
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై విమర్శలు చేయడం హీరోయిన్ తాప్సీకి అలవాటుగా మారిపోయింది. గతంలో పలుసార్లు సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్ చేసింది. తాజాగా మరోసారి సౌత్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. (Taapsee Pannu)
2010లో వచ్చిన 'ఝుమ్మంది నాదం'తో హీరోయిన్ గా ప్రయాణం మొదలుపెట్టిన తాప్సీ.. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్లుగా హిందీ సినిమాలకే పరిమితమైన తాప్సీ.. సౌత్ వైపు పెద్దగా చూడటంలేదు. అయితే హిందీ సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా.. సౌత్ ఇండస్ట్రీపై కామెంట్స్ మాత్రం చేస్తోంది.
'అస్సీ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తాను ఇబ్బంది పడినట్లు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గ్లామర్ సీన్స్, సాంగ్స్ లో ప్యాడెడ్ బ్రాలు ధరించమని ఒత్తిడి చేసేవారని ఆరోపించింది. అంతేకాదు, సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ల నాభిపై ఎక్కువ దృష్టి పెడతారని కామెంట్స్ చేసింది.
తాప్సీ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అప్పుడు ఫేమ్ కోసం సౌత్ కావాల్సి వచ్చింది, ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు వస్తుండటంతో సౌత్ ని టార్గెట్ చేసిందని కొందరు తాప్సీ తీరుని తప్పుబడుతున్నారు.
కాగా, తాప్సీ అడ్వకేట్ గా నటించిన 'అస్సీ' మూవీ ఫిబ్రవరి 20న థియేటర్లలో అడుగుపెట్టింది.
Also Read: ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో పుష్పరాజ్ హవా







