Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 10

"అన్నారా?"అన్నది మంగమ్మ.
నిజానికావిడకు ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలనిలేదు. అంచేత దాన్ని తేల్చిపారేసింది. "అనాను. నీ ఉద్దేశం ఆ పదిహేనువేలూ దేనికిస్తున్నారని?" అన్నాడు చలపతి.
ఆ ప్రశ్న చలపతి ఏజవాబు నాశించి అడిగిందీ మంగమ్మకు అర్దమయింది. ఆవిడ ఎందుకైనా మంచిదని ఓ నవ్వు గిరాటేట్టి దానికి అనుబంధంగా ఓ సిగ్గుముక్కను విసిరేసి కళ్ళ కోసల్నించి చలపతిని చూసి  "డ్రైవరున్నా" డన్నట్టుగా తలతోనే సైగ చేసింది.
ఈ దెబ్బతో చలపతి చిత్తుచిత్తయి పోయాడు. వాడు కాస్సేపటికి తమాయించుకొని "బ్రేవోబ్రోవో"
అని లోపలనుకోవాలను కొని పైకే  అనేశాడు. ఈ సమాధానం మంగమ్మ నుండి రావడం     ఈ దెబ్బతో చలపతి చిత్తుచిత్తయి పోయాడు. వాడు కాస్సేపటికి తమాయించుకొని "బ్రేవోబ్రోవో" అని లోపలనుకోవాలను కొని పైకే  అనేశాడు. ఈ సమాధానం మంగమ్మ నుండి రావడం కోసమే ఇంత సేపటినుంచి చలపతి తంటాలుపడుతున్నాడు. మంగమ్మ మహా పతి వ్రతన్న నమ్మకం అతనికి లేనిమాట నిజమే
గానీ తను చెప్పినట్లల్లా వింటుందో లేదోకూడా లేలియాలిగదా ! అలా విన్నప్పుడే తానీ మద్రాసులో ఉండి చక్రం తిప్పకలుగుతాడు. కర్మగాలి మంగమ్మ పెంకిగట్టమాయిందో, ఆటకు వెలయిందన్నమాటే !
టాక్సీ 192 వ ఇంటిముందు ఆగింది. చలపతి దిగాడు. ఆ తరవాత మంగమ్మకూడా దిగింది. చలపతిటాక్సీకి డబ్బులిచ్చి పంపేశాడు. అయింటిని చూస్తూనే మంగమ్మకు అనేక సందేహాలు పుట్టుకొచ్చాయి. ఆవిడ రెండుమూడు రోజులనుండహిస్తున్న ఇల్లువేరు. ఆ ఇల్లు చాలా పెద్దది.ముందు బాగాన అరెకరం ఖాళీస్థలం, అందులో రకరకాల పూలమొక్కలు. మూలగా రెండుమూడు అశోక వృక్షాలు,పెద్దభాల్కానీ, స్టంభాలు నల్లుకొని సన్నజాజి తీగలు, రోడ్డుమీంచి గడపలదాకా నాపరాళ్ళ బాట, హాల్లో సోఫాసెట్టు, గోడలకు పఠాలు. ఓ ప్రక్కన కారుషెడ్డు. కాకిదుస్తుల్లో డ్రైవరూ, నలుగురైదుగురు నౌకర్లు, టెలిపోన్ వంటమనిషి, పై అంతస్టుల్లో కిటికీలకు సిల్కు తెరలు - ఇలాంటివి చాలా ఆలోచించింది. చలపతి సామాన్యుడు కాడాయె. సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళదగ్గరే బోలెడంత డబ్బున్నప్పుడు, సినిమాతీసే వాళ్ళ దగ్గర అంతకు పదిరెట్లు డబ్బు ఉండాలని మంగమ్మ అంచనా! అంత డబ్బున్నవాడు, ఓ సాదా ఇంట్లో ఉంటాడని ఎవరు మాత్రం ఊహిస్తారు గనక?
