటాషియం తగ్గితే? రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉండటాన్ని Hypokalemia అంటారు. వాంతులు, విరేచనాలు, అధికంగా చెమట పట్టడం, కొన్ని మందుల వాడకం వంటి కారణాలతో శరీరంలో పొటాషియం తగ్గే అవకాశం ఉంటుంది. పొటాషియం తక్కువగా ఉన్నప్పుడు నీరసం, కండరాల బలహీనత, కండరాలు పట్టేయడం, గుండె దడ వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి? పొటాషియం స్థాయి ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా అనేది కేవలం లక్షణాల ఆధారంగా నిర్ణయించలేం. అవసరమైతే వైద్యుల సూచనతో రక్త పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా కొన్ని మందులు క్రమం తప్పకుండా ఉపయోగించేవారు వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. పొటాషియం ఎక్కువగా ఉందని లేదా తక్కువగా ఉందని అనుమానం వచ్చినప్పుడు సొంతంగా మందులు తీసుకోవడం, పొటాషియం సప్లిమెంట్లు వాడటం లేదా ఆహారంలో పెద్ద మార్పులు చేయడం చేయకండి. వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. పొటాషియం ఎక్కువైనా ప్రమాదమే.. తక్కువైనా సమస్యే. కాబట్టి శరీరంలో పొటాషియం స్థాయి ఎందుకు మారుతుంది, దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయాలపై పూర్తి అవగాహన కోసం ఈ వీడియోను చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్యుల వ్యక్తిగత సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా అనుమానాలు ఉంటే అర్హత కలిగిన వైద్యులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అంటారు. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటే జీవితం చాలా వరకు దిగులు లేకుండా ఉంటుంది.   కంటికి ఏదైనా సమస్య వస్తే.. దాని ప్రభావం జీవితం మీద చాలా ప్రస్పుటంగా కనిపిస్తుంది. కంటి సమస్యలు అంటే చాలామంది కంటి శుక్లాలు రావడం,  కంటికి ఏదైనా దెబ్బ తగలడం... వీటి గురించి చెబుతుంటారు. కానీ వర్షాకాలంలో పిలవని అతిథి గా వచ్చేది కంటి ఇన్ఫెక్షన్ల సమస్య. కంటి ఇన్ఫెక్షన్లు వస్తే కన్ను ఎర్రబడటం,  కంటి నుండి నీరు కారడం, కళ్లు మసకగా మారడం, కళ్ల మంటలు వంటి సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో వచ్చే ఈ కంటి ఇన్ఫెక్షన్ల సమస్య.. ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది కూడా. అసలు కంటి ఇన్పెక్షన్ సమస్యలు ఎందుకు వస్తాయి? కారణాలు ఏంటి?  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  కంటి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు చికిత్స ఏంటి?  తెలుసుకుంటే.. వర్షాకాలంలో కంటి ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి? వర్షపు నీరు నేరుగా కంటి ఇన్ఫెక్షన్లకు కారణం కాదు.. అయినప్పటికీ ఈ కాలంలో బ్యాక్టీరియా , వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం, మురికి చేతులతో కళ్లను తాకడం, ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి వాడిన టవల్ లేదా చేతి రుమాలును ఇతరులు వాడటం, కాంటాక్ట్ లెన్స్‌లను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటివి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇన్ఫెక్షన్ సోకిన కంటిని తాకిన తర్వాత  డోర్‌నాబ్, మొబైల్ ఫోన్, టేబుల్ లేదా ఇతర వస్తువులను తాకితే, అక్కడ ఉన్న వైరస్‌లు లేదా బ్యాక్టీరియా ఇతరులకు వ్యాప్తి చెందవచ్చు. కంటి ఇన్పెక్షన్ లక్షణాలు.. కళ్లు ఎర్రబడటం, ఆగకుండా నీరు కారడం,  దురద లేదా మంట.  