![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో బాలయ్య లుక్ కి సంబంధించిన పిక్ ని నటి చాందిని చౌదరి లీక్ చేసేసింది.
'NBK 109'లో బాలకృష్ణ లుక్ ఎలా ఉండబోతుందో ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ తో కాస్త క్లారిటీ వచ్చింది. ఇందులో బాలయ్య లుక్ అదిరిపోనుందని అర్థమైపోయింది. దీంతో మేకర్స్ ఆయన లుక్ కి సంబంధించి విడుదల చేసే అఫీషియల్ పోస్టర్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే అనూహ్యంగా మేకర్స్ చేయాల్సిన పనిని చాందిని చేసింది.

'NBK 109'లో 'కలర్ ఫోటో' ఫేమ్ చాందిని చౌదరి నటిస్తోంది. ఆమె సినిమాలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన రాకముందే.. సెట్స్ లో దర్శకుడు బాబీతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తాను నటిస్తున్నట్లు ముందే లీక్ చేసింది. ఇక ఇప్పుడు బాలకృష్ణ లుక్ ని కూడా అలాగే పూర్తిగా రివీల్ చేసేసింది. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. సెట్స్ లో బాలయ్యతో దిగిన ఫొటోని చాందిని పంచుకుంది. ఆ పిక్ లో నటసింహం లుక్ అదిరిపోయింది. డ్రెసింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ టైంలో బాలయ్య బెస్ట్ లుక్స్ లో ఒకటిగా ఇది నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.
![]() |
![]() |