అయితే తన దిజప్పాయింట్ మెంట్ ను మంగమ్మ బైటపడనివ్వలేదు. లోలోపలే భద్రంగా దాచుకొంది. మద్రాసు చేరిన వెంటనే తన కిలాంటి అనుభవం ఎదురయినందుకు, మంగమ్మ కొంచెం బాధపడింది కూడా.
"ప్రస్తుతానికి మన ఇల్లు ఇదే!" అన్నాడు చలపతి.
మంగమ్మ ఉల్లిక్కి పడింది. ఖర్మకాలి తన ఆలోచనలు గానీ అతనికి  తెలిసిపోయాయోమోనని గిజ గిజ లాడి పోయింది. ఓ సారి చలపతి కేసి చూసి తల వంచుకొంది. చలపతి ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెడితే బావుండుననిపించింది మంగమ్మకు. కానీ మన వాడు వదిలే ధోరణిలో లేడు.
 "కాఫీ తెప్పిస్తున్నాను. నువ్వీలాగా స్నానం చెయ్యి. అదే బాత్ రూం. తాయారు గంగాళంలో నీళ్ళు పెట్టె ఉంటుంది. అది నీ గది, ఇది నా గది. ప్రస్తుతానికి ఒక్కటే మంచం ఉండి. నువ్వు మరోటి కావాలని పట్టుబడితే తప్పా మంచం తెప్పించవలసిన అవసరం లేడు" అన్నాడు చలపతి నవ్వుతూ.    
మంచాల ప్రసక్తి నెందుకు తీసుకు వచ్చిందీ మంగమ్మకు తెలుసు. అయినా అతన్నీ కాసేపు ఏడిపించి వదలలానిపించింది.
"ఉన్నదోక్కటే మంచమంటురి. ఇద్దారం మనుషులముంటిమి. ఇంకోటి తెప్పించకపోతే ఎలా? మీరో నేనో కింద పడుకోవాలి మరి! నాకు కిందపడుకోవడం అలవాటు లేదు, మీకున్నదేమో నాకు తెలీదు" అన్నది మంగమ్మ.
చలపతి ఏం చెబుతాడో కూడా ఆలోచించకుండానే ఆవిడ బాత్ రూలోకెళ్ళింది. చల్లని నీళ్ళు వంటిమీద పడగానే శరీరానికి కొత్తశక్తి వచ్చినట్టునిపించింది. ఓగంట సేపు అలాగే గంగాళంలో కూచుండిపోతే ఎంత బావుండును?
ఆవిడ చీరకట్టుకుని వచ్చేసరికి చలపతి స్నానానికి సిద్దమయ్యాడు. "నేనేమో అనుకొన్నాను గాని, నువ్వు అసాద్యురాలివి మంగమ్మా! ఉండు, నేవచ్చి గట్టి సమాధానం చెబుతాను" అంటూనే చలపతి వెళ్ళిపోయాడు.
ఈలోగా మంగమ్మ కాఫీని కప్పులోనికి సర్దింది. తాయారు క్యారియర్ దొడ్లోకి పట్టుకెళ్ళింది. వెడుతూ వెడుతూ అది చూసిన చూపు చాలా చిత్రమనిపించింది మంగమ్మకు. కానీ ఆ చూపులో ఏమున్నది మంగంమాకు అంతుపట్టలేదు.
"కాఫీ బావుందా? అన్నాడు చలపతి వస్తూనే! నువ్వింకా తాగలేగా ఏం?"మగమ్మ పెదవి విరిచింది.
"ఇలాంటి పట్టింపులు పట్టుక్కూచుంటే ఎలా? నువ్వు తాగేయ్యక పోయావా" అన్నాడు చలపతి.