కళ్ల నుండి జిగటగా లేదా పసుపు-తెలుపు రంగులో స్రావం రావడం. కనురెప్పలు వాపు. కళ్లలో ఇసుక గుచ్చుతున్నట్లు అనిపించడం. ఉదయం నిద్రలేచినప్పుడు కనురెప్పలు జిగటగా ఉండటం.. వంటివి కంటి ఇన్పెక్షన్ లక్షణాలు. కన్ను ఎర్రబడితే ఇన్పెక్షన్ వచ్చినట్టా? వర్షాకాలంలో అలర్జీలు, దుమ్ము, కాలుష్యం లేదా ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల తరచుగా కళ్ళు ఎర్రబడవచ్చు. అందువల్ల,  కన్ను ఎర్రబడగానే అది  కంటి ఇన్పెక్షన్ అనుకోవడం పొరపాటు.   కొందరు ఇలా సందేహం రాగానే  సొంతంగా యాంటీబయాటిక్ కంటి డ్రాప్స్ వంటివి   వాడతారు,  ఇలా చేయడం మంచిది కాదు.  నొప్పి తీవ్రంగా ఉంటే, దృష్టి మసకబారితే, లేదా లైటింగ్ కు కళ్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే  వెంటనే కంటి వైద్య నిపుణుడిని సంప్రదించాలి. వీళ్లకు ఎక్కువ జాగ్రత్త అవసరం.. కాంటాక్ట్ లెన్స్ వాడేవారు,  చిన్న పిల్లలు,  వృద్ధులు కంటి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు మాత్రమే కాకుండా.. మధుమేహ వ్యాధిగ్రస్తులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఈ మధ్యనే  కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారు కంటి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో కళ్లను ఎలా కాపాడుకోవాలి? చేతులను సబ్బు ,  నీటితో బాగా కడుక్కోవాలి. మురికి చేతులతో  కళ్ళను తాకకూడదు. బయటి నుండి వచ్చిన తర్వాత  ముఖాన్ని, చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి.  కళ్ళలోకి దుమ్ము లేదా మురికి నీరు వెళితే, వాటిని శుభ్రమైన నీటితో కడగాలి. తువ్వాళ్లు, చేతి రుమాళ్లు లేదా దిండులను సెల్ఫ్ గా ఉంచుకోవడం, సెల్ఫ్ గా వాడుకోవడం మంచిది. ఇతరులకు ఇవ్వడం లేదా ఇతరులవి వాడటం మంచిది కాదు. కంటి అలంకరణ వస్తువులైన కాటుక,  ఐ లాషెస్,  ఐ లైనర్ వంటివి ఇతరులకు ఇవ్వడం, ఇతరులవి తీసుకోవడం మంచిది కాదు.  ఇన్ఫెక్షన్ సోకినట్లయితే కళ్లను అలంకరించుకోవడం మానెయ్యాలి. కాంటాక్ట్ లెన్స్ ధరించేవారు.. వర్షాకాలంలో కాంటాక్ట్ లెన్స్ ధరించేవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని పెట్టుకునే ముందు  చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. లెన్స్‌లను గానీ, వాటి కేస్‌ను గానీ కుళాయి నీటితో ఎప్పుడూ శుభ్రం చేయకూడదు. కళ్ళు ఎర్రబడటం, నొప్పి లేదా చీము కారడం వంటివి కనిపిస్తే, వెంటనే  లెన్స్‌లను తీసివేసి, వైద్యుడిని సంప్రదించాలి. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లెన్స్‌లు ధరించడం వల్ల ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. కంటి ఇన్ఫెక్షన్ వస్తే ఏం చేయాలి?  కళ్ళు ఎర్రబడినా లేదా నీరు కారుతున్నా, మొదటగా  వాటిని పదేపదే రుద్దడం ఆపాలి. శుభ్రమైన దూదితో లేదా మెత్తని గుడ్డతో వాటిని శుభ్రం చేసుకోవాలి. తక్కువ మంట లేదా వాపు ఉంటే చల్లటి కాపడం ఉపశమనాన్ని ఇస్తుంది.  డాక్టర్ రికమెండ్  చేస్తే కృత్రిమ ఐ డ్రాప్స్ ఉపయోగించవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా డాక్టర్‌ను సంప్రదించకుండా యాంటీబయాటిక్ లేదా స్టెరాయిడ్ కంటి చుక్కలను ఉపయోగించకూడదు. అన్ని రకాల ఇన్ఫెక్షన్లకు చికిత్స ఒకేలా ఉండదు. కానీ సొంత ప్రయోగాలు చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.                                *రూపశ్రీ.