![]() |
![]() |

-కమల్ నిర్మాతగా రజినీ 173 స్టార్ట్ అయిన విషయం తెలిసిందే
-సుందర్ నుంచి శిబి చక్రవర్తి చేతికి
-ఇప్పుడు మరో దర్శకుడు
-ఎందుకు ఇలా
ఎన్ని పనుల్లో ఉన్నా డైలీ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)కి సంబంధించిన కొత్త సినిమా అప్డేట్ గురించి సెర్చ్ చెయ్యడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మరి ఏడు పదుల వయసులోను ఇండియన్ సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టే పనిలో బిజీగా ఉన్న రజినీకి ఆ మాత్రం సినీ సెల్యూట్ చేయని వాళ్ళు అభిమాని, మూవీ లవర్స్ నే కాదు. ఇప్పుడు వాళ్ళందరిలో రజిని న్యూస్ ఒకటి ఉదయాన్నే సినీ చర్చలు చేసే స్థాయికి దారి తీసింది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
కూలీతో హిట్ ని అందుకున్న తర్వాత రజినీ లోకనాయకుడు కమల్ హాసన్(Kamalhaasan)నిర్మాతగా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎవరి ఆలోచనల్లో కూడా పురుడు పోసుకొని కాంబో కావడంతో అంచనాలకి కొలమానాలు లేకుండా పోయాయి. తొలుత ఈ సినిమాకి రజినీకి 'అరుణాచలం' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన సుందర్(Sundhar)ని ఎంపిక చేసారు. కానీ కొన్ని కారణాల వల్ల సుందర్ తనంతట తానుగా తప్పుకున్నాడు. నెక్స్ట్ సిబి చక్రవర్తి(Sibi Chakravarthi)ని ఎంపిక చేసారు. శివకార్తికేయన్ కి 'డాన్' వంటి బిగ్ హిట్ ని అందించిన దర్శకుడు కావడంతో రజినీనీ ఎలా ప్రెజెంట్ చేస్తాడనే ఆసక్తి ఏర్పడటంతో పాటు ప్రాజెక్ట్ కి నయా క్రేజ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో అశ్వత్ మారిముత్తు(Ashwath Marimuthu)చేరినట్టుగా తమిళ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఫ్రెష్ టాక్.
ఇప్పుడు ఈ న్యూస్ రజినీ ఫ్యాన్స్ ఆలోచనలకి పదును పెడుతుంది. ఎందుకు ఇలా దర్శకుడిని మారుస్తున్నారు, అందుకు గల కారణాలేంటి అనేవి ట్రేడ్ వర్గాలలో సైతం చర్చకి దారితీస్తున్నాయి. అశ్వత్ మారి ముత్తు నుంచి ఇప్పటి వరకు రెండు చిత్రాలు వచ్చాయి. 2022 లో వెంకటేష్, విశ్వక్ సేన్ తో 'ఓరి దేవుడా' .2025 లో ప్రదీప్ రంగనాధన్, అనుపమ పరమేశ్వరన్ నుంచి వచ్చిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. టేకింగ్ పరంగా ఈ రెండు చిత్రాలు సూపర్ గా ఉంటాయి. ఏది ఏమైనా సంచలన కాంబో, ఇప్పుడు దర్శకత్వ మార్పుల వార్తలతో కూడా సంచలనంగా మారింది. రజినీ చేస్తున్న 173 వ మూవీ. రజినీ, కమల్ లు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో హీరోలుగా కలిసి ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టి స్టారర్ గా తన హవా స్టిల్ చాటుతూనే ఉంది.

![]() |
![]() |