![]() |
![]() |
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే కమిట్ అయిన సినిమాల్లో రాజా సాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్.. గ్యాప్స్‌తో జరుగుతోంది. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా రెండు సినిమాల షూటింగ్ పూర్తి చేస్తున్నారు ప్రభాస్. రాజా సాబ్ విషయానికి వస్తే.. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు. కానీ, ఆ డేట్‌కి రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
రాజాసాబ్‌తోపాటు షూటింగ్ జరుపుకుంటున్న ఫౌజీ ఇప్పటివరకు సగం పూర్తయింది. మరో పక్క క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాగా చెప్పుకుంటున్న స్పిరిట్ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభించాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి చేసుకోవచ్చని ప్రభాస్ డేట్స్ కూడా ఇచ్చాడు. ఇప్పటివరకు రాజాసాబ్, ఫౌజీ సినిమాలు ఒక కొలిక్కి రాలేదు. దీన్నిబట్టి చూస్తే అక్టోబర్‌లో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
వీటికి తోడు సలార్, కల్కి సీక్వెల్స్ కూడా లైన్‌లో ఉన్నాయి. రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ చిత్రాలు పూర్తయితేనే తప్ప సీక్వెల్స్‌పై ప్రభాస్ దృష్టి పెట్టే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. కల్కి సీక్వెల్‌కి సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకొని ఎదురుచూస్తున్నాడు నాగ్ అశ్విన్. సలార్, కల్కి చిత్రాల విషయంలో ఇప్పటివరకు ప్రభాస్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాలన్నింటి కంటే స్పిరిట్ విషయంలో ఎక్కువ గందరగోళం కనిపిస్తోంది. రాజాసాబ్ షూటింగ్ ఈ ఏడాది పూర్తవుతుంది. ఫౌజీ షూటింగ్ కంప్లీట్ చెయ్యడానికి ఇంకా టైమ్ పడుతుంది. అలాంటప్పుడు స్పిరిట్ ఎప్పుడు మొదలవుతుంది అనేది అర్థంకాని విషయంగా మారింది. మొత్తానికి ప్రభాస్‌తో సినిమాలు చేస్తున్న దర్శకనిర్మాతలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. తను కమిట్ అయిన సినిమాల విషయంలో వారికి ఎప్పుడు క్లారిటీ ఇస్తాడా అని ఎదురుచూస్తున్నారు.
![]() |
![]() |