Home  »  News  »  Ram Charan: 'డెకాయిట్'పై రామ్ చరణ్ రివ్యూ.. నచ్చిందా లేదా?

Updated : Apr 14, 2026

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'డెకాయిట్' (Dacoit). రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈ సినిమాపై స్పందించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

'డెకాయిట్' చూసి ఎంజాయ్ చేశా..
తాజాగా 'డెకాయిట్' సినిమాని వీక్షించిన రామ్ చరణ్ తన అనుభూతిని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. "నేను డెకాయిట్ సినిమా చూశాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. హరి పాత్రలో అడివి శేష్ నటన అద్భుతం. ఆయన నటన గుర్తుండిపోతుంది. మృణాల్ తన పాత్రలోని భావోద్వేగాలను ఎంతో లోతుగా పండించి, పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అనురాగ్ కశ్యప్ తో పాటు ఇతర నటీనటులంతా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నిర్మాత సుప్రియ యార్లగడ్డ, అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించారు" అంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

కథా నేపథ్యం..
'డెకాయిట్' మూవీ  ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీగా సాగుతూనే, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. అడివి శేష్ తనదైన శైలిలో సీరియస్ రోల్ లో మెప్పించగా.. మృణాల్ ఠాకూర్ తన గ్లామర్, నటనతో సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రం టెక్నికల్ గా కూడా చాలా రిచ్ గా ఉందని ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా క్లైమాక్స్ గురించి ప్రస్తుతం సినీ వర్గాల్లో ప్రత్యేకంగా చర్చ సాగుతోంది.

రామ్ చరణ్ 'పెద్ది' అప్‌డేట్..
ఒకవైపు ఇతర సినిమాలను అభినందిస్తూనే, మరోవైపు రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది' (Peddi) పనుల్లో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉంటుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశముంది.

https://x.com/AlwaysRamCharan/status/2043979111136407754






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.