కృష్ణమ్మ గురించి తెలియని ఆరు విషయాలు

 

 

1. మహాబలేశ్వర పర్వతం మీద గోముఖం నుండి సన్నని ధారగాకృష్ణానది అవతరించింది. అక్కడ నుంచి దాదాపుగా 1400 కిలోమీటర్లు సాగే కృష్ణానది ప్రయాణం తూర్పు తీరంలో ఆ నది పేరుతోనే ఏర్పడిన కృష్ణాజిల్లాహంసలదీవిలో సాగర సంగమంతో ముగుస్తుంది.

 

 

2. దక్షిణ మహారాష్ట్రలోని కరాద్ ప్రాంతంలో ‘కోయనానది’కృష్ణానదిలో కలుస్తుంది. వీటి కలయికలో ఒక ప్రత్యేకత వుంది. ఎక్కడైనా రెండు నదులు సంగమ ప్రదేశం గమనిస్తే సాధారణంగా ఆ నదులు సమాంతరంగా కొంత దూరం ప్రయాణం చేసి కలుస్తాయి. కాని కృష్ణా, కోయనా నదులు ఎదురెదురుగా వచ్చి కలుస్తాయి.

 


3. కృష్ణానది జన్మస్థానం అరేబియా సముద్రానికి కేవలం 60 కిలోమీటర్ల దూరమే అయినప్పటికీ తూర్పు దిశగాప్రవహించిమహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రజలకు మేలు చేస్తోంది.

 

 

4. కృష్ణానదికి దాదాపుగా 223 ఉపనదులు వున్నాయి. కొండలు, గుట్టలలో పుట్టిన ఆ ఉపనదులను తనలో ఐక్యం చేసుకుంటూ ప్రవహిస్తుంది కృష్ణమ్మ.

 

 

5. కృష్ణానది తీరంలో ఇంచు మించు 170కి పైగా పుణ్యక్షేత్రాలు వున్నాయి.

 

 

6. సాగర సంగమానికి ముందు కృష్ణానది తూర్పు పడమర పాయలుగా చీలుతుంది. తూర్పు పాయ హంసల దీవి వద్ద సాగర సంగమం చేరగా, పశ్చిమ పాయ నాగాయలంక దిగువున మరో మూడు పాయలుగా చీలి ఆ మూడు బంగాళాఖాతంలో చేరటంతో కృష్ణానది ప్రయాణం ముగుస్తుంది.


 

 

...Rama


More Krishna Pushkaralu