![]() |
![]() |

`లెజెండ్`(2014)తో నయా ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టిన సీనియర్ హీరో జగపతి బాబు.. గత కొంతకాలంగా దక్షిణాది మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్ లో ఒకరిగా మారిపోయారు. ఇంకా చెప్పాలంటే.. దాదాపు ప్రతి క్రేజీ ప్రాజెక్ట్ లోనూ ఆయన పేరు తప్పక ఉంటుందీ మధ్య.
ఇదిలా ఉంటే.. వినాయక చవితి, విజయ దశమి, దీపావళి, క్రిస్మస్.. ఇలా 2021లో రాబోయే పండగేదైనా థియేటర్స్ లో లేదా ఓటీటీలో జగ్గూభాయ్ దర్శనం పక్కా అన్నట్లుగా తయారయింది పరిస్థితి. ఆ వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 9న వినాయక చవితి కానుకగా థియేటర్స్ లోకి రానున్న తమిళ చిత్రం `లాభం`లో విజయ్ సేతుపతి హీరోగా నటించగా.. ప్రతినాయకుడి వేషంలో జగపతి బాబు కనిపించనున్నారు. ఇక అదే పండక్కి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతున్న `టక్ జగదీష్`లో నానికి అన్నగా ఎంటర్టైన్ చేయనున్నారు ఈ వెర్సటైల్ యాక్టర్. సెప్టెంబర్ 10న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సదరు ఓటీటీలో స్ట్రీమ్ కాబోతోంది.
ఇక విజయదశమి సీజన్ లో `రిపబ్లిక్`, `మహా సముద్రం` చిత్రాలతో పలకరించబోతున్నారు జగ్గూ భాయ్. వీటిలో `రిపబ్లిక్` అక్టోబర్ 1న, `మహా సముద్రం` అక్టోబర్ 14న థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. ఇక దీపావళి సీజన్ లో `గని`, `అణ్ణాత్తే` (తమిళ్) చిత్రాలతోనూ.. క్రిస్మస్ కి `పుష్ప`తోనూ టూరింగ్ టాకీస్ లో జగపతి బాబు అలరించబోతున్నారు.
సో.. 2021 సెకండాఫ్ పండగ సినిమాలన్నింటిలోనూ దాదాపుగా జగ్గూ భాయ్ సందడి పక్కా అన్నమాట. మరి.. ఈ చిత్రాలతో ఈ వెటరన్ స్టార్ ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తారో చూడాలి.
![]() |
![]() |