![]() |
![]() |
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి సెలబ్రిటీస్ తో పాటు ఈసారి చాల ఎక్కువ సంఖ్యలో కామనర్స్ ని కూడా తీసుకోవడం విశేషం. ఇక వాళ్లకు రకరకాల టాస్కులైతే ఇచ్చి వాళ్ళను సెలెక్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ అగ్నిపరీక్ష టీమ్. ఐతే రీసెంట్ గా శ్రీజ అనే కామన్ కంటెస్టెంట్ ని నవదీప్ ఊపుకుంటా ఊరు నుంచి వచ్చేసి అంటూ ఒక డైలాగ్ వేసి మరీ అవమానించడం ఆడియన్స్ అంతా చూసారు. ఇక దీని మీద ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ కూడా రియాక్ట్ అయ్యాడు. "బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఎలా ఉంది ? నచ్చుతుందా..దాని గురించి ఏదన్నా చెప్తే కొంతమంది హ్యాపీగా ఫీలవుతారు. కొంతమంది బాడ్ గా ఫీలవుతారు. కొంచెం సేపు బిగ్ బాస్ అగ్నిపరీక్షను పక్కన పెట్టి కామనర్స్ గా లోపలి వెళ్లిన వాళ్ళను చూస్తుంటే వాళ్ళను చిన్న చూపు చూస్తున్నట్టుగా ఉందన్న విషయం తెలుస్తోంది. నిజానికి శ్రీజాని నవదీప్ గారు అలా అనకుండా ఉండాలని అనిపిస్తోంది. అది నాకు కొంచెం బాధగా అనిపించింది. మరి మీకేమనిపించిందో నాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళేదో కష్టపడి జీవితంలో ఏదో సాధిద్దామని ఈ పొజిషన్ కి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళను కామనర్స్ గా ట్రీట్ చేస్తూ చులకనగా మాట్లాడుతున్నారు. కామనర్స్ కూడా జడ్జెస్ మార్క్స్ ఇస్తున్నారన్న విషయాన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళు రిప్లై ఇచ్చేదానికి అన్ని మూసుకుని కూర్చోవాలి. వాళ్ళు కామనర్స్ కి ఆ మాత్రమన్నా గౌరవిస్తున్నారు ఎందుకంటే జనాలు వాళ్ళను జడ్జ్ చేస్తున్నారు కాబట్టి. జడ్జెస్ కూడా ఒకప్పుడు కామనర్స్ గా వచ్చి సెలబ్రిటీస్ ఐనవాళ్ళే అన్న విషయాన్నీ మర్చిపోకూడదు. కామనర్స్ ని మనుషుల్లానే ట్రీట్ చేసి వాళ్లకు కూడా మర్యాద ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ షేవింగులు చేయించడాలు, సెల్ ఫోన్ లు పగలగొట్టించడాలు, ఇవన్నీ చూస్తుంటే కామనర్స్ ని ఇక లైఫ్ లో ఎప్పుడూ బిగ్ బాస్ పేరు ఎత్తనివ్వకుండా కొంచెం వికృతమైన చర్యలు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. మీకేమనిపిస్తోంది" అంటూ మాజీ బిగ్ బాస్ విన్నర్ కౌశల్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టాడు.
![]() |
![]() |