![]() |
![]() |

నటసింహ బాలకృష్ణ - మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. ఇదివరకు వీరిద్దరు జట్టుకట్టిన 'సింహా', 'లెజెండ్' చిత్రాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. అలాంటి ఈ ఇద్దరి కలయికలో దాదాపు ఏడేళ్ళ తరువాత మరో సినిమా రాబోతోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్‌గా 'BB3'ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలో ఓ కథానాయిక పాత్ర కోసం 'అఖిల్' ఫేమ్ సాయేషా సైగల్‌ని ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరో నాయికగా పూర్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ ఇద్దరు కూడా బాలయ్యతో తొలిసారిగా నటిస్తున్నారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. బాలయ్యతో బోయపాటి జట్టుకట్టిన ప్రతీసారి అప్పటివరకు నటసింహతో నటించని నాయికలే ఆయా చిత్రాల్లో సందడి చేసి ఘనవిజయాల్లో భాగమయ్యారు. 'సింహా'లో నయనతార, స్నేహ ఉల్లాల్, నమిత మొదటిసారిగా బాలయ్య సరసన ఆడిపాడితే.. 'లెజెండ్'లో రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కూడా అదే తరహాలో అలరించారు. మొత్తమ్మీద.. బాలయ్యకి హీరోయిన్ల పరంగా ఫ్రెష్ కాంబినేషన్‌ని సెట్ చేసిన ప్రతీసారి బోయపాటి బ్లాక్‌బస్టర్ బాట పట్టారు. మరి.. మూడో ప్రయత్నానికి కూడా ఆ సెంటిమెంట్ పునరావృతమై హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ నమోదవుతుందేమో చూడాలి.
![]() |
![]() |