"పెద్దలు మీరు ముందు కానివ్వండి" అన్నది మగమ్మ. చలపతి కూచున్నాక "ఇందాక మీరేదో గట్టి సమాధానం చెబుతామన్నారు కదూ?" అని జ్ఞాపకం చేసింది.
"ఏది? ఓహొ, అదా?" అన్నాడు చలపతి ఫకలుమని నవ్వుతూ. "కిందపడుకోవడం అలవాటు లేడంటేను- నాకేవో సంగతులు జ్ఞాపకం వచ్చాయిలో! మరేంలేదు." చలపతి తనను ఎటుడ్రైవ్ చేస్తున్నాదీ మంగమ్మ తెలుసుకోంది. ఆవిడకు చెప్పారానంత అసహ్యంకూడా వేసింది. ఆ రంధి తప్పా బ్రతుకులో మరో వ్యాపకం లేనివాడికి మల్లె ఆ స్తమానూ అవే కబుర్లయితే ఎంత అసహ్యం? మంగమ్మ ధోరణిని సున్నితంగా మార్చేసింది. "ఈ ఊరు చాలా పెద్దదా?" అనడిగింది కప్పు బలామీద పెదితూ.
"ఊ రేమిటి నీతలకాయ్! ఇది మహా పట్నం. మనవాళ్ళు కధల్లో చెబుతారే పన్నెండామడ పట్నామని - అలాంటిధనుకో, మనమున్నది కోడంబాకం. సినిమావాళ్ళు ఎక్కువమంది ఇక్కాడే ఉంటారు. ఇదోకొస ఈ చుట్టుపక్కల చాలా స్టూడియోలున్నాయి. అందులో రేయింబవళ్ళు ఘాటింగులు జరుగుతుంటాయి. నువ్వేప్పుడన్నా భీచ్ చూశావా?" అన్నాడు చలపతి.
"అంటే?" అన్నది మంగమ్మ అమాయకంగా పోజుపెట్టి.
"ఓసి పిచ్చిదానా!" అన్నాడు చలపతి. "అబ్బో అబ్బో! అక్కడకు కొన్ని వేలమంది జనం వస్తారు. సాయంత్రం మనం కూడా వెడదాం. భీచ్ కెళ్ళే స్వాత్యం త్ర్యం నీకు  ఎక్కువకాలం ఉంటుందనుకొను...!"
"అదేం?" అన్నది మంగమ్మ.
"రేపు నువ్వు పది సినిమాల్లో బుక్కయితే కాల్  షీట్లు సర్దలేకనే చస్తావుగదా! షికార్లకతు టైమేక్కడుంటుంది. మంగమ్మా! అదీగాక భీచ్ కేడితే జనం నిన్ను బతకనిస్తారా? చుట్టేసేయ్యరూ" అన్నాడు చలపతి.
"ఎప్పటి మాటో లెండి. ఈ లోగా మనం హాయిగా తిరగాడానికేం?" అన్నది మంగమ్మ.
చలపతి ఓ సిగేరేటు అంటించి గట్టిగా పొగ పీల్చి ఆ పోగతోనే అగ్గిపుల్లను ఆర్పేసి, ఆరిపోయిన అగ్గిపుల్లను సుతారంగా దూరంగా గిరాటేట్టాడు.
"అదంతా మదియాద్ మంగమ్మా. మనం తిరగటానికి టైమే రేపట్నుంచి మనకు ఊపిరి తిరగని పనులుంటాయి. అవి చూసుకోవాలి" అన్నాడు చలపతి.
మంగమ్మ మాట్లాడకుండా లేచి లోపలికి వెళ్ళిపోయింది.
