![]() |
![]() |

ఎమ్మెస్ రాజు.. పరిచయ వాక్యాలు అక్కర్లేని పేరు. శత్రువు, పోలీస్ లాకప్, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా.. ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలిచిన నిర్మాత ఆయన. అలాంటి ఈ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ 'పౌర్ణమి' నుంచి సక్సెస్ ట్రాక్ తప్పారు. దర్శకుడి అవతారమెత్తినా విజయాలు దక్కలేదు. ఈ నేపథ్యంలో.. స్వల్ప విరామం తరువాత మెగాఫోన్ పట్టి 'డర్టీ హరి' తీశారాయన.
ప్రచార చిత్రాలు చూస్తే.. ఎమ్మెస్ రాజు ఇలాంటి సినిమా తీశారేంటి అనిపించేలా ఉన్నా.. ఇన్సైడ్ సోర్స్ ప్రకారం సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుందని తెలిసింది. ముఖ్యంగా సెకండాఫ్ సినిమాకి ప్రధాన బలమని టాక్. కేవలం యువతని ఆకట్టుకోవడానికే ఈ తరహా ప్రచార చిత్రాలకు ఎమ్మెస్ రాజు ప్రాధాన్యమిచ్చారట. మరి.. బోల్డ్ ఎటెంప్ట్ తో రాజు చేస్తున్న ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. శ్రావణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన 'డర్టీ హరి'.. త్వరలోనే ఓటీటీ వేదికగా సందడి చేయనుంది.
![]() |
![]() |