తప్పు చేసిన గానగంధర్వుడు బాలు
on Nov 28, 2011
గానగంధర్వుడు, పద్మశ్రీ, డాక్టర్ శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం మీద గతంలో ఒక మచ్చ ఉండేది. ఆయన సినీ నేపథ్య గాయకుడిగా తన జీవితం ప్రారంభించిన తొలి రోజుల్లో ప్రముఖ హిందీ సినీ నేపథ్య గాయకుడు కిశోర్ కుమార్ గారిని బాగా అనుకరించేవారని. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం గారు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నూటికి నూరు శాతం యదార్థం. ఆయన ఆయన సినీ పరిశ్రమకొచ్చిన కొత్తలో కిశోర్ కుమార్ పాటల్లోని అరుపులనూ, కొన్ని కూతలనూ మక్కీకి మక్కీ కొన్ని తెలుగు పాటల్లో అనుకరించారు.
అలాగే ఆయన తను పాడే పాటల్లో యన్.టి.రామారావుగారికి పాడినప్పుడు ఆయన గాత్రాన్ని, అక్కినేని వారికి పాడినప్పుడు ఆయన గాత్రాన్నీ, రాజబాబు గారికి ఆయన గాత్రాన్నీ, అల్లు రామలింగయ్యగారికి పాడినప్పుడు ఆయన గాత్రాన్ని...ఇలా ఏ నటుడికి పాడితే ఆయన గాత్రాన్ని అనుకరించే ప్రయత్నం చేసినట్టు ప్రత్యక్షంగా దాఖలాలున్నాయి...కానీ ప్రస్తుతం ఆయన "పాడుతా తీయగా" అనే కార్యక్రమంలో "దయచేసి ఎవరినీ అనుకరించకండి... మీ సొంత గొంతుతోటే పాడండి" అని పిల్లలకు పాఠాలు చెపుతున్నారు. అంటే నేను చేసిన తప్పుని మీరు చెయ్యకండర్రా అని చెపుతున్నట్టుంది కదూ...!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



