![]() |
![]() |

మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి(Vijay sethupathi)గత ఏడాది 'విడుదలై పార్ట్ 2 ' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా విజయ్ నటనకి అయితే అభిమానులతో పాటు ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారని చెప్పవచ్చు. విజయ్ సేతుపతి ప్రస్తుతం 'ఎస్' ,'ట్రైన్' అనే రెండు విభిన్నమైన నేపథ్యంతో కూడిన సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలే ఉన్నాయి.
విజయ్ సేతుపతి రీసెంట్ గా ఒక కాలేజీ లో జరిగిన ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.కొంత మంది విద్యార్థులు విజయ్ తో 'మీరు అజిత్(Ajith)తో ఎప్పుడు కలిసి నటిస్తారని అడిగారు.అప్పుడు విజయ్ సేతుపతి మాట్లాడుతు అజిత్ గారు చాలా మంచి వ్యక్తి,.నేను కూడా అజిత్ గారితో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.గతంలో ఒకసారి వర్క్ చేసే అవకాశం వచ్చింది.కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ముందుకెళ్ళలేదు.
నా కెరీర్ లో ఏది ప్లాన్ చేసుకోలేదు.వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నానని చెప్పుకొచ్చాడు.ఇప్పడు విజయ్ సేతుపతి మాటలు విన్న ఇరువురు అభిమానులైతే అజిత్,విజయ్ సేతుపతి కాంబినేషన్ లో సినిమా రావాలని కోరుకుంటున్నారు.విజయ్ సేతుపతి గతంలో ఇళయ దళపతి విజయ్ తో కలిసి మాస్టర్ మూవీ చేసిన విషయం అందరకి తెలిసిందే.
![]() |
![]() |