![]() |

శాఖమూరి శ్రీనివాసరావు సమర్పణలో ఎమ్ ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మందలపు శ్రీనివాసరావు, మేడికొండ శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించిన సినిమా 'ఏ చోట నువ్వున్నా'. ఈ పల్లెటూరి ప్రేమకథా చిత్రానికి ఎస్.వి. పసలపూడి దర్శకత్వం వహించారు. నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు మేకర్స్.
ఈ సందర్బంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. పల్లెటూరి నేపథ్యంలో అందంగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రం విజయవంతం అవ్వాలని ఆకాంక్షీస్తూ, చక్కటి కథాంశాన్ని ఎన్నుకొన్న దర్శకుడు ఎస్.వి. పసలపూడి, నిర్మాతలు మందలపు శ్రీనివాసరావు, మేడికొండ శ్రీనివాసరావులను అభినందించారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ "ఈ చిత్రాన్ని నెల 17న విడుదల చేస్తున్నాం. దర్శకుడు ఎస్.వి పసలపూడి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్" అని కొనియాడారు.
దర్శకుడు ఎస్. వి మాట్లాడుతూ "నిర్మాతల సహాయసహకారాలు మరువలేనివి. మా చిత్రానికి తరుణ్ రాణా ప్రతాప్ సమాకూర్చిన సంగీతం ఆకట్టుకుంటుంది. రచయిత కుమార్ పిచ్చుక రాసిన మాటలు ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి. ఈ చిత్రం ప్రేక్షకుల మన్నలను కచ్చితంగా పొందుతుంది" అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

అదే విధంగా ఈవెంట్ కి హాజరైన ప్రముఖ దర్శకులు వి.ఎన్ ఆదిత్య, ఎ.ఎస్. రవికుమార్ చౌదరి, నర్రా శివనాగు, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, యువ నిర్మాత అహితేజ బెల్లంకొండ, ప్రముఖ నటులు- నిర్మాత రాంకీ, ప్రముఖ రచయిత మరుదూరి రాజా, ప్రముఖ వ్యాపారవేత్త శివ రెమిడాల చిత్ర విజయాన్ని కోరుకుని యూనిట్ కి అభినందనలు తెలిపారు.
![]() |