                                                          *             *                 *             *
అతడనట్లుగా ఆ మొన్నాటినుండీ ఊపిరి తిరగని పనిలంటూ ఏమీలేవు. ఉదయం కాఫీతాగి చలపతి ఎక్కడికో వెళ్ళేవాడు. ఒక్కోరోజున మద్యంహ్నం భోజనానికి వచ్చేవాడు. ఒక్కో రోజున సాయంత్రం వేచ్చేవాడు. ఉదారూ కలిసి ఏటన్నా షికారు వెడుతుండేవాళ్ళు. నారంరోజులపాటు మంగమ్మ సిటీ అంతా చూసింది. 'జు' చూసినప్పుడూ ' మ్యూజియం' చూసినప్పుడూ మంగమ్మ తనకు తాను మరిచిపోయింది. ఇన్ని లక్షలరూపాయలు ఖర్చుపెట్టి వీటిని ఏర్పాటు చెయ్యడమెందుకో ఆవిడకు అర్ధం కాలేదు. దీన్ని గురించి ఒకటి రెండుసార్లు చలపతిని అడుగుదామనుకొందిగానీ, అడగలేదు. ఏదో సమాధానం చెప్పడని కాదు. ఆ దోరణిలో పడితే అతన్ని మళ్లించటం కష్టమని ఆవిడ భయం."ఊరంటే ఇదే ఊరు... బ్రతుకంటే ఇదే బ్రతుకు" అనుకొంది మంగమ్మ.
విశాలంగా నున్నాగా ఉన్నరోడ్లు, వాటి మీద చిత్తువత్తుగా ప్రవాహం వోత్తుగా పోయేకార్లు, రోడ్లకు రెండు ప్రక్కాలా ఉన్న షాపులు, అందులోని సామాను. కందీరిగలతుట్టెల్లా ముసిరేజనం, విద్యుత్ దీపాలు, సినిమా హాల్సు - ఓహ్ ఎంతబావున్నాయి!
తొలిసారిగా భీచ్ చూసినప్పుడు, మంగమ్మ మనస్సంతా అలుక్కుపోయినట్ట్లయింది. రోడ్డు దిగి ఇసకలో కూరుకుపోతున్న పాదాలను రవంత బలంతో పెకలించుకొంటూ నడవడం ఓవింత అనిభావం. వందగజాలు నడిచాక తనో మైలుదూరం నడిచాననుకుంది మంగమ్మ. సముద్రంనీదినించి ఉప్పునిగాలి బలంగా వెనక్కి నేడుతొంటే పమిటచెంగు తోలక్కుండా వీపు వెనగ్గాతిప్పి రెండో కొసను కుచ్చెళ్ల దగ్గర దోపుకుని, ముందుకు నడుస్తుంటే., చీరంతా వెనక్కు నొక్కుకొని, కాళ్ళు గుండ్రంగా కనిపిస్తుంటే మంగమ్మ సిగ్గుపడింది.
చలపతి ఆవిడ పక్కనే నడుస్తూ మద్యమద్య తగుల్తూ, ఏవో కబుర్లు చెబుతున్నాడు. దూరంగా, ఆకాశం వంగి సముద్రంతో ఏవో రహస్యాలు చెబుతున్నట్టుగా ఉంది. ఎడమవైపున నల్లని పోగచారా, అచారకో కొసను మసకమసగ్గా ఓడా కనిపించాయి. కుడివైపున చిన్న చిన్న పడవలు, ఇంకా దూరంగా, ఇసకమీదనే బెస్తవాళ్ళ గుడిసెలు, వాటివెనక మళ్ళా ఎత్తయిన భవనాలు. వెనక రోడ్డు మీద పాముల్లా పారిపోతున్న కార్లు జనసముద్రం అందులో రకరకాల దుస్తులు ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్ట్లునిపించింది మంగమ్మకు.
