How To Make Kakarakaya Pulusu (Bitter gourd Curry) | Yummyone
Learn How to Make Kakarakaya Pulusu (Bitter gourd Curry) And What Are The Ingredients To Be Used To Make it. Watch The Video For Procedure To Make Kakarakaya Pulusu (Bitter gourd Curry) by Subbulakshmi Garu
కాకరకాయ పులుసు :--
కావలసిన పదార్థాలు:
కాకరకాయ ముక్కలు - 1 కప్పు
ఉల్లిపాయ ముక్కలు - ½ కప్పు
ఉప్పు - 2 టీ స్పూన్లు
పసుపు - ½ టీ స్పూన్
కారం - 1 టీ స్పూన్
చింతపండు - చిన్న నిమ్మకాయంత
బెల్లం - చిన్న ముక్క
పచ్చిమిరపకాయలు - 2
కరివేపాకు - రెండు రెబ్బలు
కొత్తిమీర - ఒక కట్ట
ఇంగువ - ½ టీ స్పూన్
మెంతులు - ½ టీ స్పూన్
ఆవాలు - 1 టీ స్పూన్
జీలకర్ర - 1 టీ స్పూన్
ఎండుమిరపకాయలు - 2
నూనె - 4 టేబుల్ స్పూన్లు
బియ్యపుపిండి - 1 టేబుల్ స్పూన్
తయారు చేసే విధానం :-
1. ముందుగా ఒక బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి ఉల్లిపాయలు వేసి వేపాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తరువాత చిన్నగా తరిగిన కాకరకాయ ముక్కలు వేసి మరికొద్దిసేపు వేపాలి. మూత పెట్టి కాకరకాయ ముక్కలను ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి.
2. తరువాత ఉప్పు, కారం, పసుపు, చింతపండు పులుసు, బెల్లం వేయాలి. పులుసు మరుగుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి మూతపెట్టాలి.
3. పులుసు చిక్కగా కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ బియ్యపుపిండిని కొంచెం నీళ్ళల్లో కలిపి పులుసులో పోయాలి. తరువాత కారం వేసి మంట తగ్గించి పులుసు చిక్కబడే వరకు మరిగించాలి.
4. తరువాత ఒక గరిటెలో 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని ఇంగువ, ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలి, జీలకర్ర వేసి పోపు పెట్టాలి. ఈ పోపును మరుగుతున్న పులుసులో వేసి కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసుకొని వేడి వేడిగా వడ్డించాలి.
How to make Palak and Soya Granules Curry --
https://youtu.be/DE_I9cBMPlY
Shahi Paneer (Paneer Butter Masala) --
https://youtu.be/6z1feSx-QcE
Andhra Special Combo | Three Different Tastes --
https://youtu.be/KlmAhTm6pxg
How to Make Kobbari Avakaya Chutney --
https://youtu.be/Je8JTn3vXOY