అదృష్టాన్ని తెచ్చిపెట్టే శుక్ర ప్రదోష వ్రతం.. ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి!

ప్రదోష వ్రతం అనేది శివుడికి సంబంధించింది. ఇందులో శివుడిని పూజిస్తారు. ప్రదోషకాలంలో శివుడిని పూజించడం వల్ల సంతోషం, ఐశ్వర్యం సిద్దిస్తాయని, కష్టాలు తొలగుతాయని చెబుతారు. ఈ కార్తీకమాసంలో ప్రదోష వ్రతం ఇప్పుడు ప్రాముఖ్యత సంతరించుకుంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం కార్తీక త్రయోదశి నాడు ప్రదోషవ్రతం ఆచరిస్తారు. దీన్ని ప్రతి నెలా రెండుసార్లు పాటిస్తారు. ఒకటి కృష్ణపక్షంలో  అయితే, రెండవది శుక్లపక్షంలో. కార్తీక మాసంలో రెండవ ప్రదోష వ్రతం నవంబర్ 24వ తేదీన జరుపుకుంటారు. ఇది శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రప్రదోష వ్రతం అని పండితులు సంభోదిస్తున్నారు.

కార్తీక మాసంలోని శుక్ల త్రయోదశి తిథి నవంబర్ 24వ తేదీ రాత్రి 07:06 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది నవంబర్ 25 సాయంత్రం 05:22 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ప్రదోష వ్రతాన్ని నవంబర్ 24, శుక్రవారం జరుపుకుంటారు. ప్రదోష కాలంలో ప్రదోష వ్రత పూజ చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.  ఈ పూజను  రాత్రి 07:06 నుండి 08:06 మధ్య చేయాలి. ఇదే ఈ పూజకు శుభ సమయం.

శుభయోగం ఏమిటంటే..

శుక్ర ప్రదోష వ్రతం నాడు జ్యోతిష్యం పరంగా చాలా శుభప్రదంగా భావిస్తున్నారు. దీనికి కారణం ఈరోజున పవిత్రంగా  భావించే సర్వార్థ సిద్ధి యోగం,   అమృత సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం  రోజంతా కొనసాగుతుంది. ఇక అమృత సిద్ధి యోగం  ఉదయం 06:51  నుండి సాయంత్రం 04:01  వరకు ఉంటుంది.

ప్రదోష పూజ ఎలా చేయాలంటే..

ప్రదోష వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయడం మొదలైనవి చేయాలి. దీని తరువాత శివుడిని ధ్యానిస్తూ ఉపవాసానికి సంకల్పించాలి.  సాయంత్రం ప్రదోష వ్రత పూజ నిర్వహిస్తారు.  సాయంత్రం పైన చెప్పుకున్న  శుభ సమయంలో పూజ ప్రారంభించాలి. నెయ్యి, తేనె, పాలు, పెరుగు,  గంగాజలం మొదలైన వాటితో శివలింగానికి అభిషేకం చేయాలి. దీని తరువాత శివలింగంపై మారేడు దళాలు, గన్నేరు  పువ్వులు సమర్పించాలి. చివర్లో హారతి ఇచ్చి అందరికీ ప్రసాదం వితరణ చేయాలి. ఇలా ప్రదోష పూజ పాటిస్తే అదృష్టం కలసివస్తుంది. మానసిక అశాంతి తొలగుతుంది. సమస్యలకు పరిష్కాలు లభిస్తాయి.

                                  - నిశ్శబ్ద

 


More Karthikamasa Vaibhavam