నిలువెత్తు కెరటాలులేచి, వొడ్డుమీద విరుచుకుపడి దాన్ని నురుగుతో అలికి ఎవరో తరుముతున్నట్టు సముద్రంలోకి పారిపోవడాన్ని ఎన్నిసార్లు చూసినా తనివితీరదనిపించింది మంగమ్మక
"ఇలా ఈ సముద్రం పోంతనే, ఓ చిన్న డాబా, దానిగోడ నానుకొని సముద్రమూ, సముద్రం వేపుకున్న కిటికీకి దగ్గరగా మెత్తని కుర్చీనేసుకొని, అందులో తను కూచోవడం దూరంగా నౌక రాక పోకలు, సముద్రంలోంచి అగ్నిజ్వాలలు ఎగిసినట్లు, ఉషఃకాలపు అరుణారుణ మేఘశకల సమూవాయం. అలల మీదడిన సూర్యకాంతి ముక్కలయి నీటిలో కరిగిపోవడం, తానూ పండు ముదసలికావడం, ఎవరికోసమో ఎదురుచూస్తూ కూచోవడం- ఆ వ్యక్తి అలలమీదగా నడిచి తన దగ్గర కోస్తునాదన్న భ్రమ-
అన్నింటినీ భద్రంచేస్తూ " ఇవిగో మంగమ్మా! వేరుశనక్కాయలు తనవూ" అన్నాడు చలపతి.
లిప్టునుంచి కిందకి దిగుతున్నప్పుడు కలిగే భావాలంటి గేగో మంగంమ్మలో మెసలి, నిటుర్చింది. ఈ కొద్దిక్షణాల్లో తను చూసిన కొత్త ప్రపంచానికి వేరుశనక్కాయలు వాస్తవం. ఆ ప్రపంచం కల్పన! ఐతేనేం ఎంత హాయిగా ఉండి ప్రాణానికా కల్పన!!
"మరి పోదామా?" అన్నాడు చలపతి ఆవిడ సమాధానానికి ఎదురు చూడకుండానే.
అయిష్టంగానే మంగమ్మ లేచింది.
మద్యలో ఉడ్ లాండ్స్ లో భోజనం చేసుకొని ఇంటికొచ్చే సరికి తోమ్మిదయింది. భోజనం చెస్తూన్నప్పుడు, చాలామంది చలపతిని పలకరించారు.కొంతమంది ముందుగా దణ్ణాలు పెట్టి. ఏమీ అడగకుండానే పోయారు. వారిలో చాలామందిని తనెక్కడో చూసింది . ఎక్కడచూసిందో, ఎప్పుడు చూసిందో జ్ఞాపకం రావడంలేదు. ఈ ఆలోచనలతోనే మంగమ్మ బుర్రంతా నిండిపోయింది.
"ఏమిటి అలోచిస్తున్నావే?" అన్నాడు చలపతి, కిటికీకి కింద వరస తలుపులు వేసేస్తూ.
మంగమ్మ ఇంకా మద్యాహల్లోనే కూచుని వుంది. "ఏమలేదన్నట్టుగా పెదవి విరిచింది."
చలపతి గట్టిగా నిట్టూర్పు విడిచాడు.
"నా కేసి అలాచూడవద్దని ఇదివరకు రెండు మూడుసార్లు గట్టిగా చెప్పాను. నేనందుకు చెప్పానో నీకర్దమయినట్టులేదు" అన్నాడు చలపతి
మంగమ్మకు అర్ధం కాలేదనుకోవడంలో అర్ధంలేదు.
"ఓరి వీడికడుపుడక! ఈ పూట పూనకం పూనిందల్లే వుందే" అనుకోన్నది మంగమ్మ.
చలపతి ముఖం ఆర్చుకు పోయేలాగా మంగమ్మ సమాధానం చెప్పగలదు కానీ అలా చెప్పాడంవల్ల కలిగే లాభమేమీ లేదు. ఇప్పుడు తన జీవితం, చలపతి మీద ఆధారపడి ఉన్నది. వీడేదో ఉద్దరిస్తాడన్న ఆశ - నమ్మకం కాదు- కేవలం ఆశ- తనకున్నది. అదేదో గట్టిగా తేలిందాకా, తానీఆధారాన్ని వదలడం మంచిదికాదని మంగమ్మ ఎప్పుడో అనుకొంది. ఆవిడ రాజమణితో మాట్లాడినప్పుడు, ఈ సంగతులన్నీ రాజమణి చూసినట్టుగా చెప్పింది. అది చెప్పిన సంగతులన్నీ ఒక్కటొక్కటిగా నిజమవుతున్నాయ్! రాజమణి అనుభవం, త౫అన కెంతగానో ఉపయోగపడుతోంది.
