నవంబర్ 6న ఈ పని చేస్తే తెలివితేటలు పెరుగుతాయ్

 

 

కార్తీకమాసంలో ఒక్కోరోజు ఒక్కో వస్తువును దానం చేస్తే సకలైశ్వర్యాలూ సిద్ధిస్తాయ్. అలా.. కార్తీక  బహుళ తదియ నాడు.. తులసి చెట్టును పూజించి.. తులసి మాలను బ్రాహ్మణులను దానం చేస్తే తెలివితేటలు మెరుగుపడతాయనేది పెద్దల మాట. 
కార్తీక మాసం అతి పవిత్రం. అలాగే హిందువులకు తులసి చెట్టు అత్యంత పవిత్రం. పైగా కార్తీకమాసంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు.. తులసిలో కొలువైవుంటాడని వేదాలు ఘోషిస్తున్నాయ్. భక్తుల పాలిటి కొంగుబంగారం శ్రీ మహావిష్ణువు. వాతావరణాన్ని పునీతం చేసే పవిత్ర దేవతావృక్షం తులసి. అందుకే.. కార్తీక బహుళ తదయ నాడు.. తులసి చెట్టును శ్రీ మహావిష్ణువుగా భావించి పూజించి.. తులసి మాలను బ్రాహ్మణులకు దానం చేస్తే.. అంతులేని మేథస్సు.. దానం చేసినవారి సొంతం అవుతుందని పెద్దల మాట. పైగా తులసి మాలలను జపతపాలకు వాడతారు. తులసి మాల దానం చేస్తే... జపతపాల వల్ల కలిగే పుణ్యంలో కొంతైనా.. దానం చేసిన వ్యక్తికి లభిస్తుంది. 

కార్తీక బహుళ తిధియ రోజున తప్పకుండా తులసి మాలను దానం చేయండి. ఈ ఏడాది కార్తీక బహుళ తదియ నవంబర్ 6వ తారీకున వచ్చింది. మంద బుద్ధితో బాధపడుతున్న పిల్లలుండే తల్లిదండ్రులు.. పిల్లల చేత ఆ రోజు తులసి మాలను దానం చేయించండి. మరిన్ని పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.


More Karthikamasa Vaibhavam