![]() |
![]() |
.webp)
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా జూన్ 12న నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి చెందిన ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేయనున్నారు. ముఖ్యంగా స్టేట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి చంద్రబాబు నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు స్పెషల్ ఫ్లైట్లో విజయవాడకు ప్రయాణం అవుతున్నారు చిరంజీవి. ప్రమాణ స్వీకార కార్యక్రమం గన్నవరం ఎయిర్ పోర్ట్ దగ్గరలోని కేసనపల్లి ఐటి పార్క్ దగ్గర జరగనుంది.
![]() |
![]() |