"మాట్లాడవేం!" అన్నాడు చలపతి. ఈసారి మంగమ్మకు వెనగ్గావచ్చి నించుని.
అతని చేతులు కుర్చీమీదినుంచి మెల్లిగా మంగమ్మ భుజాలను తాకుతున్నాయి. ఆవెల్లు భయంతో వణుకుతున్నాయని మంగమ్మ గ్రహించింది. అతన్ని రెచ్చగొట్టి, పిచ్చి కుక్కను చేయాలన్న సరదా కలిగింది. ఆ పిచ్చిమైకంలో పడినప్పుడు చలపతి ఎలా ప్రవర్తిస్తాడో చూడాలని మంగమ్మ కుతుహాలం.
కుర్చూలోంచి కదలకుండానే, మేడమాత్రం వెనక్కి వంచింది మంగమ్మ, బంగారపు శంఖంలాగా, మిలమిలా మెరిసిపోయింది మేడ. ఆ శంఖంమీద సాగగాఉన్న ముఖం. సన్నని పెదవులు, చిన్ని నొక్కుతో, కొద్దిగావంగిన గడ్డం, నవ్వినప్పుడు, సొట్టలుపడే నున్నవి చెక్కిళ్ళు, మనిషి గుండెల్లోకి చొచ్చుకెళ్ళి, రహాస్యాలను వెదికి తీసుకురాగల తెలివైనా కళ్ళు, వొత్తుగా నల్లగా మెరిసేజుట్టూ, చలపతి నిలవనీయలేదు.
అతనికళ్ళలో ఎరుపు జీరలు చోటు చేసుకొంటున్నాయి. కోరిక నరనరానా పాకి, రక్తంలోకలిసి, శరీరాన్ని సంచలింప చేస్తోంది. అతని ఊర్పులు నులివెచ్చగా, మంగమ్మ చెంపల్ని తాకుతున్నాయి.
"ఎమిటమ్మాయిది?" అన్నది మంగమ్మ, సన్నగానవ్వుతో అతనికళ్ళల్లో కళళుంచి చూస్తో. ఆమె భజంమీద చలపతి వెళ్ళు భయంతో కిందికిజారుతున్నాయి. మంగమ్మ అతని చేతుల్ని పట్టుకొని మెత్తగా నొక్కింది. చలపతి నిలువునా చలించిపోయాడు.
"నీకు నిదరోస్తోందా?" అన్నాడు చలపతి ఆవిడచేతులు వదలకుండానే.
"ఎందుకా?" అని, ఓక్షణమాగి, రెండు చేత్తుల్లోనూ ముఖం దాచుకుంది మంగమ్మ. "పోండిబాబు! నేను చెప్పను, నన్ను ముట్టుకోకండి . నామీదనించి చేతులు తియ్యండి ముందు అన్నది ఆప్రయత్నమేమీ చేయ్యాకుండానే."
"చచ్చిపోమన్నా పోతానుగానీ, ఆపనిమాత్రం నావల్ల కాదు" అన్నాడు చలపతి.
"ఏమిటమ్మా ఆ మాటలు? ఇప్పుడు చావులెందుకు చెప్పు?" అంది మంగమ్మ.
చలపతి చెప్పలేదు. అతని నరనరమూ, బిరుసెక్కి బాధపెడుతున్నది. రక్తం గోళ్ళ చతివళ్ళకొచ్చి వెళ్ళు చిమచిమ లాడుతున్నాయి.
