![]() |
![]() |
ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఉషాకిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణం అందర్నీ బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన పార్థీవ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
తెలుగువన్ అధినేత, ‘రాజధాని ఫైల్స్’ చిత్ర నిర్మాత కంఠంనేని రవిశంకర్ కూడా రామోజీరావు పార్థీవ దేహానికి నివాళులర్పించేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. గత నెల 12న ఈటీవీలో ప్రసారమైన ‘రాజధాని ఫైల్స్’ చిత్రాన్ని రామోజీరావు రెండున్నర గంటల సేపు ఎంతో ఓపికగా చూసారని, సినిమా బాగా తీశారని ఆయన మెచ్చుకున్నారని వారు ఎంతో ఎమోషనల్‌గా చెప్పారు.
అమరావతి రైతులకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ రూపొందించిన ‘రాజధాని ఫైల్స్’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ తర్వాత సినిమాలోని అంశాలను అందరూ ఓన్ చేసుకున్నారు. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ ఘనవిజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాక్షస పాలనను అంతం చేయడంలో ఈ సినిమా కూడా కొంత పాత్ర పోషించిందనేది వాస్తవం. రామోజీరావు నిర్మాతగా ఎన్నో వైవిధ్యమైన సినిమాలు, జనాన్ని మేల్కొలిపే సినిమాలు నిర్మించారు. ప్రతిఘటన, మౌనపోరాటం వంటి సినిమాలు జనంలో చైతన్యం తీసుకొచ్చాయి. రైతుల సమస్యల నేపథ్యంలో రూపొందిన ‘రాజధాని ఫైల్స్’ కూడా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేదిగా ఉండడంతో రామోజీరావుకు సినిమా బాగా నచ్చిందని, ఎంతో ధైర్యం చేసి అలాంటి కథాంశంతో సినిమా తీసిన నిర్మాతను ఆయన మెచ్చుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
![]() |
![]() |