  అబ్బ! ఇంత చలిలో, ఇలా బయటకూచోవడం ఇబ్బందిగా లేదూ? లోపలకొచ్చి కూచోరాదూ?" అన్నాడు చలపతి మంగమ్మను కుర్చీలోంచి కదుపుతూ.
"ఇబ్బందేననుకొండి, ఓషరతుమీదనయితే లోపలికొస్తాను."
"చెప్పు"
"తరువాత మాటతిరుగితే నేను వోప్పుకోను సుమా! ముందు చెబుతున్నాను, ఏమిటంటే - మీరు బుద్దిమంతుడైనా పిల్లాకాయలా, చెప్పినమాట వింటానంటే వస్తాను. కొంటేవేషాలు వేశారంటే ఈ వరండా కొచ్చి పడుకుంటాను. మీ కిష్టమేనా?" అన్నది మంగమ్మ.
చలపతి చూపులు, ఆమె పమిట వెనుక వెదుకుతున్నాయి.
"నువ్వింత మొండిదానివెం మంగమ్మా?" అన్నాడు చలపతి.
"నా సంగతి తరువాత చెబుతాను. ముందు మీసంగతి చెప్పండి"
"నన్ను చంపుతున్నావుపో!" అన్నాడు చలపతి సరేనీ యిష్టం.
మంగమ్మ లోపలికొచ్చింది. ఆవెంటనే చలపతి కూడా వచ్చాడు. వస్తూనే తలుపుకు గడియ వేశాడు.
"ఇవ్వేళమీరు కిందపడుకోండి. ఈ నాలుగైదురోజుల్నుంఛీ చాపమీద పడుకొంటే, వొళ్ళంతా విరగోట్టినట్టుగా ఉంది" అన్నది మంగమ్మ.
చలపతి మాట్లాడలేదు.
"కిందపడుకోవడం నాకలవాటు లేదని, వెనక మీకోసారి చెప్పాను...... అయ్యేరామా! ఎందుకలా నవ్వుతారు.... మీరలా ప్రతిదానికి పెడర్ధాలు తీస్తే నేనేసలు మీతోనే మాట్లాడనే మాట్లాడను పోండి బాబూ! నాకు మీమంచమూవద్దు మీరువద్దు, నేనే వెళ్ళి కిందపడుకొంటాను" అన్నది మంగమ్మ.
మంచంమీద కూచున్నదల్లా చటాలున లేచి తనగదిలో కొచ్చింది. రాత్రి పడుకొన్న పక్క నలిగి, అలానే పడివుంది. దాన్నో సారి దులుపుకొని ఏసుకుందామనుకొంది. దుప్పటి దులిపి వేస్తున్నప్పుడు. మంగమ్మ వెనక్కు తిరిగి చూసోమ్ది. చలపతి నించుని ఉన్నాడు అతనికళ్ళు తాగినవాడి కళ్ళలాగా ఉన్నాయి.
"మళ్ళా ఇక్కడికికోచ్చారేం? నన్నీ రాత్రి నిద్రపోనివ్వారా ఏం?" అన్నది మంగమ్మ.
"ఉహూ"
"ఆ పప్పులేం మనదగ్గరఉడకవు సార్ మర్యాదగా వెళ్ళి నిద్రపొండి..... ముందా భుజంమీదినుంచి చెయ్యి తీసెయ్యండి" అన్నది మంగమ్మ.
"అంతేనా?" అన్నాడు చలపతి.
"మీరు మాటతప్పారు, నన్ను పక్క ముట్టుకోనని ముట్టుకున్నారు. నేనిక గదిలో పడుకోను.... ఉండండి... నన్ను పక్క చుట్ట వరండాలోకి తీసుకెళ్ళినివ్వండి.... అరె! అలా అడ్డందూరతారేం?" అన్నది మంగమ్మ నవ్వి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS